బెదిరింపులపై డీయూ విద్యార్థిని ఫిర్యాదు
న్యూఢిల్లీ: రేప్ చేస్తామని వచ్చిన బెదిరింపులపై కార్గిల్ అమరవీరుడి కుమార్తె, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గుర్ మెహర్ కౌర్ సోమవారం ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ)ను ఆశ్రయించింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కు వ్యతిరేకంగా మాట్లాడడంతో తనకు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదులో కౌర్ పేర్కొంది.
బెదిరింపులకు దిగిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్ లో ఎవరూ ఇలాంటి బెదిరింపులకు దిగకుండా చూడాలని డీసీడబ్ల్యూ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ కోరారు. తమకు గుర్ మెహర్ కౌర్ ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. న్యాయ పోరాటానికి ఆమె సిద్ధమైతే చట్టప్రకారం చర్యలు చేపడతామని చెప్పారు.
కాగా, తనపై ఏఐఎస్ఏకు చెందిన ఇద్దరు తనను వేధించారని ఏబీవీపీకి చెందిన డీయూ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 21న శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్(ఎస్‌ఆర్ సీసీ) వెలుపల తనను వేధించారని ఫిర్యాదులో పేర్కొంది. ఇదంతా ఏబీవీపీ ఆడుతున్న నాటకమని ఏఐఎస్ఏ ప్రతినిధి అమన్ ఆవాజ్ ఆరోపించారు.
సంబంధిత కథనాలు ఇక్కడ చదవండి: