comedian Ali
-
ప్రముఖ కమెడియన్ అలీకి నోటీసులు
అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలతో టాలీవుడ్ కమెడియన్ అలీకి నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని ఎక్మామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ శోభారాణి.. అలీ ఫామ్ హౌసులోని పనిమనుషులకు నోటీసులు అందజేశారు. అక్రమ నిర్మాణలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఉంది.(ఇదీ చదవండి: 'బాహుబలి' కోసం రెండేళ్లు పనిచేశా.. పక్కనబెట్టేశారు!)విషయానికొస్తే వికారాబాద్ ఎక్మామిడి గ్రామంలో అలీకి వ్యవసాయ భూమి ఉంది. కుటుంబంతో ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్తుంటారు. అయితే అనుమతి లేకుండా ఆ స్థలంలో ఫామ్ హౌస్ నిర్మించారని, అలానే పన్ను చెల్లించకుండా అందులో నిర్మాణాలు చేపట్టినట్లు గ్రామ కార్యదర్శి శోభారాణి గుర్తించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.అక్రమ నిర్మాణానికి సంబంధించిన ఈ నెల 5వ తేదీన నోటీసు ఇవ్వగా స్పందన లేదు. దీంతో ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేశారు. అలీ అందుబాటులో లేకపోవడంతో పనివాళ్లకు నోటీసులు ఇచ్చినట్లు సెక్రటరీ తెలిపారు. మరి ఈ విషయమై అలీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: విడాకుల గోల.. వాళ్లందరికీ రెహమాన్ నోటీసులు) -
వరద బాధితులకు అండగా సినీ సెలబ్రిటీలు
కుండపోత వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో సెలబ్రిటీలు సైతం మేమున్నామంటూ తోచిన సాయం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ తమవంతు సాయం చేశారు.అలీ దంపతుల గొప్ప మనసుతాజాగా కమెడియన్ అలీ దంపతులు ఆంధ్రప్రదేశ్‌కు రూ.3 లక్షలు, తెలంగాణకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. యంగ్ డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ సైతం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాకు కలిపి రూ.1.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. అతడి స్నేహితులతో కలిసి.. వరదల వల్ల ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఆహారం, నిత్యావసర వస్తులను పంచుతూ మానవత్వం చాటుకున్నారు.అక్కినేని కుటుంబం సాయంమరోవైపు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటే అక్కినేని కుటుంబం తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చింది. విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ సాయాన్ని అందజేశాయి. మరోవైపు రామ్‌చరణ్ సైతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశాడు.. వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ( Rs.1 Crore) విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి…— Ram Charan (@AlwaysRamCharan) September 4, 2024మెగా హీరో సాయిధరమ్ తేజ్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకు చెరో రూ.10 లక్షలు విరాళమిచ్చాడు. అలాగే అమ్మ ఆశ్రమం, ఇతర స్వచ్ఛంద సంస్థలకు రూ. 5 లక్షలు సాయం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి నా వంతు బాధ్యతగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకి చెరో 10 లక్షలు.. అదే విధంగా విజయవాడ లో నేను మన మెగా అభిమానులు మరియు జనసైనికులు నడిపిస్తున్న అమ్మ ఆశ్రమం మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలకు 5 లక్షలు.…— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 4, 2024చదవండి: కోట్లు దానం చేసిన ప్రభాస్-బన్నీ -
మెగాస్టార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నటుడు అలీ..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ప్రముఖ నటుడు, కమెడియన్ అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గణతంత్ర వేడుకల సందర్భంగా పద్మ విభూషణ్ పొందిన చిరుకు ఆయన అభినందనలు తెలిపారు. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ చరిత్రలో అక్కినేని తర్వాత ఈ అవార్డ్ అందుకున్న నటుడిగి మెగాస్టార్ ఘనత సాధించారు. అంతే కాకుండా టాలీవుడ్ డైరెక్టర్స్ బాబీ, గోపించద్ మలినేని, నిర్మాతలు నవీన్ యేర్నేని, వై రవిశంకర్ కూడా మెగాస్టార్‌ను అభినందించారు. కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్నీ అప్డేట్స్ రానున్నాయి. Blockbuster directors @dirbobby, @megopichand, Producers #NaveenYerneni, @mythriravi & comedian #Ali met and conveyed their best regards to #PadmaVibhushanChiranjeevi garu for being bestowed with the prestigious #PadmaVibhushan award ✨@Kchirutweets @MythriOfficial… pic.twitter.com/0z8YD9DG5U — Telugu FilmNagar (@telugufilmnagar) January 30, 2024 -
Ali Birthday Celebrations : కమెడియన్ అలీ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Zubeda Ali: నిరుపేదలకు బిర్యానీ ప్యాకెట్స్ పంచిన కమెడియన్ అలీ భార్య జుబేదా (ఫోటోలు)
-
వేణుమాధవ్ మంచి మనసు కలిగిన వాడు..!
-
నాకు నా తమ్ముడు నా భార్య చాలా సపోర్ట్ చేశారు
-
ఆ రోజు నేను చాలా ఏడ్చాను ఏడుపు ఆపుకోలేకపోయాను : అలీ
-
అమెరికా నుంచి హైదరాబాద్‌కు అలీ కూతురు.. పెళ్లి తర్వాత తొలిసారి! (ఫొటోలు)
-
రంజాన్ పర్వదినం.. అలీ దంపతుల ఆహ్వానం వీరికే! (ఫొటోలు)
-
Ramadan: మెగాస్టార్‌ని కలిసిన అలీ అండ్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
రంజాన్ స్పెషల్: చిరంజీవిని కలిసిన అలీ..ఫోటోలు వైరల్
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా సినీ నటుడు అలీ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. ఇక రంజాన్ పర్వదినాన్ని చిరంజీవితో పంచుకోవడం ఎంతో అందంగా ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. కాగా అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. -
రంజాన్ కోసం అలీ దంపతుల ప్రిపరేషన్ చూస్తే కళ్లు చెదరాల్సిందే! ( ఫొటోలు)
-
పుడమి సాక్షిగా క్యాంపెయిన్‌కు ప్రతిష్టాత్మక AAFA అవార్డు
ముంబై/హైదరాబాద్: పుడమి సంరక్షణ కోసం సాక్షి మీడియా గ్రూప్ చేస్తోన్న పుడమి సాక్షిగా క్యాంపెయిన్‌కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. IAA ఆధ్వర్యంలో ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ AAFA.. పుడమి సాక్షిగా కార్యక్రమాన్ని ఎంపిక చేసి కార్పోరేట్ సోషల్ క్రూసేడర్ ఆఫ్ ది ఇయర్ సిల్వర్ అవార్డుతో సత్కరించింది. ముంబై వేదికగా జరిగిన ఈ అవార్డుల సమర్పణ కార్యక్రమంలో సాక్షి మీడియా తరుపున సాక్షి కార్పోరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణి రెడ్డికి AAFA చైర్మన్ శ్రీనివాసన్ స్వామి, IAA ప్రెసిడెంట్ అవినాష్ పాండే, ఆలివ్ క్రౌన్ చైర్మన్ జనక్ సర్థా ఈ అవార్డును అందజేశారు. ► ప్రతీ ఏటా జనవరి 26న మెగా టాకథాన్‌గా వస్తోన్న పుడమి సాక్షిగా కార్యక్రమం 2020-21లో ప్రారంభమై ఇప్పటికి మూడు ఎడిషన్లు పూర్తి చేసుకుంది. పర్యావరణాన్ని కాపాడడం, కాలుష్యం తగ్గించడం, స్వచ్ఛమైన పుడమిని భవిష్యత్తు తరాలకు అందించడం.. పుడమి సాక్షిగా లక్ష్యాలు. ప్రాణకోటికి జీవనాధారమైన ధరిత్రి ప్రమాదంలో పడడానికి ప్రధాన కారణం మనుష్యులే. ఈ భూమి మళ్లీ పునర్వైభవాన్ని దక్కించుకోవాలంటే .. ప్రతీ ఒక్కరు నిరంతరం చేయాల్సిన కృషిని పుడమి సాక్షిగా గుర్తు చేస్తోంది. ► ఏడాది పాటు ప్రతీ నెలా ఏదో ఒక రూపంలో పుడమి కార్యక్రమాలు చేపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో పర్యావరణంపై అవగాహన కల్పించడంతో పాటు అందరిని ఇందులో భాగస్వామ్యులను చేస్తోంది. దీంతో పాటు గణతంత్ర దినోత్సవం రోజున సాక్షి టీవీలో దాదాపు 10 గంటల పాటు మెగా టాకథాన్ రూపంలో ప్రసారం చేస్తోంది. ► పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్న పెద్దలు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు, తమ అనుభవాలను పంచుకుంటూ సమాజానికి స్పూర్తి కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమస్త సమాచారం, స్టోరీలు, వీడియోలు https://www.pudamisakshiga.com/ వెబ్ సైట్లో చూడవచ్చు. సాక్షి టీవీ ఔట్ పుట్ ఎడిటర్ నాగరాజు, మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్, ఇన్ పుట్ ఎడిటర్ ఇస్మాయిల్, సినీ నటుడు అలీ, CEO అనురాగ్ అగ్రవాల్, డైరెక్టర్ KRP రెడ్డి, బిజినెస్ కంట్రోల్ డైరెక్టర్ ALN రెడ్డి, కార్పోరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణీ రెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ YEPరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ డిజిటల్ శ్రీనాథ్ ఇక AAFA అవార్డు సందర్భాన్ని పురస్కరించుకుని సాక్షి మీడియా హౌస్‌లో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా సినీనటుడు అలీ పాల్గొన్నారు. సాక్షి మీడియా గ్రూపు సంకల్పాన్ని అలీ ప్రత్యేకంగా ప్రశంసించారు. పుడమి సాక్షికి గౌరవం.. సెలబ్రేషన్స్ ఫొటోల కోసం క్లిక్ చేయండి -
రిలీజ్ రోజున సినిమా చూసే ఛాన్స్.. చిన్న నిర్మాతలకు వరం
సినిమా రిలీజైన రోజు ఇంట్లోనే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే ఛాన్స్ కల్పిస్తోంది ఏపీ ఫైబర్ నెట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన మేరకు ప్రజల వద్దకు సినిమా తీసుకు వస్తున్నాం అన్నారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. మారుమూల గ్రామాల్లో ఉన్న వారు కూడా రిలీజ్ రోజే సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. శుక్రవారం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. 'భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నెట్ సేవలను ఏపీలో తక్కువ ధరకు అందిస్తున్నాం. పెద్ద హీరోలకు, నిర్మాతలకు మేము వ్యతిరేకం కాదు. సినిమాను బేస్ చేసుకుని ఫిఫ్టీ-ఫిఫ్టీ రేషియో ఉంటుంది. ఎల్పీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నాము కాబట్టి పైరసీ ఉండదు. ఏపీఎస్ఎఫ్ఎల్ పల్లెటూర్లతో ఎక్కువ కనెక్ట్ అయింది. దీనివల్ల మారుమూల గ్రామాల్లో ఉన్న వారు కూడా రిలీజ్ రోజు సినిమా చూసే అవకాశం లభిస్తుంది' అన్నారు. ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. 'ఏ రోజు సినిమా రిలీజ్ అవుతుందో అదే రోజు పల్లెటూరులో కూడా సినిమా చూడవచ్చనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. చిరంజీవి లాంటి పెద్ద హీరో సినిమా కూడా ఫైబర్ నెట్లో రిలీజ్ అయితే ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుంది' అన్నారు. నటుడు అలీ మాట్లాడుతూ.. 'ఒక నిర్మాత కష్టపడి సినిమా తీస్తే అది రిలీజ్ రోజునే పైరసీ అయిపోతుంది. ఇండస్ట్రీలో ఉన్న మనం పైరసీని ఎందుకు అరికట్టలేకపోతున్నాము. పెద్దలందరూ కూడా దీనిపై పోరాడాలి. ఫైబర్ నెట్లో రిలీజ్ రోజున సినిమా చూడడం అనేది చిన్న సినిమాకు ఆక్సిజన్ లాంటిది. చిన్న నిర్మాతలు ఫైబర్ నెట్లో రిలీజ్ చేస్తారు. పెద్ద నిర్మాతలు కూడా ముందుకు వస్తారని అనుకుంటున్నాను' అన్నారు. నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. 'ఏపీ ప్రభుత్వం, పోసాని అలీ గారి వల్ల సినిమా ఇండస్ట్రీకి మంచి జరుగుతోంది. ఫైబర్ నెట్లో సినిమా రిలీజ్ అనేది చిన్న నిర్మాతకు జగన్ గారిచ్చిన వరం. చిన్న సినిమాకు అసలు థియేటర్స్ ఇవ్వడం లేదు. జనాలు ఓటీటీకి అలవాటు పడ్డారు. ఈ రోజు చిన్న నిర్మాతలకు పేదల పాలిట పెన్నిదే ఈ ప్లాట్‌ఫామ్. ఏపీ సీఎం జగన్ గారి విజన్ చాలా పెద్దది.. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం మంచి ఆలోచన చేశారు. చిన్న నిర్మాతలకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు సినీ ఇండస్ట్రీ తరపున ఏ సహాయం కావాలన్నా ముందుంటాం' అని పేర్కొన్నారు. -
'చూసిన ప్రతి అమ్మాయిని హేట్ చేస్తున్నాడు'.. ఆసక్తిగా 'భారీ తారాగణం' ట్రైలర్
సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష నటీ నటులుగా శేఖర్ ముత్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భారీ తారాగణం’. బీవీఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై బీవీ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణా రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, కమెడియన్ ఆలీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ..' దర్శకుడు శేఖర్, నిర్మాత బివి.రెడ్డి మంచి కథను తెరకెక్కించారు..ఈ సినిమాకు సుక్కు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అలీ ఏ పాత్ర ఇచ్చినా ఒదిగిపోతారు. నాకు ఇష్టమైన బాబా కుమారుడు హీరోగా చేయడం చాలా సంతోషం. ఈ చిత్రంలో అందరూ కూడా చాలా బాగా నటించారు. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. 'ట్రైలర్ చూస్తుంటే చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది. ఆలీ ఈ సినిమాలో చాలా చక్కగా నటించాడు. దర్శక నిర్మాతలకు ఈ చిత్రం ద్వారా మంచి పేరు వస్తుంది. ప్రతి ఒక్కరూ చాలా చక్కగా నటించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు ఆలీ మాట్లాడుతూ.. 'మంచి కంటెంట్‌తో తీసిన ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ చిత్రంలో మా అన్న తమ్ముడు సదన్ హీరోగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో నాకు మంచి పాత్ర లభించింది. ఇలాంటి మంచి సినిమాలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉంది.' అని అన్నారు. -
స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేసిన అలీ దంపతులు.. ఫోటోలు
-
సీఎం జగన్ ఆదేశిస్తే పవన్ పై పోటీకైనా సిద్దమే : అలీ
-
అమెరికా వెళ్తున్న కూతురికి అలీ దంపతుల వీడ్కోలు (ఫొటోలు)
-
కూతురి పెళ్లికి మలీదా చేసిన అలీ భార్య జుబేదా (ఫొటోలు)
-
పెళ్లి తర్వాత కూతుర్ని కలిసిన అలీ దంపతులు..ఫోటోలు వైరల్
-
కమెడియన్ అలీ కూతురి అప్పగింతల (ఫొటోలు)
-
పెళ్లికి ముందు ప్రేమ కహానీ.. ఆ అమ్మాయినే పెళ్లాడతానన్న అలీ
హీరోగా, హీరో స్నేహితుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు అలీ. ఇటీవలే తన పెద్దకూతురికి ఘనంగా పెళ్లి చేసి తండ్రిగా తన బాధ్యత తీర్చుకున్నాడు. ఇక పెళ్లికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంది అమె భార్య జుబేదా. ఆ వీడియోల్లో అలీ దంపతులను చూసినవారెవరైనా వీరిది అన్యోన్య దాంపత్యం అని మెచ్చుకోక మానరు. అయితే జుబేదా కంటే ముందు వేరొకరిపై మనసు పారేసుకున్నాడట అలీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు. 'అప్పుడు నా వయసు 17 అనుకుంటా! మా ఇంటి పక్కన ఓ అమ్మాయి ఉండేది. ఆమె కళ్లు చాలా బాగుంటాయి. పొడుగైన జుట్టు.. అందంగా ఉండేది. నన్ను చూసి చిన్న నవ్వు విసిరేది. ఒకరోజు ఆమె వర్షంలో తడుచుకుంటూ వస్తోంది. నేను ఎదురుగా వెళ్లి గొడుగు పట్టాను. అలా మా మధ్య బాగానే నడిచింది. 21 ఏళ్లు వచ్చాక అమ్మ దగ్గరకు వెళ్లి ఆమెకు తండ్రి లేడు, ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అమ్మ సరేనంది. ఆ తర్వాత ఒకరోజు అమ్మ తమ్ముడితో పాటు సినిమాకెళ్లింది. ఆ థియేటర్‌కు అమ్మాయి తన స్నేహితులతో కలిసి వచ్చింది. ఇంటికి వచ్చాక అమ్మ ఆ అమ్మాయే వద్దని చెప్పింది. దీంతో ఆ అమ్మాయి వంక చూడటం మానేసి బుద్ధిగా నా పని నేను చూసుకున్నాను. తర్వాత పెళ్లి సంబంధాలు చూసినప్పుడు ఒకమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది. దీంతో నాకు కోపం వచ్చి అదే కుటుంబంలో ఉన్నవాళ్లనే పెళ్లి చేసుకుంటానని అమ్మకు చెప్పాను. అలా అక్కను చూడటానికి వెళ్లి ఆమె చెల్లి జుబేదాను చేసుకున్నాను' అని చెప్పుకొచ్చాడు అలీ. చదవండి: ఆమె మంటల్లో కాలిపోయింది.. నా కూతురికి ఆమె పేరే పెట్టుకున్నా: అలీ షారుక్ ఖాన్‌ను సజీవ దహనం చేస్తా: అయోధ్య సాధువు -
కడుపులో బిడ్డతో సహా కాలిపోయింది: అలీ ఎమోషనల్
అందరినీ నవ్వించే కమెడియన్ అలీ స్టార్ సెలబ్రిటీలను సైతం ఇంటర్వ్యూ చేస్తాడన్న విషయం తెలిసిందే! తాజాగా అతడిని ఇంటర్వ్యూ చేసింది యాంకర్ సుమ. ఈ సందర్భంగా అలీ ఎవరికీ తెలియని విషయాలను పంచుకున్నాడు. తన కుటుంబంలో జరిగిన ఓ విషాద ఘటనను బయటపెట్టాడు. 'నా ఎనిమిదేళ్ల వయసులో మా పెద్దక్క ఫాతిమా ఒక ప్రమాదంలో చనిపోయింది. అదెలాగంటే.. అప్పటికే ఆమెకు ఒక బాబు పుట్టాడు. రెండోసారి గర్భవతి అయినప్పుడు ఆమె పిల్లాడికి పాలు వేడి చేసింది. పాలు గ్లాసులో పోసేటప్పుడు చున్నీని వెనకేసుకోగా దానికి మంట అంటుకుంది. అలా ఆ మంటలు తన ఒళ్లంతా వ్యాపించాయి. ఇంట్లో నుంచి అలానే బయటకు రావడంతో అక్కడున్నవాళ్లు చూసి ఆమెపై నీళ్లు గుమ్మరించారు. అయినా ఆమె ప్రాణాలతో దక్కలేదు. కడుపులో ఉన్న బిడ్డతో పాటు ఆమె కూడా చనిపోయింది. చిన్నప్పుడు ఆవిడ నా మీద ఎక్కువ ప్రేమ చూపించేది. నేను పొద్దున నిద్ర లేవకపోతే తనే కేర్ తీసుకుని నన్ను నిద్ర లేపి రెడీ చేసి షూటింగ్‌కు పంపేది. ఆమె మీదున్న అభిమానంతోనే నా పెద్ద కూతురుకు ఫాతిమా పేరు పెట్టుకున్నా. ఈ మధ్యే తన పెళ్లి కూడా చేశాను' అని చెప్పుకొచ్చాడు అలీ. చదవండి: నేనొక నటుడ్ని.. అమాయకుణ్ణి.. చిరంజీవి షారుక్ ఖాన్ కనిపిస్తే తగలబెడ్తా.. అయోధ్య సాధువు -
అంగరంగ వైభవంగా అలీ కూతురు పెళ్లి.. వైరల్‌గా ఫొటోలు
-
అలీ కూతురి పెళ్లి వీడియో వచ్చేసింది.. ఎంత గ్రాండ్‌గా జరిగిందో..
ప్రముఖ కమెడియన్, నటుడు అలీ కూతురు ఫాతిమా ఇటీవలె పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ వివాహానికి చిరంజీవీ, నాగార్జున సహా పలువురు ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పటికే ఫాతిమా పెళ్లికి సంబంధించన ఫోటోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అలీ సినిమాలు ,టీవీ షోల ద్వారా అలరిస్తుండా, ఆయన భార్య జుబేదా అలీ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈమె యూట్యూబ్ ఛానల్‌కు ఇప్పడు సుమారు 6లక్షల 91వేల సబ్స్రైబర్లు ఉన్నారు. కూతురి పెళ్లి షాపింగ్ దగ్గరి నుంచి హల్దీ, పెళ్లి కూతుర్ని చేయడం సహా ప్రతి వీడియోను ఆమె అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ఇక జుబేదా అలీ యూట్యూబ్ వీడియోలకు బాగానే ఫాలోయింగ్ ఉంది. ఆమె ఏ వీడియో పోస్ట్ చేసినా లక్షల్లో వ్యూస్ వస్తాయి. తాజాగా కూతురు ఫాతిమా పెళ్లి ఎలా జరిగింది? మండపం దగ్గరికి తీసుకొచ్చిన్నప్పటి నుంచి పెళ్లి తంతులో కూతురు ఎమోషనల్ అయిన క్షణాల వరకు.. వీడియో రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు. మరి టాలీవుడ్ ప్రముఖులు విచ్చేసిన అలీ కూతురి పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో వీడియోలో చూసేయండి. -
అలీ కుమార్తె వివాహం.. మరి అల్లుడి బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ పెద్ద కూతురు ఫాతిమా వివాహం షహయాజ్‌లతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్వయ కన్వెక్షన్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ సెలబ్రిటీలు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ తో పాటు చిరంజీవి, నాగార్జున లాంటి సెలబ్రిటీలు కూడా ఈ వేడుకకు వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అలీ అల్లుడు బ్యాక్ గ్రౌండ్ గురించి పలు వార్తలు వినిపించాయి. సాధారణంగా నటీనటులు పెళ్లిళ్లు జరిగితే వధువు, వరుడు వివరాలపై ఆరా తీస్తుంటారు. తాజాగా అలీ అల్లుడు ఎవరా అని కూడా నెటిజన్లు ఆరా తీస్తున్నారు. (చదవండి: నా కూతురిని ఆశీర్వదించిన అందరికీ కృతజ్ఞతలు: అలీ) అలీ పెద్ద కూతురు ఫాతిమా ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అలీ కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్‌గా నిలిచింది ఫాతిమా. ఇక అల్లుడు షెహయాజ్ కూడా డాక్టరే కావడం విశేషం. జమీలా బాబీ, జలానీ భాయ్ దంపతుల కుమారుడు షెహయాజ్. అతనికి అన్న, సోదరి ఉన్నారు. వీళ్లిద్దరితో పాటు వరుడి వదిన కూడా డాక్టరే కావడం మరో విశేషం. వీరంతా గుంటూరుకు చెందిన వారు కాగా.. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. అతని కుటుంబ సభ్యులు అందరూ ఉన్నత విద్యావంతులే. ఇక అలీ కూతురు డాక్టర్ చదివేసరికి.. అల్లుడు కూడా డాక్టరే కావాలని.. షెహయాజ్ను ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా.. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా అలీ గుర్తింపు తెచ్చుకున్నారు. బాల నటుడిగా పరిచయమైన అతడు.. ప్రస్తుతం హాస్యనటుడిగా మాత్రమే కాకుండా హీరోగా, నిర్మాతగానూ పలు చిత్రాలు చేస్తున్నారు. టీవీ షోకు హోస్ట్ గానూ నిరూపించుకున్నారు. -
అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
సాక్షి, అమరావతి, గుంటూరు వెస్ట్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. మంగళవారం సాయంత్రం గుంటూరు ఇన్నర్ రింగ్రోడ్లోని శ్రీకన్వెన్షన్‌లో జరిగిన రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్
సాక్షి, అమరావతి/గుంటూరు వెస్ట్: సీఎం వైఎస్ జగన్ మంగళవారం గుంటూరు పర్యటనకు వెళ్లనున్నారు. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. సాయంత్రం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 4.55 గంటలకు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్‌లోని శ్రీ కన్వెన్షన్‌కు చేరుకుంటారు. నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం తాడేపల్లికి చేరుకుంటారు. చదవండి: (సీఎం జగన్ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలం) -
నా కూతురిని ఆశీర్వదించిన అందరికీ కృతజ్ఞతలు: అలీ
ప్రముఖ కమెడియన్ అలీ పెద్ద కూతురు ఫాతిమా వివాహం షహయాజ్‌లతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్వయ కన్వెక్షన్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ సెలబ్రిటీలు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి–సురేఖ, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, కె.రాఘవేంద్రరావు, మురళీమోహన్, బ్రహ్మానందం, జయసుధ, నాగార్జున–అమల, వెంకటేశ్, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, రాజశేఖర్–జీవిత, నిర్మాతలు అల్లు అరవింద్, కె.యల్ నారాయణ, ఎస్ గోపాల్‌రెడ్డి, చోటా.కె.నాయుడు, తనికెళ్ల భరణి, మంచు విష్ణు, లక్ష్మీ, తొట్టెంపూడి వేణు, ఆది సాయికుమార్, బ్రహ్మానందం, ఊహ, రోషన్, ‘అల్లరి’ నరేశ్, రాజేశ్, ప్రియదర్శి, పూరి జగన్నాథ్ సతీమణి లావణ్య, ఆకాశ్ పూరి, పవిత్రా పూరి తదితరులు హాజరై నూతన వధూవరులను దీవించారు. రాజకీయ రంగం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రోజా, అవంతి శ్రీనివాస్, మార్గాని భరత్, ప్రత్తిపాటి పుల్లారావు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రపంచ చాంపియన్ పి.వి సింధు తల్లితండ్రులతో సహా పెళ్లికి హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరై నూతన జంటను ఆశీర్వదించిన అతిరథ మహారధులందరికి కృతజ్ఞతలు తెలుపుతూ అలీ ఓ ప్రకటన విడుదల చేశారు. చదవండి: నోరు జారకు.. రేవంత్‌పై చెలరేగిపోయిన ఫైమా నా పనిమనిషి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు: నటి -
అలీ కూతురిని ఆశీర్వదించిన మెగాస్టార్, వీడియో వైరల్
ప్రముఖ నటుడు, కమెడియన్ అలీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. అలీ, జుబేదాల కుమార్తె ఫాతిమా వివాహం ఆదివారం నాడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి చిరంజీవి, నాగార్జున సతీసమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. నటి రోజా సైతం పెళ్లివేడుకలో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా తన కూతురి పెళ్లికి రావాలంటూ అలీ భార్య జుబేదాను వెంటపెట్టుకుని ఇండస్ట్రీ మిత్రుల ఇంటికి వెళ్లి స్వయంగా శుభలేఖలు అందించిన విషయం తెలిసిందే! అటు జుబేదా నగల షాపింగ్ నుంచి హల్దీ ఫంక్షన్ వరకు అన్నింటినీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు పెళ్లిపనులను అభిమానులకు అప్డేట్ ఇస్తూ వచ్చింది. B O S S #MegastarChiranjeevi garu today @#Ali Daughters Marriage 🤩#ValtheruVerayya #BossParty@KChiruTweets @Chiru2020_ @Deepu0124 @Chirufan4ever @ChiruIdealActor @Chiru_FC @ChiruFanClub @Chiru025527081 @EluruMegaFan @GaddamMega @Konidelachiru31 pic.twitter.com/KADKQeGnEQ — Ramesh BOLLI (@RameshBOLLIS) November 27, 2022 చదవండి: అలీ కూతురి వివాహ వేడుకలో నాగార్జున దంపతులు -
అలీ కూతురి వివాహ వేడుకలో అక్కినేని దంపతులు.. ఫోటోలు వైరల్
ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు ఇంట పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అలీ, జుబేదాల కుమార్తె ఫాతిమా రమీజున్ వివాహం నవంబర్ 27న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ రోజు జరిగిన అలీ కూతురు వివాహానికి నాగార్జున అక్కినేని తన భార్య అమలతో కలిసి హాజరయ్యారు. పెళ్లి వేడుకలో నాగార్జున దంపతులు పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. (చదవండి: ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్) వివాహ వేడుకకు హాజరైన నాగార్జున, అమల నూతన జంటను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి నాగార్జునతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులకు అలీ ఆహ్వానాలు అందించారు. తన కుమార్తె వివాహానికి ఆహ్వానించడానికి అలీ తన భార్య జుబేదా సుల్తానా బేగంతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కూడా వెళ్లి శుభలేఖలు అందించారు. కాగా.. అలీకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం ఉన్నారు. టాలీవుడ్లో నటుడు అలీ తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. తెలుగు, తమిళం, హిందీలో కలిపి దాదాపు 1000 చిత్రాలకు పైగా నటించారు. 1979లో నిండు నూరేళ్లు చిత్రంతో అరంగేట్రం చేశారాయన. -
ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్
కమెడియన్ అలీ ఇంట పెళ్లి సందడి మొదలయ్యింది. అలీ, జుబేదాల కుమార్తె ఫాతిమా త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ప్రస్తుతం కుమార్తె పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు అలీ దంపతులు. ఈ క్రమంలో ఫాతిమా హల్దీ వేడుకను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కూతురు హల్దీ వేడుకు సంబంధించిన వీడియోను అలీ భార్య జుబేదా తన యూట్యూబ్ చానల్లో షేర్ చేసింది. అతి కొద్ది మంది బంధువులు సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో ఆలీ దంపతులు డాన్స్ చేస్తూ సందడి చేశారు. కాగా రిసెంట్‌గా ఫాతిమా నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. -
కుమార్తె పెళ్లి కోసం ఖరీదైన నగలు కొన్న అలీ భార్య
కమెడియన్ అలీ ఇంట పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. అలీ కూతురు ఫాతిమా త్వరలో ఓ ఇంటి కోడలు కాబోతున్న విషయం తెలిసిందే కదా! అందులో భాగంగా ఇప్పటికే పసుపు దంచే కార్యక్రమం ఫంక్షన్, బ్రైడల్ షవర్ పూర్తవగా తాజాగా పెళ్లి పత్రికలు పంచే పనిలో పడ్డారు అలీ దంపతులు. పనిలో పనిగా వీలు దొరికితే షాపింగ్ కూడా చేస్తోంది అలీ భార్య జుబేదా. తాజాగా వైజాగ్‌లో అలీని వెంటపెట్టుకుని నగలు కొనడానికి వెళ్లింది జుబేదా. మా వారి సెలక్షన్ చాలా బాగుంటుంది, మా అమ్మాయి కోసం నగలు కొనడానికి ఆయన్ను తీసుకొచ్చానంటూ యూట్యూబ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. తీరా నగల దుకాణంలోకి వెళ్లాక మా అమ్మాయి కోసం అని చెప్పాను, కానీ నేను కూడా నగలు తీసుకుంటున్నాను అని ఝలక్ ఇచ్చింది. ఇంట్లో పెళ్లికి ఇల్లాలు కొనుక్కోకపోతే ఎలా అనుకున్న అలీ భార్య కోరుకున్నంత బంగారం కొనిచ్చాడు. ఏడు వారాల నగలు మాత్రం వద్దంటూనే కాస్ట్లీ ఆభరణాలు సెలక్ట్ చేసి బిల్లు కట్టాడు. చదవండి: అల్లు అరవింద్‌కు నలుగురు కుమారులని మీకు తెలుసా? చిరంజీవిని పెళ్లికి ఆహ్వానించిన అలీ దంపతులు -
చిరంజీవికి పెళ్లిపత్రిక అందించిన అలీ దంపతులు
ప్రముఖ నటుడు అలీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. అలీ, జుబేదాల కుమార్తె ఫాతిమా త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ఈ క్రమంలో కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు పెళ్లి పత్రికలు పంచే పనిలో నిమగ్నమయ్యారు అలీ దంపతులు. అందులో భాగంగా గురువారం నాడు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. తమ ఇంట జరిగేబోయే వివాహానికి హాజరు కావాల్సిందిగా చిరును కోరారు. ఈ సందర్భంగా అలీ దంపతులు చిరుతో కలిసి దిగిన ఫొటోను జుబేదా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Zubeda Ali (@zubedaspage) చదవండి: రేవంత్‌కు శ్రీహాన్ వెన్నుపోటు? ఇప్పటికైనా తెలుసుకుంటాడా? హెబ్బా పటేల్‌తో ఫొటోలు దిగిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా? -
Hyderabad: గవర్నర్ తమిళిసైను కలిసిన అలీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, టాలీవుడ్ ప్రముఖ నటుడు అలీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని కలిశారు. అలీ దంపతుల పెద్ద కుమార్తె ఫాతిమా త్వరలో పెళ్లిపీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా బుధవారం గవర్నర్ తమిళిసైని కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. పెళ్లి పత్రికను స్వీకరించిన తమిళిసై తప్పకుండా వివాహానికి హాజరు అవుతానని అలీకి మాటిచ్చారు. చదవండి: (కమెడియన్ అలీకి కాబోయే అల్లుడు ఎవరో తెలుసా?) -
కార్తికేయ 2 సినిమా ఒక ఎత్తు.. ఆ ఒక్క స్పీచ్ మరో ఎత్తు: నటి
తెలుగు, తమిళ, కన్నడ.. ఇలా పలు ప్రాంతీయ భాషల్లో కలిసి దాదాపు 700 సినిమాలు చేసింది నటి తులసి. ఒకప్పుడు హీరోయిన్గా, తర్వాత క్యారెక్టర ఆర్టిస్టుగా రాణించిన ఆమె ఇటీవల ఎక్కువగా అమ్మ పాత్రల్లో ఒదిగితోంది. ఇటీవల బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన కార్తికేయ 2తో మరింత ఊపు మీదున్న ఆమె వరుస సినిమాలకు సంతకం చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. తులసి మాట్లాడుతూ.. 'నేను 1967లో జన్మించాను. పుట్టిన మూడు నెలలకే నటించాను. మూడేళ్లకే డైలాగ్స్ చెప్పాను. అంటే 56 ఏళ్లుగా వెండితెరపై నా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. నాలుగు స్తంభాలాట సినిమాలో అలీ హీరో, నేను హీరోయిన్. షూటింగ్ గ్యాప్‌లో అలీ నాకు సరదాగా సైట్ కొట్టేవాడు. ఇక కార్తికేయ 2 సినిమా విషయానికి వస్తే ఆ మూవీ సక్సెస్ ఒక ఎత్తయితే, ఆ సినిమా స్పీచ్ వల్ల నాకు బోలెడన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి' అని చెప్పుకొచ్చింది. చదవండి: ఫిజికల్ అన్నారంటే ఒక్కొక్కరి తోలు తీస్తా: రేవంత్ వార్నింగ్ సమంత గ్లిజరిన్ కూడా వాడదు: యశోద డైరెక్టర్స్ -
బ్రైడల్ షవర్ కోసం ముస్తాబైన అలీ కూతురు (ఫొటోలు)
-
ఘనంగా కమెడియన్ అలీ కూతురు హల్దీ ఫంక్షన్..ఫొటోలు వైరల్
-
నా కూతురి పెళ్లికి రండి.. సీఎం జగన్‌కు అలీ ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: ప్రముఖ కమెడియన్ అలీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. అలీ దంపతుల కూతురు ఫాతిమా త్వరలో పెళ్లిపీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు అలీ దంపతులు. ఈ మేరకు బుధవారం నాడు తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిసి కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక తొలిప్రతిని అందించారు. ఈ సందర్భంగా తనను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించినందుకు సీఎం జగన్‌కు అలీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అలీ మాట్లాడుతూ.. 'రాజకీయాలలో సహనం ఎంతో అవసరం. అది కోల్పోయి మాట్లాడితే జనమే తిరగబడతారు. బూతులు తిట్టడమే రాజకీయం అనుకోవటం కరెక్ట్ కాదు. సీఎం జగన్ ప్రజల మనిషి. వారికోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చారు. ఈసారి 175 కి 175 సీట్లు కచ్చితంగా సాధిస్తారు. గతంలో జగన్ మీద నమ్మకంతోనే జనం 151 సీట్లు గెలిపించారు. ఈసారి 175 సీట్లు గ్యారంటీగా వస్తాయి. ఆ క్రతువులో నావంతు పాత్ర పోషిస్తా. సీఎం చెప్పిన బాధ్యతలను నిర్వర్తిస్తా. ఇకనుంచి ప్రభుత్వంలో భాగస్వామిగా మరో అలీని చూస్తారు' అని తెలిపారు. చదవండి: రాజీవ్ వల్ల నా కెరీర్ నాశనమైంది: నటి కాంతార కలెక్షన్ల వర్షం, తెలుగులో ఎంత వచ్చిందంటే -
కమెడియన్ అలీకి కాబోయే అల్లుడు ఎవరో తెలుసా?
టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవలె లైగర్ సినిమాలో నటించారు. ఈమధ్య సినిమాల కంటే బుల్లితెరపై హోస్ట్‌గా,జడ్జిగా అలరిస్తున్నారు. మరోవైపు ఆయన భార్య జుబేదా అలీ సైతం సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌తో పాపులారటీ దక్కించుకున్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదిలా ఉండగా అలీ పెద్ద కుమెర్తె ఫాతిమా రెమీజు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఎంగేజ్మెంట్ వీడియోను జుబేదా అలీ తన ఛానెల్లో షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు సన్నిహితులు సహా బ్రహ్మానందం, సాయికుమార్ వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు. చదవండి: కమెడియన్ అలీ కూతురి ఎంగేజ్మెంట్ చూశారా? అయితే అలీకా కాబోయే అల్లుడు ఏం ఎవరు, ఏం చేస్తారు? అంటూ నెటిజన్లలో క్యూరియాసిటీ పెరిగింది. అయితే అలీ అల్లుడు డాక్టర్ అని తెలుస్తుంది. అంతేకాకుండా అలీ వియ్యంకుల ఇంట్లో అందరూ డాక్టర్లేనట. అలీ కూతురు ఫాతిమా సైతం ఈమధ్య మెడిసన్ కంప్లీట్ చేసింది. తమ కుటుంబంలో ఫాతిమానే మొదటి డాక్టర్ అంటూ అలీ దంపతులు పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఘనంగా కమెడియన్ అలీ కూతురి ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
-
ఘనంగా కమెడియన్ అలీ కూతురి ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్
కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు వెయ్యికి పైగానే చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోపక్క బుల్లితెరపై కూడా ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా అలీ కూతురు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది. ఈ క్రమంలో తన కూతురి నిశ్చితార్థానికి సంబంధించిన వీడియోను అలీ భార్య జుబేదా తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి అలీ-జుబేదా దంపతులకు ముగ్గురు సంతానం కాగా పెద్దకూతురు ఫాతిమా ఇటీవలే మెడిసిన్ కంప్లీట్ చేసింది. త్వరలోనే ఈమె మెట్టినింట్లో అడుగపెట్టనుంది. కాగా యూట్యూబ్ వీడియోలతో జుబేదా సెపరేట్ ఫ్యాన్‌బేస్‌ను ఏర్పరుచుకున్నారు. ఇప్పటికే ఆమె ఛానెల్‌కు 5లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తాజాగా తన కూతురి ఎంగేజ్మెంట్కు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ వేడుకకు బంధుమిత్రులు సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. -
నేను ఈ స్థాయికి రావడానికి ప్రేక్షకులే కారణం: కమెడియన్ అలీ
సినీ నటుడు అలీకి జీవన సాఫల్య రజిత కిరీట జాతీయ పురస్కారాన్ని అందజేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతిని పురస్కరించుకొని త్యాగరాయ గానసభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మధుసూదనచారి మాట్లాడుతూ.. పీవీ నరసింహరావు ప్రతికూలపరిస్థితులలో జాతీయ స్థాయికి ఎదిగారని అలీ కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని సినీ రంగంలో ఉన్నతస్థాయికి ఎదిగి సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నారని కొనియాడారు. నటుడు అలీ మాట్లాడుతూ చిన్న దర్జీగా మా నాన్న పనిచేసేవారని, అలాంటి కుటుంబం నుంచి ఈ స్థాయికి రావటానికి ప్రేక్షకులే కారణమని అన్నారు. పీవీ ప్రభాకర్‌రావు, గానసభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి, తదితరులు పాల్గొన్న సభకు సురేందర్ స్వాగతం పలుకగా దైవజ్ఞశర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు 101 జయంతిని పురస్కరించుకుని 101 మంది నృత్యకళాకారులు విభిన్న నృత్యాలు చేయగా సంస్థ అధ్యక్షురాలు పుష్ప రికార్డ్ పత్రం అందుకొన్నారు. చదవండి: థియేటర్లో రెండే, ఓటీటీలో మాత్రం బోలెడు సినిమాలు రిలీజ్‌కు రెడీ! సెట్లో నోరుపారేసుకున్న హీరో, చెంప చెల్లుమనిపించిన సిబ్బంది -
ఇన్నాళ్లకు మీనా నాకు చిక్కింది: అలీ భార్య జుబేదా
నవ్వుల రారాజు రాజేంద్ర ప్రసాద్ ఇటీవలే తన బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాడు. జూలై 19న తన పుట్టినరోజు సందర్భంగా 'ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు' సినిమా సెట్స్‌లో కేక్ కట్ చేశాడు. అయితే దీన్నంతటినీ తన కెమెరాలతో క్యాప్చర్ చేసింది కమెడియన్ అలీ భార్య జుబేదా. సెట్స్‌లోకి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించింది. ఇక ఈ సినిమా సెట్స్‌లో నటి మీనా కూడా ఉండటంతో ఆమెను కలిసింది జుబేదా. నీకు వీరాభిమానిని అంటూ మీనాతో మాటలు కలిపింది జుబేదా. గతంలో 'పెళ్లాం చెబితే వినాలి' సినిమా సమయంలో కలిశామని, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కలిశామని చెప్తూ సంతోషపడిపోయిందామె. పెళ్లాం చెబితే వినాలి సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసి 7వ తరగతి పరీక్షలు మానేసి మరీ మిమ్మల్ని కలిశానంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది జుబేదా. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు కలుద్దామన్నా సెట్ అవ్వలేదని చెప్పుకొచ్చింది. ఏదైతేనేం, ఇన్నాళ్లకు మీనా తన యూట్యూబ్‌కు చిక్కిందని సంబరపడిపోయింది. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత తెలుగులో నటిస్తున్నాననంది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తొలిసారి యాక్ట్ చేస్తున్నానని తెలిపింది. తెలుగులో సినిమాలు చేయట్లేదని ఇప్పటికే చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, తప్పకుండా తెలుగులో మూవీస్ చేస్తాను అని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. చదవండి: యంగ్ హీరో శ్రీవిష్ణుకు తీవ్ర అస్వస్థత తెలుగు సినిమాలకు అవార్డుల పంట, ఏ సినిమాకు ఏ అవార్డు వచ్చిందంటే? -
అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ
Comedian Ali Comments On F3 Movie In Success Meet: ‘‘ఎఫ్ 3’ చిత్రం తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తున్నారు’’ అని వెంకటేశ్ తెలిపారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎఫ్ 3’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న రిలీజైంది. ఈ సందర్భంగా సోమవారం (మే 30) ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ‘‘ఈ చిత్రాన్ని ఎలాంటి ఫ్రస్ట్రేషన్ లేకుండా తీశారు అనిల్ రావిపూడి. థియేటర్లో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘కరోనా తర్వాత ‘అఖండ’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘సర్కారు వారి పాట’ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్స్‌కు తీసుకుని వచ్చాయి. ఇప్పుడు ‘ఎఫ్ 3’ తీసుకొచ్చింది. విడుదలైన రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నైజాంలోనే తొమ్మిది లక్షల యాభైవేలమంది ప్రేక్షకులు చూశారు. తెలుగు సినిమాకు పూర్వవైభవం తీసుకువచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ‘‘45 ఏళ్లుగా నవ్వునే నమ్ముకుని సినిమాలు చేస్తున్నాను. అలా ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చేశాను. ప్రపంచంలోని నలుమూలల నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ‘మీ పాత సినిమాలు గుర్తుకు వస్తున్నాయి’ అని అభినందిస్తున్నారు. నాకు నా ‘మాయలోడు’ సినిమా గుర్తొచ్చింది’’ అన్నారు రాజేంద్రప్రసాద్. ‘‘హిట్టయిన సినిమాను కూడా బాగాలేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది సరి కాదు. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారనే విషయానికి ‘ఎఫ్ 3’ సక్సెస్ ఓ నిదర్శనం’’ అని తెలిపారు అలీ. చదవండి: నేను సింగిల్, కాదు మింగిల్.. ఏం చెప్పాలో తెలియట్లేదు: అనుపమ పరమేశ్వరన్ -
సినీనటుడు ఆలీ సడన్ సర్ప్రైజ్.. ఎవరికీ చెప్పకుండా..
మండపేట(కోనసీమ జిల్లా): ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒక చోటకు చేరారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ మైమరచిపోయారు. విద్య నేర్పిన గురువులను సత్కరించడంతో పాటు ఆటపాటలతో సందడి చేశారు. ఈ వేడుకలో ప్రముఖ సినీనటుడు ఆలీ తళుక్కున మెరిసి సందడి చేశారు. మండపేట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 1991–92 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం స్థానిక సూర్య ఫంక్షన్ హాలులో జరిగింది. చదవండి: సీక్రెట్ స్మోకింగ్‌పై స్పందించిన బిందుమాధవి తాము 10వ తరగతి పూర్తిచేసుకుని 30 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని వేడుకగా జరుపుకోవాలని నాలుగేళ్ల క్రితమే నిర్ణయించుకున్నారు. అప్పట్లోనే తమ బ్యాచ్ పేరిట ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేయడం ద్వారా ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడిన వారందరిని ఒక తాటిమీదకు తెచ్చారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ తమ క్షేమ సమాచారాలను పంచుకున్నారు. అదే బ్యాచ్‌కు చెందిన ఆలీ సతీమణి జుబేదా వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధ్యాహ్న సమయంలో అనుకోని అతిథిలా ఆలీ వేడుకకు విచ్చేసి అందరినీ ఆనందంలో ముంచెత్తారు. అప్పట్లో తమకు విద్య నేర్పిన గురువులు ప్రమీలా జూలియట్, సుబ్బయ్యశాస్త్రి, తలుపులమ్మ, షబాబా, వీరన్న, సత్యవతి, ఈశ్వరిలను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఆత్మీయ సమ్మేళనానికి గుర్తుగా జ్ఞాపికలు అందజేశారు. సహపంక్తి భోజనాలు అనంతరం పూర్వ విద్యార్థులందరూ తమతమ కుటుంబ సభ్యులతో కలిసి తాము చదువుకున్న పాఠశాలను సందర్శించి సందడి చేశారు. కార్యక్రమం నిర్వహణకు కృషిచేసిన మెహర్జ్యోతి, విజయవాణిలను సహచర విద్యార్థులు సత్కరించారు. సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనే తన సతీమణికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎవరికీ చెప్పకుండా ఉదయం ఫ్లైట్‌కు బయలుదేరి వచ్చినట్టు ఆలీ తెలిపారు. పూర్వపు విద్యార్థులంతా ఇలా కలుసుకుని విద్యాబుద్ధులు నేరి్పన గురువులను సత్కరించుకోవడం అభినందనీయమన్నారు. ఎప్పుడు నవ్వుతూ నవి్వస్తూ ఉండాలన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఆలీతో సెల్ఫీలు తీసుకునేందుకు చిన్నారులు, వేడుకకు హాజరైన వారు ఉత్సాహం చూపించారు. కొద్దిసేపటి తర్వాత ఆలీ వేడుక నుంచి వెనుతిరిగారు. -
నార్త్ వాళ్లకు ఇప్పుడు ఆ భయం మొదలైంది: అలీ
‘సౌత్ సినిమాలు అంటే నార్త్ వాళ్లకు ఒకప్పుడు బాగా ప్రేమ ఉండేది. ఇప్పుడు ఇంకా ప్రేమ వచ్చింది. అలాగే వీళ్లు మనల్ని తొక్కేస్తున్నారనే భయం కూడా వాళ్లకు మొదలైంది’ అని కమెడియన్ అలీ అన్నారు. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన అలీ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు.. స్టార్ ఇమేజ్ ఉంది. 43 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు? ఈ మధ్య కాలంలో మీ స్పీడ్ తగ్గింది. ఎందుకు? బుల్లితెరపై ఒకే ఒక షో చేస్తున్నాను. అలాగే యమలీల సీరియల్ చేశా. ఎస్వీ కృష్ణారెడ్డి గారి కోసమే ఆ సీరియల్ చేశా. ఎందుకంటే ఆయన నన్ను హీరో చేశాడు. స్టార్ దర్శకుడిగా ఉన్న ఆయన.. అందరినీ ఒప్పించి నాతో సినిమా చేశాడు. అందుకే ఆయన ఏం చెప్పినా.. వెనకా ముందు ఆలోచించకుండా చేసేస్తా. ఇక ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాల్లో మాకు క్యారెక్టర్ ఇస్తున్నారు. సినిమా కథ ఏంటో మాకు చెప్పరు. తీరా సినిమా చూస్తుంటే..అలీగారు ఎందుకు ఈ సినిమాలో నటించాడు? అని అందరు అనుకుంటారు. అభిమానులతో ఆ మాట అనిపించుకోవద్దనే కొన్ని సినిమాలు చేయడం లేదు. కథ విని నా క్యారెక్టర్ బాగుంటేనే సినిమా చేస్తా. కొత్త వాళ్లకు అయితే ఏదైనా పర్లేదు అని చేస్తారు. నాకు ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎఫ్ 3లో పూర్వ అలీగారిని చూడగలమా? తప్పకుండా చూస్తారు. నా క్యారెక్టర్లో అంత సత్తా ఉంది. లొకేషన్లో కూడా టెక్నీషయన్స్ బాగా ఎంజాయ్ చేశారు. శిరీష్ గారు అయితే 35 సార్లు చూసి కిందపడి మరీ నవ్వారని అనిల్ చెప్పారు. నా పాత్రను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎఫ్3లో మీ క్యారెక్టర్ పేరు? పాల బేబీ. వడ్డీకి తిప్పే క్యారెక్టర్ నాది. ఆడవాళ్లు అంటే అపారమైన గౌరవం.. సినిమా ఎండింగ్లో మీకు ఆ విషయం తెలుస్తుంది (నవ్వుతూ..). సినిమా మొత్తంలో 45 నిమిషాలకు పైగా నా పాత్ర ఉంటుంది. సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. చాలా మంది ఆరిస్టులు నటించారు. ఎవరెలా చేశారు? ఒకరిని మించి ఒకరు నటించారు. ఎవ్వరినీ తగ్గించలేం. చిన్న క్యారెక్టర్ కూడా సినిమాలో కీలకం. ‘కొన్ని సీన్స్ మిస్ అయిపోయామే.. మళ్లీ వెళ్లాలిరా’ అనేలా ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. వెంకటేశ్, వరుణ్‌తేజ్ కామెడీ టైమింగ్ గురించి? వాళ్లు పుట్టిందే ఇండస్ట్రీలో. ఇద్దరూ బాగా చేశారు. వారితో పాటు మిగతా నటీనటులు కూడా చక్కగా నటించారు. సినిమాల్లో హీరోలిద్దరికి ఓ లోపం ఉంది. వెంకటేశ్‌కు రేచీకటి అయితే.. వరుణ్‌కు నత్తి.. మరి మీకేముంది? నాకు గన్ ఉందిగా (నవ్వుతూ..) అనిల్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? సినిమాలో ఇంత మంది ఆర్టిస్టులు ఉంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. కానీ అనిల్‌లో అది కొంచెం కూడా కనిపించదు. అందరు వచ్చారా? టిఫిన్ చేశారా? ఓకే షూటింగ్ స్టార్ట్ చేద్దాం అని సింపుల్‌గా అనేస్తాడు. అతి తక్కువ వయసులో ఇంతమంది ఆర్టిస్టులను మేంటేన్ చేయడం అనేది గొప్ప విషయం. ఒకప్పుడు రాఘవేంద్రరావు, ఈవీవీ సత్యనారాయణ, దాసరి నారాయణరావు సినిమాల్లో ఇలాంటి వాతావరణం ఉండేది. అనిల్‌లో అంత సత్తా ఉంది కాబట్టే.. దిల్ రాజు గారు కూడా ఎంత మంది ఆర్టిస్టులు కావాలంటే.. అంతమందిని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇలాంటి నిర్మాత దొరకడం అనిల్ అదృష్టం. వెంకటేశ్‌తో మీ కామెడీ టైమింగ్ ఎలా ఉండబోతుంది? ఆయనతో నేను చేసిన సినిమాలు అన్ని కామెడీ చిత్రాలే. కామెడీ చేయడంలో చిరంజీవి, వెంకటేశ్, మోహన్‌బాబు, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేశ్‌బాబు ఎక్స్పర్ట్స్ పొలిటికల్ కెరీర్ గురించి? నన్ను హీరోగా క్రియేట్ చేసింది ఎస్వీ కృష్ణారెడ్డి అయితే.. పొలిటికల్ లీడర్‌గా క్రియేట్ చేయబోతున్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిగారే. ఆయన నాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. నామీద నమ్మకం పెట్టుకోండి అన్నారు అంతే. ఏదో ఒకరోజు కాల్ వస్తే వెళ్తా.. మీ సమక్షంలోనే(మీడియా) ఆ విషయాన్ని పంచుకుంటా(నవ్వుతూ..) ఫైనల్‌గా ఎఫ్3 గురించి ఏం చెప్తారు? ఇది ఒక అద్భుతమైన సినిమా. పైసా వసూల్ మూవీ. వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే... మూడు వందల రూపాయల ఆనందం వస్తుంది. కొత్త సినిమాల గురించి? అంటే సుందరానికి, ఎఫ్3, లైగర్, ఖుషీ, ఒకే ఒక జీవితం సినిమాలతో పాటు తమిళ వెబ్ సిరీస్ చేస్తున్నా. కన్నడలో ధృవ సర్జా మూవీలో నటిస్తున్నాను. ఓ నేపాలి సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నా. ఒకప్పుడు మనం సినిమాల్లో అవకాశం కోసం వెళ్లేవాళ్లం. ఇప్పుడు వాళ్లే మన దగ్గరకు వస్తున్నారు. ఒకప్పుడు నార్త్‌వాళ్లను మనం తెచ్చుకునేవాళ్లం. మనం యాక్టింగ్ నేర్పించి, డబ్బింగ్ చెప్పించి డబ్బులు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు సౌత్ వాళ్ల సత్తా ఏంటో తెలిసింది. అక్కడి సినిమాల కోసం మమ్మల్ని పిలుస్తున్నారు. -
కూతురి గురించి గుడ్‌న్యూస్ షేర్ చేసిన కమెడియన్ అలీ
కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన సీతాకోకచిలుక’చిత్రం ద్వారా హీరోగా మారారు. ఇప్పటివరకు వెయ్యికి పైగానే చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అనతికాలంలోనే స్టార్ కమెడియన్‌గా పాపులర్ అయ్యారు. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే, మరోపక్క బుల్లితెరపై కూడా ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఏమాత్రం ఖాళీ దొరికినా కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతుంటారాయన. ఇక అలీ భార్య జుబేదా ఈ మధ్యే యూట్యూబ్‌లో ఎంట్రీ ఇచ్చి రకరకాల వీడియాలతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వీరికి ముగ్గురు సంతానం. తాజాగా అలీ పెద్దకూతురు ఫాతిమా గురించి ఓ గుడ్‌న్యూస్‌ను షేర్ చేసుకున్నారు. ఫాతిమా డాక్టర్ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ కుటుంబంలో ఫాతిమానే మొదటి డాక్టర్ అంటూ అలీ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా తన కూతురు డాక్టర్ కావడం అలీ కోరిక అని తెలుస్తుంది. అలీ పోస్ట్ చూసిన నెటిజన్లు ఫాతిమాకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
హాస్యం అపహాస్యం కాకూడదనేదే నా లక్ష్యం: కమెడియన్ అలీ
హాస్యం అనేది అపహాస్యం కారాదని ప్రముఖ తెలుగు నటుడు అలీ అన్నారు. శుక్రవారం రాత్రి బెంగళూరులోని తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో 70వ ఉగాది ఉత్సవాలు - శ్రీకృష్ణదేవరాయల పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. అలీతో పాటు కన్నడ రంగస్థల నటుడు సరిగమ విజీ, విద్యాసంస్థల అధినేత వేణుగోపాల్, ప్రిన్స్ రామవర్మ పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా అలీ ప్రసంగిస్తూ ప్రజలను నవ్వించడమే నా తపన అన్నారు. అయితే హాస్యం అపహాస్యం కాకూడదనేది తన లక్ష్యమన్నారు. తన మంచితనమే సినీరంగంలో ఇంతటి పేరును తెచ్చిందని చెప్పారు. స్థానిక తెలుగు పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించాలని సమితి అధ్యక్షుడు ఎ.రాధాకృష్ణరాజు కర్ణాటక సర్కారుకు విజ్ఞప్తి చేశారు. సరదాకు మరోపేరు అలీ అని సమితి ప్రధాన కార్యదర్శి ఇడమకంటి లక్ష్మిరెడ్డి అన్నారు. వెండితెర తారాజువ్వ అలీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు. చదవండి: కమెడియన్ అలీతో హీరోయిన్ పెళ్లి, పత్రికల్లో ఫొటో! ఆమెతో లవ్ ట్రాక్, కానీ ఆ కమెడియన్‌కు ఆల్రెడీ పెళ్లైంది.. ఫొటోతో బయటపెట్టిన కంగనా -
కమెడియన్ అలీతో హీరోయిన్ పెళ్లి, పత్రికల్లో ఫొటో!
అలనాటి హీరోయిన్ మాలశ్రీ చెల్లెలు శుభశ్రీ కూడా కథానాయికగా రాణించింది. మలయాళ చిత్రాలతో పాటు ఊహ, పెదరాయుడు వంటి పలు తెలుగు సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె అసలు పేరు భారతి పాండే. కానీ ఆమె పోషించిన శుభశ్రీ పాత్ర పాపులర్ కావడంతో అదే ఆమె అసలు పేరుగా మారిపోయింది. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తను చిన్నపిల్లలతో ఆడుకునే సమయంలో ఓ అబ్బాయి వచ్చి సైట్ కొట్టేవాడంది. అలా ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నామని తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది. అతడు డైమండ్ రింగ్‌ను తొలి బహుమతిగా ఇచ్చాడంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది శుభశ్రీ. తాను స్కూలుకు వెళ్లకుండా ఉండటానికే సినిమాల్లోకి వచ్చానంది. కాగా శుభశ్రీ, అలీ 'అల్లరి పెళ్లికొడుకు' సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమాలో వీళ్లిద్దరికీ పెళ్లి జరుగుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగానే ఆ పెళ్లి ఫొటో బయటకు వచ్చింది. దీంతో ఓ మ్యాగజైన్ అలీ, శుభశ్రీ పెళ్లైపోయిందంటూ ఓ కథనం రాయగా అది చూసి అలీ భార్య షాకైందట! ఆ సంఘటనను తలుచుకుని శుభశ్రీ పడీపడీ నవ్వింది. చదవండి: అదే జరిగితే రాజమౌళిని చంపేస్తారు.. ఎన్టీఆర్ Ghani Movie Review: ‘గని’ పంచ్ ఎలా ఉందంటే.. -
త్వరలోనే గుడ్‌న్యూస్ ఉంటుందని సీఎం జగన్ చెప్పారు: అలీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రముఖ నటుడు అలీ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో అలీ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌ను కలిశాను. త్వరలోనే గుడ్‌న్యూస్ ఉంటుందని ఆయన చెప్పారు. ఏమీ ఆశించకుండా పార్టీలోకి వచ్చాం. త్వరలోనే నా పదవిపై పార్టీ ఆఫీస్ నుంచి ప్రకటన వస్తుంది. రెండు వారాల్లోనే ప్రకటన ఉంటుందని అనుకుంటున్నాను.ఇక సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నా. సామాన్యులకు కూడా సినిమా టికెట్ అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ ఆలోచన. చిన్న సినిమాకు కూడా లాభం ఉండాలన్నదే మా ఉద్దేశం అని అలీ అన్నారు. చదవండి: తిరుపతిలో స్టూడియోలు ఏర్పాటు చేస్తాం: మంచు విష్ణు -
రాజమండ్రి : బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సమ్మేళనంలో సినీ నటుడు అలీ
-
కమెడియన్ అలీ లగ్జరీ ఇంటిని చూశారా?
Comedian Ali Home Tour Video Is Out: ఇప్పుడంతా యూట్యూబ్ ట్రెండ్. ఇప్పటివరకు సోషల్ మీడియా ఫాలో అవ్వని సెలబ్రిటీలు సైతం ఈ మధ్యకాలంలో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. దీనికి తోడు యూట్యూబ్ చానల్స్‌తో సరికొత్త ఎంటర్టైన్మెంట్ను పరిచయం చేస్తున్నారు. సాధారణంగానే సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువగా ఉంటుంది. అలాంటిది వాళ్లే తమ సొంత యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వారి పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన సీక్రెట్స్ షేర్ చేసుకుంటే ఫ్యాన్స్‌కు అంతకు మించిన ఆనందం ఏముంటుంది. చదవండి : స్టార్ కిడ్స్ ముఖాలు రెండోసారి చూడగలమా : నటి ఇక ఇటీవలి కాలంలో యూట్యూబ్‌లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న వీడియోల్లో 'హోమ్ టూర్' టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ మధ్యే యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ అలీ భార్య జుబేదా తాజాగా తన ఇంటికి సంబంధించి 'హోమ్ టూర్' వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో అలీకి వచ్చిన అవార్డులు, రివార్డుల గురించి స్వయంగా అలీ చెప్పడం హైలెట్‌గా నిలిస్తే.. వాళ్ల ఇంట్లో ఉన్న ఓ ఫోటో సీక్రెట్‌ను జుబేదా రివీల్ చేసేసింది. అంతేకాకుండా తమ పక్కింట్లోనే బ్రహ్మానందం ఉంటారని, తమ అబ్బాయి అడిగిన ఓ ప్రశ్నకు ఆయన షాక్ అయ్యారని వివరించింది. ఇక హాలు, డైనింగ్ ఏరియా, నమాజ్ ఏరియా, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి సకల సౌకర్యాలతో ఉన్న అలీ ఇల్లు ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. చదవండి : గ్రాండ్‌గా సుకుమార్ భార్య బర్త్‌డే సెలబ్రేషన్స్ -
కమెడియన్ అలీ ఇంటిని ఎప్పుడైనా చూశారా?
Ali Home Tour: యూట్యూబ్.. ఇప్పటివరకు పెద్దగా గుర్తింపు లేని వాళ్లకు కూడా బోలెడంత పాపులారిటీ తెచ్చి పెడుతుంది. ఒకే ఒక్క వీడియోతో అటు డబ్బుతో పాటు బోలెడంత అభిమానం కూడా సొంతం చేసుకోవచ్చు. అందుకే సెలబ్రిటీలు సైతం సొంతంగా యూట్యూబ్ చానెల్స్ పెడుతున్నారు. క్రియేటివ్ వీడియోస్‌తో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు యూట్యూబ్ చానెల్స్‌తో సత్తా చాటుతున్నారు. తాజాగా కమెడియన్ అలీ భార్య జుబేదా సైతం యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఇంటికి సంబంధించి ‘మై హోమ్ టూర్’ పేరుతో ప్రోమో వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో హాలు, డైనింగ్ ఏరియా, నమాజ్ ఏరియా, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి సౌకర్యాలతో ఉన్న జుబేదా అలీ ఇల్లు మొత్తం ఎలా ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. త్వరలోనే పూర్తి వీడియో రిలీజ్ కానుంది. అప్పటివరకు ప్రోమోపై ఓ లుక్కేయండి. -
వాళ్లందరికీ కమెడియన్ అలీ బిర్యానీ దావత్
వెంకటేష్, వరుణ్‌తేజ్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ఎఫ్ 2. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌ను నమోదు చేసుకుని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి దీనికి సీక్వెల్‌ను ప్లాన్ చేశాడు. మళ్లీ ఇదే ఇద్దరు హీరోలను పెట్టి ఎఫ్ 3 సినిమా తీస్తున్నాడు. ఇందులో మెహరీన్, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కమెడియన్ అలీ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా అతడు ఎఫ్ 3 మూవీ టీమ్‌కు మాంచి విందు భోజనం ఏర్పాటు చేశాడు. సెట్లో ఉన్నవారందరికీ మటన్ బిర్యానీ తినిపించాడు. అది కూడా ఇంట్లో సిద్ధం చేసిన బిర్యానీ! ఇంకేముందీ.. ఆ బిర్యానీని చూడగానే లొట్టలేసుకుని తిన్నారు చిత్రయూనిట్ సభ్యులు. బిర్యానీ ఎంతో రుచికరంగా ఉందంటూ అనిల్ రావిపూడి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్ట్ చేశాడు. 'అలీ గారు ఇంట్లో వండించి తీసుకొచ్చి మాకు వడ్డించారు' అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ బిర్యానీ టేస్ట్‌ను హీరోహీరోయిన్లు మిస్ అయినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Anil Ravipudi (@anilravipudi) -
సాలిడ్‌గా ఎంట్రీ ఇచ్చిన అలీ..'బిగ్‌బాస్' కోసమేనా?
సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది యూట్యూబ్, ఇన్‌స్టా స్లార్లుగా పుట్టుకొచ్చారు. ఇక ప్రముఖ హీరో, హీరోయిన్లు సైతం సైతం సినిమా ప్రమోషన్స్ కోసం వీళ్ల సాయం కోరతారంటే ఈ సోషల్ స్టార్స్ హవా ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీంతో సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఇప్పటిదాకా డిజిటల్ మీడియాకి దూరంగా ఉన్న పలువురు స్టార్స్ ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చేశారు. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ కమెడియన్ అలీ కూడా చేరిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చీ రావడంతోనే 23వేల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఇక ఇన్‌స్టా ఎంట్రీ సందర్భంగా అలీ చేసిన మొదటి పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇన్‌స్టాలోకి రావడం రావడంతోనే తన సొంత సినిమాను ప్రమోట్ చేసుకున్నారు అలీ. అలీ సొంత బ్యానర్లో రూపొందిన 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' అనే చిత్రంలోని ఓ సాంగ్ షూట్ సందర్భంగా తీసుకున్న ఫోటోనే ఇన్‌స్టా మొదటి పోస్ట్‌లో షేర్ చేసుకున్నారు. ఇది అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని, ఇకపై ఈ అకౌంట్‌ను తానే హ్యాండిల్ చేస్తున్నట్లు అలీ పేర్కొన్నారు. ఇక అలీ ఇన్‌స్టా అకౌంట్‌పై పలువురు సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తూ 'వెల్కం టూ ఇన్‌స్టా ఫ్యామిలీ అలీగారు' అంటూ పోస్టులు షేర్ చేసుకుంటున్నారు. మరోవైపు సడెన్‌గా అలీ ఇన్‌స్టాలో ఎంట్రీ ఇవ్వడం బిగ్‌బాస్ కోసమేనా అని కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో అతి త్వరలోనే బిగ్‌బాస్ సీజన్-5 ప్రసారం అవ్వనున్న సంగతి తెలిసిందే. సీజన్-5లో పాల్గొనాల్సిందిగా ఇప్పటికే బిగ్‌బాస్ షో నిర్వాహకులు అలీని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సడెన్‌గా అలీ ఇన్‌స్టాలో ఎంట్రీ ఇవ్వడంతో ఇది బిగ్‌బాస్ కోసమేనంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Ali (@ali_the_actor) -
Comedian Ali : కష్టకాలంలో వారికి అండగా నటుడు అలీ
లాక్డౌన్ కారణంగా షూటింగులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కమెడియన్, నటుడు అలీ వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తన భార్య జుబేదాతో కలిసి ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్‌కు చెందిన 130 మంది మహిళా కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. పదికిలోల బియ్యం, నూనె, గోధుమపిండి, చక్కెర సహా 8 రకాలైన సరుకులను వారికి అందజేశారు. ఈ సందర్బంగా అలీ మాట్లాడుతూ..ప్రతి రోజు ఈ మహిళా కార్మికులు మా కంటే ముందే షూటింగ్ స్పాట్‌కు వెళ్లిపోయి విధులు నిర్వర్తిస్తుంటారు. ప్లేట్లు, కాఫీ కప్పులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటారు. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగులు లేక పని దొరక్క వారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని తెలుసు. అందుకే నా వంతుగా చిన్న సహాయం చేస్తున్నాను అని పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో అలీ సోదరుడు, నటుడు ఖయ్యూం సహా తదితరులు పాల్గొన్నారు. చదవండి : బ్రదర్స్ డే : అరుదైన ఫోటోను షేర్ చేసిన చిరంజీవి వాళ్లు నాకు ఎప్పటికీ ఫోన్ చేయరు: సోనూసూద్ భావోద్వేగం -
నా మేనకోడలిని ఆశీర్వదించండి: అలీ
సాక్షి, రాజమండ్రి(తూర్పు గోదావరి జిల్లా): ప్రముఖ హాస్యనటుడు అలీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. అలీ పెద్దక్క కూతురు సల్మా వివాహం సోమవారం రాత్రి రాజమండ్రిలో జరిగింది. సల్మా, అహ్మద్ అలీల పెళ్లి వేడుకలో రాజమండ్రి ఎంపీ మర్గాని భరత్, ఇతర ప్రముఖులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. సల్మాకు తండ్రి లేకపోవటంతో తండ్రి స్థానాన్ని మేనమామ అలీ తీసుకుని పెళ్లి వేడుకని అంగరంగా వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు అందరి దీవెనలు ఉండాలని అలీ కోరుకున్నారు. -
మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ
కరోనా వైరస్ నియంత్రణకు 21రోజుల పాటు లాక్డౌన్ విధించడంతో సామాన్య జనం నుంచి ప్రముఖులు వరకూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో హాస్యనటుడు అలీ... ఇంటి పనులతో బిజీ బిజీగా ఉన్నారు. షూటింగ్‌లతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఖాళీ దొరకని ఆయన ఇప్పుడు ఇంట్లో వాళ్లు చెప్పిన పనులు చేస్తున్నారు. ’రోజూ కార్లు కడుగుతున్నా.. ఇంట్లో పని చేస్తున్నా. కాయగూరలు కట్ చేస్తున్నా. ఇల్లంతా శుభ్రపరుస్తున్నా. (కిచెన్ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్) అప్పుడప్పుడు ఓ గంటో, గంటన్నరో టీవీ చూస్తున్నా. ఇంకా మా ఆవిడ ఏ పని చెబితే అది చేస్తున్నా.. వంట పని లాంటివి. నాకు కొన్ని వంటలు వచ్చు. బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు రూమ్‌లో వంట చేసేవాణ్ణి.. అందుకని నన్ను బాడుగ (అద్దె) కట్టమనేవాళ్లు కాదు. అప్పుడు నా బట్టలు నేనే ఉతుక్కునేవాణ్ణి. ఇస్త్రీ మాత్రం బయట చేయించుకునేవాణ్ణి. అప్పుడు షర్ట్‌కి యాభై పైసలు, ప్యాంటుకి యాభై పైసలు ఉండేది. ఇంటిలో మన పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఏం మనం స్నానం చేయడం లేదా? వేరే వాళ్లు చేయిస్తున్నారా? చిన్నప్పుడంటే తల్లిదండ్రుల చేయించేవాళ్లు.’ అని తెలిపారు. (బుల్లితెర కార్మికులకు యాంకర్ ప్రదీప్ చేయూత) -
డబ్బు సంపాదించే సమయం కాదు
‘‘కరోనా వైరస్ పైకి వెళ్లిపోవాలని కోరుతూ గత పదిరోజులుగా ఇంట్లోనే ఉంటూ నమాజ్ చేస్తున్నా. చాలా మంది తిండి లేక, డబ్బుల్లేక బాధపడుతుంటారు.. కానీ తప్పదు. ఈ వ్యాధి అలాంటిది. ఇటలీలో ఈ వ్యాధి వల్ల చనిపోయిన వారి మృతదేహాలను తీయడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వాలకు, పోలీసులకు సహకరించాలి’’ అన్నారు అలీ. కరోనా కట్టడి సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లక్ష రూపాయలు, తెలంగాణ ప్రభుత్వానికి లక్ష రూపాయలు సాయం ప్రకటించారు. ‘‘భారతదేశంలో చాలా మంది గొప్పోళ్లు ఉన్నారు.. ఈ సమయంలో వారు కూడా సాయం చేస్తే చాలా మంచిది.. ఈ వైరస్‌పై ఎవరూ కామెంట్స్ చేయొద్దు.. కామెడీ చేయొద్దు. ఈ సమయంలో చాలా మంది రేట్లు పెంచి డబ్బు సంపాదించేద్దాం అనుకుంటున్నారు.. ఇది సంపాదించే సమయం కాదు.. మానవత్వం చూపాల్సిన సమయమిది. ఎంత రేటు ఉంటే అంతకే అమ్మండి’’ అన్నారు అలీ. ‘3జి లవ్’ చిత్రనిర్మాత ప్రతాప్ కోలగట్ల కరోనా కట్టడి సహాయ కార్యక్రమాల కోసం ఏపీ ప్రభుత్వం సహాయ నిధికి లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. -
అలీకి టాలీవుడ్ ప్రముఖుల పరామర్శ
-
నటుడు అలీ దంపతులకు సన్మానం
సాక్షి, హైదరాబాద్ : సినీనటుడు అలీ అద్భుతమైన కళాకారుడని, విలువలుగ వ్యక్కి అని ప్రముఖ హాస్య నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం కితాబిచ్చారు. ఎస్ఆర్ఆర్ ఫార్చూన్ ఇన్ఫ్రా సౌజన్యంతో పద్మ మోహన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో అలీ, జుబేదా దంపతులకు ‘పద్మ మోహన స్వర్ణ కంకణం, విశిష్ట దంపతులు, జీవిత సాఫల్య పురస్కారాన్ని’ గురువారం రవీంద్రభారతిలో ప్రధానం చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. సామాన్యంగా కొన్ని వంద సినిమాలు చూడడమే కష్టమని.. అలాంటిది కొన్ని వందల సినిమాల్లో నటించడం అలీకే చెల్లిందన్నారు. అలీ మాట్లాడుతూ.. ‘సినీ పరిశ్రమలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తయ్యాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పలు భాషలలో 11 వందల సినిమాలలో నటించాను. త్వరలో దబాంగ్–3, హాలీవుడ్ చిత్రం గోల్డెన్ బర్డ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి’ అని పేర్కొన్నారు. కాగా వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రముఖులకు ఇదే వేదికపై పద్మ మోహన అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
ఆలీతో జోర్ సే
-
సినీనటుడు అలీ రోడ్‌షో
సాక్షి, కదిరి: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం కదిరి పట్టణంలో నిర్వహించిన సినీనటుడు అలీ రోడ్‌షో భారీ సక్సెస్ అయింది. మండుటెండను సైతం లెక్కచేయకుండా జనం రోడ్‌షోలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎంఎస్ లాడ్జి వద్ద ప్రారంభమైన రోడ్ షో వలీసాబ్‌రోడ్, రాయలసీమ సర్కిల్, తేరు బజార్, ఎక్బాల్ రోడ్ మీదుగా కొలిమి సర్కిల్ చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన ముస్లింల ఆత్మీయ సభలో అలీతోపాటు వైఎస్సార్సీపీ జాతీయ కార్యదర్శి రెహమాన్, మైనార్టీ సెల్ రాష్ట అధ్యక్షుడు ఖాదర్‌బాషా, ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్, కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పీవీ.సిద్దారెడ్డి ప్రసంగించారు. ‘కదిరి, జగను, మాధవ, సిద్దయ్య ఇలా మూడక్షరాలతో ఏర్పడిన పేర్లు చాలా బాగున్నాయని, ఈ కలయిక విజయానికి మారుపేరు’ అని సినీ నటుడు అలీ చెప్పడంతో జనం ఈలలు, కేకలతో ఆ ప్రాంతాన్ని మార్మోగించారు. 100 మంది చంద్రబాబులు వచ్చినా ఈసారి ఫ్యాను గాలిలో కొట్టుకుపోవడం ఖాయమని వైఎస్సార్సీపీ జాతీయ కార్యదర్శి రెహమాన్ అన్నారు. నోరు కూడా సరిగా తిరగని లోకేష్‌ను చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయాలని తాపత్రయ పడుతున్నారని, అయితే జగన్ మాత్రం బడుగు, బలహీన వర్గాల వారిని చట్టసభలకు పంపాలని తపన పడుతున్నారని హిందూపురం ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ అనడంతో సభ ఈలలు, కేకలతో హోరెత్తిపోయింది. -
ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చింది వైఎస్సారే
సాక్షి, గుంతకల్లు టౌన్: నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని సినీనటుడు, వైఎస్సార్సీపీ నేత అక్బర్ అలీ అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పామిడి, గుత్తి, గుంతకల్లులో ఆయన ప్రచారం నిర్వహించారు. గుంతకల్లులోని పోర్టర్స్‌లైన్‌లోని హజరత్ గులాంషా ఖాదరీ బాబా దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్సార్సీపీ గుంతకల్లు ఎమ్మెల్యే అభ్యర్థి వై.వెంకటరామిరెడ్డి, ఎంపీ అభ్యర్థి పీడీ రంగయ్యలకు మద్దతుగా అలీ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని కొనియాడారు. ఆయన తనయుడు జగన్ కూడా తండ్రి బాటలో పయనిస్తున్నారన్నారు. ముస్లిం మైనార్టీలకు ఐదు ఎమ్మెల్యే స్థానాలను కేటాయించిన ఘనత కూడా వైఎస్సార్‌సీపీదేనన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో రోడ్‌షో విజయవంతమైంది. వైఎస్సార్సీపీలోకి చంద్రశేఖర్ గుంతకల్లు టౌన్: అవోపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు, ప్రముఖ వ్యాపారవేత్త పువ్వాడి చంద్రశేఖర్ వైఎస్సార్సీపీలోకి చేరారు. రోడ్‌షోలో భాగంగా గుంతకల్లుకు విచ్చేసిన అలీ, గుంతకల్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.వెంకటరామిరెడ్డిల సమక్షంలో చంద్రశేఖర్ వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. -
చిరు చేతుల మీదుగా ‘దేశంలో దొంగలు పడ్డారు’ ట్రైలర్
స్టార్ కమెడియన్ ఆలీ తమ్ముడు ఖయూమ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం దేశంలో దొంగలు పడ్డారు. కమెడియన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఖయూమ్ తాజాగా హీరోగా మారి చేస్తోన్న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. “దేశంలో దొంగలు పడ్డారు' ట్రైలర్ నా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషం. దీనికి కారణం నా చిరకాల మిత్రుడు అలీ సోదరుడు ఖయ్యూం ఇందులో ప్రధాన పాత్ర పోషించడం చూసి నాకు ఓ గుడ్ ఇంప్రెషన్ వచ్చింది. డైరెక్టర్ గౌతమ్ ఫస్ట్‌టైమ్ డైరెక్ట్ చేస్తున్నప్పటికీ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఓ సీనియర్ మోస్ట్ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నట్లుగా అనిపించింది. ట్రైలర్ ఇంప్రెస్సీవ్ గా ఉంది. ముందుగా అలీ నాదగ్గరికి వచ్చి ఖయ్యూం నటించిన సినిమా అనగానే ఇదొక కామెడీ సినిమా అనుకున్నాను, గానీ ఇది ఒక సీరియస్ సినిమా అని ట్రైలర్ చూసాక అర్థం అయ్యింది. ఇది ఖయ్యూంకు ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. తన కెరియర్‌కు ఇది బెస్ట్ సినిమాగా నిలుస్తుంది. అలాగే కొత్త అమ్మాయి తనిష్క కూడా పెరఫార్మర్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటించిందని అర్థం అవుతుంది.. ఈ సందర్భంగా యూనిట్‌కు సంబంధించిన టెక్నీషియన్ సభ్యులందరికీ, అలాగే మా ఖయ్యూం కి ఆల్ ది వెరీ బెస్ట్, గౌతమ్‌ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను’ అని అన్నారు. -
అక్క.. అమ్మలా పెంచింది
‘అన్నా చెల్లెళ్ల అనుబంధం... జన్మజన్మల సంబంధం’ అంటూ వివరించాడో రచయిత. సృష్టిలో ఓ అపూర్వ బంధమిది. అక్కాచెల్లెళ్లకుజీవితాంతం అండగా నిలిచే సోదరులు...అన్నాదమ్ములను అంతే ఆప్యాయంగా చూసుకునే సోదరీమణులు ఎందరో. వీరందరికీ రాఖీ పండగ ఎంతో ప్రత్యేకం. నేడు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగ. ఈ సందర్భంగా అటు అక్కాచెల్లెళ్లను, ఇటు అన్నాదమ్ములను‘సాక్షి’ పలకరించింది. ఆ విశేషాల సమాహారమిది... సాక్షి, సిటీబ్యూరో: ‘ మా అక్క అంటే నాకెంతో ఇష్టం. అమ్మ తర్వాత అమ్మలా నన్ను పెంచింది. మా కుటుంబంలో రాఖీ సంప్రదాయం లేకపోయినా... అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండగకు ప్రతిసారి మా అక్క జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అక్క ఫాతిమా నన్ను అల్లారు ముద్దుగా చూసుకునేది. మా సొంతూరు రాజమండ్రి. అక్క పెళ్లయ్యే నాటికి నా వయస్సు తొమ్మిదేళ్లు ఉంటుందేమో. వైజాగ్ వాళ్ల అత్తారిల్లు. వాళ్లింట్లో ఓ రోజు పాలు వేడి చేస్తుండగా చున్నీ అంటుకుంది. అక్క గమనించలేదు. వెనుక నుంచి మంటలు చెలరేగాయి. భయంతో ఇంట్లోంచి బయటకు పరుగెత్తుకొచ్చింది. అక్కడున్న వాళ్లు గమనించి, అక్కపై నీళ్లు పోశారు. కానీ ఆ ప్రయత్నం వికటించింది. అప్పటికే అక్క ఆరు నెలల గర్భిణి. కుటుంబసభ్యుతో అలీ...ఫాతిమా నీళ్ల కారణంగా ఇన్ఫెక్షన్స్ బాగా పెరిగాయి. అక్కతో పాటు, కడుపులోని బేబీ కూడా చనిపోయింది. నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న మా అక్క లేని లోటు నా జీవితంలో ఎప్పటికీ పూడ్చలేనిది. మా అక్క జ్ఞాపకంగా నా పెద్ద కూతురుకు ఆమె పేరు పెట్టుకున్నాను. అక్కను నా కూతురులో చూసుకుంటున్నాను. ప్రతి ఏటా రాఖీ సందర్భంగా తెలిసిన వాళ్లు వచ్చి రాఖీలు కడతారు. షూటింగులలో ఉన్నప్పుడు ఆ అనుబంధాలు బాగా తెలిసి వస్తాయి. అలా సినీనటి విజయశాంతి నన్ను తన సొంత సోదరుడిలా చూసుకునేది. ప్రతి ఏటా రాఖీలు కట్టేది. సినిమా రంగం నుంచి ఆమె దూరమయ్యాక రాఖీలు కట్టడం తగ్గిపోయింద’ని అక్క ఫాతిమాతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రముఖ సినీ నటుడు అలీ. -
కులం కూడు పెట్టదు.. కష్టం కూడు పెడుతుంది
వైఎస్ఆర్ జిల్లా , రాజంపేట: నేటి విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని మరచిపోకుండా, పట్టుదల, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి వారి ఆశయాలను నెరవేర్చాలని సినీనటి, ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. రాజంపేటలోని ఏఐటీఎస్‌లో గురువారం జరిగిన మహోత్సవ్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కన్నవారిని, చదువు చెప్పిన గురువును, చదివిన కళాశాలను మరచిపోరాదన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సక్సెస్ కావాలంటే నాణ్యమైన విద్యను అందించే ఏఐటీఎస్ లాంటి విద్యాసంస్థలో విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చారు. అన్నమయ్య నడయాడిన ప్రాంతంలో ఏఐటీఎస్ అధినేత చొప్పా గంగిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలను స్థాపించడం వల్ల ఇక్కడ విద్యను అభ్యసించిన వారు ఎందరో దేశ, విదేశాలలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజురీయింబర్స్‌మెంట్‌ను తీసుకురావడం వల్ల ఎందరో పేదలకు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభించిందన్నారు. ప్రతి ఇంట ఆయనను తలుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమ ఫలాలు అందించడంలో భాగంగా కుటుంబలో ఒకరికి ఉన్నత విద్యను అందించగలిగితే ఆ కుటుంబం ఆర్థికంగా బలోపేతమవుతుందనే ఉద్దేశంతో దివంగత సీఎం వైఎస్సార్ ఫీజురీయింబర్స్‌మెంట్‌ను తీసుకువచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయన్నారు. ఉద్యోగం దక్కక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నేడు నెలకొన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ పుట్టిన రాయలసీమలో తాను జన్మించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాబోయే ఎన్నికల్లో విద్యార్థులు ముందుండి ప్రత్యేక హోదాను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఎవరైతే సాధించగలరనే నమ్మకం ఉందో వారికే ఓటు వేయించేలా విద్యార్థులు కృషి చేయాలన్నారు. కులం కూడు పెట్టదు.. కష్టం కూడు పెడుతుంది: హాస్యనటుడు అలీ కులం కూడు పెట్టదని..కష్టపడితే భవిష్యత్తు ఉంటుందని ప్రముఖ సినీ హాస్య నటుడు అలీ అన్నారు. విద్యార్థి జీవితం చాలా విలువైనదన్నారు. అలాంటి జీవితం తనకు లేకుండా పోయిందన్నారు. చిన్నప్పుడే సినీ పరిశ్రమలో అడుగు పెట్టానన్నారు. విద్యార్థి జీవితం విలువలతో ఉన్నతంగా సాగితే జీవితానికి సార్థకత ఉంటుందన్నారు. తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా ముందుకు సాగాలన్నారు. తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు చూపాలన్నారు. నాకు అమ్మే సినిమా అన్నారు. చదువు ఉంటే సంస్కారం వస్తుందని, తాను జీవితంలోని అనుభవాలతో, ఎదుటివారిని చూసి ఆ సంస్కారం సంపాదించుకున్నానని చెప్పారు. అన్నమయ్య 108 అడుగుల విగ్రహానికి తన స్థలాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి ఏఐటీఎస్ అధినేత గంగిరెడ్డి అని కొనియాడారు. అనంతరం ఏఐటీఎస్ అధినేత చొప్పా గంగిరెడ్డి, రాయలసీమ విద్యాసంస్థల డైరెక్టర్ ఆనందరెడ్డి, ఏఐటీఎస్ వైస్‌చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ఏఐటీఎస్ ఈడీ చొప్పా అభిషేక్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ నారాయణ పాల్గొన్నారు. -
కడప పెదదర్గాను దర్శించుకున్న ఆలీ
-
కమెడియన్ ఆలీ.. ఖైదీల 'శ్రీమంతుడు'
హైదరాబాద్: 'శ్రీమంతుడు' సినిమా స్ఫూర్తితో సినీ నటులు, రాజకీయ నాయకులు పలు గ్రామాలను దత్తత తీసుకుంటున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. కాగా, అందరికంటే భిన్నంగా.. దత్తత విషయంలో మరో ముందడుగు వేశారు కమెడియన్ ఆలీ. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం చంచల్ గూడా జైలులో సందడిచేసిన ఆలీ.. నలుగురు మహిళా ఖైదీలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రతి ఏటా గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా సెలబ్రీటీలను తీసుకొచ్చి ఖైదీలతో మాట్లాడించే అధికారులు ఈ సారి ఆలీని ఆహ్వానించారు. జైలు ప్రాంగణంలో ఆడా, మగ ఖైదీలు, అధికారులు పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొన్న ఆలీ.. హాస్యోక్తులతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ డీఐజీ నర్సింహ మాట్లాడుతూ.. ఓ ఖైదీని దత్తత తీసుకోవాలని అలీకి సూచించారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఆలీ.. నలుగురు మహిళా ఖైదీలను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కలెక్టర్ బొజ్జ రాహుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
ఆ మనుషుల్లో మంచితనం...
తెలుగునాట సాటిలేని మేటి హాస్యనటుల్లో ఒకరైన అలీ గోదావరి ఒడ్డున ఉన్న రాజమండ్రిలో పుట్టిపెరిగారు. ఆయన బాల్యం అక్కడే గడిచింది. బాల నటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టి, కమేడియన్‌గా, కామెడీ హీరోగా అంచెలంచెలుగా ఎదిగిన ఆయనకు గోదావరితో విడదీయలేని బంధం ఉంది. ఇప్పటికి మూడు పుష్కరాలు చూసిన అలీకి ఇవి నాలుగో పుష్కరాలు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఆయన ‘ఫన్డే’తో పంచుకున్న అనుభూతులు ఆయన మాటల్లోనే... మనుషుల్లో మంచితనానికి, పరిసరాల్లో పచ్చదనానికి మారుపేరు గోదావరి తీరం. గోదావరి ఒడ్డునే ఉన్న రాజమండ్రిలో పుట్టిపెరిగాను. నా బాల్యమంతా అక్కడే గడిచింది. చెన్నైలో ఉన్నప్పుడు కూడా ఇక్కడి పుష్కరాలకు వచ్చేవాణ్ణి. ఇప్పటికి మూడు పుష్కరాలు చూశాను. నాలుగో పుష్కరంలోకి ప్రవేశించాను. రాజమండ్రి, ఆ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న దాదాపు వంద సినిమాల్లో నటించాను. ఉభయ గోదావరి జిల్లాల నుంచి విశాఖ వరకు కలుపుకుంటే ఆ పరిసరాల్లో షూటింగ్ జరుపుకున్న దాదాపు రెండువందల సినిమాల్లో నటించాను. గోదావరి ఒడ్డున షూటింగ్ జరుపుకొనే సినిమాలు హిట్ అవుతాయనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. ఏఎన్నార్‌గారు నటించిన ‘మూగమనసులు’, నా చిన్నతనంలో కృష్ణగారు నటించిన ‘ఊరికి మొనగాడు’, శోభన్‌బాబుగారు నటించిన ‘దేవత’ వంటి సూపర్‌హిట్ సినిమాలు గోదావరి తీరంలో షూటింగ్ జరుపుకొన్నవే. ‘దేవత’లోని ‘ఎల్లువొచ్చి గోదారమ్మ..’ పాట అప్పట్లో సూపర్‌హిట్. సినిమారంగంలో ప్రతి హీరోకి గోదావరితో అనుబంధం ఉంది. గోదావరి ఒడ్డున వందలాది సినిమాలు షూటింగ్ జరుపుకొన్నాయి. ఒకప్పుడు గ్రామీణ నేపథ్యంలో ఉన్న సినిమాలన్నింటికీ షూటింగ్ కోసం గోదావరి పరిసరాలకే వచ్చేవారు. బాపుగారు, వంశీ, ఈవీవీ సత్యనారాయణ వంటి దర్శకులు గోదావరి తీరంలో చాలా సినిమాలు తీశారు. బడ్జెట్ సమస్యల వల్ల చిన్న సినిమాలు గోదావరి తీరంలో షూటింగ్ జరుపుకోలేకపోతున్నాయి. అయితే, గ్రామీణ నేపథ్యంలో సాగే పెద్ద సినిమాల షూటింగ్‌లన్నీ ఇప్పటికీ గోదావరి తీరంలోనే జరుగుతున్నాయి. పుష్కరాలంటే పెద్దసంఖ్యలో జనాలు ఇక్కడకు వస్తారు. ఇక్కడకు వచ్చే జనాలకు తగినట్లుగా ప్రభుత్వం ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి. ఇక్కడకు వచ్చే యాత్రికులు శుభ్రతపై శ్రద్ధ చూపితే కాలుష్యం జరగకుండా ఉంటుంది. అలాగే స్థానికులు కూడా సహకరించాలి. లేకుంటే, పుష్కరాల తర్వాత వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది. అందువల్ల పుష్కరాలకు వచ్చే జనాలు పరిసరాల శుభ్రతపై దృష్టి పెడితే బాగుంటుంది. ప్రభుత్వం కూడా వారి కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అదే... నేటి సఖినేటిపల్లి! శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతా లక్ష్మణ సమేతంగా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామిని అర్చించుకుని, వశిష్ట మహాముని ఆశీస్సులు పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. అక్కడి నుంచి శ్రీరాముడు సీతా సమేతంగా గోదావరిని దాటి అవతలి పల్లెకు చేరే సమయానికి చీకటి పడింది. ఇక ఆ రాత్రికి అక్కడే బస చేయాలనుకున్న రాముడు ‘సఖీ! నేటికీ పల్లె’ అన్నాడట. అదే కాలక్రమంలో ‘సఖినేటిపల్లి’గా రూపాంతరం చెందినట్లు స్థానికులు చెబుతారు. -
'గుంటూరుకు తరలి రానున్న సినిమా పరిశ్రమ'
గుంటూరు: సినీ రంగానికి ఎంతోమంది కళాకారులను అందించిన గుంటూరు జిల్లా త్వరలో కల్చరల్ హబ్‌గా రూపుదిద్దుకోనున్నదని సినీనటుడు ఆలీ చెప్పారు. గుంటూరులో ఆదివారం ఎన్ఆర్ఐ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10 కె వాక్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలో సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాజధానైన గుంటూరుకు తరలి రానున్నదని చెప్పారు. సినిమా షూటింగ్‌కు ఇక్కడ ఆహ్లాదకరమైనా వాతావరణం ఉందన్నారు. శిల్పరామం నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన జరగనుందని చెప్పారు. గాయకుడు మనో మాట్లాడుతూ త్వరలో సామాజిక, ఆధ్యాత్మిక సంగీత ఆల్బమ్స్‌ను నవ్యాంధ్రలో రూపొందించనున్నట్టు తెలిపారు. సినీనటులు నిఖిత, సౌమ్య, మాధవీలత పాల్గొన్నారు. -
మోసం చేసిన మహిళపై జాలి చూపిన నటుడు అలీ..
హైదరాబాద్: హాస్యనటుడు అలీ ఔదార్యాన్ని ప్రదర్శించారు. తనను లక్షల రూపాయల మేర మోసం చేసిన ఓ మహిళపై జాలి చూపారు. ప్రస్తుతం తినడానికి తిండి కూడా లేనిస్థితిలో వృద్దాప్యంలో ఉన్న ఆమెపై కేసును వెనక్కి తీసుకున్నారు. జాతీయ లోక్‌అదాలత్ సందర్భంగా శనివారం నాంపల్లి కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో పాల్గొని ఆ వృద్ధురాలిపై కేసు ఉపసంహరించుకున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన సాంబశివరావు, శకుంతల దంపతుల ఇంటిని 1998లో అలీ కొనుగోలు చేశారు. అయితే ఆ ఇంటిపై సాంబశివరావు దంపతులు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.90 లక్షల రుణం తీసుకున్నారు. ఈ సంగతి చెప్పకుండానే ఇంటిని విక్రయించారు. బ్యాంకు అధికారుల ద్వారా ఆలస్యంగా ఆ విషయాన్ని తెలుసుకున్న అలీ... 2006లో వారిద్దరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో చీటింగ్ కేసు నమోదైంది. ప్రస్తతం నాంపల్లి నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో తుది విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా న్యాయమూర్తి ఎస్.ఎస్.శ్రీదేవి... శకుంతల దయనీయ పరిస్థితిని అలీకి వివరించారు. దీంతో కేసును ఉపసంహరించుకునేందుకు ఆయన ముందుకొచ్చారు. లోక్ అదాలత్ లో నిందితుల నుంచి తమకు రావాల్సిన డబ్బు తీసుకొని కక్షిదారులు రాజీ అవుతుండగా..అలీ మాత్రం తనకు రావల్సిన డబ్బును వదులుకొని పెద్ద మనసుతో కేసును ఉపసంహరించుకున్నారు. ఈ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించిన అలీని న్యాయమూర్తులు అభినందించారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు ముందుకొచ్చి కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. -
రాజమండ్రి నుంచి పోటీ చేస్తా: అలీ
-
రాజమండ్రి నుంచి పోటీ చేస్తా: అలీ
వెలుగుబంద (రాజానగరం) : రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుంచి తనను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని అడుగుతున్నారని, అయితే సొంత ప్రాంతమైన రాజమండ్రి నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నానని ప్రముఖ హాస్యనటుడు అలీ అన్నారు. ఏ పార్టీ నుంచి అని ప్రశ్నిస్తే ‘కాట్రవల్లి పార్టీ’ అంటూ తన సహజధోరణిలో చమత్కరించారు. స్థానిక గైట్ కళాశాలలో మైత్రి యువజనోత్సవాలలో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పవన్‌కల్యాణ్‌కి అత్యంత ఆప్తుడైనంత మాత్రాన ఆయన ప్రతి విషయాన్ని తనకు చెప్పాలని లేదని ఒక ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. సినిమాల పరంగా ఆయనంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. జనసేన పార్టీ గురించి తనకు చెప్పలేదు, రమ్మని అనలేదన్నారు. పనిచేసే వారిని యువతరం ఎన్నుకోవాలని సూచించారు. -
చిరంజీవి అంటే ప్రాణం: అల్లు అర్జున్
రాజమండ్రి(తూర్పుగోదావరి జిల్లా): సినిమాల్లో తనకు తానే పోటీ తప్పా ఎవరూ తనకు పోటీకాదని సినీహీరో అల్లు అర్జున్ స్పష్టం చేశారు. ఎవరి రికార్డులు బ్రేక్ చేయాలన్నది తన ఆలోచన కాదన్నారు. తన రికార్డులను తానే అధిగమిస్తానన్నారు. స్థానిక గైట్ కళాశాల క్యాంపస్‌లో నిర్వహిస్తున్న మైత్రి యువజనోత్సవాల్లో 'రేసుగుర్రం' సినిమా యూనిట్‌తో కలిసి అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పవన్ అంటే ఇష్టం, చిరంజీవి అంటే ప్రాణం అని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ స్దాపించిన జనసేన పార్టీపై స్పందించేందుకు అల్లు అర్జున్ నిరాకరించాడు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సురేంద్రరెడ్డి, సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ల సమక్షంలో హాస్యనటుడు అలీ 'రేసుగుర్రం' ట్రైలర్‌ను ఆవిష్కరించారు. సానియామీర్జాతో హైదరాబాద్‌కు, షారూక్ ఖాన్‌తో ఇండియాకు ఏవిధంగా గుర్తింపు వచ్చిందో అలీతో రాజమండ్రి ఒక గుర్తింపు వచ్చిందని అల్లు అర్జున్ పేర్కొన్నారు. గోదావరి బుల్లోడు ఈ ట్రైలర్‌ని ఆవిష్కరించాలంటూ అలీ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
‘అలీబాబా ఒక్కడే దొంగ’
కథానాయకునిగా అలీ 50వ చిత్రం ‘అలీబాబా ఒక్కడే దొంగ’. సూజవారుని కథానాయిక. ఫణిప్రకాష్ దర్శకత్వంలో బొడ్డేడ శివాజీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.