గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ16తో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో చెర్రీ నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన ముద్దుల కూతురు క్లీంకారను ఎత్తుకుని ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ పోస్ట్ చూసిన ఉపాసన కామెంట్ చేసింది. ఫోమో అంటూ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది. మెగా హీరో వరుణ్ తేజ్ సైతం లవ్ సింబల్ పోస్ట్ చేశాడు. కాగా.. ఈ మూవీ షూటింగ్ తొలి షెడ్యూల్ కర్ణాటకలోని మైసూర్‌లో జరుగుతోంది. ఇక్కడ రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనా తొలిసారిగా రామ్ చరణ్‌తో మూవీని తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment