ఓ మహిళా డాక్టర్ ఆరోపణ
హర్యానా మంత్రిపై మండిపాటు
కురుక్షేత్ర:
హర్యానాలోని ఒక మంత్రికి, మహిళా వైద్యురాలికి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ తీవ్ర వివాదానికి కారణమైంది. ఫోన్లో తన పట్ల ఆయన చాలా అసభ్యంగా మాట్లాడారని, కఠిన పదజాలం ఉపయోగించారని ఆమె ఆరోపించారు. దాదాపు 30 ఏళ్ల నుంచి ప్రభుత్వ సర్వీసులో ఉన్న కురుక్షేత్ర చీఫ్ మెడికల్ ఆఫీసర్ వందనా భాటియా.. తనకు మంత్రితో మూడున్నర నిమిషాల పాటు జరిగిన సంభాషనను రికార్డు చేసి, సీడీ కూడా పదిమందికీ పంచారని ఆరోపణలు వచ్చాయి.
'డాక్టరువా.. పశువులు కాసుకునేదానివా' అని మంత్రి అన్నట్లుగా ఆ సంభాషణలో ఉంది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కృషణ్ కుమార్ బేడీ ఈ అంశాన్ని ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో డాక్టర్పై ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు అనిల్ విజ్ ఫిర్యాదుచేశారు. ఈ విషయం కేబినెట్ సమావేశంలో చర్చకు రాలేదని, దీన్ని తగిన పద్ధతిలోనే తేలుస్తామని ఆర్థికమంత్రి అభిమన్యు తెలిపారు. సీఎంఓను సస్పెండ్ చేశారంటూ వచ్చిన వార్తలను అధికార ప్రతినిధి ఖండించారు.
'మంత్రి నాతో అసభ్యంగా మాట్లాడారు'
Published Fri, Jan 30 2015 8:00 PM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM
Advertisement