Sukumar Write An Emotional Poem About Buchi Babu And Posted Shared On Social Media - Sakshi
Sakshi News home page

‘నాలోకి నన్ను అన్వేషించుకునేలా చేసిన సా‘నా’బుచ్చిబాబు’

Published Tue, Feb 16 2021 6:01 PM | Last Updated on Tue, Feb 16 2021 7:08 PM

Sukumar Pens Down Heartfelt Appreciation Note To Buchibabu lOve Success Of Uppena - Sakshi

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా హీరోగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమాకు క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడు సానా బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. ఈ నెల 12న విడుదలైన ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. టాలీవుడ్‌ చరిత్రలో అత్యధిక వసూళ్లను రాబట్టిన తొలి డెబ్యూ మూవీగా నిలిచింది.  ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ తో కలిసి సుకుమార్‌ ఈ సినిమాను నిర్మించాడు.

ఇక తన ప్రియ శిష్యుడి తొలి సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో సుకుమార్‌ ఆనందంతో ఉబ్బితబ్బి పోతున్నారు. తన పేరుని నిలబెట్టినందకు గర్వంగా ఉందంటూ ఓ ఎమోషనల్‌ కవిత రాసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ‘నువ్వు నన్ను గురువు చేసేసరికి.. నాకు నేను శిష్యుడినై పోయాను. ఇంత గొప్ప సినిమా తీయడానికి, నువ్వు నా దగ్గర ఏం నేర్చుకున్నావా..?? అని.. నాకు నేను శిష్యుడ్ని అయిపోతే తప్ప అదేంటో తెలుసుకోలేను.. నాలోకి నన్ను అన్వేషించుకునేలా చేసిన సా‘నా’బుచ్చిబాబును ఉప్పెనంత ప్రేమతో అభినందిస్తూ.. ఇట్లు సుకుమార్‌ ఇంకో శిష్యుడు’అని బుచ్చిబాబు తన భూజాలనే ఒరిగి ఉన్న ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. 

చదవండి : 
రాధేశ్యామ్‌ : ప్రభాస్ కాస్ట్యూమ్స్‌ కోసం 6కోట్లు! 

భర్తకు ఖరీదైన కారు గిఫ్టిచ్చిన లాస్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement