న్యూఢిల్లీ: ఏబీవీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తన ప్రచారాన్ని విరమిస్తున్నట్లు లేడీ శ్రీరాం కాలేజీ విద్యార్థిని, కార్గిల్ అమరుడి కుమార్తె గుర్‌మెహర్ కౌర్ ప్రకటించినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. ఆమెపై బీజేపీ నాయకుల మాటల దాడి కొనసాగుతోంది. గుర్‌మెహర్ కౌర్ ను సమర్థించేవారు పాకిస్థాన్ అనుకూలురని, ఇటువంటి వారిని దేశం నుంచి వెళ్లగొట్టాలని హర్యానా మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించారు.
ఎవరు భారతీయులో, ఎవరు దేశ వ్యతిరేకులో నిర్ణయించే అధికారం ఏబీవీపీకి ఎక్కడదని... ఆ హక్కు ఎవరు ఇచ్చారని ఆర్జేడీ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ ప్రశ్నించారు.
‘ఆమెను సమర్థించేవారిని వెళ్లగొట్టండి’
Published Wed, Mar 1 2017 12:55 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM
Advertisement
Advertisement