
ఛండీగఢ్ : అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్‌లో మాటల తూటాలు పేలుతున్నాయి. పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈసారి పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆదీ పార్టీ(ఆప్) పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ సంచలన ఆరోపణలు చేశారు.
ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనపై లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ‍్యక్తం చేశారు. కేజ్రీవాల్ ఓ అబద్దాల కోరు అంటూ విరుచుకుపడ్డారు. తనపై చేసిన ఆరోపణలన్నీ తప్పని తేలాయని, నిజాలేంటో బయటకు వచ్చాయని పేర్కొన్నారు. గతంలో భారతదేశాన్ని దోచుకోవడానికి ఆంగ్లేయులు ఎలాగైతే దేశానికి వచ్చారో.. ఇప్పుడు పంజాబ్‌ను దోచుకోడానికి క్రేజీవాల్‌తో సహా మరికొందరు నేతలు వస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారి గురించి పంజాబ్ ప్రజలకు బాగా తెలుసు అలాంటి వారికి ఓటర్లు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
చదవండి: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు ఓటేయొద్దు..