Charanjit Singh Channi
-
కంచు కోటలు బద్దలు కొట్టారు.. చరిత్ర సృష్టించారు!
పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు భగవంత్ మాన్ బుధవారం ప్రమాణం చేశారు. పంజాబ్‌లో ఆప్ ఘన విజయం సాధించడంతో ఆయన సీఎం అయ్యారు. అయితే తాజా ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులు హేమాహేమీలను మట్టికరిపించి సంచలనం సృష్టించారు. సామాన్య పౌరులు.. కాంగ్రెస్ సీఎంతో సహా సీనియర్ నాయకులను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించారు! చన్నీకి ఉగోకే చెక్ పంజాబ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఘోరంగా ఓడిపోవడం అతిపెద్ద సంచలనం. ఆయన ఓడించింది సీనియర్ నాయకుడు కాదు.. సామాన్య యువకుడు. చిన్న మొబైల్ రిపేర్ షాప్ నడుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్త లాభ్ సింగ్ ఉగోకే అనే యువకుడు బదౌర్ నియోజకవర్గంలో చన్నీపై 34,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ఉగోకే తండ్రి డ్రైవర్ కాగా, తల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా సేవలు అందిస్తోంది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఉగోకేకు హీరో హోండా మోటార్‌సైకిల్ మాత్రమే ఉంది. డాక్టర్ సాబ్‌కే జై చమ్‌కౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి కూడా చన్నీకి ‘ఆప్’చేతిలో చుక్కెదురైంది. వృత్తిరీత్యా వైద్యుడైన 55 ఏళ్ల చరణ్‌జిత్ సింగ్ ఇక్కడ నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ చన్నీకి వ్యతిరేకంగా ఆప్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 12,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయినప్పటికీ నియోజకవర్గాన్ని వదలిపెట్టకుండా, ప్రజల మధ్యే ఉంటూ వారి మన్ననలు పొందారు. ఈసారి 7,942 ఓట్ల తేడాతో చన్నీని ఓడించగలిగారు. నవజ్యోత్ వర్సెస్ జీవన్ జ్యోత్ ప్రజల దృష్టిని ఆకర్షించిన మరో ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్. పంజాబ్ ఎన్నికల్లో ఇద్దరు ప్రముఖ నాయకులను ఆమె ఓడించారు. అమృత్సర్ తూర్పు నుంచి కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ, శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి బిక్రమ్ మజిథియాలపై 6,750 ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. ఆమ్ ఆద్మీ పార్టీలో వలంటీర్‌గా చేరి, పార్టీ జిల్లా అర్బన్ అధ్యక్షురాలిగా మారడానికి ముందు.. కౌర్ సామాజిక కార్యకర్తగా చురుగ్గా పనిచేశారు. ‘షీ’అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి మహిళలకు రుతుక్రమ పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. శానిటరీ ప్యాడ్ల వాడకం, రుతుక్రమ పరిశుభ్రత తెలియజేస్తూ 'ప్యాడ్‌వుమన్'గా ఆమె ప్రాచుర్యం పొందారు. (క్లిక్: సోనియా సీరియస్ ఆదేశాలు.. దిగొచ్చిన సిద్ధూ.. పదవికి గుడ్ బై) కౌర్ చేతిలో సింగ్లా చిత్తు సంగ్రూర్‌లో ఆప్ యువనేత నరీందర్ కౌర్ భరాజ్.. సిట్టింగ్ కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లాతో పోటీ పడి భారీ విజయాన్ని అందుకున్నారు. సింగ్లాను 36,430 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించి తానేంటో నిరూపించుకున్నారు. కోట్లకు పడగెత్తిన వ్యాపారవేత్త, బీజేపీ అభ్యర్థి అరవింద్ ఖన్నా మూడో స్థానానికి పరిమితమయ్యారు. (క్లిక్: మమతా బెనర్జీ అనూహ్య నిర్ణయం..) లా గ్రాడ్యుయేట్ అయిన కౌర్ జనవరిలో ఎన్నికల సమయంలో తన తల్లితో కలిసి స్కూటర్‌పై వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అప్పట్లో ఈ వీడియోలో తెగ వైరల్ అయింది. రూ. 24,000 విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నట్టు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న ఆమె.. ద్విచక్ర వాహనంపైనే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎవరెంత హేళన చేసినా లెక్కచేయక పోటీలో నిలబడి ఘన విజయం సాధించారు. బాదల్‌కు జగదీప్ బ్రేక్ శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ కంచుకోట జలాలాబాద్‌లో ఆప్ పాగా వేసింది. 2009 నుంచి అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న బాదల్‌కు ఆప్ అభ్యర్థి జగదీప్ కాంబోజ్ బ్రేక్ వేశారు. కాంగ్రెస్ నాయకుడైన జగదీప్ గతేడాది ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. తాజా ఎన్నికల్లో బాదల్‌పై దాదాపు 31,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. టిక్కెట్ నిరాకరించడంతో మూడేళ్ల క్రితం కాంగ్రెస్‌ను వీడిన కాంబోజ్ 2019 ఉపఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసినా 5,000 ఓట్లకు మించి సాధించలేకపోయారు. ఈ ఎన్నికల్లో ఆప్ మరో ‘జెయింట్ కిల్లర్’అజిత్‌పాల్ సింగ్ కోహ్లి. అకాలీదళ్ మాజీ నాయకుడైన అజిత్‌పాల్.. పటియాలా నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించాడు. గతంలో మేయర్‌గా పనిచేసిన ఆయన పెద్దగా అంచనాలు లేకుండానే పోటీకి దిగి విజయం సాధించడం విశేషం. -
సీఎంపై గెలిచి ఎమ్మెల్యే అయిన కొడుకు.. తల్లి మాత్రం స్వీపర్‌గానే.. ఎవరామె..?
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ.. జాతీయ పార్టీలకు షాకిస్తూ భారీ మెజార్టీతో విజయం సాధించింది. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ఈనెల 16వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భదౌర్ నియోజకవర్గం నుంచి సీఎం అభ్యర్థి చరణ్‌జీత్ సింగ్ చన్నీపై ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్ పోటీ చేసి 37వేలకు పైగా మెజారిటీతో భారీ విజయాన్ని అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా లాభ్ సింగ్ ఫేమస్ అయ్యాడు. కాగా, తన కొడుకు ఎమ్మెల్యే అయ్యాడని ఊరంతా సంబురాలు జరుపుకుంటుడగా.. ఆయన తల్లి మాత్రం సాదాసీదాగా తన పని తాను చేసుకుంటోంది. ఎమ్మెల్యే లాభ్ సింగ్ తల్లి బల్దేవ్ కౌర్ ప్రభుత్వ పాఠశాలలో కొన్నేళ్లుగా స్వీపర్‌గా పని చేస్తోంది. తన కొడుకు ఎమ్మెల్యే అయినప్పటికీ తాను ఇదే వృత్తిలో కొనసాగుతానని పేర్కొంది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. తన కొడుకు ఎన్నికల్లో గెలుస్తాడని మొదటి నుంచి ధీమాగానే ఉన్నట్టు తెలిపింది. రానున్న రోజుల్లో లాభ్ సింగ్ కచ్చితంగా పంజాబ్‌లో మార్పులు తీసుకొస్తాడని చెప్పింది. అతడు అందరికీ వైద్యం, విద్య అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తన కొడుకు ఎమ్మెల్యే అయినా తాను స్వీపర్‌గా పని చేస్తానని స్పష్టం చేసింది. లాభ్ సింగ్ తండ్రి దర్శన్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా తన కొడుకు పనిచేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. కాగా, లాభ్ సింగ్ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటూ కొద్దికాలంలోనే కీలక నేతగా ఎదిగాడు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఇది చదవండి: ఆ సినిమాకు ప్రధాని మోదీ ప్రశంసలు.. -
Sakshi Cartoon: ఓడిపోవడానికే సీఎం పదవి చేపట్టారేమోననిపిస్తుంది సార్!
ఓడిపోవడానికే సీఎం పదవి చేపట్టారేమోననిపిస్తుంది సార్! -
రాజ్‌భవన్‌లో గవర్నర్ పురోహిత్‌ను కలిసిన చన్నీ
-
పంజాబ్ ప్రజలు మార్పు కోరుకున్నారు: చరణ్‌జిత్ సింగ్ చన్నీ
-
సీఎంను ఓడించిన సామాన్యుడు.. ఎవరతను?
ఎన్నికల ముందు వరకు అతడో సామాన్య యువకుడు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిని మట్టికరిపించి అసామాన్యుడిగా నిలిచాడు. ఈరోజు వరకు అతడి గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలీదు, కానీ ముఖ్యమంత్రిని ఓడించడంతో అతడి పేరు పతాక శీర్షికలకు ఎక్కింది. పంజాబ్ రాజకీయాల్లో సంచలనాలకు తెరతీసిన అతడి పేరు లభ్ సింగ్ ఉగోకే. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బర్నాలా జిల్లా బదౌర్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి లభ్ సింగ్ గెలుపొందారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీపై 37 వేల పై చిలుకు మెజారితో ఘన విజయం సాధించారు. లభ్ సింగ్‌కు 63 వేలకు పైగా ఓట్లు తెచ్చుకోగా, ఛన్నీకి కేవలం 26 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఎవరీ లభ్ సింగ్? 35 ఏళ్ల లభ్ సింగ్ సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. 12 తరగతి వరకు చదువుకుని మొబైల్ రిపేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. అతడి తండ్రి డ్రైవర్ కాగా, తల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో వలంటీర్‌గా లభ్ సింగ్ చేరారు. తాజా ఎన్నికల్లో తనను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ప్రజల మధ్య ఉంటూ ఇంటింట ప్రచారం సాగించారు. ఎమ్మేల్యేగా తనను గెలిపిస్తే దౌర్ నియోజకవర్గ ఓటర్ల సమస్యలను పరిష్కరించే బాధ్యతను భుజాన వేసుకుంటానని అని చెప్పి ప్రజల నమ్మకాన్ని పొందారు. తనపై పోటీ చేస్తున్నది ముఖ్యమంత్రి అయినా కూడా లభ్ సింగ్ ఏమాత్రం భయపడలేదు. నిరాడంబరంగా తన ప్రచారం సాగించి విజయాన్ని అందుకున్నారు. లభ్ సింగ్ విజయాన్ని కేజ్రీవాల్ ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందనలు తెలిపారంటే.. ఈ గెలుపు ప్రాముఖ్యత అర్థమవుతోంది. ఆప్ కంచుకోట.. బదౌర్ బదౌర్ నియోజకవర్గంలో రెండు పట్టణాలు, 74 గ్రామాలు ఉన్నాయి. 2017 ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి పిర్మల్ సింగ్ ధౌలా ఇక్కడ విజయం సాధించారు. అయితే గతేడాది ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2012లో బదౌర్‌లో కాంగ్రెస్ విజయం సాధించగా.. 1997, 2002, 2007లో శిరోమణి అకాలీదళ్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. కాగా, బదౌర్ నియోజకవర్గం తమ పార్టీకి కంచుకోట అని, ముఖ్యమంత్రి పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని ఎన్నికలకు ముందు లభ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. సామాన్యుడికి పట్టంకట్టి సీఎంను ఓడించారు బదౌర్ ఓటర్లు. (క్లిక్: గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే?) ఆమెకు డిపాజిట్ గల్లంతు పంజాబ్ డిప్యూటీ స్పీకర్, మలౌట్ ఎమ్మెల్యే అజైబ్ సింగ్ భట్టి భార్య మంజిత్ కౌర్.. బదౌర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగా ఆమెకు డిపాజిట్ కూడా దక్కలేదు. శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సత్నామ్ సింగ్ రాహి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. (క్లిక్: కమెడియన్ నుంచి సీఎం స్థాయికి..) -
కాంగ్రెస్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతోంది
ఫతేపూర్: కాంగ్రెస్ పనిగట్టుకొని ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఇలా విభేదాలను రెచ్చగొట్టే పార్టీలకు పరిపాలించే అధికారం ఉండదన్నారు. యూపీ, బిహార్, ఢిల్లీకి చెందినవారంతా ఒక్కటేనని వారిని పంజాబ్‌లోకి అడుగు పెట్టనివ్వకూడదంటూ ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ తన స్వప్రయోజనాల కోసం ఒక ప్రాంతం వారిని మరో ప్రాంతంపైకి ఉసిగొల్పుతూ ఉంటుందని నిందించారు. పంజాబ్ అబోహర్లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ చన్నీ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. చన్నీ అలా మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న ప్రియాంకా గాంధీ చప్పట్లు కొడుతున్నారని యావత్‌దేశం దీనిని చూసిందన్నారు. యూపీలోని ఫతేపూర్‌లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎంతో స్వార్థంతో ఆలోచిస్తాయని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్‌ని రద్దు చేస్తూ చట్టం తెస్తే విపక్షాలన్నీ ఏకమై వ్యతిరేకించాయని గుర్తు చేశారు. అయితే తన నిర్ణయానికి ముస్లిం మహిళలు అంతా అండగా ఉన్నారని, వారి బతుకులు బాగు చేసినందుకు కృతజ్ఞతలు వెల్లడించారని మోదీ పేర్కొన్నారు. -
దౌబాలో నువ్వా నేనా?
ముక్కోణ, చతుర్ముఖ పోటీలు దౌబాలో చాలా స్థానాల్లో త్రిముఖ, చతుర్ముఖ పోటీ నెలకొంది. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న చమ్‌కౌర్ సాహిబ్ నుంచి సీఎం చన్నీ నాలుగోసారి బరిలో దిగారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన ఆప్ అభ్యర్థి డాక్టర్ చరణ్‌జిత్ మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక జలంధర్ కాంట్‌లో పంజాబ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, విద్యా, క్రీడల మంత్రి పర్గత్ సింగ్ మూడోసారి బరిలో దిగారు. అకాలీదళ్ నుంచి జగ్బీర్ బ్రార్, బీజేపీ నుంచి సరబ్జిత్ సింగ్ మక్కర్, ఆప్ నుంచి సురీందర్ సింగ్ సోధి ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. హోషియార్పూర్, ఫగ్వారా, నవాన్షహర్ సహా పలు అసెంబ్లీ స్థానాల్లో హోరాహోరీ పోటీ ఖాయంగా కన్పిస్తోంది. దళితులను బాగా ప్రభావితం చేయగల డేరాలను ప్రసన్నం చేసుకునేందుకు కూడా పార్టీలు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నారై బెల్ట్‌గా పేరున్న పంజాబ్‌లోని దౌబా ప్రాంతంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు నెగ్గేందుకు కాంగ్రెస్, అకాలీదళ్, ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దళిత ప్రాబల్య ప్రాంతం కావడంతో ఆ వర్గాన్ని ఆకట్టుకొనేందుకు జోరుగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే వారికి రకరకాల వాగ్దానాలు చేశాయి. అకాలీదళ్ తన కుల సమీకరణాలను సరిదిద్దుకొనేందుకు బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. దళితులకు డిప్యూటీ సీఎం పదవి ప్రకటించింది. బీజేపీ అయితే వారికి సీఎం పదవే హామీ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ దళితుడైన చరణ్‌జిత్ సింగ్ చన్నీని మళ్లీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. జలంధర్, కపుర్తలా, హోషియార్పూర్, నవాన్షహర్ జిల్లాలతో కూడిన దౌబాలో 23 అసెంబ్లీ స్థానాలున్నాయి. 20న పోలింగ్ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీఎస్పీ చీఫ్ మాయావతి తదితరులు ఇప్పటికే దోబాలో ప్రచారం చేశారు. దోబాలో దళితుల రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక్కడి జనాభాలో 45 శాతం దాకా దళితులున్నారని అంచనా. వీరు ప్రధానంగా రెండు వర్గాలు. గురు రవిదాస్ అనుయాయులైన రవిదాసియాలు ఒక వర్గం కాగా, వాల్మీకులు మరో వర్గం. ఇక్కడ రవిదాసియాలది ఆధిపత్యం. దౌబాలోని హోషియార్పూర్, జలంధర్ లోక్‌సభ సెగ్మెంట్లను ఎస్సీలకు రిజర్వ్ చేశారు. వీటి పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో వారి ఆధిపత్యం మరింతగా ఉంది. సన్యశ్యామల ప్రాంతం కావడంతో దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దౌబాలోని దళితులు ఆర్థికంగా బలంగా, ప్రభావశీలంగా ఉన్నారు. ఏ ఎన్నికల్లోనూ వీరు ఒకే పార్టీకి ఏకమొత్తంగా ఓట్లు వేసిన దాఖలాల్లేవు. గత ఎన్నికల్లో దౌబాలో 15 సీట్లు నెగ్గి ఆధిపత్యం ప్రదర్శించిన కాంగ్రెస్‌కు ఈసారి గట్టి పోటీ ఎదురవుతోంది. – సాక్షి, న్యూఢిల్లీ -
కేజ్రీవాల్‌ను ఆంగ్లేయులతో పోల్చిన సీఎం.. దోచుకోవడానికే వస్తున్నాడంటూ..
ఛండీగఢ్ : అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్‌లో మాటల తూటాలు పేలుతున్నాయి. పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈసారి పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆదీ పార్టీ(ఆప్) పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనపై లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ఓ అబద్దాల కోరు అంటూ విరుచుకుపడ్డారు. తనపై చేసిన ఆరోపణలన్నీ తప్పని తేలాయని, నిజాలేంటో బయటకు వచ్చాయని పేర్కొన్నారు. గతంలో భారతదేశాన్ని దోచుకోవడానికి ఆంగ్లేయులు ఎలాగైతే దేశానికి వచ్చారో.. ఇప్పుడు పంజాబ్‌ను దోచుకోడానికి క్రేజీవాల్‌తో సహా మరికొందరు నేతలు వస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారి గురించి పంజాబ్ ప్రజలకు బాగా తెలుసు అలాంటి వారికి ఓటర్లు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. చదవండి: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు ఓటేయొద్దు.. -
కాంగ్రెస్‌కు పోటీయే లేదు.. పంజాబ్ మళ్లీ మాదే
కాంగ్రెస్‌దే గెలుపన్న ఆత్మవిశ్వాసం. కలిసికట్టుగా పనిచేస్తే ఎవరూ పోటీకి రాలేరన్న ధీమా, కేజ్రివాల్‌పై విమర్శలు, భగవంత్ మాన్‌పై వ్యక్తిగత దాడి.. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఒక చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని ఇలా బయటపెట్టారు. ప్రశ్న : సీఎం అభ్యర్థి కోసం పోటీ పడినపీసీసీ అధ్యక్షుడు సిద్ధూతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? జవాబు: ముఖ్యమంత్రి అభ్యర్థిగా హైకమాండ్ ఎవరిని ఎంపిక చేసినా కట్టుబడి ఉంటానని సిద్ధూ చెప్పారు. అధిష్టానం నన్ను ఎంపిక చేసింది. ఇక మా మధ్య విభేదాలు ఎందుకుంటాయి? మేము ఈ ఎన్నికల్లో కలిసి పని చేస్తాం. టీమ్ వర్క్ చేసి మూడింట రెండు వంతుల మెజార్టీ సాధిస్తాం. ప్రశ్న : కాంగ్రెస్ గెలిస్తే మీరు మరబొమ్మ సీఎంగా మారిపోతారని మాయావతి అంటున్నారు? దళితులు ఢిల్లీ చేతుల్లో ఉండాలా అన్న ఆమె ప్రశ్నలకు మీ సమాధానం? జవాబు: మాయావతి పంజాబ్‌లో కేవలం 20 స్థానాల్లోనే పోటీ చేస్తున్నారు. మిగిలిన అన్ని సీట్లలోనూ శిరోమణి అకాలీదళ్ పోటీ పడుతోంది. అంటే దళితులు ఎవరి చేతుల్లో ఉన్నారు? ఈ విషయం ఆమె తెలుసుకోవాలి. నాకు ఈ కులాల రాజకీయాలు తెలీవు. పార్టీలో నాకు మద్దతు ఉందని సీఎం అభ్యర్థిని చేశారు. దళితుడినని చెయ్యలేదు. ప్రశ్న : ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ దూకుడుని అడ్డుకోగలరా ? జవాబు: అరవింద్ కేజ్రివాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారు. మొదట్లో ఆయన ఆబ్కీ బార్ కేజ్రివాల్ పేరిటప్రచారానికి రూ.200–400 కోట్లు ఖర్చు చేశారు. ప్రజలు దానిని ఆమోదించకపోవడంతో భగవంత్ మాన్‌ను తీసుకువచ్చారు. కేజ్రివాల్ కన్న కలలు పంజాబ్‌లో నెరవేరవు. ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో పాలించే నాయకుల్ని ప్రజలు తిరస్కరిస్తారు. ప్రశ్న : భగవంత్ మన్ మీతో పోటీ పడగలరా ? జవాబు: భగవంత్ మన్ నాకు ఎప్పటికీ పోటీ కాలేరు. పన్నెండో తరగతి పాస్ కావడానికి ఆయనకు మూడేళ్లు పట్టింది. నేను పీజీ చేశాను. ఇప్పుడు పీహెచ్డీ చేస్తున్నాను. ఆయన తాగుడు మానేశానని అంటున్నారు. ఒక్కసారి సాయంత్రం 4 గంటల తర్వాత ఆయనకి ఫోన్ చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. -
చన్నీ మంత్రం ఫలించేనా?
అందరి దృష్టీ ఉత్తర ప్రదేశ్ (యూపీ), పంజాబ్‌ల మీదే నెలకొన్న వేళ... కాంగ్రెస్ పార్టీ తన సాధారణ పద్ధతికి భిన్నంగా పంజాబ్‌లో ముందుగానే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. రకరకాల ఊహాగానాలొస్తున్న నేపథ్యంలో మరో తడవ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న దళిత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీనే సీఎంగా కొనసాగించనున్నట్టు ఆ పార్టీ ఎట్టకేలకు ఆదివారం ప్రకటించింది. సొంత పార్టీలోనే సీఎం పీఠాన్ని ఆశిస్తున్న మిగతా పోటీదారుల సమక్షంలో కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ ఈ ప్రకటనతో తాంబూలాలు ఇచ్చేశారు. దీంతో పార్టీలో కుమ్ములాటలు ఏ మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ‘టీమ్ పంజాబ్ కాంగ్రెస్’ సమష్టిగా ఎన్నికల పోరాటం చేస్తుందని పైకి చెబుతున్నా, పార్టీలో ప్రకంపనలు ఆగడం లేదు. అభ్యర్థిగా చన్నీని ప్రకటించిన కాసేపటికే, రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు – సీఎం కావాలని తపిస్తున్న మరో ఆశావహుడు సునీల్ జాఖడ్ క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై కొడుతున్నానన్నారు. అయిదు నెలల క్రితమే సీఎం మార్పు వేళ కూడా తన పేరును పరిశీలించ లేదని అలిగిన జాఖడ్ మళ్ళీ అలకపాన్పు ఎక్కేశారు. పార్టీ ఇచ్చిన పని చేస్తానంటూనే, పంజాబ్‌లో సీఎం కాగల సత్తా ఉన్న నేతలు చాలామంది ఉన్నారంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తన మనసులోని ఇదే బాధ సిద్ధూకు కూడా ఉంటుందంటూ, ఆయననూ గిల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి, అధిష్ఠానానికి కావాల్సిందల్లా ఢిల్లీ నుంచి తాము చెప్పినట్టల్లా ఆడే బలహీన ముఖ్యమంత్రి మాత్రమేనంటూ పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధూ శనివారమే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కానీ, ఆదివారం నాటి సభలో మాత్రం రాహుల్ ముందు కాస్తంత తగ్గి, తనకు కావాల్సింది పదవి కాదు, పంజాబ్ ప్రజల జీవితాల బాగు అని ప్లేటు తిప్పారు. ఆయన ఈ మాటకు కట్టుబడి ఎన్నాళ్ళు సొంత పార్టీ, సొంత సీఎంపై బాణాలు సంధించకుండా ఉంటారో ఎవరూ చెప్పలేరు. ఆ మాటకొస్తే ప్రతిక్షణం పాదరసంలా జారిపోయే సిద్ధూ కూడా చెప్పలేరు. కాకపోతే, ఈ సరిహద్దు రాష్ట్రంలోని దాదాపు ప్రధాన పార్టీలన్నిటితోనూ ఖటీఫ్ చెప్పి, కాంగ్రెస్‌కు వచ్చిన సిద్ధూకు ఇప్పటికిప్పుడు పెద్దగా ప్రత్యామ్నాయాలు లేవు. ప్రస్తుతానికి తాను పోటీ చేస్తున్న అమృత్సర్ తూర్పు స్థానంలో గెలిచి, సమయం కోసం వేచి చూడడమే కీలకమని ఆయనకూ తెలుసు. పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ అయిన సునీల్ జాఖడ్ కారులోనే చన్నీ, సిద్ధూలతో కలిసొచ్చి మరీ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించడం ద్వారా అందరూ కలిసే ఉన్నారని సంకేతించాలని రాహుల్ శ్రమించారు. అంతర్గత విభేదాలు ఎన్ని ఉన్నా, దళిత సీఎం చన్నీని కాదని మరొకరి పేరు ప్రకటిస్తే, మొదటికే మోసం వస్తుందని ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీకి బాగా తెలుసు. అధికారంలో ఉన్న కాసిన్ని రాష్ట్రాలనూ కాపాడుకోవడానికీ శతవిధాల ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు ఓ అగ్నిపరీక్ష. మునుపటి దామోదరం సంజీవయ్య, భోలా పాశ్వాన్, జగన్నాథ్ పహాడియా, సుశీల్ కుమార్ షిండేల వరసలో చన్నీతో దళిత బాంధవ పార్టీగా నిలవాలనీ, పంజాబ్‌లోని 31 శాతం ఉన్న దళిత ఓటర్ల మనసు గెలవాలనీ కాంగ్రెస్ ఆలోచన. ఇక, గత ఏడాది సెప్టెంబర్ 20న పంజాబ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 58 ఏళ్ళ చన్నీకేమో ఇది ఊహించని అవకాశం. షెడ్యూల్డ్ కులాల వర్గం నుంచి పంజాబ్ పీఠమెక్కిన తొలి వ్యక్తిగా ఆయనకు రికారై్డతే దక్కింది. కానీ, రామ్‌దాసియా, రవిదాసియా అని పంజాబీ దళితుల్లో రెండు వర్గాలున్నాయి. తొలి వర్గానికి చెందిన చన్నీ అందరినీ ఆకట్టుకొని, అయిదు నెలలైనా కాక ముందే పార్టీని గెలిపించడం అత్యవసరమైంది. గ్రామీణ పంజాబ్‌లోని పేద కుటుంబం నుంచి పైకొచ్చిన ఈ మృదుభాషికీ కాంగ్రెస్ సంస్కృతిలో భాగమైన అసమ్మతి సహజగుణమే. మునుపటి కాంగ్రెస్ సీఎం అమరీందర్ సింగ్‌పై ధ్వజమెత్తినవారిలో చన్నీ కూడా ఉన్నారు. తీరా అమరీందర్ స్థానంలో తనకే సీఎం పీఠం వస్తుందని ఆయన ఊహించలేదు. గద్దెనెక్కాక ఇంటిపోరు ఆయనకూ అనుభవంలోకి వచ్చింది. ఒకే విడతలో ఫిబ్రవరి 20న జరిగే పంజాబ్ ఎన్నికల ప్రధాన ప్రచారకర్తల జాబితాలో తన పేరు మినహాయించడం లోక్‌సభ కాంగ్రెస్ ఎంపీ మనీశ్ మల్హోత్రాకు కినుక తెప్పించింది. ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన వేళ ఏర్పడ్డ భద్రతా వైఫల్యంపై మనీశ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ కథనానికి దగ్గరగా ఉండడమే అందుకు కారణమని కథనం. ఆయనా ఇప్పుడు తిరుగుబాటు జెండా పట్టే పనిలో ఉన్నారు. ఈ అనైక్యతా రాగం చన్నీ మాటెలా ఉన్నా పార్టీని ఇరుకున పెడుతోంది. దీనివల్ల విజయావకాశాలు దెబ్బ తింటే చన్నీకి పెద్దగా పోయేదేమీ లేదేమో కానీ, పార్టీకే నష్టం. అనైక్యతను భరిస్తూ, ఎన్నికల్లో గెలుపు చన్నీకి సవాలే. మరోపక్క చన్నీ సన్నిహితగణంపై కేంద్ర దర్యాప్తు సంస్థల తాకిడీ మొదలైపోయింది. చన్నీ మేనల్లుణ్ణి ఇసుక అక్రమ తవ్వకాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. వీటన్నిటి మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ, కొందరు రైతుల కొత్త జెండా ఎస్ఎస్ఎం, బీజేపీ– అమరీందర్ సింగ్‌ల పీఎల్సీ, అకాలీదళ్ – బీఎస్పీలతో బహుముఖ పోరులో చన్నీ విజేతగా బయట పడగలరా? దారిద్య్రం నుంచి పైకొచ్చిన చన్నీకి ప్రజల కష్టాలు తెలుసన్నారు రాహుల్. ప్రజలదే కాదు... ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్‌ని బాధిస్తున్న అధికార దారిద్య్రం కూడా ఆయనకు తెలుసు. పంజాబ్‌లో పార్టీని మరోసారి గెలిపించి, ఆ దారిద్య్రాన్ని ఆయన పోగొట్టగలరా అన్నదే శేషప్రశ్న. -
సిద్ధూ త్యాగం.. చన్నీ పాదాభివందనం
Punjab Assembly Elections 2022: పంజాబ్‌లో క్లిష్టమైన సమస్యగా భావించిన ముఖ్యమంత్రి ఎంపిక.. ప్రకటనను ఎట్టకేలకు పూర్తి చేసింది కాంగ్రెస్. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెంచుకున్న నవజోత్ సింగ్ సిద్ధూను ఎలాగోలా పార్టీ చల్లబర్చింది. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్‌సింగ్ చన్నీనే.. సీఎం అభ్యర్థిగా ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అంతకు ముందు కొన్ని గంటలపాటు పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా.. అభ్యంతరం లేదని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ సిద్ధూ ప్రకటించడంతో ఆసక్తికరంగా మారింది సీన్. ఈ తరుణంలో.. స్టేజ్‌పై సీఎం అభ్యర్థిగా చన్నీ పేరును ప్రకటించిన వెంటనే ఆసక్తికర దృశ్యం కనిపించింది. సిద్ధూ చన్నీ కుడి చెయ్యిని పైకి ఎత్తగా.. ఆక్షణంలోనే చన్నీ తన ఎడమ చేతితో సిద్ధూకి పాదాభివందనం చేశాడు. ‘సిద్ధూజీ.. మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసేయండి. మీ మోడల్ కచ్చితంగా అమలు అయ్యి తీరుతుంది’ అని చన్నీ ఆ వెంటనే వ్యాఖ్యానించడం విశేషం. లూథియానా: ఇక పంజాబ్‌లో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెంచుకున్న పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు పార్టీ నేత రాహుల్ గాంధీ పెద్ద షాక్ ఇచ్చారు. పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ చన్నీ పేరును రాహుల్ ఆదివారం పంజాబ్‌లో వర్చువల్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించి.. ప్రసంగించారు. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా రావాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. పేదరికాన్ని, ఆకలిని అర్థం చేసుకున్నవారే కావాలని అంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. ‘‘ఇది చాలా కఠినమైన నిర్ణయం. దాన్ని మీరు సులభతరం’’ చేశారు అని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. అనంతరం చన్నీ, సిద్ధూ, పార్టీ నేత సునీల్ జాఖర్‌ను రాహుల్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. మీడియా, టీవీ చర్చా కార్యక్రమాల్లో నాయకులు పుట్టుకురారని తెలిపారు. కొన్ని సంవత్సరాల పోరాటంతోనే వ్యక్తులు నాయకులుగా ఎదుగుతారని వివరించారు. గొప్ప నాయకులకు తమ పార్టీలో లోటు లేదన్నారు. ప్రజల కోసం నిలబడే నాయకులు కాంగ్రెస్‌లో ఉన్నారని పేర్కొన్నారు. చన్నీ, సిద్ధూల రక్తంలో పంజాబ్ ఉందన్నారు. సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై కాంగ్రెస్ నాయకత్వం పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించింది. ప్రజల మనోభావాలను కూడా తెలుసుకుంది. ఇందుకోసం అటోమేటెడ్ కాల్ సిస్టమ్‌ను ఉపయోగించుకుంది. దళిత సిక్కు నాయకుడైన చరణ్‌జిత్‌సింగ్ చన్నీ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పేరును రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించారు. వర్చువల్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఆయన ప్రధానమంత్రిగా కాదు, ఒక రాజులాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ రోడ్లపై ఎవరికైనా సాయం చేయడం ఎప్పుడైనా చూశారా? ఆయన ప్రజల మధ్య ఉండడం ఎప్పుడైనా గమనించారా? అని ప్రజలను ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. పదవుల కోసం పాకులాడలేదు: సిద్ధూ తాను ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌సింగ్ సిద్ధూ అన్నారు. ఆయన లూథియానాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. గత 17 ఏళ్లుగా రాజకీయ జీవితం కొనసాగిస్తున్నానని, పదవులపై ఎప్పుడూ ఆశపడలేదని పేర్కొన్నారు. పంజాబ్ అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని మాత్రమే కోరుకున్నానని వివరించారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. గత ఏడాది పంజాబ్ రాష్ట్రానికి ఒక దళితుడిని ముఖ్యమంత్రిగా చేశారని కొనియాడారు. మార్పునకు సమయం ఆసన్నమైందని వెల్లడించారు. పంజాబ్ అభివృద్ధి కంటే తనకు కావాల్సింది ఇంకేమీ లేదని వ్యాఖ్యానించారు. సీఎం అభ్యర్థి ప్రకటనపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సిద్ధూ ట్వీట్ చేశారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. బీజేపీ శ్రుతులకు అనుగుణంగా అమరీందర్ డ్యాన్స్ చేస్తున్నారని ఆరోపించారు. పంజాబ్‌ను లూటీ చేసిన నాయకులు ఇప్పుడు డబల్ ఇంజన్ ప్రభుత్వం అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ అధికారం రాహుల్‌కు ఎక్కడిది?: బీజేపీ చండీగఢ్: పంజాబ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అధికారం రాహుల్ గాంధీకి ఎక్కడుందని బీజేపీ నేత, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదివారం ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో రాహుల్‌కు ఎలాంటి హోదా లేదని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఏ అధికారంతో సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని నిలదీశారు. పేరు చివర ‘గాంధీ’ అన్న ఒక్క అర్హత మాత్రమే రాహుల్‌కు ఉందని ఎద్దేవా చేశారు. -
పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తుండటంతో పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ప్రస్తుత సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ వైపే మొగ్గుచూపింది. లుధియానాలో ఆదివారం జరిగిన వర్చువల్ ఎన్నికల ప్రచారంలో పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఈ మేరకు ప్రకటించారు. ‘సీఎం అభ్యర్థిని నిర్ణయించడం ఇబ్బందికర పరిస్థితే. అయితే, పేదల కష్టాన్ని ఓ పేద బిడ్డ మాత్రమే అర్థం చేసుకుంటారని పంజాబ్ ప్రజలు భావిస్తున్నారు. అందుకనే చన్నీనే పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. (చదవండి: ఆరునెలల్లోనే సీఎం అభ్యర్థి రేంజ్‌కి.. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ) -
పంజాబ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి పై నెలకొన్న ఉత్కంఠ!!
చండీగఢ్: పంజాబ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఇద్దరూ ఉంటారంటూ వస్తున్న పుకార్లను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. అంతేకాదు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒకరి పేరును మాత్రమే ప్రకటిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. పంజాబ్‌లోని కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవీ కోసం పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ చన్నీ, నవజ్యోత్ సిద్ధూ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌గాందీ లూథీయానాలో ఈ ఇద్దర్ని పంజాబ్ ముఖ్యమంత్రులు ప్రకటిస్తున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు ఈ ప్రచారం ఊపందుకున్న తర్వాత రోజే అక్రమ కేసుల తవ్వకాల్లో చన్నీ మేనల్లుడు భూపేంద్ర సింగ్ హనీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుతో ముందంజలో చన్నీ ఉన్నందున సిద్దూ తన సొంత పార్టీపై దాడిని పెంచారు. మరోవైపు చన్నీ మేనల్లుడు అరెస్టు కావడంతో ప్రత్యక్ష విమర్శదాడులకు దిగారు. ఈ మేరకు సిద్దూ పార్టీ నిజాయితీ, క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉన్న వారిని ఎన్నుకోవాలంటూ పిలుపునిచ్చారు. అంతేకాదు కాంగ్రెస్ చన్నీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు మెగ్గుచూపుతున్నట్లుగా పలు సంకేతాలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలు ఏ నాయకుడికి అనుకూలంగా ఉన్నారో ఎంచుకోవడానికి ఐవీఆర్(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) కాల్ల ద్వారా పబ్లిక్ సర్వేను కూడా నిర్వహిస్తోంది. అయితే చన్నీ బంధువు అరెస్టు కావడంతో సిద్దూ తన వాదనను వినిపించేందుకు దీన్ని ఒక అవకాశంగా వినియోగించుకున్నారు. అంతేకాదు చన్ని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి నామినేట్ అవ్వడం, మరోవైపు బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా చన్నీకి మరో అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీని కోరడం వంటి తదితర కారణాలతో చన్నీయే ముఖ్యమంత్రి అభ్యర్థి అనే ఊహాగానాలకు తెర తీసింది. మరోవైపు సిద్ధూ కూడా తనను తాను అభ్యర్థిగా చెప్పుకోవడానికి పదేపదే ప్రయత్నించడం గమనార్హం. (చదవండి: ‘సీఎం అభ్యర్థి చాయిస్.. చాన్స్ కాదు’) -
దళితుల చేతిలోనే.. పంజాబ్ అధికార దండం
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా పంజాబ్‌లో అత్యధికంగా 32 శాతం మంది దళిత ఓటర్లు ఉన్నారు. కానీ వీరి చేతిలో 2.3 శాతం భూమి మాత్రమే ఉండటం గమనార్హం. ఛండీఘడ్: పంజాబ్‌లో రాజకీయం పంచముఖ పోరుగా మారడం, కాంగ్రెస్‌కు మారుపేరుగా నిలిచిన కెప్టెన్ అమరీందర్‌సింగ్ హస్తం పార్టీకి గుడ్‌బై కొట్టి... బీజేపీతో జట్టుకట్టడంతో ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. మరోవైపు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీతో ఉన్న బంధాన్ని తెగదెంపులు చేసుకున్న శిరోమణి అకాలీదళ్–కొత్తగా మాయావతి పార్టీ బీఎస్పీతో పొత్తపెట్టుకోవడం, ఆమ్ ఆద్మీ పార్టీ... దళిత ఎమ్మెల్యే హర్బాల్ సింగ్ (దిర్బా నియోజకవర్గం)ను అసెంబీల్లో ఆప్ పక్ష నేతగా నియమించడం... ఇలా ఇప్పుడు పంజాబ్ రాజకీయమంతా దళితుల చుట్టూనే తిరుగుతోంది. వాస్తవంగా చెప్పాలంటే... పంజాబ్ రాజకీయాల్లో జాట్ సిక్కులదే ఆధిపత్యమైనప్పటికీ... ప్రస్తుతం పరిస్థితి వేరుగా ఉంది. రాష్ట్ర జనాభాలోని 60 శాతం సిక్కుల్లో జాట్ల వాటా 21 శాతమే అయినప్పటికీ అదే ఆధిపత్య వర్గం. రాజకీయ నాయకత్వమంతా దశాబ్దాలుగా ఈ వర్గం చేతిలోనే కేంద్రీకృతమవుతోంది. ఆయా పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకుకు దళితుల ఓట్లు తోడైతేనే ఏ పార్టీ అయినా ప్రస్తుతం పంజాబ్ సీఎం పీఠాన్ని అందుకోగలుగుతుంది. ఎందుకంటే పంజాబ్ జనాభాలో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏకంగా 32 శాతం మంది దళిత ఓటర్లు ఉన్నారు. మూడింటి ఒకవంతున్న దళిత ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు రాజకీయపక్షాలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. 10 నెలల కిందటే మొదలుపెట్టిన బీజేపీ మూడు నూతన వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దీర్ఘకాలిక భాగస్వామి అయిన శిరోమణి అకాలీదళ్ ఎన్డీయేను వీడటంతోనే కమలదళం అప్రమత్తమైంది. ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రమైన పంజాబ్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో (ఫిబ్రవరి 20న జరగనున్నాయి) తాము గెలిస్తే దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని గత ఏప్రిల్‌లోనే ప్రకటించడం ద్వారా బీజేపీ ఈ వర్గంలో కొత్త ఆశలు రేకెత్తించింది. అమరీందర్ సింగ్– సిద్ధూల మధ్య గొడవ తలకుమించిన భారం కావడంతో కాంగ్రెస్ గత ఏడాది సెప్టెంబరులో తెగించేసింది. జాట్ సిక్కు అయిన కెప్టెన్ అమరీందర్ స్థానంలో రవిదాసియా వర్గానికి చెందిన దళితుడైన చరణ్‌జిత్‌సింగ్ చన్నీని సీఎంగా నియమించి అందరికంటే ముందుగానే దళిత ఛాంపియన్ అనిపించుకునే ప్రయత్నం చేసింది. గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకొని... ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న కాకుండా మరో ఆరురోజులు ముందుకు జరిపి ఈ నెల 20 నిర్వహించాలని పంజాబ్ సీఎం చన్నీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. మిగతా రాజకీయపక్షాలన్నీ ఆయన డిమాండ్‌కే మద్దతు పలకడంతో ఈసీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఈనెల 20కి వాయిదా వేసింది. ఈ చర్య దళితుల్లో చన్నీ గ్రాఫ్‌ను అమాంతంగా పెంచేసిందని రాజకీయ పండితులు విశ్లేషణ. అయితే అధికార వ్యతిరేకతను అధగమించడం, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ కొట్టే సిక్సర్లను తట్టుకోవడం లాంటి పనులతోనే పాపం చన్నీ బిజీగా గడపాల్సి వస్తోంది. దళితుల్లోనూ మళ్లీ రెండు వర్గాలు పంజాబ్‌లోని దళితుల్లో... హిందు దళితులు, సిక్కు దళితులుగా రెండు వర్గాలున్నాయి. హిందు దళితుల శాతం ఎప్పటికప్పుడు మారుతూ ఉండటానికి కారణం... వీరిలో చాలా మంది సిక్కు మతంలోకి మారిపోవడం, రవిదాసియా, ఆది ధర్మిలు మాత్రం తమను ప్రత్యేక మతంగా గుర్తించాలనే డిమాండ్లు వినిపిస్తున్నారు. 2018 సామాజిక సాధికార శాఖ గణాంకాల ప్రకారం పంజాబ్ దళితుల్లో మొత్తం 39 ఉపకులాలున్నాయి. వీటిలో ఐదు ప్రముఖమైనవి. రాష్ట్రంలోని 32 శాతం దళిత జానాభాలో వీటి వాటాయే 80 శాతం దాకా ఉంటుంది. మజ్హబీ సిక్కులు అత్యధికంగా 30 శాతం ఉండగా... తర్వాత రవిదాసియాలు 24 శాతం మేరకు ఉంటారు. కాగా ఆది ధర్మీలు 11 శాతం ఉంటారు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే... దౌబాలో 37 శాతం, మాల్వాలో 31 శాతం, మజ్హాలో 29 శాతం దళితులున్నారు. మొత్తం 117 అసెంబ్లీ సీట్లున్న పంజాబ్‌లో 34 సీట్లు ఎస్సీలకు రిజర్వు చేశారు. 2017లొ ఈ 34 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 21 నెగ్గగా, ఆప్ 9 సీట్లు గెల్చుకుంది. డేరాల ప్రభావం క్షీణించినట్లేనా! గతంలో దళిత ఓటర్లపై డేరా సచ్చా సౌదా (సమానత్వాన్ని ప్రబోధించే ధ్యాన కేంద్రా)ల ప్రభావం తీవ్రంగా ఉండేది. డేరాసచ్చా సౌదా అధిపతి రామ్‌రహీమ్ సింగ్ అత్యాచారం, హత్య కేసులో అరెస్టయి జైల్లో ఉండటంతో దళితులపై ఈ డేరాల ప్రభావం మునుపటి స్థాయిలో లేదు. 69 సీట్లున్న మాల్వా ప్రాంతంలో గత ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా దెబ్బతింది. అకాలీ దళిత ఓటు బ్యాంకు కాస్తా కాంగ్రెస్ బదిలీ అయింది. ఐక్యత లేదు.. పంజాబ్‌లో జనాభాలో దళితులు ఏకంగా 32 శాతం ఉన్నప్పటికీ... వారి మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఐక్యత లేకపోవడమే వీరిని దెబ్బతీస్తోంది. ఏదో ఒక ఆధ్యాత్మిక బోధకుడి సూక్తులకు కట్టుబడి ఉండకపోవడం, భిన్నమైన ఆచారాలు, సంస్కృతులు ఉండటం మూలంగా పంజాబ్ దళితుల్లో ఐక్యత లోపించి బీఎస్సీ ఇక్కడ దారుణంగా విఫలమైందని, గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ కనీసం ఒక్క సీటును కూడా గెలవకపోవడానికి ఇదే కారణమని పంజాబ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ప్రమోద్ కుమార్ విశ్లేషించారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
పంజాబ్ సీఎం చన్నీ మేనల్లుడు అరెస్ట్
న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ అలియాస్ హనీని మనీల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం అరెస్టు చేసింది. అక్రమ ఇసుక మైనింగ్‌కు సంబంధించి హనీకి మనీల్యాండరిం గ్‌తో సంబంధాలున్నాయని ఈడీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి చాలా సేపు హనీని విచారించి అనంతరం పీఎంఎల్ చట్టం కింద అదుపులోకి తీసుకొన్నామని తెలిపారు. విచారణలో సహకరించనందుకే హనీని అరెస్టు చేసినట్లు తెలిసింది. ఆయన్ను పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఐదురోజుల ఈడీ కస్టడీ విధించింది. గతనెల 18న హనీ నివాసాలపై ఈడీ దాడులు జరిపి రూ. 8 కోట్ల నగదు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ప్రత్యర్థులకు అస్త్రం హనీ అరెస్టుతో పంజాబ్ ఎన్నికల ముందు ప్రత్యర్థి పార్టీలకు, సొంతపార్టీలోని వ్యతిరేకులకు చన్నీ మేనల్లుడి అరెస్టు వరంలా మారనుందని నిపుణుల అంచనా. ఈనెల 6న పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి పేరును రాహుల్ గాంధీ ప్రకటించే నేపథ్యంలో చన్నీకి చాన్సు లభించడంపై ఉత్కంఠ నెలకొంది. హనీ అరెస్టు రాజకీయ గిమ్మిక్కని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే చన్నీ బంధువుల్లో ఒక్కరే 111 రోజుల చన్నీ పాలనలో కోట్లు కూడబెడితే, ఆయన చుట్టాలంతా కలిసి ఎంత పోగేసి ఉంటారో ఊహించవచ్చని ఆప్ పార్టీ దుయ్యబట్టింది. ఈ విషయంలో చన్నీ సమాధానం చెప్పాలని శిరోమణి అకాలీదళ్ నేత మజితియా డిమాండ్ చేశారు. -
సాక్షి కార్టూన్
గట్టి నమ్మకం ఉంటేనే పోటీ చేయండి! లేకుంటే మరో రెండు స్థానాల్లో కూడా పోటీకి దిగటం బెటర్!! -
సేఫ్‌సైడ్ కోసం.. రెండు చోట్లా పోటీ
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ చన్నీని కాంగ్రెస్ సేఫ్పైడ్గా రెండో నియోజకవర్గంలోనూ పోటీకి దింపింది. బదౌర్ (ఎస్పీ రిజర్వుడు) స్థానం నుంచి చన్నీ పోటీ చేస్తారని ప్రకటించింది. చన్నీతో కలిపి ఆదివారం మొత్తం ఎనిమిది మందితో కూడిన తుది జాబితాను కాంగ్రెస్ విడుదల చేనింది. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చింది. నామినేషన్లకు మరో రెండు రోజులు గడువు మిగిలి ఉందగనా... కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడం గమనార్హం. ఆమ్ ఆద్మీ పార్టీ సర్వే ప్రకారం చన్నీ చమకౌర్ నియోజకవర్గంలో ఓడిపోతున్నారని తేలిందని, అందుకే కాంగ్రెస్ ఆయన్ను మరోచోటు నుంచి పోటీకి నిలిపిందని ఆప్. చదవండిః ఒక వైపు నామినేషన్లు.. మరోవైపు రాజీనామాలు -
Charanajit Singh Channi: గాడ్ ఫాదర్ లేరు.. అయితేనేం..
పంజాబ్‌కు తొలి దళిత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ. ఆయన ఒక నిత్య విద్యార్థి. మూడు పీజీ డిగ్రీలున్న విద్యాధికుడు. చదువులోనైనా, రాజకీయాల్లోనైనా స్వయంకృషినే నమ్ముకున్నారు. కెప్టెన్ అమరీందర్ నిష్క్రమణతో ఆయనకి అనుకోకుండా పంజాబ్ అత్యున్నత పీఠం అధిష్టించే అవకాశం వచ్చింది. విద్యార్థిగా ఉన్నప్పుడే చన్నీ రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. రాజకీయ రంగంలో గాడ్ ఫాదర్ ఎవరూ లేనప్పటికీ ఓటమి ఎరుగని నాయకుడిగా పేరు సంపాదించారు చదువుకోవడం, ప్రజలతో కలిసి తిరగడం ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన అంశాలు. ముఖ్యమంత్రి అయిన ఈ కొద్ది రోజుల్లోనే నిరుపేదల సీఎం అన్నపేరు తెచ్చుకోవాలన్న ఆశతో అడుగులేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా నవజోత్ సింగ్ సిద్ధూతో పోటీపడుతున్న చన్నీకి కూడా ప్రజల్లో మంచి ఆదరణే ఉంది. ►పంజాబ్‌లో చంకూర్ సాహిబ్ జిల్లాలోని మకరోనా కలన్ గ్రామంలో ఒక దళిత కుటుంబంలో 1963 సంవత్సరం మార్చి 1న జన్మించారు. ►చన్నీకి చదువంటే ప్రాణం. మూడు పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలు చేశారు. రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. ఎంబీఏ, ఎల్ఎల్బీ కూడా చదువుకున్నారు. ►చదువుకి వయసుతో పని లేదని నమ్మడమే కాదు ఆచరించి చూపించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఎంబీఏ చదివారు. 2016లో సీఎల్పీ నాయకుడిగా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తూనే పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేశారు. ►చన్నీ తండ్రి హర్షసింగ్ ఖరార్ గ్రామ సర్పంచ్‌గా ఉండడంతో ఆయన ప్రభావంతో రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. ►విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు. చండీగఢ్ గురుగోవింద సింగ్ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నప్పుడే యూనియన్ నాయకుడిగా ఎన్నికయ్యారు. 2002లో ఖరార్ మునిసిపల్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ►చన్నీ భార్య కమల్జిత్ కౌర్ డాక్టర్. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ►2007 సంవత్సరంలో తొలిసారిగా పంజాబ్ శాసనసభకు చంకూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. ►2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ పడి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ►2015లో కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికై ప్రతిపక్ష నాయకుడిగా ఒక ఏడాది పాటు సమర్థవంతమైన పాత్ర పోషించారు. ►2017లో జరిగిన ఎన్నికల్లో చంకూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. కెప్టెన్ అమరీందర్ నేతృత్వంలో సాంకేతిక విద్య మంత్రిగా వ్యవహరించారు. ►అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేసి, పార్టీని వీడటంతో చరణ్‌జిత్ సింగ్ చన్నీ 2021 సెప్టెంబర్‌లో పంజాబ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. పంజాబ్‌కు తొలి దళిత ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు. ►ఈసారి ఎన్నికల పోలింగ్‌కు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించమని చన్నీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం చన్నీ, సిద్ధూల మధ్య ఈ పదవి కోసం పోటీ ఉంది. ఎవరి పేరు ప్రకటించినా అందరూ సమష్టిగా కలిసి పని చేస్తామంటూ ఇరువురు నాయకులు రాహుల్‌కు హామీ ఇవ్వడం విశేషం. ►పంజాబ్‌లో దాదాపుగా 32 శాతం దళిత జనాభా ఉంది. ఈ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొనే దళితుడైన చన్నీని కాంగ్రెస్ అధిష్టానం పంజాబ్ సీఎంగా నియమించింది. ►ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలో పంజాబ్ సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలని రాహుల్ గాంధీ అనుచరుడు నిఖిల్ ఆల్వా ట్విట్టర్లో పోలింగ్ నిర్వహించగా చన్నీకి అనుకూలంగా ఏకంగా 69 శాతం ఓట్లు వచ్చాయి. ►యువతని ఆకట్టుకోవడానికి సీఎం చన్నీ ప్రయత్నిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏడాదిలోనే యువతకి లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, విదేశాలకు వెళ్లేందుకు ఉచితంగా శిక్షణ, ఉన్నత విద్యాభ్యాసానికి రుణం లేని వడ్డీలు వంటి హామీలెన్నో ఇచ్చారు. ►రాష్ట్రంలో దళితుల్ని ఆకర్షించడానికి గురు రవిదాస్ బోధనల్ని ప్రచారం చేయడం కోసం అతి పెద్ద కేంద్రాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ►సీఎం పదవిని చేపట్టిన మూడు నెలల్లోనే పాలనలో తన ముద్ర వేశారు. కేవలం మూడు నెలల్లోనే 60కి పైగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దళితుడైనప్పటికీ ఆ సామాజిక కార్డు తీయకుండా తాను పేదల సీఎం అన్న ముద్ర వేయించుకోవాలన్న లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి కూలీల సమస్యలు అడిగి తెలుసుకోవడం, ఆటో రిక్షా డ్రైవర్లను పలకరించడం, గురుద్వారకు వెళ్లి అక్కడి వారితో కలిసి భక్తి పాటలు పాడడం వంటివి చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
చన్నీ, సిద్ధూలు పంజాబ్ ప్రజలను దోచుకున్నారు: అరవింద్ కేజ్రీవాల్
చండీగఢ్: కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్ ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాహుల్ గాంధీ జలంధర్ పర్యటనపై పలు వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ప్రజలకు రాహుల్ మొహం చూపించలేక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పర్యటిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ గత 60 ఏళ్లలో పంజాబ్‌ను దోచుకుందని ఎద్దేవా చేశారు. చన్నీ,సిద్దూలు ప్రజలను మోసం చేసిన రాజకీయా ఏనుగులే అన్నారు. ప్రజలను దోచుకున్నారని తెలిపారు. ఒక వ్యక్తి సత్యమార్గంలో నడిచినప్పుడు గిట్టని వారు తిట్టడం సహజమే అన్నారు. కాంగ్రెస్ నేతల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. కాగా, తమ సీఎం అభ్యర్థి బిక్రమ్ మజిథియా అమృత్సర్ ఈస్ట్ నుంచి ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని తెలిపారు. People are tired of Congress & SAD. Why will people vote for Majithia or Sidhu? Both are political elephants who have crushed people. Our candidate(from Amritsar East) is a common woman who will be available for people always: Delhi CM & AAP national convenor Arvind Kejriwal pic.twitter.com/ghW7Gn4R1B — ANI (@ANI) January 27, 2022 చదవండి: చన్నీ వర్సెస్ సిద్ధూల మధ్య వివాదం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు -
చన్నీ వర్సెస్ సిద్ధూల మధ్య వివాదం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
చండీగఢ్: కాంగ్రెస్ పార్టీ పంజాబ్ ప్రజలకు తీపికబురు అందించింది. త్వరలోనే పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. రాహుల్ గాంధీ పంజాబ్‌లోని జలంధర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సభలో.. పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ, పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాల్గోన్నారు. కాగా, తాము.. సీఎం పదవి కోసం ఆశపడబోమని ఆ సభలో బహిరంగంగా హమీ ఇచ్చారు. కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. అదే విధంగా ఒకరు నాయకత్వం వహిస్తే మరొకరు వారికి సహకారం అందిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ లేదా పంజాబ్ కోరుకుంటే త్వరలోనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని అన్నారు’. ఈ ప్రకటనతో చన్నీ వర్సెస్ సిద్ధూల మధ్య పోటీకి తెరపడినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు నాయకత్వం వహించలేరు.. ఒకరు మాత్రమే సరైన నాయకుడిగా ఉండగలరని ఆయన అన్నారు. సీఎం అభ్యర్థిని ఎవరు ఉండాలనే దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలనే అడుగుతామన్నారు. అయితే, చన్నీ, నవజ్యోత్ సింగ్ ఇద్దరు నాయకులు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తారని తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ.. క్రమశిక్షణ కల్గిన కాంగ్రెస్ సైనికుడిలా పనిచేస్తానని అన్నారు. తనను ‘షోపీస్’లా ట్రీట్ చేయోద్దని అన్నారు. ‘ మనమంతా పంజాబ్‌లో కాంగ్రెస్‌ను అధికారంలో తేవడానికి ఐక్యంగా పోరాడదామన్నారు’. ఇదే వేదికపై ఉన్న చన్నీ కూడా.. సిద్ధూ దగ్గరకు వెళ్లి తమ ఐక్యతను చూపే ప్రయత్నం చేశారు. ఈ సభలో సీఎం చన్నీకూడా మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి పదవికి ఎవరి పేరును ప్రతిపాదించిన అభ్యంతరంలేదన్నారు.’ ఎవరి పేరు ప్రతిపాదించిన ప్రచారం కోసం పనిచేసే మొదటి వ్యక్తి తానేనని చన్నీ స్పష్టం చేశారు. ఆ తర్వాత చన్నీ.. అరవింద్ కేజ్రీవాల్‌పై ఫైర్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ఉందని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని చురకలంటించారు. చదవండి: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే -
యువతను ఆకట్టుకునేలా హాలీవుడ్ సినిమా రేంజ్లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్
Punjab Chief Minister Charanjit Singh Channi portrayed as superhero Thor: కరోనా మహమ్మారి సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ఎలక్షన్ కమిషన్ రోడ్ షోలు, ర్యాలీలను నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తమదైన వ్యూహాలతో ప్రజలను ఆకర్షించేలా ప్రచారాలకు సనద్దమయ్యారు. అందులో భాగంగానే పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ని స్ఫూర్తిగా తీసుకుంది. అయితే మార్వెల్ కామిక్స్ ఆధారంగా రూపొందించిన ఈ హాలీవుడ్ చిత్రంలో క్రిస్ హేమ్స్‌వర్త్, మార్క్ రుఫాలో, క్రిస్ ఎవాన్స్, తదితర నటులు నటించారు. ఈ మేరకు ఈ అవెంజర్స్ చిత్రంలో థోర్స్ పాత్రలో చరణ్ జిత్ సింగ్ చన్నీ ముఖాన్ని, రాహుల్ గాంధీని బ్రూస్ బ్యానర్ అకా ది హల్క్‌గా ఒక యుద్ధ సన్నివేశానికి సంబంధించిన వీడియోని చిత్రీకరించారు. అయితే ఇందులో నవజ్యోత్ సింగ్ సిద్ధూని కెప్టెన్ అమెరికాతో పోల్చారు. అంతేకాదు ఈ అవెంజర్స్ సినిమాలో దేవుళ్ల సినిమాల్లో ఉన్నట్టుగా ఉరుములు మెరుపులతో కూడి యుద్దం చేస్తున్న సన్నీవేశాన్ని చిత్రీకరించారు. ఆ వీడియోలో నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ముఖాలను గ్రహాంతరవాసుల పాత్రలతో వారిని శత్రువులుగా చిత్రీకరించారు. పైగా పంజాబ్‌లో లోక్ కాంగ్రెస్ అనే తన సొంత పార్టీని స్థాపించిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, శిరోమణి అకాలీదళ్ (సీఏడీ) చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్‌లను దుష్ట గ్రహాంతరవాసులు పాత్రలుగా చిత్రీకరించారు. బ్యాక్ గ్రౌండ్లో థీమ్ సాంగ్‌తో మిస్టర్ చన్నీ ఎంట్రీ అయ్యి స్టార్మ్బ్రేకర్(గొడ్డలి ఆకారంలో ఉండే ఆయుధం)ని ఉపయోగించి గ్రహాంతరవాసులందరి గొంతులను కోస్తున్నట్టుగా వీడియో రూపోందించారు. పంజాబ్ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దుష్టశక్తుల నుండి తమ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఏమైన చేస్తాం అని వీడియో చివరలో వినిపిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు హాలీవుడ్ అవెంచర్స్ మూవీలోని యుద్ధ సన్నివేశాన్ని ఎడిట్ చేసిన క్లిప్పింగ్ వీడియోతోపాటు "పంజాబ్‌లో కాంగ్రెస్ మాత్రమే అధికారంలోకి వస్తుంది" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ హాలీవుడ్ మూవీకి భారతదేశంలో విపరీతమైన అభిమానులు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లోని యువత ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాన్ని ఎంచుకుంది. ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బాలీవుడ్ పాట 'మస్త్ కలందర్'ను ఎడిట్ చేసిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. We will do whatever it takes to redeem our beloved state from the clutches of evil forces working against the interest of Punjab and its people. #CongressHiAyegi pic.twitter.com/6lVxqkN4VC — Punjab Congress (@INCPunjab) January 24, 2022 -
చన్నీకి మరొక్కసారి అవకాశం ఇవ్వాలి: సోనూసూద్
Punjab Assembly Election 2022: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి సుదీర్ఘకాలం పదవిలో ఉండి సేవలందించే అవకాశం లభింనందున అతనికి మరొక్క అవశాశం ఇవ్వాలని బాలీవుడ్ నటుడు సోనూసూద్ అన్నారు. చన్నీ ముఖ్యమంత్రిగా చాలా తక్కువ సమయమే పని చేసినప్పటికీ చాలా ప్రశంసించదగ్గ పనులు చేశారని చెప్పారు. అంతేకాదు పంజాబ్ రాష్ట కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మంచి నిజాయితీ పరుడు, హృదయ పూర్వకంగా మాట్లాడతారని అన్నారు. కాంగ్రెస్ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని, పైగా ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందన్న విషయన్ని కూడా నొక్కి చెప్పారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ని తాను చాలా ఏళ్ల క్రితం ఒక కళాకారుడిగా మాత్రమే కలిశానని చెప్పారు. ఆయన రాజకీయనాయకుడిగా ఎలా ఉంటారనే విషయం గురించి తనకు తెలియదని సోనూ సూద్ తెలిపారు. సోనూ సూద్ సోదరి 38 ఏళ్ల మాళవిక సూద్ సచార్ కాంగ్రెస్ అభ్యర్థిగా తమ పూర్వీకుల ఊరు మోగా నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం తన సోదరితో కలిసి ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, చాలా కాలంగా సామాజిక సేవలో పాల్గొంటున్న తన సోదరికి మాత్రమే మద్దతు ఇస్తున్నానని సూద్ నొక్కి చెప్పారు. మొగాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ధర్మశాలలు మా కుటుంబమే నిర్మించిందని ఈ సందర్భంగా చెప్పారు. పైగా వ్యవస్థలో భాగమైతే చాలా పనులు జరుగుతాయని మాళవికను ప్రజలే రాజకీయాల్లోకి తీసుకొచ్చారని సూద్ అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లోని మోగా నియోజకవర్గంలో మంచి పనులు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారిందన్నారు. అంతేకాదు తమ మానిఫెస్టోని అమలు చేయగల పార్టీగా కాంగ్రెస్‌ని విశ్వస్తున్నాని, అందువల్ల తమ సోదరి కాంగ్రెస్‌లో చేరడం మంచిదని భావించానని చెప్పుకొచ్చారు. పైగా తనకు వివిధ పార్టీ నుంచి ఆఫర్లు వచ్చాయని కూడా చెప్పారు. అయితే తాను వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి వస్తానని, కాకపోతే తనవద్ద తగినంత పెద్ద టీమ్ లేదని అన్నారు. అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అనంతరం జరిగిన ఆదాయపు పన్ను శాఖ రైడ్ విషయం కూడా సెటిల్ అయ్యిందని సోనూ సూద్ చెప్పారు. (చదవండి: పాటియాలా నుంచి అమరీందర్.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల) -
పంజాబ్ ఎన్నికల్లో అందరిదీ సేఫ్ గేమే!..
వచ్చే నెలలో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ దిగ్గజాలు ఈసారి సేఫ్‌గేమ్ ఆడుతున్నారు. అన్ని పార్టీల్లోని పెద్ద నేతలంతా ఒకరిపై ఒకరు పోటీ చేయొద్దన్న ధోరణితో బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, ప్రస్తుత ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ సహా అనేకమంది బాదల్ కుటుంబంపై పోటీ చేసేందుకు ముందుకు వచ్చి చేతులు కాల్చుకోవడంతో ఈసారి మాత్రం ఒకరిపై ఒకరు పోటీచేసేందుకు వెనక్కి తగ్గారు. మిగతా కొందరి ప్రముఖుల స్థానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎవరు ఎక్కడి నుంచి.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ: కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పాత సీటు అమృత్సర్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి సిద్ధూ మజీఠా సీటులో బిక్రమ్ మజీఠియాపై లేదా పాటియాలా స్థానంలో కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై పోటీ చేస్తారని ముందుగా ఊహించారు. బిక్రమ్ మజీఠియా: మజీఠా సిట్టింగ్ ఎమ్మెల్యే, శిరోమణి అకాలీదళ్ యువనేత అయిన బిక్రమ్ మజీఠియాకు పోటీగా కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు పెద్ద నేతలను నిలబెట్టలేదు. ఇక్కడ నుంచి ఆప్ తరఫున లాలీ మజీఠియా, కాంగ్రెస్ నుంచి జగ్గా మజీఠియాలు బరిలో ఉన్నారు. చరణ్‌జిత్ చన్నీ: చమ్‌కౌర్ సాహిబ్ స్థానం నుంచి సీఎం చరణ్‌జిత్ చన్నీ పోటీ చేస్తున్నారు. అయితే ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేసేలా చర్చలు జరిగినా, పార్టీ అధిష్టానం అందుకు అంగీకరించలేదు. చదవండి: (Punjab Assembly Election 2022: వ్యూహకర్త బాదల్) కెప్టెన్ అమరీందర్ సింగ్: కెప్టెన్ అమరీందర్ సింగ్ పాటియాలా అర్బన్ నుం చి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఆయన తన సొంత జిల్లా పాటియాలాను వదిలి వేరే దగ్గర పోటీ చేసే పరిస్థితి లేదు. అయితే కెప్టెన్ అమృత్సర్ ఈస్ట్ నుంచి సిద్ధూపై పోటీ చేస్తారనే ప్రచారం గతంలో జరిగింది. సుఖ్బీర్ బాదల్: అకాలీదళ్–బీఎస్పీ కూటమి సీఎం అభ్యర్థి అయిన సుఖ్బీర్ బాదల్ ఈసారి కూడా జలాలాబాద్ నుంచి పోరాడుతున్నారు. ప్రస్తుత ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ 2017 ఎన్నికల్లో సుఖ్బీర్ బాదల్‌పై పోటీ చేసి ఓడిపోయారు. భగవంత్ మాన్: ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ ధురి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ధురి నుంచి ఆధిక్యం సాధించారు. అందుకే ఆయనకు ఎలాంటి ఆటంకం రాకుండా పార్టీ అధిష్టానం సేఫ్ సీటు ఎంపిక చేసింది. అయితే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దల్బీర్ గోల్డీ, అకాలీదళ్ నుంచి ప్రకాశ్ చంద్ గార్గ్‌లను ఆ రెండు పార్టీలు రంగంలోకి దింపాయి. – సాక్షి, న్యూఢిల్లీ -
కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: పంజాబ్ సీఎం చన్నీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తానని పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ అన్నారు. పరువు నష్టం దావా వేయడానికి కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు నిర్వహించిన నేపథ్యంలో పంజాబ్ సీఎం చన్నీని ఉద్దేశించి కేజ్రీవాల్ ‘నిజాయితీ లేని వ్యక్తి’ అంటూ విమర్శించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై స్పందించిన చన్నీ.. తర్వలోనే పరువు నష్టం దావా వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇతరుల పరువు, ప్రతిష్టలకు భంగంకలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం కేజ్రీవాల్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. గతంలో కూడా నోటికొచ్చినట్లు మాట్లాడి.. తర్వాత క్షమాపణలు చెప్పిన ఘటనలు కూడా చూశామని గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు పలువురు నేతలపై ఇష్టమోచ్చినట్లు వ్యాఖ్యలు చేసి.. తర్వాత క్షమాపణలు చేప్పి అక్కడి నుంచి పారిపోతారని ఎద్దేవా చేశారు. అయితే ఈ సారిగా ఊరుకునే ప్రసక్తే లేదని.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తానని స్పష్టంచేశారు. భూపిందర్ సింగ్ హనీ నివాసంలో జరిగిన దాడుల్లో రూ.10 కోట్ల నగదు, 21 లక్షలకు పైగా విలువైన బంగారం, రూ. 12 లక్షల విలువైన రోలెక్స్ వాచ్‌ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనను దృష్టిలో పెట్టుకొని తమ పార్టీ నేతలపై ఈడీ దాడులు జరుపుతూ ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరగనుంది. ఫలితాలు మార్చి 10న వెల్లడికానున్నాయి.