aravind Kejriwal
-
న్యూఢిల్లీ నుంచి మాత్రమే పోటీ చేస్తా
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానం నుంచి పోటీ చేస్తానని ఆప్ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఓటమి భయంతో తాను న్యూఢిల్లీతోపాటు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై గురువారం మీడియా సమావేశంలో స్పందించారు. గత ఎన్నికల్లో పోటీ చేసినట్లే వచ్చే ఎన్నికల్లో కూడా న్యూఢిల్లీ సీటు నుంచి మాత్రమే మళ్లీ ఉంటానన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రతిపక్ష ఇండియా కూటమితో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈసారి పోటీ ఆప్, బీజేపీల మధ్యే ప్రధానంగా ఉండనుందన్నారు. కేజ్రీవాల్‌కు ఈ దఫా ఓటమి తప్పదు, అందుకే మరో చోటు నుంచి పోటీ చేస్తారంటూ బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ‘ఎక్స్’లో చేసిన వ్యాఖ్యలకు పైవిధంగా బదులిచ్చారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ బీజేపీ నుంచి, మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేస్తుండటం తెలిసిందే. -
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ–కాంగ్రెస్ పొత్తు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ–కాంగ్రెస్‌లు తమ మధ్య పొత్తు ఉందనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆప్ లక్ష్యంగా ఈ రెండు పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ కేజ్రీవాల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. కొందరు మీడియా వ్యక్తులు మినహా మరెవరూ కాంగ్రెస్‌ను సీరియస్‌గా తీసుకోవడం మానేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలు రెండు తెరవెనుక మైత్రిని సాగిస్తున్నాయని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆరోపించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఆప్‌ల మధ్య హరియాణా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తు పొసగలేదు. అప్పటి నుంచి రెండు పార్టీల నేతలు కత్తులు దూసుకుంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ కేజ్రీవాల్‌ను జాతి వ్యతిరేకి అంటూ విమర్శించడం..ప్రతిగా కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీని ఇండియా కూట మి నుంచి బయటకు పంపించేయాలని ఇతర పార్టీలను కోరుతాననే దాకా వెళ్లింది. శనివారం ఫిరోజ్‌షా మార్గంలోని తన నివాసం ఎదుట పంజాబ్‌కు చెందిన మహిళలు నిరసనకు దిగడంపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘వీరు పంజాబ్ మహిళలు కారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన వారు. పంజాబ్ మహిళలకు ఆప్‌పై నమ్మకముంది. వాళ్లు మమ్మల్ని విశ్వసించారు’అని చెప్పారు. బీజేపీకి ఒక ఎజెండా లేదు. ముఖ్యమంత్రి అభ్యర్థే లేరు. నాపై విమర్శలు చేయడం ద్వారానే బీజేపీ నేతలు ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు’ అని దుయ్యబట్టారు. -
నేను అద్దాల మేడ కట్టుకోలేదు
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘నేను అద్దాల మేడ(శీష్ మహల్) కట్టుకోలేదు. కానీ, పదేళ్లలో నాలుగు కోట్ల మందిపైగా పేదల సొంతింటి కల నెరవేర్చాను. వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చాను’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తన కోసం విలాసవంతమైనæభవనం కాకుండా పేదలకు శాశ్వత నివాసం ఉండాలన్నదే తన స్వప్నం అని వివరించారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ కేజ్రీవాల్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అశోక్ విహార్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం నిర్మించిన 1,675 ఇళ్లను ప్రారంభించారు. లబ్దిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. వారితో ముచ్చటించారు. నౌరోజీ నగర్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్, సరోజినీ నగర్లో జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ (జీపీఆర్ఏ)టైప్–2 క్వార్టర్స్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ద్వారకలో రూ.300 కోట్లతో నిర్మించిన సీబీఎస్ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఢిల్లీ యూనివర్సిటీలో రూ.600 కోట్ల విలువైన మూడు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్)పై నిప్పులు చెరిగారు. అది ఆప్ కాదు, ఆపద అంటూ మండిపడ్డారు. ప్రధానమంత్రి ఏం మాట్లాడారంటే... ఢిల్లీని ఆపదలో పడేశారు ‘‘మోదీ ఎప్పుడూ తన కోసం ఇల్లు నిర్మించుకోలేదన్న విషయం దేశానికి తెలుసు. గడచిన పదేళ్లలో నాలుగు కోట్ల కంటే ఎక్కువగా ఇళ్లు నిర్మించి పేదల కలను సాకారం చేశాం. నేను కూడా శీష్ మహల్(అద్దాల మేడ) నిర్మించుకొనేవాడినే. కానీ, అది నాకు ఇష్టం లేదు. నా దేశ ప్రజలకు పక్కా ఇళ్లు ఉండాలన్నదే నా కల. కొందరు వ్యక్తులు(కేజ్రీవాల్) అబద్ధపు ప్రమాణాలు చేసి ప్రజల సొమ్ముతో అద్దాల మేడలు నిర్మించుకున్నారు. గత పదేళ్లలో ఢిల్లీ పెద్ద ఆపదలో పడిపోయింది. అన్నా హజారేను ముందు పెట్టి పోరాటాలు చేసిన కొందరు కరడుగట్టిన అవినీతిపరులు ఢిల్లీని ఆపదలో పడేశారు. మద్యం, పాఠశాలలు, వైద్య చికిత్స, కాలుష్య నియంత్రణ, ఉద్యోగ నియామకాల్లో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. వీళ్లా ఢిల్లీ అభివృద్ధి గురించి మాట్లాడేది? ముంచుకొచ్చిన ఆపదకు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు యుద్ధం చేయాలి. ఆపద నుంచి విముక్తి పొందాలని ఢిల్లీ ప్రజలు సంకల్పించారు. ఆదపను సహించం.. మార్చి చూపిస్తాం అని ఢిల్లీలోని ప్రతి గల్లీలో ప్రతి ఒక్కరూ అంటున్నారు. యమునా నది శుద్ధి చేస్తే ఓట్లు పడవని అంటున్నారు. ఓట్ల కోసం యమునను వదిలేస్తామా? యమునను శుద్ధి చేయకపోతే ఢిల్లీ ప్రజలకు తాగునీరు ఎలా వస్తుంది? అవినీతిపరుల కారణంగా ప్రజలకు కలుషితమైన నీరు అందుతోంది. ఈ ఆపద తెచ్చిపెట్టిన వ్యక్తులు ఢిల్లీ ప్రజల జీవితాలను వాటర్ ట్యాంకర్ల మాఫియాకు వదిలేశారు. ఈ ఆపద ఇలాగే కొనసాగితే మరిన్ని కష్టాలు తప్పవు. ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకుండా వాళ్లు అడ్డుకుంటున్నారు. ఈ ప«థకం కింద ప్రజలకు ప్రయోజనం అందకపోవడానికి కారణం ఆ వ్యక్తులే. ప్రజల జీవితాల కంటే తమ స్వార్థం, విజయం, అహంకారమే ప్రధానంగా భావిస్తున్నారు. జాతీయ పథకాల ప్రయోజనాలు ఢిల్లీ ప్రజలకు చేరేలా చేయడమే మా లక్ష్యం. ఆపద నుంచి తప్పించుకోవాంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
ఓటర్ జాబితా తారుమారుకు బీజేపీ కుట్ర: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆరోపించారు. ‘‘ఢిల్లీలో ఒక్క అసెంబ్లీ స్థానంలోనే 11 వేల ఓట్లను తొలగించాలంటూ ఈసీకి బీజేపీ దరఖాస్తులు చేసింది. నేను పోటీ చేసే న్యూఢిల్లీ స్థానంలోనూ 12,500 పేర్లను తొలగించాలంటూ దరఖాస్తు చేసింది. మేం ఈసీ దృష్టికి తీసుకెళ్లడం వల్ల పేర్ల తొలగింపు ఆగిపోయింది’’ అని వివరించారు. బీజేపీ ఆటలను సాగనివ్వబోమన్నారు. -
ఓట్లను తొలగిస్తున్నారు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ కుట్రపూరితంగా ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగిస్తోందని అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఆప్ ప్రతినిధి బృందం బుధవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దళితులు, ఎస్పీలు, పూర్వాంచల్‌కు చెందిన బలహీనవర్గాల ఓట్లను బీజేపీ పనిగట్టుకొని తొలగించేలా చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘భారత పౌరులుగా ప్రజలకు ఉన్న ఓటు హక్కును బీజేపీ లాగేసుకుంటోంది. ఓటర్లను తొలగించడానికి బీజేపీ కార్యకర్తలకు దరఖాస్తు ఫారాలను అందించింది. చాలా నియోజకవర్గాల్లో ఇది జరుగుతోంది’ అని కేజ్రీవాల్ అన్నారు. భారత పౌరులుగా ప్రజలకున్న హక్కులను బీజేపీ లాగేస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో చాలా నియోజకవర్గాల్లో ఈ విధంగా ఓట్లను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్ల తొలగింపునకు సంబంధించి ఈసీకి మూడు వేల పేజీల ఆధారాలను సమర్పించామని కేజ్రీవాల్ తెలిపారు. భారీస్థాయిలో ఓట్ల తొలగింపు జరుగుతోందన్నారు. దీన్ని అడ్డుకోవాలని, ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. షాహ్దారా నియోజకవర్గంలో ఒక బీజేపీ నాయకుడు ఏకంగా 11,008 ఓట్లను తొలగించాలని ఈసీకి ఒక జాబితాను సమర్పించారని, ఈసీ రహస్యంగా వీటిని తొలగించే పనిలో ఉందని ఆరోపించారు. పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు ఉండదని ఈసీ తమకు హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఇప్పటివరకు తొలగించిన ఓట్లపై దృష్టి పెడతామని, బూత్‌స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని తెలిపిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
కేజ్రీవాల్ చేతిలో మొహల్లా బస్సుల బ్రహ్మాస్త్రం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఈ విషయంలో అధికారంలో ఉన్న ఆప్ మరోమారు అధికారం సొంతం చేసుకునేందుకు తన దగ్గరున్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. వాటిలో ఒకటే ‘మొహల్లా’.. మొహల్లా క్లీనిక్‌ల తరువాత మొహల్లా బస్సులను రాబోయే ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ భావిస్తున్నారు.మొహల్లా క్లినిక్‌లకు అమితమైన ఆదరణకేజ్రీవాల్ సారధ్యంలో ఢిల్లీలో ఏర్పాటైన 300కు పైగా మొహల్లా క్లినిక్‌లు అమితమైన ప్రజాదరణ పొందాయి. 1.6 కోట్ల మంది మొహల్లా క్లీనిక్‌ల ద్వారా ఉచితంగా ఆరోగ్య సేవలను అందుకున్నారు. ఇప్పుడు త్వరలోనే ఢిల్లీ రోడ్లపైకి ఎక్కనున్న మొహల్లా బస్సులు రవాణా రంగంలో మరో విప్లవానికి నాంది పలకబోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మొహల్లా బస్సులు బ్రహ్మాస్త్రంగా మారనున్నాయనే మాట కూడా వినిపిస్తోందిమహిళల భద్రతే ధ్యేయంగా..మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని మొహల్లా బస్సులను విరివిగా అందుబాటులోకి తీసుకురావాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. శాంతిభద్రతల అంశాన్ని ఎన్నికల్లో ఆయుధంగా మలచుకునే ఉద్దేశంలోనే అరవింద్ కేజ్రీవాల్ మొహల్లా బస్సులను తీసుకువస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఢిల్లీలో ప్రతిరోజు మూడు అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఢిల్లీ ఎంత అభద్రతలో ఉందో తెలియజేస్తుంది. కార్యాలయాల్లో పనిచేసే మహిళలు సురక్షితంగా ఇంటికి చేరుకుంటామో లేదో అనే అభద్రతా భావంతో ఉంటున్నారు. ఈ నేపధ్యంలో వారి కోసం మొహల్లా బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం ఎప్పటి నుంచో యోచిస్తోంది. గల్లీల్లోనూ సులభంగా తిరిగేలా..మొహల్లా బస్సులు 9 మీటర్ల పొడవు కలిగివుంటాయి. ఇవి చిన్నపాటి గల్లీల్లోనూ సులభంగా కదిలే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కేజ్రీవాల్-అతిషి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా మొహల్లా బస్సుల కోసం ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నేపధ్యంలో మరో రెండు వారాల్లో ఢిల్లీ రోడ్లపై మొహల్లా బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ఈ బస్సులో 23 సీట్లు ఉండనున్నాయి. అలాగే 13 మంది నిలుచునేందుకు అవకాశం ఉంటుంది. మొత్తంగా 36 మంది ప్రయాణికులు ఈ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఈ బస్సుల్లో ఆరు సీట్లు మహిళలకు కేటాయించారు.రాత్రి 10 గంటల వరకూ అందుబాటులో..తొలిదశలో 140 మొహల్లా బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు.. మొత్తం 16 గంటల్లో 12 ట్రిప్పులు తిరుగుతాయి. ఈ విధంగా ఒక్కరోజులో లక్షా 20 వేల 960 మంది ప్రయాణికులు ఒక రోజులో ప్రయాణించవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మొహల్లా బస్సులు ప్రారంభం కావడం విశేషం. మొహల్లా బస్సుల వినియోగం ఢిల్లీ రవాణా రంగంలో ఒక మైలురాయిగా మారనుందనే మాట వినిపిస్తోంది. మొహల్లా బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు. ఫలితంగా వీటి నుంచి కాలుష్యం ఏర్పడదు. ఇది కూడా చదవండి: మరోమారు తెరపైకి అమృత్సర్.. -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: వారికే ‘ఆప్’ టిక్కెట్లు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశంలోని మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో నేడు (బుధవారం) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇదే తరుణంలో ఢిల్లీలోనూ అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలయ్యింది. 2025 ఫిబ్రవరిలో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, బీజేపీతో సహా వివిధ పార్టీలు ఇప్పటికే తమ సన్నాహాలు మొదలుపెట్టాయి.తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీలోని నేతల పనితీరు, విజయావకాశాలను పరిగణలోకి తీసుకుని వారికి టిక్కెట్లు కేటాయించనున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. బంధువులు, పరిచయస్తులు, స్నేహితులు అనే భావనతో ఎవరికీ టిక్కెట్లు కేటాయించేది లేదని ఆయన స్పష్టం చేశారు.అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని కేజ్రీవాల్ ఈ సమావేశంలో పేర్కొన్నారు. తమ పార్టీ సత్య మార్గాన్ని అనుసరించిందని, పార్టీకి దేవునితో పాటు ప్రజల ఆశీస్సులు ఉన్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: UP By Election 2024: సెమీ ఫైనల్లో యూపీ ఓటర్లు ఎటువైపు? -
కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర: ఆప్
న్యూఢిల్లీ: తమ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపించింది. జరగరానిదేదైనా ఆయనకు జరిగితే బీజేపీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురిలో ప్రచార పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్‌పై శుక్రవారం బీజేపీ గూండాలు దాడికి దిగారని పేర్కొంది. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ శనివారం మీడియాతో మాట్లాడారు. ‘దాడి ఘటనపై పోలీసుల వైఖరిని బట్టి చూస్తే దీని వెనుక కేజ్రీవాల్‌ను చంపేందుకు పెద్ద కుట్రే ఉందని స్పష్టమవుతోంది. ఆయనకు బీజేపీ శత్రువుగా మారింది’అని పేర్కొన్నారు. ఆయనకు హాని తలపెట్టాలనుకుంటే ప్రజలు ఊరుకోరన్నారు. ఇటువంటి వాటికి కేజ్రీవాల్ వెనుకడుగు వేయర న్నారు. వికాస్పురిలో ముందుగా ప్రకటించిన విధంగానే కేజ్రీవాల్ పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌పై మొదటిగా దాడి చేసింది బీజేపీ ఢిల్లీ యువ మోర్చా ఉపాధ్యక్షుడు కాగా, రెండో వ్యక్తి ఢిల్లీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి అని ఆప్కే చెందిన ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దాడి అనంతరం వీరిద్దరూ అక్కడ డ్యాన్స్ చేశారన్నారు. ఘటనపై చట్ట పరంగా ముందుకెళ్లే విషయమై నిపుణుల సలహాలను తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. అటువంటిదేమీ జరగలేదంది. -
నేను ఎందుకు అరెస్ట్ అయ్యానో మీకు తెలుసా?: కేజ్రీవాల్
ఢిల్లీ : మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. మేం అందిస్తున్న ప్రజా సంక్షేమాన్ని అడ్డుకునేందుకే తనని అరెస్ట్ చేయించిందని మండిపడ్డారు.వచ్చేడాది ప్రారంభంలో ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 'జన్ సంపర్క్' పేరిట కేజ్రీవాల్ తన ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో తమ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పన్నిన రాజకీయ కుట్రలో భాగంగా తన అరెస్ట్ జరిగిందన్నారు. పనిలో పనిగా తన అరెస్ట్,ఐదునెలల జైలు జీవితంపై గురించి ప్రజల్లోకి వెళ్లేలా ఓ లేఖను సిద్ధం చేసినట్లు చెప్పారు. ‘నేను ఒక లేఖను సిద్ధం చేశాను. మా కార్యకర్తలు ఆ లేఖతో ఢిల్లీలో ప్రతి ఇంటికీ వెళతారు. నన్ను ఎందుకు అరెస్టు చేశారనేది ఈ లేఖ చెబుతుంది. కొందరు చెప్పినట్లు అవినీతి వల్ల కాదు, ఢిల్లీ ప్రజల కోసం మేము చేస్తున్న పనిని ఆపడానికి’ బీజేపీ చేసిన ప్రయత్నమేనని అన్నారు.ఆప్ కార్యకర్తలు ఈ లేఖతో ఢిల్లీ అంతటా ఇంటింటా ప్రచారం చేస్తారు. తన ఐదు నెలల జైలు జీవితం వెనుక అసలైన కారణాల్ని వివరించి వారికి లేఖను అందిస్తాం. మరోసారి ఆప్ కొనసాగేలా ఓటర్లను కోరనున్నట్లు తెలిపారు. ఈ ప్రచారం అక్టోబర్ 29 వరకు కొనసాగుతుందని చెప్పారు. ఢిల్లీలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ని విజయపథంలో నడిపించిన తాను ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని పునరుద్ఘాటించారు. ‘కేజ్రీవాల్ అవినీతి చేయలేరని అందరికీ తెలుసు. ఢిల్లీవాసుల కోసం ఉచిత విద్యుత్, ఉచిత నీరు, మొహల్లా క్లినిక్‌లు, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలల కోసం మేం చేస్తున్న అభివృద్ధిని ఆపాలని కోరుకున్నారు కాబట్టే అరెస్ట్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే, వారు చేసే మొదటి పని ఏంటో తెలుసా? మీకు అందించే ఉచిత విద్యుత్తును నిలిపివేయడం. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను నాశనం చేయడం, దీర్ఘకాలిక కరెంట్ కోతలతో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు’ అంటూ ఢిల్లీ ప్రజలను ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ ప్రసంగం చేశారు. -
అమెరికాలోనూ ఉచిత తాయిలాలు..!
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఉచితాలు అమెరికా వరకూ వెళ్లాయి’అంటూ ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే విద్యుత్తు చార్జీలను సగానికి తగ్గిస్తానంటూ అక్కడి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీని శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో ప్రస్తావించారు. ట్రంప్ ట్వీట్‌ను ఆయన రీ ట్వీట్ చేస్తూ.. ‘విద్యుత్తు బిల్లులు సగానికి తగ్గిస్తానంటూ ట్రంప్ ప్రకటించారు. ఉచిత తాయిలాలు అమెరికా వరకూ వెళ్లాయి’అంటూ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. విద్యుత్, వైద్యం, విద్య ఉచితమంటూ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ పక్షాలు కేజ్రీవాల్‌పై మండిపడుతుండటం తెలిసిందే. కాగా, అధ్యక్షుడిగా ఎన్నికైతే 12 నెలల్లో కరెంట్ బిల్లులతో పాటు ఇంధన బిల్లులను 50 శాతానికి తగ్గిస్తానని, దీనివల్ల అమెరికాలో వ్యాపారావకాశాలు పెరుగుతాయని ట్రంప్ ట్వీట్ చేశారు. విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు పర్యావరణ అనుమతులను వేగవంతం చేస్తానని కూడా ట్రంప్ ప్రకటించారు. -
ఢిల్లీ సీఎం ఆతిశి
సాక్షి, న్యూఢిల్లీ: సస్పెన్స్ వీడింది. ఢిల్లీ సీఎం పీఠం ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు ఆతిశీ మార్లీనాకు దక్కింది. పార్టీ శాసనసభాపక్షం మంగళవారం ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. అనంతరం కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆయన రాజీనామా లేఖ అందజేయడం, ఆ వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఎల్జేకు ఆతిశి లేఖ సమరి్పంచడం వెంటవెంటనే జరిగిపోయాయి. వారంలోగా ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం 26, 27 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో లాంఛనంగా మెజారిటీ నిరూపించుకుంటారు. కేజ్రీవాల్ కేబినెట్లో ఆరి్ధకం, విద్య, సాగు నీరు సహా 14 శాఖల బాధ్యతలను మోస్తూ వచి్చన ఆతిశి త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల దాకా సీఎంగా ప్రభుత్వాన్ని నడపనున్నారు. ఢిల్లీకి ఆమె మూడో మహిళా సీఎం. గతంలో బీజేపీ దిగ్గజం సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ సీఎంలుగా చేశారు. మమతా బెనర్జీ (పశి్చమ బెంగాల్) తర్వాత ప్రస్తుతం దేశంలో రెండో మహిళా సీఎం కూడా ఆతిశే కానున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఐదు నెలల పై చిలుకు కారాగారవాసం నుంచి కేజ్రీవాల్ వారం క్రితం బెయిల్‌పై బయటికి రావడం, సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ ఆదివారం సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. దాంతో తదుపరి సీఎంగా ఆతిశితో పాటు కేజ్రీవాల్ భార్య సునీత తదితర పేర్లు రెండు రోజులుగా తెరపైకొచ్చాయి. మంగళవారం ఆప్ ఎల్పీ భేటీలో కేజ్రీవాల్ సూచన మేరకు ఆతిశి పేరును పార్టీ సీనియర్ నేత దిలీప్ పాండే ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలంతా నిలబడి ఆమోదం తెలిపారు. 2013లో ఆప్ ఆవిర్భావం నుంచి పారీ్టలో ఆతిశి క్రియాశీలంగా ఉన్నారు. 2015 నుంచి కేజ్రీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2018 దాకా నాటి ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చూసిన విద్యా శాఖకు సలహాదారుగా ఉన్నారు. 2020లో కాల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి గెలుపొందారు. మద్యం కుంభకోణంలో మంత్రి పదవులకు సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా తర్వాత ఆమె మంత్రి అయ్యారు. కీలకమైన ఆర్ధిక, విద్య, తాగునీరు సహా 14 శాఖలు చూస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అటు పారీ్టని, ఇటు ప్రభుత్వాన్ని సర్వం తానై నడిపించారు. కేజ్రీవాల్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే మా ఏకైక లక్ష్యం: అతిశిఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యాక ఆతిశి మీడియాతో మాట్లాడారు. తన గురువు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తున్నందుకు ఎంతో బాధగా ఉంది. నన్ను నమ్మి ఇంతటి బాధ్యత కట్టబెట్టారు. ఎమ్మెల్యేను చేశారు. మంత్రిని చేశారు. ఇప్పుడిలా సీఎంనూ చేశారు. ఇది ఆప్‌లో మాత్రమే సాధ్యం. సామాన్య కుటుంబం నుంచి వచి్చన నా వంటివారికి మరో పారీ్టలో అయితే కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కదు. ఢిల్లీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో సాగుతా. ఆయన్ను తిరిగి సీఎం చేయడమే లక్ష్యంగా పని చేస్తాం’’ అన్నారు. నిజాయితీపరుడైన కేజ్రీవాల్‌పై తప్పుడు అభియోగాలు మోపారన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించి ఆయన్ను మళ్లీ సీఎం చేయాలని ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ ప్రకారం అవి వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. మహారాష్ట్రతో పాటే నవంబర్లోనే జరపాలని కేజ్రీవాల్ డిమాండ్ చేయడం తెలిసిందే. ఆ అవకాశం లేదని ఈసీ వర్గాలంటున్నాయి.మారింది ముఖమే: బీజేపీ సీఎంగా ఆతిశి ఎంపికపై బీజేపీ పెదవి విరిచింది. కేవలం ముఖాన్ని మార్చినంత మాత్రాన పార్టీ స్వభావం మారబోదని పార్టీ ఢిల్లీ విభాగం చీఫ్ వీరేందర్ సచ్దేవ అన్నారు. ఈ రాజకీయ జూదంతో కేజ్రీవాల్‌కు లాభించేదేమీ ఉండబోదని ఆయన జోస్యం చెప్పారు. -
కేంద్రానికి చెంపపెట్టు
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ విడుదలను సీబీఐకి, అమిత్ షాకు, కేంద్రానికి చెంపపెట్టుగా ఆప్ అభివరి్ణంచింది. ‘‘సీబీఐ పంజరంలో చిలుకేనని సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు మరోసారి రుజువు చేశాయి. అవి నేరుగా కేంద్రంపై చేసిన వ్యాఖ్యలు. కనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి’’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా ఏ సాక్ష్యాన్నీ సంపాదించలేకపోయాయని ఢిల్లీ మంత్రి ఆతిషి ఎద్దేవా చేశారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తారని ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ సుశీల్ గుప్తా అన్నారు. కేజ్రీవాల్ విడుదలను ప్రజాస్వామ్య విజయంగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అభివరి్ణంచారు. ఆప్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ‘‘కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మాత్రమే వచి్చందని మర్చిపోవద్దు. మద్యం కేసులో ప్రధాన నిందితుడైన ఆయన తక్షణం రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేసింది. లేదంటే ఢిల్లీ ప్రజలే ఆయన రాజీనామాకు పట్టుబట్టే రోజు ఎంతో దూరం లేదంది. -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్
-
హర్యానా: ఆప్ మరో జాబితా.. వినేశ్‌పై కవితా దళాల్ పోటీ
చంఢీఘడ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా మరో అభ్యర్థులు జాబితా విడుదల చేసింది. 21 మందితో నాలుగో జాబితా బుధవారం విడుదల చేసింది. కీలకమైన జులానా అసెంబ్లీ స్థానం నుంచి స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై కవితా దళాల్‌ను ఆప్ బరిలోకి దింపింది. ఇక.. ఇప్పటికే 20 మందితో తొలి జాబితాను ఆప్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజా జాబితాతో కలిపి ఇప్పటివరకు ఆప్ మొత్తం ఆప్ 61 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. హర్యానాలో ఉన్న 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబరు 5న పోలింగ్ జరగనుంది. 8న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడికానున్నాయి.కవితా దళాల్ కూడా ప్రొఫెషనల్ రెజ్లర్, గతంలో ఈమె WWE లాంటి ప్రపంచ ప్రఖ్యాత ప్రొఫెషనల్ పోటీల్లో పాల్గొన్నారు. 2021లో కవితా దళాల్ WWE నుంచి వైదొలిగినట్లు ప్రకటించారు. Aam Aadmi Party (AAP) released the fourth list of 21 candidates for Haryana Assembly electionsSo far, AAP has announced the names of 61 candidates pic.twitter.com/9YmkzmLMKe— ANI (@ANI) September 11, 2024చదవండి: హర్యానా బీజేపీ రెండో జాబితా: వినేశ్‌పై పోటీ ఎవరంటే.. -
హర్యానా ఎన్నికలు.. ఆప్ తొలి జాబితా
చంఢిఘడ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ షాక్ ఇచ్చింది. ఓవైపు.. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో 20 మంది అభ్యర్థులతో ఆప్ తొలి జాబితా విడుదల చేసింది. కలయత్ నుంచి అనురాగ్ ధండా, మెహమ్ నుంచి వికాస్ నెహ్రా, రోహ్ తక్ నుంచి బిజేందర్ హుడాను ఆప్ బరిలోకి దించించింది. కాంగ్రెస్‌తో చర్చలవేళ ఆప్ తీసుకున్న ఈ నిర్ణయం తాజాగా చర్చనీయాంశంగా మారింది. 📢Announcement 📢 The Party hereby announces the following candidates for the state elections for Haryana Assembly.Congratulations to all 💐 pic.twitter.com/Ulca3eVppu— AAP (@AamAadmiParty) September 9, 2024పొత్తుపై కాంగ్రెస్, ఆప్ నేతలు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా సీట్ల పంపకాలపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆప్ చీఫ్ సుశీల్ గుప్తా సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.నేటి సాయంత్రంలోగా కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాకుంటే మొత్తం 90 స్ధానాల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తుపై తమకు పార్టీ అధిష్టానం నుంచి తమకు ఇప్పటివరకూ ఎలాంటి సందేశం రాలేదన్న ఆయన.. సోమవారం 90 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు హర్యానా ఆప్ యూనిట్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.చదవండి: 90 స్థానాల్లో పోటీ చేస్తాం.. కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం! -
స్వాతి మలివాల్‌పై దాడి కేసు: బిభవ్ కుమార్‌కు బెయిల్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్) ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎంపీపై దాడి కేసులో బెయిల్, అరెస్ట్‌ను సవాల్ చేస్తూ బిభవ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితుడు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీలో 100 రోజులు ఉన్నారని, ఛార్జ్‌షీట్ నమోదైనట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ‘స్వాతి మలివాల్‌కు గాయాలు అయ్యాయి. కానీ ఈ కేసులో బెయిల్ ఇవ్వడాన్ని అడ్డుకోలేం. బెయిల్ నిరాకరిస్తూ జైలులోనే ఉంచేలా చేయలేం’ అని న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. ఢిల్లీ పోలీసుల తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఈ కేసులో కొందరు ముఖ్యమైన సాక్షులపై నిందితుడు బిభవ్ కుమార్ ప్రభావం ఉంది. వారిని విచారించడానికి అనుమతి ఇవ్వండి. అప్పుడు తాము బెయిల్‌ను వ్యతిరేకించమని కోర్టుకు తెలిపారు. అలా అయితే.. సొలిసిటర్ జనరల్ చెప్పిన విధంగా తాము ఎవరికీ బెయిల్ మంజూరు చేయలేమని జస్టిస్ భుయాన్ అన్నారు. బెయిల్ మంజూరు చేయకుండా ఉంచటం ఆందోళన కలిగించే విషయమని సుప్రీకోర్టు పేర్కొంది. ఈ దాడి కేసులో సాక్షులందరినీ విచారించే వరకు నిందితుడు బిభవ్ కుమార్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోకి ప్రవేశించవద్దని సుప్రీం కోర్టు షరుతు విధించింది.మే 13న స్వాతి మలివాల్‌పై బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. స్వాతి మలివాల్ ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్‌పై పోలీసులు మే 18న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
ఢిల్లీ పంద్రాగస్టు పంచాయతీ.. జెండా ఎగరేసేది ఆయనే
ఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) రోజున ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగరవేస్తారనే అనిశ్చితికి తెరపడింది. తాజాగా జెండా ఆవిష్కరణకు ఢిల్లీ హోంమంత్రి కైలాశ్ గహ్లోత్ పేరును గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్.. హోమ్ మంత్రి కైలాశ్ గహ్లోత్‌ను నామినేట్ చేయడం సంతోషంగా ఉంది. దానికోసం అవసరమైన ఏర్పాట్లు చేయండి’’ అని ఎల్జీ కార్యదర్శి ఆశిష్ కుంద్రా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్‌కు లేఖలో పేర్కొన్నారు. అంతకు ముందు.. జాతీయ జెండాను ఎగరవేసే అవకాశం మంత్రి అతిశీకి ఇవ్వాలనే సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తిపై పరిపాలన శాఖ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయజెండా ఎగరవేసే అధికారాన్ని ఢిల్లీ మంత్రి అతిశీకి ఇవ్వలేం. ఈ వేడుక నిర్వహించేందుకు నిర్దేశిత విధానం ఉంటుంది. ఆ నిబంధనలు పాటించకుండా అతిశీకి జెండా ఎగరవేసే బాధ్యత అప్పగిస్తే కార్యక్రమం పవిత్రత దెబ్బతింటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొంది.కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఆయనకు స్వాతంత్రవ దినోత్సవం రోజు జాతీయ జెండాను మంత్రి అతిశీ ఎగురవేస్తారని ఎల్జీకి లేఖ రాశారు. ఈ విషయం ప్రస్తుతం ఎల్జీ వర్సెస్ ఆప్‌గా మారింది. తాజాగా రాజ్‌భవన్ విడుదల చేసిన ప్రకటనపై మంత్రి అతిశీ స్పందించలేదు. -
‘మంత్రి అతిషి జెండా ఎగరవేయలేరు’
ఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) రోజున ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగరవేస్తారనే అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైలులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ తరఫున మంత్రి అతిశీ జాతీయ జెండాను ఎగరవేయడానికి అనుమతి లేదని తెలిపింది. ఇక.. సోమవారం సాధారణ పరిపాలన శాఖ మంత్రి గోపాల్ రాయ్ కేజ్రీవాల్ కోరిక మేరకు రాష్ట్ర మంత్రి అతిశీ జెండా ఎగరవేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే తాజాగా జీఏడీ అదనపు ముఖ్యకార్యదర్శి నవీన్ కుమార్ చౌదరీ స్పందిస్తూ.. జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ ఆదేశాలు చట్టపరంగా చెల్లుబాటు కాదని అన్నారు. ఆ ఆదేశాలము తాము పాటించలేమని స్పష్టం చేశారు. ఈ విషయంపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. జైలు నిబంధనల ప్రకారం ఇలా చేయటం అనుతించబడదని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఛత్రసల్ స్టేడియం వేదికగా సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. సీఎం జ్యుడీషియల్ కస్టడీలో ఉండటంతో జెండా ఎగరవేసే విషయంపై అత్యున్నత అధికారులకు తెలియజేశామని తెలిపారు. వారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. -
ఢిల్లీ లిక్కర్ కేసు: కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. సీబీఐ కస్టడీ నేటితో ముగియటంతో తీహార్ జైలు అధికారులు ఆయన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు కేజ్రీవాల్ సీబీఐ జ్యుడీషియల్ కస్టడీని మరోసారి ఆగస్ట్ 20వరకు పొడిగించింది. ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేయడాన్ని కేజ్రీవాల్ సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. లిక్కర్ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ సరైన కారణాలు లేకుండా అరెస్ట్ చేసిందని చెప్పలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.చదవండి: కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్ట్ చేస్తారా?.. ఈడీని ప్రశ్నించిన కోర్టు -
సుప్రీం కోర్టులో ఆప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
ఢిల్లీ: సుప్రీం కోర్టులో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు(ఎల్జీ) ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం ఎల్జీకి నామినేట్ చేసే అధికారం వచ్చిందని తెలిపింది. ఎంసీడీలో 10 మంది కౌన్సిలర్లను మంత్రి మండలి సలహా మేరకు నామినేట్ చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ప్రభుత్వ సలహాను పాటించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇది చట్టబద్ధమైన అధికారమని, కార్యనిర్వాహక అధికారం కాదని స్పష్టం చేసింది. కార్పొరేషన్ సభ్యుల నామినేషన్‌కు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సలహా తీసుకోవాల్సిన అవసరం ఎల్జీకి లేదని పేర్కొంది.2022 డిసెంబర్లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ గెలుపొందింది. కాగా, మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్(126)ను దాటి ఆప్ 134 స్థానానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన 10 మంది నామినేటెడ్ కౌన్సిలర్స్ చేత ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ఎల్జీకి కౌన్సిర్లను నియమించే అధికారం లేదని ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అనంతరం ఈ వ్యవహారంపై ఆప్ సుప్రీం కోర్టును అశ్రయించింది. -
ఢిల్లీ లిక్కర్ కేసు: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు నేడే
ఢిల్లీ:ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు రిజర్వులో పెట్టిన తీర్పును ఇవాళ(సోమవారం) ఇవ్వంది. లిక్కర్ ఈడీ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో కేజ్రీవాల్ ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు. గతవారం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై వాదానులు ముగియడంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. ‘‘ఎక్సైజ్ కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్. ఆయన్ను విడుదల చేస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారు. ఆయన అరెస్టయితేనే ఈ కేసు విచారణ ముగింపునకు వస్తుంది. నెలలోగా చార్జిషిటు వేస్తాం’అని సీబీఐ లాయర్ డీపీ సింగ్ తెలిపారు. కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు రాకుండా చేసేందుకే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని ఆయన తరఫు సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఊహాకల్పనలతోనే కేజ్రీవాల్‌కు అరెస్ట్ చేశారే తప్ప, ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా ఎటువంటి ఆధారాలు లేవన్నారు. వాదనలు విన్న అనంతరం జస్టిస్ నీనా బన్సన్ కృష్ణ తీర్పును రిజర్వులో ఉంచుతూ ఆదేశాలిచ్చారు. -
స్వాతి మలివాల్‌పై దాడి కేసు: బిభవ్ కుమార్‌పై సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ: రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాఖలుచేసిన పటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బీభవ్ కుమార్‌పైనే సుప్రీం కోర్టు ధర్మాసనం మండిపడింది. ఈ ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని, నివాసంలోకి ప్రవేశించిన ఓ గూండా స్వాతి మలివాల్‌పై దాడి చేసినట్లు అనిపించిందని కోర్టు పేర్కొంది. ఈ కేసులో బిభవ్ కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఢిల్లీలోని మెజిస్టీరియల్ కోర్టు కొట్టివేసింది. అయితే మెజిస్టీరియల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. బిభవ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలుచేసిన బెయిల్ పిటిషన్‌పై న్యాయమూర్తులు సూర్యకాంత్, దీపాంకర్ దత్తా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది.‘ముఖ్యమంత్రి బంగ్లా ఏమైనా వ్యక్తిగత నివాసమా? సీఎం కార్యాలయం అటువంటి గూండాలను ఉంచుకోవటం అవసరమా? ఇది సరైనా పద్దతేనా? మేము చాలా ఆశ్చర్యపోయాం. అసలు ఇది ఎలా జరిగింది’అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘బిభవ్ కుమార్ అసలు ఏమనుకుంటున్నాడు? అతని ఏం అధికారం ఉంది? ఒక గూండాలా అతన్ని తయారు చేశారు. ఓ యువతి అయిన స్వాతి మలివాల్‌పై దాడి చేయడానికి బిభవ్ కుమార్‌కు సిగ్గు ఉండాలి?’ కోర్డు అసహనం వ్యక్తం చేసింది. స్వాతి మలివాల్ తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పినా ఆమెపై దాడి చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కేసు పరిశీలన కోసం ఛార్జిషీట్‌ను తమ ముందు ఉంచాలని చెప్పి సుప్రీంకోర్టు విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసింది. సీఎం కేజ్రీవాల్ నివాసంలో బిభవ్‌కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మలివాల్ మే 13న ఆరోపణలు చేశారు. మే 16 ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా బిభవ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. -
లిక్కర్ కేసు: కేజ్రీవాల్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాత్రపై రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో సెంట్రల్ బ్యూరో ఇన్వేస్టిగేషన్ (సీబీఐ) చార్జ్‌షీట్ దాఖలు చేసింది. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వటాన్ని సీబీఐ వ్యతిరేకిస్తోంది. ఇవాళ సీబీఐ కేసులో హైకోర్టు విచారణ జరపనుంది. జస్టిస్ నీనా బన్సల్ కృష్ విచారణ చేపట్టనున్నారు.ఈ కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. జూన్ 26న సీబీఐ అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆగస్టు 8 వరకు కేజ్రీవాల్‌ను సీబీఐ కస్టడీకీ అప్పగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టు అనుమతితో అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక.. ఈ కేసులో ప్రధాన కుట్రదారుల్లో కేజ్రీవాల్ ఒకరని సీబీఐ అభియోగాలు మోపింది. కేజ్రీవాల్ సన్నిహితుడు విజయ్ నాయర్ అనేక మంది మద్యం ఉత్పత్తిదారులు, వ్యాపారులతో టచ్‌లో ఉన్నారని ఆరోపణలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. అయితే ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా.. అనంతరం ఇదే కేసులో సీబీఐ అరెస్ట్ చేయటంతో తిహార్ జైలులోనే ఉన్నారు. -
ఢిల్లీ లిక్కర్ కేసు: మరోసారి కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పొడిగించింది. కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ నేటితో ముగియగా.. తిహార్ జైలులో ఉన్న ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. విచారణ జరిపిన కోర్టు కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ పొడిగించింది. ఆగస్టు 8 వరకు కేజ్రీవాల్‌ను సీబీఐ కస్టడీకీ అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున ఆయన కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించాలని అధికారులు కోర్టును కోరారు. దీంతో కోర్టు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు వారాలు పొడిగించింది. అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కేజ్రీవాల్ మే 10న మధ్యంత బెయిల్ పొందారు. బెయిల్ గడువు ముగిసిన అనంతరం జూన్ 2ను ఆయన మళ్లీ తిహార్ జైలుకు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను జూన్ 26న సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఎల్జీ ఆరోపణలు.. ఖండించిన ఆప్
ఢిల్లీ: లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి రాజకీయ మలుపు తీసుకుంది. సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఢిల్లీ లెఫ్ట్నెట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా, ఆప్ పార్టీ నేతల మధ్య విమర్శలు తీవ్రం అయ్యాయి.సీఎం కేజ్రీవాల్ ఉద్దేశ పూర్వకంగానే బరువు తగ్గుతున్నారని, అందుకు తగ్గట్టుగా తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకుంటున్నారని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా తాజాగా ఆరోపించడంతో వివాదం ముదిరింది. తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటున్నారని ఎల్జీ ఆరోపణలు మాత్రమే చేయలేదు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ఛీఫ్ సెక్రటరీకి ఒక లేఖ కూడా రాశారు. ‘సీఎం అరవింద్ కేజ్రీవాల్ మెడికల్ రిపోర్టుల్లో గ్లూకోమీటర్, సీజీఎంఎస్ ( రక్తంలో చక్కెర మోతాదులు నిరంతరం గుర్తించి నమోదు చేసే పరికరం. కంటిన్యుయస్ గ్లూకోజ్ మానిటరింగ్) వివరాల్లో తేడాలు ఉన్నాయి. జూన్ 2న తిహార్ జైలుకు వెళ్లినప్పటి నుంచి సీఎం కేజ్రీవాల్ కేజీల బరువు తగ్గారు. ఉద్దేశపూర్వకంగా తక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటున్నారు. జూన్ 2 కంటే ముందు ఆయన 63. 5 కేజీల బరువు ఉండగా... ఇప్పుడు రెండు కేజీలు తగ్గి 61.5 కిలోలకు చేరింది.’ అని ఎల్జీ లేఖలో ఆరోపణలు చేశారు. ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన బరువు, బ్లడ్ షుగర్ తగ్గుతోందని ఇటీవలే ఆప్ మంత్రి అతిశీ ఆందోళన వ్యక్తం చేసిన విషయం ఇక్కడ చెప్పుకోల్సిన అంశం. అయితే...ఎల్జీ వీకే సక్సెనా చేసిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్రస్థాయిలో మండిపడింది. ఎల్జీ ఆరోపణలను ఖండించింది. ‘ఎల్జీ సార్.. మీరు ఎలాంటి జోక్ వేస్తున్నారు?. ఎవరైనా రాత్రికి రాత్రి తమ షుగర్ వెవల్స్ తగ్గించుకుంటారా? ఇది చాలా ప్రమాదకరం. మీకు ( ఎల్జీ) ఈ వ్యాధి గురించి ఏమి తెలియదు. మీలాంటి వారు ఇలాంటి లేటర్ రాయటం సరికాదు. ఇటువంటి పరిస్థితి మీకు రావొద్దని దేవుడ్ని కోరుకుంటున్నా’ అని ఎల్జీపై విమర్శలు చేశారు. ‘ఎల్జీ సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తారన్న విషయం నాకు తెలుసు. కానీ, ఆయన డయాబెటిస్‌లో స్పెషలైజ్ ఎప్పుడు అయ్యాడో నాకు తెలియదు’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఎల్జీపై సెటైర్లు వేశారు.