gurmehar kaur
-
మోదీగారు వారిని అన్‌ఫాలో చేయండి!
మహిళలను వేధించేవారిని, బెదిరించేవారిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్లో అన్‌ఫాలో చేయాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన ప్రధాని మోదీకి ఈ విజ్ఞప్తి చేశారు. మహిళలను వేధించేవారిని ట్విట్టర్లో అన్‌ఫాలో చేయడమే కాదు.. వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలని ట్విట్టర్లో కోరారు. ఏబీవీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నిరసనగళం ఎత్తిన లేడీ శ్రీరాం కాలేజీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్‌కు రేప్ బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో కేజ్రీవాల్ బీజేపీని ఇరకాటంలో పెట్టేలా ఈ కామెంట్ చేశారు. ఆయన కామెంట్‌ను ఆప్ మద్దతుదారులు విపరీతంగా రీట్వీట్ చేస్తుండగా.. ఆయన ప్రత్యర్థులు మాత్రం తప్పుబడుతున్నారు. విడిపోయిన భార్య నుంచి గృహహింస కేసు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతిని ట్విట్టర్లో కేజ్రీవాల్ ఫాలో అవుతుండటాన్ని తప్పుబడుతున్నారు. ముందు ఆయన అన్‌ఫాలో చేసి.. ఇతరులకు హితబోధ చేయాలని సూచిస్తున్నారు. -
అసహనానికి చోటు లేదు
విశ్వవిద్యాలయాల్లో హింస కాదు చర్చ జరగాలి: ప్రణబ్ కొచ్చి: అసహనపరులకు భారత్‌లో చోటు ఉండకూడదని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పురాతన కాలం నుంచి మనదేశం స్వేచ్ఛాయుత ఆలోచనలు, భావప్రకటనకు నిలయమని పేర్కొన్నారు. ఆయన గురువారం ఇక్కడ కేఎస్ రాజమోని ఆరో స్మారక ప్రసంగం చేశారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు, అధ్యాపకులు అర్థవంత చర్చల్లో పాల్గొనాలి కానీ అశాంతిని రాజేసే వాతావరణాన్ని సృష్టించరాదని పిలుపునిచ్చారు. హింస, అశాంతి అనే సుడిగుండంలో విద్యార్థులు చిక్కుకోవడం విచారకరమని అన్నారు. వర్సిటీల్లో స్వేచ్ఛాయుత ఆలోచన విధానాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఏబీవీపీ, ఏఐఎస్ఏ మద్దతుదారుల మధ్య ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఈ మధ్య జరిగిన గొడవలు, విద్యార్థిని గుర్మెహర్ కౌర్ ట్వీట్ల తరువాత భావ స్వేచ్ఛ, జాతీయవాదంపై వెల్లువెత్తిన చర్చల నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. మన విశ్వవిద్యాలయాలు భారత్‌ను జ్ఞాన సమాజం వైపు నడిపే వాహనాల లాంటివి అని అన్నారు. దేవాలయాల్లాం టి వర్సిటీల్లో సృజన, స్వేచ్ఛాయుత ఆలోచనలు మార్మోగాలని అభిలషించారు. అసహనం, మహిళలపై దాడుల వంటివాటి పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. విరుద్ధ భావాలు ప్రకటించడం, చర్చలు జరగడం మన సమాజం విశిష్ట లక్షణమని చెప్పారు. ‘వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనేవి రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులు’ అని ప్రణబ్ అన్నారు. -
సోషల్ మీడియాలో ఉండాలంటే: మెగాస్టార్
ముంబై: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ ప్రముఖుల్లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముందు వరుసలో ఉంటారు. ఆయన సామాజిక అంశాలతో సహా తాజా విశేషాలపై స్పందిస్తుంటారు. నెటిజెన్లకు, కొత్తగా సోషల్ మీడియాలోకి రావాలనుకునే వారికి అమితాబ్ ఓ సలహా ఇచ్చారు. సోషల్ మీడియాలో ఉండాలంటే ప్రశంసలను స్వీకరించడంతో పాటు విమర్శలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అమిత్ పేర్కొన్నారు. ప్రశంసలతో పాటు విమర్శలను కూడా తాను ఆస్వాదిస్తానని చెప్పారు. ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా అమితాబ్ నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటారు. తాజాగా ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్ ఉదంతంపై అమితాబ్ స్పందించారు. గుర్మెహర్ విషయం వ్యక్తిగతమైనదని అభిప్రాయపడ్డారు. దీని గురించి మాట్లాడితే బహిరంగమవుతుందని చెప్పారు. కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్‌దీప్ సింగ్ కుమార్తె, లేడీ శ్రీరామ్ కాలేజీ విద్యార్థిని గుర్మెహర్ బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ నాయకుల దాడిని ఖండిస్తూ, సోషల్ మీడియాలో వారిపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గుర్మెహర్ తన తండ్రి మరణం గురించి చేసిన ట్వీట్ దుమారం రేపింది. కొందరు సెలెబ్రిటీలు విమర్శించగా, మరికొందరు సమర్థించారు. చివరకు ఆమె సోషల్ మీడియా వార్‌కు స్వస్తి పలికింది. -
గుర్మెహర్కు గంభీర్ మద్దతు
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో రామ్జాస్ కళాశాల పరిస్ధితులపై ఫోటోను పెట్టి అందరి దృష్టిని ఆకర్షించిన గుర్మెహర్ కౌర్‌కు క్రికెటర్ గౌతమ్ గంభీర్ మద్దతు తెలిపాడు. భావ ప్రకటన ప్రతి ఒక్కరి హక్కు అని ట్విట్టర్లో పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరూ తన జీవితంలో స్వేచ్చా, స్వతంత్రాల విస్తృతిని ఎదిగే కొద్ది తెలుసుకుంటారని అన్నాడు. కాగా, గుర్మెహర్పై భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్, రెజ్లర్ యోగేశ్వర్ దత్ వ్యంగ్యంగా స్పందించారు. ఫోగట్ సిస్టర్స్ బబితా, గీతలు కూడా ఈ వ్యాఖ్యలను సమర్ధించిన విషయం తెలిసిందే. -
‘ఆమెను సమర్థించేవారిని వెళ్లగొట్టండి’
న్యూఢిల్లీ: ఏబీవీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తన ప్రచారాన్ని విరమిస్తున్నట్లు లేడీ శ్రీరాం కాలేజీ విద్యార్థిని, కార్గిల్ అమరుడి కుమార్తె గుర్మెహర్ కౌర్ ప్రకటించినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. ఆమెపై బీజేపీ నాయకుల మాటల దాడి కొనసాగుతోంది. గుర్మెహర్ కౌర్ ను సమర్థించేవారు పాకిస్థాన్ అనుకూలురని, ఇటువంటి వారిని దేశం నుంచి వెళ్లగొట్టాలని హర్యానా మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించారు. ఎవరు భారతీయులో, ఎవరు దేశ వ్యతిరేకులో నిర్ణయించే అధికారం ఏబీవీపీకి ఎక్కడదని... ఆ హక్కు ఎవరు ఇచ్చారని ఆర్జేడీ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ ప్రశ్నించారు. -
నా క్రికెట్ హీరో సెహ్వాగ్ ఇలా మాట్లాడేమిటి?
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శించారు. తన క్రికెట్ హీరో సెహ్వాగ్.. గుర్మెహర్పై చేసిన వ్యాఖ్యలు తనకు నిరాశ కలిగించాయని, సీరియస్ అంశమైన యుద్ధాన్ని తక్కువ చేసేలా వ్యాఖ్యానించాడని ఫేస్బుక్లో కామెంట్ చేశారు. కార్గిల్ అమరవీరుడి కుమార్తె అయిన గుర్మెహర్ తెలిసీ తెలియని వయసులో వ్యాఖ్యలు చేసిందని, ఆమె వ్యాఖ్యలు ఆవేశపూరితంగా ఉండవచ్చని, అంతమాత్రాన వారి కుటుంబాన్ని తక్కువ చేసేలా మాట్లాడటానికి మనమెవరని, కుటుంబపెద్దను పోగొట్టుకున్న బాధలో వారు స్పందించారని వీరూను ఉద్దేశించి శశిథరూర్ పేర్కొన్నారు. ఓ యువతి భావజాలంపై మీ శక్తివంతమైన పదాలను ప్రయోగించేందుకు సాహసించరాదని వీరూకు సూచించారు. కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె గుర్మెహర్.. తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధ చంపిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గుర్‌మోహర్ వ్యాఖ్యలకు సమాధానంగా సెహ్వాగ్ అదే తరహాలో ట్వీట్ చేశాడు. 'నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసింది' అంటూ వీరూ ట్వీట్ చేశాడు. పలువురు సెలెబ్రిటీలు కూడా ఆమె వ్యాఖ్యలను తప్పుపడుతూ సోషల్ మీడియాలో స్పందించారు. దీనిపై గుర్మెహర్ స్పందిస్తూ వీరూ వ్యాఖ్య తన గుండెను బద్దలు చేసిందని పేర్కొనగా.. తన వ్యాఖ్యలు ఆమెను ఉద్దేశిస్తూ చేసినవి కావని సెహ్వాగ్ వివరణ ఇచ్చాడు. ఏబీవీపీపై సంచలన ఆరోపణలు చేసిన గుర్మెహర్ చివరకు సోషల్ వార్‌కు స్వస్తి చెబుతున్నట్టు పేర్కొంది. -
సోషల్ ‘వార్’కు గుర్మెహర్ స్వస్తి
తనను ఒంటరిగా వదిలేయాలని విజ్ఞప్తి ► ఢిల్లీ వర్సిటీలో ఏబీవీపీ వ్యతిరేక ర్యాలీ.. న్యూఢిల్లీ: ఏబీవీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తన ప్రచారాన్ని విరమిస్తున్నట్లు లేడీ శ్రీరాం కాలేజీ విద్యార్థిని, కార్గిల్ అమరుడి కుమార్తె గుర్మెహర్ కౌర్ మంగళవారం స్పష్టంచేసింది. ప్రచారంపై తీవ్ర వ్యతిరేకతతోపాటు అత్యాచార, హత్య బెదిరింపులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘ప్రచారాన్ని విరమించుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నా ధైర్యసాహసాలను ప్రశ్నించేవారికి అవసరమైనదానికంటే ఎక్కువే సమాధానమిచ్చా’ అని ట్వీట్ చేసింది. తన కుటుంబంతో కలసి ఉండేందుకు ఆమె జలంధర్‌కు వెళ్లింది. ఆమెకు రక్షణ కల్పించాలని అక్కడి పోలీసులను ఢిల్లీ పోలీసులు కోరారు. మరోవైపు.. ఢిల్లీ వర్సిటీ నార్త్ క్యాంపస్‌లో ఏబీవీపీకి వ్యతిరేకంగా మంగళవారం జేఎన్ యూ, డీయూ, జామియా వర్సిటీలకు వందలాది విద్యార్థులు, అధ్యాపకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి గుర్మెహర్ కౌర్ గైర్హాజరైంది. కౌర్‌కు వచ్చిన బెదిరింపులకు సంబంధించి ఢిల్లీ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై.. లైంగిక వేధింపులు, బెదిరింపుల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, ర్యాలీలో ఇద్దరు ఏఐఎస్ఏ విద్యార్థులపై దాడి చేశారనే ఆరోపణలపై ఇద్దరు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కౌర్ వ్యాఖ్యలపై తాను చేసిన ట్వీట్ సరదా కోసమేనని, దాన్ని అపార్థం చేసుకున్నారని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పారు. అయితే కౌర్ వ్యాఖ్యలను ఒలింపిక్ మెడలిస్ట్ యోగేశ్వర్ దత్ ఖండించారు. కౌర్, హిట్లర్, లాడెన్ ల ఫొటోలను జతచేసి దత్ పోస్ట్ చేశారు. ‘తండ్రి ఆత్మ క్షోభిస్తోంది’ కౌర్‌పై కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు విమర్శలు ఆపడం లేదు. ‘మన జవాన్లు విధుల్లో చనిపోతే వేడుక చేసుకునే వారు కౌర్‌ను తప్పుదారి పట్టిస్తున్నారు.. ఆమె తండ్రి ఆత్మ తప్పకుండా క్షోభిస్తూ ఉంటుంది’ అని అన్నారు. ‘జవాన్లు చనిపోతే లెఫ్టిస్టులు పండగ చేసుకుంటారు. వర్సిటీల్లో్ల యువతను తప్పుదారి పట్టిస్తున్నారు’ అని ఆరోపించారు. రిజిజు విమర్శలను సీపీఎం నేత సీతారాం ఏచూరి తిప్పికొట్టారు. ‘‘గాంధీని చంపాక ఎవరు పండుగ చేసుకున్నారు? ‘గాంధీ హత్య తర్వాత ఆరెస్సెస్ కార్యకర్తలు సంతోషంతో స్వీట్లు పంచారు’ అని పటేల్(తొలి హోం మంత్రి)..గోల్వార్కర్(ఆరెస్సెస్)కు 11–09–1948న చెప్పా రు’’ అని ఏచూరి ట్వీట్ చేశారు. -
నా ట్వీట్ ఆమెనుద్దేశించి కాదు: సెహ్వాగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గుర్మెహర్ వివాదంలో ఓ ట్విట్టర్ ద్వారా కూరుకుపోయిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. మౌనాన్ని వీడి తన మాటలను, తన ఉద్దేశాన్ని తప్పుబట్టారని, తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ‘నా ట్వీట్ గుర్మెహర్ను ఉద్దేశించి కాదు. అది చిన్న సరదాకు మాత్రమే పెట్టాను. కానీ ప్రజలు దానిని వేరేలా అర్ధంచేసుకున్నారు’ అని ఆయన మంగళవారం ఓ మీడియాతో చెప్పారు. ఢిల్లీ రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ గుర్మెహర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. లేడీ శ్రీరామ్ కాలేజి విద్యార్థిని అయిన గుర్మెహర్.. తాను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినినని, తాను ఏబీవీపీకి భయపడనని ఫేస్బుక్లో కామెంట్ చేశారు. అంతకుముందు తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధ చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక వార్తల్లోకి నిలిచారు. అయితే అదే సమయంలో గుర్‌మోహర్ వ్యాఖ్యలకు సమాధానం అనిపించే భావన వచ్చేట్టుగా సెహ్వాగ్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. ఆ ట్వీట్‌తో కొంతమంది ఏకీభవించగా ఇంకొందరు విభేదించారు.'నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసింది' అంటూ వీరూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై గుర్మెహర్ కూడా స్పందిస్తూ తనను సెహ్వాగ్ ట్వీట్ బాగా హర్ట్ చేసిందని చెప్పింది. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యం సతంరించుకుంది. రాంజాస్ కాలేజీ వివాదం.. సంబంధిత కథనాలు ట్విట్టర్ వార్‌కు తెరలేపిన సెహ్వాగ్ ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు 'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు' రాంజాస్ కాలేజీలో రణరంగం! నన్ను రేప్ చేస్తామని బెదిరించారు -
ఢిల్లీని వదిలి వెళ్తాను: గుర్మెహర్
న్యూఢిల్లీ: కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె, ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్ తన ఆందోళనను విరమించాలని నిర్ణయించుకుంది. తనపై బీజేపీ, ఏబీవీపీతో సహా సెల్రబిటీలు కూడా తీవ్రమైన కామెంట్లు చేస్తుండటంతో తన నిరసనను ఇక్కడితే ఆపేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు మద్ధతు తెలిపిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఆందోళన విరమించకపోతే అత్యాచారం చేస్తామంటూ ఏబీవీపీ వారు తనపై బెదిరింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ నుంచి గుర్మెహర్ కౌర్ ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకున్నట్లు చెప్పింది. ఈ వివాదంలో గుర్మెహర్కు అరవింద్ కేజ్రీవాల్ మద్ధతు తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గుర్మెహర్కు వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గత వారం రాంజాస్ కాలేజీలో జరిగిన గొడవలపై చర్చించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ను కలిశారు. రాంజాస్ కాలేజీలో విధ్వసం సృష్టించిన ఏబీవీపీ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంగ్ గవర్నర్‌కు కేజ్రీవాల్ విజ్ఞప్తిచేశారు. గుర్మెహర్ను బెదిరించిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కేజ్రీవాల్ కోరారు. గుర్మెహర్ తండ్రి కెప్టెన్ మణ్‌దీప్ సింగ్ 1999 కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందారు. తన తండ్రిని పాకిస్తాన్ చంపలేదని, యుద్ధం ఆయనను చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మరోసారి ఆమె వివాదంలో చిక్కుకుంది. దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలిద్‌ను రాంజాస్ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించేందుకు ఆహ్వానించారు. దీనిపై గత బుధవారం ఏబీవీపీ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పాటు విద్యార్థులు, మీడియాపై దాడికి పాల్పడగా ఈ ఘటనలో దాదాపు 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనపై గుర్మెహర్ కౌర్ గుర్మెహర్ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ.. ఏబీవీపీకి భయపడేది లేదంటూ.. తనకు దేశ వ్యాప్తంగా విద్యార్థుల మద్దతు ఉందని రాసున్న ప్లకార్డుతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదం మొదలైంది. రాంజాస్ కాలేజీ వివాదం.. సంబంధిత కథనాలు ట్విట్టర్ వార్‌కు తెరలేపిన సెహ్వాగ్ ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు 'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు' రాంజాస్ కాలేజీలో రణరంగం! నన్ను రేప్ చేస్తామని బెదిరించారు -
గుర్మెహర్ కౌర్ ట్వీట్ పై దుమారం
న్యూఢిల్లీ:తన తండ్రి మణ్ దీప్ సింగ్ కు చావుకు పాకిస్తాన్ కారణం కాదని, ఆనాటి కార్గిల్ యుద్ధమే కారణమని ఢిల్లీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్ చేసిన ట్వీట్ పై దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆ ట్వీట్ పై భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఘాటుగా స్పందించగా, తాజాగా రెజ్లర్ యోగశ్వర్ దత్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. ఆల్ ఖైదా వ్యవస్ధాపకుడు ఒసామా బిన్ లాడెన్ ప్రజల్ని చంపలేదని, బాంబులే ఆ పని చేశాయని యోగేశ్వర్ ట్వీట్ చేశాడు. ఒకనాటి జర్మనీ నియంత హిట్లర్ కూడా తనను వ్యతిరేకించిన జ్యూస్‌కు చావుకు కారణం కాలేదని, అతను ప్రయోగించిన గ్యాసే ఆ పని చేసిందని చమత్కరించాడు. ఈ మేరకు ఫోటోను ట్వీట్టర్లో పోస్ట్ చేసి గుర్మెహర్ కు కౌంటర్ ఇచ్చాడు. అంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే తరహాలో గుర్మెహర్ ట్వీట్ ను తప్పుబట్టిన సంగతి తెలిసిందే. తన టెస్టు కెరీర్లో చేసిన రెండు ట్రిపుల్ సెంచరీలను చేసింది తాను కాదని, అవి చేసింది బ్యాట్ అని రిప్లే ఇచ్చాడు. ఇప్పడు సెహ్వాగ్ సరసన యోగేశ్వర్ దత్ కూడా చేరిపోయాడు. గుర్మెహర్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన యోగేశ్వర్.. ఫ్లకార్డుతో ఉన్న ఆమె ఫోటోకు మరో మూడు ఫోటోల్ని జోడించి మరీ విమర్శించాడు. 1999 కార్గిల్ యుద్ధంలో కెప్టెన్ గా పని చేసిన మణ్‌దీప్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. దానిపై అతని కుమార్తె గుర్మెహర్ ఇటీవల ట్వీట్ చేసింది. తన తండ్రి అమరుడు కావడానికి పాకిస్తాన్ కాదని పేర్కొంది. యుద్ధమే తన తండ్రిని చంపిందని ఆ ట్వీట్ లో పేర్కొంది. దాంతో పాటు ఢిల్లీ రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని గుర్మెహర్ తీవ్రంగా ఖండించింది. ఆ క్రమంలోనే తర్వాత గుర్మెహర్ సోషల్ మీడియాలో నిత్యం పోస్ట్‌లు చేస్తోంది. దీనిలో భాగంగా తనను రేప్ చేస్తామని ఏబీవీపీ కార్యకర్తలు బెదిరించారని ఆరోపించింది.దాంతో పాటు వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్‌పై కూడా గుర్మెహర్ స్పందించింది. సెహ్వాగ్ చేసిన ట్వీట్ చూడగానే తనకు చాలా బాధ కలిగిందని, తన చిన్నతనం నుంచి ఆయనను చూస్తున్నానని, తనను ఉద్దేశిస్తూ ఎందుకు ఇలా ట్వీట్ చేశాడోనని ఆవేదన వ్యక్తం చేసింది. 🙈🙈🙈 pic.twitter.com/SiH90ouWee — Yogeshwar Dutt (@DuttYogi) 28 February 2017 -
ఆ అమ్మాయి రాజకీయాలు మానేస్తే మంచిది
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్ రాజకీయాలు మానేసి చదువుపై దృష్టిపెట్టాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెణ్ రిజిజు హితవు పలికారు. గుర్‌మోహర్ తీరుతో ఆమె తండ్రి, కార్గిల్ అమరవీరుడు మణ్‌దీప్ సింగ్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. దేశంలో ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చని, కానీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గుర్మెహర్ తండ్రి కెప్టెన్ మణ్‌దీప్ సింగ్ 1999 కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందారు. గుర్మెహర్ ఇటీవల.. తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధ చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వ్యాఖ్యలను నెటిజెన్లు, కొందరు సెలబ్రిటీలు తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి స్పందించారు. గుర్మెహర్ ఫిర్యాదుపై కేసు నమోదు: తనను రేప్ చేసి చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ గుర్మెహర్ చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ గుర్మెహర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఏబీవీపీకి భయపడనని, తాను ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థినినంటూ పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఏబీవీపీ నాయకులు తనను బెదిరించారని ఆమె ఆరోపించింది. -
సెహ్వాగ్ ట్వీట్ నా గుండెను బద్దలు చేసింది
న్యూఢిల్లీ: కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె, ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్ ఆరోపణలు, విమర్శలతో నిత్యం వార్తల్లో ఉంటోంది. ఏబీవీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో చర్చకు తెరలేపిన కౌర్.. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్‌పై స్పందించింది. తనను ఉద్దేశిస్తూ సెహ్వాగ్ చేసిన ట్వీట్ తన గుండెను బద్దలు చేసిందని ఓ ఇంటర్వ్యూలో గుర్మెహర్ చెప్పింది. సెహ్వాగ్ చేసిన ట్వీట్ చూడగానే తనకు చాలా బాధ కలిగిందని, తన చిన్నతనం నుంచి ఆయనను చూస్తున్నానని, తనను ఉద్దేశిస్తూ ఎందుకు ఇలా ట్వీట్ చేశాడోనని చెప్పింది. గుర్మెహర్ తండ్రి కెప్టెన్ మణ్‌దీప్ సింగ్ 1999 కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందారు. గుర్మెహర్ ఇటీవల.. తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధ చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గుర్‌మోహర్ వ్యాఖ్యలకు సమాధానంగా సెహ్వాగ్ అదే తరహాలో ట్వీట్ చేశాడు. 'నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసింది' అంటూ వీరూ ట్వీట్ చేశాడు. వీరూ ఈ ట్వీట్ చేయగానే చాలా మంది నెటిజెన్లు స్పందించారు. కొందరు వీరూను సమర్థించగా.. మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ గుర్మెహర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గుర్మెహర్ సోషల్ మీడియాలో నిత్యం పోస్ట్‌లు చేస్తోంది. తనను రేప్ చేస్తామని ఏబీవీపీ కార్యకర్తలు బెదిరించారని ఆరోపించింది. ట్విట్టర్ వార్‌కు తెరలేపిన సెహ్వాగ్ ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు 'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు' రాంజాస్ కాలేజీలో రణరంగం! నన్ను రేప్ చేస్తామని బెదిరించారు -
'కౌర్ ను దావూద్ తో పోల్చిన ఎంపీ'
బెంగళూరు: బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీకి వ్యతిరేకంగా గళం విప్పిన ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని, కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె గుర్మెహర్ కౌర్ ను మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా.. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో పోల్చారు. కౌర్ కంటే దావూదే నయమని వ్యాఖ్యానించారు. జాతి వ్యతిరేక విధానాన్ని ప్రకటించుకోవడానికి దావూద్ ఇబ్రహీం తన తండ్రి పేరును వాడుకోలేదని ప్రతాప్ సింహా అన్నారు. గుర్మెహర్ కౌర్ వ్యవహార శైలిని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తప్పుబట్టారు. భావప్రకటన స్వేచ్ఛ అంటే కశ్మీర్, బస్తర్ కు స్వాతంత్ర్యం కావాలని నినాదాలు చేయమేనా అంటూ మండి పడ్డారు. గుర్మెహర్ కౌర్ కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బాసటగా నిలిచారు. దేశాన్ని బీజేపీ నాశనం చేస్తోందని, వారి గూండాయిజంకు వ్యతిరేకంగా ప్రజలంతా గళం విప్పాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. సంబంధిత కథనాలు ఇక్కడ చదవండి: బెదిరింపులపై డీయూ విద్యార్థిని ఫిర్యాదు నన్ను రేప్ చేస్తామని బెదిరించారు ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు 'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు' రాంజాస్ కాలేజీలో రణరంగం! -
బెదిరింపులపై డీయూ విద్యార్థిని ఫిర్యాదు
న్యూఢిల్లీ: రేప్ చేస్తామని వచ్చిన బెదిరింపులపై కార్గిల్ అమరవీరుడి కుమార్తె, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గుర్ మెహర్ కౌర్ సోమవారం ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ)ను ఆశ్రయించింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కు వ్యతిరేకంగా మాట్లాడడంతో తనకు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదులో కౌర్ పేర్కొంది. బెదిరింపులకు దిగిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్ లో ఎవరూ ఇలాంటి బెదిరింపులకు దిగకుండా చూడాలని డీసీడబ్ల్యూ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ కోరారు. తమకు గుర్ మెహర్ కౌర్ ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. న్యాయ పోరాటానికి ఆమె సిద్ధమైతే చట్టప్రకారం చర్యలు చేపడతామని చెప్పారు. కాగా, తనపై ఏఐఎస్ఏకు చెందిన ఇద్దరు తనను వేధించారని ఏబీవీపీకి చెందిన డీయూ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 21న శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్(ఎస్ఆర్ సీసీ) వెలుపల తనను వేధించారని ఫిర్యాదులో పేర్కొంది. ఇదంతా ఏబీవీపీ ఆడుతున్న నాటకమని ఏఐఎస్ఏ ప్రతినిధి అమన్ ఆవాజ్ ఆరోపించారు. సంబంధిత కథనాలు ఇక్కడ చదవండి: నన్ను రేప్ చేస్తామని బెదిరించారు ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు 'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు' రాంజాస్ కాలేజీలో రణరంగం! -
ఆ అమ్మాయి మనసును కలుషితం చేస్తున్నారు
న్యూఢిల్లీ: బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీకి వ్యతిరేకంగా ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని, కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె గుర్మెహర్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు స్పందించారు. గుర్మెహర్ కౌర్ మనసును ఎవరు కలుషితం చేస్తున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా కౌర్ ఏబీవీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని రాంజాస్ కాలేజిలో ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ.. తాను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినినని, తాను ఏబీవీపీకి భయపడనని ఫేస్బుక్లో కామెంట్ చేశారు. ఏబీవీపీని విమర్శించినందుకు కొందరు తనను రేప్ చేస్తామని హెచ్చరించారని ఆ తర్వాత ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. గుర్మెహర్ మనసును ఎవరో కలుషితం చేస్తున్నారని అన్నారు. -
ట్విట్టర్ వార్‌కు తెరలేపిన సెహ్వాగ్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన విధ్వంసకర బ్యాటింగ్ శైలి తరహాలో.. ట్విట్టర్లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఏ సందర్భం వచ్చినా వదలకుండా ట్వీట్లు బాదేస్తుంటాడు. ఆదివారం ట్విట్టర్ వేదికగా పుణె టెస్టులో టీమిండియా ఓటమిపై వ్యంగాస్త్రాలు విసిరిన వీరూ.. తాజాగా ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని, కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె గుర్మెహర్ కౌర్ పోస్టింగ్‌కు రిప్లే ఇచ్చాడు. ఢిల్లీ రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ గుర్మెహర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. లేడీ శ్రీరామ్ కాలేజి విద్యార్థిని అయిన గుర్మెహర్.. తాను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినినని, తాను ఏబీవీపీకి భయపడనని ఫేస్బుక్లో కామెంట్ చేశారు. అంతకుముందు తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధ చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక వార్తల్లోకి వచ్చింది. గుర్‌మోహర్ వ్యాఖ్యలకు సమాధానంగా సెహ్వాగ్ అదే తరహాలో ట్వీట్ చేశాడు. 'నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసింది' అంటూ వీరూ ట్వీట్ చేశాడు. వీరూ ఈ ట్వీట్ చేయగానే చాలా మంది నెటిజెన్లు స్పందించారు. వీరిలో సెలెబ్రిటీలు, రచయితలు ఉన్నారు. కొందరు వీరూను సమర్థించగా.. మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తానికి వీరూ చేసిన ట్వీట్ దుమారం రేపింది. నెటిజెన్ల మధ్య ట్విట్టర్ వార్‌కు తెరలేపింది. ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు 'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు' రాంజాస్ కాలేజీలో రణరంగం! నన్ను రేప్ చేస్తామని బెదిరించారు -
నన్ను రేప్ చేస్తామని బెదిరించారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కి వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుంచి ఆమెకు విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయి. అందులో భాగంగానే.. ఏకంగా ఆమెను రేప్ చేస్తామని కూడా కొంతమంది బెదిరించారు. ఈ విషయాన్ని స్వయంగా గుర్మెహర్ కౌర్ తెలిపారు. ఢిల్లీలోని రాంజాస్ కాలేజిలో బుధవారం జరిగిన గొడవ తర్వాత.. తాను ఏబీవీపీకి భయపడనంటూ ఆమె ఒక లేఖ రాసి, ప్లకార్డుతో కూడిన ఫొటోను ఫేస్బుక్లో ఆమె అప్లోడ్ చేయడంతో, అది బాగా వైరల్ అయ్యింది. 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన కెప్టెన్ మన్దీప్ సింగ్ కుమార్తె ఆమె. తనకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయినా, ఆయన ధైర్యాన్ని పుణికి పుచ్చుకుంది. సోషల్ మీడియాలో తనకు విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయని, తనను జాతి వ్యతిరేకిగా అందులో పలువురు తిడుతున్నారని ఆమె చెప్పారు. ఎవరైనా దాడి చేస్తామని, రేప్ చేస్తామని బెదిరిస్తే అది చాలా భయంకరంగా ఉంటుందని అన్నారు. రాహుల్ అనే వ్యక్తి తాను రాసిన కామెంటులో చాలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడని, తనను ఎలా రేప్ చేయాలనుకుంటున్నాడో కూడా అందులో వివరించాడని, అది చూసి చాలా భయమేసిందని గుర్మెహర్ కౌర్ తెలిపారు. గత సంవత్సరం జేఎన్‌యూలో జరిగిన ఒక ర్యాలీలో జాతి వ్యతిరేక నినాదాలు చేసి, ప్రస్తుతం రాజద్రోహ నేరం ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్‌ను రాంజాస్ కాలేజిలో జరిగిన ఒక సెమినార్‌కు ఆహ్వానించడంతో.. దాన్ని ఏబీవీపీ వ్యతిరేకించింది. ఈ సందర్భంగా మిగిలిన విద్యార్థులకు, ఏబీవీపీ వాళ్లకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై స్పందించిన గుర్మెహర్, తన ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్‌ను కూడా మార్చారు. తాను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినినని, తాను ఏబీవీపీకి భయపడనని ఆమె అందులో చెప్పారు. తాను ఒంటరిని కానని, దేశంలో ప్రతి విద్యార్థి తన వెంట ఉన్నారని అన్నారు. దాంతో ఆమెను సమర్థించేవాళ్లు, వ్యతిరేకించేవాళ్లు కూడా భారీ స్థాయిలో ఫేస్బుక్లో కామెంట్లు పెట్టారు. ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు 'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు' రాంజాస్ కాలేజీలో రణరంగం! -
'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు'
న్యూఢిల్లీ: మౌనం పదునైన ఆయుధం, మౌన మంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ద సంభాషణ అన్నాడు ఓ పెద్దాయన. నిశ్శబ్దాన్నే ఆయుధంగా చేసుకుని పాలకులపై పదునైన ప్రశ్నలు ఎక్కుపెట్టింది ఓ అమరవీరుడి కుమార్తె. పంజాబ్ లోని జలంధర్ కు చెందిన 19 ఏళ్ల గుర్ మెహర్ కౌర్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసిన నిశ్శబ్ద వీడియో చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లీషులో సందేశం రాసివున్న 30 ప్లకార్డులను ప్రదర్శించింది. భారత్-పాకిస్థాన్ శాంతి నెలకొనాలని ప్రగాఢంగా ఆకాంక్షించింది. 1999లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో తన తండ్రి కెప్టెన్ మణ్ దీప్ సింగ్ వీర మరణం పొందేనాటికి తనకు రెండేళ్లు అని తెలిపింది. తన చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ఆయనతో గడిపే అవకాశం లేకుండా పోయిందని వాపోయింది. తన తండ్రి కారణమైందని పాకిస్థాన్ ను, అక్కడి ప్రజలను(ముస్లింలను) వ్యతిరేకించానని వెల్లడించింది. ఆరేళ్ల వయసులో బురఖా వేసుకుని వచ్చిన మహిళ తనపై హత్యాయత్నం చేసిందని గుర్తు చేసుకుంది. తన తండ్రి చావుకు ఆమే కారణమన్న అనుమానం కూడా కలిగిందని చెప్పింది. అయితే తండ్రి మరణానికి పాకిస్థాన్ కారణం కాదని, యుద్ధం వల్లే ఆయన తమకు దూరమయ్యాడని తన తల్లి వివరించడంతో రియలైజ్ అయినట్టు పేర్కొంది. తన తండ్రిలాగే సైనికుడిగా పోరాడుతున్నానని, భారత్-పాకిస్థాన్ మధ్య శాంతి కోసం పోరుబాట పట్టానని వెల్లడించింది. రెండు దేశాల ప్రభుత్వాలు పంతాలకు పోకుండా సమస్యల పరిష్కారానికి నడుం బిగించాలని విజ్ఞప్తి చేసింది. రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ఫ్రాన్స్, జర్మనీ మిత్రులుగా మారాయని.. జపాన్, అమెరికా గతం మర్చిపోయి అభివృద్ధి పథంలో సాగుతున్నాయని గుర్తు చేసింది. అలాంటప్పుడు భారత్-పాకిస్థాన్ ఎందుకు చేతులు కలపకూడదని ప్రశ్నించింది. రెండు దేశాల్లోని సామాన్య ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని, యుద్ధాన్ని కాదని స్పష్టం చేసింది. ఇరు దేశాల పాలకుల నాయకత్వ పటిమను పశ్నిస్తున్నానని, అసమర్థ నాయకుల పాలన ఉండాలని కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. బేషజాలను పక్కన పెట్టి చర్చలు జరపాలని, పరిష్కారం కనుగొనాలని కోరింది. తీవ్రవాదానికి, గూఢచర్యానికి, విద్వేషాలకు పాల్పడవద్దని రెండు దేశాలకు విజ్ఞప్తి చేసింది. సరిహద్దులో మారణహోమం ఆగాలని కౌర్ ఆకాంక్షించింది.