youtube videos
-
రూ.5 వేల నుంచి రూ.100 కోట్లు వరకు - సామాన్యుడి సక్సెస్ స్టోరీ!
ఆధునిక కాలంలో డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలున్నాయి. ఇందులో ఒకటి యూట్యూబ్. ప్రస్తుతం యూట్యూబ్ రాజ్యమేలుతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీని ద్వారా సంపాదిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి విపరీతంగా పెరుగుతోంది. ఇండియాలో యూట్యూబ్ ద్వారా కోట్లు సంపాదిస్తున్న వారిలో 'భువన్ బామ్' (Bhuvan Bam) ఒకరు. ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భువన్ బామ్ యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు చేస్తూ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న వారి జాబితాలో ఒకరుగా ఉన్నారు. మ్యుజిషియన్‌గా కెరీర్ ప్రారభించిన భువన్ ఆ తరువాత యూట్యూబ్ ప్రారభించారు. దీని కోసం సింగింగ్ కెరీర్ వదులుకున్నట్లు సమాచారం. ఇతడు చేసిన మొదటి కామెడీ వీడియో బాగా పాపులర్ అయింది. దీంతో 'బీబీ కి వైన్స్' (BB Ki Vines) అనే సొంత సిరీస్ ప్రారభించాడు. స్పూప్ వీడియోలు.. బీబీ కి వైన్స్ సిరీస్‌లో భాగంగా వివిధ రకాల పాత్రలతో స్పూప్ వీడియోలు క్రియేట్ చేసి ఎక్కువ వ్యూవ్స్ పొందగలిగాడు. దెబ్బకు ఈ సిరీస్ పెద్ద హిట్ కొట్టింది. తన సొంత కుటుంబాన్ని మాత్రమే కాకుండా, ఫ్రెండ్స్ పాత్రలు కూడా పోషించి ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. ఇప్పటికి తన యూట్యూబ్ ఛానెల్‌కి 2.6 కోట్ల కంటే ఎక్కువమంది సబ్స్క్రైబర్స్ ఉన్నట్లు సమాచారం. వీడియోలు చాలా కామెడీగా ఉండటం వల్ల ఎక్కువ మంది వ్యూవ్స్ రావడంతో, ఇండియాలో టాప్ యూట్యూబర్లలో ఒకడుగా నిలిచాడు. కేవలం యూట్యూబ్ ఛానల్ వీడియోలు మాత్రమే కాకుండా.. అనేక వెబ్ సిరీస్‌లు కూడా ప్రారభించి సక్సెస్ సాధించాడు. దీంతో చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించాడు. ఇదీ చదవండి: వాడిన పూలతో కోట్ల బిజినెస్ - ఎలాగో తెలిస్తే షాకవుతారు! ప్రారంభంలో కేవలం రూ. 5000 పొందిన భువన్ క్రమంగా లక్షలు సంపాదించడం ప్రారంభించాడు. ప్రస్తుతం రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులని కలిగి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎంతోమంది యూట్యూబర్లకు రోల్ మోడల్‌గా నిలిచాడు. మొత్తానికి కష్టపడి ఎంతోమంది ప్రేక్షకులను ఆకర్శించి ఈ రోజు గొప్ప సక్సెస్ సాధించిన వారి జాబితాలో ఒకడిగా నిలిచాడు. కష్టపడి అంకిత భావంతో పనిచేయడమే సక్సెస్ మంత్రం అని ఇతని ద్వారా తెలుస్తుంది. -
నవతరం నయా ట్రెండ్ ‘వీ’ ట్యూబింగ్.. ఇంతకి ఏంటది?
మన దేశంలో టాప్ యూట్యూబర్స్ ఎవరు? అనే ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం కాకపోవచ్చు. కానీ ‘వీట్యూబర్స్ ఎవరు?’ అనే ప్రశ్నకు సమాధానం రాకపోగా ‘ఇంతకీ వారు ఎవరు?’ అనే ఎదురు ప్రశ్న ఎదురుకావచ్చు. జపాన్‌లో మంచి ఆదరణ ఉన్న వీట్యూబింగ్ (వర్చువల్ యూట్యూబ్ స్టార్స్) మన దేశంలోకి ప్రవేశించింది. పాపులర్ కావడానికి రెడీగా ఉంది... వెండిరంగు జుట్టు, వెరైటీ కళ్లద్దాలతో ఆకట్టుకునే జాక్నిఎక్స్ తన యూట్యూబ్ చానల్లో పాపులర్ వీడియో గేమ్స్ ఆడుతుంటాడు. జాక్నిఎక్స్కు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. అతడి ఆటను, మాటను అమితంగా ఇష్టపడుతుంటారు. నిజానికి జాక్నిఎక్స్ నిజం కాదు. దక్షిణాదికి చెందిక ఒక స్టూడెంట్ సృష్టించిన డిజిటల్ అవతార్! మన దేశంలో 90కి పైగా వీట్యూబ్ అవతార్స్ ఉన్నాయి. సాధారణంగా వీట్యూబ్ అవతార్స్ జపనీస్ యానిమేషన్ స్టైల్ ఫీచర్స్‌తో కనిపిస్తుంటాయి. ‘వీట్యూబింగ్’ అనేది 2016లో జపాన్‌కు పరిచయమైంది. స్ట్రీమ్గేమ్స్, ఇంటర్నెట్ ట్రెండ్స్, మ్యూజిక్, ఆర్ట్...ఇలా రకరకాల విభాగాల్లో వీట్యూబ్ అవతార్స్ వీక్షకులను వినోదపరుస్తున్నాయి. ‘వీట్యూబర్స్’ అనే పదం జపాన్‌లోనే పుట్టింది. రికు తజుమితో జపాన్‌లో ‘వీట్యూబర్స్’ ట్రెండ్ అగ్రస్థాయికి చేరుకుంది. 26 సంవత్సరాల రికు తజుమి జపాన్‌లోని యంగెస్ట్ బిలియనీర్లలో ఒకరు కావడానికి కారణం ‘ఎనీ కలర్’ అనే స్టార్టప్. యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లోనే 21 సంవత్సరాల వయసులో ఇచికర (శూన్యం నుంచి) అనే ఎంటర్టైన్మెంట్ స్టార్టప్‌ను మొదలు పెట్టాడు రికు. ఆ తరువాత దీని పేరును ‘ఎనీ కలర్’గా మార్చాడు. వీట్యూబర్స్ ప్రపంచంలో ‘ఎనీ కలర్’ అగ్రస్థానంలోకి దూసుకుపోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ‘ఏ న్యూ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్’ అనే నినాదంతో నిజజీవితానికి చెందిన వందమంది వర్చువల్ క్యారెక్టర్స్‌ను ఇది సృష్టించింది. యూజర్స్, క్రియేటర్స్‌కు మధ్య సరిహద్దులు లేకుండా చేయడమే తన విధానం అని చెబుతోంది. ఎన్నో వీట్యూబర్స్ ఏజెన్సీలకు ‘ఎనీ కలర్’ మాతృసంస్థగా ఉంది. ‘కోవిడ్ సమయంలో మన దేశంలో ఊపందుకున్న వర్చువల్ యూట్యూబర్ ధోరణి మెయిన్‌స్ట్రీమ్ పాపులారిటీకి దగ్గరలో ఉంది’ అంటున్నాడు వీట్యూబర్ టాలెంట్ ఏజెన్సీ ‘ప్రాజెక్ట్ స్టార్‌స్కేప్’ ఫౌండర్ వేణు జీ జోషి. ‘వీట్యూబింగ్ అనేది ప్రైవసీని కాపాడుకోవడానికి, ముఖ్యంగా మహిళలకు బాగా ఉపయోగపడుతుంది. మీ ముఖం బాగాలేదు, మీ గొంతు బాగలేదు... వంటి విషపూరితమైన ట్రోలింగ్ నుంచి బయటపడవచ్చు. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో ఏమో అనే సంశయం లేకుండా ధైర్యంగా కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు’ అంటుంది అసలు పేరే ఏమిటో తెలియని దిల్లీకి చెందిన వర్చువల్ అవతార్ సకుర. వర్చువల్ అవతార్స్ పరిచయం ఆసక్తికరంగా ఉంటుంది. ఒక అవతార్ పరిచయం ఇలా ఉంటుంది: ‘రెండు వందల సంవత్సరాల వయసు ఉన్న ఈ బాలికకు అపారమైన మాంత్రిక శక్తులు ఉన్నాయి’ చాలామంది మోడల్స్ జపనీస్ యానిమేషన్ స్టైల్ డిజైన్లకు ప్రాధాన్యత ఇస్తుండగా కొందరు మాత్రం పురాణాలలోని చిత్ర విచిత్ర పాత్రలను ఎంచుకుంటున్నారు. 19 సంవత్సరాల వీట్యూబర్ ‘మియో’ సగం మనిషి, సగం భూతంతో కూడిన అవతార్‌ను సృష్టించుకుంది. కొందరు తమ అవతార్లకు తామే గొంతు ఇస్తుండగా, మరికొందరు మాత్రం గొంతులో వైవిధ్యం కోసం వాయిస్ మాడ్యులేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇండియన్ వీట్యూబ్ కమ్యూనిటీస్ కోసం రెడిట్‌లో ప్రత్యేకమైన పేజీ నిర్వహిస్తున్న హర్ష్ ‘వీట్యూబర్స్’కు వీరాభిమాని. ‘వీట్యూబర్ను చూస్తే స్నేహితుడిని చూసినట్లుగానే ఉంటుంది. వారి షోలో భాగమైతే రియాలిటీ షోలో భాగమైనట్లు అనిపిస్తుంది’ అంటున్నాడు హర్ష్. అభిమానం, విశ్లేషణ సంగతి ఎలా ఉన్నా అప్‌కమింగ్ వీట్యూబర్స్ కోసం ‘వర్చువలిజం’లాంటి కంపెనీలు వచ్చాయి. వీట్యూబర్గా మారాలని, తమను తాము నిరూపించుకోవాలనే ఆసక్తి యూత్‌లో పెరిగింది. ఇదీ చదవండి: చైతన్యపథం: గేమ్‌ఛేంజర్.. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి గురించి తెలుసుకోవాలి’ -
యూజర్లకు భారీ షాకిచ్చిన యూట్యూబ్.. డబ్బులు చెల్లించాల్సిందేనా!
యూట్యూబ్ ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలను తన వైపు తిప్పుకుని అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫాంగా అవతరించింది యూట్యూబ్. ప్రస్తుతం ఆదాయం పెంచుకునేందుకు అనేక మార్గాలలో ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో యూజర్లపై భారం మోపుతోంది. తాజాగా యూట్యూబ్ మరో బాదుడికి సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. యూజర్లు ఇకపై యూట్యూబ్‌లోని హై క్వాలిటీ వీడియోలు చూడాలంటే పైసలు చెల్లించాల్సి వచ్చేలా ఉంది. ఎలా అని ఓ లుక్కేద్దాం! సమాచారం ప్రకారం.. యూట్యూబ్‌లో 4K రెజుల్యూషన్ వీడియోలను యూజర్లు చూసేందుకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తప్పనిసరి చేసే ప్లాన్‌లో ఉందట. ప్రసుత్తం యూట్యూబ్‌లో యాడ్స్ లేకుండా వీడియోలు చూసేందుకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉండాలి. ఇందుకోసం నెలకు రూ.129, మూడు నెలలకు రూ. 399, సంవత్సరానికి ₹1290 వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరహాలోనే 4k వీడియోలు చూడాలంటే కూడా ప్రీమియం తప్పనిసరి చేయనున్నారని సమాచారం. ప్రస్తుతానికైతే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, యూజర్లలో దీనిపై చర్చ మాత్రం జరుగుతోంది. 4కే వీడియోలు చూడాలంటే యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని తమకు నోటిఫికేషన్స్ వస్తున్నట్టు కొందరు యూజర్లు రెడిట్ ప్లాట్‌ఫాంలో వివరించారు. కొందరు యూజర్లు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. దీని బట్టి చూస్తే త్వరలో యూట్యూబ్‌లో 4కే వీడియోలు ఉచితంగా చూడటం సాధ్యం కాకపోవచ్చు. హై క్వాలిటీ వీడియోలు చూడాలంటే యూట్యూబ్ ప్రీమియం మెంబర్షిప్ తీసుకోవాల్సి వచ్చేలా ఉంది. So, after testing up to 12 ads on YouTube for non-Premium users, now some users reported that they also have to get a Premium account just to watch videos in 4K. pic.twitter.com/jJodoAxeDp — Alvin (@sondesix) October 1, 2022 చదవండి: ఫ్రెషర్స్‌కి భారీ షాక్.. ఐటీలో ఏం జరుగుతోంది, ఆఫర్ లెటర్స్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్! -
ఆ యూట్యూబ్ ఛానెళ్లు బ్యాన్!
సాక్షి, న్యూఢిల్లీ: ఫేక్ న్యూస్, విద్వేషాలు రెచ్చగొట్టేలా వీడియోలు పోస్ట్ చేస్తున్న పలు యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఐటీ చట్టం 2021 నిబంధనల ప్రకారం.. 10 యూట్యూబ్ ఛానెల్స్‌కు సంబంధించిన 45 వీడియోలను బ్లాక్ చేసినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ ఛానెళ్లు మార్పింగ్ వీడియోలు, ఫోటోలను ఉపయోగించి భారత జాతీయ భద్రతకు, విదేశీ సంబంధాలు దెబ్బతినేలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్నిపథ్, ఆర్మీ, కశ్మీర్ అంశాలపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ‘తప్పు వార్తల ద్వారా భారత్‌కు ఇతర దేశాలతో సంబంధాలను దెబ్బతీసేలా వీడియోలు చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లను ప్రసార, సమాచార శాఖ బ్యాన్ చేసింది. దేశ భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులోనూ ఇలాంటి చర్యలు తీసుకుంటాం. భారత సార్వభౌమత్వం, సమగ్రతను, జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, ప్రజా సంబంధాలను దెబ్బతీసేందుకు చేసే కుట్రను అణచివేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది.’ అని తెలిపారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్. ఇదీ చదవండి: రసవత్తరంగా రాజస్థాన్ రాజకీయ సంక్షోభం: గెహ్లాట్‌ను రేసు నుంచి తప్పించాలంటూ ఫిర్యాదు -
వీడియోలకు కత్తెర! అమెరికాను దాటేసి ప్రథమ స్థానంలో భారత్
సాక్షి, అమరావతి: యూట్యూబ్‌లో సెన్సారింగ్ భారీగానే జరుగుతోంది. విచిత్రమేంటంటే ఇలా కత్తెర వేటుకు గురైన వీడియోల సంఖ్యలో భారతదేశం అమెరికాను మించిపోయింది. మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పెద్దగా ఎవరూ చూడకముందే ఇండియాలో 11,75,859 వీడియోలను బ్లాక్ చేసినట్లు యూట్యూబ్ వెల్లడించింది. వీటిల్లో ఎక్కువగా పిల్లల భద్రత, హింసాత్మక కంటెంట్, అశ్లీల వీడియోలు ఉన్నట్లు సంస్థ తెలియజేసింది. ఇటీవల యూట్యూబ్ సంస్థ కమ్యూనిటీ మార్గదర్శకాల ఎన్ఫోర్స్మెంట్ నివేదికను విడుదల చేసింది. ఇందులో 2022 తొలి త్రైమాసికం (జనవరి–మార్చి)లో ప్రపంచ వ్యాప్తంగా 38.82 లక్షల వీడియోలను బ్లాక్చేస్తే అందులో అగ్రరాజ్యం అమెరికా కంటే అధికంగా భారత్ ప్రథమ స్థానంలో ఉండడం గమనార్హం. అదనంగా 2,58,088 వీడియోలను తొలగింపు వాస్తవానికి గ్లోబల్ కమ్యూనిటీ నివేదిక కంటే దేశంలో తొలగించిన వీడియోల సంఖ్య ఎక్కువగానే ఉంది. నివేదికలో కమ్యూనిటీ మార్గదర్శకాల ప్రకారం సొంత మోడరేటర్లు, విశ్వసనీయ ఫ్లాగర్లు, ఆటోమేటెడ్ అల్గారిథమ్‌లు వంటి సాంకేతికత ద్వారా తొలగించిన వీడియోల సంఖ్యను మాత్రమే చూపిస్తారు. అయితే, దేశ ఐటీ రూల్స్–2021 ప్రకారం.. యూట్యూబ్‌కు ఫిర్యాదులు పరిష్కారించే అధికారులున్నారు. వీరికి దేశవ్యాప్తంగా యూజర్లు, ఎన్జీఓలు, ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా 95వేల ఫిర్యాదులు అందాయి. వాటి ఆధారంగా 2,58,088 వీడియోలను అదనంగా తీసేశారు. దీంతో దేశంలో మొత్తం 14,33,947 వీడియోలను తొలగించినట్లయింది. ఇందులో అధికంగా పిల్లల భద్రతకు సంబంధించి 24.9 శాతం, హింసాత్మక కంటెంట్ 21.2 శాతం, అశ్లీల కంటెంట్ వీడియోలు 16.9 శాతం ఉన్నాయి. యూట్యూబ్ అనుచిత, అశ్లీల, అతివాద కంటెంట్, సైబర్ బెదిరింపులు, తప్పుదారి పట్టించే, తప్పుడు సమాచార (స్పామ్) వీడియోలను తొలగించడానికి 91 శాతం ఆటోమేటెడ్ అల్గారిథమ్ సహాయపడింది. గడిచిన రెండేళ్లుగా.. ఇక యూట్యూబ్ ఎక్కువ వీడియోలను తొలగిస్తున్న దేశాల జాబితాలో భారత్ గడిచిన రెండేళ్లుగా అగ్రస్థానంలో ఉంటోంది. 2019 మూడో త్రైమాసికంలో 5వ స్థానంలో ఉండగా 2020 తొలి త్రైమాసికానికి వచ్చేసరికి రెండో స్థానంలోనూ, అదే ఏడాది మూడో త్రైమాసికం నుంచి ఇప్పటివరకు మొదటి స్థానంలో కొనసాగుతోంది. 44 లక్షల చానెళ్లు నిలిపివేత ఈ ఏడాది తొలి మూడునెలల్లో ప్రపంచ వ్యాప్తంగా 44 లక్షల చానెళ్లను నిలిపివేసినట్లు కంపెనీ ప్రకటించింది. 90 రోజుల వ్యవధిలో కంపెనీ మార్గదర్శకాలను మూడుసార్లు ఉల్లంఘిస్తే సదరు చానెల్‌ను అందులోని వీడియోలను తొలగించనున్నట్లు వివరించింది. -
యూట్యూబ్ వీడియోలు చూసి.. అర్ధరాత్రి ఏంచేశాడంటే?
నరసరావుపేట (గుంటూరు జిల్లా): యూట్యూబ్‌లో వీడియోలు చూసి బ్యాంకు దొంగతనాలు చేస్తున్న యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ సి.విజయభాస్కరరావు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన రాజేష్‌కుమార్ ఐటీఐ చదివాడు. ఏ పనీ చేయకుండా సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్‌లో బ్యాంకు చోరీల వీడియోలు చూసి మార్చి 30వ తేదీ అర్ధరాత్రి ఫిరంగిపురంలోని ఎస్బీఐ బ్యాంకులో దొంగతనానికి యత్నించాడు. తొలుత బ్యాంకులో అలారం వైర్లు కట్ చేసిన రాజేష్‌కుమార్ కిటికీ ఊచలు కట్ చేసి బ్యాంకు లోపలికి ప్రవేశించాడు. స్ట్రాంగ్‌రూమ్ తాళాలు కట్టర్ ద్వారా కట్‌చేసి సేఫ్ లాకర్ తెరిచేందుకు యత్నించాడు. ఆ లాకర్ బ్యాంక్ మేనేజర్ ఫోన్‌కు అనుసంధానమై ఉండడంతో ఆ మొబైల్ అలారమ్ మోగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన మేనేజర్ సిబ్బందిని బ్యాంకు వద్దకు పంపారు. దీనిని గమనించిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు దర్యాప్తు కోసం పోలీసు శాఖ రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి ఆధ్వర్యంలో నరసరావుపేట టుటౌన్ ఏఎస్ఐ జీవీ సుబ్బారావు, నరసరావుపేట రూరల్ ఏఎస్ఐ ఎం.శ్రీనివాసరావు, ఫిరంగిపురం, నాదెండ్ల ఏఎస్ఐలు కె.శ్రీనివాసరావు, రోసిబాబు, హెడ్‌కానిస్టేబుల్ శ్రీధర్, నాదెండ్ల హోంగార్డు కె.మధుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకుని గ్రిల్స్ కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది ఆగస్టులో గుంటూరు గాంధీపార్కుకు ఎదురుగా హెచ్డీఎఫ్సీ బ్యాంకులోనూ రాజేష్‌కుమార్ రూ.23 లక్షలు చోరీ చేయగా, లాలాపేట పోలీసులు అతడిని అరెస్టుచేసి జైలుకు పంపారు. బెయిల్‌పై వచ్చిన రాజేష్‌కుమార్ మళ్లీ ఫిరంగిపురం ఎస్బీఐలో చోరీకి యత్నించాడు. దర్యాప్తు చేసిన సిబ్బందిని రూరల్ ఎస్పీ విశాల్‌గున్నీ అభినందించి రివార్డుకు సిఫార్సు చేశారని డీఎస్పీ చెప్పారు. -
మింగేస్తున్న డ్రగ్స్
హైదరాబాద్‌లో ఒకేరోజున బయటపడిన మూడు ఘటనలు ఇవి. ఇప్పటిదాకా డ్రగ్స్ రవాణా, వాడకమే బయటపడితే ఇప్పుడు డ్రగ్స్‌తో ప్రాణాలు పోగొట్టుకున్నవారు, ఆరోగ్యం దెబ్బతిన్నవారు, సొంతంగానే డ్రగ్స్ తయారు చేసి అమ్ముతున్నవారి ఉదంతం బయటపడటం కలకలం రేపుతోంది. ఓవైపు గంజాయి, ఓపియం వంటి మాదకద్రవ్యాలతోపాటు మరోవైపు ఎక్స్టసీ, చరస్, ఎల్ఎస్డీ, ఎండీఎంఏ వంటి సింథటిక్ డ్రగ్స్ దందా కూడా విచ్చలవిడిగా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. యూట్యూబ్‌లో చూసి డ్రగ్స్ తయారు చేసి.. ► అతడో మామూలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. మొదట్లో డ్రగ్స్‌కు బానిసయ్యాడు. దానికి డబ్బుల కోసం డ్రగ్స్ అమ్మే పెడ్లర్‌గా మారాడు. చివరికి యూట్యూబ్‌లో చూసి డ్రగ్స్ తయారు చేయడం నేర్చుకున్నాడు. ఫార్మసీల్లో, ఆన్లైన్లో పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేసి.. ఓ ఫ్లాట్‌లో డ్రగ్స్ ల్యాబ్‌నే ఏర్పాటు చేసుకున్నాడు. ‘చంగా’గా పిలిచే డ్రగ్‌ను తయారు చేసి తెలిసినవారికి అమ్ముతూ వచ్చాడు. తాజాగా పోలీసులకు పట్టుబడ్డాడు. ► అతను 23 ఏళ్ల యువకుడు.. చదువుకునే రోజుల్లోనే స్నేహితులతో కలిసి డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. అంతా గోవా వెళ్లి మరీ పార్టీలు చేసుకుంటూ డ్రగ్స్‌కు బానిసలయ్యారు. కొద్దిరోజుల కింద ఇలాగే గోవా వెళ్లినప్పుడు సదరు యువకుడు మితిమీరి డ్రగ్స్ తీసుకున్నాడు. ఓవర్‌డోస్ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. నరాల పటుత్వం కోల్పోయి మంచానపడి.. మూడు రోజుల కింద చనిపోయాడు. రాష్ట్ర చరిత్రలో అధికారికంగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన డ్రగ్స్ మరణం ఇదే. ఆ పార్టీలో విపరీతంగా డ్రగ్స్ తీసుకున్న మరికొందరూ అనారోగ్యంతో ఉన్నట్టు తెలిసింది. పోలీసులు ఓ డ్రగ్స్ విక్రేతను, అతడి దగ్గర కొనుగోలు చేసిన ముగ్గురు వినియోగదారులను అదుపులోకి తీసుకున్న క్రమంలో.. ఈ డ్రగ్స్ మరణం విషయం బయటికి రావడం గమనార్హం. అక్కడ మరో నలుగురు.. ► సికింద్రాబాద్ ప్రాంతంలో గంజాయి నుంచి తయారు చేసే హాష్‌ఆయిల్ డ్రగ్‌ను విక్రయిస్తున్న ఇద్దరిపై పోలీసులు నిఘాపెట్టారు. వారితోపాటు డ్రగ్ కొనేందుకు వచ్చిన మరో ఇద్దరినీ పట్టుకున్నారు. అప్పటికే డ్రగ్స్ కొన్న మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. సాక్షి, హైదరాబాద్: రసాయన శాస్త్రం చదవలేదు.. ఫార్మా ఇండస్ట్రీలో పనిచేయలేదు.. అయితేనేం యూట్యూబ్‌లో చూశాడు.. ఓ ఫ్లాట్‌లో సొంతంగా ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నాడు. ‘చంగా’గా పిలిచే సింథటిక్ డ్రగ్ ‘డైమిథైల్ థ్రెప్టోమైన్ (డీఎంటీ)’తయారుచేసి విక్రయించడం మొదలుపెట్టాడు. చివరికి గురువారం ‘హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ)’అధికారులకు పట్టుబడ్డాడు. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో అదనపు సీపీ డీఎస్ చౌహాన్ ఈ వివరాలు వెల్లడించారు. మొదట డ్రగ్స్‌కు అలవాటై.. సూర్యాపేట జిల్లాకు చెందిన కె.శ్రీరామ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. విద్యార్థి దశ నుంచే అతడికి మాదకద్రవ్యాల వినియోగం అలవాటైంది. తర్వాత ఇతరులకు విక్రయించడం మొదలుపెట్టాడు. కొని అమ్మడంలో రిస్క్ ఉందని, తానే డ్రగ్స్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్‌లో, వేర్వేరు వెబ్సైట్లలో డ్రగ్స్ తయారీపై అధ్యయనం చేశాడు. ‘చంగా’ తయారీ తేలిక అని భావించాడు. రహస్యంగా తయారు చేయడం కోసం.. కొండాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. హైదరాబాద్‌లో వివిధ రసాయనాలు విక్రయించే దుకాణాలకు వెళ్లి.. తానో కెమిస్ట్రీ విద్యార్థినంటూ పరిచయం చేసుకున్నాడు. పలు రకాల రసాయనాలు, ఉపకరణాలు కొన్నాడు. మెడికల్ షాపులు, అమెజాన్ లాంటి వెబ్సైట్ల నుంచి మరికొన్నింటిని ఖరీదు చేశాడు. వీటితో చంగా డ్రగ్ పొడిని తయారుచేశాడు. దాన్ని పరిచయస్తులకు గ్రాముకు రూ.8వేల చొప్పున విక్రయించేవాడు. ఒక్కో గ్రాము 20 మంది వినియోగించే అవకాశం ఉండటం, దీని ప్రభావం ఎక్కువ కావడంతో గిరాకీ పెరిగింది. ముక్కుతో పీల్చే ఈ డ్రగ్‌తో కొన్ని గంటలు తీవ్ర నిషా ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. గట్టిగా నిఘాపెట్టి..: శ్రీరామ్ దగ్గర బొల్లారం ప్రాంతానికి చెందిన ఎస్.దీపక్‌కుమార్ జాదవ్ డ్రగ్స్ కొని వాడేవాడు. ఈక్రమంలోనే ‘హెచ్–న్యూ’ కానిస్టేబుల్ సత్యనారాయణకు సమాచారం అం దింది. దీంతో ఇన్స్పెక్టర్ పి.రాజేష్ నేతృత్వంలోని బృందం 15 రోజుల నుంచి నిఘా పెట్టి గురువారం జూబ్లీహిల్స్‌లో అదుపులోకి తీసుకుంది. శ్రీరామ్ ఫ్లాట్‌లో తనిఖీలు చేసి 8గ్రాముల చంగాను, దాని తయారీకి వాడే రసాయనాలు, పరికరాలను స్వాధీనం చేసుకుంది. వీటిని శ్రీరామ్ ఎప్పుడ కొన్నాడనేది ఆరా తీస్తున్నారు. వాటిలో నిషేధిత, నియం త్రిత పదార్థాలు ఉంటే విక్రయించిన వారిపై చర్య లు తీసుకుంటామని డీఎస్ చౌహాన్ తెలిపారు. -
యూజర్లకు యూట్యూబ్ భారీ షాక్!
ప్రముఖ వీడియో షేరింగ్ దిగ్గజం యూట్యూబ్ యూజర్లకు షాకిచ్చింది. ఇప్పటి వరకు ఫ్రీగా చూసిన వీడియోల్ని ఇకపై డబ్బులు చెల్లించి వీక్షించాలని యూట్యూబ్ కొత్త నిబంధన తెరపైకి తెచ్చింది. రాబోయే రోజుల్లో యూట్యూబ్‌లో ఎంటర్టైన్మెంట్ కాస్త మరింత కమర్షియల్‌గా మారనుంది. ఇప్పటికే యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు చూడాలంటే డబ్బులు చెల్లించాలి. మనకు నచ్చిన సినిమానో లేదంటే వెబ్ సిరీస్ చూసే సమయంలో యాడ్స్ రాకుండా ఉండాలంటే పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఇకపై డౌన్లోడ్ చేసుకున్న వీడియోలకు డబ్బులు కట్టాలని యూట్యూబ్ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. బఫరింగ్ సమస్య , డేటా అయిపోతుందనే బాధలేకుండా విద్యార్ధులు, ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లల కోసం నచ్చిన వీడియోల్ని చూపించేలా యూట్యూబ్ వీడియోల్ని డౌన్లోడ్ పెట్టి మరి ఆ వీడియోల్ని చూపించే వారు. విద్యార్ధులు సైతం వారికి కావాల్సిన ఏదైనా కోర్స్ ట్యుటోరియల్ వీడియోల్ని డౌన్లోడ్ పెట్టుకొని వీక్షించేవారు. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభంలో ఈ డౌన్లోడ్ సదుపాయాన్ని వినియోగించుకునే వారి సంఖ్య ఎక్కువైంది. అయితే దీన్ని క్యాష్ చేసుకునేలా యూట్యూబ్' డౌన్లోడ్ వీడియోలకు పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలని సూచించింది. దీంతో తాజా యూట్యూబ్ నిర్ణయంపై యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: నిద్రపోతున్నా సరే అతడి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంది -
ఈ ఏడాది యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ ఏంటో తెలుసా?
►నిన్న మొన్నటివరకూ ఇంటర్నెట్ సామ్రాజ్యంలో యూట్యూబ్ అంటే కేవలం కాలక్షేపం కోసం నెటిజన్లు వీక్షించే ఓ వినోద సాధనమే. ► మరి నేడు... వీక్షకులకు వినోదం, విజ్ఞానాన్ని అందిస్తూనే యూట్యూబర్లకు కోట్లాది మంది సబ్స్క్రైబర్లను, అంతకన్నా మించి భారీగా ఆదాయాన్ని సంపాదించిపెట్టే కల్పతరువు! ప్రతి నిమిషం ఈ ప్రసార మాధ్యమంలో ఏకంగా 30 లక్షల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయంటే యూట్యూబ్ స్థాయి ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరి... ►ఈ ఏడాది యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ ఏమిటి? ►భారత్‌లో నాలుగు రాళ్లు వెనకేసుకున్నదెవరు? చార్ట్‌లు బద్దలు కొట్టిన పాటలేమిటి? ►వినోదం పంచిన వెబ్‌సిరీస్, గేమ్‌లు ఏవి? ఓసారి పరిశీలిద్దాం.. సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది యూట్యూబ్‌లో వినూత్నమైన ఆలోచనలతో సృష్టించిన వీడియోలు మంచి ఆదరణ పొందాయి. ‘ఏ2మోటివేషన్స్’, ‘మిస్టర్ గ్యానీ ఫ్యాక్ట్స్’ వంటి చానళ్లు.. అద్భుతం, వినూత్నం, విచిత్రం అనిపించే విషయాలను నిమిషం, రెండు నిమిషాల వీడియోలైన ‘షార్ట్స్’లో బంధించాయి. అలాగే ‘క్రేజీ ఎక్స్‌వైజెడ్’, ‘మిస్టర్ ఇండియన్హ్యాకర్’ వంటి చానళ్ల నిర్వాహకులు విచిత్రమైన పనులు చేసి పాపులారిటీ, సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నారు. తెలుగు యూట్యూబ్ చానళ్లు ఫిల్మీమోజీ, ఫన్మోజీలు అనిమోజీ పేరుతో అవతార్ ఆధారిత కంటెంట్ సృష్టించి ట్రెండింగ్ చార్టుల్లో పైకి చేరితే.. భువన్ బామ్ (బీబీ కి వైన్స్) తన కామెడీ వీడియోలను ‘ధిండోరా’ పేరుతో వెబ్ సిరీస్‌గా మార్చి 2.49 కోట్ల అభిమానులను సంపాదించుకున్నాడు. గేమింగ్ విషయానికొస్తే ఇందులోనూ మూసపోకడలకు స్వస్తిపలికి కామెడీ, ప్రాంక్స్, సవాళ్లు వంటి అనేక అంశాల ఆధారంగా కొత్త గేమ్‌లు సిద్ధమయ్యాయి. గేమింగ్ అంటే ఇష్టపడే వాళ్లు ఇప్పుడు నగర ప్రాంతాలను దాటిపోవడం ఇంకో విశేషం. కోవిడ్ కారణంగా సినిమాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ ఏడాది వీడియో పాటలు కొంచెం ఎక్కువ సంఖ్యలోనే విడుదలయ్యాయి. అంకుశ్ రజా, శిల్పి రాజ్ వంటివారు తమ భోజ్‌పురి సంగీతంతో ఈ ఏడాది టాప్ స్థానాల్లో నిలిచారు. మహిళల మ్యూజిక్ వీడియోల్లో తమిళ సింగర్లు అరివు, ఢీల వీడియో ‘ఎంజాయ్ ఎంజామీ’ చార్ట్‌లలో టాప్‌గా నిలిచింది. చదవండి: Top Apps In 2021: ఈ ఏడాది క్రేజీ యాప్స్ ఇవే.. ‘ఈ తరం’ వెబ్ సిరీస్‌లు.. తెలుగు విషయానికి వస్తే... షణ్ముక్ జశ్వంత్ హీరోగా నటిస్తున్న యూట్యూబ్ సిరీస్ ‘సూర్యా’తోపాటు ‘గర్ల్ ఫార్ములా’ రూపొందించిన ‘30 వెడ్స్ 21’ ఆకట్టుకోగా.. దేశంలో యువతరం సమస్యలను, అనుభవాలను వినూత్నమైన పద్ధతుల్లో అందుబాటులోకి తెచ్చిన కొన్ని వెబ్ సిరీస్‌లు ఈ ఏడాది బాగా ప్రేక్షకాదరణ పొందాయి. ‘ద వైరల్ ఫీవర్’ నిర్మించిన కొత్త సిరీస్ ఆస్పిరెంట్స్.... యూపీఎస్సీకి సిద్ధమవుతున్న విద్యార్థుల కష్టాలు, సమస్యలు ఆశనిరాశలను ప్రతిబంబించింది. అలాగే డైస్ మీడియా వైద్యవిద్యార్థుల జీవితానుభవాల ఆధారంగా నిర్మించిన ‘ఆపరేషన్ ఎంబీబీఎస్’, గేమింగ్‌నే వృత్తిగా ఎంచుకున్న వారిపై రూపొందించిన ‘క్లచ్’ ప్రేక్షకుల మన్ననలు పొందాయి. బుల్లి వీడియోలు భలేభలే... యూట్యూబ్ ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టిన చిన్న వీడియో విభాగం ‘షార్ట్స్’కూ దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. నిమిషం కంటే తక్కువ నిడివి ఉండే ‘షార్ట్స్’ వీడియోలను ఇప్పుడు చాలా మాంది వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. 2021లో సృష్టించిన కొత్త, వినూత్న వీడియోల్లో స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులు మొదలుకొని కుటుంబ సంబంధాలు, స్ఫూర్తిదాయకమైనవి, పురుషుల సౌందర్య పరిరక్షణకు ఉపయోగపడేవి కూడా బోలెడు ఉన్నాయి. ‘ఏ2మోటివేషన్’ తొలిస్థానంలో నిలివగా ‘మిస్టర్ గ్యానీ ఫ్యాక్ట్స్’, ‘శివమ్ మాలిక్’, ‘లిటిల్గ్లవ్’, ‘ఇంగ్లిష్ కనెక్షన్’, ‘బసీర్ గేమింగ్’, ‘అజయ్ శర్మ’, ‘దుష్యంత్ కుక్రేజా’ వంటివి టాప్–10లో ఉన్నాయి. -
నెలకు కోటి రూపాయల జీతం వదిలేసి మరీ..
Korea Man Quits Crores Salary Job And Became Youtuber Because Of Mother: కంపెనీలో చేరిన ఏడాదికే ఇంక్రిమెంట్. అది అలాంటి ఇలాంటిది కాదు. నెలకు కోటికి పైగా(మన కరెన్సీలో) జీతం. ప్రొఫెషనల్ కెరీర్‌ను పీక్స్‌కు చేర్చే టైం అది. కానీ, ఆ సమయంలో ఉద్యోగం వదిలేయాలనే ఆలోచన ఎవరికైనా వస్తుందా?.. దక్షిణ కొరియాకు చెందిన బెన్ చోన్(28) ఆ నిర్ణయం తీసేసుకున్నాడు మరి!. అయితేనేం తనకు తెలిసిన విద్యతో లక్షలు(మన కరెన్సీలోనే) సంపాదిస్తూ.. సొంతంగా బాస్‌గా ఉండడంలో కిక్కును వెతుక్కుంటున్నాడు. జేపీ మోర్గాన్.. అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం. ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అలాంటి కంపెనీలో 2017లో చేరాడు బెన్ చోన్. పుట్టి, పెరిగింది దక్షిణ కొరియాలోనే అయినా. స్కాలర్షిప్ మీద అమెరికాలో మంచి యూనివర్సిటీలో చదివి.. జాబ్ తెచ్చుకున్నాడు. ఏడాది తిరగకుండానే అతని టాలెంట్‌కి భారీ ప్యాకేజీ ఆఫర్ చేసింది జేపీ మోర్గాన్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్‌గా ప్రమోషన్‌తో పాటు నెలకు లక్షా యాభై వేల డాలర్ల జీతం(అదనంగా బోనస్) ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే రెండు నెలల జీతం అందుకున్నాడో లేదో.. పిడుగులాంటి వార్త అతని చెవిన పడింది. తల్లి ప్రమాదకరమైన వ్యాధి బారినపడిందన్న విషయం అతన్ని స్థిమితంగా ఉంచలేదు. ఆ సమయంలో అతనికి తల్లే ప్రపంచంగా కనిపించింది. ఆమె పక్కనే ఉండి.. ఎలాగైనా రక్షించుకోవాలనుకున్నాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి.. సొంతూరికి బయలుదేరాడు. అక్కడ ఓ చిన్న బట్టల దుకాణంలో కొంతకాలం పని చేశాడు. బట్టల షాపులో.. దాచుకున్న సొమ్మంతా కేవలం మూడు నెలల్లోనే తల్లి ట్రీట్మెంట్కి ఖర్చైంది. బ్యాంకింగ్ సలహాలిచ్చే బెన్ చోన్.. సొంతూరులోనే ఓ బట్టల షాపులో పని చేశాడు. ఆపై ఇంట్లో బట్టల దుకాణం తెరిచాడు. కొన్నాళ్లు పోయాక తల్లి మందులకు ఖర్చులు పెరిగాయి. ఆ టైంలోనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆదాయం సంపాదించొచ్చనే విషయం అతనికి గుర్తొచ్చింది. యూట్యూబ్‌లో రోజూ రకరకాల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో చాలావరకు వీడియోలను చూసి తిట్టుకుంటాం.. నవ్వుకుంటాం. కొన్నింటిని చూడకుండానే స్కిప్ చేస్తుంటాం. కానీ, వాటి వ్యూస్ ద్వారా యూట్యూబర్లకు ఆదాయం వస్తుంది. అంటే.. ఏదో ఒకరకంగా తమ శ్రమను పెట్టుబడిగా పెట్టి సంపాదిస్తున్నారు వాళ్లు. అలా బెన్ చోన్ మాత్రం తనకు తెలిసిన విద్యతోనే యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టాడు. తెలిసిన విద్యతోనే.. 2019లో రేర్లిక్విడ్ rareliquid పేరుతో యూట్యూబ్ఛానెల్ మొదలుపెట్టాడు బెన్. ఇన్వెస్ట్మెంట్, కెరీర్ గైడెన్స్ వీడియోలతో నెమ్మదిగా ఫేమ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న క్రిప్టోకరెన్సీ గురించి, బ్లాక్ చెయిన్ మార్కెట్ తీరు తెన్నులు, టిప్స్‌తో పాటు టెక్, మార్కెటింగ్ సలహాలు అందిస్తాడు. ‘‘ జేపీ మోర్గాన్‌లో చేరిన తొలినాళ్లలో వారానికి 70 నుంచి 110 గంటల పని. ఒక్కోసారి ఏకధాటిగా 28 గంటలు పని చేయాల్సి వచ్చేది. ఇప్పుడు నాకు నేనే బాస్. నాకు తెలిసిన విద్య. కోట్ల జీతం పోతేనేం.. నాకు ఉన్న వనరులతో, తక్కువ శ్రమతో సంతోషం, మనశ్శాంతిని సంపాదించుకుంటున్నా. నాలాగే ప్రతీ ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మనసు పెడితే డిజిటల్ ప్రపంచంతో సంపాదించుకోవచ్చు.. ఒక అడుగు ముందుకేసి అద్భుతాలూ చేయొచ్చు. సిగ్గు-మొహమాటం పడాల్సిన అవసరం అస్సలు లేదు. నా వరకు నేను బాగానే సంపాదిస్తున్నా. అన్నింటికి మించి మా అమ్మ పక్కనే ఉంటున్నా. ఇది చాలాదా నాకు’’ అంటున్నాడు బెన్ చోన్. ప్రస్తుతం rareliquid ఛానెల్లో టెక్, మార్కెట్, క్రిప్టోకరెన్సీ తీరు తెన్నులపైనా అతని సలహాలు, డెమో వీడియోలు ఉంటాయి. రెజ్యూమ్(సీవీ) సలహాలు, రకరకాల కోర్సుల గురించి వివరిస్తాడు. ఇదంతా చిన్న చిన్న వ్యాపారాల కలయికగా చెప్తాడు బెన్ చోన్. క్రియేటివ్ వేలో మరికొందరికి పాఠాలు, సలహాలు ఇవ్వడం సంతోషాన్ని ఇస్తుందని అంటున్నాడు ఈ యూట్యూబర్. యూట్యూబ్ వ్యూస్ ప్రకారం.. జులైలో బెన్ జీతం 19, 161 డాలర్లుకాగా, నవంబర్‌లో 26,000 డాలర్లు సంపాదించాడు. మన కరెన్సీలో ఇది 17 లక్షల రూపాయలు. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
గూగుల్ అదిరిపోయే శుభవార్త, ఇక యూట్యూబ్‌లో చెలరేగిపోవచ్చు
యూట్యూబ్ క్రియేటర్లకు గూగుల్ ఇండియా అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారత్‌లో యూట్యూబ్ షార్ట్స్ టైమ్ డ్యూరేషన్ పై కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో యూట్యూబ్ ఛానల్ క్రియేటర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లైందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. యూట్యూబ్ షార్ట్స్‌లో టైమ్ డ్యూరేషన్ తక్కువే 2020 సెప్టెంబర్‌లో గూగుల్ సంస్థ యూట్యూబ్ షార్ట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ షార్ట్స్ లో ఇన్సిడెంట్ ఏదైనా కట్టే కొట్టే తెచ్చే అన్న చందంగా 60 సెకన్ల వ్యవధి వీడియోను చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ షార్ట్స్ వీడియోస్‌లో 15 సెకన్లు, అంతకంటే తక్కువ టైమ్ డ్యూరేషన్ ఉన్న వీడియోల్ని చేసేందుకు అనుమతిస్తున్నట్లు ఈరోజు జరిగిన ఓ ఈవెంట్లో గూగుల్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ షార్ట్స్‌తో లాభాలు యూట్యూబ్ షార్ట్స్ వల్ల నిర్వహకులకు అనేక లాభాలున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలనుకునేవారికి ఈ ప్లాట్ ఫాం సువర్ణ అవకాశమనే చెప్పుకోవాలి. నిమిషాల వ్యవధి వీడియోల కంటే సెకన్ల వ్యవధి వీడియో చేయడం చాలా ఈజీ. అదే సమయంలో వ్యూస్, ఛానల్ బ్రాండింగ్ వేగం పెరిగిపోతుంది. ఈ జనరేషన్ క్రియేటర్స్, ఆర్టిస్ట్‌ల క్రియేటివిటీని బిజినెస్‌గా మలచడంలో సహాయపడుతుంది. క్రియేటర్లకు వంద మిలియన్ డాలర్లు యూట్యూబ్ షార్ట్స్ ద్వారా గుర్తింపు పొందిన కంటెంట్ క్రియేటర్లకు ప్రతినెలా డబ్బులు సంపాదించుకోవచ్చు. టిక్.. టాక్ గత సంవత్సరం ‘క్రియేటర్స్ ఫండ్’ పేరుతో రెండు వందల మిలియన్ డాలర్లను కేటాయించింది. అదే బాటలో యూట్యూబ్ కూడా కంటెంట్ క్రియేటర్ల కోసం వంద మిలియన్ డాలర్లు (2021–2022) కేటాయించింది. ఇప్పుడు మనదేశంలో టిక్... టాక్ లేకపోవడంతో చాలామంది క్రియేటర్లు యూట్యూబ్ షార్ట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వారిని మరింత ప్రోత్సహించేందుకు గూగుల్ భారీ ఎత్తున ఫండ్‌ను కేటాయించింది. చదవండి: హాయ్ గైస్...నేను మీ షెర్రీని..!! -
Anisha Dixit: ఎంబీయే అని చెప్పి సీక్రెట్‌గా యాక్టింగ్.. అనుమానం రాకుండా
ఏదైనా కావాలంటే అది ఇచ్చేవరకు మారాం చేస్తూనే ఉంటారు చిన్నారులు. కొందరు మాత్రం... తల్లిదండ్రుల కోపానికి భయపడి, కోరికను మనసులోనే దాచుకుని తమలో తామే బాధపడుతుంటారు. అనిశా దీక్షిత్ది ఇటువంటి మనస్తత్వమే. ఆమెకు సినిమాల్లో నటించడం అంటే ఇష్టం. కానీ తన తండ్రి ‘‘నటనా గిటనా ఏం వద్దు’’ అని గట్టిగా చెప్పడంతో భయపడి మరోసారి నటన ఊసెత్తలేదు. కానీ అనిశాతోపాటు పెరిగి పెద్దదైన నటనాసక్తి.. డిగ్రీ చదువుతున్నానని చెప్పి యాక్టింగ్ కోర్సు చేసేలా చేసింది. తొలిప్రయత్నంలోనే సినిమా అవకాశం వచ్చినప్పటికీ, ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయినా నిరుత్సాహ పడకుండా యూ ట్యూబ్ వీడియోల ద్వారా ఆకట్టుకుంటూ.. సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగింది. జీవితంలో ఎదురయ్యే అనేక ఆటుపోట్లను సానుకూల దృక్పథంతో తీసుకుంటూ ముందుకు సాగితే లక్ష్యాన్ని చేరుకోవచ్చనడానికి అనిశా దీక్షిత్ ఉదాహరణగా నిలుస్తోంది. భారత సంతతికి చెందిన అనిశ్, దివ్యాదీక్షిత్ దంపతులకు జర్మనీలో పుట్టింది అనిశా దీక్షిత్. విదేశంలో ఉన్నప్పటికీ నిరుపేద కుటుంబం కావడంతో అనిశా అనేక రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ పెరిగింది. తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం మొత్తం వీధిన పడినంత పని అయ్యింది. దీంతో బంధువుల ఇంటిలో తల దాచుకున్నారు. కుటుంబ అవసరాల నిమిత్తం, వీధుల్లో చిన్నపాటి వస్తువులను విక్రయించి పొట్ట పోసుకునేవారు. ఇంతటి పేదరికంలోనూ అనిశా మంచి నటిగా ఎదగాలనుకునేది. తన ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి ‘‘నువ్వు నటివి కావాల్సిన అవసరం లేదు’’ అంటూ యాక్టింగ్ కోర్సు చేస్తానంటే అస్సలు ఒప్పుకునేవారు కాదు. ఎంబీఏ అనిచెప్పి.. డిగ్రీ పూర్తయిన తరువాత స్విట్జర్లాండ్‌లో ఎమ్బీఏ చేస్తానని ఇంట్లో చెప్పి.. అక్కడ ఎంబీఏలో చేరకుండా సీక్రెట్‌గా యాక్టింగ్, మోడలింగ్ కోర్సు చేసింది. వీకెండ్స్‌లో ఇంటికి వచ్చిన ప్రతిసారి అనిశా తండ్రి బిజినెస్‌కు సంబంధించిన విషయాలను అడుగుతుండేవారు. ఆ ప్రశ్నలకు తన స్నేహితురాలితో మాట్లాడి సరైన సమాధానాలు చెబుతూ తండ్రికి అనుమానం రాకుండా చూసుకునేది. స్విట్జర్లాండ్‌లో కోర్సు పూర్తయ్యాక, వెంటనే ఇండియా వచ్చిన అనిశా ముంబైలోని యాక్టింగ్ స్కూల్లో చేరింది. ఈ స్కూలు ద్వారానే 2013లో బాలీవుడ్ సినిమా ‘పంజాబ్ బోల్దా’లో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. అయితే ఆ సినిమా విడుదల అవకముందే తన తండ్రి మరణించారు. ఈ సినిమాను ప్రేక్షకులను ఆదరించకపోవడంతో అనిశా సినిమా కెరియర్ ఆదిలోనే ముగిసింది. ఫేస్బుక్ వ్లాగింగ్.. సినిమా అవకాశాలు రాకపోయినా అనిశా ఏమాత్రం నిరుత్సాహపడలేదు. స్విట్జర్లాండ్‌లో ఉన్నప్పటి నుంచే ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చిన్నచిన్న వ్లాగ్ వీడియోలను పోస్ట్ చేస్తుండేది. ఇండియా వచ్చిన తరువాత తన రోజూవారి పనులను వీడియోలు తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసేది. ఇలా క్రమంగా వీడియోలను అప్లోడ్ చేస్తూ మంచి ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్‌గా ఎదిగింది. సినిమా అవకాశాలు రాక ఖాళీగా ఉన్న సమయంలో..ఈ అనుభవాన్ని ఉపయోగించుకుని యూ ట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. రిక్షావాలా... ఇండియాలో రవాణాకు వాడే ఆటో రిక్షా(ఆటో)ను తన వీడియోలలో ప్రధాన థీమ్‌గా తీసుకుంది. యూట్యూబ్ చానల్‌కు ‘రిక్షావాలా’ అని పేరు పెట్టుకుంది. ఆటోలో కూర్చోని.. ప్రారంభం లో సినిమా రివ్యూల వీడియోలను పోస్ట్ చేసేది. ‘రామ్‌లీలా’ సినిమా తొలి రివ్యూ వీడియో చేసింది. క్రమంగా లింగ ఆధారిత (జండర్ బేస్డ్) కామెడీ వీడియోలను అప్లోడ్ చేసేది. ఈ వీడియోలు బాగా వైరల్ అయ్యేవి. భారత మహిళలు ఎదుర్కొంటున్న అనేక అభద్రతతో కూడిన అంశాలపై వీడియోలు చేయడంతో అనిశా బాగా పాపులర్ అయ్యింది. ఆ వీడియోల వల్ల సమాజంలో మార్పులు చోటు చేసుకోవడంతో అనిశా సెలబ్రిటిగా మారడమేగాక, సోషల్ మీడియా స్టార్‌గా మారింది. రిక్షావాలి డాట్ కమ్ వెబ్సైట్ ప్రారంభించి, దీనిలో ఇండియా గురించిన ఆర్టికల్స్‌ను కూడా రాసేది. ప్రస్తుతం తన చానల్లో వివిధ కోణాల్లో వీడియోలు అప్లోడ్ చేస్తుంది. వీటిలో స్టోరీటైమ్స్, వ్లాగ్స్ నుంచి లఘు చిత్రాల రివ్యూలు చేస్తోంది. సెలబ్రెటీ గుర్తింపు వచ్చాక తన యూట్యూబ్ చానల్ రిక్షావాలా పేరుని మార్చి తన పేరునే చానల్ పేరుగా మార్చింది. ప్రముఖులతో వీడియోలు అప్లోడ్ చేయడంతో ప్రస్తుతం అనిశా చానల్‌కు ముఫ్పై లక్షల మంది సబ్స్క్రెబర్స్, ఇన్‌స్టాలో ఐదులక్షలమందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. -
YouTube: యూట్యూబ్‌లో ఇక అవి కనిపించవు
Youtube Dislike Count No More: గూగుల్ ఆధారిత లైవ్ స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ నుంచి డిస్లైక్ బటన్ కౌంట్‌ను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత కొంతకాలంగా ఈ ఫీచర్‌ను తొలగించే అంశంపై తర్జన భర్జన పడుతున్న యూట్యూబ్.. ఎట్టకేలకు ముందడుగు వేసింది. యూట్యూబ్‌లో కొందరు డిస్‌లైక్‌లతో దాడులు, వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో డిస్లైక్ కౌంట్‌ను కనిపించకుండా చేయడం ద్వారా క్రియేటర్స్‌కి, వ్యూయర్స్‌కి మధ్య మర్యాదపూర్వక వాతావరణం నెలకొనవచ్చని యూట్యూబ్ ఆశిస్తోంది. ఇక యూట్యూబ్‌లో కామెంట్ సెక్షన్లో కామెంట్‌కు సైతం డిస్లైక్ బటన్ ఉన్నప్పటికీ.. అది కూడా కౌంట్ చూపించదనే విషయం తెలిసిందే!. ఇప్పుడు దానిని మొత్తం అన్ని వీడియోలకు వర్తింప చేసింది. యూట్యూబ్ తాజా నిర్ణయంతో ముఖ్యంగా చిన్న యూట్యూబ్ ఛానెల్స్, యూట్యూబర్స్కు ఊరట లభించనుంది. అలాగే సినిమావాళ్ల ఫ్యాన్స్ మధ్య డిస్లైక్ వార్‌ను చెక్ పడే ఛాన్స్ ఉంది. కొత్తగా ఏదైనా టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగానే యాంటీ ఫ్యాన్స్ నెగెటివ్ కామెంట్లతో కొట్లాడుకుంటారు. తమ ప్రకోపాన్నంతా డిస్‌లైక్‌ల రూపంలో ప్రదర్శించడం చూస్తుంటాం. అయితే యూట్యూబ్ తాజా నిర్ణయంతో కేవలం కౌంట్ మాత్రమే కనిపించదు. డిస్లైక్ బటన్ మాత్రం యధాతధంగా ఉంటుంది. యూట్యూబ్ స్టూడియో, గణాంకాల ద్వారా ఆ కౌంట్‌ను చూసుకునే వెసులుబాటు ఉంది. ఈ ఫీచర్ కనిపించాలంటే యూట్యూబ్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలి. Inspiration Story: ఎక్కడికెళ్లినా నిరాదరణే.. కట్ చేస్తే యూట్యూబ్‌తో కోట్లు సంపాదిస్తున్నాడు..! -
మైనర్ బాలికకు గర్భం.. యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లోనే డెలివరీ..
కొచ్చి: కేరళలోని మలప్పురంలో ఓ మైనర్ బాలిక తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో శారీరకంగా కలవడంతో గర్భం దాల్చింది. అయితే ఆ విషయం ఇంట్లో తల్లికి కూడా తెలియకుండా జాగ్రత్తపడింది. చివరకు డెలవరీ కూడా యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఆ బాలికే స్వయంగా చేసుకుంది. బాలిక తల్లి పాక్షికంగా అంధురాలు కావడంతో డెలివరీ రోజు ఇంట్లో పసికందు ఏడుపు వినిపించేంతవరకు ఈ విషయాన్ని గ్రహించలేకపోయింది. ఈ నెల 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పాక్షికంగా అంధురాలైన ఓ మహిళ తన 17 ఏళ్ల కూతురితో కలిసి కొట్టకల్లో నివసిస్తోంది. బాలిక తన ఇంటి సమీపంలోని ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ విషయం వారివురి కుటుంబాలకు తెలిసింది. దీంతో బాలిక మైనర్ కావడంతో తనకి 18 ఏళ్లు నిండిన తర్వాత వారిద్దరికి పెళ్లి చేయాలని వారి కుటుంబీకులు నిర్ణయించుకున్నారు. అయితే, ఈ మధ్యలోనే బాలిక తన ప్రియుడితో శారీరకంగా కలవడంతో గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా ఆన్లైన్ తరగతుల పేరుతో ఎక్కువగా తన గదిలోనే ఉంటున్నట్లు తన తల్లిని నమ్మించింది. చివరకు డెలవరీ కూడా యూట్యూబ్ వీడియోలు తన ఇంట్లోనే చేసుకుంది. ఇంట్లో పసికందు ఏడుపు వినపడడంతో బాలిక తల్లికి ఈ విషయం తెలిసింది. డెలివరీ చేస్తుండగా ప్రక్రియలో తనకు ఇన్ఫెక్షన్ సోకడంతో బాలికతో పాటు బిడ్డని మంజేరిలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. దీనంతటికి కారకుడైన 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడితో రిలేషన్షిప్లో ఉన్నందున అతనిపై బాలిక వాంగ్మూలం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. చదవండి: Miss Telangana 2018: లైవ్ వీడియోతో ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ మిస్ తెలంగాణ -
యూట్యూబ్ వీడియోలు చూసి అబార్షన్.. వికటించడంతో..
ముంబై: యూట్యూబ్ వీడియోలను చూస్తూ ఇంట్లోనే స్వయంగా అబార్షన్ చేయడానికి యత్నించిన ఓ యువతికి ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రి పాలైంది. మహారాష్ట్ర నాగపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యశోధర నగర్‌కి చెందిన సోహెబ్ ఖాన్(30), బాధితురాలు 2016 నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఇటీవల తను గర్భం దాల్చడంతో విషయం తెలుసుకున్న ఖాన్ ఆమెను అబార్షన్ చేసుకోవాలని కోరాడు. ఇందుకు అబార్షన్ ఎలా చేస్తారో, లేదా గర్భస్రావం కోసం ఏ మందులు వాడాలో యూట్యూబ్‌లో వీడియోలు ఉంటాయని వాటిని చూసి తెలుసుకోవాలని సోహెబ్ ఆమెకు సూచించాడు. అతని బలవంతం మీద యూట్యూబ్ వీడియోలు చూసి ఆమె సొంతంగా అబార్షన్‌కు యత్నించింది. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఈ విషయం తెలియడంతో సోహెబ్ ఖాన్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. చదవండి: రూటు మార్చిన మోసగాళ్లు.. జర జాగ్రత్త! -
యూట్యూబ్ వీడియోలు తెగ చూస్తున్నారు
సాక్షి,న్యూఢిల్లీ: యూట్యూబ్‌లో వీడియోల వీక్షణం భారత్‌లో అంతకంతకూ పెరుగుతోంది. వీక్షిస్తున్న సమయం క్రితం ఏడాదితో పోలిస్తే 2020 జూలైలో 45 శాతం పెరిగింది. ఆరు ప్రాంతీయ భాషలలో 2020 రెండవ భాగంలో యూట్యూబ్ ఇండియాలో అత్యధికంగా వీక్షించిన టాప్ 10 వాణిజ్య ప్రకటనల జాబితాలో చోటు దక్కించుకున్నట్లు ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫాం శుక్రవారం తెలిపింది. తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ లాంటి ప్రాంతీయ భాషల్లో కంటెంట్ ఉండడం కూడా ఈ వృద్ధిని నడిపించిన కారణాల్లో ఒకటని యూట్యూబ్ తెలిపింది. అందుబాటు ధరలో స్మార్ట్ఫోన్లు లభించడం, చవక డేటా టారిఫ్‌లతో కొన్నేళ్లుగా వీడియోలు ఎక్కువగా చూస్తున్నారని వివరించింది. మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా ఓటీటీల వాడకం మరింతగా పెరిగిందని యూట్యూబ్ తెలిపింది. 2019 సెప్టెంబరులో విడుదలైన గూగుల్-కాంటార్ అధ్యయనం ప్రకారం 93 శాతం మంది ప్రాంతీయ భాషల్లో ఉన్న కంటెంట్‌ను చూసేందుకే మొగ్గు చూపుతున్నారు. యూట్యూబ్‌లో ప్రస్తుతం ఆరు ప్రాంతీయ భాషల్లో ప్రకటనలు వెలువడుతున్నాయి. -
కథ కంచికి.. మనం ఇంటికి!
కథ చదవడం ఆసక్తి అయితే.. కథ చెప్పడం గొప్ప ఆర్ట్. సంపూర్ణ బాల్యానికి కథ పునాది. చిన్నారుల్లో దీక్ష, పట్టుదల, జ్ఞాన సముపార్జన, మంచి చెడుల మధ్య వ్యత్యాసం, మానవ సంబంధాల గొప్పతనాన్ని కథ కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. గతంలో ప్రతి ఇంటిలో అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు గొప్ప కథకులుగా ఉండేవారు. కథ ఎంపిక దగ్గర నుంచి దానిని చిన్నారులకు అర్థమయ్యేలా, వారిని ఆకట్టుకునేలా వివరించడంలో ఇప్పటి సినిమా స్క్రీన్ ప్లే రైటర్స్ కంటే అద్భుతంగా నడిపించేవారు. తెనాలి: ‘అనగనగా’.. అంటూ మొదలు పెట్టి సాఫీగా వెళ్తున్న కథను ఒక్కసారిగా ఆపి.. చిన్నారుల ఆలోచనా శక్తికి కథకులు పదనుపెట్టే వారు. కథలోని ట్విస్టే ఉలిక్కిపడేలా ఉత్సుకతను పెంచి ఆ ట్విస్ట్‌ని బయటపెట్టి పిల్లలను ఆశ్చర్యపరిచి ఆనందాన్ని అందిచేవారు. ఒక రాజు కథలో.. ‘ఏడు చేపలు’ గురించి ఏడు తరాలు చెప్పుకునేవారు. ‘నాన్నా పులి’ అంటూ చిన్నారి కేకలో.. ముందు నవ్వును పంచి.. కన్నీటి నీతిని బయటపెట్టేవారు. ఇతరుల శక్తిని తక్కువ అంచనా వేయవద్దంటూ ‘కుందేలు–తాబేలు’ పోటీని వినిపించేవారు. ‘మాట తప్పని ఆవు’ గురించి చెప్పి మాట విలువను పెంచేవారు. ‘పంచతంత్ర’లో విజ్ఞాన్ని పంచి.. ‘చందమామ’లో జానపథాన్ని వినిపించి.. ‘అక్బర్ బీర్బల్’.. తెనాలి రామకృష్ణుడి తెలివిని వినిపించి, ‘ఇంద్రజాలాన్ని’ పరిచయం చేసి కథతోనే కథను చెప్పించి.. బాలలకు వినోద, విజ్ఞానాన్ని అందించేవారు. తరాలు మారడంతో.. కానీ, ఇప్పుడు తరాలు మారాయి. ఆ కథలు కలగా మిగిలిపోయాయి. అమ్మమ్మ, నాయనమ్మ ఒడిలో చిన్నారులు నిద్రపోవడం లేదు. సాయంత్రం వేళ సరదా కబుర్లు లేవు. కుటుంబ వ్యవస్థ చిన్నదైపోయింది. పని ఒత్తిడిలో ఎవరికివారే యమునా తీరే. పుస్తకాలు చదివే అలవాటు లేకపోవడంతో ఎప్పుడైనా ఏదైనా కథ చెప్పాలనిపించినా ఏదీ గుర్తుకురాదు. నేటి పాఠశాల విద్యలో పుస్తకాలతోపాటు మోసుకొచ్చే హోంవర్క్‌తోనే పిల్లల కళ్లమీదకు నిద్ర ముంచుకొస్తోంది. ఇక కథలకు ఆస్కారం ఎక్కడ! ఈ క్రమంలోనే తనను వినిపించేవారు, వినేవారు లేక కథ మూగబోయింది. లోగిళ్ల నుంచి దూరమైపోంది. కొత్త రూపు దాల్చిన కథ ప్రస్తుతం కథ.. కొత్త రూపుదాల్చింది. ‘తెర’బొమ్మగా మారింది. సినిమాలు, నాటికలు, షార్ట్‌ఫిల్మŠస్‌గా కనిపిస్తోంది. కాలక్షేపంగా కార్టూన్ సినిమాలు, వీడియో గేమ్‌లలోకి వచ్చేసింది. మొబైల్/టీవీలకు అతుక్కుపోతున్న పిల్లలకు కంటి సమస్యలు రావడం తప్ప కథా విషయాలు తెలియడం లేదు. కథ చెప్పడంలో కొత్త మార్పులొచ్చాయి గానీ నీతిని, జ్ఞానాన్ని పంచడంలో నేల విడిచి సాము చేస్తున్న చందంగా తయారైంది. పిల్లల్ని కథలకు దగ్గర చేద్దాం.. విధి ఎంత విచిత్రమో!.. ‘కథ’ కంచికి వెళ్తే.. ‘మనం’ ఇంటికి వచ్చాం. కరోనా లాక్డౌన్లో కుటుంబం మొత్తం ఒకే చోటుకు చేరింది. వ్యక్తుల మధ్య దూరం తగ్గి ప్రేమానురాగం బలపడింది. పెద్దల సంగతి అలా ఉంటే బడుల కెళ్లాల్సిన చిన్నారులకు మరే అవకాశం లేదు. కేవలం ఇళ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో తెలీదు. ఆన్లైన్ పాఠాలు చెవికెక్కుతున్నా, మెదడుకు ఎక్కేది ఎంతవరకు అన్నదీ ప్రశ్నే! ఎటుతిరిగి పెద్దోళ్లు, పిల్లలు ఇంటిలోనే గడుపుతున్న ఈ కాలంలో పిల్లలి్న, కథల్లోకి తీసుకెళ్లగలిగితే, సెలవులు సది్వనియోగమైనట్టే. అపరిమిత విలువలు, జ్ఞానం, ఆలోచనాశక్తిని అందించినట్టే. మరోవైపు వెబ్సైట్, యూట్యూబ్ చానళ్లలో కూడా తెలుగు కథలు లభిస్తున్నాయి. నెట్టింట్లో కథలు.. ♦help@pratham.org ♦podupukathalu.blogspot.com ♦indianepicstories.blogspot.in ♦telugupennidhi.com ♦telugu& velugu.net ♦forkids.in ♦telugumalika.blogspot.com యానిమేషన్ రూపంలో కథలు అందిస్తున్న యూట్యూబ్ ఛానళ్లు ♦fairy toonz telugu ♦bommarillu videos ♦kids planet -
గరిటె పట్టేందుకు సమయం ఏదీ?
ఒకప్పుడు అమ్మాయికి పెళ్లి చూపుల సమయంలో.. ఇంటి పనులు వచ్చా..? వంట చేస్తుందా..? సంగీతం నేర్చుకుందా?.. ఇలా అడిగేవారు. ఇప్పుడు తరం మారింది. అమ్మాయి ఏం చదువుతోంది?.. ఎక్కడ ఉద్యోగం చేస్తుంది?.. జీతం ఎంత?.. అని అడుగుతున్నారు. ఇంటి, వంటకు పని మనుషులు.. ఇష్టమైనవి తినాలంటే హోటల్ నుంచి పార్సిల్స్.. వీలైతే రెస్టారెంట్లో భోజనం.. ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో ఇదే పరిస్థితి. కారణం నేటి తరం ఆడ పిల్లలు వంట గది వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పుస్తకాలు పట్టిన చేతులు గరిటె పట్టడానికి రావడం లేదు. ‘ చదువులో పడి వండినవి కూడా తినేందుకు సమయం ఉండటం లేదు. ఇంకా వంటెప్పుడు నేర్చుకుంటారు’ అని తల్లిదండ్రులే తమ పిల్లల గురించి చెబుతున్నారు. –కర్నూలు(హాస్పిటల్) ‘ఆమె చేతి వంట అద్భుతం’.. ఇలాంటి అభినందన అందు కోవాలంటే సామాన్య విషయం కాదు. నలుగురు మెచ్చేలా వంటలు చేయడం ఓ కళ. అయితే గరిటె తిప్పడంలో నేటితరం ఆడపిల్లల్లో ఇవన్నీ నేర్చుకోవడానికి సమయం ఉండటం లేదు. ఎదిగే వయస్సులో వారి సమయమంతా చదువుకే సరిపోతోంది. ఫలితంగా వంటా వార్పు నేర్చుకునేందుకు వారికి వీలులేకుండా పోతోంది. ఈ విషయాలన్నీ గమనించి ఇప్పుడు పెళ్లి చూపుల్లో సైతం వంట పనులకు మినహాయింపులిస్తున్నారు. పెళ్లయ్యాక భార్యకు వంట పనుల్లో భర్తలూ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఇద్దరూ యూట్యూబ్‌లు చూసి వంటలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆధునిక యువతికి అర్హతలు మారుతున్నాయి. ఒకప్పటి కొలమానాలు కాలక్రమేణా ఇప్పుడు తొలగుతున్నాయి. చదువుల ధ్యాసలో పడి అమ్మాయిలు వంటనేర్చే సమయం ఉండటం లేదు. దీంతో ఇప్పుడు వారిని చేసుకునే వారు సైతం అప్పటిలా కండిషన్లు పెట్టకుండా సర్దుకుపోతున్నారు. జిల్లాలో 44 లక్షల జనాభా ఉంది. అందులో 23 లక్షల మందికి పైగా మహిళలు ఉన్నారు. ఇందులో వివాహ వయస్సున్న యువతుల సంఖ్య 8 లక్షల దాకా ఉన్నట్లు అంచనా. వీరిలో 60 శాతం దాకా కాస్త మంచి చదువులు చదివిన వారే ఉన్నారు. వీరు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత చదువుల వరకు చదువుకోవడం కోసమే అధిక సమయం వెచ్చిస్తున్నారు. పాతికేళ్ల క్రితం నాటికి ఇప్పటికీ చదువుకునే అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగింది. నగరాలు, పట్టణాల్లో కూలీ పనిచేసుకునే వారు సైతం తమ ఇంట్లో మగపిల్లలతో సమానంగా చదివిస్తున్నారు. గతంలో ఒకవర్గం వారు అమ్మాయిలను చదువుకు దూరంగా ఉంచేవారు. ఇప్పుడు వారు కూడా అందరితో సమానంగా చదివిస్తున్నారు. స్థానికంగా ఇంటికి కాస్త దూరంగా ఉండే పాఠశాలకు పంపి చదివించడానికి వెనుకాడే వారు సైతం ఇతర నగరాలకు తమ ఇంటి ఆడపిల్లలను పంపి చదివిస్తున్నారు. దీనికితోడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు ఈరియంబర్స్మెంట్ పథకంతో ఉన్నత చదువులు చదివే వారి సంఖ్య పెరిగింది. దీనికితోడు క్యాంపస్ సెలెక్షన్లలో ఉద్యోగాలు రావడంతో ఒకరిని చూసి మరొకరు ఆడపిల్లలను చదివిస్తున్నారు. నెట్టింటి సాయం.. కొంత మంది అమ్మాయిలు ఒకవైపు చదువుతూనే ఖాళీ సమయాల్లో ఇంట్లో వంటావార్పు కూడా నేర్చుకుంటున్నారు. కాఫీ, టీతో మొదలు పెట్టి టిఫిన్లు, మధ్యాహ్నం, రాత్రి భోజనం వండటం అభ్యసిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆన్లైన్ వంటలను ఫాలో అవుతున్నారు. యూ ట్యూబ్‌లు, టీవీ ఛానళ్లల్లో వచ్చే కొత్తరకం వంటలను ఇంట్లో ప్రయత్నిస్తూ ఇంట్లో వారికి కొత్త రుచులు చూపిస్తున్నారు. అయితే చదివే సమయంలో వంట నేర్చుకోని వారు సైతం ఇప్పుడు యూ ట్యూబ్ ద్వారా వంటలను నేర్చుకుంటున్నారు. చదువుకే టైమ్ సరిపోవడం లేదు ఇప్పటి కాలం పిల్లలు ఎక్కువగా చదువుతున్నందున వారికి వంట నేర్చుకునే టైమ్ ఉండటం లేదు. చదువు తర్వాత క్యాంపస్ సెలక్షన్లలో ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ తర్వాత వెంటనే పెళ్లి చేస్తున్నారు. ఇక వారు వంట నేర్చుకునే సమయం ఉండటం లేదు. అధిక శాతం మందికి కేవలం తెల్ల అన్నం మాత్రమే వండటం వచ్చు. టిఫిన్లు, కూరలు, పప్పు, పెరుగు అన్నింటికీ కర్రీపాయింట్లు, హోటళ్లను ఆశ్రయిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు హోటళ్లల్లో పార్సిల్ కట్టించుకుని వచ్చి తింటున్నారు. అత్తారింట్లో వంటావార్పు రావడం లేదని కోడళ్లను తిడుతున్న సంఘటనలు, దీనివల్ల రెండు కుటుంబాలకు గొడవలు అక్కడక్కడా జరుగుతున్నాయి. – చిన్నయ్య, వివాహాల మధ్యవర్తి, కర్నూలు మధ్యతరగతి ఇళ్లల్లో నేర్చుకుంటున్నారు గతంలో అక్షరాస్యత తక్కువ. ఇంట్లో ప్రతి పని మనమే చేసుకునే పరిధి ఉండేది. ఇప్పుడు అక్షరాస్యత పెరిగింది. చదువులో పడి ఇతర పనులను మరిచిపోతున్నారు. సెల్ఫోన్లు, టీవీల వల్ల కూడా వాటి ధ్యాసలో పడి వంటావార్పు నేర్చుకోవడం లేదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ పిల్లలు బాగా చదువుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇందులో స్త్రీ, పురుష బేదం ఉండటం లేదు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను కూడా చదివిస్తున్నారు. ఈ కారణంగా చదువుకునే సమయంలో వంట నేరి్పంచేందుకు ఉత్సాహం చూపడం లేదు. అయితే ఇప్పటికీ ఒకవైపు చదువుతూనే మరోవైపు వంట నేర్చుకునే అమ్మాయిలు ఉన్నారు. – రామస్వామి, తెలుగువీధి, కర్నూలు మగపిల్లలు నేర్చుకుంటున్నారు యువతులకు వంట దూరమైంది. గతంలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాల ఉండేది. ఇంటికి వచ్చిన వెంటనే వారు తల్లికి సహాయంగా ఉండేవారు. ఇప్పుడు పొద్దున వారు రెడీ కావడానికే సరిపోతోంది. ఇప్పుడు ఉదయం 7 గంటలకు వెళ్లి రాత్రి 8 గంటలకు వస్తున్నారు. దీంతో పాటు పెద్ద చదువులు చదువుతూ వంటకు దూరం అవుతున్నారు. పెళ్లి ఖాయమైన సమయంలో మాత్రమే వంట నేర్చుకుంటున్నారు. దీంతో ఇప్పుడు మగపిల్లలు కూడా వంట నేర్చుకుంటున్నారు. దీనికితోడు రెడీమేడ్‌గా ఆహారం లభించడం, డబ్బు అధికంగా ఉండటంతో వంటావార్పుకు దూరం అవుతున్నారు. –యాన్నీ ప్రతాప్, చాణిక్యపురికాలని, కర్నూలు -
పూనం కౌర్ కేసు.. 36 యూట్యూబ్ లింక్‌లు
సాక్షి, సిటీబ్యూరో: తనకు సంబంధించి అభ్యంతకరమైన వీడియోలు యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారంటూ సినీ నటి పూనం కౌర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బుధవారం మరోసారి సైబర్ క్రైమ్ ఠాణాకు వచ్చిన ఆమె వాంగ్మూలంతో పాటు కేసుకు సంబంధించిన వివరాలను అందజేశారు. మంగళవారం పూనం తన ఫిర్యాదుతో పాటు 36 యూట్యూబ్ లింక్‌లు అందించగా... వీటిలో కొన్ని బుధవారానికి డిలీట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. వైసీపీ నాయకురాళ్లు వైఎస్ షర్మిళ, నందమూరి లక్ష్మీపార్వతి సైతం ఇప్పటికే తమపై జరుగుతున్న దుష్ఫ్రచారంపై గతంలోనే సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మూడు కేసుల వెనుకా ఒకరే ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీతో పాటు ఆ పార్టీ నేతలు, వారికి సంబంధించిన వారిపై బురద జల్లేందుకు, దుష్ఫ్రచారం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో షికారు చేసిన పుకార్లు, అభ్యంతరకరమైన విషయాలను మరోసారి కొత్తగా ఎన్నికలకు ముందు యూట్యూబ్ ద్వారా ప్రచారం చేసినట్లు భావిస్తున్నారు. ఓ సందర్భంలో తన వ్యక్తిగత విషయాలు మాట్లాడుతుండగా వాటిని రికార్డు చేసిన కొందరు యూట్యూబ్‌లో అప్లోడ్ చేసినట్లు పూనం కౌర్ పోలీసులకు తెలిపారు. ఎన్నికల కుయుక్తుల్లో భాగంగా మహిళలపై టీడీపీ శ్రేణులు యూట్యూబ్ వీడియోలను ఎక్కుపెట్టి కించపరిచినట్లు, తద్వారా వారిని మానసికంగా దెబ్బతిసేందుకు ప్రయత్నించినట్లు అనుమానాలు రేగుతున్నాయి. పై మూడు కేసుల్లోనూ దుండగులు దాదాపు ఒకే తరహా విధానం అవలంభించారు. ఈ నేపథ్యంలో వీటి వెనుక ఉన్నది ఒకరేనని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. షర్మిల కేసులో అరెస్టైన వారికి మిగిలిన రెండు కేసుల్లోనూ అనుమానితులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు మూడు కేసులను అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఐపీ అడ్రస్‌లు, లాగిన్ ఐడీలు వంటి సాంకేతిక అంశాలు, ఆధారాల కోసం వేచి చూస్తున్న పోలీసులు అవి వస్తే ఈ మూడు కేసుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. పూనం కౌర్ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే బాధ్యులను పట్టుకుంటామని సైబర్ క్రైమ్ ఏసీపీ కేసీఎస్ రఘువీర్ బుధవారం మీడియాకు తెలిపారు. -
ఆ వీడియోల ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వైనం!
యూట్యూబ్.. ప్రతిభను ప్రదర్శించేందుకు అంతర్జాతీయ వేదిక. ఇది కొంతమందిని రాత్రికిరాత్రే స్టార్లుగా మార్చేస్తోంది. మరికొంత మందికి ఊహించని ఆదాయం తెచ్చిపెడుతోంది. సృజనాత్మకతే పెట్టుబడిగా యూట్యూబర్‌గా మారి సంపాదించేందుకు వీలుకల్పిస్తోంది. ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, కామెడీ, బ్యూటీ, ఫ్యాషన్, ఫిట్నెస్ మొదలైన విభాగాల్లో యువత ప్రతిభ చాటుతోంది. యూట్యూబర్గాసక్సెస్ సాధించి.. సినిమా అవకాశాలను చేజిక్కించుకుంటున్నవారూ ఉన్నారు. సృజన, నవ్యత, నాణ్యత ఉంటే.. ఎవరైనా యూట్యూబర్‌గా మారొచ్చు. నేటి డిజిటల్ యుగంలో వినోదంతోపాటు ఆదాయ వనరుగా నిలుస్తున్న యూట్యూబర్ కెరీర్ గురించి తెలుసుకుందాం.. వైవా హర్ష, ఘాజీ దర్శకుడు సంకల్ప్‌రెడ్డి, పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి, మహా తల్లి (జాహ్నవి) వంటి వారెందరో యూట్యూబ్‌లో ప్రతిభను చాటడం ద్వారా.. బుల్లితెర, వెండితెరలపై తమకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. యూట్యూబ్‌ను ఆధారం గా చేసుకొని కొందరు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుం టే.. మరికొందరు బాగా సంపాదిస్తున్నారు. వినూ త్నంగా సాగే తమ ఆలోచనలకు ఒక రూపం ఇవ్వగలిగే నేర్పు ఉంటే చాలు యూట్యూబ్ స్టార్‌గా ఎదగవచ్చు అంటున్నారు నిపుణులు. ఇందుకోసం పెద్దగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. మొబైల్ లేదా తక్కువ బడ్జెట్ కెమెరాలతో వీడియో షూట్ చేయొచ్చు. వీటిని గూగుల్ అకౌంట్ సహాయంతో యూట్యూబ్ చానల్ అకౌంట్ ఓపెన్‌చేసి, అప్లోడ్ చేయొచ్చు. ఆదాయం ఎలా? యూట్యూబ్ చానల్‌కు ప్రధాన ఆదాయ మార్గం.. ప్రకటనలు. వీటిద్వారా వచ్చే ఆదాయం ద్వారానే సదరు యూట్యూబ్ చానల్ యజమానికి చెల్లింపులు జరుగుతాయి. ఇటీవల యూట్యూబ్‌లో స్పామ్ కంటెంట్ పెరిగిందంటూ ఫిర్యాదులు, వీడియోలను వాయిస్‌ఓవర్‌తో తప్పుదోవ పట్టిస్తున్న సంఘటనలు ఎక్కువ అవడంతో గూగుల్ సంస్థ యూట్యూబ్ నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో నవ్యత, నాణ్యతకు ప్రాధాన్యత పెరిగింది. వీటితోపాటు ఏడాది కాలంలో 4,000 గంటల వాచ్‌టైం తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను సైతం అమల్లోకి తెచ్చింది. కనీసం వెయ్యి మంది సబ్ స్క్రైబర్స్‌తో రోజుకు 10 గంటల వాచ్ టైం ఉంటేనే ఆదాయం పొందేందుకు వీలుంటుంది. ముఖ్యమైన టూల్స్ యూట్యూబ్ చానల్ ప్రారంభించడానికి పెట్టుబడి అవసరం లేకున్నా.. వీడియోలను కొన్ని టూల్స్ ద్వారా ఆకర్షణీయంగా రూపొందించవచ్చు. దాంతో వ్యూస్ పెంచుకోవడంతో పాటు సబ్స్క్రిప్షన్స్ కూడా పెరుగుతాయి. చానల్ ప్రారంభించే ముందు మీరు ఎంచుకునే అంశంపై స్పష్టత ఉండాలి. దానికోసం కొంత పరిశోధన చేయాలి. వీక్షకులకు ఆసక్తి గలిగించే అంశాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. వీడియో రికార్డింగ్ కోసం 720పి రెజల్యూషన్ కంటే ఎక్కువ నాణ్యతతో రికార్డింగ్ చేస్తే మేలు. బడ్జెట్ అనుకూలిస్తే తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉండే కెనాన్ 1300డి వంటి బ్రాండెడ్ కెమెరాలు తీసుకొని వాటితో వీడియోలు చేయొచ్చు. ట్రైపాడ్స్ తీసుకుంటే రికార్డింగ్ సులువు అవుతుంది. మార్కెట్లో తక్కువ పెట్టుబడితో ట్రైపాడ్స్ కొనుగోలు చేయొచ్చు. మైక్రోఫోన్ ఆధారంగా చక్కటి ఆడియోతో పాటు వీడియో రికార్డింగ్ సాధ్యపడుతుంది. ఇది ప్రేక్షకుల ఆదరణ పొందడానికి ఉపయోగపడుతుంది. బ్లూ స్క్రీన్ లేదా గ్రీన్ స్క్రీన్ ఉపయోగిస్తే బ్యాక్‌గ్రౌండ్ ఎడిటింగ్ సులువు అవుతుంది. వీడియో రికార్డింగ్ చేసే క్రమంలో అవాంతరాలు రావడం సహజం. వాటిని డిలీట్ చేయడానికి ఎడిటింగ్ టూల్స్ ఉపయోగపడతాయి. వీడియో, ఆడియో ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించి వీడి యోను ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దొచ్చు. ముఖ్యంగా వీడియో ఎడిటింగ్ కోసం థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లను ఉపయోగించుకోవచ్చు. యూట్యూబ్‌లోనూ ఇన్ బిల్ట్ ఎడిటింగ్ టూల్స్ ఉంటాయని.. వాటిని ఉపయోగించుకుంటే కోరుకున్న ఔట్పుట్ వస్తుం దని నిపుణులు చెబుతున్నారు. వ్యూస్ పెరిగేకొద్దీ.. యూట్యూబ్‌లో డబ్బులు రావాలంటే వ్యూస్ ఎక్కువగా రావాలి. అదేవిధంగా క్రమంతప్పకుండా వీడియోలు అప్లోడ్ చేయాలి. చానల్ ప్రారంభించిన మొదట్లోనే డబ్బులు రావు. మొదటి పేమెంట్ రావాలంటే.. బ్రేక్ ఈవెన్ అమౌంట్ (సుమారు 100 డాలర్లు) దాటాలి. తర్వాత రెగ్యులర్‌గా ఆదాయం అందుతుంది. ఇండియాలో కంటే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వీడియోలు చూస్తే సదరు చానల్ ఓనర్‌కు ఆదాయం ఎక్కువగా ఉంటుంది. వ్యూస్ పెంచుకునేందుకు కొన్ని చిట్కాలు పాటించడం తప్పనిసరి. ప్రధానంగా టైటిల్స్ ఆకర్షించే విధంగా ఉండాలి. అదే విధంగా థంబ్‌నైల్స్ కూడా చూపరులను కట్టిపడేసేవిగా కనిపించాలి. తెలుగులో చానల్ ప్రారంభిస్తే .. తెలుగు భాషలోనే కీవర్డ్స్ ఇవ్వాలి. ఇక, యూట్యూబ్ నుంచి కూడా ఆటోమేటిక్/సజెస్టెడ్ కీవర్డ్స్ వస్తుంటాయి. వాటిని ఉపయోగిం చుకోవాలి. ‘ఎంటర్టైన్మెంట్’ విభాగాల వీడి యోలు ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. ఎడ్యుకేషన్ వంటి సంప్రదాయ విభాగాలు ట్రెండింగ్ వీడియోల్లో కనిపించట్లేదు. వైరల్ అయితే కాసులే! ప్రస్తుతం ఒక వీడియో వైరల్ అయితే చాలు ఎంతో పేరు, డబ్బు వస్తుంది. వినోదాత్మక జానర్ ఎంచుకొని కొత్తగా వీడియోలు చేస్తే త్వరగా వీక్షకుల సంఖ్య పెరుగుతుంది. కొత్తగా చానల్ పెట్టాలనుకుంటే.. ఫ్రెష్‌గా, ప్రొఫెషనల్‌గా తీయాలి. వాయిస్ ఓవర్, యాంకర్లను పెట్టి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లొచ్చు. అప్లోడ్ చేసే క్రమంలో ‘కీవర్డ్స్’ కూడా సరిపోయేవి ఇస్తే చానల్‌కు ప్రేక్షకులు ఎక్కువగా వస్తారు. చానల్ ప్రమోషన్స్‌కు ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలను కూడా ఉపయోగించుకోవాలి. అందులోనూ ‘చెల్లింపు’ ప్రమోషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా త్వరగా ప్రేక్షకులను చేరొచ్చు. – నల్లమోతు శ్రీధర్, కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ చానల్. డేటా వినియోగం బాగా పెరిగింది జియో వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో డేటా వినియోగం బాగా పెరిగింది. యూట్యూబ్ వీడియోలు బాగా చూస్తున్నారు. నేను అప్లోడ్ చేసే పోటీ పరీక్షల ‘ఎడ్యుకేషన్’ విభాగానికి సంబంధించిన వీడియోలకు ప్రత్యేకంగా ప్రేక్షకులు ఉంటున్నారు. వారు మాత్రమే ఈ వీడియోలు చూస్తున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ అంత సులువుగా డబ్బులు ఇవ్వడం లేదు. నిబంధనలు కఠినంగా ఉన్నాయి. నాకు మొదట ఆర్నెల్ల వరకు డబ్బులు రాలేదు. నేను ఫుల్‌టైం ఉద్యోగం చేస్తూ వీలున్నప్పుడు వీడియోలు చేస్తున్నాను. రెగ్యులర్‌గా వీడియోలు పెడితే డబ్బులు వస్తాయి. – ఆకుల నారాయణరావు, ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. -
యూట్యూబ్‌లో చూసి.. చోరీలు చేసి!
హైదరాబాద్: యూట్యూబ్‌లో వీడియోలు చూసి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఓ బాలుడు పోలీసులకు పట్టుబడ్డాడు. మూడు నెలల్లో పదిహేను స్పోర్ట్స్ బైక్‌లను మాయం చేశాడు. ఆసిఫ్‌నగర్ ఏసీపీ చక్రవర్తి వివరాలను వెల్లడించారు. పహాడీ షరీఫ్ ప్రాంతంలో నివాసముండే అబ్దుల్ ఖాదర్ కుమారుడు(15) ద్విచక్ర వాహనాలను దొంగిలించే వీడియోలను ఈ ఏడాది మార్చిలో యూట్యూబ్‌లో చూశాడు. తర్వాత కొద్ది రోజులకు స్నేహితుడి వాహనాన్నే దొంగిలించాడు. జల్సాలకు అలవాటు పడి చోరీలబాట పట్టాడు. స్థానికంగా ఉండే పాత నేరస్తుడు, ఎలక్ట్రీషియన్ మొహమ్మద్ సోహైల్(19), మరో ఇద్దరు స్నేహితులతో కలసి చోరీలకు పాల్పడుతు న్నాడు. ఈ దొంగలు కేవలం స్పోర్ట్స్ బైక్‌లు, బుల్లెట్లు, రాయల్‌ఎన్‌ఫీల్డ్, 200 సీసీ పైన ఉన్న పల్సర్ వాహనాలనే చోరీ చేసేవారు. కేవలం రెండు, మూడు నిమిషాల వ్యవధిలోనే తాళం విరగ్గొట్టి ఎంతటి వాహనాన్నైనా సునాయాసంగా తస్కరించేవారు. ఈ వాహనాలను విక్రయించిన సొమ్ముతో షికార్లు చేయడం, మండి బిర్యాని తినడం వంటివి చేసేవారు. దొరికింది ఇలా..... ఈ నెల 10న కాళీమందిర్ ప్రాంతానికి చెందిన అక్షయ్ తన కేటీఎం స్పోర్ట్స్ బైక్‌పై అత్తాపూర్‌లోని స్నేహితున్ని కలవడానికి వెళ్లాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో మొఘల్‌నగర్ రింగ్ రోడ్ వద్దకు రాగానే వాహనంలో పెట్రోల్ అయిపోయింది. సమీపంలో ఉన్న క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద బైక్ పార్కు చేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయాన్నే వచ్చి చూడగా వాహనం కనిపించకపోవడంతో లంగర్‌హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సాలార్జంగ్ కాలనీలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఈ దొంగలను కానిస్టేబుళ్లు మనీష్‌కుమార్ తివారి, నరేష్‌బాబు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చోరీ విషయాలు బయటపడ్డాయి. ముగ్గురు మైనర్ బాలురతోపాటు మొహమ్మద్ సోహైల్(19), మొహమ్మద్ గఫూర్ ఖాన్(20)లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుండి 4 రాయల్ ఎన్ఫీల్డ్లతోపాటు 15 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.15 లక్షలుంటుందని పోలీసులు తెలిపారు. -
యూట్యూబ్‌లో భారీగా వీడియోలు తొలగింపు
ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్‌కు చెందిన యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్‌పై భారీగా వీడియోలను తొలగించేసింది. కంటెంట్ పాలసీ ఉల్లంఘన చేపడుతుందనే ఆరోపణలతో ఈ వీడియోలను తీసేసింది. గతేడాది నాలుగో త్రైమాసికంలో ఎవరూ చూడకముందే 60 లక్షలకు పైగా వీడియోలను తొలగించినట్టు కంపెనీ తన గణాంకాల్లో పేర్కొంది. తొలగించిన వీడియోల్లో ఎక్కువగా స్పామ్ లేదా అడల్డ్ కంటెంటే ఉన్నట్టు కంపెనీ తెలిపింది. యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్‌పై సరియైన కంటెంట్ పాలసీని చేపట్టడం లేదని ఎంతో కాలంగా విమర్శలు ఎదుర్కొంటోంది. గత రెండేళ్లుగా దిగ్గజ కంపెనీలు సైతం యూట్యూబ్‌కు వ్యాపార ప్రకటనలు ఇవ్వడం మానేశాయి. తమ ప్రకటనలను అతివాద, ద్వేషపూరిత కంటెంట్ పక్కన చూపిస్తుందంటూ ఆరోపిస్తూ కంపెనీ వ్యాపార ప్రకటనలను ఇవ్వడం నిరాకరిస్తున్నాయి. యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌పై వస్తున్న అతివాద కంటెంట్‌ను చట్టసభ్యులు సైతం పరిశీలిస్తున్నారు. అలాంటి వీడియోలను తొలగించడానికి యూట్యూబ్ శాయశక్తుల ప్రయత్నిస్తోంది. సోమవారం గూగుల్ తన ఫలితాల ప్రకటన సందర్భంగా ఈ విషయాలను వెల్లడించింది. మంచి కంటెంట్‌తో యూట్యూబ్‌ను సురక్షితమైన ప్లాట్‌ఫామ్‌గా రూపొందిస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. తమ కంటెంట్ పాలసీని ఉల్లంఘించే వీడియోల విషయంలో కంపెనీ దర్యాప్తు సంస్థలకు కానీ మేథోసంపత్తి హక్కుల యజమానులకు కానీ స్పష్టమైన వివరాలు ఇవ్వలేమని యూట్యూబ్ పేర్కొంది. అప్లోడర్స్, హక్కుదారులను అంత తేలికగా గుర్తించలేమని చెప్పింది. ఎవరైనా కాపీరైట్ ఓనర్లు తమ హక్కులను ఏమైనా వీడియో హరిస్తుంది అని గుర్తిస్తే యూట్యూబ్‌కు రిపోర్టు చేయాలని తెలిపింది. -
వాట్సాప్ నుంచి గ్రేట్ ఫీచర్స్
మెసేజింగ్ సర్వీసుల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన వాట్సాప్, కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఐఫోన్లపై రెండు సరికొత్త ఫీచర్లను వాట్సాప్ ఆవిష్కరించింది. దానిలో ఒకటి యూట్యూబ్ వీడియోలను సంభాషణ మధ్యలో ఉండగానే ప్రత్యక్షంగా చూసేలా, రెండోది లాక్ రికార్డింగ్. దీని ద్వారా కింద ఉన్న బటన్‌ను అలానే పట్టుకుని ఉండకుండానే యూజర్లు వాయిస్ మెసేజ్‌ను రికార్డు చేయవచ్చు. యూట్యూబ్ ఫీచర్‌ను పిక్చర్ ఇన్ పిక్చర్(పీఐపీ) మోడ్‌లో యూజర్లకు అందిస్తోంది. ఈ ఫీచర్లను సద్వినియోగం చేసుకునేందుకు ఐఫోన్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి కొత్త వాట్సాప్ వీ2.17.81 యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. '' యూట్యూబ్ వీడియో తిలకించేందుకు యూజర్లు ఓ లింక్‌ను పొందితే, దాన్ని ప్రస్తుతం వాట్సాప్‌లోనే ప్లే చేసుకోవచ్చు. పిక్చర్-ఇన్-పిక్చర్తో మరో చాట్‌ను నావిగేట్ చేస్తూనే వీడియోను తిలకించవచ్చు'' అని యాప్ స్టోర్ పేర్కొంది. ఇంతకముందు వరకు యూజర్లు వారు పొందిన లింక్‌ను క్లిక్ చేస్తే, స్మార్ట్ఫోన్లలో ఇన్స్టాల్ అయిన యూట్యూబ్ యాప్‌లో ఆ వీడియో ఓపెన్ అయ్యేది. తాజా అప్డేట్ ద్వారా లాంగ్ మెసేజ్‌లను కూడా తేలికగా రికార్డు చేసుకోవచ్చు. లాంగ్ వాయిస్ మెసేజస్‌ను తేలికగా రికార్డు చేసుకోవాలనుకుంటే, లాక్ రికార్డింగ్‌ను స్వైప్ చేసి, వాయిస్ రికార్డింగ్‌ను చేపట్టవచ్చు. అదేవిధంగా మరో ఫీచర్‌ను కూడా లాంచ్ చేసేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. వాయిస్ నుంచి వీడియో కాల్‌కు, వీడియో నుంచి వాయిస్ కాల్‌కు కాల్ మధ్యలో ఉండగానే మారేలా వాట్సాప్ పనిచేస్తుందని తెలుస్తోంది. దీని కోసం ఓ కొత్త బటన్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు డబ్ల్యూఏబీటాఇన్ఫో రిపోర్టు చేసింది. -
యూట్యూబ్‌లో పాఠాలు..లక్షల్లో ఆదాయం
పెద్దపల్లి(యైటింక్లయిన్‌కాలనీ): సోషల్‌మీడియాలో గంటలకొద్దీ సమయం వెచ్చిస్తూ యువత కాలాన్ని వృథా చేస్తుంటే..హఫీజ్ మాత్రం అదే సోషల్‌మీడియా వేదికగా ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కంప్యూటర్ కోర్సులు, మొబైల్ ప్రాబ్లమ్స్‌పై వీడియోలు రూపొందించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ ప్రతి నెల రూ.1.50లక్షల ఆదాయం పొందుతున్నాడు. యూట్యూబ్‌లో హఫీజ్ నిర్వహిస్తున్న తెలుగు టెక్ ట్యూట్స్కు 4కోట్ల వ్యూస్..4.30లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2006లో ప్రారంభం రామగుండం మండలం యైటింక్లయిన్‌కాలనీలో కం ప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్ నిర్వహిస్తున్న ఎస్డీ హఫీజ్ 2006లో యూట్యూబ్‌లో తన తొలి పాఠాన్ని అప్లోడ్ చేశారు. టెక్నాలజీతో జరుగుతున్న మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు పాఠాలను వీడియోలుగా రూపొందించి అప్లోడ్ చేయడం ప్రారంభించారు. 10వేలమంది వ్యూస్‌తో ప్రారంభమైన ‘తెలుగు టెక్ ట్యూబ్స్’ 4కోట్ల వ్యూస్‌కు చేరుకుంది. కంప్యూటర్ సెంటర్ నిర్వహిస్తూనే ఎంఎస్ ఆఫీస్, సీలాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలో యూట్యూబ్‌లో వివరించారు. ఆ సమయంలో ఇంటర్నెట్ వినియోగం పెద్దగా లేకపోవడంతో స్పందన కూడా అంతంతే ఉండేది. కాలక్రమంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో హఫీజ్ అప్లోడ్ చేస్తున్న వీడియోలకు ప్రేక్షకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2014 తర్వాత స్మార్ట్ఫోన్ల వినియో గం పెరగడంతో వ్యూస్, ఫాలోవర్స్ పెరిగారు. ఎస్ఈవో, ఆటోకాడ్, టాలీ, జావా, వెబ్‌డిజైనింగ్ కోర్సులను తెలుగువారి కోసం యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. మొబైల్ సీక్రెట్స్కు స్పందన స్మార్ట్ఫోన్లు ఎలా వినియోగించాలి, సీక్రెట్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయి..అనే అంశాలపై తెలుగులో అర్థమయ్యేలా వీడియోలు రూపొందించి తెలుగు టెక్ ట్యూట్స్ ద్వారా అందిస్తున్నారు. ఇటీవల హఫీజ్ టెక్నికల్ వివరణకు మంచి స్పందన లభిస్తోంది. ఇలా ఒక్క సీక్రెట్ సెట్టింగ్స్ వీడియో అప్‌లోడ్‌కు 12లక్షల వ్యూస్ వచ్చాయి. హఫీజ్ అడ్రస్ తెలుసుకుని విజయవాడ, వైజాగ్ ప్రాంతాల నుంచి చాలా మంది యువకులు టెక్నాలజీ నేర్పించాలని యైటింక్లయిన్‌కాలనీకి వస్తున్నారు. హఫీజ్ తయారు చేసిన మొబైల్ సీక్రెట్స్ సిల్వర్ ప్లే బటన్ అవార్డు యూట్యూబ్‌లో హఫీజ్ వీడియోలకు లక్షకుపైగా వ్యూస్ పెరగడంతో ఆ సంస్థ సిల్వర్ ప్లేబటన్ అవార్డును ప్రకటించింది. ఈమేరకు పోస్టు ద్వారా అవార్డు, ప్రశంసాపత్రంను సైతం పంపించింది. గోల్డెన్ ప్లేబటన్ సాధించడమే తన లక్ష్యమంటున్నారు హఫీజ్. ప్రతినెల రూ.1.50లక్షలు ఆదాయం యూట్యూబ్ ద్వారా తెలుగుటెక్ ట్యూట్ పేరుతో అప్లోడ్ చేస్తున్న వీడియోలకు ఆదరణ పెరగడంతో ఆసంస్థ ప్రతినెలా రూ.1.50లక్షలను హఫీజ్ ఖాతాల్లో వేస్తోంది. అయితే హఫీజ్ వీడియోలను ఇతరులు కాపీ చేసి తమ సైట్లలో అప్లోడ్ చేస్తుండడంతో వ్యూస్ తగ్గి ఆదాయం కూడా రూ.లక్షకు తగ్గిందని తెలిపారు. ఇటీవల విజయవాడలో జరిగిన సదస్సులో రెండు రాష్ట్రాల్లో అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తిగా నిలిచారు. చైతన్య పర్చడమే లక్ష్యం మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలు సైతం మొబైల్ ద్వారా చేస్తున్నారు. అదనుగా చూస్తున్న హ్యాకర్స్ ఖాతాలను హ్యాక్ చేస్తూ రూ.కోట్ల కొద్ది సొమ్ము దోచుకుంటున్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నదే నా ఉద్దేశ్యం. అందుకే టెక్‌ట్యూట్స్ పేరిట సైట్ ప్రారంభించాను. అన్ని కోర్సులు యూట్యూబ్‌లో అప్లోడ్ చేయాలన్నది లక్ష్యం. నిరుపేదలు యూట్యూబ్ ద్వారా సంపాదించేలా వారిని చైతన్యవంతం చేసేందుకు ఉచితంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తా. – ఎస్డీ హఫీజ్, ఎంఏ ఇంగ్లిష్ -
యూట్యూబ్ వీడియోలు చూసి గంగలో మునక
న్యూఢిల్లీ: వారంతా ఢిల్లీ వాసులు. యూట్యూబ్‌లో వచ్చే సాహసోపేతమైన క్రీడలకు సంబంధించిన వీడియోలు చూసి తాము చేయగలమని ఒక అంచనాలేని స్ఫూర్తిని పొందారు. అనుకున్నదే తడవుగా రోడ్డు ట్రిప్‌కు వెళ్లిన వారు గంగా నదిలో ఓ 20 కిలో మీటర్లపాటు ర్యాప్టింగ్కు వెళ్లి బోటు తిరగలపడటంతో ప్రమాదంలో పడ్డారు. మొత్తం ఆరుగురు గంగా నదిపై బోటు షికారుకు వెళ్లగా వారిలో ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. సుభాష్ కుమార్(35) అనే వ్యక్తి మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. సుభాష్ కుమార్ అతడి అయిదుగురు సోదరులు ప్రొఫెషనల్స్. సరదాగా రోడ్డు ట్రిప్‌కు వెళ్లిన వారు గంగా నదిలో ర్యాప్టింగ్కు వెళ్లాలనుకున్నారు. వారికి ఈత కూడా సరిగా రాదు. శివపురి నుంచి రామ్‌లీలా వరకు ర్యాప్టింగ్కు వెళ్లాలని భావించిన వారు ఇద్దరు గైడ్లను తమ బోటులో ఎక్కించుకున్నారు. వారితోపాటు మరో ముగ్గురు టూరిస్టులు కూడా ఉన్నారు. ఇలా మొత్తం 11మంది ఆ బోటులో ఎక్కి షికారుకు వెళుతుండగా నది ఉదృతంగా ప్రయాణించే ఓ చోట దానిని నిర్వహించలేకపోవడంతో ఆ బోటు బోర్లా పడింది. అయితే, వెనుక మరో బోటులో వచ్చిన వారు నదిలో పడ్డవారిని రక్షించారు. అయితే, అప్పటికే సుభాష్ కుమార్ నీళ్లు ఎక్కువగా తాగడంతో ప్రాణాలుకోల్పోయాడు. కాగా, వారితోపాటు ఎక్కిన గైడ్లలో ఒకరు సుక్షితుడు కాదంట. పైగా అతడికి పదిహేనేళ్లనట. వీడియో తీసేందుకు డబ్బులు మాట్లాడుకునే విషయంలో గొడవ వచ్చి కావాలనే అతడు బోటును నియంత్రణ చేసే విషయంలో సహాయం చేయలేదని, ఫలితంగా ప్రమాదం జరిగిందని సుభాష్ సోదరుడు విజయ్ అనే వ్యక్తి చెప్పాడు.