swati maliwal
-
‘మఫ్లర్ మేన్’ మాటపై నిలబడతారా?
చెప్పులో రాయి, చెవిలో జోరిగ, కంటిలోని నలుసు, కాలిలోని ముల్లు, ఇంటిలోని తగువు.. సామెత మనకందరికీ తెలిసిందే. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పరిస్ధితి ప్రస్తుతం ఇలాగే ఉంది. హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడి.. అధికారాన్ని కోల్పోయిన ‘మఫ్లర్ మేన్’కు సొంత పార్టీలోనే సెగ తగులుతోంది. ఒకప్పుడు అండగా నిలబడిన నాయకులే ఇప్పుడు ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. సొంత పార్టీలో ఉంటూనే అధినాయకుడిపై విరుచుకుపడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ (Swati Maliwal).. కేజ్రీవాల్‌కు కంట్లో నలుసులా మారారు.తనపై కేజ్రీవాల్ నివాసంలో దాడి జరిగిందని గతేడాది మే నెలలో స్వాతి మలివాల్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో తనకు అండగా నిలబడలేదన్న అక్కసుతో కేజ్రీవాల్‌ను టార్గెట్ చేశారు. అప్పటి నుంచి సమయం దొరికినప్పుడల్లా ఆయనపై విరుచుకుపడుతూ ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా లేఖాస్త్రం సంధించి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) అధికారం కోల్పోయి ప్రతిపక్షంగా మిగిలింది. ఈ నేపథ్యంలో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి పదవి దళితుడికి ఇవ్వాలని స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కేజ్రీవాల్‌కు ఆమె లేఖ రాశారు.మీకు ఇదే మంచి అవకాశం‘ఢిల్లీ శాసనసభలో ప్రతిపక్ష నేతను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. మీరు(కేజ్రీవాల్) మాట నిబడేందుకు ఇది మీకు మంచి అవకాశం. విపక్ష నేతగా దళిత ఎమ్మెల్యేను నియమించండి. ఇది రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు.. సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం కోసం బలమైన ముందడుగు అవుతుంద’ని కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో స్వాతి మలివాల్ పేర్కొన్నారు. దళితుడిని ఉప ముఖ్యమంత్రి చేస్తానని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ ఇచ్చిన హామీని ఇప్పటివరకు నిలబెట్టుకోలేదని ఆమె గుర్తు చేశారు. కాగా, ఢిల్లీ ప్రతిపక్ష నాయకుడిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాతో సహా అగ్రనేతలు ఓటమి పాలయిన సంగతి తెలిసింది. మాజీ సీఎం ఆతిశీ మాత్రం ఒడ్డున పడ్డారు.బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి మలివాల్ఇదిలావుంటే దేశ రాజధాని ఢిల్లీలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంలీలా మైదానంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీసీఎంలు హాజరయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వచ్చినట్టు ఎక్కడా కనబడలేదు. అయితే ‘ఆప్’ ఎంపీ స్వాతి మలివాల్ మాత్రం ప్రమాణ స్వీకారం హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్‌తో ఆసక్తిగా ముచ్చటిస్తూ ఆమె కనిపించారు. రేఖా గుప్తాతో కరచాలనం చేసి స్వయంగా అభినందలు కూడా తెలిపారామె.చదవండి: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉంటాకాగా, కేజ్రీవాల్‌తో విభేదాల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీని వదిలిపెట్టి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని వచ్చిన ఊహాగానాలపై స్వాతి మలివాల్ స్పందించారు. ఈ విషయంపై ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీని. ఈ పార్టీలోనే కొనసాగుతాను. ప్రశ్నలను సంధించినందుకు నన్ను రాజీనామా చేయంటున్నారు. నేనేం తప్పులేదు. రాజీనామా ఎందుకు చేయాల’ని ఆమె ఎదురు ప్రశ్నించారు. -
ఢిల్లీ సీఎం రేఖాగుప్తా ప్రమాణ స్వీకారంలో అనుకోని అతిథి!
ఢిల్లీ : కొత్త సీఎం రేఖాగుప్తా (Rekha Gupta Takes Oath) ప్రమాణ స్వీకారంలో అనుకోని అతిథి ప్రత్యక్షమయ్యారు. ఎవరా? ఆ అనుకోని అతిథి అనుకుంటున్నారా? అదేనండి ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్. ఆప్ అధికారంలో ఉండగా.. ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేసి రెబల్ మహిళా నేతగా మారిన స్వాతి మాలివాల్. గురువారం బీజేపీ సీఎం రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టేజీ మీద కాంగ్రెస్ ఢిల్లీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్‌తో ముచ్చటిస్తూ తారసపడ్డారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి, తర్వాత జరుగుతున్న వరుస రాజకీయ పరిణామాలతో ఆప్ ఇమేజ్ డ్యామేజీ అయ్యేందుకు పరోక్షంగా స్వాతి మాల్ కారణమవుతున్నారు. గతేడాది మేలో ఆప్‌లో అంతర్గతంగా కొనసాగుతున్న కుమ్ములాటలపై చర్చించేందుకు కేజ్రీవాల్ తనని ఆహ్వానించారని, అలా వెళ్లిన తనపై కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని ఆరోపించారు. ఆ తర్వాత అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిని తన సొంత పార్టీ ఆమ్ ఆద్మీ మోసం చేసి ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసిందన్నారు. కాబట్టే ఆప్‌కు కేవలం రెండు శాతం ఓట్లు పడినట్లు కేజ్రీవాల్‌పై ఎదురుదాడికి దిగారు. VIDEO | AAP Rajya Sabha MP Swati Maliwal (@SwatiJaiHind) attends Delhi CM oath-taking ceremony at Ramlila Maidan. (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/z9kXxTo9GX— Press Trust of India (@PTI_News) February 20, 2025ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ నివాసం ఎదుట యమునా నది శుద్ధి చేయాలనే హామీని నెరవేర్చలేదని ఆరోపిస్ స్వాతి మలివాల్ ఆందోళన చేపట్టారు. స్వాతి మాలివాల్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమినిపై పరోక్షంగా స్పందించారు. కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తూ ఎక్స్ వేదికగా మహాభారతంలోని ద్రౌపది వస్త్రాభరణం ఫోటోను షేర్ చేశారు. (ఢిల్లీ పీఠమెక్కిన మహిళా ముఖ్యమంత్రులు, రికార్డ్ ఏంటంటే..!)pic.twitter.com/kig39RQYmD— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025 ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆప్ ఓటమికి కేజ్రీవాల్ కారణమని అన్నారు. ఒక వ్యక్తి అహంకారంతో పనిచేయాలని చూస్తే ప్రజలు ఇలాగే బుద్ధి చెబుతారు. కేజ్రీవాల్ విషయంలో అది ఈరోజే జరిగింది’అని వ్యాఖ్యానించారు. గొప్ప విజన్‌తో రాజకీయాల్లోకి వచ్చాం. ఆప్‌లో అదే విధంగా పనిచేశాం. కానీ నాయకత్వం ప్రజాస్వామ్యాన్ని నమ్మకపోవడం, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయగలమని అనుకోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఇదే సమయంలో, ఆప్ వీడి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నిస్తే. నేనెందుకు రాజీనామా? చేయాలి. నేను ఏమైనా తప్పుచేశానా? అని ప్రశ్నించారు. ఆప్ ఎంపీగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రశ్నించినందుకే రాజీనామా చేస్తారా? అని ద్వజమెత్తారు. (ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?)#WATCH | Rajya Sabha MP Swati Maliwal greets Delhi CM-designate Rekha Gupta as she arrives at Ramlila Maidan to attend her oath ceremony. pic.twitter.com/y6jSJLCaRO— ANI (@ANI) February 20, 2025 ఇలా కేజ్రీవాల్‌ను రాజకీయంగా దెబ్బతీస్తున్న స్వాతిమాల్ తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే రేఖాగుప్తా ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి హాజరై చర్చాంశనీయంగా మారారు. -
‘ఆప్’ ఓడినా అతిషి డ్యాన్సులేంటి..? స్వాతి మలివాల్ పోస్టు వైరల్
న్యూఢిల్లీ:ఢిల్లీ సీఎం అతిషిపై రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఫైరయ్యారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోయినప్పటికీ సీఎం అతిషి మాత్రం కల్కాజి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలిచిన సంతోషంలో అతిషి తన అనుచరులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను స్వాతి మలివాల్ ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. పార్టీ ఓడిపోయినా బాధలేదు కానీ తాను మాత్రం గెలిస్తే చాలన్నట్లు సీఎం అతిషి డ్యాన్సులేయడం ఏంటని మలివాల్ ఎద్దేవా చేశారు. పార్టీ ఓడిపోయింది.ఆప్ ముఖ్య నేతలంతా ఓడిపోయారు.అయినా అతిషి ఇలా వేడుక చేసుకుంటున్నారు అని వీడియోను ఉద్దేశించి మలివాల్ విమర్శించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అతిషి 3521 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరిపై గెలుపొందారు. ये कैसा बेशर्मी का प्रदर्शन है ? पार्टी हार गई, सब बड़े नेता हार गये और Atishi Marlena ऐसे जश्न मना रही हैं ?? pic.twitter.com/zbRvooE6FY— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025ఈ ఎన్నికల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ వంటి పార్టీ సీనియర్ నేతలంతా ఓటమి పాలయ్యారు.27 ఏళ్ల తర్వాత బీజేపీ తిరిగి ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకుంది. కాగా, అతిషి ఆదివారం(ఫిబ్రవరి 9) తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎల్జీ వీకే సక్సేనాను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే దాకా పదవిలో కొనసాగాలని ఎల్జీ అతిషిని కోరారు. -
‘ఆప్’ ఓటమి వేళ..స్వాతి మలివాల్‌కు ‘మీమ్స్’ మద్దతు
న్యూఢిల్లీ:ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ, స్వయంగా ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు.ఈ ఓటమి అంశం బీజేపీ నేతలకు అంతులేని ఆనందాన్నిచ్చింది. వారి సంబరాలకు కారణమైంది.ఎందుకంటే ఆప్‌పై గెలిచింది వారే.అయితే ఆప్‌తో ఎన్నికల్లో తలపడకుండా ఆప్ ఓటమి పట్ల బీజేపీ తర్వాత అంత సంతోషించింది ఒక్కరే. ఆమే..ఆప్ నుంచి సస్పెండైన రాజ్యసభ ఎంపీ స్వాతిమలివాల్. ఢిలీ ఎన్నికల్లో ఆప్ ఓటమి నిర్ధారణ అయిన వెంటనే స్వాతి మలివాల్ తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తుచేస్తూ మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణం పోస్టు పెట్టారు. pic.twitter.com/kig39RQYmD— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, గతేడాది మేలో లిక్కర్ కేసులో జైలుకు వెళ్లిన కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చారు.ఈ సమయంలో కేజ్రీవాల్‌ను కలవడానికి స్వాతి ఆయన నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత కొద్ది సేపట్టికి స్వాతి అక్కడి నుంచే పోలీసులకు ఫోన్ చేసిన తనపై కేజజ్రీవాల్ ఇంట్లో దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు.కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్‌కుమార్ తనను కొట్టాడని కేసు పెట్టారు. దీంతో పోలీసులు బిభవ్‌కుమార్‌ను అరెస్టు చేశారు.స్వాతి మలివాల్ జరిగిన దాడిని తొలుత ఖండించిన ఆప్ ఆ తర్వాత స్వాతి మలివాల్ చెప్పేవన్నీ అబద్దాలేనని ఆరోపించింది. దీంతో స్వాతి మలివాల్ ఆప్, కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు.తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఆప్ వ్యతిరేకంగా పలు చోట్ల ప్రచారం కూడా చేశారు. స్వాతిమలివాల్‌కు మద్దతుగా ఆప్ ఓటమిపై శనివారం మీమ్స్, పోస్టులు సోషల్‌మీడియాను ముంచెత్తాయి. -
ఢిల్లీలో హీట్ పాలిటిక్స్.. సీఎం ఇంటి వద్ద ఆప్ ఎంపీ వినూత్న నిరసన
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి నివాసం వద్ద ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న నిరసన చేపట్టారు. ఓ వాటర్ బాటిల్లో కలుషిత నీటిని తీసుకువచ్చి సీఎం ఇంటి ఎదుట పారబోసి ఆప్ సర్కార్‌పై మండిపడ్డారు. దీంతో, ఆమ్ ఆద్మీ పార్టీలో కొత్త చర్చ మొదలైంది.ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ తాజాగా సీఎం అతిషి నివాసం వద్ద వినూత్న నిరసన తెలిపారు. ఓ వాటర్ బాటిల్లో కలుషిత నీటిని తీసుకువచ్చి సీఎం ఇంటి ఎదుట పారబోశారు. అనంతరం స్వాతి మాలివాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు సాగర్పూర్, ద్వారక ప్రజలు నాకు ఫోన్ చేసారు. దీంతో, నేను అక్కడికి వెళ్లాను. ఆ ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను ఒక ఇంటికి వెళ్లి అక్కడ నల్లానీరు సరఫరాను గమనించాను. ఆ నల్లా నీటిని బాటిల్లో నింపాను.నల్లాల్లో సరఫరా అవుతున్న నీరు నల్లగా, కలుషితంగా ఉంది. అదే నీటిని ఇప్పుడు నేను సీఎం అతిషి ఇంటి వద్దకు తెచ్చాను. ఇలాంటి నీటిని ఎవరైనా తాగుతారా?.. వాడుకుంటారా?. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇదే నా హెచ్చరిక. రానున్న 15 రోజుల్లో ఢిల్లీలో ప్రతీ ఇంటికి మంచి నీరు అందాలి. లేని పక్షంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇవే నీటిని ట్యాంకర్లో నింపి సీఎం నివాసం వద్ద పారబోస్తాం. ఇప్పుడు కేవలం ఒక్క బాటిల్ నీటిని మాత్రమే వేస్తున్నాను. ఇది కేవలం శాంపిల్ మాత్రమే.#WATCH | AAP MP Swati Maliwal arrives at Delhi CM Atishi's residence with a bottle filled with polluted water and throws it outside the CM's residence. She is claiming that this water is being supplied to the people of Delhi pic.twitter.com/ERJpqowuZX— ANI (@ANI) November 2, 2024ఇలాంటి నీటిని ఎవరైనా తాగుతారా? తాగితే వారు ప్రాణాలతో ఉంటారా?. ఢిల్లీలో ఛత్ పూజ వస్తోంది. ఈరోజు గోవర్ధన్ పూజ జరిగింది. నిన్న దీపావళి. పండుగ వేళ ఇలాంటి నీటితో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి అతిషి వద్దే నీటి పారుదల శాఖ కూడా ఉంది. నీటి సమస్యపై ఆమె ప్రతీరోజు మీటింగ్ పెట్టి ఈ సమస్యను పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు. ఇక, ఆప్ ఎంపీ నిరసన రాజకీయంగా బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. #WATCH | Delhi | AAP Rajya Sabha MP Swati Maliwal says, "The people of Sagarpur, Dwarka had called me and the situation there is very bad... I went to a house and black water was being supplied there. I filled that black water in a bottle and I brought that water here, at the… https://t.co/FN3JgtYUXn pic.twitter.com/2twrYzVlO8— ANI (@ANI) November 2, 2024 -
ఆతిశి డమ్మీ సీఎంగా ఉంటారు!
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా ఆప్ నేత అతిశిని ఎంపిక చేయడంపై రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్ స్పందించారు. ముఖ్యమంత్రిగా ఆమె డమ్మీగా మిగిలిపోతారనే విషయం అందరికీ తెలిసిందే అంటూ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. అతిశి కుటుంబం ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరి శిక్ష నుంచి కాపాడేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ‘అఫ్జల్ గురు అమాయకుడు. అతడు రాజకీయ కుట్రకు బలయ్యాడు. అతడిని ఉరి తీయకండి, క్షమాభిక్ష పెట్టండంటూ ఈమె తల్లిదండ్రులు రాష్ట్రపతికి పలుమార్లు వినతులు పంపారు’అని మలివాల్ ఆరోపించారు. ‘దేశ భద్రతపై ఆందోళన కలిగించే పరిణామమిది. ఇది ఎంతో విచారకరమైన రోజు. ఢిల్లీని ఆ దేవుడే కాపాడాలి’అని ఆమె పేర్కొన్నారు. అతిశి తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్తా వాహి సంతకాలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపిన క్షమాభిక్ష పిటిషన్ కాపీని కూడా మలివాల్ షేర్ చేశారు. వీటిపై ఆప్ ఎమ్మెల్యే దిలీప్ పాండే స్పందిస్తూ..‘ఆప్ టిక్కెట్‌పై రాజ్యసభకు వెళ్లిన స్వాతి మలివాల్..ఇప్పుడు బీజేపీ గొంతు వినిపిస్తున్నారు. ఏమాత్రం సిగ్గున్నా వెంటనే ఆమెకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి’అని డిమాండ్ చేశారు. రాజ్యసభలోనే కొనసాగాలనుకుంటే బీజేపీ టిక్కెట్‌పై ఆమె మళ్లీ ఎన్నికవ్వొచ్చని పాండే పేర్కొన్నారు. పార్లమెంట్‌పై 2001లో జరిగిన దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురును 2013లో ఉరితీయడం తెలిసిందే. తన తల్లిదండ్రులు అఫ్జల్ గురుకు అనుకూలంగా రాష్ట్రపతికి పంపిన క్షమాభిక్ష పిటిషన్‌పై 2019లో ఓ ఇంటర్వ్యూలో అతిశి..‘ఆ అంశంతో నాకెలాంటి సంబంధమూ లేదు. అది నా తల్లిదండ్రులు వారి ఆశయాలకు అనుగుణంగా స్పందించారు. అది వారిష్టం. ఈ విషయంలో వారికి నేను ఎలాంటి మద్దతివ్వలేదు కూడా’అని స్పష్టం చేయడం గమనార్హం. -
స్వాతి మలివాల్‌పై దాడి కేసు: బిభవ్ కుమార్‌కు బెయిల్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్) ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎంపీపై దాడి కేసులో బెయిల్, అరెస్ట్‌ను సవాల్ చేస్తూ బిభవ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితుడు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీలో 100 రోజులు ఉన్నారని, ఛార్జ్‌షీట్ నమోదైనట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ‘స్వాతి మలివాల్‌కు గాయాలు అయ్యాయి. కానీ ఈ కేసులో బెయిల్ ఇవ్వడాన్ని అడ్డుకోలేం. బెయిల్ నిరాకరిస్తూ జైలులోనే ఉంచేలా చేయలేం’ అని న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. ఢిల్లీ పోలీసుల తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఈ కేసులో కొందరు ముఖ్యమైన సాక్షులపై నిందితుడు బిభవ్ కుమార్ ప్రభావం ఉంది. వారిని విచారించడానికి అనుమతి ఇవ్వండి. అప్పుడు తాము బెయిల్‌ను వ్యతిరేకించమని కోర్టుకు తెలిపారు. అలా అయితే.. సొలిసిటర్ జనరల్ చెప్పిన విధంగా తాము ఎవరికీ బెయిల్ మంజూరు చేయలేమని జస్టిస్ భుయాన్ అన్నారు. బెయిల్ మంజూరు చేయకుండా ఉంచటం ఆందోళన కలిగించే విషయమని సుప్రీకోర్టు పేర్కొంది. ఈ దాడి కేసులో సాక్షులందరినీ విచారించే వరకు నిందితుడు బిభవ్ కుమార్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోకి ప్రవేశించవద్దని సుప్రీం కోర్టు షరుతు విధించింది.మే 13న స్వాతి మలివాల్‌పై బిభవ్ కుమార్ తనపై దాడి చేసినట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. స్వాతి మలివాల్ ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్‌పై పోలీసులు మే 18న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
స్వాతి మలివాల్ కేసు: బిభవ్‌పై 201 సెక్షన్ నమోదు
ఢిలీ: తనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్ దాడి చేశారని గత నెలలో ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ కేసులో బిభవ్ కుమార్‌పై కేసు నమోదు కాగా.. పోలీసులు మే 18 అరెస్ట్ చేశారు. అయితే తాజాగా బిభవ్‌కుమార్ నమోదైన కేసులో 201 సెక్షన్‌ను చేర్చారు. 201 సెక్షన్ అంటే.. ఆధారాలు మాయం చేసి.. తప్పుడు సమాచారం ఇవ్వటం. బిభవ్ కుమార్ ఈ కేసుకు సంబంధించి ఆధారాలు మాయం చేసి.. తప్పుడు సమాచారం అందించిస్తున్నట్లు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.బిభవ్ కుమార్‌ను దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆయన తన ఫోన్‌ను ఫార్మాట్ చేసినట్లు గుర్తించారు. ఆయన ముంబైలో ఫోన్ ఫార్మాట్ చేసినట్లు అనుమానం రావటంతో ఇప్పటికే పోలీసులు రెండుసార్లు ముంబైకి తీసుకువెళ్లి దర్యాప్తు చేశారు. ముంబైలో ఏ ప్రాంతంలో ఫార్మాట్ చేశారు?. ఫోన్లోని డేటాను ఎవరికి షేర్ చేశారు? అన్న విషయాలు మాత్రం బిభవ్ వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. ఇక.. కస్టడీలో ఉన్న ఆయన దర్యాప్తు సమయంలో అస్సలు సహకరించలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు.సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నుంచి మూడు సీసీటీవీ కెమెరాల డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బిభవ్ సీసీటీవీ కెమెరాలను ట్యాంపర్ చేశారని పోలీసుల అనుమానం వ్యకం చేశారు. దీంతో డీవీఆర్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వీటికి సంబంధించిన రిపోర్టులు ఇంకా వెల్లడికాలేదని తెలిపారు. మే 18 అరెస్ట్ అయిన బిభవ్ కుమార్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు.మే 13న ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లితే.. అక్కడ కేజ్రీవాల్ సహాయకుడు తనపై దారుణంగా దాడి చేశారని బయటపెట్టారు. అయితే వాటిని ఆప్.. బీజేపీ కుట్రలో భాగంగానే స్వాతి మలివాల్ బిభవ్‌పై దాడి ఆరోపణలను చేస్తోందని విమర్శలు చేసింది. -
స్వాతి మలివాల్ కేసు: హైకోర్టుకు సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ భివవ్ కుమార్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మే 13న స్వాతి మలివాల్‌పై బిభవ్ కుమార్ దాడి చేసినట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. స్వాతి మలివాల్ ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్ మే 18న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే.. తనను స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అక్రమగా అరెస్ట్ చేశారని హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్లో బిభవ్ పేర్కొన్నారు. అదే విధంగా ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బిభవ్ తరఫున న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.ఈ దాడి కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బిభవ్ కుమార్ సీఎం కేజ్రీవాల్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీని తారుమారు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. స్వాతి మలివాల్‌పై సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దాడి చేశారన్న ఆరోపణలు ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాశం అయింది. బీజేపీ కుట్రంలో భాగంగా స్వాతి మలివాల్ బిభవ్‌పై దాడి ఆరోపణులు చేశారని ఆప్ నేతలు ఆరోపించారు. -
కోర్టులో ఎంపీ కన్నీరు
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా తనకు విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయని ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతీ మలివాల్ వాపోయారు. ఆమెపై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం తీస్ హజారీ కోర్టులో విచారణ జరిగింది. ఈ ఉదంతంలో ఎంపీ కావాలనే సమస్యలు సృష్టించారని బిభవ్ న్యాయవాది వాదించారు. సీఎం నివాసంలో సీసీ కెమెరాలు లేనిచోట తనపై దాడి జరిగిందని ఆమె చెప్పడంలో దురుద్దేశం దాగుందన్నారు. దాంతో ఎంపీ కన్నీటి పర్యంతమయ్యారు. ఆప్ ట్రోల్ ఆర్మీ తనను తీవ్రంగా వేధిస్తోందని కోర్టుకు తెలిపారు. బిభవ్‌కు బెయిలిస్తే తనకు, తన కుటుంబానికి ప్రమాదమని వాదించారు. ఈ ఉదంతంలో నిబంధనలను ఉల్లంఘించింది బిభవ్ కుమారేనని ఢిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేజ్రీవాల్ నివాసంలో బిభవ్ ఈనెల 13న తనపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టాడని స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ కేసులో బిభవ్ అరెస్టయ్యారు. ఫోన్‌ను ఫార్మాట్ చేసి, సీసీటీవీ ఫుటేజిని తొలగించిన బిభవ్ అమాయకుడు కాదని స్వాతి తరఫు లాయర్ వాదించారు. అనంతరం బిభవ్‌కు బెయిల్‌ను నిరాకరిస్తున్నట్టు అడిషనల్ సెషన్స్ జడ్జి సుశీల్ అనూజ్ త్యాగి పేర్కొన్నారు. -
స్వాతి మలివాల్ ‘ఆప్’ను వీడతారా..?
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)కి రాజీనామా చేసే విషయమై ఆ పార్టీ ఎంపీ స్వాతిమలివాల్ స్పందించారు. తాను ఆప్‌ను వీడటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలివాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.మే13న సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఆయన అనుచరుడు బిభవ్‌కుమార్ చేతిలో మలివాల్ దాడికి గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెను బీజేపీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానించారని, ఆమె త్వరలో పార్టీ మారనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని ఆమె తాజాగా ఖండించారు. బీజేపీ నేతలు తనతో టచ్‌లోకి రాలేదని చెప్పారు.తాను ఆప్‌లోనే కొనసాగుతానని, ఆ పార్టీ ఏ ఒకరిదో ఇద్దరిదో కాదన్నారు. పార్టీ కోసం తన చెమట, రక్తాన్ని ధారపోశానన్నారు. నిజానికి తనపై దాడి తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మాత్రమే తనతో మాట్లాడారని, ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తని మలివాల్ చెప్పుకొచ్చారు. -
చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్
న్యూఢిల్లీ: చంపేస్తామని, అత్యాచారం చేస్తామని తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎంపీ స్వాతి మలివాల్ అన్నారు. తన మీద సీఎం కేజ్రీవాల్ ఇంట్లో జరిగిన దాడి ఘటనపై ఓ యూట్యూబ్ ఛానల్లో వన్‌సైడ్ వీడియో పెట్టారని, ఆ తర్వాతే బెదిరింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. ఈ మేరకు ఆదివారం(మే26) ఎక్స్(ట్విటర్)లో ఆమె ఒక ట్వీట్ చేశారు. యూట్యూబ్ ఛానళ్లు నడిపే ఇండిపెండెంట్ జర్నలిస్టులు కూడా ఆప్ అధికార ప్రతినిధుల అవతారమెత్తడం సరికాదన్నారు. దాడి ఘటనపై ఆ జర్నలిస్టులకు తన వెర్షన్ చెప్పుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫోన్లు ఎత్తడం లేదన్నారు. తాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని తమ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని తెలిపారు. -
మరో ఎంపీ లండన్‌లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సమయంలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఇండియాలో లేరని విమర్శలు వస్తున్నాయి. అయితే వాటిపై స్వాతి మలివాల్ స్పందించారు.‘‘ హార్వార్డ్ యూనివర్సిటీలో ఓ సెమినార్ పాల్గొనడానికి నేను మార్చిలో అమెరికా వెళ్లాను. ఆప్ వలంటీర్లు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా. నా సోదరికి కోవిడ్ సోకటం కారణంగా నేను ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. అమెరికాలో ఉన్న భారత్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో టచ్ ఉన్నాను. ...ఆప్ నేతలతో ఎప్పటికప్పుడు మాట్లడుతూ.. ట్వీట్లు చేస్తూ వచ్చాను. ఆ సమయంలో నేను చేయగలిగింది చేశాను. ఆ సమయంలో పార్టీ కోసం నేను పని చేయలేదనటం చాలా దురదృష్టకరం. మరో రాజ్యసభ ఎంపీ లండన్‌లో ఉన్నా.. నన్ను మాత్రమే ఎందుకు ఇలా ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావటం లేదు’’ అని పేర్కొన్నారు.ఇక కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయంలో రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా భారత్‌లో లేకపోటంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన కంటి శస్త్రచికిత్సకు లండన్ వెళ్లి ఇటీవల భారత్ తిరిగి వచ్చారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల ర్యాలీల్లో రాఘవ్ పాల్గొంటున్నారు. ఇటీవల (మే 13) సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మలివాల్ కేసు నమోదు చేసిన విషయంలో తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కోనసాగుతోంది. ఆమెపై దాడి జరిగినట్లు చేస్తున్న ఆరోపణల వెనక బీజేపీ కుట్ర ఉందని ఆప్ నేతలు విమర్శలు చేస్తున్నారు. -
స్వాతిమలివాల్‌పై దాడి.. తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎంపీ స్వాతిమలివాల్‌పై తన ఇంట్లో జరిగిన దాడి పట్ల పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. ఈ ఘటనలో రెండు వెర్షన్లు ఉన్నాయని ఏది నిజమో తేలాలంటే నిష్పక్షపాత దర్యాప్తు జరగాలన్నారు. ఈ విషయంలో తనకు న్యాయం కావాలన్నారు. ఈ విషయమై బుధవారం(మే22) కేజ్రీవాల్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాగా, మే13న ఎంపీ స్వాతిమలివాల్ సీఎం కేజ్రీవాల్‌ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని మలివాల్ తొలుత ఆరోపించారు. వివాదం పెద్దదైన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బిభవ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయంలో ఆప్ నేతలు, స్వాతిమలివాల్ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. -
స్వాతి మలివాల్ కేసులో సాక్ష్యాలు మాయం?!
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాడి కేసులో ఢిల్లీ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిందితుడు బిభవ్ కుమార్ రిమాండ్ నోట్‌ను విడుదల చేశారు. ఈ కేసులో సాక్షాలు మాయమైట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన రోజు (మే13)న సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సీసీటీవీ ఫుటేజీని నిందితుడు బిభవ్‌కుమార్ ట్యాంపర్ చేశారని వెల్లడించారు. ‘‘విచారణకు సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ సహకరించడం లేదు. బిభవ్ కుమార్ తన ఫోన్ పాస్ వర్డ్ చెప్పడం లేదు. ఆయన ఫోన్‌ను ముంబైలో ఫార్మాట్ చేశారు. కేజ్రీవాల్ నివాసంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజీ బ్లాంక్‌గా ఉంది. దాడి జరిగిన వీడియోను తొలగించారు. సీసీటీవీ పుటేజీకి సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డర్‌ను ఇచ్చేందుకు కేజ్రీవాల్ నిరాకరిస్తున్నారు’’ అని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.‘‘ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు బ్లాంక్‌గా ఉన్నాయి. మే 23( సోమవారం) రోజు సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసేందుకు వీలుగా డిజిటిల్ వీడియో రికార్డర్‌ను మాకు అందజేయలేదు.ముఖ్యమంత్రి నివాసంలో ఉన్న సీసీటీవీ కెమెరాల నిర్వహణ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది. ఆ విభాగానికి చెందని ఓ జూనియర్ ఇంజనీర్ ఇచ్చిన పెన్ డ్రైవ్‌ను పరిశీలించాము. కానీ అందులో ఒక వీడియో బ్లాంక్‌గా వస్తోంది. జూనియర్ ఇంజనీర్ వద్ద డీవీఆర్ యాక్సెస్ లేదు’ అని దర్యాపు చేసిన ఢిల్లీపోలీసులు రిమాండ్ నోట్లో వెల్లడించారు. ఇక.. స్వాతి మలివాల్‌పై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి.. ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. -
బిభవ్ కుమార్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆప్ రాజ్యసభ సభ్యు రాలు స్వాతి మలివాల్‌పై దాడి ఆరోపణ కేసులో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు, కేజ్రీ వాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్‌చేశారు. శనివారం కేజ్రీవాల్ ఇంటికి బిభవ్ వచ్చాడని తెల్సుకుని ఢిల్లీ పోలీసులు అక్కడికి వెళ్లారు. బిభవ్‌ను ప్రశ్నించే నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అరెస్ట్‌చేసినట్లు తర్వాత ప్రకటించారు. సీఎం కేజ్రీవాల్‌ను కలిసేందుకు వెళ్లిన సందర్భంగా బిభవ్ విచక్షణరహితంగా, నెలసరి బాధ ఉందని చెప్పినా వినకుండా చెంపలు చెళ్లుమనిపించి, ఛాతి, పొట్ట, పొత్తికడుపుపై పలుమార్లు తన్నాడని బిభవ్‌పై మలివాల్ ఫిర్యాదు చేయడం తెల్సిందే. శుక్రవారం ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన మరుసటి రోజే నిందితుడిని పోలీసులు అరెస్ట్చేయడం గమనార్హం. కోర్టు ఎదుట బిభవ్‌ను హాజరుపరిచి దర్యాప్తు నిమిత్తం తమ కస్టడీకి కోరతామని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఆరోజు ఘటనాస్థలిలో ఉన్న 10 మంది నుంచి స్టేట్మెంట్లు నమోదుచేశామని వెల్లడించారు. బిభవ్ ఫిర్యాదును పట్టించుకోండి: అతిశిఢిల్లీ పోలీసులు ఈ కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని భావిస్తే మలివాల్‌పై బిభవ్ ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని ఆమెపై ఎఫ్ఐఆర్ నమోద ుచేయాలని ఆప్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ రాష్ట్ర మంత్రి అతిశి శనివారం డిమాండ్‌చేశారు. పత్రకాసమావేశంలో అతిశి సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘ఏసీబీ నమోదుచేసిన ఒక అక్రమ నియామకాల కేసులో మలివాల్ ఇరుక్కున్నారు. అరెస్ట్ నుంచి తప్పించాలంటే కేజ్రీవాల్‌ను కేసులో ఇరికించాలని ఆమెను బీజేపీ బ్లాక్మెయిల్ చేసింది. బీజేపీ చేసిన ఈ కుట్రలో మలివాల్ ఒక పావు మాత్రమే. అపాయింట్మెంట్ లేకుండా సీఎం ఇంటికి ఆమె ఎందుకొచ్చినట్లు? ఒకవేళ సీఎంను కలిసి ఉంటే వాళ్ల ప్లాన్ ప్రకారం బిభవ్‌తో గొడవ, అరెస్ట్ జరిగేవి కాదు. బీజేపీకి ఒక విధానం ఉంది. మొదట కేసులు పెడతారు. తర్వాత బెదిరించి వినకపోతే జైల్లో పెడతారు. సీఎం ఆఫీస్‌లో డ్యూటీలో ఉన్న భద్రతా అధికారిపై మలివాల్ దుర్భాషలాడి గొడవ పడ్డారు. అనుమతిలేకుండా లోపలికి వచ్చారు. ఈ ఉల్లంఘన అంశాలపై ఢిల్లీ పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయట్లేరు? ఎఫ్ఐఆర్ ప్రతిని పోలీసులు కోర్టుకు ఇవ్వరట. నిందితుడి లాయర్‌కు ఇవ్వరట. కానీ రెండ్రోజులుగా మీడియాలో అది చక్కర్లు కొడుతోంది. ఈ కుట్ర ఎంతపెద్ద స్థాయిలో జరిగిందో ఇట్టే అర్థమవుతోంది ’’ అని మోదీ సర్కార్‌పై అతిశి ఆరోపణలు గుప్పించారు. మరో వీడియో విడుదలఘటన జరిగిన రోజునాటి సీసీటీవీ ఫుటేజీ మరొకటి బయటికొచ్చింది. ఆ వీడియోలో కేజ్రీవాల్ భద్రతా సిబ్బంది మలివాల్‌ను చేయిపట్టుకుని ఇంటి బయటకు బలవంతంగా తీసుకొచ్చారు. మహిళా సెక్యూరిటీ గార్డ్ చేతిని మలివాల్ విదిలించుకుని దూరం జరిగి, అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు ఆ వీడియోలో రికార్డయింది. అయితే ‘‘మలివాల్ ఆరోపించినట్లు ఆమె నడవలేకపోతున్నట్లు వీడియోలో లేదు. మామూలుగానే నడుస్తున్నారు. మహిళా పోలీస్ అధికారిని నెట్టిపడేశారు. షర్ట్ చిరిగిందని, బటన్స్ ఊడిపోయాయని చెప్పిందంతా అబద్ధమని ఈ వీడియోలో తేలిపోయింది’’ అని అతిశి ఆరోపించా. అయితే పూర్తి నిడివి ఫుటేజీ విడుదలచేయకుండా కత్తిరించి అతికించిన ఎడిటెడ్ వీడియోను విడుదలచేసి ఆప్ మలివాల్ వ్యక్తిత్వహననానికి పాల్పడుతోందని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ తీవ్రంగా తప్పుబట్టారు. బిభవ్ అరెస్ట్‌తో ఆప్ చెత్త చరిత్ర పేజీలు ఇప్పుడు బయటికొస్తాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో మలివాల్‌కు చేసిన వైద్యపరీక్షల వివరాలు బహిర్గతమయ్యాయి. మెడికో లీగల్ సర్టిఫికెట్ ప్రకారం మలివాల్ ఎడమ కాలు బొటనవేలు సమీపంలో, కుడి చెంపపై గాయాలున్నాయి. -
Delhi Chief Minister Arvind Kejriwal: బీజేపీ ఆఫీస్కొస్తాం
న్యూఢిల్లీ: బెయిల్‌పై బయటికొచ్చాక ఆప్ ఎన్నికల ప్రచారపర్వంలో ఎన్నికల వేడిని రాజేసిన కేజ్రీవాల్ శనివారం ప్రధాని మోదీకి కొత్త సవాల్ విసిరారు. తన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ పత్రికా సమావేశంలో మాట్లాడారు. ‘‘ ప్రధాని మోదీజీ మీరు కొత్తరకం జైలు ఆట ఆడుతున్నారని తెలుసు. మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ ఇలా ఆప్ నేతలను ఒకరి తర్వాత మరొకరిని జైలుకు పంపిస్తున్నారు. రేపు(ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు నేను, నాతోపాటు ఆప్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం బీజేపీ ప్రధాన కార్యాలయానికి గుంపుగా వస్తాం. ఎంత మందిని అయితే మీరు జైలులో పడేద్దామనుకుంటున్నారో అంత మందిని ఒకేసారి అరెస్ట్‌చేసి జైల్లో వేసేయండి’’ అని మోదీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ‘ సంజయ్ సింగ్‌ను చెరసాలలో వేశారు. ఈరోజు బిభవ్ కుమార్‌ను అరెస్ట్‌చేశారు. కంటికి శస్త్రచికిత్స తర్వాత మా ఎంపీ రాఘవ్ చద్దా లండన్ నుంచి తిరిగొచ్చారు. ఆయనను కూడా జైలుకు పంపుతామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఢిల్లీ రాష్ట్ర మంత్రులు అతిశి, సౌరభ్ భరద్వాజ్లనూ కారాగారంలో వేస్తామని గతంలో బీజేపీ వెల్లడించింది’ అని ‘ఎక్స్’లో కేజ్రీవాల్ ఒక వీడియోను షేర్చేశారు. డ్రామాలు ఆపండి: బీజేపీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తామన్న కేజ్రీవాల్ ప్రకటనపై బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ స్పందించారు. ‘‘ ఈ డ్రామాలు ఆపండి. మేం చాలా సులభమైన ప్రశ్న అడుగుతున్నాం. మీ సొంతిట్లో మీ పార్టీ ఎంపీని చితకబాదితే ఆరు రోజులైనా మీరు మౌనం వీడట్లేరు. మహిళా ఎంపీపై దాడి ఉదంతంలో బాధ్యులు ఎవరు? ఈ విషయంపై మీరెందుకు స్పందించట్లేరు? చర్యలెందుకు తీసుకోవట్లేరు?’’ అని సచ్దేవ్ నిలదీశారు. -
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్‌పై రాష్ట్ర మంత్రి అతిశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెపై అవినీతి కేసు ఆరోపణలు ఉన్నాయని వాటి నుంచి తప్పించుకోవడానికి స్వాతీ మలివాల్ బీజేపీతో కుమ్మక్కై దాడి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు కూడా నమోదైంది. అయితే తాజాగా ఆమెపై దాడి జరిగినట్లు చెబుతున్న సోమవారం రోజు.. సీఎం ఇంట్లో రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోను శనివారం ఆప్ బయటపెట్టగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Footage of Swati Maliwal being escorted out of Kejriwal's residence by lady security officer.She seems fine and cooperative. pic.twitter.com/xwnfJtBCDS— Nehr_who? (@Nher_who) May 18, 2024 ఈ వీడియోలో స్వాతీ మలివాల్ లేడీ పోలీసు భద్రత, పర్యవేక్షణలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోకి వెళ్లి.. బయటకు రావటం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంట్లో వెళ్లినప్పుడు.. మళ్లీ తిరిగి వచ్చినప్పుడు కూడా లేడీ పోలీసు వెంటనే ఉంటూ చేయ్యి పట్టుకొని ఉన్నారు. ఆమె తనను పట్టుకొవద్దంటూ వారిని విడిపించుకోవడానికి వారిస్తున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి అతిశీ శనివారం మీడియాతో మాట్లాడారు.‘స్వాతీ మలివాల్‌పై అవినీతి కేసు ఆరోపణలు ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానినే ఆమె బీజేపీతో కుమ్మక్కై దాడి ఆరోపణుల చేశారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. స్వాతీ మలివాల్ ఎఫ్ఐఆర్లో చేర్చిన ఆరోపణలు అన్నీ అసత్యాలే. ఇంకా.. పోలీసులనే ఆమె బెదిరించటం వీడియోలో కనిపిస్తోంది. బిభవ్ కుమార్‌ను సైతం ఆమె తీవ్రంగా దూషించారు. సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి ఆమె ఎటువంటి గాయాలు లేకుండా బయటకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది’ అని అతిశీ స్వాతీ మలివాల్‌పై మండిపడ్డారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడి చేశారని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలు సంచలన సృష్టించాయి. తపై బిభవ్ కుమార్ దారుణంగా దాడి చేశాడని, గాయాలు కూడా అయినట్లు స్వాతీ మలివాల్ ఆరోణలు చేశారు. ఆమె చేసిన ఆరోపణలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ మౌనంగా ఉండటంపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ఆమెపై దాడి వెనక సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. -
AAP MP Swati Maliwal: కొట్టాడు.. పొట్టలో తన్నాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ తనపై చేసిన దాడిపై ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ సంచలన విషయాలు బయటపెట్టారు. విచక్షణారహితంగా ఛాతిపై కొట్టాడని, పొట్టలో తన్నాడని, చంపి పూడ్చిపెడతా అని బెదిరించాడని ఆమె ఇచి్చన వాంగ్మూలం వివరాలు ఎఫ్ఐఆర్ ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చాయి. దెబ్బలకు తాళలేక నడవలేకపోయా గురువారం బిభవ్‌పై ఢిల్లీ పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో స్వాతి ఇచి్చన వాంగ్మూలం వివరాలు ఉన్నాయి. ‘‘ కేజ్రీవాల్‌ను కలిసేందుకు డ్రాయింగ్ రూమ్‌లో కూర్చున్నా. పట్టరాని ఆవేశంతో నా వైపు దూసుకొచి్చన బిభవ్ ‘ మా మాట ఎందుకు వినట్లేవు? మాకు ఎదురుచెప్పడానికి ఎంత ధైర్యం? నీచమైన దానివి నువ్వు. నీకు గుణపాఠం చెప్తాం’ అని తిట్టడం మొదలెట్టాడు. తర్వాత 7–8 సార్లు చెంపమీద కొట్టాడు. దీంతో షాక్‌కు గురయ్యా. సాయం కోసం అరిస్తే ఎవ్వరూ ముందుకు రాలేదు. కూర్చున్న నన్ను షర్ట్ పట్టుకుని కిందకు తోశాడు. టేబుల్‌కు తల తగిలి కింద పడ్డా. అంతటితో ఆగకుండా వీరావేశంతో నా ఛాతి, పొట్ట, పొత్తికడుపు, కటి భాగంపై కాలితో పలుమార్లు తన్నాడు. నిలువరించబోతే షర్ట్ పట్టుకుని లాగాడు. షర్ట్ బటన్స్ కొన్ని ఊడిపోయాయి. షర్ట్ పైకి లేస్తోంది ఆపు అని అరిచినా బలంగా నెట్టేసి కొట్టాడు. పిరియడ్ నొప్పికితోడు ఈ దెబ్బల ధాటికి బాధతో విలవిల్లాడిపోయా. పీరియడ్స్ విషయం చెప్పినా అతను ఆగలేదు. దెబ్బల నొప్పికి కనీసం నడవలేకపోయా. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పా. లిఖితపూర్వక ఫిర్యాదు అడిగారు. భయంకరమైన నొప్పుల బాధతో రాసే ఓపికలేక అక్కడి నుంచి వెళ్లిపోయా’’ అని స్వాతి చెప్పారు. ‘ఏం చేసుకుంటావో చేస్కో. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. నీ అంతుచూస్తా. ఎముకలు విరగ్గొట్టి పూడ్చిపెడతా. ఎక్కడ పూడ్చామో ఎవరూ కనిపెట్టలేరు’ అని బిభవ్ నన్ను బెదిరించాడు’’ అని మలివాల్ వాంగ్మూలం ఇచ్చారు. ముఖంపై అంతర్గత గాయాలు శుక్రవారం మలివాల్ ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలు ఉన్నట్లు వైద్యులు మెడికో లీగల్ కేస్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ కేసు విషయమై మలివాల్ శుక్రవారం తీస్ హజారీ కోర్టు మేజి్రస్టేట్ ఎదుట హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు కేజ్రీవాల్ సెక్యూరిటీ సిబ్బందితో మలివాల్ వాగ్వాదానికి దిగిన మే 13నాటి 52 సెకన్ల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ‘‘ నన్నెవరైనా టచ్‌చేస్తే బాగుండదు. ఉద్యోగం నుంచి తొలగిస్తా. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశా. వాళ్లు వచ్చేదాకా ఆగండి. డీసీపీతో మాట్లాడి మీ సంగతి తేలుస్తా’’ అని మలివాల్ అంటున్నట్లు వీడియోలో ఉంది. పొలిటికల్ హిట్‌మ్యాన్.. మలివాల్ శుక్రవారం ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్ట్‌చేశారు. ‘‘ పొలిటికల్ హిట్‌మ్యాన్ మళ్లీ తనను తాను కాపాడుకునే పనిలో పడ్డాడు. విషయం లేకుండా సొంత మనుషులతో ట్వీట్లు, వీడియోలు షేర్ చేయిస్తాడు. నేరాలు చేసి కూడా తప్పించుకోవచ్చని ఆయన ధీమా. ఇంటిలోపలి సీసీటీవీ ఫుటేజీ బహిర్గతమైతే నిజం అందరికీ తెల్సిపోతుంది’’ అని పోస్ట్‌చేశారు. ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారో ఆమె పేర్కొనలేదు. కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ బృందం కేసు విచారణలో భాగంగా ఢిల్లీ పోలీసు ఫోరెన్సిక్ బృందం ఘటన జరిగిన కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మలివాల్‌ను వెంట తీసుకెళ్లారు. అక్కడి సాక్ష్యాధారాలు, సీసీటీవీ ఫుటేజీని ఐదుగురు సభ్యుల ఫోరెన్సిక్ నిపుణులు స్వా«దీనం చేసుకున్నారు. కాగా, తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ ఇచి్చన సమన్లను బిభవ్ బేఖాతరు చేశారు. దీంతో ఆయన జాడ తెల్సుకునేందుకు ఢిల్లీ పోలీసు బృందాలు బయల్దేరాయి. ఒక బృందం ఇప్పటికే అమృత్‌సర్‌కు వెళ్లింది. మహారాష్ట్రకు వచ్చాడేమో అనే అనుమానంతో ఆ రాష్ట్ర పోలీసు విభాగాన్ని సంప్రదించారు. ఇంత జరిగితే మాట్లాడరా?: సీతారామన్ ‘‘ ఇంట్లో సొంత పార్టీ మహిళా ఎంపీపై ఇంత ఘోరమైన దాడి జరిగితే కేజ్రీవాల్ ఎందుకు మాట్లాడట్లేరు? నిందితుడు బిభవ్‌ను ఇంకా వెంటేసుకుని తిరగడం నిజంగా సిగ్గుచేటు. ఈ విషయంలో కేజ్రీవాల్ ఒక బహిరంగ ప్రకటన చేసి క్షమాపణ చెప్పాలి’ అని బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్‌చేశారు. ఇదంతా బీజేపీ కుట్ర: అతిశి మలివాల్‌ను అడ్డుపెట్టుకుని కేజ్రీవాల్‌ను ఈ కేసులో ఇరికించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆప్ నాయకురాలు అతిశి ఆరోపించారు. ‘‘ ఈ రోజు ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. అందులో మలివాల్ సోఫాలో కూర్చుని వాగ్వాదానికి దిగారు. కొట్టారని, నొప్పితో బాధపడ్డానని, షర్ట్ బటన్లు ఊడిపోయాయని ఎఫ్ఐఆర్లో చెప్పారు. కానీ ఆ వీడియో చూస్తుంటే అదంతా అబద్ధమని తేలిపోయింది. సీఎం బిజీగా ఉంటే కలుస్తానని బిభవ్‌ను ఆమెనే కేకలేసి నెట్టేశారు. ఈ ఉదంతం వెనుక బీజేపీ హస్తముంది’’ అని అతిశి ఆరోపించారు. -
కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలీవాల్.. సీన్ రీ కన్స్ట్రక్షన్?
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేజ్రీవాల్ నివాసంలోని డ్రాయింగ్ రూంలో సీఎం కోసం ఆప్ ఎంపీ ఎదురుచూస్తుండగా.. బిభవ్ కుమార్ అక్కడికి వెళ్లి, ఆమెతో అమర్యాదగా ప్రవర్తించి, దాడి చేసినట్లు స్వాతి మలీవాల్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బిభవ్ కుమార్‌ను నిందితుడిగా చేర్చి దర్యాప్తు జరుపుతున్నారు.దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు మలీవాల్‌ను ఆమెపై దాడి జరిగిన సీఎం కేజ్రీవాల్ నివాసానికి శుక్రవారం సాయంత్రం తీసుకెళ్లారు. మే 13న జరిగిన క్రైం సీన్‌ను రీక్రియెట్ చేయడానికి సంఘటన స్థలానికి తీసుకెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఆప్ ఎంపీని కేజ్రీవాల్ ఇంటికి తీసుకెళ్లే ముందు అయిదుగురు ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి ఢిల్లీ పోలీసు బృందం సంఘటనా స్థలానికి వెళ్లింది. అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) అంజిత చెప్యాల నాయకత్వంలో నలుగురు సభ్యులు అక్కడికి చేరుకున్నారు. సీఎం ఇంటి నుంచి పలు ఆధారాలను సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. అనంతరం ఫోరెన్సిక్ బృందం కేజ్రీవాల్ నివాసం నుంచి తిరిగి వెళ్లిపోయింది.#WATCH | AAP MP Swati Maliwal arrives at Delhi CM Arvind Kejriwal's residence as police is expected to recreate what happened with her here on 13th May pic.twitter.com/bM7w8kygO3— ANI (@ANI) May 17, 2024 కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సోమవారం ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని స్వాతి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీన్ని ఆప్ కూడా ధ్రువీకరించి, బిభవ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.చదవండి: ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలుదాడి ఆరోపణల నేపథ్యంలో మలీవాల్‌కు నేడు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ముఖంపై అంతర్గత గాయాలు అయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు దాడికి ముందు కేజ్రీవాల్ నివాసంలో మలీవాల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరిన కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉన్న సిబ్బందితో స్వాతి మలివాల్ వాదనకు దిగింది. ఇప్పటికే పోలీసులకు ఫోన్ చేశానని, పోలీసులు వచ్చిన తర్వాతే వెళ్లతానని వారితో అన్నది. అలాగే తనను తాకితే ఉద్యోగం పోతుందంటూ అక్కడ ఉన్న సిబ్బందిని ఆమె బెదిరించినట్లు వీడియోలో కనిపిస్తోంది.Analysing the #SwatiMaliwal case through this video:If this video was recorded before the alleged assault, there's no way she could have been assaulted the way she has written in the FIR after this, in presence of so many security staff including a female staff. If this video… pic.twitter.com/RNnmzYkC04— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 17, 2024దీనిపై తాజాగా ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ప్రతిసారిలాగే.. ఈసారి కూడా ఈ రాజకీయ హిట్‌మ్యాన్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడని విమర్శించారు. అసలు విషయం లేకుండా పోస్టులు, వీడియోలను ప్రచారం చేయడం ద్వారా.. ఈ నేరం నుంచి తనను తాను రక్షించుకోవచ్చని భావిస్తున్నారని మండిపడ్డారు. ఒకరిని కొడుతున్న వీడియో ఎవరు తీస్తారు..? ఆ ఇంటి సీసీటీవీ దృశ్యాలను తనిఖీ చేస్తే.. నిజం వెలుగులోకి వస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఆప్ అధినేత ఇప్పటి వరకు బహిరంగంగా స్పందించలేదు. దీంతో కేజ్రీవాల్ మౌనంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.#WATCH | AAP MP Swati Maliwal leaves from Delhi CM Arvind Kejriwal's residence after recreation of May 13 incident by Police pic.twitter.com/8n3K6sAbZ5— ANI (@ANI) May 17, 2024 -
మలీవాల్‌పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహయకుడు దాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మలీవాల్‌పై దాడిని ఆప్ సైతం ధృవీకరించింది. నిందితుడు బిభవ్ కుమార్‌పై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కాగా కేజ్రీవాల్ సొంత ఇంట్లో ఈ దాడి జరగడం గమనార్హంఈ ఘటనపై కేజ్రీవాల్‌ను మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు. దీంతో సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఆయన మౌనం కూడా ఎంతో చెస్తోందని, జైలు నుంచి విడుదలయ్యాక సీఎంగా కంటే గూండాలా వ్యవహరిస్తున్నారని బీజేపీ మండిపడింది. తాజాగా ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ స్పందించారు.తన నివాసంలోనే స్వాతి మలీవాల్‌పై జరిగిన దాడిపై కేజ్రీవాల్ మౌనం వహించడం దిగ్బ్రాంతికి సిగ్గుచేటని అన్నారు. అంతేగాక లక్నోలో నిందితుడైన బిభవ్ కుమార్‌తో సీఎం సిగ్గులేకుండా తిరుగుతున్నాడని ఆరోపించారు. ఇందుకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన ఆమెకు ఈ పరిస్థితి ఎదురుకావడం దారుణమని అన్నారు.‘సొంత నివాసంలోనే పార్టీ ఎంపీపై దాడి జరిగితే.. కేజ్రీవాల్ మాట్లాడకపోవడం షాక్‌కు గురిచేస్తోంది. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పాలి. లక్నో పర్యటనలో సీఎం వెంట నిందితుడు బిభవ్ కూడా ఉన్నాడని నాకు తెలిసింది. ఆమెకు ఎదురైన పరిస్థితి సిగ్గుచేటు. ఫిర్యాదు చేయడానికి రోజుల సమయం పట్టిందంటే.. ఆమెపై ఒత్తిడి ఉందని అనిపిస్తోంది’ అని సీతారామన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.చదవండి: ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు -
మలివాల్ వాంగ్మూలం నమోదు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ ఆరోపించిన ఉదంతంలో పోలీసులు ముందడుగు వేశారు. ఈ విషయంలో ఇంతవరకు స్వాతి పోలీసులకు ఫిర్యాదుచేయలేదు. అయినాసరే పోలీసులే గురువారం స్వయంగా ఆమె ఇంటికి వెళ్లిమరీ ఆమె వాంగ్మూలాన్ని రికార్డుచేశారు. సోమవారం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లినప్పుడు జరిగిన ఘటన వివరాలను ఇద్దరు సభ్యుల ఢిల్లీ పోలీసు బృందానికి స్వాతి వివరించింది. నాలుగున్నర గంటలపాటు అదనపు పోలీసు కమిషనర్ పీఎస్ కుషా్వహా బృందం స్వాతి ఇంట్లో వివరాలు సేకరించింది. వాంగ్మూలం నమోదు పూర్తయిన నేపథ్యంలో బిభవ్‌పై పోలీసులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. సోమవారం దాడి ఘటన జరిగిన వెంటనే స్వాతి సివిల్ లైన్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన దాడి విషయాన్ని చెప్పి వచ్చారుగానీ ఫిర్యాదుచేయలేదు. దీంతో ఇన్నిరోజులైనా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. దీంతో ఈ విషయాన్ని సూమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ శుక్రవారం తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని బిభవ్ కుమార్‌కు సమన్లు జారీచేసింది. కేజ్రీవాల్ మౌనమేల?: బీజేపీ సొంత ఇంట్లో జరిగిన ఘటనపై సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ప్రశ్నించింది. లక్నోలో పత్రికా సమావేశం సందర్భంగా కేజ్రీవాల్‌ను మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు. దీంతో బీజేపీ విమర్శించింది. ‘‘ ఆయన మౌనం కూడా ఎంతో చెప్తోంది. జైలు నుంచి విడుదలయ్యాక సీఎంగా కంటే గూండాలా వ్యవహరిస్తున్నారు’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. బీజేపీ రాజకీయాలు ఆపాలి: స్వాతి దాడి ఉదంతాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని బీజేపీకి స్వాతి మలివాల్ హితవు పలికారు. ‘‘ ఆరోజు నా విషయంలో జరిగింది నిజంగా బాధాకరం. అందుకే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చా. సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. ఇందులో బీజేపీకి ఏం సంబంధం. వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనను రాజకీయంచేయొద్దని బీజేపీ నేతలకు ప్రత్యేకంగా విన్నవిస్తున్నా’’ అని స్వాతి ‘ఎక్స్’లో హిందీలో పోస్ట్‌చేశారు. -
స్వాతి మాలీవాల్ ఎపిసోడ్: బిభవ్ కుమార్‌కు ఎన్డబ్ల్యూసీ సమన్లు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడి చేశారని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఆమె చేసిన ఆరోపణలను ఆ పార్టీ సీనియర్ ఎంపీ సంజయ్ సింగ్ నిజమేనని ధృవీకరించారు. దీంతో ఈ వ్యవహారంపై గురువారం జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్కుమార్కు సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరై.. స్వాతి మాలీవాల్‌పై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సమన్లలో ర్కొంది. ఈ నోటీసులను జాతీయ మహిళా కమిషన్.. సీఎం కేజ్రీవాల్ కార్యాలయానికి పంపించటం గమనార్హం.సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ తనపై తీవ్రంగా దాడి చేశారని ఎంపీ స్వాతిమాలీవాల్ సోషల్ మీడియా పోస్ట్ చేసింది. అయితే ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా సుమోటోగా తీసుకున్నామని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. తనపై దాడి జరిగినట్లు ఎంపీ స్వాతి మాలీవాల్ సోమవారం బయటపెట్టారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. -
ఢిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. 223 మంది మహిళా కమిషన్ ఉద్యోగులపై వేటు
ఢిల్లీ: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్‌లోని 223 మంది ఉద్యోగులను ఎల్జీ వీకే సక్సేనా తొలగించారు. ఈ మేరకు ఎల్జీ గురువారం ఉత్తర్వుల జారీ చేశారు. అమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్.. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగులను నియమించినట్లు ఆరోపణలు రావటంతో ఎల్జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఎల్జీ నిర్ణయంపై స్పందించిన ఎంపీ స్వాతి మలివాల్ తీవ్రంగా ఖండించారు. ‘కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తే.. మొత్తం కమిషన్ మూతపడుతుంది. కమిషన్ ప్యానెల్లో ప్రస్తుతం 90 మంది మాత్రమే ఉన్నారు. అందుతో కేవలం 8 మంది మాత్రమే ప్రభుత్వ సిబ్బంది. మిగిలిన వారంతా మూడే నెలలపాటు పని చేసే.. కాంక్రాక్టు ఉద్యోగులు. ఇలా ఎందుకు చేస్తున్నారు. మహిళా కమిషన్ అస్సలు మూత పడనివ్వను. నన్ను జైలులో పెట్టండి కానీ, మహిళలను హింసించకండి’అని ‘ఎక్స్’ వేదికగా ఉన్నారు.LG साहब ने DCW के सारे कॉंट्रैक्ट स्टाफ को हटाने का एक तुग़लकी फ़रमान जारी किया है। आज महिला आयोग में कुल 90 स्टाफ है जिसमें सिर्फ़ 8 लोग सरकार द्वारा दिये गये हैं, बाक़ी सब 3 - 3 महीने के कॉंट्रैक्ट पे हैं। अगर सब कॉंट्रैक्ट स्टाफ हटा दिया जाएगा, तो महिला आयोग पे ताला लग जाएगा।…— Swati Maliwal (@SwatiJaiHind) May 2, 2024ఢిల్లీ మహిళా కమిషన్ చట్టం ప్రకారం ప్యానెల్లో 40 ఉద్యోగాలు, కొత్తగా కొల్పించిన 223 ఉద్యోగ పోస్టులకు ఎల్జీ అనుమంతి తీసుకోలేదని జారీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగులను నియమించే అధికారం కమిషన్‌కు లేదని తెలిపారు. స్వాతి మలివాల్ ఆప్ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కాకముందు 9 ఏళ్లు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్‌గా పనిచేవారు. ప్రస్తుతం ప్యానెల్ చైర్మన్ పదవి ఖాళీ ఉంది. తాజా చర్యలతో మరోసారి ఆప్ ప్రభుత్వానికి, ఎల్జీకి మరోసారి వివాదం ముదరనుందని ప్రచారం జరుగుతోంది. -
ఆప్ తరఫున రాజ్యసభకు మలివాల్ సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలకు మళ్లీ అవకాశం
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్‌ను రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) ప్రకటించింది. అదేవిధంగా, పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలకు మరో విడత ఎగువసభ సభ్యులుగా కొనసాగించాలని నిర్ణయించింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ మేరకు ప్రకటించింది. హరియాణా రాజకీయాల్లో కీలకంగా ఉండాలన్న రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ గుప్తా అభిప్రాయం మేరకు ఆయన స్థానంలో స్వాతి మలివాల్‌కు మొదటిసారిగా అవకాశం కల్పిస్తున్నట్లు ఆప్ పేర్కొంది. ఆమె 2015లో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. పార్టీ నిర్ణయం మేరకు శుక్రవారం సాయంత్రం డీసీడబ్ల్యూ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఆప్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన వినతి మేరకు శుక్రవారం ప్రత్యేక కోర్టు..ఈ నెల 19న జరిగే రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు సంజయ్ సింగ్‌కు వెసులుబాటు కల్పించాలని జైలు అధికారులకు ఆదేశాలిచ్చింది. -
రాజ్యసభకు స్వాతి మలివాల్!
ఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్‌ని రాజ్యసభ అభ్యర్థిగా ఆప్ నామినేట్ చేసింది. సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలను పార్లమెంటు ఎగువ సభకు ఆప్ మరోసారి నామినేట్ చేసింది. ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఈరోజు నామినేషన్లను ప్రకటించింది. స్వాతి మలివాల్ మొదటిసారిగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలను రెండవసారి రాజ్యసభ సభ్యులుగా కొనసాగించాలని ఆప్ నిర్ణయించింది. సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాల ప్రస్తుత పదవీకాలం జనవరి 27, 2024తో ముగియనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సంజయ్ గుప్తా జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఆప్ అభ్యర్థన మేరకు సంజయ్ సింగ్ నామినేషన్ పత్రాలపై సంతకం చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. రాజ్యసభ సభ్యునిగా పదవీ కాలం ముగుస్తున్న సుశీల్ కుమార్ గుప్తా స్థానంలో స్వాతి మాలీవాల్‌కు అవకాశం కల్పించనున్నారు. ఈ ఏడాది జరగనున్న హర్యానా ఎన్నికల్లో ఆప్ పోటీ చేయాలనుకుంటోంది. సుశీల్ కుమార్ గుప్తాకు హర్యానా బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఎగువ సభలో రాఘవ్ చద్దా, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సహా ఆప్‌కి ప్రస్తుతం 10 మంది సభ్యులు ఉన్నారు. పంజాబ్‌లో విజయం తర్వాత రాజ్యసభలో ఆప్ బలం గణనీయంగా పెరిగింది. అటు.. ఢిల్లీలోని మూడు రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు జనవరి 3న ప్రారంభమయ్యాయి. జనవరి 19న పోలింగ్ జరుగుతుంది. ఢిల్లీ అసెంబ్లీలోని 70 సీట్లలో ఆప్‌కి 62 స్థానాలు ఉన్నందున అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ సర్కార్‌కు షాక్.. మొహల్లా క్లినిక్‌లపై సీబీఐ దర్యాప్తు -
Wrestlers Protest: ఆమె మైనర్ కాదంటూ వీడియో! మండిపడ్డ స్వాతి.. వెంటనే
Wrestlers’ protest against Brij Bhushan: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో రాజధాని ఢిల్లీ వేదికగా మహిళా రెజ్లర్లు, వారికి మద్దతుగా బజ్రంగ్ పునియా తదితరులు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. కాగా బ్రిజ్ భూషణ్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. వీరిలో ఓ మైనర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తాను ఆమె అంకుల్‌నంటూ వీడియో విడుదల చేశాడు. ఆమె మైనర్ కాదంటూ వీడియో అందరూ అనుకుంటున్నట్లు సదరు రెజ్లర్ మైనర్ కాదని, ఆమె వయసు దాదాపు 20 ఏళ్లకు పైనే అంటూ ఆధారాలుగా కొన్ని డాక్యుమెంట్లు చూపించాడు. ఈ విషయంపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ సదరు వ్యక్తిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అతడిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మండిపడ్డ స్వాతి మలివాల్.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఈ మేరకు.. ‘‘బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా కేసు పెట్టిన మైనర్‌కు అంకుల్‌నంటూ ఓ వ్యక్తి మీడియా ముందు ఆమె ఐడెంటీని బయటపెట్టాడు. చట్టవిరుద్ధ చర్యకు పాల్పడిన అతడిపై పోక్సో చట్టప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులకు నేను నోటీస్ జారీ చేస్తున్నాను. ఎందుకంటే.. ఇప్పుడు బ్రిజ్ భూషణ్ బయటే స్వేచ్ఛగా తిరుగుతున్నారు.. కాబట్టి ఆయన బాధితురాలిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది’’ అని స్వాతి మలివాల్ బుధవారం ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ఈ విషయంలో సింగ్ ప్రమేయం కూడా ఉందేమో విచారించి.. ఆయనను అరెస్టు చేయాల్సిందిగా మహిళా కమిషన్ తరఫున డిమాండ్ చేశారు. రెజ్లర్ల పట్ల పోలీసుల చర్యపై ఆగ్రహం కాగా భారత రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా తదితరులు గత కొన్ని రోజులుగా బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. సాధారణ ప్రజలు సహా కొంతమంది క్రీడాకారులు వారికి మద్దతుగా సంఘీభావం ప్రకటించగా.. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లపై పోలీసులు కఠినంగా ప్రవర్తించారు. దీంతో అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో తాము సాధించిన పతకాలు గంగలో నిమజ్జనం చేస్తామంటూ వాళ్లు హరిద్వార్ బయల్దేరగా.. చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఆ ప్రయత్నం విరమించారు. ఇదిలా ఉంటే.. భారత రెజ్లర్లపై పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తూ ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య విచారం వ్యక్తం చేసింది. భారత్‌లో జరుగుతున్న పరిణామాలను సునిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. చదవండి: WTCFinal2023: ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన ఆ ఐదుగురు! ఫోటోలు వైరల్ WTC: నెట్స్‌లో శ్రమిస్తున్న యశస్వి.. దగ్గరకొచ్చి సలహాలు ఇచ్చిన కోహ్లి! వీడియో -
మా నాన్న లైంగికంగా వేధించాడు.. స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు..
సాక్షి,న్యూఢిల్లీ: కన్నతండ్రే తనను బాల్యంలో లైంగికంగా వేధించాడని ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ ఇటీవల చెప్పడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ కూడా ఇలాంటి విషయాన్నె వెల్లడించడం షాక్‌కు గురిచేస్తోంది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన స్వాతి మలివాల్.. కన్నతండ్రే తనను బాల్యంలో లైంగికంగా వేధించాడని చెప్పారు. అతని భయానికి బెడ్ కింద దాచుకునేదానినని దిగ్భ్రాంతికర విషయాన్ని వెల్లడించారు. 'నా చిన్నప్పుడు తండ్రే నన్ను లైంగికంగా వేధించాడు. నన్ను బాగా కొట్టేవాడు. భయంతో వెల్లి మంచం కింద దాచుకునేదాన్ని. జుట్టుపట్టుకుని నా తలను గోడకేసి బాదేవాడు. దీంతో తల పగిలి రక్తం వచ్చేది. ఓ వ్యక్తిపై ఇలాంటి దాడులు జరిగినప్పుడే అవతలి వాళ్ల బాధ బాగా అర్థం అవుతుంది. ఈ ఆగ్రహ జ్వాల మొత్తం వ్యవస్థనే షేక్ చేస్తుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మహిళలకు ఎలా న్యాయం చేయాలి, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారికి గుణపాఠం ఎలా చెప్పాలి అని ప్రతి రోజు ఆలోచించే దాన్ని.' అని స్వాతి మలివాల్ పేర్కొన్నారు. తన నాలుగో తరగతి వరకు తండ్రితోనే ఉన్నానని, చాలా సార్లు తనను వేధించాడని చెప్పారు. నటి ఖుష్బూ సుందర్ కూడా ఇటీవలే తన తండ్రి లైంగికంగా వేధించాడని చెప్పడం సంచలనం సృష్టించింది. తన 8 ఏళ్ల వయసులోనే ఇది జరిగిందని, అదే తన జీవితంలో అత్యంత కఠినమైన పరిస్థితి అని పేర్కొంది. 15 ఏళ్లు వచ్చాక తన తండ్రిని ఎదిరించినట్లు చెప్పింది. అప్పుడే అతను ఇళ్లు వదిలి వెళ్లిపోయాడని వివరించింది. చదవండి: నేను వెళ్లిపోతున్నా ఎప్పటికీ తిరిగిరాను అని మెసేజ్.. లవర్‌తో కలిసి కొండపై నుంచి దూకి.. -
సూర్యకుమార్ యాదవ్ తరహా విధ్వంసం.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న వీడియో
క్రికెట్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఈ వీడియోలో రాజస్థాన్‌కు చెందిన ముమల్ మెహర్ అనే ఓ బాలిక.. టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తరహా విధ్వంకర షాట్లతో విరుచుకుపడుతుంది. ముమల్ అచ్చం సూర్యకుమార్‌లా 360 డిగ్రీస్‌లో షాట్లు ఆడుతుంది. Kal hi toh auction hua.. aur aaj match bhi shuru? Kya baat hai. Really enjoyed your batting. 🏏👧🏼#CricketTwitter #WPL @wplt20 (Via Whatsapp) pic.twitter.com/pxWcj1I6t6 — Sachin Tendulkar (@sachin_rt) February 14, 2023 బౌలింగ్ చేస్తున్నది అబ్బాయి అయినా ఏమాత్రం బెరుకు లేకుండా ప్రొఫెషనల్‌లా నలుదిక్కులా షాట్లు ఆడి అందరి మనసులను దోచుకుంటుంది. ముమల్ విన్యాసాలకు సంబంధించిన ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. లేడీ స్కై అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియోను బట్టి చూస్తే రాజస్థాన్‌లో ఏదో మారుమూల ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణగా తెలుస్తోంది. ముమల్ విన్యాసాలకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం ఫిదా అయ్యాడు. సచిన్ ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ.. నిన్ననే కదా వేలం అయ్యింది.. అప్పుడే విధ్వంసం మొదలైందా..? అంటూ కామెంట్ చేశాడు. అత్యద్భుతం.. ముమల్ బ్యాటింగ్ విన్యాసాలను నిజంగా ఎంజాయ్ చేశానంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. ये वीडियो राजस्थान की बताई जा रही है। जिस तरह ये बेटी शॉट्स लगा रही है इसकी बैटिंग में सूर्यकुमार यादव की झलक है। ऐसे टैलेंट को प्रमोट कर अच्छी ट्रेनिंग मिलनी चाहिए। @ashokgehlot51 जी, इस बच्ची के टैलेंट को सही मंच दिलाएँ जिससे ये एक दिन देश की जर्सी पहने। pic.twitter.com/vd1TkhVeVt — Swati Maliwal (@SwatiJaiHind) February 13, 2023 ముమల్ విన్యాసాలకు సంబంధించిన వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ సైతం ట్విటర్లో షేర్ చేశారు. భవిష్యత్తులో ముమల్ టీమిండియా జెర్సీ ధరించే స్థాయికి ఎదిగేందుకు తోడ్పడాలని ఆమె రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్‌ను అభ్యర్ధించారు. మొత్తంగా ముమల్ వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇదిలా ఉంటే, ముంబై వేదికగా నిన్న (ఫిబ్రవరి 13) తొట్టతొలి మహిళల ఐపీఎల్ వేలం జరిగిన విషయం తెలిసిందే. మెగా వేలంలో చాలామంది భారత మహిళా క్రికెటర్లపై కనకవర్షం కురిసింది. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3.4 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకోగా.. దీప్తి శర్మ (యూపీ వారియర్జ్, 2.6 కోట్లు), జెమీమా రోడ్రిగెజ్ (ఢిల్లీ క్యాపిటల్స్, 2.2 కోట్లు), షెఫాలీ వర్మ (ఢిల్లీ క్యాపిటల్స్, 2 కోట్లు), రిచా ఘోష్ (ఆర్సీబీ, 1.9 కోట్లు), పూజా వస్త్రాకర్ (ముంబై ఇండియన్స్, 1.9 కోట్లు), టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (ముంబై ఇండియన్స్, 1.8 కోట్లు), రేణుకా సింగ్ (ఆర్సీబీ, 1.5 కోట్లు), యస్తికా భాటియా (ముంబై ఇండియన్స్, 1.5 కోట్లు) భారీ ధర పలికిన వారిలో ఉన్నారు. -
దేవుడే నన్ను రక్షించాడు: లైంగిక వేధింపులపై స్వాతి మలివాల్
ఢిల్లీ: ప్రముఖ ఉద్యమకారిణి, మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ భయానక అనుభవం ఎదుర్కొన్నారు. ఓ యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన చంపిన ఘటన తర్వాత.. ఢిల్లీలో మహిళల భద్రతను పర్యవేక్షించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు ఆమె. అయితే.. ఈ ప్రయత్నంలో కారులో తప్పతాగి వచ్చిన ఓ వ్యక్తి నడిరోడ్డుపై ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు ప్రతిఘటించడంతో కొద్దిదూరం అతని కారుతో సహా లాక్కెల్లాడు. ఈ ఘటన నుంచి ఆమె సురక్షితంగా బయటపడగా.. ఆమె ఆ భయానక అనుభవాన్ని పంచుకున్నారు. అంజలి సింగ్ ఘటన తర్వాత.. ఢిల్లీలో మహిళల భద్రతపై తన బృందంతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు డీసీడబ్ల్యూ చైర్పర్సన్ స్వాతి మలివాల్. ఈ క్రమంలో.. బుధవారం అర్ధరాత్రి మూడు గంటల తర్వాత ఎయిమ్స్ వద్ద కాలిబాటలో ఆమె నిల్చున్నారు. అంతలో ఓ బాలెనో కారులో దూసుకొచ్చిన వ్యక్తి.. ఆమెను చూసి ఆగిపోయాడు. కారులో ఎక్కమంటూ ఆమెను బలవంతం చేయబోయాడు. ఆమె నిరాకరించడంతో అక్కడి నుంచి కొంతదూరం వెళ్లి.. యూటర్న్ తీసుకుని మళ్లీ వచ్చాడు. మరోసారి కారు ఎక్కమంటూ ఆమెను కోరగా.. ఆమె అతన్ని కిటీకి నుంచి బయటకు లాగే యత్నం చేసింది. అయితే.. కిటీకిని క్లోజ్ చేయడంతో ఆమె చెయ్యి అందులో ఇరుకుపోయింది. అలా.. 15 మీటర్లపాటు కారు దూసుకెళ్లగా, ఆమె కిటికీలోంచి చెయ్యిని విడిపించుకుంది. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న టీం ఆమెకు సాయంగా వచ్చారు. ఆపై సదరు వ్యక్తి మీద ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవుడే తనను రక్షించాడని, ఢిల్లీలో ఒక మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కే ఇలా జరిగితే.. పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని ఆమె ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిని నలభై ఏడేళ్ల హరీశ్‌చంద్రగా గుర్తించి.. కారును సీజ్ చేశారు. कल देर रात मैं दिल्ली में महिला सुरक्षा के हालात Inspect कर रही थी। एक गाड़ी वाले ने नशे की हालत में मुझसे छेड़छाड़ की और जब मैंने उसे पकड़ा तो गाड़ी के शीशे में मेरा हाथ बंद कर मुझे घसीटा। भगवान ने जान बचाई। यदि दिल्ली में महिला आयोग की अध्यक्ष सुरक्षित नहीं, तो हाल सोच लीजिए। — Swati Maliwal (@SwatiJaiHind) January 19, 2023 కొత్త సంవత్సరం రోజున.. స్నేహితురాలితో స్కూటీ మీద వస్తున్న అంజలి సింగ్(20)ను ఢీ కొట్టారు దుండగులు. ఆపై సుల్తాన్‌పురి నుంచి కంఝావాలా మధ్య పదమూడు కిలోమీటర్లపాటు ఆమె శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళ్లారు. ఈ ఘోర ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోగా.. దేశవ్యాప్తంగా ఈ హిట్ అండ్ రన్ కేసు చర్చనీయాంశంగా మారింది. -
అంజలి కారు కింద పడితే చూసి పారిపోయావ్.. నువ్వేం ఫ్రెండ్‌వి?
న్యూఢిల్లీ: ఢిల్లీలో యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయ తెలిసిందే. స్కూటీపై వెళ్తున్న అంజలిని మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో ఢొకొట్టి ఈడ్చుకెళ్లారు. అయితే ఈ సమయంలో ఆమె స్నేహితురాలు నిధి అక్కడే ఉన్నారు. అంజలి కారు కింద నలిగిపోవడం చూసి కూడా ఆమె సాయం చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అక్కడి నుంచి పారిపోయింది. పైగా అంజలిదే తప్పు అని మాట్లాడింది. నిధి తీరుపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ మండిపడ్డారు. చనిపోయిన ఫ్రెండ్ గురించి ఇలా మాట్లాడటమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ కళ్ల ముందే అంజలి కారు కింద పడి నలిగిపోతుంటే చూసి పారిపోయావ్.. నువ్వేం ఫ్రెండ్‌వి అని ఫైర్ అయ్యారు. విపత్కర పరిస్థితిలో స్నేహితురాలిని విడిచిపెట్టి వెళ్లిన నీ లాంటి వాళ్లను ఎలా నమ్మాలి అని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఓ వీడియో విడుదల చేశారు. DCW chief @SwatiJaiHind ‘s byte on Anjali’s friend !! pic.twitter.com/0XA42DTOnG — Vandana Singh (@VandanaSsingh) January 4, 2023 జనవరి 1న అంజలి, నిధి స్కూటీపై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. కారు చక్రాల కింద అంజలి ఇరుక్కుంది. తాగిన మత్తులో ఉన్న ఐదుగురు యువకులు ఈ విషయాన్ని గమనించకుండా కారును కిలోమీటర్ల మేర తిప్పారు. దీంతో ఆమె దారుణంగా చనిపోయింది. కంఝవాల ప్రాంతంలో ఉదయం అంజలి మృతదేహం నగ్నంగా లభ్యమవ్వడం కలకలం రేపింది. ఈ ఘటనలో నిధికి ఎలాంటి గాయాలు కాలేదు. చదవండి: ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన.. యువతిని బలవంతంగా కారులోకి.. -
ఢిల్లీ యువతి ఘటన.. హోటల్ ఓనర్‌పై మహిళా కమిషన్ సీరియస్..
న్యూఢిల్లీ: ఢిల్లీలో యువతిని కారుతో ఈడ్చికెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. జనవరి 31 అర్ధరాత్రి దాటిన తర్వాత న్యూ ఇయర్ రోజున ఈఘటన జరిగింది. అయితే అంతకుముందు ఏం జరిగిందో ఓ హోటల్ యజమాని వివరించాడు. ఈ ఘటనలో చనిపోయిన యువతి(అంజలి) తన స్నేహితురాలు(నిధి)తో కలిసి హోటల్‌కు వచ్చిందని పేర్కొన్నాడు. ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారని, ఒకరితో ఒకరు గొడవపడి హోటల్లో రచ్చ చేశారని చెప్పాడు. ఇది చూసి ఇద్దరినీ బయటకు గెంటేసినట్లు వెల్లడించాడు. హోటల్ ఓనర్ వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ సీరియస్ అయ్యారు. బాధితురాలిపై నిందలు మోపడం సరికాదన్నారు. అర్ధరాత్రి సమయంలో అమ్మాయిలను బయటకు ఎలా గెంటేస్తారని ప్రశ్నించారు. ఇద్దరు యువతులు మద్యం మత్తులో ఉన్నారనేందుకు ఆధారాలేంటని? అడిగారు. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువతులను హోటల్ నుంచి గెంటేయడం కంటే.. పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందని స్వాతి అన్నారు. అలా చేసి ఉంటే యువతి చనిపోయి ఉండేది కాదన్నారు. హోటల్ నుంచి వాళ్లను బయటకు పంపడం వల్లే ప్రమాదంలో యువతి ప్రాణాలు కోల్పోయిందన్నారు. ఈమేరకు ఆమె ట్వీట్ చేశారు. सुबह से होटल मालिक के घटिया बयान TV पे दिखाए जा रहे हैं, वो कह रहा है लड़कियों ने शराब पी थी, झगड़ा कर रही थीं और मैंने उन्हें बाहर निकाल दिया। अगर लड़कियाँ नशा करके झगड़ा कर रही तो पुलिस बुलाते, देर रात में उन्हें होटल से क्यूँ निकाला? नशे का क्या सबूत है? STOP VICTIM SHAMING! — Swati Maliwal (@SwatiJaiHind) January 3, 2023 జనవరి 1న ఉదయం 1:30 గంటల సమయంలో ఇద్దరు యువతులు హోటల్ నుంచి బయటకు వచ్చినట్లు సీసీటీవీ రికార్డులో ఉంది. ఆ తర్వాత కాసేపటికే ఆ యువతి స్కూటీని కారు ఢీకొట్టింది. చక్రాల మధ్య ఇరుక్కున్న ఆమెను గుర్తించకుండా మద్యం మత్తులో ఉన్న ఐదుగురు యువకులు కారును కిలోమీటర్ల మేర తిప్పారు. దీంతో యువతి చనిపోయింది. తెల్లవారుజామున ఆమె మృతదేహం నగ్నంగా రోడ్డుపై కన్పించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. అర్థాంతరంగా నిలిపివేత.. -
మరో ‘నిర్భయ’ కాదు.. అంతా ఉత్తుత్తి డ్రామా!
మరో నిర్భయ ఉదంతంగా.. సంచలనం సృష్టించిన ఘజియాబాద్ గ్యాంగ్ రేప్ కేసు ఉత్తదేనని పోలీసులు తేల్చారు. ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ట్వీట్‌తో ఈ కేసు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. 36 ఏళ్ల సదరు మహిళ ఉద్దేశపూర్వకంగానే సామూహిక అత్యాచార నాటకం ఆడినట్లు పోలీసులు ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్-ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో రెండు రోజుల కిందట వెలుగు చూసిన ఉదంతం.. దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. మహిళను అపహరించిన ఐదుగురు.. అత్యాచారం చేసి శారీరకంగా హింసించారనే ఉదంతం ప్రకంపనలు పుట్టించింది. కాళ్లు చేతులు కట్టేసి.. జననాంగాల్లో ఇనుపరాడ్లు పెట్టి ఓ గోనె సంచిలో కుక్కేసి ఢిల్లీ-ఘజియాబాద్ రూట్లోని ఆశ్రమ్ రోడ్డు దగ్గర పడేశారని, నిస్సహాయ స్థితిలో పడి ఉన్న ఆమెను గుర్తించి బుధవారం ఓ ఆస్పత్రిలో చేర్పించారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. అయితే.. పోలీసుల అదుపులో నిందితులు అయితే ఆమెతో వాళ్లకు ఆస్తి తగాదాలు ఉండడంతో.. ఈ కేసును ఆ కోణంలోనే విచారణ చేపట్టారు. ఈలోపు ఆమెకు పరీక్షలు నిర్వహించిన ఢిల్లీ జీటీబీ ఆస్పత్రి ఆమెకు అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని తేల్చి చెప్పింది. దీంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. పైగా ఆమె ఆచూకీ లభ్యమైన తర్వాత రెండు ప్రభుత్వాసుపత్రులకు తీసుకెళ్లగా.. వైద్య పరీక్షలకు ఆమె నిరాకరించడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. బాధితురాలిగా చెప్పుకుంటున్న యువతి.. నాటకం ఆడిందని చెప్తున్న పోలీసులు చివరికి ఆమె మొబైల్ సిగ్నల్‌ను ట్రేస్ చేసి.. అసలు విషయాన్ని తేల్చేశారు పోలీసులు. స్నేహితురాలి బర్త్ డే పార్టీ ముగించుకుని ఇంటికి వస్తున్న తరుణంలో.. కారులో వచ్చిన నిందితులు తనను అపహరించుకు పోయి అఘాయిత్యానికి పాల్పడ్డారనేది ఆమె ఫిర్యాదు. అయితే.. ఆ సమయంలో ఆమెతో పాటు ఉన్న ఓ స్నేహితుడు.. అదే స్పాట్లో ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో.. అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. అంతేకాదు.. బాధితురాలిగా చెప్పుకుంటున్న మహిళ నుంచి ఆ స్నేహితుడికి పేటీఎం ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యిందని, ఈ వ్యవహారాన్ని అత్యాచారం కోణంలో ప్రచారం చేయించేందుకే అతనికి ఆమె డబ్బు ఇచ్చిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. दिल्ली की लड़की से 5 लोगों ने किया गैंगरेप. उसके प्राइवेट पार्ट्स में रोड घुसा दी. लहूलुहान लड़की को बोरे में बांध कर सड़क पर फेंक दिया.@GhaziabadPolice के SSP को @DCWDelhi चेयरपर्सन @SwatiJaiHind ने दिया नोटिस दिया. वहशी दरिंदों के खिलाफ एक्शन हो @SandhyaTimes4u @NBTDilli pic.twitter.com/CMq4N1PMHc — सूरज सिंह/Suraj Singh 🇮🇳 (@SurajSolanki) October 19, 2022 ఆ ఐదుగురితో ఆస్తి తగాదాలు ఉండడంతోనే ఆమె అలా నాటకం ఆడిందని యూపీ రీజినల్ పోలీస్ చీఫ్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. తనపై రెండు రోజులు సామూహిక అత్యాచారం జరిగిందని చెప్తున్న టైంలో.. ఆమె తన స్నేహితులతో రిసార్ట్‌లో గడిపిందట. ఆ తర్వాత వాళ్ల సహకారంతోనే గ్యాంగ్ రేప్ డ్రామా ఆడిందని పోలీసులు దర్యాప్తులో తేల్చేశారు. పోలీసుల ప్రకటనపై బాధితురాలి నుంచిగానీ.. మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ నుంచిగానీ ఎటువంటి స్పందన రాలేదింకా. ఇదీ చదవండి: 3 నెలల కిందటే ప్రేమ పెళ్లి.. అఘాయిత్యానికి పాల్పడ్డ జంట -
లేడీస్ హాస్టల్లో యువతిపై వికృత చేష్టలు..
ఢిల్లీ: మరో షాకింగ్ ఘటన సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. తాగిన మత్తులో లేడీస్ హాస్టల్లోకి జొరబడి.. ఓ యువతిపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు అదే హాస్టల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు. ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజీలో రికార్డుకాగా.. విషయం బయలకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఢిల్లీ కరోల్ బాగ్ ఏరియాలో ఉన్న ఓ లేడీ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ కారిడార్లోంచి వెళ్తున్న యువతులు.. మద్యం మత్తులో లోపలికి వచ్చిన సెక్యూరిటీ గార్డును చూసి ఒక్కసారిగా వెనక్కి పరుగులు తీశారు. ఇంతలో ఓ యువతిని దొరకబుచ్చుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దాడికి సైతం పాల్పడ్డాడు సెక్యూరిటీ గార్డు. ఈ ఘటనపై హాస్టల్ ఓనర్ ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజీ ద్వారా ఢిల్లీ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ దృష్టికి చేరడంతో ఆమె ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో డీసీడబ్ల్యూ రంగంలోకి దిగి.. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. करोल बाग में चल रहे एक PG hostel में सिक्योरिटी गार्ड ने नशे की हालत में लड़कियों के साथ छेड़खानी और मारपीट की. हमें ट्विटर के जरिए शिकायत मिली, मामले की गंभीरता को देखते हुए पुलिस को नोटिस जारी किया है. मामले में कड़ी कार्यवाही सुनिश्चित करेंगे। pic.twitter.com/6smwjfqEJB — Swati Maliwal (@SwatiJaiHind) August 16, 2022 వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. నిందితుడిని అరెస్ట్ చేయాలని స్వాతి మలివాల్, ఢిల్లీ పోలీసులకు కోరారు. అంతేకాదు గురువారం సాయంత్రం కల్లా ఘటనపై పూర్తి నివేదికను అందించాలని గడువు విధించారు. అయితే బాధితురాలు ఫిర్యాదుకు ముందుకు రాకపోవడంతో.. న్యాయ సలహా మేరకు వీడియో ఆధారంతో ఈ ఘటనను సుమోటాగా స్వీకరించామని, ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఢిల్లీ సెంట్రల్ డిస్ట్రిక్ డీసీపీ శ్వేతా చౌహాన్ వెల్లడించారు. Since the complainant is against giving a statement, legal opinion was taken&as per legal opinion & in light of video footage, FIR being registered suo motto by police: DCP Central Dist, Shweta Chauhan on a security guard molesting & manhandling girls at a PG hostel in Karol Bagh pic.twitter.com/GdzvVjnwZQ — ANI (@ANI) August 17, 2022 ఇదీ చదవండి: ఇది రూ. 500 మర్డర్!! తల నరికి.. -
దయనీయం: 19 మంది వృద్ధులను..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వృద్ధాశ్రమం నడుపుతున్న ఓ ఎన్జీవో నిర్వాకానికి సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. 19 మంది వృద్ధులను ఓ గదిలో బంధించి.. వారిని తీవ్రంగా కొట్టిన తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు.. పశ్చిమ ఢిల్లీలోని నంగ్లోయిలో ఓ ఎన్జీవో వృద్ధాశ్రమం నిర్వహిస్తోంది. అయితే అక్కడ సరైన సౌకర్యాలు లేవని, వృద్ధులు దయనీయమైన జీవితం గడుపుతున్నారని సంబంధిత మంత్రిత్వ శాఖకు సమాచారం అందింది.(అమానుషం: పోలీసుల ముందే పాశవిక దాడి!) ఈ నేపథ్యంలో ఢిల్లీ స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతం, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఎన్జీవో సభ్యులు వృద్ధులను ఓ చిన్న గదిలో బంధించి, హింసించినట్లు గుర్తించారు. అదే విధంగా కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కనీస నిబంధనలు పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో ఉంచినట్లు తేలింది. దీంతో వెంటనే వాళ్లను అక్కడి నుంచి మరో చోటికి తరలించారు. ఇక ఈ అమానవీయ ఘటనపై తీవ్రంగా స్పందించిన మంత్రి గౌతం తక్షణ విచారణకు ఆదేశించారు. ఎన్జీవో నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సోషల్ మీడియాలో టన్నుల కొద్దీ హింస
న్యూ ఢిల్లీ: నేరాలు కొత్తరూపం ఎత్తాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అవి మరింత వికృతంగా మారాయి. ఫొటోలు మార్ఫింగ్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి క్రూర నేరానికి పాల్పడటం, నిస్సిగ్గుగా గ్రూపుల్లో అమ్మాయిని ఎలా అత్యాచారం చేయాలని మాట్లాడుకోవడం వీటికి పరాకాష్ట. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'బాయ్స్ లాకర్ రూమ్' గ్రూపులో జరిగిన నీచ చేష్టలివి. ఒక్క బాయ్స్ లాకర్ రూమ్ గ్రూపు మాత్రమే కాదు, ఇంకా తెలీని, వెలుగు చూడని ఇలాంటి క్రూర చేష్టలు ఎన్నెన్నో. వీటన్నింటికి సోషల్ మీడియా వేదికగా మారడాన్ని సుమోటోగా తీసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ గురువారం విచారణ చేపట్టింది. ('బాయ్స్ లాకర్ రూమ్'లో కొత్త ట్విస్ట్) అసభ్య వీడియోలకు, విద్వేషపూరిత చర్యలకు, సమస్మాత్మక కంటెంట్లకు సోషల్ మీడియా ప్రధాన కేంద్రంగా మారిందని అభిప్రాయపడింది. ఇవి నానాటికీ పెరిగిపోతున్నాయని పేర్కొంది. వీటిని ఎలా నిలువరిస్తాలో తెలియజేస్తూ.. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మే 25లోగా నివేదిక అందజేయాలని ఆదేశించింది. దీని గురించి మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో హింసను, వేధింపులను ప్రధానంగా చిత్రీకరిస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా మహిళలు, పిల్లలే బాధితులుగా ఉంటున్నారు. గత కొద్ది రోజులుగా ఇలాంటి ప్రమాదకర అంశాలు టన్నుల కొద్దీ వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి పోస్టులను నియంత్రించడం కష్టసాధ్యమైన పని. ఎవరైనా హింసను ప్రేరేపించేవిధంగా వీడియోలు పోస్ట్ చేస్తే వారిని తక్షణమే వారిని ఆ సోషల్ మీడియా యాప్ నుంచి నిషేధిస్తామని హెచ్చరించారు. (ఆ కమిటీతో సోషల్ మీడియా గాడిన పడేనా..?) -
‘బాయ్స్ లాక్ రూం’పై పోలీసుల ట్వీట్
ముంబై: బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడాలంటూ ఇతరులను రెచ్చగొట్టేలా కొంతమంది యువకులు ‘బాయ్స్ లాకర్ రూం’ పేరిట గ్రూప్‌లో సంభాషించిన ఓ ఆడియో ఇటీవల వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటికే ఆ గ్రూప్ సభ్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించిన విషయం తెలిసిందే. సదరు యువకుల చర్యను ఖండిస్తూ ముంబై పోలీస్ ఓ సందేశం ఇచ్చారు. అంతేగాక అమ్మాయిలను మానసికంగా, లైంగికంగా వేధించే విధంగా వారి సంభాషణ ఉండటంతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘బాయ్స్ లాక్ ఎర్రర్’?.. ఇక్కడ మహిళలను అగౌరవ పరిచే స్థలం లేదు" అంటూ ట్విటర్లో షేర్ చేశారు. దీనికి ‘‘పురుషుడు ఎప్పటికీ పురుషుడే. వీరిని ఎప్పటికీ క్షమించరాదు. ఇక ముందు కూడా ఇలాంటి వారు రాకుండా ఉండాలంటే వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. దీంతో వారిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. (పోలీసుల అదుపులో ‘బాయ్స్ లాకర్ రూం’ సభ్యుడు) Boys will be boys - never an acceptable excuse earlier, will never be one ever after #StopThemYoung pic.twitter.com/sJx7nFOy4P — Mumbai Police (@MumbaiPolice) May 4, 2020 కాగా ఆ బాలుర చర్యను వ్యతిరేకిస్తూ మహిళలకు మద్దతుగా నిలిచిన ముంబై పోలీసులపై వివిధ రకాలుగా తమ స్పందనలను తెలుపుతూ నెటిజన్లు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక ఢిల్లీ మహిళా సంఘం చీఫ్ కమిషనర్ స్వాతి మాలివాల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఢిల్లీ పోలీసులకు మే 4న నోటిసులు జారీ చేస్తూ.. మే 8 నాటికి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ నోటిసులో ‘‘బాయ్స్ లాకర్ రూం’’ అనే పేరుతో కొంతమంది పాఠశాల బాలురు మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడాలని రెచ్చగొడుతూ చట్ట విరుద్దమైన చర్యలకు పాల్పడ్డారు. వీరిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె నోటీసులో పేర్కొన్నారు. (అశ్లీల ఫొటోలు షేర్ చేసి.. విపరీత వ్యాఖ్యలు) -
ఢిల్లీ పోలీసులపై మాలివాల్ అసంతృప్తి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా సంఘం చీఫ్ కమిషనర్ స్వాతి మాలివాల్ బుధవారం ఢిల్లీ అధికారులను కలిశారు. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసాకాండ వల్ల ఒత్తిడికి లోనవుతున్న బాధిత మహిళల నుంచి తమ ప్యానల్‌కు ముకుమ్ముడిగా ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులకు తెలిపారు. అదే విధంగా స్పెషల్ పోలీసు కమిషనర్(శాంతి భద్రతల) అధికారి ఎస్ఎన్ శ్రీవాస్తవను కూడా డీసీపీ కార్యాలయంలో కలిశారు. ఈ క్రమంలో కరావల్ నగర్, దయల్పూర్, భజన్‌పురా, గోకుల్‌పురి ఇతర ప్రాంతాల మహిళల నుంచి వందల్లో ఫిర్యాదులు వస్తున్నాయని ఆయనకు వెల్లడించారు. సీఏఏ అల్లర్లు : సీబీఎస్ఈ పరీక్ష వాయిదా ఢిల్లీ పోలీస్ చీఫ్‌గా ఎస్ఎన్ శ్రీవాస్తవ ఈ సందర్బంగా మాలివాల్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘మా కమిషన్‌కు పలు ప్రాంతాల మహిళలు తరచూ 181 హెల్స్ లైన్ ద్వారా నిరంతరం ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులను ఢిల్లీ పోలీసులకు పంపిస్తున్నాము. కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకే సీలాంపూర్‌లో ఉన్నత పోలీసు అధికారులను కలిసి విషయం వివరించాము’ అని చెప్పారు. అంతేగాక పోలీసుల తీరుపై అసంతృప్తి చెందిన మాలివాల్.. తన కమిషన్ సభ్యులతో కలిసి ఘటన స్థలానికి వెళ్లానని, అక్కడ అల్లర్ల వల్ల పరిస్థితులు తీవ్రంగా మారాయని తెలిపారు. ఇక ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో తాను సీనియర్ పోలీసు అధికారులను కలవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల అధికారి ఎస్ఎన్ శ్రీవాస్తవను కలిసి తమకు వచ్చిన ఫిర్యాదులన్నింటిని ఆయనకు అందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. కాగా ప్రతి ఫిర్యాదుపై తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇక ప్రతి ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్‌కు ఇవ్వాల్సిందిగా తన బృందానికి ఆదేశించినట్లు పేర్కొన్నారు. -
విడాకులు తీసుకున్న స్వాతి మలివాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్...భర్తతో విడాకులు తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానా కన్వీనర్ నవీన్ జైహింద్(39) నుంచి ఆమె చట్టబద్దంగా విడిపోయారు. స్వాతి మలివాల్ దేశంలోనే అత్యంత పిన్న వయసులో మహిళా కమిషన్ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. భర్తకు విడాకులిచ్చినట్లు బుధవారం ప్రకటించిన ఆమె.. దంపతులుగా కలిసుండటంలో, విడిపోవాలనుకున్నప్పుడు ఎదుర్కొన్న సమస్యల్ని ప్రస్తావిస్తూ భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పోస్టు చేశారు. ఘజియాబాద్ లో పుట్టిపెరిగిన స్వాతి, ఢిల్లీలోని ప్రఖ్యాత జేఎస్ఎస్ కాలేజీలో ఐటీలో డిగ్రీ చేశారు. అన్నా హజారే నేతృత్వంలో ఉధృతంగా సాగిన అవినీతి వ్యతిరేక పోరాటంలో ఆమె భాగం పంచుకున్నారు. ఆ ఉద్యమంలోనే ఆమెకు నవీన్ జైహింద్ తో పరిచయం, ప్రేమ ఏర్పడ్డాయి. కొంతకాలం కలిసుండి పెళ్లిచేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిపోయారు. పార్టీ హర్యానా విభాగానికి నవీన్ కన్వీనర్ కాగా, ఢిల్లీలో ఎమ్మెల్యే టికెట్ మిస్ కావడంతో స్వాతికి మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి దక్కింది. చిచ్చుపెట్టిన మీటూ.. చిన్న వయసులోనే డీసీఎం చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన స్వాతి మలివాల్.. మహిళల సమస్యల పరిష్కారానికి తీవ్రంగా పాటుపడ్డారు. చిన్నారులపై అత్యాచారాలు చేసేవాళ్లకు కఠినంగా శిక్షలు విధించేలా పోక్సో చట్టం రావడంలో ఆమె కృషి కూడా ఉంది. అత్యాచారాలకు వ్యతిరేకంగా ఇటీవలే నిరాహార దీక్ష కూడా చేపట్టారామె. కాగా, మీటూ ఉద్యమం సమయంలో స్వాతి భర్త నవీన్.. మహిళలను కించపరుస్తూ చేసిన కామెంట్లు దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. అప్పటి నుంచి క్రమంగా దూరమైన జంట.. బుధవారం నాటికి విడాకులు తీసుకుంది. -
అపస్మారక స్థితిలోకి స్వాతి మలివాల్
న్యూఢిల్లీ: రేప్ దోషులకు నేరం చేసిన ఆరు నెలల్లోగా కఠిన శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజులుగా దీక్ష చేస్తున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం ఉదయం అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో ఇక్కడి ఎల్ఎన్జేపీ ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్లు ఆస్పత్రిలో చేర్పించాలని సూచించినప్పటికీ, ఆమె అందుకు నిరాకరించారు. అపస్మారక స్థితిలోకి చేరుకోగానే ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారని, స్పృహలోకి రాగానే డాక్టర్లు సెలైన్లు ఎక్కించడాన్ని స్వాతి నిరాకరించారని కమిషన్ సభ్యుడొకరు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఇక్కడి రాజ్‌ఘాట్‌లోని సమతా స్థల్ వద్ద స్వాతి పది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. -
క్షీణించిన మాలివాల్ ఆరోగ్యం
-
దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిందే
సాక్షి, అమరావతి, న్యూఢిల్లీ: మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడే వారిని సత్వరమే శిక్షించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ‘దిశ’ చట్టం ఒక మైలు రాయిగా నిలుస్తుందని.. ఆ చట్టాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ఢిల్లీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలీవాల్ శనివారం లేఖ రాశారు. మహిళలపై నేరాలకు పాల్పడే దుస్సాహసానికి ఒడిగట్టాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా దిశ చట్టాన్ని రూపొందించారని, ఇది నేరాల నియంత్రణకు అస్త్రంగా పని చేస్తుందని లేఖలో పేర్కొన్నారు. దేశంలో మహిళలు, పిల్లలపై జరిగే అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడే వారిని సత్వరమే కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో ఢిల్లీలో ఆమె చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శనివారానికి 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె ప్రధానికి లేఖ రాశారు. ఆ లేఖలో ఇంకా ఏముందంటే.. మహిళల హక్కుల పరిరక్షణపై శ్రద్ధ ఏదీ? ‘దేశంలో మహిళలు, పసిపిల్లలపై వేధింపులతో పాటు అత్యాచారాలు, అఘాయిత్యాలు, గ్యాంగ్ రేప్‌లు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ కేసుల్లో దోషులను తక్షణమే శిక్షించడంతో పాటు భవిష్యత్‌లో ఇలాంటి నేరాలు చోటు చేసుకోకుండా కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని కొన్ని వారాలుగా దేశ వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు భారీ ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఈ అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు గానీ, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడకుండా అడ్డుకట్ట వేసేలా చట్టాన్ని తేవడంలో మాత్రం ప్రభుత్వం విఫలమవుతోంది. పార్లమెంట్లో ప్రజా ప్రతినిధులు అనవసరమైన విషయాలతో సమయాన్ని వృథా చేస్తున్నారు తప్ప మహిళల హక్కులను పరిరక్షించడంపై చర్చించడం లేదు. ఇదే సమయంలో మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో భాగంగా ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్), పోస్కో యాక్ట్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్‌కు పలు సవరణలు చేసింది. అవేమంటే.. ►మహిళలపై అత్యాచారం చేసినా, గ్యాంగ్ రేప్‌కు పాల్పడినా, పసిపిల్లలపై అత్యాచారం చేసినా, యాసిడ్ దాడులకు పాల్పడినా మరణ శిక్ష విధించేలా ఐపీసీ, పోస్కో చట్టానికి సవరణ. ►మహిళలపై నేరాలకు పాల్పడే వారిని తక్షణమే శిక్షించేలా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్‌కు సవరణ చేసింది. ఈ సవరణ ప్రకారం సంఘటన జరిగిన వారం రోజుల్లోగా పోలీసులు విచారణ పూర్తి చేయాలి. ఆ తర్వాత 14 రోజుల్లోగా కోర్టుల్లో ట్రయల్స్ పూర్తి చేసి 21 పని దినాల్లో తీర్పు ఇవ్వాలి. ఈ తీర్పుపై అప్పీల్లు, రివిజన్ పిటిషన్లపై విచారణను మూణ్నెళ్లలోగా పూర్తి చేయాలి. ►మహిళలపై నేరాలకు పాల్పడే కేసుల విచారణకు జిల్లాకు ఒక ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు. వాటిలో ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా మహిళలను నియమించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ కేసుల విచారణకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం. ►ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన దిశ చట్టం చరిత్రాత్మకమైనది. దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్ట వేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఈ చట్టాన్ని దేశ వ్యాప్తంగా ఎందుకు అమలు చేయరు? ► దోషులకు తక్షణమే శిక్ష పడేలా, బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చేయడానికి దిశ చట్టం చుక్కానిలా నిలుస్తుంది. ►ఇప్పటికి నేను నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి 12 రోజులు పూర్తయింది. మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేయడానికి దేశ వ్యాప్తంగా దిశ చట్టాన్ని అమలు చేసే వరకు దీక్ష విరమించను. దేశంలోని మహిళలు, పసిపిల్లల హక్కులను పరి రక్షించడం కోసం దిశ చట్టాన్ని దేశమంతటా అమలు చేస్తారని ఆశిస్తున్నాను’ అని ఆమె వివరించింది. -
మానవత్వమా నీవేక్కడ..?
న్యూఢిల్లీ : మానవత్వం, మానవ సంబంధాలు కనుమరుగవుతున్న రోజులివి. బిడ్డలకు కన్న తల్లిదండ్రులు బరువవుతున్న కాలం ఇది. కడపున పుట్టిన వారే కడవరకూ చూస్తారనే నమ్మకంలేని కాలంలో తోడబుట్టిన వారి నుంచి ఇలాంటి ఆప్యాయతను ఆశించడం అత్యాశే అవుతోంది. మతి స్థిమితం లేని సోదరి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడో అన్న. తోబుట్టువుగా కాదు కదా కనీసం మనిషి అనే విషయాన్ని మరిచి ఆమెకు ప్రత్యక్ష నరకం చూపించాడు. చివరకూ ఢిల్లీ మహిళా కమీషన్ చొరవతో బాధితురాలు ఆ నరకం నుంచి బయటపడ్డారు. హృదయవిదారకమైన ఈ ఘటన వివరాలు.. ఢిల్లీకి చెందిన బాధితురాలు మానసిక వికలాంగురాలు. ఆమెకు ఇద్దరూ సొదరులు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు మరణించే వరకూ వారితో పాటు ఉన్న బాధితురాలిని రెండేళ్ల క్రితం ఆమె సోదరుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి అతడు తన భార్యతో కలిసి బాధితురాలిని తీవ్రంగా హింసిస్తున్నారు. ఆమెకు సరైన తిండి కాదు కదా అసలు భోజనం పెట్టడమే మానేశారు. నాలుగు రోజులకు ఒకసారి ఒక బ్రెడ్డు మాత్రమే ఇస్తున్నారు. బాధితురాలు మానసిక వికలాంగురాలు కావడంతో ఆమె తన పనులను స్వయంగా చేసుకోలేదు. సోదరుడు కూడా ఆమెను పట్టించుకోకపోవడంతో ఆమె తన మలమూత్రాల మధ్యనే అత్యంత జుగుప్సాకరమైన పరిసరాల్లో జీవనం గడుపుతోంది. బాధితురాలికి మరో సోదరుడు ఉన్నాడు. కానీ ఆమె ప్రస్తుతం ఉంటున్న సోదరుడు ఆమెను చూడటానికి ఎవ్వరిని అనుమతిచ్చేవాడు కాదు. దాంతో బాధితురాలి రెండో సోదరుడు ఈ విషయం గురించి ఢిల్లీ మహిళా కమిషన్‌కు సమాచరం అందించాడు. అధికారులు బాధితురాలి సోదరుని ఇంటికి వచ్చినప్పుడు, అతడు వారిని తిట్టడమే కాక ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడ్డాడు. దాంతో సదరు అధికారులు స్థానిక పోలీసుల సాయంతో ఇంట్లోకి వెళ్లి అక్కడ అత్యంత దయనీయ స్థితిలో ఉన్న బాధితురాలిని అంబేద్కర్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషయం గురించి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ మాట్లాడుతూ ‘బాధితురాలి వయసు కేవలం 50 ఏళ్లు ఉండోచ్చు.. కానీ సరైన పోషణ అందకపోవడంతో 90 ఏళ్ల వయసు వ్యక్తిలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్చాం. అనంతరం అక్కడి నుంచి ప్రభుత్వ పర్యవేక్షణలోని ఆశ్రమానికి మారుస్తాం. ప్రజలు కూడా తమ చుట్టు పక్కల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే ఆ వివరాలు మాకు తెలియజేయండి. బాధితులకు సాయం చేయండి’ అని కోరారు. -
వ్యభిచార ముఠా చెర వీడిన అమ్మాయిలు
న్యూఢిల్లీ/వారణాసి: అంతర్జాతీయ వ్యభిచార ముఠా చెర నుంచి 16 మంది నేపాలీలుసహా 18 మంది అమ్మాయిలను ఢిల్లీ, వారణాసి నేర విభాగం పోలీసులు రక్షించారు. అమ్మాయిలనందరినీ గల్ఫ్ దేశాలకు అక్రమంగా తరలించి వ్యభిచార ఊబిలో దించాలని ఓ అంతర్జాతీయ ముఠా కుట్రపన్నింది. ఈ కుట్రను పోలీసులు మంగళవారం భగ్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్టుచేసి ప్రశ్నిస్తున్నారు. అమ్మాయిలను సహాయ శిబిరాలకు, నేపాల్ రాయబార కార్యాలయానికి పంపనున్నట్లు ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమన్ చీఫ్ స్వాతి మలివాల్ మీడియాతో చెప్పారు. అమ్మాయిలను ముఠా నిర్భంధించిన ఇంటిలో 68 పాస్‌పోర్టులు దొరికాయని, వీటిలో ఏడు భారత పాస్‌పోర్టులని స్వాతి పేర్కొన్నారు. ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి కొందరు నేపాలీ అమ్మాయిలను ముఠా ముందుగా వారణాసికి తీసుకొచ్చింది. వీరిలోంచి ఇద్దరు అమ్మాయిలు జూలై మొదటివారంలో తప్పించుకుని నేపాల్ పోలీసులకు, నేపాల్ ఎంబసీకి సమాచారమిచ్చారు. ఎంబసీ ఇచ్చిన వివరాలతో పోలీసులు వారణాసిలో ఆరేడు చోట్ల సోదాలుచేసి ముఠాతో సంబంధమున్న జైసింగ్ అనే వ్యక్తిని అరెస్టుచేశారు. ఇతను ఇచ్చిన సమాచారంతో వారణాసి, ఢిల్లీ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి ఎట్టకేలకు అమ్మాయిలను రక్షించారు. -
రాజధానిలో మానవ మృగం...
సాక్షి, న్యూఢిల్లీ: సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన. డ్రగ్స్ మత్తులో మానవత్వం మాయమైంది.. అతడిలో మృగం నిద్రలేచింది. ఆరేళ్ల పసికందును అతికిరాతకంగా చెరచటంతో ఆ చిన్నారి ప్రాణపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దేశరాజధానిలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే... మింటో రోడ్‌లోని కాళిమందిర్ వద్ద ఉన్న ఫుట్‌పాత్‌పై ఓ రిక్షా కార్మికుడి కుటుంబం నివసిస్తోంది. భార్య గుడి దగ్గర భిక్షాటన చేస్తుండగా, వారికి ఆరేళ్ల పాప ఉంది. అదే ఫుట్‌పాత్‌పై ఓ యువకుడు కూడా జీవిస్తున్నాడు. గత కొంతకాలంగా డ్రగ్స్‌కు బానిసైన ఆ యువకుడు.. ఆ చిన్నారిపై కన్నేశాడు. ఈ నెల 14న సదరు యువకుడు ఆ చిన్నారి ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆడుకుంటున్నకూతురు కనిపించపోయేసరికి కంగారుపడ్డ ఆ తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. కాస్త దూరంలోని పొదల్లో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి కనిపించటంతో షాక్‌కి గురయ్యారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా 4 గంటలపాటు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. చిన్నారి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్.. ఆ చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. చిన్నారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు రావాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను కోరుతున్నారు. రాజధానిలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆమె ఆవేదన చెందుతూ ఓ ట్వీట్ చేశారు. Visited 6 year old rape survivor in hospital. She was raped so brutally dat despite 4 hour operation, her internal organs r damaged! Father rickshaw puller, stepmom beggar & family homeless. Request courts to give death to guilty imm. Seek support frm society to help rehab girl. — Swati Maliwal (@SwatiJaiHind) 16 July 2018 -
ఆశ్రమం కాదది.. అత్యాచారాల అడ్డా !
సాక్షి, న్యూఢిల్లీ : పేరుకే అది ఆశ్రమం. పైకి చూసే వారికి అక్కడ ఆధ్మాత్మిక కార్యక్రమాలు, సేవలు జరుగుతాయి. కానీ, అందులో జరిగేది మాత్రం మరొకటి. గుర్మీత్ ఆశ్రమంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయో అచ్చం అలాంటివే. అది కూడా ఢిల్లీకి సమీపంలోనే.. ఎందరో మైనర్ల జీవితాలు ఆ ఆశ్రమంలో కొవ్వొత్తుల్లా కరిగిపోతున్నాయి. ఆశ్రమం కాస్త అత్యాచారాల అడ్డాగా మారడంతో ఈ విషయం గుర్తించిన ఓ ఎన్జీవో చొరవతో దాని బండారం బయటపడింది. పోలీసులు రైడింగ్ చేసి రెండు గంటలపాటు కష్టపడి అందులో వారిని అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను ఆ కూపంలో నుంచి బయటపడేశారు. వివరాల్లోకి వెళితే.. రోహిణీ ప్రాంతంలో ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ అనే ఆశ్రమం ఉంది. అందులో దాదాపు 14 ఏళ్లుగా కొంతమంది మైనర్లను, మహిళలను బలవంతంగా నిర్భందించి చేయకూడని పనులు చేస్తున్నారని ఓ ఎన్జీవో గమనించింది. అందులో నుంచి అతి కష్టం మీద ఓ మైనర్‌ను కూడా విడిపించుకొచ్చి కోర్టుకు తీసుకెళ్లి అసలు విషయం చెప్పారు. దీంతో ఇంత జరుగుతున్నా పోలీసులకు ఎందుకు పట్టింపు లేకుండా పోయిందని ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఢిల్లీ పోలీసుల బృందం, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలైవాల్ బృందం ఏకకాలంలో ఆశ్రమంపై దాడి చేశారు. వారికి కూడా బాధితులను చేరుకునేందుకు దాదాపు రెండు గంటలు పట్టింది. ఈ సందర్భంగా స్వాతి మలైవాల్ మీడియాతో మాట్లాడుతూ 'ఆశ్రమంలోకి వెళ్లిన మాపై దాడులు చేసేందుకు వారు ప్రయత్నించారు. దాదాపు గంటసేపు మమ్మల్ని బందించే ప్రయత్నం చేశారు. అందులో తమపై లైంగిక దాడులు జరిగినట్లు భారీ సంఖ్యలో లేఖలు, ఇంజెక్షన్లు, మందులు పెద్దమొత్తంలో దొరికాయి' అని చెప్పారు. ఇక ఈ కేసుపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. చుట్టూ గోడలు కట్టి వాటిపై ఫెన్సింగ్ పెట్టి బయటపడకుండా జంతువుల్లా చూస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి చెప్పింది. -
వేశ్యాగృహాలను మూసివేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జీబీ రోడ్డులో ఉన్న 125 వేశ్యాగృహాలను మూసివేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ వాటి నిర్వాహకులకు సమన్లు ఇచ్చింది. వివిధ రకాల ఏజెన్సీలు ఒకదాని కొకటి సంబంధం లేకుండా పొంతనలేని సమాధానాలివ్వడంతో అసలైన నిర్వాహకు లను గుర్తించడం కమిషన్‌కు చాలా కష్టతరమైంది. దీంతో వీరిని సెప్టెంబర్ 21 నుంచి 24 మధ్య తమ వ్యక్తిగత, నివాస ధ్రువీకరణ పత్రాలతో కమిషన్ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించినట్లు ఢిల్లీ మహిళా కమిషన్ అధికారులు తెలిపారు. కొందరు నిర్వాహకులు సమన్లు తీసుకోవడానికి నిరాక రించడంతో వేశ్యాగృహాల గోడలకు వాటిని అంటించామని వారు పేర్కొన్నారు. ఇంతకుముందే కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్, ఢిల్లీ పోలీస్ డిపార్ట్ మెంట్లోని సీనియర్ అధికారులు, ఉత్తరఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా మేజిస్ట్రేట్, ఢిల్లీ జల్ బోర్డు, అగ్ని మాపక విభాగం, కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల్లోని వారితో ఓ కమిటీ దీని కోసమే ఏర్పాటయింది. ఢిల్లీ మహిళా కమిషన్ లీగల్ కౌన్సిలర్ ప్రిన్సీ గోయెల్, మొబైల్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ కిరణ్ నేగిల ఆధ్వర్యంలోని బృందం ఈ సమన్లు అందజేసింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి మైనర్ బాలికలు, యువతులు, మహిళలను జీబీ రోడ్డులోని వేశ్యాగృహాలకు అక్రమంగా తరలించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని స్వాతి మలివాల్ ఆరోపించారు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో అత్యాచారాలు కూడా జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నా రు. ఇప్పటివరకు ఎన్ని దాడులు జరిగినా ఇక్కడి వేశ్యాగృహాల నిజమైన యజమానులు బయట పడలేదని, కొందరు నిర్వాహకులను మాత్రం పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. పార్లమెంటుకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే వ్యభిచారం జరుగుతుండటం సిగ్గు చేటని, దీనిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. -
‘రేపిస్టులకు నరాలు కోసేయాలి’
న్యూఢిల్లీ: రేపిస్టులకు మరణశిక్ష విధించాలని ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) అధ్యక్షురాలు స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు. కఠిన శిక్షలు అమలు చేయడం ద్వారా మాత్రమే మహిళలపై దారుణాలకు అడ్డుకట్ట పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. గురుగ్రామ్‌లో సిక్కిం రాష్ట్రానికి చెందిన యువతిపై కదిలే కారులో ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూడడంతో ఆమె స్పందించారు. ‘దేశంలో ప్రతి నిమిషానికి ఒక రేప్ జరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రేపిస్టుకి మరణశిక్ష విధించడం ద్వారా జాతికి భారత ప్రభుత్వం గట్టి సందేశం పంపించాల్సిన సమయం ఆసన్నమైంది. అత్యాచారాలకు అడ్డుకట్ట పడాలంటే రేపిస్టుల నరాలు కోసేయాలి. ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వరమే న్యాయం అందించి, రేపిస్టులకు మరణశిక్ష అమలు చేయడమే సముచితమ’ని స్వాతి మలివాల్ పేర్కొన్నారు. కాగా, హర్యానాలోని రొహతక్ జిల్లాలో శనివారం రాత్రి 23 ఏళ్ల యువతిని సామూహిక అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచనలం రేపింది. -
బెదిరింపులపై డీయూ విద్యార్థిని ఫిర్యాదు
న్యూఢిల్లీ: రేప్ చేస్తామని వచ్చిన బెదిరింపులపై కార్గిల్ అమరవీరుడి కుమార్తె, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గుర్ మెహర్ కౌర్ సోమవారం ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ)ను ఆశ్రయించింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కు వ్యతిరేకంగా మాట్లాడడంతో తనకు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదులో కౌర్ పేర్కొంది. బెదిరింపులకు దిగిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్ లో ఎవరూ ఇలాంటి బెదిరింపులకు దిగకుండా చూడాలని డీసీడబ్ల్యూ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ కోరారు. తమకు గుర్ మెహర్ కౌర్ ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. న్యాయ పోరాటానికి ఆమె సిద్ధమైతే చట్టప్రకారం చర్యలు చేపడతామని చెప్పారు. కాగా, తనపై ఏఐఎస్ఏకు చెందిన ఇద్దరు తనను వేధించారని ఏబీవీపీకి చెందిన డీయూ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 21న శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్(ఎస్ఆర్ సీసీ) వెలుపల తనను వేధించారని ఫిర్యాదులో పేర్కొంది. ఇదంతా ఏబీవీపీ ఆడుతున్న నాటకమని ఏఐఎస్ఏ ప్రతినిధి అమన్ ఆవాజ్ ఆరోపించారు. సంబంధిత కథనాలు ఇక్కడ చదవండి: నన్ను రేప్ చేస్తామని బెదిరించారు ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు 'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు' రాంజాస్ కాలేజీలో రణరంగం! -
‘మేం షాక్.. ఆరుబయట నగ్నంగా తిప్పుతున్నారు’
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ హయాంలో నడుస్తోన్న ఓ మానసిక వికలాంగుల ఆశ్రమం గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడి అధికారుల నిర్లక్ష్యం, నిర్లజ్జ వ్యవహారాలు బయటకొచ్చాయి. కనీసం ఉండాల్సిన మానవతా విలువలు కూడా ఆ ఆశ్రమంలో లేకపోవడంపట్ల ఢిల్లీ మహిళా కమిషన్ విస్తుపోయింది. అసలు అక్కడ ఏం జరుగుతుందంటే.. ఢిల్లీలో ఆశా కిరణ్ అనే ఓ సంస్థ ఉంది. ఇందులో మానసిక వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తారు. దీని బాధ్యతలు ప్రభుత్వం చూసుకుంటుంది. అయితే, గత రెండు నెలల్లోనే దాదాపు 11మంది ప్రాణాలుకోల్పోయారు. ఈ అంశాన్ని పరిశీలించేందుకు అక్కడికి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్, మరో సభ్యురాలు ప్రమీలా గుప్తా వెళ్లారు. శనివారం రాత్రంతా అక్కడే ఉండి అక్కడి పరిస్థితులు చూసి అవాక్కయ్యారు. ఎలాంటి పరిస్థితులు ఆ సంస్థలో ఉన్నాయో వారి మాటల్లోనే చూస్తే.. ‘స్నానం చేసేందుకు ఆరు బయటే మహిళలను వివస్త్రలను చేసి వరుసగా నిలబెడుతున్నారు. పూర్తి నగ్నంగా ఉన్న స్త్రీలు కారిడార్‌లో అటు ఇటూ తిరుగుతున్నారు. అదే కారిడార్లలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. వాటిని ఆపరేట్ చేస్తున్న వ్యక్తులు పురుషులు. ఈ దృశ్యాలు చూసి మేం దిగ్భ్రాంతి చెందాం. పరిశుభ్రత కొరవడింది. సరిపోయే ఉద్యోగులు లేరు. మానసిక వికలాంగులకు కనీస హక్కులు లేవు. పెద్ద మొత్తంలో అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి. 350మందికి మాత్రమే సరిపోయే చోటులో 450 మందిని ఉంచారు. దీనిపై ఇప్పటికే మేం సాంఘిక సంక్షేమ శాఖకు నోటీసులు ఇచ్చాం. 72గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించాం. అలాగే మేం కూడా ఒక ప్రత్యేక కమిటీని వేశాం. శర వేగంగా అది దర్యాప్తు పూర్తి చేస్తుంది. ఆ కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వానికి పంపిస్తాం’ అని స్వాతి మాలివాల్ తెలిపారు. -
4 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని డిల్లీలో మరో ఘోరం. కేశవపురం ప్రాంతంలో ఆదివారం రాత్రి ఓ నాలుగేళ్ల చిన్నారిని రేప్ చేసి హత్య చేశారు. బ్రిటానియా రైల్వే లైన్ సమీపంలోని ఇంటి బయట ఆమె ఆడుకుంటుండగా ఇద్దరు ఎత్తుకెళ్లి రేప్ చేశారని, ఆ తరువాత గొంతు నులిమి చంపి దగ్గర్లోని రైలు పట్టాలపై పడేశారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సోమవారం చిన్నారి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. సమీపంలోని ఫ్యాక్టరీలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో నిందితులు బాలికను తీసుకెళ్తున్నట్లు గుర్తించామని వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. చిన్నారి కుటుంబం 20 ఏళ్లుగా కేశవపురం ప్రాంతంలో నివసిస్తోంది. ఆమె తండ్రి ఓ గోడౌన్ లో కూలీగా పనిచేస్తున్నాడు. బాధితురాలి కుటుంబ సభ్యులను ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మాలివాల్ పరామర్శించారు. ఢిల్లీలో మహిళలు, ఆడ పిల్లలకు భద్రత లేకుండా పోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది ఇదే ప్రాంతంలో గతేడాది నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిందని గుర్తు చేశారు. ఈ ప్రాంతం ఏమాత్రం సురక్షితం కాదని అన్నారు. -
నెలకు నాకొచ్చేది రూ.30 వేలే: స్వాతి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) ల మధ్య కొనసాగుతోన్న విబేధాలు ఉద్యోగుల వేతనాలకు ఎసరు పెట్టాయి. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశాల మేరకు ఢిల్లీ మహిళా కమిషన్ లో పనిచేస్తోన్న పలువురు సిబ్బంది నెల జీతాల చెల్లింపులు నిలిచిపోయారు. దీంతో ఆ సంస్థ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ప్రభుత్వ నిర్ణయం అన్యాయం, అక్రమం, అమానవీయం అని విమర్శించారు. సోమవాంర ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన స్వాతి.. 'డీసీడబ్ల్యూ సిబ్బందిలో ఎక్కువ మంది యాసిడ్ బాధిత మహిళలున్నారు. పైగా శనివారాలు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తారు. ఉన్నపళంగా వేతనాలు ఆపేయడం దారుణం. లెఫ్టినెంట్ గవర్నర్ చేత నియమితురాలైన సెక్రటరీ అల్కా దివానే ఇదంతా చేయిస్తున్నారు. ఆమె ప్రోద్బలంతోనే వేతనాలు నిలిపేశారు'అని అన్నారు. 'డీసీడబ్ల్యూ ఉద్యోగుల్లో చాలామంది జీతాలు రూ. 25వేల లోపే. నాకొచ్చేదీ రూ.30 వేలే. సిబ్బందికి వేతనాలు ఇచ్చేవరకూ నాక్కూడా జీతం ఇవ్వొద్దని ఉన్నతాధికారులకు చెప్పా'నని స్వాతి పేర్కొన్నారు. అసలు వివాదానికి కారణం కూడా సిబ్బంది నియామకాలేనన్నది తెలిసిందే. కొద్ది నెలల కిందట డీసీడబ్ల్యూ చేపట్టిన సిబ్బంది నియామకాల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో సంస్థ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ను సెప్టెంబర్ లో ఢిల్లీ ఏసీబీ ప్రశ్నించింది. కాగా, తానే తప్పూ చేయలేదన్న స్వాతి.. జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. -
స్వాతీ.. ఇదేం పని?
స్వయంగా ఏసీబీ కేసులో చిక్కుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్.. పాత చైర్పర్సన్లపై ఏసీబీకి ఫిర్యాదు చేయడం మీద నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తన పదవీ కాలం ముగిసిన ఇన్నాళ్ల తర్వాత తనపై అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయడం ఏంటని మాజీ చైర్పర్సన్ బర్ఖా శుక్లా సింగ్ ప్రశ్నించారు. ఏసీబీ విచారణ అంటే తాను భయపడేది లేదని ఆమె చెప్పారు. మహిళా కమిషన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను ఇబ్బడి ముబ్బడిగా నియమించడం, అందులోనూ అక్రమాలకు పాల్పడటంతో స్వాతి మలివాల్‌పై ఇటీవలే ఏసీబీ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. మహిళా కమిషన్‌లో జరిగిన అవినీతిపై ఏసీబీ ఇప్పటికే కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తోందని, తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని బర్ఖా శుక్లా సింగ్ అన్నారు. అక్రమాలు జరిగితే.. తనపై ఆమె అప్పుడే కేసు పెట్టాల్సిందని చెప్పారు. బర్ఖాతో పాటు అంతకుముందు పనిచేసిన కిరణ్ వాలియా, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కూడా ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని, అందువల్ల ఏసీబీ అధికారులు వాళ్లందరినీ అరెస్టుచేసి జైలుకు పంపాలని స్వాతి మలివాల్ శుక్రవారం ఆరోపించిన విషయం తెలిసిందే. స్వాతి చేసినవన్నీ నిరాధార ఆరోపణలని, అందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని కిరణ్ వాలియా అన్నారు. ముగ్గురు మహిళలు చేసిన అక్రమాలకు ఆధారాలు కూడా చూపిస్తానంటూ 128 పేజీల పత్రాన్ని స్వాతి మలివాల్ ఏసీబీకి సమర్పించారు. -
'ఎఫ్ఐఆర్లో నన్నెందుకు చేర్చారో తెలియడం లేదు'
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ సభ్యుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఏసీబీ అధికారులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ లో తన పేరును ఎందుకు చేర్చారో అర్థం కావడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాను ఏం చేశాననే విషయాన్ని కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొనలేదని చెప్పారు. 'ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో నా పేరు ఎందుకు చేర్చారో తెలియదు. ఇందులో నా పాత్ర ఏముంది? అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎఫ్ఐఆర్ వెనుక కుట్ర ఏమిటో తేల్చుకునేందుకు త్వరలోనే ప్రత్యేక విధాన సభ సమావేశం ఏర్పాటుచేసి పూర్తి స్థాయిలో చర్చిస్తామని అన్నారు. మహిళా కమిషన్ సభ్యుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని స్వాతి మలివాల్ పై కేసు నమోదు చేసిన అధికారులు ఇప్పటికే ఆమెను ప్రశ్నించారు. డీసీడబ్ల్యూ మాజీ అధ్యక్షురాలు బర్కా శుక్లా సింగ్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ విచారణ చేపట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వారిని డీసీడబ్ల్యూలో అక్రమంగా నియమించినట్టు ఆమె ఫిర్యాదు చేశారు. ఎటువంటి అర్హతలు లేకపోయినా 85 మందిని నియమించారని ఆరోపించారు. ఈ ఆరోపణలను స్వాతి మలివాల్ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. -
జైలులో పెట్టినా పోరాడతా: స్వాతి
న్యూఢిల్లీ: కొంత మంది వ్యక్తులు కేంద్రకానికి, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ మహిళ కమిషన్(డీసీడబ్ల్యూ) చైర్పర్సన్ స్వాతి మలివాల్ ఆరోపించారు. తాము ప్రశ్నించడం ఇష్టంలేని కొంత మంది వ్యక్తులు ఇదంతా చేస్తున్నారని అన్నారు. వీరి పేర్లు వెల్లడించేందుకు ఆమె నిరాకరించారు. తాను ఎవరిపైనా అకారణంగా నిందలు వేయాలనుకోవడం లేదన్నారు. ఏసీబీ కేసులతో తమను ఆపలేరని పేర్కొన్నారు. తనను జైలులో పెట్టినా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. డీసీడబ్ల్యూ సిబ్బంది నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు రావడంతో స్వాతి మలివాల్ ను ఏసీబీ అధికారులు సోమవారం ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వారిని డీసీడబ్ల్యూలో అక్రమంగా నియమించినట్టు మాజీ అధ్యక్షురాలు బర్కా శుక్లా ఫిర్యాదు చేయడంతో ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. -
స్వాతి మలివాల్‌ను ప్రశ్నించిన ఏసీబీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్(డీసీడబ్ల్యూ) స్వాతి మలివాల్‌ను ఏసీబీ అధికారులు సోమవారం ప్రశించారు. మహిళా కమిషన్ సభ్యుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఐదుగురు అధికారులతో కూడిన ఏసీబీ బృందం ఈ ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకుని స్వాతిని ప్రశ్నించిందని ఏసీబీ అధికారి ఒకరు వెల్లడించారు. గతవారం ఆమెకు ఏసీబీ నోటీసు జారీ చేసింది. డీసీడబ్ల్యూ మాజీ అధ్యక్షురాలు బర్కా శుక్లా సింగ్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వారిని డీసీడబ్ల్యూలో అక్రమంగా నియమించినట్టు ఆమె ఫిర్యాదు చేశారు. ఎటువంటి అర్హతలు లేకపోయినా 85 మందిని నియమించారని ఆరోపించారు. ఈ ఆరోపణలను స్వాతి మలివాల్ తోసిపుచ్చారు. నిబంధనల మేరకే సిబ్బందిని నియమించినట్టు చెప్పారు. -
‘వచ్చేవారంలో స్వాతిని అరెస్ట్ చేస్తారు’
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్... ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్‌ను అరెస్టు చేయించి, ఆమెను పదవి నుంచి తొలగించాలనుకుంటున్నారని ఆరోపించారు. స్వాతి మలివాల్ చక్కగా పని చేస్తున్నందువల్ల ఆమెను పదవి నుంచి తొలగించాలని ప్రధాని కార్యాలయం, ఎల్జీ కార్యాలయం యోచిస్తున్నట్లు తనకు అనధికారిక వర్గాల ద్వారా తెలిసిందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. వచ్చే వారం ఆమెను అరెస్టు చేసి పదవి నుంచి తప్పిస్తారంటూ ఆయన పేర్కొన్నారు. కేజ్రీవాల్ మరో ట్వీట్లో ఎల్జీ, ఆయన కార్యాలయంపై ఆరోపణలు చేశారు. మొహల్లా క్లినిక్‌లు ఏర్పాటుచేసిన వారిని, ఫ్లై ఓవర్ల నిర్మాణంలో సొమ్ము ఆదా చేసినవారిని కూడా పదవుల నుంచి తొలగించాలని ఎల్జీ పట్టుదలతో ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. ఆప్ సర్కారు చేసిన తప్పిదాలను తాను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తానని ఎల్జీ అన్నట్లుగా పత్రికలలో వచ్చి న వార్తలను కూడా ఆయన ట్విటర్‌పై ఉంచారు. LG & PMO hell bent on removing Swati Maliwal for doing good job. She will be arrested coming week & then removed.: Delhi CM Arvind Kejriwal — आशुतोष (@ashu3page) 27 August 2016 -
'వాళ్లను వెంటనే ఉరి తీయండి'
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషులను ఉరి తీయాలని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ డిమాండ్ చేశారు. భవిష్యత్ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే రేపిస్టులకు మరణశిక్ష అమలు చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం చేసిన నేపథ్యంలో స్వాతి స్పందించారు. 'వ్యవస్థ దేన్నైతే సమర్థించిందో, దాన్నే వినయ్ శర్మ తనకు తానుగా విధించుకోబోయాడు. నిర్భయ దోషులకు ఉరిశిక్ష వెంటనే అమలు చేయాలి. ఒక్క నిర్భయ దోషులనే కాదు, అత్యాచారానికి పాల్పడిన ప్రతి ఒక్కరికి మరణశిక్ష విధించాలి. మరెవరూ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా గట్టి హెచ్చరికలు పంపాల'ని స్వాతి అన్నారు. జైలు అధికారులు వేధించడం వల్లే వినయ శర్మ ఆత్మహత్యకు ప్రయత్నించాడని వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. -
అక్కడ ప్రత్యక్ష నరకంలా ఉంది...
న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళల పునరావాసం కోసం ఏర్పాటు చేసిన నారీ నికేతన్ నరకానికి నకలుగా ఉందని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ వ్యాఖ్యానించారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా రాత్రంతా నారీ నికేతన్‌లో గడిపామన్నారు. ఈ సందర్భంగగా తమ అనుభవాలను, నారీ నికేతన్ సంస్థలోని పరిస్థితులు, సౌకర్యాల లేమి గురించి స్వాతి మాలివాల్ శనివారం మీడియాకు వెల్లడించారు. తమకు రాత్రంతా నరకంలో ఉన్న అనుభూతి కలిగిందని స్వాతి తెలిపారు. అక్కడ నెలకొన్ని భయంకరమైన పరిస్థితులను కళ్లారా చూశాక చాలా ఆశ్చర్యం కలిగిందన్నారు. అక్కడున్న మహిళలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతిస్థిమితం కోల్పోయిన మహిళలతో సామాన్య మహిళలు కలిసి జీవిస్తున్నారని, ఒకే మంచాన్ని ఇలాంటి ఇద్దరు మహిళలు పంచుకోవడం చాలా దుర్భరమని వ్యాఖ్యానించారు. నారీ నికేతన్‌లో చాలా సమస్యలు, సౌకర్యాలలేమి తమ దృష్టికి వచ్చాయని స్వాతి మాలివాల్ తెలిపారు. విడుదల చేయాలని కోర్టు ఆదేశాలున్నా కొంతమంది మహిళలు ఇంకా నారీ నికేతన్‌లో ఉండాల్సి వస్తోందన్నారు. కేవలం పోలీసులు, కార్యాలయ అధికారుల సమన్వయ లోపం వల్లనే ఇలా జరిగిందని ఆమె పేర్కొన్నారు. సాధ్యమైనంత వేగంగా నారీ నికేతన్ కార్యాలయంలోని సమస్యలను పరిష్కరిస్తామని ఆమె తెలిపారు.