Reception
-
పరుచూరి రామకోటేశ్వరరావు- కొత్తపల్లి గీత కుమారుడి పెళ్లిలో సెలబ్రిటీలు (ఫోటోలు)
-
పీవీ సింధు రిసెప్షన్లో సినీ స్టార్స్.. చిరు, అజిత్‌తో పాటు
ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu).. రీసెంట్గా వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకుంది. రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోగా.. హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుకని అంగరంగ వైభవంగా చేశారు. అయితే ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది విచ్చేశారు. సినీ సెలబ్రిటీలు మాత్రం తెలుగు, తమిళ స్టార్స్ విచ్చేశారు.(ఇదీ చదవండి: Allu Arjun Issue: 3.30 గంటలు.. 20 ప్రశ్నలు)టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి(Chiranjeevi), నాగార్జునతో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకుర్ (Mrunal Thakur).. సింధు రిసెప్షన్లో సందడి చేసింది. తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) ఏకంగా ఫ్యామిలీతో పాటు హైదరాబాద్ వచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్లందరితో పాటు ఉపాసన కూడా సింధుని ఆశీర్వదించేందుకు రిసెప్షన్‌కి వచ్చింది.గత ఆదివారం రాత్రి రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో పీవీ సింధు వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. సింధు పెళ్లాడిన వెంకట్ దత్త సాయి (Venkat Datta Sai) బడా వ్యాపారవేత్త కావడం విశేషం.(ఇదీ చదవండి: ముంబైలో చాలామంది హీరోలు కీర్తి ఫోన్ నెంబర్ అడిగారు: వరుణ్ ధావన్)Boss❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥 at #PVSindhuWedding Reception 🥳 @KChiruTweets #MegaStarChiranjeevi Congratulations 💐@Pvsindhu1 pic.twitter.com/Vobmc1K8l1— Team Chiru Vijayawada (@SuryaKonidela) December 24, 2024#akkineninagarjuna at #pvsindhu wedding reception #nagarjuna #PVSindhuWedding pic.twitter.com/tTVQc3h6vs— Cinema Factory (@Cinema__Factory) December 24, 2024#MrunalThakur with #PVSindhu and #VenkatDatta at their wedding reception 💙 pic.twitter.com/vqh005nHlF— y. (@yaaro__oruvan) December 24, 2024AK Family ❤️#Ajith | #Ajithkumar | #AK | #VidaaMuyarchi | #GoodBadUgly | #PVSindhu pic.twitter.com/1i5hvSUWC2— vanakkam world (@VanakkamWorld) December 24, 2024 -
కాళిదాస్ వెడ్డింగ్ రిసెప్షన్.. సినీ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మల గ్రాండ్ రిసెప్షన్.. హాజరైన చిరంజీవి, నాగార్జున(ఫొటోలు)
-
డ్రీమ్ వెడ్డింగ్: భారతీయ దుస్తులతో అమెరికాలో ఘనంగా, ఫోటోలు వైరల్
నేటి తరానికి పెళ్లంటే ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట. అత్యంత విలాసవంతంగా తమ పెళ్లి జరగాలి అనేది ఒక డ్రీమ్. ఎంత ఖర్చైనా సరే మెహిందీ, సంగీత్‌లు, బారాత్‌లు, ఖరీదైన డిజైనర్ దుస్తులు, డైమండ్ నగలు, వంద రకాల వంటలు ఉండాల్సిందే. వరుడు, మురారి సినిమాల్లో లాగా అంగరంగ వైభంగా తమ పెళ్లి జరగాలని ముందునుంచే కలలు కంటారు. ఈ క్రమంలో భారత సంతతికి చెందిన కాలిఫోర్నియా వధువు సినిమా తరహాలోనే పెళ్లి చేసుకుంది. ఈ జీవితకాల వేడుక చాలా స్పెషల్‌గా ఉండాలని ప్లాన్ చేసుకుని మరీ ప్రియుడిని పెళ్లాడింది. నెట్టింట సందడి చేస్తున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన నితాషా పటేల్ అచ్చం బాలీవుడ్ పెళ్లి సందడిలా తన పెళ్లిని జరిపించుకుంది. అంతేకాదు తన గ్రాండ్ వెడ్డింగ్ కోసం డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన ప్రత్యేకమైన దుస్తులకోసం ఇండియాకు వచ్చింది. నితాషా పటేల్, కృష్ణ గగ్లానీ ఇద్దరు ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్నారు. ప్రొఫైల్‌తో నితాషా కాలిఫోర్నియాకు బదులుగా ఆమె తన బేస్ లొకేషన్ లండన్ అని రాయడంతో తొలుత ఇద్దరి మధ్య కొంత అపార్థాలకు దారి తీసింది. కానీ అన్నీ సర్దుబాటు చేసుకుని నాలుగు నెలలపాటు కాల్స్, మెసేజెస్ ద్వారా మాట్లాడుకున్నారు. ఆ తరువాత లండన్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. అనంతరం కాలిఫోర్నియాకు వచ్చిన కృష్ణ రెండు నెలలు అక్కడే ఉన్నాడు. ఇలా ఒక ఏడాది డేటింగ్ తర్వాత, కృష్ణ నితాషాకు ప్రపోజ్ చేశాడు. చివరికి పెళ్లి ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు.నితాషా పటేల్, కృష్ణ గగ్లానీ తన పెళ్లికి హల్దీ, మెహందీ వేడుకలు ఘనంగా ఉండాలని భావించారు. ముఖ్యంగా నితాషా తన వివాహ ఈవెంట్లకు బాలీవుడ్ టచ్ ఉండాలని కోరుకుంది. నితాషా, తన తల్లితో కలిసి, ఇండియాలోని ముంబైలో ఉనన ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రా స్టోర్‌ని సందర్శించి, తన డ్రెసెస్ సెలెక్ట్ చేసుకుంది. పెళ్లిలో ఐవరీ హ్యూడ్ త్రీ పీస్ పలాజో సెట్లో, డైమండ్ హె లేయర్డ్ డైమండ్ నెక్లెస్, చెవిపోగులు , బ్రాస్లెట్తో సింపుల్ బ్యూటీగా మెరిసింది. మరోవైపు, వరుడు కృష్ణ తన వధువును క్రీమ్-హ్యూడ్ కుర్తా సెట్,రోలెక్స్ వాచ్, కార్టియర్ రింగ్‌తో కొత్త పెళ్లికళతో ఆకట్టుకున్నాడు.నితాషా, కృష్ణ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్గ్రాండ్ వెడ్డింగ్ తరువాత రిసెప్షన్‌ను కూడా అంతే గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఐవరీ కలర్ నెక్లైన్ సీక్విన్ లెహంగా, షీర్ సీక్విన్ దుపట్టాతోపాటు డైమండ్ డైమండ్ నెక్లెస్‌తో హైలైట్‌గా నిలిచింది వధువు నితాషా. ఇక వరుడు కృష్ణ తెల్లటి చొక్కా, సిల్క్ బౌటీ,మోనోగ్రామ్ కఫ్లింక్ల, బ్లాక్ టక్సేడోలో అందంగా కనిపించాడు. -
అప్యాయంగా పలకరించుకున్న మెగాస్టార్- బాలయ్య.. వీడియో వైరల్!
ఓకే వేదికపై మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ప్రముఖ టాలీవుడ్ రచయిత కుమారుడి వివాహ రిసెప్షన్లో కనిపించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఈనెల 22న ప్రముఖ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి కుమారుడి వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో ఈనెల 24న నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్లో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య సందడి చేశారు. చాలా రోజుల తర్వాత ఇద్దరు కలిసి ఓకే ఫంక్షన్లో కలిశారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే చిరు ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరోవైపు బాలకృష్ణ ఎన్బీకే 109 చిత్రంతో బిజీగా ఉన్నారు. Chiru 🤝Balayya @KChiruTweets | #NandamuriBalakrishna pic.twitter.com/0Kz6jLN4cr— Whynot Cinemas (@whynotcinemass) August 24, 2024 -
అనంత్ - రాధిక రిసెప్షన్: జిగేలుమన్న సెలబ్రిటీలు (ఫోటోలు)
-
Sonakshi-Zaheer Wedding: సోనాక్షి - ఇక్బాల్ సింపుల్ రిసెప్షన్: సెలబ్రిటీల జబర్దస్త్ సందడి (ఫోటోలు)
-
వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రిసెప్షన్ (ఫొటోలు)
-
Shankar Daughter Reception Photos: శంకర్ కుమార్తె రిసెప్షన్ హైలైట్స్.. దిల్‌రాజు, సిద్దార్థ్, బేబమ్మ సహా ఎందరో.. (ఫోటోలు)
-
Vasanthi Krishnan: బిగ్‌బాస్ బ్యూటీ వాసంతి రిసెప్షన్ పిక్స్ (ఫోటోలు)
-
వీడియో: యంగ్ హీరో ఆశిష్ రిసెప్షన్లో విజయ్-రష్మిక
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ రెడ్డి.. కొన్నిరోజుల ముందు పెళ్లి చేసుకున్నాడు. అద్వైత రెడ్డి అనే అమ్మాయితో ఏడడుగులు వేశారు. జైపూర్‌లో జరిగిన వివాహానికి పలువురు హాజరయ్యారు. తాజాగా శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇందులో చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) హైదరాబాద్‌లోని మాదాపూర్ ఎన్ కన్వెక్షన్‌లో రిసెప్షన్ జరగ్గా.. నాగార్జున, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు హాజరయ్యారు. అలానే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా క్లాస్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. విజయ్ వచ్చిన కాసేపటికి రష్మిక కూడా ఈ వేడుకకు రావడం విశేషం. ప్రస్తుతం వీళ్లిద్దరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే విజయ్ ప్రస్తుతం 'ఫ్యామిలీ స్టార్' సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ 5న ఇది రిలీజ్ కానుంది. దీనికి దిల్ రాజు నిర్మాత. మరోవైపు రష్మిక.. ప్రస్తుతం 'పుష్ప 2'తో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. తాజాగా ఒకేపెళ్లికి వీళ్లిద్దరూ హాజరయ్యారు. కాకపోతే విడివిడిగానే వచ్చారండోయ్. (ఇదీ చదవండి: ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్) Srivalli aka the Ravishing Actress @iamRashmika at hero Ashish wedding reception #RashmikaMandanna #Rashmika #Pushpa2TheRule #DilRaju pic.twitter.com/3LBUbGFCNM — Sai Satish (@PROSaiSatish) February 23, 2024 Brides fan moment🥹💗🤩#dilrajusonreception#VDK #VijayDeverakonda #VijayDevarakonda #rowdy pic.twitter.com/fPt7cRQwTt — SRAVS💛💥 (@happy_souull) February 24, 2024 -
టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి.. హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడి పెళ్లి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈనెల 14న రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌లో టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి వేడుకకు పలువురు టాలీవుడ్ సినీతారలు కూడా హాజరయ్యారు. ఏపీకి చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డిని ఆయన పెళ్లాడారు. అయితే తాజాగా ఈ జంట తమ రిసెప్షన్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్ సెంటర్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈనెల 23న గ్రాండ్ రిసెప్షన్ వేడుక జరగనుంది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. దిల్ రాజు తమ్ముడి కుమారుడైన ఆశిష్ రెడ్డి గతేడాది డిసెంబర్లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. టాలీవుడ్లో రౌడీ బాయ్స్ అనే చిత్రం ద్వారా ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. 2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆశిష్ రెడ్డి ప్రస్తుతం సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నారు. -
వైభవంగా స్టార్ హీరో కుమార్తె రిసెప్షన్, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
స్టార్ హీరో కుమార్తె పెళ్లి రిసెప్షన్: బీటౌన్ స్టార్లు, క్రికెటర్ల సందడి
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ కుమార్తె ఇరా ఖాన్, ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరే పెళ్లి సందడి గత వారం రోజులుగా ఒకటే సందడి చేస్తోంది. వీరి ప్రీ వెడ్డింగ్వేడుకలు, బారాత్, రిజిస్టర్ మ్యేరేజ్, ఆతరువాత ఉంగరాలు మార్చుకుని ఇలా రెండు రకాలుగా చేసుకున్న పెళ్లి వార్తలు, ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో సదడి చేస్తున్నాయి. మాపెళ్లి మా ఇష్టం: ముఖ్యంగా ఎలాంటి హంగామా లేకుండా జాగింగ్ చేసుకుంటూ మండపానికి వచ్చిన వరుడు నూపుర్, పట్టుచీరలు, నగల హడావిడి లేకుండా పెళ్లికుమార్తె ఇర్ఖాన్ చాలా ప్రత్యేకంగా నిలిచారు. సోషల్ మీడియా ట్రోలింగ్స్‌ను పట్టించుకోకుండా తమదైన శైలిలో, తమకు నచ్చినట్టు పెళ్లి చేసుకునే తమ ప్రత్యేకతను చాటుకున్నారు. దీంతో ఈ జంటలు పలువురు శుభాకాంక్షలు అందించారు. Hassan sisters gives respect to legendary actor Dharmendra at Aamir Khan's daughter Ira Khan and Nupur Shikhare's wedding reception 😍#ShrutiHaasan #Dharmendra #AamirKhan #IraKhan #Celebrities #celebrity #IraKhanWedding #NupurShikhare #Bollywood #CelebrityClicks pic.twitter.com/EmFIvfZZh3 — sdn (@sdn7_) January 13, 2024 పెళ్లి తరువాత జైపూర్, ముంబై వేదికగా ఇచ్చని రిసెప్షన్ వేడుకు కూడా టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారాయి. జైపూర్ వెళ్ల లేని వారు, ముంబైలో, ముంబైకి రావడం వీలు కాని వారు జైపూర్‌లో ఈ రిసెప్షన్‌కు హాజరైన పలువురు రాజకీయ సినీ ప్రముఖులు నూతన వధూవరులను ఆశీర్వించారు. తాజాగా (జనవరి 13న) ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ)లో వచ్చిన విందుకు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రీటీలు, క్రీడారంగ ప్రముఖులతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కూడా హాజరు కావడం విశేషం. Maharashtra CM Eknath Shinde attends Aamir Khan's daughter Ira Khan and Nupur Shikhare's wedding reception 😍#EknathShinde #Maharashtra #AamirKhan #IraKhan #Celebrities #celebrity #IraKhanWedding #NupurShikhare #Bollywood #CelebrityClicks pic.twitter.com/OvcFQfVREK — sdn (@sdn7_) January 13, 2024 ఇంకా బాలీవుడ్లో ఖాన్ త్రయంగా పేరొందిన షారుఖ్, సల్మాన్ ఇద్దరూ అమీర్‌ఖాన్‌తో కలిసి సందడి చేశారు. ఇంకా అలనాటి, నేటి మేటి నటులు అందరూ ఈ వేడుకకు విచ్చేసి ఇరా, నూపుర్ జంటకు అభినందనలు తెలిపారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కూడా ఈ ఈవెంట్‌కు హాజరైనారు. ఇంకా స్టార్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఆర్ రెహ్మాన్ మరింత ఆకర్షణగా నిలిచారు. -
Maanas-Srija Reception: గ్రాండ్‌గా బిగ్‌బాస్ కంటెస్టెంట్ మానస్ రిసెప్షన్ (ఫోటోలు)
-
ఎయిర్‌పోర్ట్‌లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి.. వీడియో వైరల్!
ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో జరిగిన వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ, నితిన్, అల్లు అర్జున్, అత్యంత సన్నిహితులు, స్నేహితులు కూడా హాజరయ్యారు. అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఇటలీలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చిన జంట టాలీవుడ్ ప్రముఖు కోసం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. దీపావళి సందర్భంగా తొలిసారి మెగా కోడలిగా వేడుకలు జరుపుకుంది లావణ్య. తాజాగా మరోసారి రిసెప్షన్ వేడుకల కోసం బయలుదేరారు. డెహ్రాడూన్ వెళ్తూ హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో కనిపించారు. ఎందుకంటే లావణ్య త్రిపాఠి యూపీలోని ఫైజాబాద్‌లో పుట్టినా.. తన బాల్యంలో తల్లిదండ్రులతో కలిసి డెహ్రాడూన్లోనే ఉన్నారు. అక్కడే లావణ్య పేరేంట్స్ ఉన్నారు. లావణ్య తరఫు బంధువుల కోసం మరోసారి రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వీరితో నిహారిక కొణిదెల కూడా డెహ్రాడూన్ వెళ్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #TFNExclusive: The newly wed couple Mega Prince @IAmVarunTej & @Itslavanya along with their family snapped at airport as they’re off to Dehradun for their reception ceremony!! 😍📸#VarunTej #LavanyaTripathi #VarunLav #TeluguFilmNagar pic.twitter.com/s2mQxVG4Ev — Telugu FilmNagar (@telugufilmnagar) November 15, 2023 -
VarunLav Wedding Reception Pics: గ్రాండ్‌గా వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్ (ఫోటోలు)
-
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్.. టాలీవుడ్ స్టార్ హీరోనే యజమాని!
మెగా ఇంట పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. ఇటలీలోని టుస్కానీలో జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే రామ్ చరణ్- ఉపాసన, అల్లు అర్జున్ దంపతులు ముందుగానే ఇటలీ బయలుదేరి వెళ్లారు. ఇటీవలే షాపింగ్ పూర్తి చేసుకున్న కాబోయే వధూవరులు సైతం ఇటలీ ఫ్లైటెక్కారు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా అక్టోబర్ 30న కాక్టేల్ పార్టీతో పెళ్లి వేడుకలు మొదలు పెట్టి 31న హల్దీ, మెహందీ నిర్వహించనున్నారు. నవంబర్ 1న పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. (ఇది చదవండి: 'అంతా నా వల్లే అంటున్నారు'.. డైరెక్టర్ పోస్ట్ వైరల్!) అయితే ఇటలీ పెళ్లి వేడుక తర్వాత హైదరాబాద్‌లో ఇండస్ట్రీలోని ప్రముఖులు, సన్నిహితులకు గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేశారు. నవంబర్ ఐదో తేదీన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో తర్వాత రిసెప్షన్ వేడుక జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫంక్షన్లో దాదాపు 3 వేలకు పైగా అతిథులు పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే గ్రాండ్ రిసెప్షన్ జరగనున్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోకు చెందినదిగా తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున ఈ సెంటర్‌కు యజమానిగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త నల్లా ప్రీతమ్ రెడ్డితో కలిసి ఆయన దీన్ని నిర్మించారు. ఈ కన్వెన్షన్ సెంటర్‌కు వీరిద్దరు భాగస్వాములుగా ఉన్నారు. అయితే గతంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై పలు వివాదాలు తలెత్తాయి. (ఇది చదవండి: వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి షెడ్యూల్ ఇదే.. వేడుకలకు ఆమె దూరం) -
గ్రాండ్‌గా బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్సే తమ్ముడి రిసెప్షన్ (ఫోటోలు)
-
పెళ్లి రిసెప్షన్లో వరుడు, స్నేహితుల హల్చల్..
-
Sharwanand Reception: ఘనంగా శర్వానంద్- రక్షితా రెడ్డి రిసెప్షన్ వేడుక (ఫొటోలు)
-
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ -రక్షితారెడ్డి జూన్ 3న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జైపుర్‌లోని లీలా ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సుమారు రెండు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో రామ్‌చరణ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. కాగా, శర్వానంద్ ఫ్యామిలీ రేపు (జూన్ 9న) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనుంది. (ఇదీ చదవండి: ‘చిరు లీక్స్’.. సంగీత్‌లో మెగాస్టార్ స్టెప్పులు) ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శర్వానంద్ కలిశారు. రిసెప్షన్‌కు రావాలని ఆయనకు ఆహ్వానం అందించారు. శర్వానంద్ సతీమణి రక్షితారెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అని తెలిసిందే. ఇకపోతే ఈ హీరో సినిమాల విషయానికి వస్తే.. ‘ఒకే ఒక జీవితం’ విజయం తర్వాత కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో రాశీఖన్నా లీడ్ రోల్లో నటిస్తుంది. (ఇదీ చదవండి: వరుణ్- లావణ్య త్రిపాఠి పెళ్లిపై ఎవరూ స్పందించరేంటి?) -
బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు
సాక్షి, నిర్మల్: పెళ్లి రిసెప్షన్ బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడికక్కడే క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కే) గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుని వివాహం శుక్రవారం బైంసా మండలంలోని కామోల్ గ్రామంలో జరిగింది. శనివారం పార్డి(కే)లో రిసెప్షన్ నిర్వహించారు. వేడుకలో భాగంగా బరాత్‌లో పెళ్లి కుమారుని సమీప బంధువు, మిత్రుడు ముత్యం(19) డ్యాన్స్ చేశాడు. ఈక్రమంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు యువకుడిని లేపి పరిశీలించగా అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో హుటహూటిన వైద్య కోసం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ముత్యం అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని సమాచారం. ఈ యువకుడిది మహారాష్ట్రలోని శివుని గ్రామం. దీంతో మృతదేహాన్ని స్వగ్రామానికే తరలించారు. చదవండి: స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి.. -
పెళ్లైన రెండో రోజే విగతజీవులైన నవ దంపతులు.. రిసెప్షన్‌కు ముందే..
రాయ్‌పూర్: ఈ జంటకు ఆదివారమే పెళ్లైంది. విహవా వేడుక ఘనంగా జరిగింది. మంగళవారం రాత్రి గ్రాండ్‌గా రిసెప్షన్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఏం జరగిందో తెలియదు. రిసెప్షన్‌కు కొన్ని గంటల ముందే నవ దంపతులు తమ ఇంట్లోని గదిలో శవాలుగా కన్పించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని బ్రిజన్‌గర్‌లో ఈ ఘటన జరిగింది. అయితే ఇద్దరి ఒంటిపై కత్తిగాయాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. భార్యభర్తలిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. భర్త తన భార్యను పొడిచి చంపిన తర్వాత, తాను కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పేర్కొన్నారు. ఈ దంపతులు గదిలోకి వెళ్లి తాళం వేసుకొని గొడవపడ్డారని, అరుపులు కేకలు వినిపించాయని కుటంబసభ్యులు చెప్పారు. లోపలికి వెళ్లే పరిస్థితి లేకపోడవంతో కిటీకీలోనుంచి చూస్తే ఇద్దరు రక్తపుమడుగులో కన్పించారని పేర్కొన్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. తీరా చూస్తే ఇద్దరూ అప్పటికే చనిపోయి ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరి మధ్య గొడవ జరిగి భర్తే భార్యను హత్య చేసి, తానూ బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు చెప్పారు. ఇతర కోణాల్లోనూ విచారణ జరుపుతామన్నారు. చదవండి: ఒక్క రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. చివరకు..