చన్నీ, సిద్ధూలు పంజాబ్​ ప్రజలను దోచుకున్నారు: అరవింద్​ కేజ్రీవాల్​ | Arvind kejriwal Fires On Channi And Navjot Singh Sidhu | Sakshi
Sakshi News home page

చన్నీ, సిద్ధూలు పంజాబ్​ ప్రజలను దోచుకున్నారు: అరవింద్​ కేజ్రీవాల్​

Published Thu, Jan 27 2022 9:05 PM | Last Updated on Thu, Jan 27 2022 9:29 PM

Arvind kejriwal Fires On Channi And Navjot Singh Sidhu - Sakshi

చండీగఢ్‌: కాంగ్రెస్​ ప్రభుత్వం పంజాబ్​ ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని ఆప్​ జాతీయ కన్వీనర్​ అరవింద్​ కేజ్రీవాల్​ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాహుల్​ గాంధీ జలంధర్​ పర్యటనపై పలు వ్యాఖ్యలు చేశారు. పంజాబ్​ ప్రజలకు రాహుల్​  మొహం చూపించలేక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పర్యటిస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్​ గత 60 ఏళ్లలో పంజాబ్​ను దోచుకుందని ఎద్దేవా చేశారు. చన్నీ,సిద్దూలు ప్రజలను మోసం చేసిన రాజకీయా ఏనుగులే అన్నారు. ప్రజలను దోచుకున్నారని తెలిపారు. ఒక వ్యక్తి సత్యమార్గంలో నడిచినప్పుడు గిట్టని వారు తిట్టడం సహజమే అన్నారు. కాంగ్రెస్ నేతల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. కాగా, తమ సీఎం అభ్యర్థి బిక్రమ్​ మజిథియా అమృత్​సర్​ ఈస్ట్​ నుంచి ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని తెలిపారు.

చదవండి: చన్నీ వర్సెస్​ సిద్ధూల మధ్య వివాదం.. రాహుల్​ గాంధీ కీలక వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement