లేడీ డాక్టర్ కాలర్ పట్టుకున్న మంత్రి | Picture of J&K minister touching woman doctor's collar goes viral | Sakshi
Sakshi News home page

లేడీ డాక్టర్ కాలర్ పట్టుకున్న మంత్రి

Published Wed, Jul 1 2015 12:44 PM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

లేడీ డాక్టర్ కాలర్ పట్టుకున్న మంత్రి

లేడీ డాక్టర్ కాలర్ పట్టుకున్న మంత్రి

జమ్మూ: సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి ఓ మహిళా వైద్యురాలి కోటు కాలర్ పట్టుకోవడం కలకలం రేపింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జమ్ముకాశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రి చౌదరీ లాల్ సింగ్... అమరనాథ్ యాత్ర ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా లఖన్ పూర్ ప్రభుత్వాసుప్రతిని సందర్శించారు. ఈ సందర్భంగా ఓ మహిళా వైద్యురాలు తన తెల్లకోట్టు కాలర్ సరిగా పెట్టుకోకపోవడాన్ని గమనించిన మంత్రి ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని పట్టుకుని సరిచేశారు.

'అమ్మాయీ నువ్వు కాలర్ సరిగా పెట్టుకోలేదు' అంటూ తన చేత్తో కాలర్ ను స్వయంగా సరిచేశారు. ఇదంతా గమనిస్తున్న మరో లేడీ డాక్టర్ తనంతట తానే కాలర్ ను సరిచేసుకున్నారు. మంత్రి వెంట ఉన్నతాధికారులు ఉన్నారు.  వైద్యురాలి కాలర్ ను మంత్రి సరిచేసే సమయంలో అక్కడ చాలా మంది జనం ఉన్నారని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కాగా,  మహిళా వైద్యురాలిని మానసికంగా వేధించారని గత ఫిబ్రవరిలో చౌదరీ లాల్ సింగ్ పై ఆరోపణలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement