
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ16 మూవీతో బిజీగా ఉన్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.
ఈనెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఆర్సీ16 సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. చెర్రీ బర్త్ డే స్పెషల్‌గా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. గురువారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్ స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో చెర్రీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా.. ఈ సినిమాను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.
Grit, power, and an untamed spirit from the rural lands ❤️🔥#RC16 TITLE & FIRST LOOK out tomorrow at 9.09 AM 💥💥#RamCharanRevolts
Global Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @IamJagguBhai @divyenndu… pic.twitter.com/ZvwUrN7fNl— Vriddhi Cinemas (@vriddhicinemas) March 26, 2025
Comments
Please login to add a commentAdd a comment