Haryana Minister
-
పంజాబ్‌ను నీళ్లడిగాం..పొగ కాదు: హరియాణా మినిస్టర్
చండీగఢ్: పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంపై హరియాణా మంత్రిప్రకాష్ దలాల్ మండిపడ్డారు.తాము పంజాబ్‌ను నీళ్లడిగామని, పొగ కాదని సెటైర్ వేశారు. మూడురోజులుగా పంజాబ్,హరియాణాల్లోని పొలాల్లో తగలబెడుతున్న పంటవ్యర్థాల గణాంకాలను దలాల్ శనివారం ట్విటర్లో వెల్లడించారు.పంజాబ్‌లోనే ఎక్కువగా పంట వ్యర్థాలు కాల్చేస్తున్నారని ఆరోపించారు. కాగా,దలాల్ ఆరోపణలపై పంజాబ్ సర్కారు స్పందించింది.హరియాణా మంత్రి అన్నీఅబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారని మండిపడింది. దేశంలోని 52 అత్యంత కాలుష్య జిల్లాల్లో ఎక్కువ హర్యానాలో ఉన్నవేనని కౌంటర్ ఇచ్చింది. -
రాహుల్ గాంధీ ఓ నిపా వైరస్
చండీగఢ్ : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిపా వైరస్‌తో సమానమని హరియాణా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఆదివారం ఆయన చేసిన ఈ ట్వీట్‌పై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొడుతున్నారు. ‘రాహుల్ గాంధీ నిపా వైరస్‌తో సమానం. ఏ రాజకీయ పార్టీ అతనితో కలసినా నాశనం కావల్సిందే.’ అని అనిల్ విజ్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇక ఈ బీజేపీ మంత్రి ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. భగత్ సింగ్, లాలా లజపతిరాయ్‌లు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించారని, కానీ నెహ్రు, మహాత్మ గాంధీలు కనీసం ఓ లాఠి దెబ్బకూడ తినలేదని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పట్టం కట్టినప్పుడు సైతం అనిల్ విజ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. నిపా వైరస్‌తో కేరళలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. పక్షులు తిని పడేసే పండ్లు వల్ల వచ్చే ఈ వైరస్ తొలిసారి 1998 మలేషియాలో గుర్తించారు. राहुल गांधी #निपाह वायरस के समान है । जो भी राजनीतिक पार्टी इसके सम्पर्क में आएगी वह फना हो जाएगी । — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) May 27, 2018 -
‘ఆమెను సమర్థించేవారిని వెళ్లగొట్టండి’
న్యూఢిల్లీ: ఏబీవీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తన ప్రచారాన్ని విరమిస్తున్నట్లు లేడీ శ్రీరాం కాలేజీ విద్యార్థిని, కార్గిల్ అమరుడి కుమార్తె గుర్మెహర్ కౌర్ ప్రకటించినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. ఆమెపై బీజేపీ నాయకుల మాటల దాడి కొనసాగుతోంది. గుర్మెహర్ కౌర్ ను సమర్థించేవారు పాకిస్థాన్ అనుకూలురని, ఇటువంటి వారిని దేశం నుంచి వెళ్లగొట్టాలని హర్యానా మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించారు. ఎవరు భారతీయులో, ఎవరు దేశ వ్యతిరేకులో నిర్ణయించే అధికారం ఏబీవీపీకి ఎక్కడదని... ఆ హక్కు ఎవరు ఇచ్చారని ఆర్జేడీ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ ప్రశ్నించారు. -
మంత్రితో వాగ్వాదం.. మహిళా ఐపీఎస్‌పై వేటు!
చండీగఢ్: హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్‌తో వాగ్వాదం చేసిన మహిళా పోలీస్ అధికారిణిపై చర్యలు తీసుకున్నారు. ఫతేహబాద్ ఎస్పీ సంగీతా కలియాపై బదిలీ వేటు వేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వివరాలిలా ఉన్నాయి. మంత్రి అనిల్ విజ్.. ఫతేహబాద్ జిల్లా గ్రీవెన్స్, ప్రజా సంబంధాల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఫతేహబాద్ ఎస్పీ సంగీతా కలియా వచ్చారు. జిల్లా పరిధిలోని గ్రామాల్లో అక్రమ మద్యం అమ్మకాలపై ఏ చర్యలు తీసుకున్నారని మంత్రి ఎస్పీని ప్రశ్నించారు. ఏడాదిగా ఎక్సైజ్ చట్టం కింద దాదాపు 2500 కేసులు నమోదు చేసినట్టు ఆమె వివరించారు. దీంతో సంతృప్తి చెందని మంత్రి.. మద్యం మాఫియాతో పోలీసులకు సంబంధాలున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. అయితే ఇది ప్రభుత్వ వ్యవహారమని, మద్యం అమ్మకాలకు లైసెన్స్ ఇచ్చింది ప్రభుత్వమేనని ఎస్పీ ఘాటుగా బదులిచ్చారు. దీంతో ఆగ్రహించిన మంత్రి సమావేశం నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆమెను ఆదేశించారు. అందుకు ఎస్పీ తిరస్కరించడంతో మంత్రి సమావేశం నుంచి వాకౌట్ చేశారు. సమావేశంలో బీజేపీ నాయకులు, కమిటీ సభ్యులు ఆయన్ను అనుసరించారు. మంత్రి ఈ విషయాన్ని హరియాణా డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీపై బదిలీ వేటు వేసినట్టు సమాచారం. -
మంత్రిగారికి చుక్కలు చూపించిన మహిళ
-
మంత్రిగారికి చుక్కలు చూపించిన మహిళా అధికారి
చండీగడ్ : హర్యానా ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ అధ్యక్షతన జరిగిన గ్రీవియన్స్ అండ్ అంబాలా పబ్లిక్ రిలేషన్స్ కమిటీ సమావేశం రసాభాసగా మారడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఓ మహిళా పోలీసు అధికారిపై దురుసుగా ప్రవర్తించి ఆయన వివాదంలో ఇరుక్కున్నారు. అంబాలా జిల్లాలో జరిగిన పబ్లిక్ రిలేషన్స్ కమిటీ సమావేశం సందర్భంగా డీఎస్పీ సంగీతా కాలియాపై గెట్ అవుట్ అంటూ విరుచుకుపడ్డారు. అంతేకాకుండా డిప్యూటీ కమిషనర్ ఎన్కే సోలంకిపై అభ్యంతరకరమైన రీతిలో ఘర్షణకు దిగి తన ప్రకోపాన్ని ప్రదర్శించారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఫతేబాద్ గ్రీవియన్స్ అండ్ అంబాలా పబ్లిక్ రిలేషన్స్ కమిటీ సమావేశానికి మంత్రి అనిల్ విజ్ హాజరయ్యారు. తమ తమ ఫిర్యాదులతో వచ్చిన జనంతో అక్కడంతా కోలాహలంగా ఉంది. ఇంతలో అక్రమ మద్యం అమ్మకాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన డీఎస్పీ సంగీతా కాలియా... అక్రమ మద్యాన్ని నిరోధించడానికి తాము చేయాల్సిందంతా చేస్తున్నామన్నారు. గత పదినెల కాలంలో సుమారు 2500 కేసులు నమోదు చేశామని, ఇదొక రికార్డని సమాధానం ఇచ్చారు. అయితే ఆమె సమాధానంపై సంతృప్తి చెందని మంత్రి గారు విరుచుకుపడ్డారు. ఒకదశలో గెట్ అవుట్ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. అయినా మహిళా పోలీసు అధికారి.. మంత్రి ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. తానేమీ తప్పు చేయలేదని వాదించారు. దీంతో ఇద్దరి మధ్యా కాసేపు వాగ్వాదం చెలరేగింది. అయినా సంగీత ఎక్కడా వెనక్కి తగ్గలేదు. విధి నిర్వహణలో తాము సక్రమంగానే ఉన్నామంటూ స్పష్టం చేశారు. దీంతో అసహనానికి గురైన మంత్రి అనిల్ సహచరులు, కమిటీ సభ్యులు సహా సమావేశం నుంచి బైటికి వెళ్ళిపోయారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ మీటింగ్‌ను కొనసాగించారు. అయితే ఈ ఆరోపణలను మంత్రి అనిల్ విజ్ ఖండించారు. డిఎస్పీ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించిందనీ, అందుకే మంత్రిగా తాను అలా ప్రవర్తించాల్సి వచ్చిందంటూ తన వైఖరిని సమర్ధించుకున్నారు. సక్రమంగా పని చేయని ప్రభుత్వ అధికారులపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఫిర్యాదులు చేయడానికి వచ్చిన కొంతమంది సభ్యులను అడ్డుకుంటుంటే తాను వారించానంటూ వివరణ ఇచ్చారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రికి, డీజీపికి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు. -
‘మోదీ మాతో ఏం చేయిస్తున్నాడో ఏంటో?’
చండీగఢ్: హరియాణాలో అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్ర సామాజిక న్యాయమంత్రి కృషాన్ కుమార్ బేడీతో పెద్ద తలనొప్పే వచ్చిపడింది. బేడీ ఆదివారం ఫతేహాబాద్లో నిర్వహించిన ‘స్వచ్ఛభారత్’ ప్రచారంలో పాల్గొన్నారు. చీపురు పట్టి ఊడుస్తూ... ‘మా చేత మోదీ ఏమేం చేయిస్తున్నాడో అర్థం కావడం లేదు’ అని అన్నారు. దీంతో అక్కడున్న వారు నవ్వేశారు. అన్ని మాధ్యమాల్లో వీడియో పాకేసింది. ఆయన్ను దీనిపై వివరణ కోరగా... ‘మోదీ చెప్పారన్న కారణంతో కొంత మంది అధికారులు బలవంతంగా చీపుర్లు పడుతున్నారే తప్ప వారిలో చిత్తశుద్ధి లేదన్నది నా దృష్టికి వచ్చింది. ఈ ధోరణి పోయి హరియాణా అంతా పరిశుభ్రంగానే కాదు, సంపూర్ణ ఆరోగ్యంగా కూడా ఉండాలన్న కోణంలోనే నేనలా మాట్లాడా’ అని బదులిచ్చారు. -
'మంత్రి నాతో అసభ్యంగా మాట్లాడారు'
ఓ మహిళా డాక్టర్ ఆరోపణ హర్యానా మంత్రిపై మండిపాటు కురుక్షేత్ర: హర్యానాలోని ఒక మంత్రికి, మహిళా వైద్యురాలికి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ తీవ్ర వివాదానికి కారణమైంది. ఫోన్లో తన పట్ల ఆయన చాలా అసభ్యంగా మాట్లాడారని, కఠిన పదజాలం ఉపయోగించారని ఆమె ఆరోపించారు. దాదాపు 30 ఏళ్ల నుంచి ప్రభుత్వ సర్వీసులో ఉన్న కురుక్షేత్ర చీఫ్ మెడికల్ ఆఫీసర్ వందనా భాటియా.. తనకు మంత్రితో మూడున్నర నిమిషాల పాటు జరిగిన సంభాషనను రికార్డు చేసి, సీడీ కూడా పదిమందికీ పంచారని ఆరోపణలు వచ్చాయి. 'డాక్టరువా.. పశువులు కాసుకునేదానివా' అని మంత్రి అన్నట్లుగా ఆ సంభాషణలో ఉంది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కృషణ్ కుమార్ బేడీ ఈ అంశాన్ని ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో డాక్టర్‌పై ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు అనిల్ విజ్ ఫిర్యాదుచేశారు. ఈ విషయం కేబినెట్ సమావేశంలో చర్చకు రాలేదని, దీన్ని తగిన పద్ధతిలోనే తేలుస్తామని ఆర్థికమంత్రి అభిమన్యు తెలిపారు. సీఎంఓను సస్పెండ్ చేశారంటూ వచ్చిన వార్తలను అధికార ప్రతినిధి ఖండించారు.