buchibabu
-
అమెరికాలో ప్రకాశం జిల్లా సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
ముండ్లమూరు: అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రకాశం జిల్లా ముండ్లమూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ దొద్దాల బుచ్చిబాబు (40) సముద్రంలో మునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ముండ్లమూరుకు చెందిన దొద్దాల కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మలకు కుమారుడు బుచ్చిబాబు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఇద్దరినీ చదివించారు. కుమారుడు బుచ్చిబాబు ఎనిమిదేళ్లు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు.కంపెనీ ఆదేశాల మేరకు 18 నెలల కిందట భార్య కిరణ్మయితో కలిసి కాలిఫోర్నియా వెళ్లి అక్కడే నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. వీకెండ్ సెలవులు కావడంతో ఆదివారం కుటుంబ సభ్యులతో సరదాగా సముద్ర స్నానానికి వెళ్లారు. అక్కడ ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు కొట్టుకుపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. కుమారుడి మరణవార్త విని తల్లి కోటేశ్వరమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి చేర్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని వేడుకొంటున్నారు. -
తనకు అంత పిచ్చి ఉంటుందనుకోలేదు
‘‘డైరెక్టర్ సుకుమార్‌గారి టీమ్‌లో బుచ్చిబాబు బెస్ట్. తనకు సినిమా అంటే పిచ్చి. ‘రంగస్థలం’ కథని సుకుమార్‌గారు నాకు నలభై నిమిషాలు చె΄్పారు. ఆ తర్వాత ప్రతి రోజూ నాకు రెండేసి గంటలు నెరేష¯Œ ఇచ్చింది మాత్రం బుచ్చిబాబునే. తనకు సినిమా అంటే అంత పిచ్చి ఉంటుందనుకోలేదు’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా బుధవారం ్రపారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బోనీ కపూర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో చిరంజీవి క్లాప్ కొట్టారు. డైరెక్టర్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ను యూనిట్‌కి అందించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ ‘‘నేను, జాన్వీ కలిసి ‘జగదేకవీరుడు–అతిలోక సుందరి’ లాంటి మూవీ చేయాలని చాలామంది అనుకున్నారు. మా కాంబినేషన్ ‘ఆర్సీ 16’తో నిజం కావడం హ్యాపీ’’ అన్నారు. ‘‘నాపై నమ్మకంతో రామ్‌చరణ్‌గారు ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటాను’’ అన్నారు బుచ్చిబాబు సానా. ‘‘బుచ్చిబాబు ఏదైనా పెద్దగా ఆలోచిస్తాడు. తన కథపై తనకు ఉన్న నమ్మకం అలా ఉంటుంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్. ‘‘ఈ సినిమాకి ఇప్పటికే మూడు ట్యూ¯Œ ్స పూర్తి చేశాం’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ‘‘నేను ఎంతగానో అభిమానించే ప్రముఖులందరితో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం నా అదృష్టం’’ అన్నారు జాన్వీ కపూర్. ‘‘బుచ్చిబాబు ఈ సినిమాతో తప్పకుండా మరో హిట్ కొడతాడు’’ అన్నారు నిర్మాత నవీన్ ఎర్నేని. ఈ ్రపారంభోత్సవంలో నిర్మాతలు వై. రవిశంకర్, ‘దిల్’ రాజు, శిరీష్, సాహూ గారపాటి, రామ్ ఆచంట, నాగవంశీ, ఎమ్మెల్యే రవి గొట్టిపాటి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పకుడు: సుకుమార్, కెమెరా: రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: వి.వై. ప్రవీణ్ కుమార్. -
రామ్ చరణ్ కొత్త సినిమా కోసం ఎన్టీఆర్ టైటిల్?
రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్. చాలారోజుల నుంచి అప్డేట్, అప్డేట్ అని కలవరిస్తున్న వాళ్ల కోసమా అన్నట్లు RC16 లాంచింగ్ డేట్, టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక్కడివరకు బాగానే ఉంది. గతంలో ఎన్టీఆర్ కోసం అనుకున్న టైటిల్‌ని ఇప్పుడు చరణ్ మూవీ కోసం ఖరారు చేసుకున్నారనే విషయం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ ప్రశాంత్.. వాళ్లకు రూ.లక్ష సాయం) 'ఆర్ఆర్ఆర్'లో కలిసి నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్.. ప్రస్తుతం ఎవరికి వాళ్లు బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ 'దేవర'.. లెక్క ప్రకారం ఏప్రిల్ 5న రావాల్సింది. కానీ అక్టోబరుకి వాయిదా వేశారు. మరోవైపు చరణ్ పుట్టినరోజున 'గేమ్ ఛేంజర్' మూవీ నుంచి అప్డేట్ వస్తుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాలి. అలానే ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ కూడా తెగ గింజుకుంటున్నారు. 'గేమ్ ఛేంజర్' తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ చేయాలి. చాన్నాళ్ల క్రితమే ఇది ఖరారైనప్పటికీ అధికారికంగా మాత్రం ఈ నెల 20న ప్రకటిస్తారని తెలుస్తోంది. అదే రోజుల 'పెద్ది' అనే టైటిల్‌తో పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. అయితే ఈ టైటిల్‌ని గతంలో ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు అనుకున్నాడని అప్పట్లో రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు దాన్నే చరణ్ కోసం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ టైటిల్ విషయంలో మెగా ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావడం లేదు! కాస్త ఓల్డ్ స్టైల్లో ఉందని అంటున్నారు. (ఇదీ చదవండి: 5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా) -
రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది
రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చరణ్- శంకర్ కాంబినేషన్ లో ' గేమ్ ఛేంజర్' మూవీ చాన్నాళ్లుగా షూటింగ్ కొనసాగుతుంది. ఈ చిత్రం గురించి కూడా పెద్దగా అప్డేట్స్ రావడం లేదు. దీంతో ఫ్యాన్స్ కూడా కొంతమేరకు నిరాశ చెందుతున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా (RC16) మూవీ గురించి కీలక సమాచారాన్ని చిత్ర నిర్మాత సంస్ధ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఇచ్చారు. రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ వచ్చే నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బిగ్ ప్రాజెక్ట్‌కు కెమెరా మెన్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. సౌత్ ఇండియాలో క్రేజీ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్న రత్నవేలును ఎంపిక చేశారు. నేడు ఫిబ్రవరి 24న ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మైత్రీ సంస్థ ప్రకటించింది. రత్నవేలు ఇప్పటి వరకు రంగస్థలం,సైరా నరసింహా రెడ్డి,భారతీయుడు 2,ఖైదీ నం. 150, 1: నేనొక్కడినే వంటి చిత్రాలతో పాటు దేవర ప్రాజెక్ట్‌లో ఆయన భాగమయ్యారు. ఇదే సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, జాన్వీ కపూర్ నటిస్తున్నారని టాక్ ఉంది. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్లో ఉండబోతున్న సంగతి తెలిసిందే. దీనికోసం బుచ్చిబాబు అండ్ టీం ఉత్తరాంధ్ర యాస బాగా మాట్లాడగలిగే నటీనటుల కోసం ఆడిషన్స్ జరిగాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఐతే జోరుగా సాగుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ మార్చి రెండో వారంలో ప్రారంభం కానుందని సమాచారం. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే ఉండటం వల్ల ఆయన అభిమానులకు కానుకగా ఫస్ట్ లుక్‌ను పరిచయం చేయాలని టీమ్ ప్లాన్ ఉంది. Team #RC16 welcomes the master lensman 🎥 Happy Birthday to the acclaimed cinematographer and the man who delivers stunning visuals, @RathnaveluDop ❤️🔥#RamCharanRevolts Global Star @AlwaysRamCharan @BuchiBabuSana @arrahman @artkolla @vriddhicinemas @SukumarWritings pic.twitter.com/TFXiJ0Te3W — Mythri Movie Makers (@MythriOfficial) February 24, 2024 -
టాలీవుడ్లో మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన శ్రీదేవి కూతురు జాన్వీ
దివంగత నటి, అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్‌లో NTR30 అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా సెట్స్‌లో ఉండగానే జాన్వీ కపూర్‌కు మరో క్రేజీ ఆఫర్ దక్కిందట. ఉప్పెన సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు- రామ్‌చరణ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా జాన్వీ కపూర్‌ను సంప్రదించగా, ఆమె వెంటనే ఓకే చెప్పిందట. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఇందులో మరో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్‌ను తీసుకోనున్నట్లు సమాచారం. -
సెప్టెంబరులో స్టార్ట్.. చిట్టిబాబు పాత్రని మించి రామ్‌చరణ్ క్యారెక్టరైజేషన్
హీరో రామ్‌చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబరులో స్టార్ట్ కానుంది. ‘‘రంగస్థలం’ సినిమాలో నేను చేసిన చిట్టిబాబు పాత్రని మించి ఈ సినిమాలో నా క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబరులో స్టార్ట్ చేస్తాం’’ అంటూ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రామ్‌చరణ్ అన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మృణాళ్ ఠాకూర్ పేరు ప్రచారంలోకి వచ్చింది. కాగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాతో రామ్‌చరణ్ బిజీగా ఉన్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. -
బుచ్చిబాబు, పిళ్లై ఏం చెప్పారు?.. కవిత విచారణపై టెన్షన్!
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత గురువారం మరోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు వెళ్లనున్నారు. లిక్కర్ స్కాంలో కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. దీంతో, రెండోసారి కవిత విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఫిబ్రవరి 11న ఈడీ అధికారులు కవితను 9 గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. కాగా.. లిక్కర్ స్కాం కేసులో బుచ్చిబాబును బుధవారం ఈడీ ప్రశ్నిస్తోంది. ఈడీ అధికారులు అరుణ్ పిళ్లైతో కలిపి బుచ్చిబాబును ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, సమావేశాలు, ముడుపులతో ఈడీ ఆరా తీస్తోంది. ఇక, కన్ఫ్రాంటేషన్ పద్దతిలో ప్రశ్నించేందుకు పిళ్లై కస్టడీని పొడిగించాలని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఇదిలా ఉండగా.. రేపు కవితను ఈడీ విచారించనున్న నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పలువురు మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. మరోవైపు.. ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన విషయంలో ఈడీ చట్ట విరుద్దంగా వ్యవహరించిందన్నారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదన్నారు. కొంత మంది వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో తనను ఇరికించినట్టు ఆరోపణలు చేశారు. ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుందన్నారు. చందన్ రెడ్డి అనే సాక్షిని కొట్టడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కోరారు. తనపై ఎలాంటి బలవంతపు(అరెస్ట్ వంటి) చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఈనెల 24న విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. -
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ లభించింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బుచ్చిబాబుకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పూచికత్తు, పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రామచంద్ర పిళ్లైకి చార్టెడ్ అకౌంటెంట్‌గా వ్యవహరించాడు గోరంట్ల బుచ్చిబాబు. ఈ కేసులో రామచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ పాలసీలో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించినట్లు నిర్ధారణ కాగా.. గతంలోనూ సీబీఐ కూడా అతని ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో, తద్వారా హైదరాబాద్‌కు చెందిన హోల్‌సేల్, రిటైల్ లైసెన్సీలకు లాభం చేకూర్చడంలో పాత్ర పోషించినందుకు గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేసింది సీబీఐ. మద్యం విధానం రూపకల్పనలో హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు భారీగా లబ్ధి చేకూరే విధంగా బుచ్చిబాబు వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. చదవండి: ఉప్పు-నిప్పు: ఔను..! వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!! సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్ల రూపాయల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి చేతులు మారడంలో బుచ్చిబాబు కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. గోరంట్ల బుచ్చిబాబు గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీఏగా పనిచేసినట్లు ఆ మధ్య కొన్నికథనాలు కూడా తెరపైకి వచ్చాయి. -
బుచ్చిబాబు మద్యం విధానం కుట్రలో భాగస్వామి: సీబీఐ
-
ఆడిటర్ బుచ్చిబాబుకు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు సీబీఐ కస్టడీ ముగిసింది. దీంతో బుచ్చిబాబును సీబీఐ అధికారులు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. బుచ్చిబాబు మద్యం విధానం కుట్రలో భాగస్వామి అని సీబీఐ కోర్టుకు తెలిపింది. సహ నిందితులతో కలిసి అనేక సమావేశాలకు హాజరయ్యారని, చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని తెలిపింది. అనంతరం బుచ్చిబాబుకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాగా ఫిబ్రవరి 8న గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేయగా మూడు రోజులు సీబీఐ కస్టడీకి అనుమతించింది కోర్టు. నేడు సీబీఐ కస్టడీ ముగియడంతో ఈనెల 25 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. -
అఫీషియల్: 'కొన్నిసార్లు తిరుగుబాటు కూడా అవసరమే'.. రామ్ చరణ్ లేటెస్ట్ అప్ డేట్
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తదుపరి చిత్రంపై లేటేస్ట్ అప్ డేట్ వచ్చేసింది. దీనిపై అభిమానుల నిరీక్షణకు తెరపడింది. వారి సందేహాలకు పుల్‌స్టాప్ పెడుతూ ఆర్సీ16 మూవీ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు మేకర్స్. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్ ఈ సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేస్తూ.. 'కొన్నిసార్లు తిరుగుబాటు కూడా అవసరమవుతుంది' అంటూ హీరో రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబును ట్యాగ్ చేసింది. దీనిపై హీరో రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఉన్నట్లు రీట్వీట్ చేశారు. బుచ్చిబాబు టీమ్‌తో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఉన్నానని రామ్ చరణ్ వెల్లడించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు వెల్లడించింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం చెర్రీ శంకర్ డైరెక్షన్లో ఆర్సీ15 షూటింగ్లో విదేశాల్లో బిజీగా ఉన్నారు. గతంలో 'ఆర్సీ 16' గౌతమ్ తిన్ననూరితో ప్రకటించారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రం ఉంటుందని టీమ్ ప్రకటించింది. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. మొదట జూనియర్ ఎన్టీఆర్‌కు ఆఫర్?: ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే.. దర్శకుడు బుచ్చి బాబు మొదట ఈ కథను జూనియర్ ఎన్టీఆర్‌తో చేయాలనుకున్నట్లు సమాచారం. అయితే కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలకు డేట్స్ బ్లాక్ కావడంతో కుదరలేదని తెలుస్తోంది. Sometimes, Revolt becomes a necessity ❤️🔥 Mega Power Star @AlwaysRamCharan & Sensational director @BuchiBabuSana team up for a powerful subject and a Pan India entertainer 💥 #RamCharanRevolts 🔥 Produced by @vriddhicinemas & @SukumarWritings Presented by @MythriOfficial pic.twitter.com/SisvkrbJo8 — Mythri Movie Makers (@MythriOfficial) November 28, 2022 Excited about this !! Looking forward to working with @BuchiBabuSana & the entire team.@vriddhicinemas @SukumarWritings #VenkataSatishKilaru @MythriOfficial pic.twitter.com/hXuI5phc7L — Ram Charan (@AlwaysRamCharan) November 28, 2022 -
లక్ అంటే ఈ డైరెక్టర్లదే.. అప్పుడే స్టార్ హీరోలతో సినిమాలు!
స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఏ దర్శకుడు అయినా అనుకుంటారు. ఈ సువర్ణావకాశం కోసం కొందరు దర్శకులు చాలాకాలం ఎదురుచూస్తుంటారు. కానీ కొందరు డైరెక్టర్లకు మాత్రం తక్కువ సమయంలోనే స్టార్ హీరోకి ‘స్టార్ట్ యాక్షన్’ చెప్పే చాన్స్ వస్తుంది. ఇప్పుడలాంటి కాంబినేషన్లు కొన్ని ఉన్నాయి. ‘స్టార్ హీరో’లు ‘యంగ్ కెప్టెన్’ (డైరెక్టర్లను కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు)ల కాంబినేషన్లో సెట్ అయిన చిత్రాలపై ఓ లుక్కేద్దాం. సిల్వర్ స్క్రీన్‌పై రజనీకాంత్ క్రేజ్ ఏంటో ప్రేక్షకులకు తెలుసు. ఇంతటి స్టార్డమ్ ఉన్న హీరోతో సినిమా చేయాలని ఏ దర్శకుడు అయినా ఆశపడుతుంటారు. ఈ చాన్స్ కనీసం మూడు సినిమాలను కూడా తెరకెక్కించని ఓ దర్శకుడికి లభిస్తే అది కాస్త ఆశ్చర్యమే. తమిళ చిత్రం ‘డాన్’తో దర్శకుడిగా పరిచయమైన సిబీ చక్రవర్తికి చాన్స్ ఇవ్వనున్నారు రజనీకాంత్. ఆల్రెడీ ఈ సూపర్ స్టార్‌ను కలిసి సీబీ చక్రవర్తి ఓ లైన్ వినిపించారు. పూర్తి కథను రెడీ చేసి, నరేషన్ ఇస్తే సినిమా చేస్తానని సీబీ చక్రవర్తికి మాట ఇచ్చారట రజనీ. ప్రస్తుతం రజనీకాంత్ ‘జైలర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రదర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా యువదర్శకుడే కావడం విశేషం. నెల్సన్ కెరీర్లో ‘జైలర్’ చిత్రం నాలుగోది. చిరంజీవి స్టార్డమ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ మెగాస్టార్ రీసెంట్గా యువదర్శకుడు వెంకీ కుడుములకు అవకాశం ఇచ్చారు. ఆల్రెడీ అధికారిక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే ‘ఛలో’, ‘భీష్మ’ వంటి చిత్రాలతో మంచి హిట్స్ సాధించిన జోష్‌లో వెంకీ కుడుముల ఉన్నా రన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, ‘బోళా శంకర్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల షూటింగ్స్ ఓ కొలిక్కి వచ్చాక వెంకీ కుడుములతో చేసే సినిమా ఆరంభమయ్యే అవకాశం ఉంది. ∙‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు హీరో ప్రభాస్. ఈ స్టార్ హీరో 25వ సినిమాకి దర్శకత్వం వహించే చాన్స్‌ను దక్కించుకున్నారు సందీప్‌రెడ్డి వంగా. ‘స్పిరిట్’ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తో దర్శకుడిగా హిట్ సాధించిన సందీప్ రెడ్డి వంగా ఇదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్‌తో ‘కబీర్ సింగ్’గా తీసి, అక్కడా హిట్ సాధించారు. ఆ తర్వాత ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చాన్స్‌ను దక్కించుకున్నారు. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్నారు సందీప్. కెరీర్లో పాతిక సినిమాలు చేసి, అగ్రహీరోల జాబితాలో కొనసాగుతున్నారు హీరో ఎన్టీఆర్. అయితే జస్ట్ ఒకే ఒక సినిమా ‘ఉప్పెన’తో ఇండస్ట్రీ తనవైపు చూసేలా చేసుకున్న బుచ్చిబాబు సనకి అవకాశం ఇచ్చారు. రెండో సినిమానే యంగ్ టైగర్‌తో చేసే అవకాశం బుచ్చిబాబుకి లభించడం విశేషం. ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్ ఓ సినిమా కమిట్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ నవంబరులో ప్రారంభం అవుతుంది. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎనీ్టఆర్. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ఎన్టీఆర్–బుచ్చిబాబు సినిమా సెట్స్‌కి పైకి వెళుతుందట. ∙ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఖాతాలో ఓ భారీ సినిమానే ఉంది. ఈ సినిమాకి శంకర్ దర్శకుడు. ఈ చిత్రం తర్వాత చరణ్ నెక్ట్స్ మూవీ తెలుగులో ‘మళ్ళీ రావా’, ‘జెర్సీ’ వంటి హిట్ సినిమాలను తీసిన యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో తెరకెక్కాల్సి ఉంది. అయితే ఈ సినిమా కంటే ముందు రామ్‌చరణ్ మరో యువ దర్శకుడితో సినిమా చేయనున్నారనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. కన్నడంలో ‘మఫ్తీ’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై సూపర్ హిట్ సాధించిన నార్తన్యే ఈ దర్శకుడు. రామ్‌చరణ్ కోసం నార్తన్ ఓ కథను రెడీ చేశారట. ఇది చరణ్‌కు కూడా నచ్చిందట. దీంతో శంకర్ ప్రాజెక్ట్ తర్వాత రామ్‌చరణ్ హీరోగా చేయబోయేది నార్తన్ దర్శకత్వంలోనే అనే టాక్ వినిపిస్తోంది. అంతే కాదు.. కోలీవుడ్ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా రామ్‌చరణ్‌కు ఓ కథ వినిపించారు. అయితే ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. దర్శకుడిగా రెండు సినిమాలే (తెలుగులో ‘తొలిప్రేమ’, ‘రంగ్ దే’) చేసిన వెంకీ అట్లూరి ప్రస్తుతం ధనుష్‌తో ‘సార్’ (తమిళంలో ‘వాత్తి’) అనే సినిమా చేస్తున్నారు. అలాగే తమిళంలో 2021లో వచి్చన ‘రాకీ’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు అరుణ్ మాథేశ్వరన్. ఆ తర్వాత ‘సాని కాయిదమ్’ (తెలుగులో ‘చిన్ని’) అనే సినిమా చేశారు. ప్రస్తుతం మూడో సినిమానే ధనుష్‌తో చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు అరుణ్. వీరిద్దరి కాంబినేషన్లో ‘కెప్టెన్ మిల్లర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. వీరే కాదు.. తొలి చిత్రం ‘జాతిరత్నాలు’తో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన కేవీ అనుదీప్ ఇటీవల విక్టరీ వెంకటేశ్‌కు, ‘రన్ రాజా రన్’, ‘సాహో’ చిత్రాల ఫేమ్ సుజిత్‌కి పవన్ కల్యాణ్‌తో సినిమా చేసే అవకాశం దక్కిందని టాక్. ఇంకా యువ దర్శకులతో సినిమాలు చేసే టాప్ హీరోల జాబితా పెరిగే అవకాశం ఉంది. -
ఎన్టీఆర్ 31వ మూవీ డైరెక్టర్ అతనేనా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేయబోతున్నాడు. ఆయన బర్త్‌డే నాడు అంటే మే 20న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రానుంది. అదే రోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మరో సర్ప్రైజ్ కూడా ఉండబోతుదంట. బర్త్ డే కానుకగా కొరటాల సినిమాతో పాటు మరో సినిమా గురించి కూడా అప్ డేట్స్ రానుందట. ఆ మూవీ ఎవరిదీ? కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్దా లేక లేక ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుదా అనేది ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సస్పెన్స్‌గా మారింది. ఎన్టీఆర్ 31వ సినిమా డైరెక్టర్ ఎవరనేదానిపై ఇప్పుడు యంగ్ టైగర్ ఫ్యాన్స్ జోరుగా డిస్కస్ చేస్తున్నారు. టైగర్ రీసెంట్ గా కేజీయఫ్ 2 డైరెక్టర్ తో కనిపించాడు.ఆయనే 31 వ సినిమా దర్శకుడు అనేది ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. (చదవండి: ‘బాలీవుడ్’ వ్యాఖ్యలపై మహేశ్ బాబు వివరణ) అయితే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కూడా చాలా కాలంగా తారక్ తో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నాడు.ఈ దర్శకుడి తోనే టైగర్ తన 31వ చిత్రం చేస్తున్నాడనే ప్రచారం కూడా ఉంది.ఉప్పెన తర్వాత కేవలం తారక్ ను దృష్టిలో పెట్టుకుని స్పోర్ట్స్ జానర్ లో బుచ్చిబాబు ఒక స్టోరీ రాసిపెట్టుకున్నాడు. కేవలం తన కోసమే చాలా కాలంగా బుచ్చిబాబు వెయిట్ చేస్తుండటంతో 31వ సినిమా తారక్ తనతోనే చేస్తున్నాడని బాగా ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా 31 వ చిత్రం ఎవరితో అనేది మే 20న క్లారిటీ రానుంది. మరో వైపు ఆచార్య రిజల్ట్ తో బాగా డిస్టర్బ్ అయ్యాడు కొరటాల శివ. అందుకే షూటింగ్ కు మరింత సమయం ఇవ్వాలనుకుంటున్నాడు తారక్. ఇప్పటికే కంప్లీట్ అయిన ప్యాన్ ఇండియా స్టోరీని కొరటాల రీరైట్ చేస్తున్నాడని బాగా ప్రచారం సాగుతోంది. అందుకే ఈ మూవీని జూన్ నుంచి కాకుండా జులై లేదా ఆగస్ట్ నుంచి పట్టాలెక్కించాలనకుంటున్నారట. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4441454862.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జూ.ఎన్టీఆర్-బుచ్చిబాబు మూవీ నుంచి ఆసక్తికర అప్డేట్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుందిజ. ఇందులో ఎన్టీఆర్ 60 ఏళ్ల వయసున్న మాజీ ఆటగాడిగా కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తోంది. అయితే బుచ్చిబాబు, ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్లు ఎప్పటి నుంచి టాక్ నడుస్తుండగా.. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ క్రమంలో వీరిద్దరి కాంబోలో మూవీ ఉందా? లేదా? అనే సందేహం కూడా మొదలైంది. చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా.. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. తాజాగా ఈ మూవీకి టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర పేరు ‘పెద్ది’ అట. అదే పేరును సినిమా టైటిల్‌గా పెట్టే ఆలోచనలో దర్శక-నిర్మాతలు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై చర్చలు జరిపి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా కబడ్డీ ఆటగాడిగా ఒక ఆశయం దిశగా హీరో ముందుకు వెళతాడు. చదవండి: పెళ్లెందుకు అంత సీక్రెట్‌గా చేసుకున్నావు: మహేశ్‌ను ఆరా తీసిన బాలయ్య ఆ ఆశయం చుట్టూ ఆవేశం, బలమైన ఎమోషన్స్ ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. ఈ మూవీ కంటే ముందు ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. పొలిటికల్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ కనిపిస్తాడని చెబుతున్నారు. ఇందులో హీరోయిన్లుగా రష్మిక మందన్నా, కీర్తి సురేశ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. -
వైరల్: మహేష్ బాబుపై క్లాప్ కొట్టిన బుచ్చిబాబు
తొలి సినిమా ‘ఉప్పెన’తో దర్శకుడు బుచ్చిబాబు సాన సంచలనం సృష్టించారు. ఈ సినిమా ఐదు రోజుల్లో రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టింది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ను లాభాల్లో ముంచెత్తింది. అంతేకాదు, హీరోహీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలకు కూడా తొలి సినిమాతో సూపర్ బ్రేక్ వచ్చింది. ఈ నేపథ్యంలో హీరో, హీరోయిన్లకు సంబంధించిన పాత ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టడం మొదలు పెట్టాయి. తాజాగా బుచ్చిబాబు పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘1.నేనొక్కడినే’ సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఫొటో అది. ఆ ఫొటోలో ఓ షాట్‌కు సంబంధించి మహేష్ బాబుపై బుచ్చిబాబు క్లాప్ కొడుతున్నారు. ‘ఉప్పెన’ సినిమా ముందు వరకు బుచ్చిబాబు.. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. ‘1.నేనొక్కడినే’ సినిమాకు కూడా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ( ‘ఉప్పెన’ దర్శకుడికి మరో బంపర్ ఆఫర్ ) కాగా, ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేసేందుకు బుచ్చిబాబుకు అవకాశం వచ్చినట్లు టాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా టైంలో ఏర్పడ్డ స్నేహంతో ఎన్టీఆర్ ఈ సినిమా చేయటానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారంట. ఈ సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తెరకెక్కించనుందని సమాచారం. -
అదేంటో తెలుసుకోలేను.. బుచ్చిబాబుపై సుకుమార్ ఎమోషనల్
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా హీరోగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. ఈ నెల 12న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. టాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లను రాబట్టిన తొలి డెబ్యూ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ ఈ సినిమాను నిర్మించాడు. ఇక తన ప్రియ శిష్యుడి తొలి సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సుకుమార్ ఆనందంతో ఉబ్బితబ్బి పోతున్నారు. తన పేరుని నిలబెట్టినందకు గర్వంగా ఉందంటూ ఓ ఎమోషనల్ కవిత రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘నువ్వు నన్ను గురువు చేసేసరికి.. నాకు నేను శిష్యుడినై పోయాను. ఇంత గొప్ప సినిమా తీయడానికి, నువ్వు నా దగ్గర ఏం నేర్చుకున్నావా..?? అని.. నాకు నేను శిష్యుడ్ని అయిపోతే తప్ప అదేంటో తెలుసుకోలేను.. నాలోకి నన్ను అన్వేషించుకునేలా చేసిన సా‘నా’బుచ్చిబాబును ఉప్పెనంత ప్రేమతో అభినందిస్తూ.. ఇట్లు సుకుమార్ ఇంకో శిష్యుడు’అని బుచ్చిబాబు తన భూజాలనే ఒరిగి ఉన్న ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Sukumar B (@aryasukku) చదవండి : రాధేశ్యామ్ : ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసం 6కోట్లు! భర్తకు ఖరీదైన కారు గిఫ్టిచ్చిన లాస్య -
‘బుచ్చిబాబు’ చిరంజీవి
- జీవన కాలమ్ కాలేజీలో చదువుకునే రోజుల్లో నాకు మూడు పారాయణ గ్రంథాలు- కృష్ణశాస్త్రిగారి ‘కృష్ణపక్షం’, బుచ్చిబాబుగారి ‘చిరంజీవి’, చెలంగారి ‘మ్యూ జింగ్స్’. నా జీవితంలో అదృష్టం ఏమిటంటే ఆ ముగ్గురితోనూ అతి సన్నిహితమైన పరిచయాలు ఏర్పడటం. 1960లో ఆంధ్రప్రభలో చిత్తూరులో పనిచేసే రోజుల్లో తరచూ చెలంగారు ఉన్న తిరు వణ్ణామలై ఆశ్రమానికి వెళ్లేవాడిని. మరో మూడేళ్లకి ఆలిండియా రేడియోలో కృష్ణశాస్త్రిగారు, బుచ్చి బాబుగారితో కలసి పనిచేశాను. నేనూ, శంకరమంచి సత్యం, ఉషశ్రీ యువతరం రచయితలం. పెద్దలతో కలసి పనిచేయడం పండగ. బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’ స్ఫూర్తి నూటికి నూరుపాళ్లూ నా మొదటి నవల ‘చీకటిలో చీలికలు’ మీద కనిపిస్తుంది. పుస్తకం పేజీలు చిరిగిపోయేదాకా చదివి ఉంటాను. బుచ్చిబాబుగారు మితభాషి, మా రేడియో కేంద్రానికి ఎదురుగా అసెంబ్లీ క్యాంటీన్లో భాస్కరభట్ల కృష్ణారావుగారి వీడ్కోలు సభలో మాట్లాడాను. బయటికి వస్తూనే భుజం మీద చెయ్యి వేసి ‘బాగా మాట్లాడావు అబ్బాయ్!’’ అన్నారు బుచ్చిబాబు. నన్ను ‘అబ్బాయ్’ అనే వారు. అదొక పెద్ద కితాబు. ఏదైనా ప్రోగ్రాం బాగా చేస్తే మర్నాడు ముఖం చూసి హార్దికంగా నవ్వేవారు. అదే అభినందన, మాటల్లేవు. ఒక సందర్భం- నాకు జీవితంలో పాఠం నేర్పిన సందర్భం. రోజూ రేడియోలో ముందురోజు కార్యక్రమాల పర్యవేక్షణకు ఒక మీటింగు ఉం టుంది. ముందురోజు ప్రసారమయిన బుచ్చిబాబుగారి కార్యక్రమాన్ని ఒక ఉత్త రదేశపు ఆఫీసరుగారు చీల్చిచెండాడాడు. బుచ్చిబాబుగారు సీనియర్ ఆఫీసరు. కాగా గొప్ప రచయిత. మేమందరం ఇబ్బందిగా చూస్తున్నాం. ఆ ఆఫీసరు విమర్శ ముగిశాక అందరం బుచ్చిబాబుగారి సమాధానానికి ఎదురుచూస్తున్నాం. బుచ్చిబాబుగారికి ఉబ్బసం. ఊపిరి కూడతీసుకుని నవ్వి, విమర్శించిన ఆఫీసరు వేపు తిరిగి ‘నా తప్పులు సరిదిద్దుకుంటాను. థాంక్యూ’ అన్నారు. అంతే. చర్చ ముగిసింది. ‘సమాధానం చెప్పరేం?’ అన్నా ను బయటకు వచ్చాక. నవ్వి, ‘ఎందుకూ! మంచి ఉంటే నేర్చుకుందాం. చెడు అయితే మరిచిపోదాం’ అన్నారు. ‘మరి ఆ ఆఫీసరుకి తెలిసేదెలా?’. నవ్వి ‘అది నా పని కాదు’ అన్నారు. అక్కరలేని గుంజాటనకి ‘మౌనం’ చక్కని సమాధానమని నేర్పిన అద్భుతమైన సందర్భమది. ఇప్పటికీ ఆ హితవుని పాటించి నేను మనశ్శాంతిని సమకూర్చుకుంటూంటాను. బి.ఎన్.రెడ్డిగారి ‘మల్లీశ్వరి’కి బుచ్చిబాబుగారు రాసిన ఒక రేడియో నాటిక మాతృక అని నిరూపణ అయినా కాలుదువ్వని సౌమ్యుడాయన. ప్రశాంతమయిన ఆలోచన, జీవనం సాగించిన వ్యక్తి. ఆయన వాటర్ కలర్ చిత్రాలు అంతే సరళంగా, అంతే పవిత్రంగా, అంతే గజిబిజి లేకుండా కనిపిస్తాయి. నాకు పాట్నా బదిలీ అయిందని కంట తడిపెట్టుకున్నప్పుడు బుచ్చి బాబుగారు నన్ను అసిస్టెంట్ స్టేషన్ డెరైక్టర్ గదికి తీసుకువెళ్లారు. అప్పుడు ధర్మజ్ఞాని అనే ఆయన మిత్రులు ఆఫీసరు. ఆ కుర్చీలో కూర్చుని నన్ను ఓదార్చి ఉద్యోగం మానవద్దని హితవు చెప్పారు. నేను నటుడినయేదాకా- 20 సంవత్సరాలు ఆ హితవుని పాటించాను. తీరా నాకు విజయవాడ బదిలీ అయాక, ఇంటికి వెళ్తూ నన్ను పిలిచి భుజం మీద చెయ్యి వేసి, ‘రాత్రి భోజనానికి రా అబ్బాయ్’ అని చెప్పి వెళ్లిపోయారు. ఆనాడు మాతో భోజనం చేసిన మరో గొప్ప రచయిత మొక్క పాటి నరసింహశాస్త్రిగారు. వారి శ్రీమతికి (సుబ్బలక్ష్మి గారి వయసు ఇప్పుడు 90) నేనంటే అమితమైన అభిమానం. బెంగళూరులో తమ్ముడి కొడుకు సుబ్బారావుగారి దగ్గర ఉంటున్నారు. రెండేళ్ల కిందట ‘వందేళ్ల కథకు వందనాలు’ కార్యక్రమా నికి బుచ్చిబాబుగారిదీ, ఆమెదీ కథలు రికార్డు చేశాను. ‘మరో రెండేళ్లు బత కాలని ఉంది మారుతీరావ్. బుచ్చిబాబుగారి శతజయంతి చేసి వెళ్లిపోతాను’ అన్నారు. 14న శతజయంతి ఉత్సవం జరిపిస్తున్నారు. బుచ్చిబాబు ఇంగ్లిష్ ఎమ్మే చదివారు. ఆయన షేక్స్పియర్ మీద రాసిన వ్యాస సంపుటికి ఆయన పోయాక అకాడమీ బహుమతి వచ్చింది. అనా రోగ్యం కారణంగా సర్వీసులో ఉండగానే (51) వెళ్లిపోయారు. కథా సాహిత్యంలో బుచ్చిబాబుగారి ‘నన్ను గురించి కథ వ్రాయవూ?’ ఒక కళాఖండం. బుచ్చిబాబుగారి జీవితమే ఒక కళాఖండం. ఏమీ అరమరకలు లేని, గజిబిజిలేని, సరళమైన జీవితాన్ని గడిపిన గొప్ప ఇంటలెక్చువల్ బుచ్చి బాబు. ఆయన మంచి కవి. ఆ సాక్ష్యాలు ఇప్పటికీ శివరాజు సుబ్బలక్ష్మిగారి దగ్గర ఉన్నాయి. - గొల్లపూడి మారుతీరావు (జూన్ 14న బుచ్చిబాబు శతజయంతి) -
ద్వేషం నుంచి దొరకని విముక్తి చివరకు మిగిలేది...
మన నవలలు దేవుడికి తొలి అవమానం బహుశా సైతాన్ చేతిలోనే జరిగి ఉంటుంది. దేవుడు- మానవుణ్ణి సృష్టించి విర్రవీగాడు. సైతాన్ని పిలిచి- చూడు... ఒక మహోన్నతమైన సృజన చేశాను. మానవుడంటే ఇతడే. అభివాదం చెయ్యి అన్నాడు. సైతాన్ మానవుణ్ణి చూశాడు. చూసిన వెంటనే ద్వేషించాడు. దహించుకు పోవడం సైతాన్ జన్మ లక్షణం. దేవా... నేను మానవుడికి ఎందుకు అభివాదం చేయాలి. అతడు ఎందులో నాకంటే గొప్ప. నువ్వు అతణ్ణి కేవలం మృత్తికతో సృజించావు. నన్ను అగ్నితో. దేవుడికి ఆగ్రహం వచ్చింది. సైతాన్‌కు దండన లభించింది. ఆ దండన సైతాన్ను మరింత జ్వలింపజేసింది. మానవజాతి మీద ప్రళయం వరకూ పగ. ఆ జాతిని నాశనం చేయాలంటే ఏం చేయాలి? చాలా సులువు. వాళ్లల్లో కాసింత ద్వేషం రగిలిస్తే చాలు. వాళ్ల నాడుల్లో కాసింత విద్వేషాన్ని పరుగులెత్తిస్తే చాలు. వాళ్ల అంగాంగాల్ని పంచేంద్రియాల్ని అకారణమైన అక్కసు అనే మాయా సంకెలలతో బిగిస్తే చాలు. అదే చేశాడు. తదాదిగా మానవజాతి అనే ఈ జాతి తనను తాను హరించుకుంటోంది. తనను తాను హతమార్చుకుంటోంది. తనను తాను పరిహసించుకుంటూ, హీనపరుచుకుంటూ, క్షోభ పెట్టుకుంటూ అట్టడుగుల్లోకి జారి, లోయల్లోకి కూలి, ప్రేమ- సంతోషం అనే ఊర్థ్వలోకాలకు దూరంగా తమస్సులో- చేతులు తడుముకుంటూ- ఏ వెలుగుకూ నోచుకోని కబోది బతుకు బతుకుతోంది. దయానిధి తల్లి ఏం పాపం చేసింది? వయసులో ఉండగా ఎవరితోనో తప్పు చేసింది. చేస్తే? దాని వల్ల ఎవరికీ రూపాయి నష్టం లేదే. లోకాన క్షామం వచ్చిపడలేదే. ఎవరి ప్రాణాలూ పుటుక్కున రాలిపోలేదే. కాని- ఆమె- అన్యులకు సాధ్యం కాని రీతిలో, ఈ సంఘం అనుమతించని రీతిలో, ఈ సంఘానికి చేతగాని రీతిలో కాసింత సుఖించింది. అంతే. సంఘమంతా ఆమెను ద్వేషించింది. ఆ ద్వేషం ఎంతటిదంటే ఆమె భర్తకు- ఆమె గొంతు పిసికి చంపేంత. ఆమె పిల్లలను జీవితాంతం వేటాడేంత. దయానిధి గుండెల్లో ఈ ద్వేషం భయాన్ని నింపేసింది. ఇది తప్పా? మనసుకు నచ్చి, కాసింత భావుకతతో, ఒక నచ్చిన ఆడపిల్ల సమక్షంలో, ఆమె ఆదరణ కోరుకుంటూ, సంఘం చెప్పిన పద్ధతిలో కాకుండా ఉండటం తప్పా? భయపడిపోయాడు. వణికిపోయాడు. అల్లల్లాడి పోయాడు. కోమలి! ఎంతందంగా ఉంటుంది. కత్తులు విరిచి ఆకాశంలో పారేసినట్టు చమక్ చమక్‌మని మెరిసినట్టు ఉంటుంది. అలాంటి కోమలిని పొందలేకపోయాడు. కారణం? కోమలి- లేచి వచ్చిన దాని కూతురు. అసలే, తల్లి ప్రవర్తనకు సంఘం అతడి ముఖాన మసి పులిమి ఉంది. కోమలి సాంగత్యం కూడా అంటే ఏం లేదు. ఊస్తుంది. పోనీ సుశీలను చేసుకోవచ్చు. కాని ఆమెకు ఒళ్లంతా ద్వేషమేనే. దయానిధి తల్లంటే ద్వేషం. అలాంటి తల్లి కడుపున పుట్టినందుకు దయానిధి అంటే ద్వేషం. అతడితో దయగా, కృపగా, కరుణగా ఉండి బావా బావా అని ఆదరిస్తున్నందుకు అమృతం అంటే ద్వేషం. సాయంత్రమైతే జుబ్బా కట్టుకొని పాపిట తీసుకొని కోమలి ఇంటి వైపుకు వెళుతున్నాడని తెలిసి కోమలి అంటే ద్వేషం. ఎప్పటికైనా సంబంధం కలుపుకునే వీలున్న నాగమణి అన్నా ద్వేషమే. సమస్యేమిటంటే సుశీలకు ప్రేమించడం రాదు. నిజానికి చాలా మందికి ప్రేమించడం రాదు. ద్వేషించమంటే సులువుగా ద్వేషిస్తారుగాని- అరే అబ్బాయ్ ఫలానా వాడు మేడ కట్టుకున్నాడురా, ఫలానావాడికి మంచి ఉద్యోగం వచ్చిందిరా, ఫలానావాడి లాటరీలో లక్ష తగిలింది, ఫలానావాడికి పదవి, ఫలానావాడు కథో కవితో. మనకేమీ నష్టం లేకపోయినా ఉత్తపుణ్యానికే అకారణంగా ద్వేషిస్తూ ద్వేషిస్తూ ద్వేషిస్తూ దూరమయ్యి దూరమయ్యి దూరమయ్యి ఆఖరుకు ఏకాకిగా మిగిలి. అప్పటికి పుణ్యకాలం ముగిసి. దయానిధి డాక్టర్. కాని ప్రేమను ఇవ్వడానికి, స్వీకరించడానికి కూడా భయపడిపోయే చిత్రమైన రోగి. కోమలికి ప్రేమ ఇవ్వలేడు. అమృతం నుంచి పొందనూ లేడు. చివరకు బడుద్దాయిలా ఇందిరను చేసుకున్నాడు. ఆమె అంటే ఇష్టం లేదు. పైగా సమాజం అనే శత్రువు పెళ్లి అనే పేరుతో ఈ గుదిబండను తగిలిస్తోంది కదా అని ద్వేషించాడు. పెళ్లిలో పేచీలు పెట్టాడు. మామగారు- పోలీసు ఆఫీసరు కావడం మూలాన- స్వరాజ్యమూ, స్వాతంత్య్రమూ అని, తనకు లేని లక్షణాలతో గొడవకు దిగి, బ్రిటిష్ వారికి చెప్పి ఆయన ఉద్యోగం ఊడదీయించే వరకూ వెళ్లాడు. చివరకు ఏమైంది? భార్య పుట్టింట్లో. ఇతను ఏలూరులో. ప్రాక్టీసు నడవదు. మందికి ఇతడంటే పడదు. మరి? ఒక పిల్లను ప్రేమించి, ఒక పిల్లతో సరసాలాడి, ఒక పిల్లకు ఆశపెట్టి, ఆఖరుకు ఒకదాన్ని చేసుకొని, దాన్ని కూడా ఇంటికి తీసుకొని రాక, ‘గృహస్తు చట్రం’లో ఇమడక. లోకం చూస్తూ ఊరుకుంటారా? రాచి రంపాన పెడుతుంది. ఆ సెగ ఎలాంటిదంటే చివరకు- ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేయాలనే ఆత్మవంచనతో అనంతపురం పారిపోయేంత. పోనీలే అదీ మంచిదయ్యింది. దయానిధి అక్కడ బాగుపడ్డాడు. కాలికి వజ్రం తగిలి కుబేరుడయ్యాడు. వజ్రకరూర్‌లో గనికి ఆసామి. మళ్లీ ఏమైంది? ద్వేషమే! పచ్చగా ఉన్నవాణ్ణి వదిలిపెడతారా లోకులు? ఎల్లాగైనా భరతం పడతారు. ఇక్కడా అదే జరిగింది. కుల తగాదాలు వచ్చాయి. కార్మికులు సమ్మె చేశారు. ప్రత్యర్థులు గనులు పూడ్చారు. గిట్టనివాళ్లు రాత్రికి రాత్రి ఇల్లు తగులపెట్టారు. మిగిలింది ఏమిటి? చివరకు మిగిలేది ఏమిటి? ఖాళీ చేతులే. మళ్లీ ప్రయాణం మొదలెట్టాలి. దయానిధి మొదలుపెట్టాడు. అంతకు మించి చేయగలిగింది కూడా లేదు. నవల ముగుస్తుంది. ఈ కథ జరిగిన కాలం 1935. అంటే అప్పటికే ఒక ప్రపంచ యుద్ధాన్ని చూసుందొక తరం. మరో ప్రపంచ యుద్ధానికి సిద్ధపడుతోందింకో తరం. యుద్ధం అంటే ఏమిటి? ద్వేషానికి విరాట్ రూపం. ఎంత ద్వేషించకపోతే కొన్ని వేల ప్రాణాల మీదకు కొన్ని వేల ప్రాణాలు దాడికి తెగబడతాయి. ఇలాంటి ద్వేషం చూశాక, ఇలాంటి ద్వేషం అనుభవంలోకి వచ్చాక, మనిషిలోని సహజమైన పురోగామి లక్షణాలు ఎలా అడుగంటిపోతాయో ఎలా కుంచించుకొని పోతాయో అతడి మానసిక స్థితి ఎలా ఉంటుందో... వీటన్నింటికీ ఒక సృజనాత్మకమైన సమాధానం ఈ నవల. బుచ్చిబాబు దీనిని 1946లో రాసినా ఇప్పుడూ చుట్టుపక్కలా అంతే ఉంది. ఈ నవలలో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ ప్రస్తావన విస్తారం. అది రాయడం బుచ్చిబాబు ఉద్దేశం కాదు. రాయలసీమవాళ్లకూ, సర్కారు జిల్లాల వారికీ పరస్పరం ఉన్న విద్వేషాన్ని చూపడమే లక్ష్యం. ఇప్పుడేం చల్లగా చల్ల తాగుతున్నామా? తెలంగాణవాళ్లకూ సీమాంధ్రవాళ్లకూ మధ్య విద్వేషం. సైతాన్‌కు మరణం లేదు. సైతాన్ను ప్రళయం వరకూ దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఓజోన్ పొరకు చిల్లుపడో, ధ్రువాలు కరిగి వరదలెత్తో, అగ్నివర్షం కురిసో ప్రళయం రాదు. కేవలం ద్వేషం వల్లే వస్తుంది. నాడు హిట్లర్. రేపు మరొకడు. ఒక జీవితకాలంలో మనం ఏం మూటగట్టుకుంటాం. చివరకు ఏం మిగుల్చుకుంటాం. ఇది చూసుకోండి అని చెప్పడానికే బుచ్చిబాబు ఈ నవల రాశారా? ఒక కోణం నుంచి ఇలా మరో కోణం నుంచి మరోలా. చాలా అరుదైన బహుముఖీయమైన జీవన పార్శ్వాలనూ వాస్తవికతలనూ తాత్త్వికతలనూ బుచ్చిబాబు పొరలు పొరలుగా ఈ నవలలో ఎలా పేర్చగలిగారా అని అబ్బురం కలగక మానదు. ఆయన పట్ల ఎనలేని గౌరవమూ కలగక మానదు. ఇంకేంటి? ఇప్పటికిప్పుడు ఈ పేపర్ పక్కనబెట్టి మీరు ప్రేమిస్తున్న, మిమ్మల్ని ప్రేమిస్తున్న వ్యక్తుల పేర్లు రాసుకోండి. మీరు ద్వేషించే, మిమ్మల్ని ద్వేషించే వ్యక్తుల పేర్లు కూడా రాసుకోండి. ఆ తక్కెడను చూసి హడలెత్తిపోతే, దారీ తెన్నూ తెలియక నాలుక పిడచగట్టుకొని పోతే, నిత్య పారాయణగ్రంథంగా ఈ నవలను స్వీకరించండి. ఇది తెలుగులో ఉండటం వలన దీని విలువ లోకానికి తెలియలేదు. ఇది తెలుగులో ఉండటం వల్ల దీని విలువ తెలుగువారిక్కూడా తెలియాల్సినంతగా తెలియదు. చివరకు మిగిలేది- బుచ్చిబాబు రచనా కాలం - 1946 తొలి ముద్రణ- 1952 ‘తాత్త్విక విశ్వాసాలకు సృజనాత్మక రూపం ఇచ్చిన ఉత్కృష్టమైన తెలుగు నవల’గా పేరు గడించింది. బుచ్చిబాబు రాసిన ఏకైక నవల ఇది. అనేక పునర్ముద్రణలు పొందింది. వెల: రూ.120; మార్కెట్లో లభ్యం.