ఢిలీ: తనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్ దాడి చేశారని గత నెలలో ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ కేసులో బిభవ్ కుమార్‌పై కేసు నమోదు కాగా.. పోలీసులు మే 18 అరెస్ట్ చేశారు. అయితే తాజాగా బిభవ్‌కుమార్ నమోదైన కేసులో 201 సెక్షన్‌ను చేర్చారు. 201 సెక్షన్ అంటే.. ఆధారాలు మాయం చేసి.. తప్పుడు సమాచారం ఇవ్వటం. బిభవ్ కుమార్ ఈ కేసుకు సంబంధించి ఆధారాలు మాయం చేసి.. తప్పుడు సమాచారం అందించిస్తున్నట్లు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బిభవ్ కుమార్‌ను దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆయన తన ఫోన్‌ను ఫార్మాట్ చేసినట్లు గుర్తించారు. ఆయన ముంబైలో ఫోన్ ఫార్మాట్ చేసినట్లు అనుమానం రావటంతో ఇప్పటికే పోలీసులు రెండుసార్లు ముంబైకి తీసుకువెళ్లి దర్యాప్తు చేశారు. ముంబైలో ఏ ప్రాంతంలో ఫార్మాట్ చేశారు?. ఫోన్‌లోని డేటాను ఎవరికి షేర్ చేశారు? అన్న విషయాలు మాత్రం బిభవ్ వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. ఇక.. కస్టడీలో ఉన్న ఆయన దర్యాప్తు సమయంలో అస్సలు సహకరించలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు.
సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నుంచి మూడు సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బిభవ్ సీసీటీవీ కెమెరాలను ట్యాంపర్ చేశారని పోలీసుల అనుమానం వ్యకం చేశారు. దీంతో డీవీఆర్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వీటికి సంబంధించిన రిపోర్టులు ఇంకా వెల్లడికాలేదని తెలిపారు. మే 18 అరెస్ట్ అయిన బిభవ్ కుమార్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు.
మే 13న ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లితే.. అక్కడ కేజ్రీవాల్ సహాయకుడు తనపై దారుణంగా దాడి చేశారని బయటపెట్టారు. అయితే వాటిని ఆప్.. బీజేపీ కుట్రలో భాగంగానే స్వాతి మలివాల్ బిభవ్‌పై దాడి ఆరోపణలను చేస్తోందని విమర్శలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment