సాక్షి, న్యూఢిల్లీ: ఫేక్ న్యూస్, విద్వేషాలు రెచ్చగొట్టేలా వీడియోలు పోస్ట్ చేస్తున్న పలు యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఐటీ చట్టం 2021 నిబంధనల ప్రకారం.. 10 యూట్యూబ్ ఛానెల్స్‌కు సంబంధించిన 45 వీడియోలను బ్లాక్ చేసినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ ఛానెళ్లు మార్పింగ్ వీడియోలు, ఫోటోలను ఉపయోగించి భారత జాతీయ భద్రతకు, విదేశీ సంబంధాలు దెబ్బతినేలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్నిపథ్, ఆర్మీ, కశ్మీర్ అంశాలపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు.
‘తప్పు వార్తల ద్వారా భారత్‌కు ఇతర దేశాలతో సంబంధాలను దెబ్బతీసేలా వీడియోలు చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లను ప్రసార, సమాచార శాఖ బ్యాన్ చేసింది. దేశ భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులోనూ ఇలాంటి చర్యలు తీసుకుంటాం. భారత సార్వభౌమత్వం, సమగ్రతను, జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, ప్రజా సంబంధాలను దెబ్బతీసేందుకు చేసే కుట్రను అణచివేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది.’ అని తెలిపారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్.
ఇదీ చదవండి: రసవత్తరంగా రాజస్థాన్ రాజకీయ సంక్షోభం: గెహ్లాట్‌ను రేసు నుంచి తప్పించాలంటూ ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment