ప్రముఖ కమెడియన్, నటుడు అలీ కూతురు ఫాతిమా ఇటీవలె పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ వివాహానికి చిరంజీవీ, నాగార్జున సహా పలువురు ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పటికే ఫాతిమా పెళ్లికి సంబంధించన ఫోటోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అలీ సినిమాలు ,టీవీ షోల ద్వారా అలరిస్తుండా, ఆయన భార్య జుబేదా అలీ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
ఈమె యూట్యూబ్ ఛానల్‌కు ఇప్పడు సుమారు 6లక్షల 91వేల సబ్‌స్రైబర్లు ఉన్నారు. కూతురి పెళ్లి షాపింగ్ దగ్గరి నుంచి హల్దీ, పెళ్లి కూతుర్ని చేయడం సహా ప్రతి వీడియోను ఆమె అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ఇక జుబేదా అలీ యూట్యూబ్ వీడియోలకు బాగానే ఫాలోయింగ్ ఉంది. ఆమె ఏ వీడియో పోస్ట్ చేసినా లక్షల్లో వ్యూస్ వస్తాయి.
తాజాగా కూతురు ఫాతిమా పెళ్లి ఎలా జరిగింది? మండపం దగ్గరికి తీసుకొచ్చిన్నప్పటి నుంచి పెళ్లి తంతులో కూతురు ఎమోషనల్ అయిన క్షణాల వరకు.. వీడియో రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు. మరి టాలీవుడ్ ప్రముఖులు విచ్చేసిన అలీ కూతురి పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో వీడియోలో చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment