
బాలిక తన ఇంటి సమీపంలోని ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ విషయం వారివురి కుటుంబాలకు తెలిసింది. దీంతో బాలిక మైనర్ కావడంతో తనకి 18 ఏళ్లు నిండిన తర్వాత వారిద్దరికి పెళ్లి చేయాలని వారి కుటుంబీకులు నిర్ణయించుకున్నారు.
కొచ్చి: కేరళలోని మలప్పురంలో ఓ మైనర్ బాలిక తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో శారీరకంగా కలవడంతో గర్భం దాల్చింది. అయితే ఆ విషయం ఇంట్లో తల్లికి కూడా తెలియకుండా జాగ్రత్తపడింది. చివరకు డెలవరీ కూడా యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఆ బాలికే స్వయంగా చేసుకుంది. బాలిక తల్లి పాక్షికంగా అంధురాలు కావడంతో డెలివరీ రోజు ఇంట్లో పసికందు ఏడుపు వినిపించేంతవరకు ఈ విషయాన్ని గ్రహించలేకపోయింది. ఈ నెల 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. పాక్షికంగా అంధురాలైన ఓ మహిళ తన 17 ఏళ్ల కూతురితో కలిసి కొట్టకల్‌లో నివసిస్తోంది. బాలిక తన ఇంటి సమీపంలోని ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ విషయం వారివురి కుటుంబాలకు తెలిసింది. దీంతో బాలిక మైనర్ కావడంతో తనకి 18 ఏళ్లు నిండిన తర్వాత వారిద్దరికి పెళ్లి చేయాలని వారి కుటుంబీకులు నిర్ణయించుకున్నారు. అయితే, ఈ మధ్యలోనే బాలిక తన ప్రియుడితో శారీరకంగా కలవడంతో గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా ఆన్‌లైన్ తరగతుల పేరుతో ఎక్కువగా తన గదిలోనే ఉంటున్నట్లు తన తల్లిని నమ్మించింది.
చివరకు డెలవరీ కూడా యూట్యూబ్ వీడియోలు తన ఇంట్లోనే చేసుకుంది. ఇంట్లో పసికందు ఏడుపు వినపడడంతో బాలిక తల్లికి ఈ విషయం తెలిసింది. డెలివరీ చేస్తుండగా ప్రక్రియలో తనకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో బాలికతో పాటు బిడ్డని మంజేరిలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. దీనంతటికి కారకుడైన 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడితో రిలేషన్‌షిప్‌లో ఉన్నందున అతనిపై బాలిక వాంగ్మూలం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.
చదవండి: Miss Telangana 2018: లైవ్ వీడియోతో ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ మిస్ తెలంగాణ