శారీ వేసుకో..! | bring a saree | Sakshi
Sakshi News home page

శారీ వేసుకో..!

Published Fri, Sep 4 2015 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM

శారీ వేసుకో..!

శారీ వేసుకో..!

మీరు విన్నది నిజమే! ఈ శారీని కట్టుకోనక్కర్లేదు. కుచ్చిళ్లు పెట్టనక్కర్లేదు. కొంగును సర్దుకోనక్కర్లేదు.


 
మీరు విన్నది నిజమే! ఈ శారీని కట్టుకోనక్కర్లేదు. కుచ్చిళ్లు పెట్టనక్కర్లేదు. కొంగును సర్దుకోనక్కర్లేదు. ఎంచక్కా గౌన్‌లా వేసుకోవచ్చు. బర్త్ డే, మ్యారేజ్ డే, రిసెప్షన్... సాయంకాలం ఏ పార్టీ అయినా సాగరకన్యలా తయారవ్వడానికి ఈ శారీ గౌన్‌ని ఎంచక్కా ధరించవచ్చు. వేడుకలో ఎంచక్కా వెలిగిపోవచ్చు.
 
ఆరుగజాలను అందంగా చుట్టాలంటే నానా తంటాలు పడాలి. అందుకే అమ్మాయిలు ఈ తతంగానికి హడలెత్తి ‘శారీ.. సారీ’ అనేస్తారు. ఇలాంటి అమ్మాయిలు కూడా స్టైల్‌గా కుట్టిన ఈ శారీ గౌన్‌ను తగిలించుకొని, కుందనపు బొమ్మ అని మార్కులు కొట్టేస్తున్నారు.
 
రెడ్ కార్పెట్...
ఫ్యాషన్ షో, అవార్డ్ ఫంక్షన్, ఆడియోలాంచ్... ఈవెనింగ్ పార్టీలు ఏవైనా రెడ్‌కార్పెట్ మీద వయ్యారాలు పోయే ఇటీవలి తారల ఫొటోలు చూడండి. ఓ కొత్త స్టైల్‌లో వహ్ వా అనిపిస్తూ కనిపిస్తున్నారు. ఆ స్టైల్ పేరే శారీ గౌన్. ఈవెనింగ్ గౌన్ నుంచి పుట్టిన ఈ ఐడియా భారతీయ సంప్రదాయతను ఇష్టపడే ప్రతి మగువనూ ఇట్టే కట్టిపడేస్తోంది. అంతేకాదు, పాశ్చాత్యభామలనూ హత్తుకుపోతోంది.
 
 ఎలా ఉంటుందంటే...

 పల్చటి, మెత్తటి  ప్లెయిన్ సిల్క్ లేదా షిపాన్ మెటీరియల్‌తో చీర కుచ్చిళ్లాలా వచ్చేలా పొడవాటి స్కర్ట్, ట్రాన్స్‌పరెంట్, ఎంబ్రాయిడరీ గల పొడవాటి బ్లౌజ్.. ఈ రెంటినీ అటాచ్‌చేస్తూ ఎదమీదనుంచి భుజం మీదుగా పొడవాటి కొంగు... ఇదీ శారీగౌన్ స్పెషల్. పాశ్చాత్యుల వెడ్డింగ్ గౌన్‌కి పల్చటి పవిటను అమర్చితే ఎలా ఉంటుందో ఈ శారీ గౌన్ అలా ఉంటుంది.
 
 ఎంపికకు ముందు...

 బ్లౌజ్ మంచి ఫిటింగ్‌తో ఉండాలి.నడుము భాగాన ఏ మాత్రం వదులు లేకుండా సరైన కొలతలతో డిజైన్ చేయించుకోవాలి. ప్లెయిన్ మెటీరియల్‌తోనే కాదు అభిరుచిని బట్టి ఎంబ్రాయిడరీ, ప్రింట్లు డిజైన్లు గల ఫ్యాబ్రిక్‌ను కూడా ఈ డ్రెస్‌కు ఎంచుకోవచ్చు.
 - ఎన్.ఆర్.
 
నా డిజైన్స్‌కు నా భార్యే స్ఫూర్తి. తను బాస్‌గా ఆఫీస్‌లో, గృహిణిగా ఇంట్లో చాలా పనులను చేస్తుంటుంది. సందర్భానుసారం తన వస్త్రధారణ ఉంటుంది. తను చాలా స్ట్రాంగ్. తనను దృష్టిలో పెట్టుకునే మహిళ మరింత కాన్ఫిడెంట్‌గా ఉండేలా డిజైన్స్ సృష్టిస్తుంటాను. శారీ గౌన్ స్టైల్స్ నాకు ప్రపంచ ప్రఖ్యాత పేరుతెచ్చి పెట్టాయి. అతివను అందంగా చూపించడానికి భారతీయ శారీని మించిన డ్రెస్ లేదు. ఈ కట్టునే మరింత సులువుగా ‘కట్’లోకి మార్చేస్తే.. అని చేసిన ఐడియానే శారీగౌన్.
 - గౌరవ్‌గుప్తా, ఫ్యాషన్ డిజైనర్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement