![Minor Girl Dies After Forced Childbirth Process In Salem Tamil Nadu - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/9/pregnent.jpg.webp?itok=XyCCjy--)
చెన్నై: గర్భం దాల్చిన మైనర్ బాలికకు గుట్టుచప్పుడు కాకుండా ఓ మహిళా డాక్టర్ ప్రసవం చేసింది. దీంతో బాలిక అస్వస్థతకు గురై మృతిచెందింది. విషయం బయటకు పొక్కడంతో డాక్టర్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో సేలం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఇందిరానగర్‌కు చెందిన జగదీశన్ కుమార్తె ఐశ్వర్య (17) అత్త కొడుకుతో సన్నిహితంగా ఉండేది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు వాలప్పాడిలో ఉన్న డాక్టర్ సెల్వంపాల్ రాజ్‌కుమార్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
బాలికను పరీక్షించిన డాక్టర్ సెల్వం పాల్ ఆమె ఏడు నెలల గర్భవతి అని తెలిపారు. శనివారం ఉదయం ఐశ్వర్యకి ప్రసవం పేరుతో అబార్షన్ చేయడానికి ప్రయత్నించారు. కానీ అబార్షన్ వీలుకాకపోడంతో బాలికకు ప్రసవం చేశారు. దీంతో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం బాలిక అస్వస్థత ఏర్పడింది. వెంటనే వైద్యం కోసం అంబులెన్స్‌లో సేలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐశ్వర్యను వైద్యులు పరిశీలించి మృతి చెందినట్టు నిర్ధారించారు.
పుట్టిన శిశువుకు సేలం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సేలం జిల్లా వైద్య సేవల డైరెక్టర్ వరమతి, ప్రభుత్వ ఆసుపత్రి చీఫ్ డాక్టర్ జయశెల్వి, పేలూరు జిల్లా వైద్యాధికారి నంబలం, ఇతర సభ్యులు డాక్టర్ సెల్వం పాల్‌ను విచారిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వైద్యురాలితోపాటు బాలిక గర్భం దాల్చడానికి కారణమైన బంధువుపై చర్యలు తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment