Woman Doctor
-
అంబానీ డీప్ ఫేక్ వీడియో : లక్షల స్కాం వెలుగులోకి
‘కూటికోసం కోటి విద్యలు’ అనేదాన్ని ‘కోటి మోసాలు’గా మార్చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఏదో ఒక రకంగా ప్రజలను మభ్య పెట్టి, మోసాలకు పాల్పడుతున్నారు. ఈ కోవలోకి డీప్ ఫేక్ వీడియోలు వచ్చి చేరుతున్నాయి. సామాన్యుల నుంచి, ఉన్నతాధికారులు, డాక్టర్లు, ఆఫీసర్లు. హై ఫ్రొఫైల్ వ్యక్తుల దాకా నమ్మించి బోల్తా కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా బిలియనీర్, ప్రముఖ వ్యాపారవేత్త పేరుతో డీప్ ఫేక్ వీడియో ద్వారా రూ.7లక్షలు మోసానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.ఏం జరిగిందంటే..రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పేరుతో తయారు చేసిన డీప్ ఫేక్ వీడియో ద్వారా ముంబైలోని అంధేరికి చెందిన మహిళా ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ కె హెచ్ పాటిల్ నుంచి రూ.7 లక్షలు కొల్లగొట్టారు నేరగాళ్లు. అధిక రాబడి కోసం ‘రాజీవ్ శర్మ ట్రేడ్ గ్రూప్’ కంపెనీకి చెందిన బీసీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ అకాడమీలో చేరాలని అంబానీ రికమెండ్ చేస్తున్నట్టు ఈ వీడియోను సృష్టించారు. తద్వారా తక్కువ పెట్టుబడికే, అధిక రాబడులు వస్తాయని నమ్మ బలికారు. ఏప్రిల్ 15న తన ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను చూసిన పాటిల్ ఆన్లైన్లో వెరిఫై చేయడానికి ప్రయత్నించినా కూడా అసలు విషయాన్ని పసిగట్టలేకపోయింది. లండన్, ముంబైలో కార్యాలయాలు ఉన్నాయని నమ్మి, పలుమార్లు నగదును డిపాజిట్ చేసింది. మే-జూన్ నెలల మధ్య 16 వేర్వేరు ఖాతాల్లో మొత్తంగా రూ. 7.1 లక్షలు జమ చేయగా, దీనికి రూ.30 లక్షల లాభాన్ని ఆర్జించినట్టు ట్రేడింగ్ వెబ్ సైట్లో కనిపిస్తోంది. కానీ దానిని విత్‌డ్రా చేసుకొనే అవకాశంలేకపోవడంతో అనుమానం వచ్చింది. చివరికి మోస పోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్ పాటిల్ డబ్బు బదిలీ చేసిన 16 బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. ఈ లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నారు. -
అత్త కొడుకుతో సన్నిహితం, ఏడు నెలల గర్భం.. బలవంతంగా ప్రసవం
చెన్నై: గర్భం దాల్చిన మైనర్ బాలికకు గుట్టుచప్పుడు కాకుండా ఓ మహిళా డాక్టర్ ప్రసవం చేసింది. దీంతో బాలిక అస్వస్థతకు గురై మృతిచెందింది. విషయం బయటకు పొక్కడంతో డాక్టర్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో సేలం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఇందిరానగర్‌కు చెందిన జగదీశన్ కుమార్తె ఐశ్వర్య (17) అత్త కొడుకుతో సన్నిహితంగా ఉండేది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు వాలప్పాడిలో ఉన్న డాక్టర్ సెల్వంపాల్ రాజ్‌కుమార్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన డాక్టర్ సెల్వం పాల్ ఆమె ఏడు నెలల గర్భవతి అని తెలిపారు. శనివారం ఉదయం ఐశ్వర్యకి ప్రసవం పేరుతో అబార్షన్ చేయడానికి ప్రయత్నించారు. కానీ అబార్షన్ వీలుకాకపోడంతో బాలికకు ప్రసవం చేశారు. దీంతో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం బాలిక అస్వస్థత ఏర్పడింది. వెంటనే వైద్యం కోసం అంబులెన్స్‌లో సేలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐశ్వర్యను వైద్యులు పరిశీలించి మృతి చెందినట్టు నిర్ధారించారు. పుట్టిన శిశువుకు సేలం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సేలం జిల్లా వైద్య సేవల డైరెక్టర్ వరమతి, ప్రభుత్వ ఆసుపత్రి చీఫ్ డాక్టర్ జయశెల్వి, పేలూరు జిల్లా వైద్యాధికారి నంబలం, ఇతర సభ్యులు డాక్టర్ సెల్వం పాల్‌ను విచారిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వైద్యురాలితోపాటు బాలిక గర్భం దాల్చడానికి కారణమైన బంధువుపై చర్యలు తీసుకోనున్నారు. -
మహిళా డాక్టర్ ఆత్మహత్య.. అదే కారణమా?.. మరేదైనానా?
సాక్షి, చెన్నై(వేలూరు): ప్రేమ వివాహం చేసుకున్న ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. కేరళ రాష్ట్రానికి చెందిన గాయత్రి (32) వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తుంది. అదే ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న తూత్తుకుడికి చెందిన సెల్వకుమార్‌ను ప్రేమించి, నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరూ తొర్రపాడిలోని గాంధీనగర్‌లో కాపురం ఉంటున్నారు. దంపతులకు సంతానం లేక పోవడంతో వీరిద్దరు మాత్రమే ఉంటున్నారు. దంపతులు ఇద్దరికీ మార్చి, మార్చి డ్యూటీలు ఉండడంతో వీరు ఇద్దరూ ఇంట్లో కలిసి ఉండడం లేదు. ఇదిలా ఉండగా సెల్వకుమార్ మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లారు. అక్కడ నుంచి ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆదివారం సాయంత్రం భార్యకు సెల్వకుమార్ ఫోన్ చేయగా ఫోన్ తీయలేదు. దీంతో ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చిన డాక్టర్ సెల్వకుమార్ ఇంట్లో పరిశీలించగా అప్పటికే గాయత్రి ఒక గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గమనించి, బాగాయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి విచారణ జరుపుతున్నారు. మహిళా డాక్టర్ సంతానం లేకపోవడంతోనే మనో వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నారా? లేక వేరే ఏమైనా కారణాలున్నాయా ?అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. చదవండి: (Khammam: వివాహేతర సంబంధమే ఆమె ప్రాణం తీసిందా..?) -
మ్యాట్రిమోనిలో పరిచయం.. మహిళా డాక్టర్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
సాక్షి, చెన్నై: వివాహం చేసుకుంటానని నమ్మించి మహిళా డాక్టర్ వద్ద రూ.13 లక్షలు మోసం చేసిన నకిలీ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నై అడయార్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళా డాక్టర్ ఒకరు వివాహం కోసం మాట్రిమోని వెబ్సైట్లో చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో చెన్నై నావలూర్కు చెందిన కార్తీక్ రాజ అలియాస్ దినేష్ కార్తీక్ (28) ఆ వివరాలతో మహిళా డాక్టర్‌తో తాను కూడా డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమె వద్ద నుంచి రూ. 12.95 లక్షలు, ఒక ఫోన్ తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో గత కొన్ని రోజుల క్రితం మహిళా డాక్టర్ నేరుగా కలుసుకుని వివాహం గురించి మాట్లాడదామంటూ కోరగా కార్తిక్రాజ తిరస్కరించాడు. దీంతో అతనిపై సందేహం ఏర్పడిన మహిళా డాక్టర్ ఈ విషయం గురించి తన బంధువు ఒకరికి వివరించింది. అతను వెంటనే అడయారు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కార్తీక్‌రాజ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం నిందితుడిని విచారణ చేశారు. ప్రేమ పేరుతో పలువురు యవతులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. బీకాం పూర్తి చేసి డాక్టర్‌గా ప్రచారం చేసుకుంటున్నట్లు నిర్ధారించారు. రూ. 98 వేలు నగదు, 5 సెల్ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు. చదవండి: మూడేళ్ల క్రితం పెళ్లి.. రెండేళ్ల పాప.. భార్యతో గొడవపడి.. -
భర్త వివాహేతర సంబంధం.. మహిళా డాక్టర్ ఏం చేసిందంటే..?
సాక్షి, పాట్నా: వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. ఇలాంటి సంబంధాల కారణంగా మహిళలపై దాడులు, హత్యలు కూడా జరుగుతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళా డాక్టర్ రోడ్డు మీదకు వచ్చి నిరసనకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. దర్భంగా మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న డాక్టర్ రేణు ప్రభకు, కతిహర్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న డాక్టర్ సంతోష్‌తో అయిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే సంతోష్ కొంత కాలంగా రేణు ప్రభను పట్టించుకోకపోవడంతో ఆమె అతడిపై నిఘా వేసింది. ఈ క్రమంలో తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న తెలుసుకొని షాక్‌కు గురైంది. దీంతో అతడిని నిలదీసింది. కానీ, అతడి ప్రవర్తనలో మార్పు రాకపోగా వారిద్దరిని సంతోష్ పట్టించుకోవడమే మానేశాడు. దీంతో, రేణు..తనకు న్యాయం చేయాలని కోల్‌కత్తాకు చెందిన ఎన్జీవో మహిళా వికాస్ మంచ్‌ను ఆశ్రయించింది. దీంతో సదరు ఎన్జీవో కార్యకర్తలు సంతోష్‌ను కలిసి మాట్లాడే ప్రయత్నం చేయగా అతను నిరాకరించాడు. మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం పెట్టుకొని తనపట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడని బీహార్‌లోని కతిహార్ వీధుల్లో నిరసనకు దిగింది. అంతేగాక భర్త విషయంలో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించనున్నట్టు ఆమె పేర్కొంది. ఈ క్రమంలో కతిహర్ మెడికల్ కాలేజీలో ఈ దంపతుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. -
గూగుల్ డూడుల్‌లో కనిపిస్తున్న ఈ వైద్యురాలు ఎవరంటే..
Google Doodle Dr Kamal Ranadive : మానవాళి సంక్షేమం కోసం కృషి చేసిన వారికి, వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారిని గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో గౌరవించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా గూగుల్ ఓ భారతీయ వైద్యురాలిని స్మరించికుంది. ఈ మేరకు సోమవారం నాడు ఆమెకు సంబంధించి ప్రత్యేక డూడుల్‌ని క్రియేట్ చేసింది. ఈ డూడుల్‌లో కనిపిస్తున్న వైద్యురాలి పేరు డాక్టర్ కమల్ రణదీవ్. నవంబర్ 8న డాక్టర్ కమల్ రణదీవ్ 104వ జయంతి. ఈ నేపథ్యంలో గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో స్మరించుకుంది. డాక్టర్ రణదీవ్, ఒక భారతీయ కణ జీవశాస్త్రవేత్త. సంచలనాత్మక క్యాన్సర్ పరిశోధనలతో గుర్తింపు తెచ్చుకున్నారు. డాక్టర్ రణదీవ్ సైన్స్, విద్య ద్వారా మరింత సమానమైన సమాజాన్ని సృష్టించేందుకు కృషి చేశారు. రణదీవ్ డూడుల్‌ని భారతదేశానికి చెందిన అతిథి కళాకారుడు ఇబ్రహీం రేయింటకత్ చిత్రీకరించారు. (చదవండి: ‘ఝాన్సీ కీ రాణి’.. ఈ పాఠం రాసింది ఈమెనే!) డాక్టర్ రణదీవ్ గురించి.. కమలా సమరాథ్ అలియాస్ కమలా రణదీవ్ 1917, నవంబర్ 8న పుణెలో జన్మించారు. తండ్రి ప్రోత్సాహంతో చదువులో రాణించిన కమలా రణదీవ్.. వైద్య విద్యను అభ్యసించారు. కాకపోతే తనుకు బయాలజీ అంటే చాలా ఇష్టమని ఒకానొక సందర్భంలో తెలిపారు. ఇండియన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్లో పని చేస్తూ కణ శాస్త్రంలో చేసిన పరిశోధనలకు గాను ఆమెకు డాక్టరేట్ వచ్చింది. అనంతరం అమెరికా మేరిల్యాండ్, బాల్టిమోరిలోని జాన్స్ హోప్కిన్స్ యూనివర్శిటీలో ఫెలోషిప్ పొందారు. ఆ తర్వాత ముంబై తిరిగి వచ్చి.. ఐసీఆర్సీలో చేరారు. అక్కడ డాక్టర్ రణదీవ్ దేశంలోని తొలి టిష్యూ కల్చర్ లాబరేటరీని ఏర్పాటు చేశారు. ఐసీఆర్సీ డైరెక్టర్‌గా పని చేస్తూనే క్యాన్సర్ వ్యాధిపై పరిశోధన చేశారు. ఈ క్రమంలో రొమ్ము క్యాన్సర్‌కి, వంశపారంపర్యానికి మధ్య గల సంబంధాన్ని గుర్తించడమే కాక కొన్ని వైరస్‌లకు, క్యాన్సర్‌కు మధ్య లింక్‌ను గుర్తించిన మొదటి పరిశోధకురాలిగా రణదీవ్ గుర్తింపు పొందారు. (చదవండి: వారెవ్వా.. పేన్లను దంచి వ్యాక్సిన్ తయారు చేశాడు) ఓ వైపు ఈ పరిశోధన చేస్తూనే.. మరోవైపు రణదీవ్ కుష్టు వ్యాధిని కలిగించే మైకోబాక్టీరియం లెప్రేపై పరిశోధనలు చేయడమే కాక వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేశారు. శాస్త్రీయ రంగంలో మహిళలకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో రణదవ్, మరో 11 మంది సహోద్యోగులతో కలసి 1973లో సి ఇండియన్ వుమెన్ సైంటిస్ట్ అసోసియేషన్‌ని ప్రారంభించినట్లు గూగుల్ డూడుల్ పేజ్‌లో పేర్కొంది. రణదీవ్ 1989లో రిటైర్ అయ్యారు. పదవీవిరమణ అనంతరం ఆమె మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో పని చేశారు. అక్కడి మహిళలను ఆరోగ్యకార్యకర్తలుగా శిక్షణ ఇచ్చారు. ఆరోగ్యం, పోషకాహార విద్యను నేర్పించారు. అంతేకాక విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు, ఇండియన్ స్కాలర్స్‌ని భారతదేశం తిరిగి వచ్చి.. వారి చదువు, జ్ఞానాన్ని తమ దేశ పౌరుల అభివృద్ధి కోసం వినియోగించాల్సిందిగా కోరేవారు. చదవండి: చీరకట్టులో విమానం నడిపింది.. ఈ గౌరవం అందుకే! -
మహిళ డాక్టర్‌పై ఐటీ కమిషనర్ లైంగిక దాడి.. బెదిరింపులు
ముంబై : పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళా డాక్టర్‌పై ఐటీ కమిషనర్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరికి మహిళ గర్భం దాల్చి పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆమె అశ్లీల ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరికి చెందిన 33 ఏళ్ల మహిళ నాగ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. నేషనల్ అకాడమీ ఆఫ్ డెరెక్ట్ ట్యాక్సెస్‌లో శిక్షణ కోసం 2019లో నాగ్‌పూర్ వెళ్లాడు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లగా అక్కడ పనిచేసే వైద్యురాలితో పరిచయం ఏర్పడింది. తాను యూపీఎస్పీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు చెప్పడంతో వైద్యురాలికి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఈ స్నేహం కాస్తా ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటానని భరోసా ఇచ్చి మహిళతో శారీరక సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో ఆమెపై అనేకసార్లు లైంగికదాడికి పాల్పడి.. మహిళ అశ్లీల ఫోటోలను తీసుకొని భద్రంగా దాచుకున్నాడు. ఇటీవల ఆ మహిళ గర్భవతి అవ్వడంతో నిందితుడు ఆమెకు అబార్షన్ చేయించాడు. బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో ఆమె అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని నిందితుడు బెదిరించాడు. తనను మోసం చేశాడని సదరు మహిళ నాగ్‌పూర్ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 376 (2) కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు బెంగళూర్‌లో విధులు నిర్వహిస్తున్నాడని, నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదని పోలీస్ అధికారి తెలిపారు. విచారణ కొనసాగుతుందన్నారు. -
నా గతం విషాదం.. ఇప్పుడు నేను డాక్టర్ని
‘కాంచన’ సినిమా గుర్తుందా?! అందులో కాంచన ఓ ట్రాన్స్‌జెండర్. గీత అనే మరో ట్రాన్స్‌జెండర్‌ను చేరదీసి డాక్టర్ చదువు చదివిస్తుంటుంది. ఆ సినిమాలో గీత డాక్టర్ కాకుండానే దుండగులు అడ్డుకుంటారు. నిజ జీవితంలో సమాజంలో మాత్రం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూనే ఓ ట్రాన్స్‌జెండర్ డాక్టర్‌గా ఎదిగింది. ‘‘నా గతం ఓ విషాదం. ఇప్పుడు నేనో డాక్టర్ని’’ అని గర్వంగా చెబుతున్న ఆమె పేరు డాక్టర్ త్రినేత్ర. ‘కర్ణాటక రాష్ట్రంలో మొదటి ట్రాన్స్ ఉమన్ డాక్టర్‌గా త్రినేత్ర హల్దార్ గమ్మరాజు గుర్తింపు పొందింది. బెంగళూరులో త్రినేత్రను ఒకప్పుడు అంగద్ గమ్మరాజు అని పిలిచేవారు. లింగమార్పిడి చేయించుకున్న తర్వాత అంగద్ తన తల్లి దుర్గ పేరు మీద ‘త్రినేత్ర’ అని పేరు మార్చుకుంది. తన కుటుంబ సహకారంతోనే డాక్టర్ని అయ్యానని అంటోంది. ‘‘నేను ట్రాన్స్జెండర్ని అనే కారణంగా చిన్నప్పటి నుండి చాలా అవమానాలను ఎదుర్కొన్నాను. ఇప్పటివరకు రకరకాల అసభ్యకర పేర్లతో నన్ను పిలిచేవారు. మొదట్లో నా మనసును అవి విపరీతంగా బాధించేవి. వాటిని అన్నీ సహిస్తూనే చదువు మీద దృష్టి పెట్టాను. ఇటీవలే మెడికల్ కాలేజీ హాస్పిటల్ ప్రాక్టికల్ సెషన్లో ఒక మహిళకు ప్రసవాన్ని చేశాను. ఆ బిడ్డను నా చేతుల్లోకి తీసుకున్న క్షణం నా జీవితంలో మరపురానిది’’ అని ఆనందంగా వివరించింది త్రినేత్ర. ప్రస్తుతం ఆమె మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్ హాస్పిటల్ లో పనిచేస్తోంది. ఈశాన్యభారతంలో బియాన్సీ లాయిష్రామ్ ఫస్ట్ ట్రాన్స్‌జెండర్ డాక్టర్‌గా వార్తల్లోకి ఎక్కారు. ఇప్పుడు ఆ తర్వాత స్థానం దక్షిణ భారత దేశంలో త్రినేత్ర దక్కించుకుంది. లక్ష్యంవైపు గురి ఉంటే ఎన్ని అవమానాలు ఎదురైనా అనుకున్నది సాధించవచ్చు అని నిరూపిస్తోంది త్రినేత్ర. (మగవాళ్ల ఆట మీకెందుకు.. అంతేనా?) -
ఆ వైద్యురాలు కరోనాను జయించారు కానీ..
న్యూఢిల్లీ : కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నవారి పట్ల కూడా కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో కరోనాను జయించిన ఒక వైద్యురాలిపై ఆమె పక్కింటి వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమె ఇంట్లో ఉండగానే బయటి నుంచి తాళం వేశాడు. ఆ వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. వివరాల్లోని వెళితే.. దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఓ పెద్ద అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సదరు వైద్యురాలు ఓ హాస్పిటల్లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ సమయంలో ఆమెకు కరోనా సోకడంతో వైఎంసీఏ ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించారు. (చదవండి : కరోనా ఉందని ఆస్పత్రిలో చేర్పిస్తే.. శ్మశానానికి పంపారు) చికిత్స అనంతరం రెండు వరుస టెస్టుల్లో కరోనా నెగిటివ్‌గా తేలడంతో వైద్యులు బుధవారం ఆమెను డిశ్చార్జి చేశారు. దీంతో ఆమె తన నివాసానికి చేరుకున్నారు. అయితే వైద్యురాలు ఇంటికి చేరుకున్న సమయంలో ఆ అపార్ట్మెంట్లోని ఓ వ్యక్తి ఆమెతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో భయపడిపోయిన ఆమె స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ‘నేను కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్టు చెప్పినా.. ఆ వ్యక్తి వినిపించుకోలేదు. నాతో అసభ్యకరంగా మాట్లాడటంతో పాటుగా.. నేను అపార్ట్మెంట్లో నివాసం ఉండటానికి వీలు లేదంటూ బెదిరింపులకు దిగాడు. నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు. దీంతో అపార్ట్మెంట్ అధ్యక్షుడితో మాట్లాడుకోవాలని చెప్పి.. నేను నా ఫ్లాట్ లోపలికి వెళ్లిపోయాను. అయితే నేను లోపలికి వెళ్లగానే అతను బయటి నుంచి తాళం వేశాడు. నువ్వు ఇంటి నుంచి వెళ్లిపోవాలని నాపై బెదిరింపులకు దిగాడు. దీంతో నేను భయంతో పోలీసులకు, నా ఆస్పత్రి సిబ్బందికి ఫోన్ చేశాను. ప్రస్తుతం నేను నా ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటున్నాను. ఈ ఘటన జరిగిన తర్వాత నాకు చాలా భయం వేస్తుంది. నా భద్రత గురించి ఆందోళనగా ఉంది’ అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వైద్యురాలి ఫిర్యాదుపై లోతైన దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు చెప్పారు. కాగా, పలు చోట్ల కరోనా విధులు నిర్వరిస్తున్న వైద్యుల పట్ల కూడా కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి : చైనాకు అక్రమంగా మాస్కులు, పీపీఈ కిట్లు) -
వైరల్ వీడియా షేర్ చేసిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి అక్కడక్కడ అవమానాలు ఎదురవుతున్నాయి. కోవిడ్-19 పోరుపై మనల్ని గెలిపించడానికి అనుక్షణం యుద్ధం చేస్తున్న వైద్యనారాయణులను సముచితంగా గౌరవిస్తున్న దృశ్యాలు కూడా ఇప్పుడు కనబడుతున్నాయి. ఇలాంటి అపురూప ఘటనకు సంబంధించిన ఒక వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. కోవిడ్-19 బాధితులకు నిర్విరామంగా 20 రోజుల పాటు ఐసీయూలో వైద్య సేవలు అందించిన ఇంటికి తిరిగొచ్చిన మహిళా వైద్యురాలిని ఆమె కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు పూలతో స్వాగతించిన అపురూప ఘట్టం ఈ వీడియోలో ఉంది. చప్పట్లు, ప్లకార్డులతో ఊహించని విధంగా తనకు లభించిన సాదర స్వాగతానికి సదరు మహిళా వైద్యురాలు భావోద్వేగానికి గురైన అపురూప క్షణాలు అందులో ఉన్నాయి. ‘ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయి. ఇది భారతదేశం యొక్క ఆత్మ. మనం ధైర్యంగా కోవిడ్-19తో పోరాడుతున్నాం. ముందుండి పనిచేసేవారంటే మనకెంతో గర్వకారణమ’ని ప్రధాని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మహిళా వైద్యురాలిపై నెటిజనులు అభినందనలు కురిపిస్తున్నారు. (కరోనా విపత్తు: భారీ ఉపశమనం) -
కరోనా.. మహిళా వైద్యురాలికి వేధింపులు
సూరత్ : కరోనా వైరస్‌పై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్యులపై కొన్ని చోట్ల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న ఓ మహిళా వైద్యురాలికి దారుణమైన పరిస్థితి ఎదురైంది. వైద్యురాలి పొరుగింటి వ్యక్తి ఆమెతో దురుసుగా ప్రవర్తించాడు. ఆమెను దూషించడమే కాకుండా.. దాడికి కూడా యత్నించాడు. వివరాల్లోకి వెళితే.. సూరత్ సివిల్ హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా డాక్టర్‌పై పొరుగింటి వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెను దారుణంగా తిట్టడంతో పాటు, భౌతికంగా దాడి చేయాలని చూశాడు. ఆమె వల్ల తమకు కూడా కరోనా వస్తుందని అర్థం లేని మాటలు మాట్లాడాడు. డాక్టర్‌పై దాడి జరుగుతున్నా పక్కన ఉన్నవారు చూస్తూ ఉండిపోయారు. ఓ మహిళ అతన్ని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అతను వినిపించుకోవలేదు. అయితే ఆ వ్యక్తి తనతో ప్రవర్తించిన తీరును ఆ వైద్యురాలు ఫోన్లో వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేసిన కాంగ్రెస్ నేత శ్రీవత్స.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని కోరారు. ఇప్పటికే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ లభించక ఇబ్బందులు పడుతున్న వైద్యులు.. ఇప్పుడు సమాజంలో కూడా ఒంటరి కావాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. -
ఈ భార్యతో వేగలేను.. టెక్కీ భర్త ఆవేదన
కర్ణాటక ,బనశంకరి: ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు చూడాలని బలవంతం చేస్తున్న మహిళా డాక్టర్‌తో కాపురం చేయలేనని టెక్కీ భర్త తేల్చిచెప్పాడు. ఈ సంఘటన బెంగళూరులో వెలుగుచూసింది. వివరాలు.. కోల్‌కతాకు చెందిన మహిళా వైద్యురాలు (32), ఉత్తరప్రదేశ్ కు చెందిన 33 ఏళ్ల సాప్ట్వేర్ ఇంజనీర్ ఓ మాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా సంబంధం కుదుర్చుకుని 2018లో పెళ్లి చేసుకుని బెంగళూరులో కాపురం పెట్టారు. కొన్నిరోజులకే భార్య ప్రవర్తన అతనికి విరక్తి కలిగించింది. పోర్న్ వీడియోలను చూడాలని ఆమె భర్తను ఒత్తిడి చేసేది. భర్త మాత్రం తనకు అలాంటి అలవాటు లేదని చెప్పేవాడు. ఆమె ఒత్తిడి తట్టుకోలేక వీడియోలను చూడడం మొదలుపెట్టాడు. ఒకరోజు భార్య మొబైల్లో ఆమె అశ్లీల వీడియోను చూసి కంగుతిన్నాడు. దీనిపై భార్యను అడగ్గా అతను తన మాజీ ప్రియుడని, అన్నీ మరచిపోదామని నచ్చజెప్పింది. భర్త అనుమానంతో ఇంటర్నెట్లో వెతగ్గా అటువంటి వీడియోలు మరికొన్ని బయటపడ్డాయి. భార్యను నిలదీయగా ఎలా అప్లోడ్ అయింది అనేది తెలియదని చెప్పింది. భార్య ప్రవర్తన నచ్చక అతడు విడిగా ఉంటున్నాడు. దీంతో భార్య నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కుటుంబ సమస్యల పరిష్కార కేంద్రాన్ని సంప్రదించింది. భర్త తనను ఇంటికి తీసుకెళ్లడం లేదని ఆరోపించింది. దీంతో కేంద్రం సీనియర్ సలహాదారు బీఎస్.సరస్వతి దంపతులిద్దరినీ పిలిపించి మాట్లాడారు. భార్య వ్యవహారం మొత్తం పూసగుచ్చినట్లు చెప్పాడు. భార్య మాత్రం గతంలో జరిగింది మరచిపోయి భర్తతో కలిసి ఉంటానని చెప్పింది. కలిసిమెలిసి ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. -
మహిళా డాక్టర్‌కు బస్సులో లైంగిక వేధింపులు
చెన్నై,టీ.నగర్: ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తున్న మహిళా డాక్టర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కండక్టర్ పోలీసుల సమక్షంలో ఆమె కాళ్లపై పడి క్షమాపణ కోరాడు. చెన్నై పెరంబూరుకు చెందిన 28 ఏళ్ల మహిళ సిద్ధ వైద్యురాలు. వల్లలార్ మండ్రంతో కలిసి సామాజిక సేవలు చేస్తుంటారు. ఈమె సోమవారం రాత్రి కోయంబేడు నుంచి తిరువారూరు జిల్లా, మన్నార్గుడికి ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు. బస్సు కండక్టర్‌గా రామనాథపురం జిల్లా ముదుగళత్తూరుకు చెందిన రాజు (32), డ్రైవర్ గణేశమూర్తి ఉన్నారు. బస్సులో మహిళా డాక్టర్ నిద్రిస్తుండగా ఆమెకు కండక్టర్ లైంగిక వేధింపులు జరిపాడు. దీంతో ఆమె కేకలు వేసింది. ఇలావుండగా బుధవారం తెల్లవారుజామున బస్సు కుంభకోణం చేరుకుంది. దీంతో ఆమె అక్కడున్న పోలీసు ఔట్‌పోస్ట్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న అక్కడి బస్సు డ్రైవర్లు, కండక్టర్లు రాజు వద్ద క్షమాపణ చెప్పిస్తామని తెలిపారు. దీంతో కండక్టర్ రాజు ఆమె కాళ్లపై పడి క్షమాపణ కోరాడు. అయినప్పటికీ మహిళ మనసు మారలేదు. దీంతో ఆగ్రహించిన రాజు ఆమెను అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఆమె మళ్లీ కుంభకోణం వెస్ట్ పోలీసు స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేసింది. -
గోవా బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటుం వైద్యురాలు మృతి
-
గోవా బీచ్‌లో జగ్గయ్యపేట వైద్యురాలు మృతి
జగ్గయ్యపేట: గోవా బీచ్‌కి వెళ్లిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఓ వైద్యురాలు మంగళవారం మృత్యువాత పడింది. అలల తాకిడికి యువతి సముద్రంలోకి కొట్టుకుపోయింది. జగ్గయ్యపేటలోని మార్కండేయ బజార్‌కు చెందిన ఊటుకూరి ఆంజనేయులు స్థానిక కోర్టులో గుమాస్తాగా పనిచేస్తూ కొంత కాలం క్రితం మృతి చెందారు. అతనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. చిన్న కుమార్తె రమ్యకృష్ణ (25) ఎంబీబీఎస్ పూర్తి చేసి జగ్గయ్యపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొంత కాలం పని చేసింది. మూడేళ్ల క్రితం గోవాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యురాలిగా చేరింది. మంగళవారం ఆరుగురు స్నేహితులతో కలసి ఆమె గోవా బీచ్‌కు వెళ్లింది. బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అయితే సముద్రంలో ఒక్కసారిగా వచ్చిన అలలకు రమ్యకృష్ణతోపాటు మరో స్నేహితురాలు కూడా గల్లంతయ్యారు. గమనించిన చుట్టుపక్కల వారు ఆమె స్నేహితురాలిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకురాగా రమ్యకృష్ణ మాత్రం దొరకలేదు. కొద్దిసేపటికి ఆమె మృతదేహం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : గోవా బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటుం వైద్యురాలు మృతి -
మహిళా డాక్టర్‌పై టీడీపీ కార్పొరేటర్ వీరంగం
-
ఛేజ్ చేసి మహిళా డాక్టర్‌ను కాపాడాడు
చెన్నై: చెన్నైలో ఓలా క్యాబ్ డ్రైవర్ ఓ మహిళా డాక్టర్‌పై లైంగికదాడికి ప్రయత్నించాడు. మరో ఇద్దరితో కలసి ఆమెను బలవంతంగా కారులో తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కారు వెనుక వాహనంలో వెళ్తున్న ఓ వ్యక్తి డాక్టర్ అరుపులు విని చేజ్ చేసి స్థానికులతో కలసి ఆమెను రక్షించాడు. మహిళా డాక్టర్ దక్షిణ చెన్నైలోని ఇంజంబక్కమ్ ప్రాంతంలో ఉంటోంది. ఆమె ఉత్తర చెన్నైలోని అంబట్టూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. గత ఆదివారం రాత్రి నైట్ షిఫ్ట్‌కు వెళ్లేందుకు క్యాబ్ మాట్లాడుకుంది. వీకెండ్ కావడంతో ఆదివారం ట్రాఫిక్ తక్కువగా ఉంది. క్యాబ్ డ్రైవర్ దారి మధ్యలో కారు ఆపగా, మరో ఇద్దరు వచ్చి వెనుక సీట్లో డాక్టర్‌కు అటూ ఇటూ కూర్చున్నారు. డాక్టర్ డ్రైవర్‌ను ప్రశ్నించగా, వాళ్లు తన స్నేహితులను, దారి మధ్యలో దిగిపోతారని చెప్పాడు. డాక్టర్‌కు అనుమానం రావడంతో తన ఫ్రెండ్‌కు మెసేజ్ పంపి, కారును ఆపాల్సిందిగా డ్రైవర్‌కు చెప్పింది. కాగా డ్రైవర్ కారు ఆపకుండా మరింత వేగంగా వెళ్లగా, వెనుక కూర్చున్న ఇద్దరూ ఆమెను వేధించడం మొదలుపెట్టారు. సాయం చేయాల్సిందిగా డాక్టర్ కేకలు వేయడంతో వెనుక వాహనంలో వస్తున్న వ్యక్తి కారును ఛేజ్ చేసి ఆపాడు. స్థానికులు గుమికూడటంతో కారులో వెనుక ఉన్న ఇద్దరూ పరారయ్యారు. స్థానికులు క్యాబ్ డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. పోలీసులు క్యాబ్ డ్రైవర్ మరుదును విచారించి మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. -
సీఎంగారూ.. మంత్రిగారి పీఎస్ వేధించాడు
ముంబై: మహారాష్ట్ర వైద్య శాఖ మంత్రి దీపక్ సావంత్ వ్యక్తిగత కార్యదర్శి తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళా డాక్టర్ ఆరోపించింది. జల్గావ్ జిల్లాకు వైద్యురాలు ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు లేఖ రాసింది. గత మార్చిలో మంత్రి సావంత్‌ను కలిసేందుకు వెళ్లినపుడు ఆయన పీఎస్ సునీల్ మాలి తనను మరో ఛాంబర్లోకి తీసుకెళ్లి దాదాపు రెండుగంటల సేపు అనుచితమైన, వ్యక్తిగత సంబంధిత ప్రశ్నలు అడిగినట్టు వైద్యురాలు ఆరోపించింది. అతడిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరింది. ఈ ఘటన జరిగిన తర్వాత మూడు నెలల వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న మీడియా ప్రశ్నకు.. తనను బదిలీ చేస్తారని భయపడ్డానని ఆమె చెప్పింది. సునీల్ ఆగడాలపై ఫిర్యాదు చేసేందుకు ఇప్పుడు మరికొందరు ముందుకు వచ్చారని, దీంతో తాను సీఎంకు లేఖ రాశానని వెల్లడించింది. కాగా వైద్యురాలి ఆరోపణలను సునీల్ తోసిపుచ్చాడు. తనను అప్రతిష్టపాలుజేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించాడు. -
కూకట్‌పల్లిలో మహిళా డాక్టర్ అదృశ్యం
హైదరాబాద్: కూకట్‌పల్లిలో ఓ మహిళా డాక్టర్ అదృశ్యమైన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నాగ దుర్గారాణి అనే మహిళ ఓ ప్రైవేటు ఆస్ప్రతిలో జూనియర్ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో విధుల్లో భాగంగా ఆస్పత్రికి వెళ్లిన ఆమె ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెళ్లి పేరుతో వైద్యురాలికి రూ. 48 లక్షలు టోకరా
న్యూఢిల్లీ: పెళ్లి పేరుతో ఓ మహిళా డాక్టర్‌ను మోసం చేసి ఆమె నుంచి 48 లక్షల రూపాయలు కాజేశారు. హైదరబాద్‌కు చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆర్నెళ్ల క్రితం అభిషేక్ మోహన్ అనే వ్యక్తి తాను ఇంగ్లండ్‌లో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానని, తగిన వధువు కావాలని ఓ వెబ్సైట్లో వివాహ ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన చూసి హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా డాక్టర్ మోహన్‌తో సంప్రదించింది. భారత్ సంతతికి చెందిన బ్రిటీష్ పౌరుడినని మోహన్ ఆమెతో చెప్పాడు. ఆ తర్వాత రోజూ ఆన్లైన్లో చాటింగ్ చేసుకునేవారు. కొంతకాలం తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లండ్ ఫోన్ నెంబర్లతో పాటు భారత్‌కు చెందిన ఓ సిమ్‌తో మాట్లాడేవాడని మహిళా డాక్టర్ చెప్పింది. డిస్కౌంట్ ధరతో వైద్య పరికరాలు కొన్నానని, ఉగ్రవాద నిర్మూలన చర్యలకు సహకరించినందుకు ఇరాక్ ప్రభుత్వం బంగారు నగలను బహుమతిగా ఇచ్చిందని మోహన్ చెప్పాడు. వీటి విలువ దాదాపు 5 కోట్ల రూపాయలు వరకు ఉంటుందని తెలిపాడు. భారత్‌లో ఉన్న తన బంధువులపై నమ్మకంలేదని, మహిళా డాక్టర్ ఇంటికి పంపుతానని చెప్పాడు. గత ఏప్రిల్ 7న మహిళా డాక్టర్‌కు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. కస్టమ్స్ ఇన్స్పెక్టర్ అని చెప్పుకున్న ఆ వ్యక్తి.. మోహన్ పంపిన వస్తువులు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాయని, వీటి విలువ కోట్ల రూపాయల్లో ఉన్నందున పన్ను కట్టాలని చెప్పాడు. అభిషేక్ మహిళా డాక్టర్‌కు ఫోన్ చేసి కస్టమ్స్ ఫీజు కట్టాల్సిందిగా కోరాడు. దీంతో ఆమె 20 లక్షల రూపాయలను ఓ ఎకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత వేర్వేరు పన్నుల పేరుతో మహిళా డాక్టర్ నుంచి మరో 28 లక్షలు వసూలు చేశారు. ఆమె తన స్నేహితుల దగ్గర కొంత, బ్యాంక్‌లో లోన్ చేసి ఈ మొత్తం చెల్లించింది. ఆ తర్వాత అభిషేక్‌కు ఫోన్ చేయగా స్విచాఫ్ అని వచ్చింది. ఎయిర్‌పోర్టు అధికారులను సంప్రదించగా అలాంటి పార్సిల్ ఏమీ రాలేదని చెప్పారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్‌కు బదిలీ చేశారు. ఢిల్లీ పోలీసులు విచారణ జరిపి గుర్గావ్లో ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నారు. అభిషేక్ మోహన్‌గా ప్రకటన ఇచ్చిన వ్యక్తి పెళ్లి పేరుతో చాలా మంది అమ్మాయిలతో పరిచయం చేసుకున్నాడని, ఏదో కారణం చెప్పి డబ్బు కావాలంటూ కొందరి ప్రపోజ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. -
లేడీ డాక్టర్ కాలర్ పట్టుకున్న మంత్రి
జమ్మూ: సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి ఓ మహిళా వైద్యురాలి కోటు కాలర్ పట్టుకోవడం కలకలం రేపింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జమ్ముకాశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రి చౌదరీ లాల్ సింగ్... అమరనాథ్ యాత్ర ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా లఖన్ పూర్ ప్రభుత్వాసుప్రతిని సందర్శించారు. ఈ సందర్భంగా ఓ మహిళా వైద్యురాలు తన తెల్లకోట్టు కాలర్ సరిగా పెట్టుకోకపోవడాన్ని గమనించిన మంత్రి ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని పట్టుకుని సరిచేశారు. 'అమ్మాయీ నువ్వు కాలర్ సరిగా పెట్టుకోలేదు' అంటూ తన చేత్తో కాలర్ ను స్వయంగా సరిచేశారు. ఇదంతా గమనిస్తున్న మరో లేడీ డాక్టర్ తనంతట తానే కాలర్ ను సరిచేసుకున్నారు. మంత్రి వెంట ఉన్నతాధికారులు ఉన్నారు. వైద్యురాలి కాలర్ ను మంత్రి సరిచేసే సమయంలో అక్కడ చాలా మంది జనం ఉన్నారని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కాగా, మహిళా వైద్యురాలిని మానసికంగా వేధించారని గత ఫిబ్రవరిలో చౌదరీ లాల్ సింగ్ పై ఆరోపణలు వచ్చాయి. -
కుమార్తెపైనే తండ్రి లైంగిక వేధింపులు?
టీనగర్ (చెన్నై): తన తండ్రి లైంగికంగా వేధించి, నిర్బంధించినట్లు ఓ మహిళా డాక్టర్ మహిళా పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన లూర్థురాజ్ చెన్నైలో కెమికల్ వ్యాపారం చేస్తున్నారు. ఇతనికి భార్య వసంత ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. ప్రస్తుతం వీరు చెన్నై ఎర్నావూరు రామకృష్ణానగర్‌లో నివసిస్తున్నారు. కుమార్తె నందిని చెన్నైలో ప్రైవేటు దంత వైద్యురాలిగా పని చే స్తున్నారు. నందినికి మానసిక స్థితి సరిలేదని చెప్పి ఆమె తండ్రి, బంధువులు పాళయంకోట్టైలోని మానసిక వికలాంగుల కేంద్రంలో నిర్బంధించారు. అక్కడికి నందినితో పనిచేసిన డాక్టర్, స్నేహితురాళ్లు వచ్చారు. దీంతో నందిని వారికి జరిగిన సంఘటన గురించి తెలుపగా వారు నందినితో మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అంతలోనే హోం నుంచి నందినిని కిడ్నాప్ చేసినట్లు హోం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ జరిపారు. పోలీసుల విచారణలో అనేక వివరాలు వెలుగు చూశాయి. నందిని మానసిక రోగి కాదని, చదువుతున్న సమయంలో యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించిందని, తండ్రి లూర్థురాజ్ కుమార్తెను లైంగికంగా వేధించడంతో, ఆమె 15 రోజుల క్రితం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. వెంటనే ఆమెను పాళయంకోట్టైలోగల ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, అక్కడ నుంచి పాళయంకోట్టైలో గల మానసిక వికలాంగుల కేంద్రంలో నిర్బంధించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి లూర్థురాజ్తోపాటు అతనికి సహకరించిన వారి కోసం గాలిస్తున్నారు. తండ్రిపై అభాండాలు: తల్లి వసంత వివాహమైన డాక్టర్‌తో నందినికి సంబంధం వున్నందున దీనిని దారి మళ్లించేందుకే తండ్రిపై అభాండాలు వేస్తున్నట్లు నందిని తల్లి వసంత ఆరోపించారు. చెన్నైకు చెందిన డాక్టర్ దినేష్ తన మొదటి భార్య వుండగానే ఆస్పత్రిలో పనిచేస్తున్న మరొక మహిళా డాక్టర్‌ను వివాహం చేసుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు వివాహాన్ని అడ్డుకున్నారని చెప్పారు. ప్రస్తుతం అతను తన కుమార్తెను లొంగదీసుకున్నాడని, అతడి ప్రేమ మోహంలో ఉన్న నందిని తన తండ్రిపైనే అభాండాలు వే స్తోందని వసంత తెలిపారు. -
వాసి ఉంది రాశి లేదు!
ఇప్పుడంటే మహిళా డాక్టర్లు ఈమాత్రమైనా కనిపిస్తున్నారు కానీ భారతదేశంలో ఒక మహిళ డాక్టర్ అవడం అంత తేలిగ్గా జరిగిన పని కాదు. డాక్టర్ అయేందుకు మొదటి తరం మహిళలు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అలా కష్టపడి భారత్‌లో మొట్టమొదటి ఫిజీషియన్ అయిన ఘనత ఇద్దరు మహిళలకు దక్కుతుంది. ఇంచుమించుగా వారిద్దరూ ఒకేసారి డాక్టర్లయినప్పటికీ తొలి డాక్టర్‌గా ఆనందీబాయి గోపాల్‌రావు జోషీనే పరిగణిస్తారు. ఆ రెండో మహిళ కాదంబినీ గంగూలీ. ఈ ఇద్దరిలో ఆనందీబాయి జోషీ డాక్టర్‌గా రూపొందినతీరు ఆసక్తిదాయకం. మహిళలందరికీ స్ఫూర్తిదాయకం. అయినప్పటికీ ఈ వందేళ్లలోనూ పెరిగిన మహిళా డాక్టర్ల సంఖ్య తక్కువేనంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆనందీబాయి మహారాష్ట్రలోని కళ్యాణ్ పట్టణంలో ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టింది. తొమ్మిదో ఏటనే ఆమెను ఆమెకన్నా కళ్యాణ్‌లో పోస్టల్ విభాగంలో పనిచేసే గోపాల్‌రావు కిచ్చి పెళ్లిచేశారు. ఆనందీ పద్నాల్గవ ఏట ఆమెకు ఓ మగపిల్లాడు పుట్టాడు. వైద్యసదుపాయం లేనందువల్ల పుట్టిన పదిరోజులకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండాయి. ఇదే ఆనందీబాయి జీవితంలో ఒక పెద్ద మలుపుగా పరిణమించింది. పురుష వైద్యులే చాలా తక్కువైన ఆ రోజుల్లో తన భార్య డాక్టర్ కోర్సు చదవాలనీ, తద్వారా తన పిల్లల్లాంటి ఎందరో పిల్లల్ని మరణపు కోరల బారిన పడకుండా కాపాడాలని గోపాల్‌రావు భావించాడు. భర్త సూచనను ఆనందీ ఆనందంగా ఆమోదించడమే కాదు... తాను అమెరికాలో మెడిసిన్ చేయాలనుకుంటున్నట్లుగా చెప్పింది. ఆనందీ తన మనసులోని ఉద్దేశం చెప్పగానే గోపాల్‌రావు... ‘‘నువ్వు తప్పక డాక్టరీ చదువు. భారత చరిత్రలో అల్లోపతి ప్రక్రియలో మొట్టమొదటి మహిళావైద్యురాలిగా చరిత్ర సృష్టించాలి’’ అంటూ ప్రోత్సహించాడు. అంతేకాదు... యూఎస్‌లో తన భార్య మెడిసిన్ చదివేందుకు గల అవకాశాలపై సమాచార సేకరణ మొదలుపెట్టాడు. ఎట్టకేలకు న్యూజెర్సీలోని రోజెల్లీ ప్రాంతానికి చెందిన థియోడీసియా అనే మహిళకు ఆనందీ ఆసక్తి గురించి తెలిసి, ఆశ్రయం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అయితే అనుకోకుండా ఆనందీ ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. ఆనందీ రోగ లక్షణాలను వివరిస్తూ గోపాలరావు థియోడీసియాకు ఉత్తరాలు రాసేవాడు. వాటి ఆధారంగా ధియోడీసియా ఆనందీ కోసం అమెరికా నుంచి మందులు పంపించేది. కానీ అవేవీ సత్ఫలితాలు ఇవ్వలేదు. దాంతో తానే స్వయంగా మెడిసిన్ చదువుకోవాలనే సంకల్పం ఆనందీలో బలపడింది. ఈ లోగా అమెరికాలో ఉన్న థార్బర్న్ అనే వైద్యదంపతులు ఆనందీకి పరిచయమయ్యారు. ‘పెన్సిల్వేనియా మహిళా వైద్య కళాశాల’ ఆనందీ చదువుకోడానికి చాలా అనువైన కాలేజీగా వారు సూచించారు. తాను అమెరికా వెళ్లి చదువుకోవాలని భావిస్తున్నట్లు సెరంపూర్ కాలేజీ హాల్లో ప్రకటించింది ఆనందీ. అంతే! ఆ ప్రాంతంలోనే కాదు... తాను పుట్టిన ఊళ్లోని జోషీ కుటుంబాల నుంచి కూడా ఆమెకు తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఆ రోజుల్లో వారి సామాజిక వర్గానికి చెందిన పురుషులు సైతం సముద్రాన్ని దాటి విదేశాలకు వెళ్లడాన్ని పాపంగా పరిగణించేవారు. కానీ ఈ ఆంక్షలన్నింటినీ పక్కన పెట్టి ఆనందీ అమెరికాకు పయనమైంది. థార్బార్న్ దంపతుల సహాయంతో పెన్సిల్వేనియా మెడికల్ కాలేజీలో చేరింది. మెడికల్ కాలేజీలో చేరేనాటికి ఆమె వయసు 19 ఏళ్లు. అక్కడి వాతావరణం సరిపడక ఆమెకు ఆరోగ్యం మరింత క్షీణించింది. అయినా ఇలాంటి ఎన్నో అవరోధాలను లెక్క చేయక తన వైద్య విద్యను కొనసాగించింది. ఎట్టకేలకు 1886 మార్చి 11న ఆమె తన ఎండీ పట్టా పుచ్చుకుంది. ఈ సందర్భంగా క్వీన్ విక్టోరియా ఆమెకు తన అభినందనలను తెలియజేసింది. ఎట్టకేలకు పట్టాపుచ్చుకుని ఆమె భారత్ తిరిగి వచ్చింది. తాను మెడిసిన్ చదువుకోడాన్ని నిరాకరిస్తూ ఏ ప్రాంతంలోనుంచైతే విపరీతమైన ఒత్తిడి ఎదురైందో... అక్కడే ఆనందీకి అత్యంత వైభవమైన స్వాగతం లభించింది. అయితే ఆనందీ అమెరికాలో పట్టా పొందిన ఏడాదే (1886లో) కలకత్తా మెడికల్ కాలేజీ నుంచి కాదంబినీ గంగూలీ కూడా పట్టాపొందింది. ఇంచుమించూ ఈ ఇద్దరు మహిళలూ మొదటితరానికి చెంది డాక్టర్లుగా ఒకేసారి ఆవిర్భవించారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే- ఈ తరంలో ఎందరో మహిళలు డాక్టరీ చదువుతున్నారు. కానీ... వాళ్లంతా గైనకాలజిస్టులు, అబ్స్టెట్రీషియన్స్, చిన్నపిల్లల నిపుణులైన పీడియాట్రీషియన్, జనరల్ ఫిజీషియన్ లాంటి కోర్సులే తప్ప... న్యూరోసర్జరీ, యూరాలజీ, యాండ్రాలజీ లాంటి కోర్సులు చదవడం తక్కువే. అయినా, డాక్టర్ నమితా గంజావాలా లాంటి కొద్దిమంది మహిళలు తమను తాము ‘సెక్సాలజిస్టు’లుగా సగర్వంగా ప్రకటించుకుంటారు. అంతెందుకు... భారతదేశంలోనే ప్రఖ్యాతి పొందిన ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ ప్రకాశ్ కొఠారీ... గుజరాత్‌కు చెందిన తన పేషెంట్లను ఆమె వద్దకే రిఫర్ చేస్తుంటారు. ప్రస్తుతం సూరత్‌లో సెక్సాలజిస్ట్‌గా ప్రాక్టీస్ కొనసాగిస్తున్న నమితా... ‘‘సెక్స్ పట్ల వివక్ష అన్నది మన మెదడులో మాత్రమే ఉంటుంది. నా పేషెంట్లు నా దగ్గరికి వచ్చినప్పుడు అంతగా బెరుకు లేకుండానే తమ సమస్యలు చెప్పుకుంటుంటారు. అయినా అనేకమంది పురుషులు గైనకాలజిస్టులుగా పనిచేస్తున్నప్పుడు ఒక మహిళ సెక్సాలజిస్ట్‌గా పనిచేయడంలో అవరోధం ఏముంటుంది?’’ అంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే- గతంతో పోలిస్తే ఇవ్వాళ ఎంతో మంది మహిళా డాక్టర్లున్నారు. ఇక నర్సింగ్ రంగంలో దాదాపు అందరూ మహిళలే. అయినప్పటికీ ల్యాన్సెట్ అనే మెడికల్ జర్నల్‌లో 2011లో ‘‘హ్యూమన్ రిసోర్సెస్ ఫర్ హెల్త్ ఇన్ ఇండియా’’ శీర్షికతో ప్రచురితమైన కథనం ప్రకారం... వైద్యరంగంలో మహిళల భూమిక ఇంకా 17 శాతం మాత్రమే. అంటే ఆకాశంలో సగమైన మహిళ వైద్యరంగంలో ఇంకెంత పురోగమించాల్సిన అవసరం ఉందో తెలుస్తూనే ఉందిగా! -
'మంత్రి నాతో అసభ్యంగా మాట్లాడారు'
ఓ మహిళా డాక్టర్ ఆరోపణ హర్యానా మంత్రిపై మండిపాటు కురుక్షేత్ర: హర్యానాలోని ఒక మంత్రికి, మహిళా వైద్యురాలికి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ తీవ్ర వివాదానికి కారణమైంది. ఫోన్లో తన పట్ల ఆయన చాలా అసభ్యంగా మాట్లాడారని, కఠిన పదజాలం ఉపయోగించారని ఆమె ఆరోపించారు. దాదాపు 30 ఏళ్ల నుంచి ప్రభుత్వ సర్వీసులో ఉన్న కురుక్షేత్ర చీఫ్ మెడికల్ ఆఫీసర్ వందనా భాటియా.. తనకు మంత్రితో మూడున్నర నిమిషాల పాటు జరిగిన సంభాషనను రికార్డు చేసి, సీడీ కూడా పదిమందికీ పంచారని ఆరోపణలు వచ్చాయి. 'డాక్టరువా.. పశువులు కాసుకునేదానివా' అని మంత్రి అన్నట్లుగా ఆ సంభాషణలో ఉంది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కృషణ్ కుమార్ బేడీ ఈ అంశాన్ని ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో డాక్టర్‌పై ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు అనిల్ విజ్ ఫిర్యాదుచేశారు. ఈ విషయం కేబినెట్ సమావేశంలో చర్చకు రాలేదని, దీన్ని తగిన పద్ధతిలోనే తేలుస్తామని ఆర్థికమంత్రి అభిమన్యు తెలిపారు. సీఎంఓను సస్పెండ్ చేశారంటూ వచ్చిన వార్తలను అధికార ప్రతినిధి ఖండించారు. -
మహిళా డాక్టర్‌పై యాసిడ్ దాడి
న్యూఢిల్లీ : నగరంలో మహిళలకు రక్షణ కరువైంది.అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో మరో ఘోరం జరిగింది. ముపై ఏళ్ల వైద్యురాలిపై దుండగులు మోటార్‌బైక్‌పై దూసుకొచ్చి యాసిడ్ దాడికి ఒడిగట్టారు. ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలోని రాజోరీ గార్డెన్ సమీపంలో మంగళవారం ఉదయం 9.30 గంటలకు చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఈఎస్ఐ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అమ్రితాకౌర్కి పెళ్లి అయి 8 నెలలు అవుతుంది. రాజోరిగార్డెన్లో నివాసం ఉంటుంది. ఉదయం టూవీలర్‌పై వెళ్తుండగా మోటార్ బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై యాసిడ్ దాడి చేసి, హ్యాండ్ బ్యాగ్ దొంగిలించారు. ఈ దాడిలో బాధితురాలి ముఖం, తలపై మంటలు వ్యాపించడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఎఐఐఎంఎస్‌కు తరలించారు. ప్రాణానికి ప్రమాదమేమీ లేదని పోలీసులు వెల్లడించారు. ఆమె పనిచేసే ఈఎస్ఐ ఆస్పత్రి ఉన్న బాలీనగర్కు కొద్ది దూరంలోనే ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. దుండగులను శిక్షించాలి : ఆప్ న్యూఢిల్లీ : నగరంలో మహిళా డాక్టర్‌పై యాసిడ్ దాడికి పాల్పడిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని ఆమ్ఆద్మీపార్టీ ఢిల్లీ కన్వీనర్ అశుతోష్ డిమాండ్ చే శారు. మంగళవారం ఆయన ఈఘటనపై మీడియాతో మాట్లాడారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి సకాలంలో కేసు విచారణ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇలాంటి కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవరిస్తే, దుండగులకు చట్టం అంటే భయం లేకుండా పోతోందని అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని అన్నారు. తక్షణమే అన్నిచోట్ల సీసీటీవీ కెమెరాలు అమర్చాలని, సరిపడా పోలీసు సిబ్బంది నియమించాలని అన్నారు. రాజోరీ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు.