
సాక్షి, అమరావతి/గుంటూరు వెస్ట్: సీఎం వైఎస్ జగన్ మంగళవారం గుంటూరు పర్యటనకు వెళ్లనున్నారు. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు.
సాయంత్రం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 4.55 గంటలకు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్‌లోని శ్రీ కన్వెన్షన్‌కు చేరుకుంటారు. నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం తాడేపల్లికి చేరుకుంటారు.