Vaishnav Tej
-
మెగా హీరో బర్త్‌డే.. సందడి చేసిన రామ్ చరణ్ దంపతులు!
గతేడాది ఆదికేశవ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది నవంబర్ 24న విడుదలైంది. రిలీజైన మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా.. ఉప్పెన చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత వచ్చిన కొండపొలం ,రంగరంగ వైభవంగా చిత్రాల్లో నటించారు. (ఇది చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ స్టార్ హీరో సినిమా!) తాజాగా మెగా హీరో 29వసంతంలోకి అడుగుపెట్టారు. జవనరి 13న వైష్ణవ్ తేజ్ బర్త్ డేను మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు పాల్గొన్ని సందడి చేశారు. వైష్ణవ్ తేజ్‌తో సరదాగా ఫోటోలు దిగుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు సైతం మెగా హీరోకు విషెస్ చెబుతున్నారు. కాగా.. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. A heart-warming glimpse of lovely couple Mega Power star @AlwaysRamCharan & @upasanakonidela with #VaisshnavTej from his birthday celebrations 😍#RamCharan #GameChanger #TeluguFilmNagar pic.twitter.com/yyjBwe52JS — Telugu FilmNagar (@telugufilmnagar) January 14, 2024 -
నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న శ్రీలీల కొత్త మూవీ
థియేటర్ల సంగతి పక్కనబెడితే ప్రతివారం ఓటీటీల్లో కొత్త మూవీస్ విడుదలవుతూనే ఉంటాయి. హిట్ అయిన మూవీస్ కాస్త లేటుగా స్ట్రీమింగ్‌లోకి వస్తున్నాయి కానీ యావరేజ్, ఫ్లాప్ మూవీస్ మాత్రం దాదాపు నెలలోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా ఓ తెలుగు మూవీ ఇప్పుడు డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైపోయింది. (ఇదీ చదవండి: తెలుగు యూట్యూబర్, 'పక్కింటి కుర్రాడు' చందు అరెస్ట్) ఇంతకీ ఏ సినిమా? ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, మెగాహీరో వైష్ణవ్ తేజ్-శ్రీలీల కాంబోలో తీసిన మూవీ 'ఆదికేశవ'. యాక్షన్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడి.. గతనెల అంటే నవంబరు 24న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే ప్రేక్షకులని అలరించలేకపోయింది. రొటీన్ స్టోరీకి తోడు టేకింగ్ కూడా దెబ్బకొట్టేసింది. ఓటీటీలో ఎప్పుడు? నవంబరు 24న థియేటర్లలో రిలీజైన 'ఆదికేశవ'.. డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇకపోతే క్రిస్మస్ టైంలో స్మాల్ స్క్రీన్ రిలీజ్ ఉండొచ్చని అందరూ అనుకున్నారు. అందుకు తగ్గట్లే డిసెంబరు 22 నుంచి ఈ మూవీ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. సరిగ్గా అదే రోజు థియేటర్లలో ప్రభాస్ 'సలార్' రిలీజ్ అవుతుండటం విశేషం. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్) -
ఆదికేశవ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
మెగా హీరో వైష్ణవ్ తేజ్ - శ్రీలీల నటించిన 'ఆదికేశవ' చిత్రం నవంబర్ 24న విడుదలైంది. పలుమార్లు వాయిదా పడుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన మొదటిరోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది. తొలి సినిమా ఉప్పెన బ్లాక్ బస్టర్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చిన వైష్ణవ్ ఆ తర్వాత వచ్చిన కొండపొలం ,రంగరంగ వైభవంగా చిత్రాలు డిజాస్టర్‌గానే మిగిలాయి. తాజాగా విడుదలైన ఆదికేశవ కూడా డిజాస్టర్‌గానే మిగిలే ఛాన్స్ ఉంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా తెరకెక్కిన ఆదికేశవకు ప్రేక్షకుల ఆధరణ అంతగా లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం నష్టాల దిశగా ఈ చిత్రం ఉంది. ఇలాంటి సమయంలో ఆదికేశవ ఓటీటీ విడుదలపై ఒక ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ నెలలో క్రిస్టమస్ కానుకగా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఆదికేశవ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి. ఈ చిత్రంలో ఎక్కువగా వయొలెన్స్‌తో పాటు ఎమోషన్ సీన్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కానీ అవి అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫైట్స్ మాత్రం ఓకే అనిపించినా.. ఊహకందేలా సాగే కథనం కాస్త మైనస్‌గా అనిపిస్తుంది. అలా ఫైనల్‌గా వైష్ణవ్ తేజ్ లిస్ట్‌లో మరో డిజాస్టర్‌గా ఈ చిత్రం మిగిలింది. మరి ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పింస్తోంది చూడాలి. -
Aadikeshava Review: 'ఆదికేశవ' సినిమా రివ్యూ
టైటిల్: ఆదికేశవ తారాగణం: వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జి, అపర్ణ దాస్, సుమన్, తణికెళ్లభరణి, జయ ప్రకాష్, రాధిక, సుదర్శన్ తదితరులు దర్శకుడు: శ్రీకాంత్ ఎన్ రెడ్డి సంగీతం : జీవీ ప్రకాశ్ నిర్మాత : సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య విడుదల తేదీ: 24 నవంబర్ 2023 ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్లో ఉప్పెనలా దూసుకొచ్చాడు. మాస్ హీరోగా తన ముద్ర వేసేందుకు వైష్ణవ్ తేజ్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదికేశవ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి స్పందనను తెచ్చుకున్నాయి. అయితే ఈ మూవీ ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. కథ ఏంటంటే.. ఆదికేశవ కథ ఓ వైపు సిటీలో సాగుతుంది.. మరో వైపు రాయలసీమలోని బ్రహ్మసముద్రంలో జరుగుతుంటుంది. సిటీలో బాలు (వైష్ణవ్ తేజ్) కథ నడుస్తుంటుంది.. సీమలో చెంగారెడ్డి (జోజు జార్జి) అరాచకాలు నడుస్తుంటాయి. తల్లిదండ్రులు, అన్న.. ఇలా ఫ్యామిలీతో హాయిగా గడిపేస్తుంటాడు బాలు. తన కంపెనీ సీఈవో చిత్ర (శ్రీలీల)ను బాలు ప్రేమిస్తుంటాడు. బాలుని సైతం చిత్ర ఇష్టపడుతుంటుంది. అంతా బాగానే ఉందనుకునే సమయంలోనే బాలు గతం, నేపథ్యం తెరపైకి వస్తుంది. బాలుకి ఆ సీమతోనే సంబంధం ఉంటుంది. సీమకు బాలు వెళ్లాల్సి వస్తుంది. బాలు కాస్త రుద్రకాళేశ్వరరెడ్డి అని తెలుస్తుంది... రుద్ర తండ్రి మహా కాళేశ్వర రెడ్డి (సుమన్) ఎలా మరణిస్తాడు? సీమలో అడుగు పెట్టిన బాలు అలియాస్ రుద్ర ఏం చేశాడు? చివరకు చెంగారెడ్డిని ఎలా అంతమొందించాడు? అనేది కథ. ఎలా ఉందంటే..? ఆదికేశవ కొత్త కథేమీ కాదు. ఈ ఫార్మాట్లో వచ్చిన ఎన్నో సినిమాలను మనం ఇది వరకు చూశాం. చూసిన కథే అయినా కూడా రెండు గంటల పాటు అలా నడిపించేశాడు దర్శకుడు. అక్కడక్కడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించినా.. అదే సమయంలో ఓ పాట, ఓ పంచ్ వేసి కవర్ చేసేశాడు డైరెక్టర్. పక్కా మీటర్లో తీసిన ఈ కమర్షియల్ చిత్రం బీ, సీ సెంటర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో హీరోయిజం ఎలివేట్ చేసే సీన్లు, హీరో మంచితనానికి అద్దం పట్టే సీన్లు బాగుంటాయి. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ బాగుంటుంది. తెరపై పాటలు చూడముచ్చటగా ఉంటాయి. ఇంటర్వెల్‌కు కథ ఆసక్తికరంగా మారుతుంది. రెండో భాగమంతా కూడా రాయలసీమకు షిప్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఎమోషనల్ పార్ట్ ఎక్కువ అవుతుంది. వయొలెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫైట్స్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే! ఊహకందేలా సాగే కథనం కాస్త మైనస్‌గా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే? యంగ్ హీరో వైష్ణవ్ తేజ్‌కు ఇది చాలా కొత్త పాత్ర. ఫస్ట్ హాఫ్‌లో జాలీగా తిరిగే పక్కింటి కుర్రాడిగా అవలీలగా నటించేశాడు. రెండో భాగంలో పూర్తి వేరియేషన్ చూపించాడు. మాస్ యాక్షన్, ఎమోషనల్ సీన్లలో మెప్పించాడు. శ్రీలీల తన డ్యాన్సులు, గ్లామర్‌తో మరోసారి మెస్మరైజ్ చేసింది. మాలీవుడ్ నటుడు జోజు జార్జ్ తెలుగులో మొదటి సారిగా కనిపించాడు. విలన్‌గా ఆకట్టుకున్నాడు. సుమన్, తణికెళ్ల భరణి, జయ ప్రకాష్, రాధిక, సుదర్శన్ ఇలా అన్ని పాత్రలు పరిధి మేరకు మెప్పిస్తాయి. సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నతంగానే కనిపిస్తుంది. పాటలు బాగున్నాయి. మాటలు అక్కడక్కడా ఎమోషనల్‌గా టచ్ అవుతాయి. రెండు గంటల నిడివితో ఎడిటర్ ప్రేక్షకుడికి ఊరటనిచ్చాడనిపిస్తుంది. కెమెరా వర్క్ చాలా రిచ్‌గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. చదవండి: సౌండ్ పార్టీ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆదికేశవ్ సినిమాతోనైనా హిట్ కొడతాడా లేదా?
-
క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్ .రెడ్డి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆదికేశవ’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. శ్రీకాంత్ ఎన్ . రెడ్డి మాట్లాడుతూ–‘‘హైదరాబాద్‌కి చెందిన ఓ కుర్రాడు అనంతపురం సమీపంలోని కళ్యాణదుర్గం బ్రహ్మసముద్రం అనే గ్రామంలో జరుగుతున్న దారుణాలను ఎలా అడ్డుకున్నాడు? అన్నదే ఈ సినిమా కథాంశం. మూవీ ప్రారంభమైన 10 నిమిషాలకే వైష్ణవ్‌తేజ్ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. సినిమాలోని చివరి 45నిమిషాల సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా, క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. బడ్జెట్, పారితోషికం.. ఇలాంటి అంశాలను పట్టించుకోకుండా నా దృష్టంతా సినిమాపై కేంద్రీకృతమయ్యేలా చేసిన నాగవంశీగారికి థ్యాంక్స్. జీవీ ప్రకాష్ కుమార్ మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు. -
‘ఆదికేశవ' ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాడు: దర్శకుడు
ఓ మంచి కథతో సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు నా సన్నిహితులతో చెబితా.. మంచి కమర్షియల్ ఫిల్మ్ చేయమని సూచించారు. అప్పుడు ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేలా మంచి కమర్షియల్ కథను సిద్ధం చేశాను.. అదే ఆదికేశవ.ఈ సినిమా కథ, కథనం, పతాక సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ. ఎమోషనల్ గా కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది’ అన్నారు నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘ఆదికేశవ’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రం.. ఈ శుక్రవారం(నవంబర్ 24) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు.ఆ విశేషాలు.. ►హైదరాబాద్ లో ఉండే ఒక సాధారణ కుర్రాడు.. ఎక్కడో అనంతపురం దగ్గరున్న కళ్యాణదుర్గంలోని బ్రహ్మసముద్రం అనే గ్రామంలో జరుగుతున్న దారుణాలను ఎలా అడ్డుకున్నాడు అనేది ఈ సినిమా లో చూస్తారు. ►భీమ్లా నాయక్ సెట్స్ కి వెళ్ళి వంశీ గారికి ఈ కథ చెప్పగా ఆయనకి నచ్చింది. ఆ తర్వాత చినబాబు గారికి, వైష్ణవ్ తేజ్ గారికి కథ చెప్పాను. అందరికీ నచ్చింది. అలా సితార సంస్థ తో దర్శకునిగా నా ప్రయాణం మొదలైంది . ►ఏ రోజూ కూడా వంశీ గారు ఇంత బడ్జెట్ లో తీయమని నాకు చెప్పలేదు. కొత్త దర్శకుడివి నువ్వు, నీకు డబ్బుల గురించి ఆలోచన వద్దని చెప్పారు. సినిమా కోసం నేను అడిగినవన్నీ సమకూర్చి పెట్టారు. మంచి మంచి నటీనటులను ఇచ్చారు. బడ్జెట్, పారితోషికం ఇలాంటి పట్టించుకోకుండా నా దృష్టి అంతా సినిమా చిత్రీకరణ మీద ఉండేలా చూశారు. ►క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. ఈ సినిమా చివరి 45 నిమిషాలు అద్భుతంగా ఉందని ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కరూ చెప్పారు. ఎడిటర్ నవీన్ నూలి గారు కూడా చివరి 45 నిమిషాలు అదిరిపోయింది అన్నారు. డీఐ టైంలో ఈ సినిమా చూస్తూ ఎమోషనల్ అయినవాళ్ళు ఉన్నారు. సినిమా కథ, కథనం, పతాక సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ. ఖచ్చితంగా ఈ సినిమా ఎమోషనల్ గా కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది. ►జి.వి. ప్రకాష్ గారి అనుభవం చాలా హెల్ప్ అయింది. పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా ఇచ్చారు. -
వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఎవరైనా అడిగినే నేను హీరో కాదని చెబుతా: వైష్ణవ్ తేజ్
కథ నచ్చితే చాలు..ఫలితం గురించి ఆలోచించకుండా సినిమాను ఒప్పుకుంటాను. నిజాయితీగా కష్టపడి పనిచేస్తాను. హీరో అని అనిపించుకోవడం కంటే..నటుడు అని పిలిపించుకోవడమే ఇష్టం. ఎవరైన నన్ను అడిగినా కూడా నేను హీరోని కాదు నటుడిని అని చెబుతాను’ అని అన్నారు యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'ఆదికేశవ'. శ్రీలీల హీరోయిన్. తార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. . జోజు జార్జ్, అపర్ణా దాస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో వైష్ణవ్ తేజ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► రంగ రంగ వైభవంగా చిత్రీకరణ చివరి దశలో ఉన్నప్పుడు నిర్మాత నాగవంశీ గారు ఈ కథ వినమని చెప్పారు. కథ వినగానే నాకు ఎంతగానో నచ్చింది. ఆ తర్వాత కథ ఇంకా ఎన్నో మెరుగులు దిద్దుకుని అద్భుతంగా వచ్చింది. ► ఇది పూర్తిస్థాయి మాస్ సినిమా అయినప్పటికీ కథలో కొత్తదనం ఉంటుంది. కథ విన్నప్పుడే ఇలాంటి పాయింట్ ఎవరూ టచ్ చేయలేదు అనిపించింది. ఇందులో కామెడీ, సాంగ్స్, విజువల్స్, ఫైట్స్ అన్నీ బాగుంటాయి. ప్రేక్షకులు సినిమా చూసి థియేటర్ల నుంచి ఆనందంగా బయటకు వస్తారు. ► నాకు, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు క్యూట్ గా ఉంటాయి. సంభాషణలు సహజంగా సరదాగా ఉంటాయి. షూటింగ్ టైంలో ఆ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాం. పాత్రలోని అమాయకత్వం, తింగరితనంతో దర్శకుడు శ్రీకాంత్ హాస్యం రాబట్టారు. మీరు స్క్రీన్ మీద చూసేటప్పుడు చాలా ముద్దుగా అనిపిస్తాయి సన్నివేశాలు. ► శ్రీలీలతో డ్యాన్స్ అనగానే కాస్త భయపడ్డాను. నేనసలు డ్యాన్సర్ ని కాదు(నవ్వుతూ). కానీ నేను మాస్టర్ కి ఒకటే చెప్పాను. మీరు ఓకే అనేవరకు నేను ఎంతైనా కష్టపడి చేస్తాను అన్నాను. 100 శాతం కష్టపడి పని చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. మొదటి రెండు టేకులకే ఎలా చేయాలి, ఎంత ఎనర్జీ పెట్టాలో అర్థమైపోయింది. మాస్టర్, శ్రీలీల మద్దతుతో పూర్తి న్యాయం చేయగలిగాను. ► రాధిక నటిస్తున్నారని తెలియగానే..అంత సీనియర్ ఆర్టిస్ట్ సెట్స్ లో ఎలా ఉంటారో అనుకున్నాను. కానీ ఆమె అందరితో బాగా కలిసిపోయి సరదాగా మాట్లాడతారు. ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు. అంతటి సీనియర్ ఆర్టిస్ట్ కలిసి పని చేయడం సంతోషంగా అనిపించింది. ► కథలో కొత్తదనం ఉంటే చాలు సినిమాను ఒప్పేసుకుంటాను. అలాగే నా పాత్రలో కొంచెం కమర్షియాలిటీ ఉండేలా చూసుకుంటాను. -
'ఆయన కోసమే అలా చేయించుకున్నా'.. మెగాస్టార్‌పై వైష్ణవ్ తేజ్ కామెంట్స్!
చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన మూవీతో అభిమానులను మెప్పించిన ఆయన.. ప్రస్తుతం ఆదికేశవతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రం పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల జంటగా నటిస్తోంది. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న వైష్ణవ్ తేజ్ మెగాస్టార్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. చిరు అని పేరు వచ్చేలా క్రాఫ్ చేయించుకున్న ఫోటోపై స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారో చూద్దాం. వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. 'మామయ్య పుట్టినరోజుకు అందరూ గిఫ్ట్స్ తెచ్చారు. సాయి ధరమ్ తేజ్ పెద్ద కత్తిని బహుమతిని తీసుకొచ్చాడు. నేను మాత్రం ఆయనకు నా ప్రాణం తప్ప ఏం ఇవ్వగలనని అనుకున్నా. అందుకే చిన్న సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా. చిరు అని వచ్చేలా హెయిర్ కట్ చేయించుకున్నా. మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా రామ్ చరణ్ అన్న అందరినీ ఆకట్టుకుంటాడు. సాయిధరమ్ తేజ్ బాగా అల్లరి చేస్తాడు. తన యాక్సిడెంట్ మా అందరికీ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలింది. ఆ విషయాన్ని మేము ఎప్పుడో మర్చిపోయాం.' అని అన్నారు. -
పక్కా మాస్
‘‘ఆదికేశవ’ సినిమా ట్రైలర్‌కి వస్తున్న స్పందన చూసి చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు మెచ్చే చిత్రాన్ని అందించడం కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. ట్రైలర్లానే సినిమా కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’’ అని హీరో వైష్ణవ్ తేజ్ అన్నారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘‘ఆదికేశవ’ పక్కా మాస్ చిత్రం. ఇందులో యాక్షన్, ఎమోషన్, కామెడీ, సాంగ్స్.. ఇలా అన్నీ బాగుంటాయి. గతేడాది వచ్చిన ‘వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి’ చిత్రాల తర్వాత ఈ ఏడాది వస్తున్న పర్ఫెక్ట్ మాస్ మూవీ ‘ఆదికేశవ’’ అన్నారు. -
ఆదికేశవగా వస్తోన్న మెగా హీరో.. ట్రైలర్ చూశారా?
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఫిల్మ్ ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉప్పెన, కొండపొలంతో అలరించిన హీరో వైష్ణవ్ తేజ్ మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. జోజూ జార్జ్, అపర్ణా దాస్ కీలక పాత్రలు పొషించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతమందించారు. ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు తెలుస్తోంది. -
మెగా హీరోతో రిలేషన్లో రీతూ వర్మ.. క్లారిటీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్!
మెగా ఫ్యామిలీ ఇంట ఏ సెలబ్రేషన్స్ జరిగినా అక్కడ వాలిపోయేది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. నిహారిక స్నేహితురాలిగా తరచూ వారి ఇంటి వేడుకల్లో కనిపించేది. కానీ జనాలు మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతోందని అనుమానపడ్డారు. అన్నట్లుగా వరుణ్-లావణ్య షికార్లకు వెళ్లడం, వీరిద్దరి మధ్య లవ్వాయణం నడుస్తోందని ప్రచారం జరగడం.. చివరకు అదే నిజమంటూ పెళ్లి చేసుకోవడం కూడా అయిపోయింది. అయితే ఆ మధ్య వరుణ్-లావణ్యల పెళ్లికి అల్లు అర్జున్ ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మ కూడా ఉంది. దీంతో ఆమె మెగా హీరోతో రిలేషన్లో ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్ ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చాడు. రీతూ వర్మ.. లావణ్య స్నేహితురాలు.. అందుకనే పార్టీకి వచ్చింది. పెళ్లి వేడుకల్లోనూ సందడి చేసింది. అంతకుమించి ఏమీ లేదు అని చెప్పుకొచ్చాడు వైష్ణవ్ తేజ్. కాగా మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆదికేశవ. శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమా నవంబర్ 10న విడుదల కావాల్సింది. కానీ క్రికెట్ వరల్డ్ కప్ ప్రభావం సినిమాలపై పడుతుందన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న స్టార్ డైరెక్టర్ కూతురు? వైద్య వృత్తిలోకి ఎంటర్? -
కమిట్ అయ్యారా..? అంటూ శ్రీలీలను అడిగిన నెటిజన్
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్ట్‌లో శ్రీలీల టాప్‌లో ఉంటుంది. ఏడాది నుంచి చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. చిన్న సినిమా అయిన పెళ్లి సందడితో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది ఇప్పుడు అగ్ర తారలతో స్క్రీన్ షేర్ చేసుకునే స్థాయికి వెళ్లిపోయింది. కొద్దిరోజుల క్రితమే భగవంత్ కేసరిలో అందరికీ గుర్తుండిపోయే పాత్రలో శ్రీలీల మెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ భారీ చిత్రాల షూటింగ్ షెడ్యూల్లలో బిజీగా ఉంది. అయితే ఇంతటి బిజీ షెడ్యూల్లోనూ ఈ చిన్నది తన ఫ్యాన్స్‌ను పలకరించడం అస్సలు మరచిపోదు. వాళ్ల కోసం తన సోషల్ మీడియా వేదికల్లో సినిమా అప్డేట్స్తో పాటు లేటెస్ట్ ఫొటోలను షేర్ చెస్తుంటుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ నుంచి అభిమానులతో ముచ్చటించింది.తన అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో అక్కడ వివిధ ఆసక్తికరమైన ప్రశ్నలకు శ్రీలీల సమాధానం ఇచ్చింది. అందులో ఒక నెటిజన్, ? ' మీరు ఈ రోజు బిగ్ బాస్‌కి వస్తున్నారా?' అని అడిగారు. దానికి శ్రీలీల స్పందిస్తూ, 'అవును, ఆదికేశవ సినిమా ప్రమోషన్స్ కోసమే' అని చెప్పింది. మరో వ్యక్తి (ఆర్ యూ కమిటెడ్..?) అని శ్రీలీలను ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగాడు.. ఆమె సమాధానం సూటిగా అవును అని చెబుతూ.. ' నేను నా పని విషయంలో కమిటెడ్‌గానే ఉంటాను.' అని కౌంటర్లా సమాధానం ఇచ్చింది. అభిమానులు అడిగిన ప్రశ్నలతో పాటు ఆమె చెప్పిన సమాధానాలు కూడా శ్రీలీల షేర్ చేసింది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైష్ణవ్ తేజ్-శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
వరల్డ్ కప్ ఎఫెక్ట్.. వాయిదా పడ్డ మెగా హీరో సినిమా!
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, హాట్‌బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘ఆదికేశవ’. ఇంకో పది రోజుల్లో అంటే నవంబర్ 10న ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ అనూహ్యంగా వాయిదా పడింది. నవంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి ధృవీకరించారు. ‘ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ వరల్డ్ కప్ లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. భారత్ విజేతగా నిలుస్తుందనే అంచనాలున్నాయి. ఈ వరల్డ్ కప్ ప్రభావం సినిమాలపై పడుతుంది. ముఖ్యంగా భారత్ మ్యాచ్ లు ఉన్న సమయంలో థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపించడంలేదు. అందుకే నవంబర్ 10వ తేదీన విడుదల కావాల్సిన 'ఆదికేశవ'ను నవంబర్ 24వ తేదీకి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం’అని నిర్మాత నాగవంశీ తెలిపారు. సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నామని, కఖచ్చితంగా అందరినీ అలరిస్తుందని అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి కూడా ఈ చిత్రంపై ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ ప్రేక్షకులతో పాటు యూత్, మాస్ ఆడియన్స్‌ని కూడా ఈ సినిమా అలరిస్తుందని అన్నారు. ‘ఉప్పెన' వంటి బ్లాక్‌బస్టర్‌తో అరంగేట్రం చేసిన పంజా వైష్ణవ్ తేజ్.. విభిన్న సినిమాలు, పాత్రలతో వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు 'ఆదికేశవ' అనే మాస్ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణా దాస్ ఈ సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. -
న్యూ లుక్ లో వైష్ణవ్ తేజ్..ఎందుకో తెలుసా..?
-
'ఆదికేశవ'సాంగ్ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
మరో మాస్ పాట.. శ్రీలీల కేక పుట్టించే డ్యాన్స్!
పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా 'ఆదికేశవ'. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా నుంచి 'లీలమ్మో' అనే పాట లిరికల్ వీడియోని బుధవారం రిలీజ్ చేశాడు. ఫుల్ మాసీగా ఉన్న ఈ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. హైదరాబాద్‌లో ఓ హోటల్లో సాంగ్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ పాట గురించి మాట్లాడిన శ్రీలీల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. (ఇదీ చదవండి: అల్లు అరవింద్ అనుకుంటే బ్రహ్మానందం చేశాడు!) 'లీలమ్మో' నాకు ఎంతో ఇష్టమైన పాట. పైగా నా పేరుతో ఉన్న మొదటి పాట. అందుకే ఇది నాకు చాలా స్పెషల్. ఈ సాంగ్ మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది పర్ఫెక్ట్ మాస్ సాంగ్. పాట వినగానే నాకు స్నేక్ డ్యాన్స్ చేయాలి అనిపించింది' అని శ్రీలీల చెప్పుకొచ్చింది. ఇకపోతే 'ఆదికేశవ' సినిమాతో శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. దీపావళి కానుకగా నవంబరు 10న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?) -
Aadikeshava Movie HD Photos: వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?
ఉప్పెన సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన 'కృతి శెట్టి' తన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఉప్పెన సినిమా తర్వాత ఆమె నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా హిట్టుగా నిలవగా, బంగార్రాజు సినిమా యావరేజ్‌గా నిలిచింది. అలా ఆమెకు మొదటి మూడు సినిమాలు మాత్రమే హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ మధ్య కాలంలో ఆమె చేసిన సినిమాలు ప్రేక్షకుల నుంచి నెగటివ్ టాక్ రావడంతో డిజాస్టర్లుగా నిలిచాయి. టాలీవుడ్‌కు ఆమె వచ్చిన కొత్తలో అమ్మడి అదృష్టం ఓ రేంజ్లో ఉండేది. ఏ సినిమా అయినా సరే 'కృతి శెట్టి' కావాలి అనేంతగా తన ఇమేజ్ ఉండేది. అప్పట్లో స్టార్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు ఎవరైనా సరే సినిమా ఛాన్స్‌లు ఇస్తామని ఈ చిన్నదాని వెనుక తెగ తిరిగారు. అయితే అవకాశాలను మాత్రమే అందుకుంది కానీ, విజయాలను అందుకోలేకపోయింది. ఉప్పెన బ్యూటీ అని తెచ్చుకున్న అదే పేరుతో ఇప్పటికీ కొనసాగుతోంది. (ఇదీ చదవండి: మీ నుంచి చాలా నేర్చుకున్నా.. బన్నీపై బాద్ షా ప్రశంసలు!) ప్రస్తుతం ఈ భామ చేతిలో ఒక సినిమా మాత్రమే ఉంది. రాబోయే రోజుల్లో అవకాశాలు వస్తాయో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. కానీ ఈ బ్యూటీ చుట్టూ అప్పుడప్పుడు పలు రూమర్స్ మాత్రం నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిని ఆమె తన టీమ్ ద్వారా తిరిగి సమాధానం కూడా చెబుతూ వచ్చేది. పెళ్లిపై రూమర్స్ తాజాగా కృతి శెట్టి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్‌మీడియాలో భారీగా ప్రచారం జరుగుతుంది. మెగా ఫ్యామిలీకి చెందిన 'వైష్ణవ్ తేజ్'తో ఆమె వివాహం అంటూ నెట్టింట వార్తలు జోరుగా వైరల్ అవుతున్నాయి. ఉప్పెన సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమా సమయంలోనే వాళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైందని పలు రకాలుగా చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే 'మిస్టర్' సినిమా సమయంలో మా మధ్య ప్రేమ మొదలైందని లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ చెప్పిన విషయం తెలిసిందే. సుమారు 7 ఏళ్లు పైగా వారి ప్రేమను దాచి.. నిశ్చితార్థంతో అందరికీ షాకిచ్చిన విషయం తెలిసిందే. అదే మాదిరి 'కృతి శెట్టి- వైష్ణవ్ తేజ్'లు కూడా షాకిస్తారా..? కాదూ, ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని తిప్పికొడతారో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం తనకు లేనట్లు పలుమార్లు బేబమ్మ చెప్పిన విషయం తెలిసిందే. తనకు ఉన్న టాలెంట్‌కు ఒక మంచి కథ పడితే మళ్లీ ఆమె కెరియర్ ఇండస్ట్రీలో దూసుకుపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ బేబమ్మకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ టాలీవుడ్లో ఉంది. తన సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ హిట్ సినిమాతో ప్రారంభం అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాబట్టి ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకుని తన కెరియర్‌కు ఫుల్స్టాప్ పెట్టకపోవచ్చని తెలుస్తోంది. -
సిత్తరాల సిత్రావతి...
‘సిత్తరాల సిత్రావతి.. ఉన్నపాటుగా పోయే మతి’ అని పాడుకున్నారు వైష్ణవ్ తేజ్. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం నవంబరు 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలోని ‘సిత్తరాల సిత్రావతి.’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. జీవీ ప్రకాష్‌కుమార్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా రమ్య బెహ్రా, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. -
‘సిత్తరాల సిత్రావతి’ వచ్చేసింది.. శ్రీలీల డ్యాన్స్ ఇరగదీసిందిగా!
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 10న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ‘సిత్తరాల సిత్రావతి’పాటను విడుదల చేశారు మేకర్స్. హీరోహీరోయిన్ల మధ్య సాగే మెలోడీ పాట ఇది. వైష్ణవ్ తేజ్ తన చిత్ర(శ్రీలీల)ను 'సిత్తరాల సిత్రావతి' అని పిలుస్తూ, ఆమె అందాన్ని పొగుడుతూ పాడే గీతంగా ఈ పాట సాగుతుంది. ఈ పాటకు గేయ రచయిత సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్అందించగా, రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటకి తన గాత్రంతో విభిన్నమైన జానపద రుచిని అందించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చాడు. -
నవంబరులో ఆదికేశవ
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఫిల్మ్ ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ ఫ్యారిస్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ షూటింగ్ షెడ్యూల్‌తో ‘ఆదికేశవ’ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా ఈ సినిమాను తొలుత ఈ నెల 18న విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. దీంతో ‘ఆదికేశవ’ చిత్రాన్ని నవంబరు 10న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ శుక్రవారం వెల్లడించింది. జోజూ జార్జ్, అపర్ణా దాస్ కీలక పాత్రలు పొషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్. -
‘మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’కు ప్రిపేర్ అవుతున్న స్టార్స్!
విలన్ ముఖం మీద హీరో పంచ్ ఇవ్వాలా? కాలితో ఒక్క కిక్ కొట్టాలా? గాల్లో ఎగిరి పల్టీలు కొట్టి మరీ విలన్ని కొట్టాలా? ఇవన్నీ చేయాలంటే కాస్త ట్రైనింగ్ కావాలి. రెగ్యులర్ ఫైట్స్‌కి అయితే అక్కర్లేదు. బీభత్సమైన ఫైట్స్‌కి అయితే శిక్షణ తీసుకోవాల్సిందే. అది హీరో అయినా హీరోయిన్ అయినా. ఈ మధ్య రిస్కీ రోల్స్ ఒప్పుకున్న కొందరు స్టార్స్ ‘మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’ నేర్చుకోవడానికి ప్రిపేర్ అయ్యారు. కిక్ బాక్సింగ్, కరాటే, కుంగ్ ఫూ, జూడో, కలరి పయట్టు వంటివన్నీ మార్షల్ ఆర్ట్స్ కిందే వస్తాయి. ఫైట్‌కి సూట్ అయ్యే ఆర్ట్ నేర్చుకుని బరిలోకి దిగనున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. మూడు నెలలు బ్యాంకాక్‌లో... హీరో మహేశ్‌బాబు– డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో జరిగే ఈ కథలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. పోరాట సన్నివేశాలు సహజంగా ఉండేందుకు కెరీర్లో తొలిసారి ఈ సినిమా కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోనున్నారట మహేశ్‌బాబు. ఇందుకోసం మూడు నెలల పాటు బ్యాంకాక్ వెళతారని టాక్. అక్కడ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్, హైకింగ్, ట్రెక్కింగ్ వంటివి నేర్చుకోనున్నారట. ఈ శిక్షణ ఇవ్వనున్న బ్యాంకాక్ స్టంట్ టీమ్‌కి ఓ హాలీవుడ్ ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ నేతృత్వం వహిస్తారని తెలిసింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ‘గుంటూరు కారం’లో నటిస్తున్నారు మహేశ్‌బాబు. ఈ చిత్రం పూర్తయ్యాక బ్యాంకాక్‌లో శిక్షణ తీసుకుని, రాజమౌళి సినిమా షూట్లో జాయిన్ అవుతారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు రాజమౌళి. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న సంగతి తెలిసిందే. థాయ్‌ల్యాండ్‌లో... తొలి చిత్రం ‘ఉప్పెన’తో (2021) బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత ‘కొండపొలం, రంగరంగ వైభవంగా’ వంటి చిత్రాల్లో నటించారు. ఈ మూడు చిత్రాల్లో సాఫ్ట్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులను అలరించిన ఆయన తొలిసారి ‘ఆదికేశవ’ చిత్రంలో ఫుల్ యాక్షన్ రోల్ చేశారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాల కోసం థాయ్‌ల్యాండ్‌లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు వైష్ణవ్ తేజ్. ఈ చిత్రంలో వైష్ణవ్‌కు జోడీగా శ్రీలీల నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 18న రిలీజ్ కానుంది. కలరి మార్షల్ ఆర్ట్‌లో... మలయాళ హీరో టొవినో థామస్ కలరి అనే మార్షల్ ఆర్ట్‌లో శిక్షణ పొందారు. టొవినో థామస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అజయంతే రందం మోషణం’. జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ పరంగా కేరళలోని కలరి అనే మార్షల్ ఆర్ట్‌కు ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉండటంతో టొవినో థామస్ ఈ విద్యలో శిక్షణ తీసుకుని నటిస్తున్నారు. ఈ చిత్రంలో కృతీ శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారతీయుడు కోసం... కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘భారతీయుడు 2’ కోసం కాజల్ అగర్వాల్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. ‘భారతీయుడు’ (1996) సినిమాకి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ (తమిళంలో ‘ఇండియన్ 2) రూపొందుతోంది. ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా కాజల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో పవర్ఫుల్ ఫైట్స్ చేయడం కోసం అతిపురాతనమైన యుద్ధ క్రీడ కలరి పయట్టు నేర్చుకున్నారు కాజల్. కలరి సాధన చేస్తున్న ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘షావోలిన్, కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో.. వంటి క్రీడలు కలరి నుంచి పుట్టుకొచ్చినవే’ అని పేర్కొన్నారామె. ఈ మూవీ కోసం గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు కాజల్ అగర్వాల్. -
ఆగస్టులో ఆదికేశవ
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగవంశీ, ఎస్. సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 18న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘ఆదికేశవ’. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలను వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ ప్రకటించింది. రాధిక, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్, కెమెరా: డడ్లీ. -
చరణ్ అన్న క్యూట్ గ ఉంటాడు..
-
పవర్ఫుల్ రుద్ర
అదొక చిన్న గ్రామం. ఆ గ్రామంలోని శివాలయాన్ని కొందరు గూండాలు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వారిని అడ్డుకోవడానికి రుద్ర రంగంలోకి దిగుతాడు. ఈ గొడవ ఎక్కడికి దారి తీసింది? తర్వాత ఏం జరిగింది? అనే కథాంశంతో హీరో వైష్ణవ్ తేజ్ తాజా చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘ఆది కేశవ’ అనే టైటిల్‌ని ఖరారు చేసి, పాత్రలను పరిచయం చేస్తూ సోమవారం ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్‌లో పవర్ఫుల్ రుద్రగా ఉగ్రరూపం చూపించారు వైష్ణవ్ తేజ్. చిత్ర పాత్రలో హీరోయిన్ శ్రీలీల, వజ్ర కాళేశ్వరి దేవిగా కీలక పాత్రలో అపర్ణా దాస్, విలన్‌గా జోజు జార్జ్ నటిస్తున్నారు. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్. నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్, కెమెరా: డడ్లీ. -
మెగా హీరో మాస్ యాక్షన్.. ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయిందిగా!
‘ఉప్పెన’ ఫేమ్ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆదికేశవ. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకునిగా పరిచయమవుతున్నారు. పెళ్లిసందడి ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. (ఇది చదవండి: వైష్ణవ్ తేజ్, శ్రీలీల మాస్ ఎంటర్టైనర్ వచ్చేస్తోంది..) తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రం జూలైలో ప్రేక్షకుల రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గ్లింప్స్ చూస్తే పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ లుక్‌లో కనిపించనున్నారు. Meet the Fiercest #PanjaVaisshnavTej in a new action avatar! 🔥👊🏻 Here's the First Glimpse of #Aadikeshava 💥⚡ ▶️ https://t.co/qAkurwAtlp July 2023 Release, In Theaters worldwide. 🤩@sreeleela14 @gvprakash #JojuGeorge @aparnaDasss #SrikanthNReddy @NavinNooli @dudlyraj… — Sithara Entertainments (@SitharaEnts) May 15, 2023 (ఇది చదవండి: అప్పట్నుంచి అన్నీ అమ్మతో అన్ని షేర్ చేసుకుంటున్నాను: శ్రీలీల) -
టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న కొత్త హీరోయిన్
మనోహరం, బీస్ట్ వంటి చిత్రాలతో మలయాళ, తమిళ ఇండస్ట్రీల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అపర్ణ దాస్. తాజాగా ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న నాలుగో చిత్రంలో (PVT04- వర్కింగ్ టైటిల్) కీలక పాత్రలో నటిస్తోంది అపర్ణా దాస్. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగవంశీ, ఎస్.సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వజ్ర కాళేశ్వరీ దేవి పాత్రను పోషిస్తోంది అపర్ణా దాస్. ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఆమె రాక సినిమాకు మరింత ఆకర్షణ అవుతుందని చిత్రయూనిట్ పేర్కొంది. చదవండి: 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా, ఎవరికీ చెప్పలేదు: నటి -
తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న మలయాళ నటుడు
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నూతన దర్శకుడు ఎన్.శ్రీకాంత్ రెడ్డి ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్.నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని చెంగారెడ్డి పాత్రలో మలయాళ నటుడు జోజు జార్జ్ నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేసింది చిత్రయూనిట్. ‘‘పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారంలో కనిపిస్తారు. ‘జోసెఫ్, నాయట్టు, ఇరాట్ట’ వంటి మలయాళ హిట్ ఫిల్మ్స్‌లో నటించిన జోజు జార్జ్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగులో ఆయనకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. Thank you ❤️🙏 https://t.co/1oHY9slrcV — joju george (@C_I_N_E_M_A_A) March 15, 2023 -
క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్.. ఈ సినిమాలు సూపర్ హిట్
ఫస్ట్ సీన్ అదిరిపోవాలి. హీరో ఇంట్రడక్షన్ కేక పుట్టించాలి. ఇంటర్వెల్ బ్యాంక్ మెస్మరైజ్ చేసేలా ఉండాలి. సినిమా అంతా బాగా రావాలనే తీస్తారు కానీ… ఇలా కొన్ని సీన్స్ మీద డైరెక్టర్స్ ప్రత్యే క శ్రద్ధ పెడతారు. ఎప్పటికప్పుడు ప్రేక్షకుడిని సర్ప్రైజ్ చేస్తూ కథలో లీనం అయ్యేలా చేయాల న్నదే మూవీ మేకర్స్ లక్ష్యం. మరి క్లైమాక్స్ సంగతేంటి ? అత్యంత కీలకం ఇదే. సినిమా అంతా బావుండి చివర్లో చెడిందనుకోండి…ఆడియన్స్ పెదవి విరిచేస్తారు. మూవీ యావరేజ్‌గా ఉన్నా…ఎండింగ్ అదిరిదంటే రిజల్ట్ హిట్టే. మరి అలాంటి క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సినిమాలపై లుక్కేద్దాం. ఉప్పెన సాధారణంగా ప్రేమ కథా చిత్రాల్లో తమ ప్రేమకి అడ్డుపడుతున్న వాళ్లని ఎదిరించి ప్రేమికులు ఒకటవుతారు లేకపోతే పెద్దల పంతాలకు బలైపోతారు. అదీ కాకుంటే హీరో, హీరోయిన్లలో ఒకరు చనిపోతారు. మరొకరు జీవచ్ఛావంలా మిగిలిపోతారు. ఎన్ని ప్రేమకథాచిత్రాలొచ్చినా క్లైమాక్స్‌లు మాత్రం ఇవే. కానీ…ఉప్పెన మాత్రం ఎవరూ ఊహించని రీతిలో ముగింపు తీసు కుంది. మగాడు అన్న పదానికి సరికొత్త అర్థం ఇస్తూ…ఎవరూ ఊహించని క్లైమాక్స్‌ని ఫిక్స్ చేసేశాడు దర్శకుడు బుచ్చిబాబు. తొలి రోజు క్లైమాక్స్ కేంద్రంగా నెగిటివ్ టాక్ నడిచినా…ఆ తరహా ముగింపుకి ప్రేక్షకులు మద్దుతు ప్రకటించారు. ఉప్పెనని వంద కోట్ల క్లబ్లో కూర్చోపెట్టేశారు. రంగస్థలం రామ్ చరణ్ ‘రంగస్థలం’ క్లైమాక్స్ కూడా ఊహించని ట్విస్ట్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది. మొదటి నుంచి జగపతిబాబునే విలన్‌గా చూపిస్తూ వస్తారు. నిజానికి ప్రెసిడెంట్‌గారు విలనే. కానీ…మూవీలో అసలు విలన్ మాత్రం కాదు. ఆ విషయం చివరి వరకు ప్రేక్షకులు గమనించకుండా స్క్రీన్‌ప్లే ని చక్కగా రెడీ చేసుకున్నాడు సుకుమార్. చివర్లో ప్రకాష్‌రాజ్ విలన్ అని తెలిసే సరికి సగటు ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఒక మంచి సినిమా చూశామన్న ఫీల్‌తో పాటుగా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో థియేటర్ నుంచి బయటకుకొచ్చారు. ఆర్ఎక్స్ 100 క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వాలని దర్శకుడు డిసైడ్ అయినప్పుడు… ఊహించని మలుపులు. ముసుగులేసుకున్న పాత్రలు లాంటి వాటితోనే కథని అల్లుకుంటాడు. అలాంటి ఒక కథతో యూత్ అటెన్షన్‌ని గెయిన్ చేసిన చిత్రం ఆర్ఎక్స్ 100. పిల్లారా పాటలో సినిమా విడుదలకు ముందే బజ్ క్రియేట్ చేసింది ఆర్ఎక్స్ 100. ఫస్ట్ మూవీతోనే కార్తికేయ హీరోగా మంచి మార్కులు కొట్టేశారు. పాయల్ రాజ్పుట్ కి గ్లామర్ ఇమేజ్ క్రియేట్ చేసింది. అన్నింటికీ మించి క్లైమాక్స్ మాత్రం ఆడియన్స్ ఊహాలకు అందలేదు. యాన్ ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ అన్న ట్యాగ్‌లైన్‌తో మొదటి నుంచి ఆసక్తి రేపిన ఆర్ఎక్స్ 100…క్లైమాక్స్ కోణంలో మాత్రం అలజడి రేపింది. హీరోయిన్ తండ్రి విలన్ అన్నట్టుగా సినిమా ని ముందుకు తీసుకువెళ్లి…మరొకరిని విలన్‌గా చూపించడం చాలా సినిమాల్లో చూసిందే. కానీ దర్శకుడు అజయ్ భూపతి ఏకంగా హీరోయిన్నే విలన్‌గా చూపించేసి ఆడియన్స్‌ని షాక్‌కి గురిచేశాడు. అలానే…చివరకు హీరోని చంపేసి ప్రేక్షకుల్లో భావోద్వేగాలను పూర్తి స్థాయి లో పెంచేసి థియేటర్ నుంచి బయటకు పంపాడు. కేరాఫ్ ‘కంచరపాలెం’ చిన్న సినిమాగా వచ్చి ఘన విజయం సాధించిన కేరాఫ్ ‘కంచరపాలెం’ క్లైమాక్స్ కూడా ఊహించని విధంగా ఉంటుంది. ఈ చిత్రంలో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. ఒక్కో కథకి ఏమాత్రం సంబంధం ఉండదు. అసలు వీళ్లందరినీ దర్శకుడు ఎలా కలుపుతాడు ? కలపడా ? ఎవరి కథ వారిదేనా ? ఇలా రకరకాల సందేహాలు సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులని వేధిస్తూనే ఉంటాయి. చివర్లో ఇవి నాలుగు కథలు కాదు. ఒక కథే. ఆ నలుగురు…ఈ రాజే అంటూ దర్శకుడు ఇచ్చే ట్విస్ట్‌కి థియేటర్లు ఈలలతో మార్మో గాయి. ఎలాంటి సినిమా అయినా సరే…మూవీ స్టార్టింగ్‌లో ఈలలు వినిపిస్తాయి. లేకపోతే పవర్ఫుల్ డైలాగో, అదిరిపోయే పాటో వచ్చినప్పుడు విజిల్స్ కామన్. కానీ క్లైమాక్స్‌తో ప్రేక్షకు లు చప్పట్లు, విజిల్స్‌తో సంతోషాన్ని వ్యక్తం చేయడం చాలా అరుదు. ఆ అరుదైన అనుభ వాన్ని కేరాఫ్ కంచరపాలెం సినిమా సొంతం చేసుకుంది. ఎవరు డిఫరెంట్ క్లైమాక్స్‌తో ఆడియన్స్‌ని షాక్ ఇచ్చిన చిత్రాల్లో ఎవరు ఒకటి. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఒక మిస్సింగ్ కేసు గురించి చెబుతూ ఉండటంతో సినిమా మొదలవుతుంది. హఠాత్తుగా ఆ కేసు నుంచి ఆడియన్స్‌కి ఫోకస్‌ని తప్పించి, ఇంటర్వెల్ పాయింట్‌కి అసలు కథతో లింక్ చేయడం. అసలు ఈ స్క్రీన్‌ప్లే నే భలే ట్విస్ట్‌గా అనిపిస్తే…ఇక బాధితురాలే నేరస్తురాలు. హీరోయినే విలన్ అన్న ట్విస్ట్ మరింతగా ప్రేక్షకులకి మజాని ఇస్తుంది. మత్తువదలరా సింపుల్ క్రైమ్ కథని కాంటెంపరరీ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా వెండితెర పై ప్రజెంట్ చేసిన చిత్రం మత్తువదలరా. సీరియస్ సీన్స్‌లోనూ కామెడీ మిస్ కాకుండా జాగ్రత్త పడటంతో తొలి రోజు నుంచే సినిమాకి పాజిటివ్ బజ్ వచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ పద్దతిలో జరిగే చోటా స్కామ్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో కథ మొదలవుతుంది. ఒక 5 వందల రూపాయల కోసం చేసిన చిన్న తప్పు కథానాయకుడి జీవితాన్ని పెద్ద సమస్యలో పడేస్తుంది. విలన్ ఎవరన్నది రివీల్ అయిపోయా క ఇక క్లైమాక్స్ రెగ్యులర్ ఫార్మెట్‌లోనే ఉంటుందని ఆడియన్స్ భావిస్తారు. కానీ… క్లైమాక్స్‌లో ఊహించని విధంగా నోట్ల రద్దు అంటూ ఇచ్చిన ట్విస్ట్ ఆడియన్స్‌ని థ్రిల్ చేసింది. హిట్ హీరో నాని నిర్మాత అనగానే…హిట్ మూవీ చుట్టూ ఒక అటెన్షన్ ఏర్పడింది. అనుకున్నట్టుగా నే డిఫరెంట్ క్లైమాక్స్‌తో…ఆడియన్స్‌ని థ్రిల్ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు లో కనిపించకుండా పోయిన ఒక టీనేజ్ అమ్మాయి, ఆ కేస్కి లింక్ అవుతూ మిస్ అయిన మరో యువతి. ఆడి యన్స్ని ఇన్‌స్టంట్‌గా ఎంగేజ్ చేయడానికి దర్శకుడు శైలేష్ కొలను చేసిన ఈ సెటప్ బానే వర్కౌట్ అయింది. హీరోతో పాటుగా ఉంటూ కేసుని పరిశోధన చేస్తున్న అతని మిత్రుడే విలన్ అంటూ క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్…థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మిస్టరీ చేధించే డిటెక్టివ్ సినిమాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. కానీ ఎక్కువుగా రావు. ఎందుకంటే…మిస్టరీ జానర్లో సస్పెన్స్‌ని హోల్డ్ చేసి ఉంచడం చాలా కీలకం. అలాంటి కీలక మైన అంశాన్ని వెండితెర మీద చక్కగా పెర్ఫామ్ చేయడంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సక్సెస్ అయ్యాడు. బాధితురాలు అన్నకున్న క్యారెక్టరే…అస్సలు ఈ భూమ్మీదే లేదనుకున్న క్యారెక్టరే…విలన్ అన్న ట్విస్ట్…మిస్టరీ జానర్ ని మజా చేస్తాయి. ఆ! సినిమాకి క్లైమాక్స్ బలం కావాలి. సినిమాకి క్లైమాక్స్ మరింత మైలేజ్ ఇచ్చేలా ఉండాలి. కానీ …క్లైమాక్స్ ట్విస్ట్ మీదే ఆధారపడి కథని రాసేసుకుని, సినిమా తీసేస్తే…అది ఆ! మూవీ నే అవుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. క్లైమాక్స్‌కి వచ్చిన తర్వాత కానీ దర్శకుడి ప్రతిభ అర్థం కాదు. అయితే…అప్పటి దాకా నడిచిన సినిమా మొత్తం ఆడియ న్స్‌కి అయోమయంగానే అనిపిస్తుంది. దీంతో…ఆ ! చిత్రం హిట్ మూవీస్ జాబితా లోకి అయితే ఎక్కలేదు. - దినేష్ రెడ్డి వెన్నపూస, డిప్యూటీ న్యూస్ ఎడిటర్ -
వైష్ణవ్ తేజ్, శ్రీలీల మాస్ ఎంటర్టైనర్ వచ్చేస్తోంది..
‘ఉప్పెన’ ఫేమ్ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించి, వైష్ణవ్ తేజ్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో వైష్ణవ్ సరికొత్త మాస్ అవతారంలో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. టైటిల్‌తో పాటు, చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డుడ్లే. A journey of the fierce one, #PVT04 in theatres from this 29 April 2023! 🔥@sreeleela14 #SrikanthNReddy @vamsi84 #Dudley #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/jk0vrf5fPQ — Panja Vaisshnav Tej (@VaisshnavTej) January 2, 2023 -
ఒకే ఫ్రేంలో రామ్ చరణ్-అల్లు అర్జున్.. మురిసిపోతున్న ఫ్యాన్స్
మెగా ఇంట క్రిస్మస్ సందడి నెలకొంది. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా మెగా-అల్లు ఫ్యామిలీ ప్రీ-క్రిస్మస్ను సెలబ్రెట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎలాంటి పండగైన, బర్త్‌డే సెలబ్రెషన్స్ అంటే మెగా-అల్లు ఫ్యామిలీ ఒక్కచోట చేరుతారు. ఈ నేపథ్యంలో ప్రీ-క్రిస్మస్ వేడుకలో భాగంగా మెగా ఇంట సీక్రెట్ శాంట గేమ్ నిర్వహించారు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? ఆమెతోనే ఏడడుగులు! ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, అల్లు అర్జన్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, మెగా డాటర్స్ నిహారిక కొణిదేల, సుష్మితా కొణిదెల, శ్రీజలతో పాటు అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి, చరణ్ వైఫ్ ఉపాసన, మిగతా కజిన్స్ అంతా పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను ఉపాసన సీక్రెట్ శాంట అంటూ షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మెగా హీరోలందరిని ఒకేఫ్రేంలో చూసి ఫ్యాన్స్ అంత మురిసిపోతున్నారు. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
హీరో వైష్ణవ్ తేజ్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
సంక్రాంతి సంబరం... సమరం
సంక్రాంతి పండగ సెలవుల్లో వినోదం పంచడానికి సినిమాలు రెడీ అవుతున్నాయి. ప్రేక్షకులకు సినిమా సంబరం.. హీరోలకు బాక్సాఫీస్ సమరం. ఈసారి పండగ బరిలో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఉన్నాయి. ఇంతకుముందు ఈ ఇద్దరూ సంక్రాంతికి చాలాసార్లు పోటీపడ్డారు. ఇక పండగకి రానున్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. వీరయ్య విజృంభణ దాదాపు ఆరేళ్ల తర్వాత సంక్రాంతి పండక్కి రానున్నారు చిరంజీవి. 2017 సంక్రాంతికి ‘ఖైదీ నంబరు 150’ చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ (ప్రచారంలో ఉన్న టైటిల్)గా వస్తున్నారు చిరంజీవి. రవితేజ ఓ లీడ్ రోల్లో, శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. విశాఖపట్నం నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్–పోలీస్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోందని తెలిసింది. వీరసింహారెడ్డి విశ్వరూపం సంక్రాంతి పండక్కి చివరిసారిగా రిలీజైన బాలకృష్ణ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఆరేళ్ల తర్వాత బాలకృష్ణ సంక్రాంతికి ‘వీర సింహారెడ్డి’గా నట విశ్వరూపం చూపించనున్నారు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన యాక్షన్ డ్రామాగా రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఆదిపురుష్ ఆగమనం ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ వేసవిలో విడుదలైంది. దీంతో ‘ఆదిపురుష్’ సినిమాను ఎలాగైనా 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్రభాస్ స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయినట్లు ఉన్నారు. అందుకే ‘ఆదిపురుష్’ను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించింది చిత్రయూనిట్. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మైథలాజికల్ ఫిల్మ్‌లో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతీ సనన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. భూషణ్‌కుమార్, క్రషణ్‌కుమార్, రాజేష్ నాయర్, ప్రసాద్ సుతార్, ఓం రౌత్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. వారసుడు వస్తున్నాడు తమిళ హీరో విజయ్ తెలుగులో ‘వారసుడు’గా సంక్రాంతి పండగకి వస్తున్నాడు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’). ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఓ సంపన్న ఉన్నత కుటుంబానికి వారసుడిగా వచ్చిన ఓ దత్తపుత్రుడు నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. వైష్ణవ్ తేజ్ కూడా... వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీలీల హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు ఏడెనిమిదిసార్లు సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ చిరంజీవి, బాలకృష్ణ ఇప్పుడు మరోసారి బరిలో నిలుస్తున్నారు. ఈ సంక్రాంతికి చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇక గతంలో సంక్రాంతి పండగకి కాస్త ముందూ వెనకా విడుదలైన చిరంజీవి, బాలకృష్ణల చిత్రాలేంటంటే... ఈ చిత్రాలు సంక్రాంతి సందర్భంగా వచ్చినా ఒకే తేదీన రాలేదు. ఒక్క 2001లో మాత్రమే చిరంజీవి నటించిన ‘మృగరాజు’, బాలకృష్ణ నటించిన ‘సమరసింహా రెడ్డి’ చిత్రాలు సంక్రాంతి సందర్భంగా ఒకే రోజున అంటే జనవరి 11న విడుదలయ్యాయి. మరి...ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ రిలీజ్ డేట్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. -
Ranga Ranga Vaibhavamga Review: 'రంగరంగ వైభవంగా’ మూవీ రివ్యూ
టైటిల్ : రంగరంగ వైభవంగా నటీనటులు : వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ, ప్రభు, నరేశ్ అలీ, సుబ్బరాజు, సత్య తదితరులు నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్ దర్శకత్వం: గిరీశాయ సంగీతం : దేవీశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ: శామ్ దత్ ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్ రావు విడుదల తేది: సెప్టెంబర్ 2, 2022 తొలి సినిమా ‘ఉప్పెన’తోనే యూత్ ఆడియన్స్ మనసు దోచుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఎంతో అనుభవం ఉన్న నటుడిలా వెండితెరపై కనిపించాడు. అయితే రెండో సినిమా ‘కొండపొలం’మాత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న వైష్ణవ్.. ఇప్పుడు ‘రంగరంగ వైభవంగా’అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రంగరంగ వైభవంగా’చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. రిషి(వైష్ణవ్), రాధ(కేతికా శర్మ) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. ఇరు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంటుంది. కానీ రిషీ, రాధలకి మాత్రం ఒకరంటే ఒకరు పడదు. తరచూ గొడవ పడుతుంటారు. వీరి వయసుతో పాటు గొడవలు కూడా పెరుగుతూనే వస్తాయి. పెద్దయ్యాక వీరిద్దరు ఓ మెడికల్ కాలేజీలో చేరతారు. అక్కడ కూడా వీరిద్దరు గొడవ పడుతూనే ఉంటారు. అయితే రిషీకి మాత్రం రాధపై అమితమైన ప్రేమ ఉంటుంది కానీ.. పైకి కోపంగా ఉంటాడు. వీరిద్దరు కలిసే సమయానికి ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలవుతాయి. అసలు ఆ గొడవలకు కారణం ఏంటి? తమ కుటుంబాలను కలపడం కోసం రిషీ, రాధలు ఏం చేశారు? చివరకు రిషీ, రాధల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. 'అర్జున్ రెడ్డి`ని తమిళంలో రీమేక్ చేసిన దర్శకుడు గిరీశాయ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేసిన తొలి చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా 'రంగ రంగ వైభవంగా' తెరకెక్కించారు. వైష్ణవ్, కేతికా శర్మ పాత్రల చైల్డ్‌హుడ్ సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతోంది. మెడికల్ స్టూడెంట్స్‌గా వైష్ణవ్, కేతికా శర్మలో కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కథంతా సరదాగా సాగుతుంది. రిషీ, రాధల మధ్య వచ్చే క్యూట్ ఫైట్స్, రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకుంటాయి. సత్యతో వచ్చే సీన్స్ కూడా నవ్వులు పూయిస్తుంది. కావాల్సిన కామెడీ ఉన్నప్పటికీ.. కథనం మాత్రం రొటీన్‌గా సాగడం మైనస్. ఇక సెకండాఫ్‌లో మాత్రం కథంతా సింపుల్ గా సాగుతుంది. మెడికల్ క్యాంపులో భాగంగా హీరో హీరోయిన్లు గ్రామానికి వెళ్ళడం..అక్కడ మళ్ళీ ఇద్దరు కలవడం, తమ ఫ్యామిలీలను కలిపేందుకు ప్లాన్ చేయడం..ఇలా రొటీన్ గా సాగుతుంది. సర్పంచ్ సత్తిబాబుగా సత్య చేసే కామెడీ నవ్వులు పుయిస్తుంది.అలానే కార్తీక దీపం సీరియల్ సీన్‌తో ఇద్దరి తల్లులను కలపడం ఆకట్టుకుంటుంది. ఎన్నికల సీన్ సాగదితగా ఉంటుంది. ఈ సినిమాలోని కొన్ని సీన్లు గతంలో వేరే సినిమాలను గుర్తు చేసేలా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు కాపీ కొట్టినట్లు అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, పాటలు, విజువల్స్ బావున్నా దర్శకుడు ఎంచుకున్న కథ, స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్ పండకపోవడం, సెకెండాఫ్, తేలిపోయిన క్లైమాక్స్ ఈ చిత్రానికి మైనస్‌గా మారాయి. ప్రభు, నరేశ్ అలీ, సుబ్బరాజు, నవీన్ చంద్ర మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు మరింత పనిచెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. మొత్తంగా ఇదొక రొటీన్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. -
‘రంగరంగ వైభవంగా’ ట్విటర్ రివ్యూ
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్.`అర్జున్ రెడ్డి`ని తమిళంలో రీమేక్ చేసిన దర్శకుడు గిరీశాయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 2)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. , మెగా ఫ్యామిలీ హీరో నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కిన ఈ చిత్రంపై వైష్ణవ్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రయోగాత్మకంగా చేసిన కొండపొలం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని తనకు అచ్చొచ్చిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది.దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘రంగరంగ వైభవంగా’ కథేంటి? సినిమా ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. నెటిజన్స్ నుంచి ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. రంగరంగ వైభవంగా మంచి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ అని కొంతమంది అంటుంటే.. రొటీన్ ఫ్యామిలీ డ్రామా అని మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #RangaRangaVaibhavanga getting Below Average Reviews from the USA Premiere Shows 🇺🇲 — VCD (@VCDtweets) September 2, 2022 ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని చెబుతున్నారు. క్లీన్ లవ్‌స్టోరీతో సినిమా సాగుతుందట. అయితే ఊహకందేలా సినిమా సాగడంతో ప్రేక్షకుడికి అంతగా ఆసక్తి కలించదని చెబుతున్నారు. సత్యతో కామెడీ సీన్స్ నవ్వులు పూయిస్తుందని అంటున్నారు. సెకండాఫ్‌తో పోలిస్తే.. ఫస్టాఫ్ కాస్త బెటర్అని అంటున్నారు. ఓవరాల్‌గా రంగరంగ వైభవంగా యావరేజ్ సినిమా అని చెబుతున్నారు. నెట్టింట కూడా ఈ సినిమాకు ఎక్కువగా బజ్ లేకపోవడం గమనార్హం. #RangaRangaVaibhavanga from USA Started with a Mediocre Outdated Story With a Vexing screenplay🤦🏻♂️🤦🏻♂️, Turned to Lackluster TV serial with Ultra bad Dialouges, poor editing👎🏻 and Jump cuts. Only good is Music, Camera and Satya Comedy. #PanjaVaisshnavTej pic.twitter.com/CdsxynAxbC — Pradyumna Reddy (@pradyumna257) September 2, 2022 ఇక వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం విడుదలైన సందర్భంగా మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయితేజ్‌తో పాటు పలువురు నటులు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. #Vaisshu babu wish you all the best for your release tomorrow 🤗😘 I know the love & effort that has gone into this film. Wishing good luck to the entire team of #RangaRangaVaibhavanga.@BvsnP Garu, Baapineedu Anna@TheKetikaSharma @ThisIsDSP @GIREESAAYA @SVCCofficial pic.twitter.com/U6qOETmVdS — Sai Dharam Tej (@IamSaiDharamTej) September 1, 2022 My best wishes to the Vaishnav , @TheKetikaSharma , @GIREESAAYA and the entire team of #RangaRangaVaibhavamga Wishing you’ll a blockbuster!💯 pic.twitter.com/OLPuXYg813 — Varun Tej Konidela (@IAmVarunTej) September 1, 2022 -
ఆ సినిమా రీమేక్‌లో నటించాలని ఉంది
‘‘రంగ రంగ వైభవంగా’లో ఎంటర్టైన్మెంట్తో పాటు అందమైన ప్రేమకథ, భావోద్వేగాలు, ఫ్యామిలీ డ్రామా.. ఇలా అన్నీ ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు వైష్ణవ్ తేజ్. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా నటించిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. బాపినీడు .బి సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ పంచుకున్న విశేషాలు. ► నా సినిమా కథల ఎంపికలో ఓ ప్రేక్షకునిగా ఆలోచిస్తాను. ఈ విషయంలో సాయిధరమ్ తేజ్ (వైష్ణవ్ అన్న) తో పాటు ఎవరి సపోర్ట్ తీసుకోను. నేనే ఎంచుకుంటున్నాను. గిరీశాయ కథ చెప్పిన విధానం, కథపై ఆయనకు ఉన్న నమ్మకం నచ్చింది. పైగా ఆయన మంచి అనుభవం ఉన్న దర్శకుడు. అందుకే ‘రంగ రంగ వైభవంగా’ చేశా. ► ఈ సినిమాలో చాలామంది సీనియర్ నటీనటులున్నారు. సీనియర్స్‌తో నటించడం వల్ల వారి అనుభవం, అంకితభావం వంటి విషయాలు తెలుసుకున్నాను. నటన విషయంలో మెగా ఫ్యామిలీలోని అందరి నుంచి స్ఫూర్తి పొందుతుంటాను. ► బీవీఎస్ఎన్ ప్రసాద్‌గారి లాంటి సీనియర్ నిర్మాత బేనర్లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఆయనే మంచి టీమ్‌ని సెట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. శ్యామ్దత్గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ► ‘ఉప్పెన’తో నాకు పెద్ద హిట్ వచ్చింది. ఆ తర్వాత చేసిన ‘కొండపొలం’ మేము అనుకున్నంతగా ఆడలేదు.. అందుకు ఎలాంటి బాధ లేదు. నా ప్రతి సినిమా రొటీన్‌గా కాకుండా వైవిధ్యంగా ఉండాలనుకుంటాను. పెదనాన్న (చిరంజీవి), బాబాయ్ (పవన్ కల్యాణ్) సినిమాలను నేను రీమేక్ చేయడమంటే సాహసమే. మంచి కథ కుదిరి, డైరెక్టర్ నన్ను కన్విన్స్ చేయగలిగితే ‘బద్రి’ సినిమా రీమేక్‌లో నటించాలనుంది. ప్రస్తుతం సితార బ్యానర్లో కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. -
రంగ రంగ వైభవంగా సినిమా చిట్ చాట్
-
హీరోగా వైష్ణవ్ తేజ్.. అదే నా బిగ్గెస్ట్ సక్సెస్: సాయిధరమ్ తేజ్
‘‘రంగ రంగ వైభవంగా’ హిట్ అవుతుందా? బ్లాక్‌బస్టర్ అవుతుందా? అనేది నాకు తెలియదు. కానీ నా తమ్ముణ్ణి (వైష్ణవ్ తేజ్) మీరు(ప్రేక్షకులు) హీరోగా యాక్సెప్ట్ చేశారు. అదే నా బిగ్గెస్ట్ సక్సెస్’’ అని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా గిరీశాయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా..’. బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘మళ్లీ ఇలా స్టేజ్‌పైకి వస్తానని ఊహించలేదు. నేను బైక్ ప్రమాదానికి గురైనప్పుడు హెల్మెట్ ధరించడం వల్లే బతికాను. మీరు కూడా బైక్‌పై వెళ్లేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించండి. వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’ హిట్ అవడంతో ఆనందపడ్డాం. నా ‘రిపబ్లిక్’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్న టైమ్‌లో సెప్టెంబరు 10న నాకు బైక్ ప్రమాదం జరిగింది. హాస్పిటల్లో పడుకుని ఉన్నప్పుడు నా తమ్ముడు వచ్చి ‘అన్నా..’ అని నన్ను పిలిస్తే పలకలేకపోయాను(భావోద్వేగంతో..). ఆ సమయంలో అమ్మ, నాన్న, నా తమ్ముడు నాతో ఉన్నారు. వైష్ణవ్ నా పక్కన ఉంటే నాకు ధైర్యం. వీడు నా బలం. సెప్టెంబరు 2న నా గురువుగారి (పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ..) బర్త్ డే. ఈ సినిమా చూసి గరువుగారి బర్త్ డే చేసుకోండి’’ అన్నారు. హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ – ‘‘పెదనాన్న (చిరంజీవి), బాబాయ్(పవన్ కల్యాణ్) మాకు చెప్పింది ఒక్కటే.. ‘నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో అని’. మూడు సినిమాలు చేసినా వైష్ణవ్ తన కష్టాన్నే నమ్ముకున్నాడు’’ అన్నారు. ‘‘గిరిగారు కథ చెప్పినప్పుడు చాలా ఎగై్జట్ అయ్యాను’’ అన్నారు వైష్ణవ్‌తేజ్. ‘‘వైష్ణవ్‌గారు సెట్స్‌లో నాకు ఇచ్చిన రెస్పెక్ట్‌కి నా పదిహేనేళ్ల కష్టాన్ని మర్చిపోయాను’’ అన్నారు గిరీశాయ. ‘‘మెగా హీరోలతో నేను చేసిన సినిమాలన్నీ హిట్స్ సాధించాయి. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. నటులు అలీ, నాగినీడు, కెమెరామేన్ శ్యామ్‌దత్ పాల్గొన్నారు. -
మా నాన్న కల నిజం అయినందుకు హ్యాపీ: కేతికా శర్మ
‘‘విభిన్నమైన వృత్తుల్లో (పాత్రల్లో) కనిపించగలిగే అవకాశం యాక్టర్స్‌కు మాత్రమే దక్కుతుంది. అందుకే నేను యాక్టర్‌ని అయినందుకు సంతోషంగా ఉంది. నా పేరెంట్స్, తాతగారు డాక్టర్స్. మా నాన్నగారు నన్ను డాక్టర్‌గా చూడాలనుకున్నారు. కానీ నా ఇష్టం మేరకు నేను యాక్టర్‌ని అయ్యాను. అయితే ‘రంగ రంగ వైభవంగా..’ చిత్రంలో మెడికల్ స్టూడెంట్ రాధగా నటించాను. అలా స్క్రీన్‌పై డాక్టర్‌గా కనిపించాను. ఈ విధంగా మా నాన్నగారి కల నిజం అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు కేతికా శర్మ. వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా గిరీశాయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా..’. బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కేతికా శర్మ మాట్లాడుతూ– ‘‘ప్రతి సినిమా నాకో లెర్నింగ్ ఎక్స్‌పీరియన్సే.‘రొమాంటిక్’, ‘లక్ష్య’ చిత్రాలతో యూత్ ఆడియన్స్‌కు దగ్గరైన నేను ‘రంగరంగ వైభవంగా..’తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర కానున్నందుకుసంతోషంగా ఉంది. ఇందులో నేను చేసిన రాధ పాత్రలో ప్రతి అమ్మాయి తనను తాను కొంచెం అయినా ఊహించుకుంటుంది’’ అన్నారు. -
తిరుపతిలో సందడి చేసిన రంగరంగ..వైభవంగా మూవీ టీమ్
సాక్షి, తిరుపతి: తిరుపతిలో రంగరంగ వైభవంగా చిత్ర యూనిట్ సందడి చేసింది. ఓ ప్రయివేటు హోటల్లో శుక్రవారం హీరో వైష్ణవతేజ్, హీరోయిన్ కృతికశర్మ, దర్శకుడు గిరిశాయ, నిర్మాత బీవీఎన్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. తిరుపతి నుంచి వైజాగ్ వరకు చిత్ర ఫ్రీ ఈవెంట్ నిర్వహిస్తున్నామన్నారు. గత రెండు చిత్రాలకంటే భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని, సెప్టెంబర్ 2న థియేటర్లలో సందడి చేస్తుందని వారు పేర్కొన్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చదవండి: (Liger Movie: థియేటర్ వద్ద రచ్చ చేసిన పూరీ ఫ్యామిలీ) -
తిరుపతిలో ‘రంగ రంగ వైభవంగా’ మూవీ టీమ్ (ఫొటోలు)
-
ఆ సీన్ చేస్తున్నప్పుడు చిరు మామ నాపై సీరియస్ అయ్యారు: వైష్ణవ్
శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో హీరోగా పరిచయమయ్యాడు. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని ఒక్కసారిగా దర్శక-నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కొండపొలంతో మరో హిట్ అందుకున్న వైష్ణవ్ ప్రస్తుతం రంగ రంగ వైభవంగా అనే మరో ప్రేమకథ చిత్రంలో నటిస్తున్నాడు. గిరీశయ్యా దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వైష్ణవ్ డైరెక్టర్ గిరీశయ్యాతో కలిసి ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. చదవండి: సౌందర్యతో అలాంటి రిలేషన్ ఉండేది, అసలు విషయం చెప్పిన జగ్గూభాయ్ ఈ సందర్భందగా శంకర్ దాదాలో మీ పెద్ద మామయ్య(మెగాస్టార్ చిరంజీవి)తో కలిసి నటించావ్ కదా ఆయన నీకు ఏమైనా సలహాలు, సూచనలు ఇచ్చేవారా? అని అడగ్గా.. ‘ఈ సినిమాలో నా పాత్ర అసలు కదలకూడదు, కల్లు అర్పకూడదు. అయితే ఒక సీన్లో బాగా నవ్వేశాను. దీంతో మామయ్య(చిరంజీవి) అప్పుడు కొంచ్ం సీరియస్ అయ్యారు’ చెప్పాడు. ఇక ఫ్యామిలీ ఫంక్షన్స్, గ్యాదరింగ్ అయితే తేజ్ అంటే అందరు ఒకేసారి తిరిగి చూస్తారా? అడిగారు హోస్ట్. దీనికి ‘‘చిరు మామ ఓరేయ్ అని పిలిస్తే చాలు.. మేమంతా పలుకుతాం. ఇక ఉప్పెన స్క్రీప్ట్‌ను మొదట నా ఫ్రెండ్స్‌తో కలిసి విన్నాను. ఆ తర్వాత సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ ఈ కథను చిరంజీవి మామయ్యకు వినిపించారు. చదవండి: తారక్ వల్లే నా పెళ్లి జరిగింది: ప్రముఖ నిర్మాత కూతురు ‘ఐడియా బాగుంది.. సినిమా తీయండి’ అని ఆయన అన్నారు’’ అని చెప్పుకొచ్చాడు. ఉప్పెన మూవీలోని రొమాంటిక్ సాంగ్(జల జల జలపాతం నువ్వు) చేసేటప్పుడు ఇబ్బంది పడ్డానన్నాడు. చూట్టు వందమంది ఉన్నారని, అంతమంది ముందు ఎలా చేయాలా? అనిపించదన్నాడు. ఈ సినిమాలో ఓ సీన్ చేసేటప్పుడు తాను నిజంగా ఏడ్చానని, బేబమ్మ నీకో మాట చెప్పాలనే సన్నివేశానికి దాదాపు 20పైనే టేక్ తీసుకున్నానన్నాడు. అది చేసేటప్పుడే అందరి సమయాన్ని, డబ్బును వృథా చేస్తున్నానని గుర్తు రాగానే కన్నీళ్లు వచ్చాయన్నాడు. ఇక చిన్న మామయ్య(పవన్ కల్యాణ్) తమ్ముడు, బద్రి సినిమాలను తాను సుమారు 120 సార్లు చూశానని వైష్ణవ్ పేర్కొన్నాడు. -
‘రంగరంగ వైభవంగా’ ట్రైలర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
-
‘రంగరంగ వైభవంగా’ ట్రైలర్ వచ్చేసింది
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. (చదవండి: ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్, తారక్ సర్కస్ చేశారు.. ఆ దర్శకుడి చిత్రాలేవి నచ్చవు: ఆర్జీవీ) చిన్నప్పటి నుంచి గొడవపడే ఓ అబ్బాయి, అమ్మాయి ఎలా ప్రేమలో పడ్డారు? చివరకు వాళ్లు ఒక్కటయ్యారా లేదా అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. కాలేజ్, ఫ్యామిలీ ఇలా సరదాగా సాగిపోతున్న హీరో కొన్ని పరిస్థితుల కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. ఆ తరువాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథాంశమని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇక ట్రైలర్ చివరల్లో ‘నాన్నా ఇప్పటి వరకు ఒకలెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క చెప్పను.. చూపిస్తా’అంటూ వేష్ణవ్ చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
రంగరంగ వైభవంగా రిలీజ్ ఎప్పుడో తెలుసా?
ఉప్పెన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం అతడు నటిస్తున్న తాజా చిత్రం 'రంగరంగ వైభవంగా'. కేతిక శర్మ కథానాయిక. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. శామ్‌దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. సెప్టెంబర్ 2న రంగరంగ వైభవంగా మూవీని థియేటర్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. మరి ఈ సినిమాతో వైష్ణవ్ మరో హిట్ అందుకుంటాడేమో చూడాలి! The Love, Laughter & Drama filled Youthful Family Entertainer #RangaRangaVaibhavanga locks a POWERFUL Release Date 💥🤙In theatres from September 2nd 🎦🍿#PanjaVaisshnavTej @TheKetikaSharma @ThisIsDSP @GIREESAAYA @SVCCofficial @BvsnP @SonyMusicSouth#RRVOnSep2nd pic.twitter.com/dfZwocn3pN— SVCC (@SVCCofficial) July 13, 2022 చదవండి: ప్రముఖ నటి కుమార్తెపై ట్రోలింగ్.. హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై జీవితంలోని కష్టాలను నీ ప్రేమతో గెలిచేస్తా.. కల్యాణ్ ఎమోషనల్ పోస్ట్ -
‘రంగరంగ వైభవంగా’ మూవీ (ఫొటోలు)
-
రంగరంగ వైభవంగా టీజర్ వచ్చేసింది..
పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'రంగరంగ వైభవంగా'. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేతిక శర్మ వైష్ణవ్‌తో జోడీ కట్టింది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైంది. నన్నే చూస్తావ్, నా గురించే కలలు కంటావు, నన్నే ప్రేమిస్తావు, కానీ నీకు నాతో మాట్లాడటానికి ఈగో.. అంటూ హీరోయిన్ వాయిస్‌తో టీజర్ మొదలైంది. ఈ మూవీలో హీరోహీరోయిన్లు టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్‌తో మాట్లాడకపోయినా సరే, ఆమె ఆపదలో ఉందంటే మాత్రం ఆదుకునేందుకు క్షణాల్లో బయలుదేరతాడని కనిపిస్తోంది. మొత్తానికి టీజర్ మాత్రం ఇంట్రస్టింగ్ ఉంది. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. శామ్‌దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చదవండి: ఆ సినిమాకు మొదట మిశ్రమ రివ్యూలు వచ్చాయి: హీరో చైతూతో డేటింగ్‌పై స్పందించిన శోభిత, వీడియో వైరల్! -
వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా.. ఆకట్టుకుంటున్న వీడియో
PVT04 Shooting Started Announcement Video Released: పంజా వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వైష్ణవ్ 'రంగరంగ వైభవంగా' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో మరో చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా నేడు జూన్ (22) ఉదయం 11.16 నిమిషాలకు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో అతిరథుల మధ్య వైభవంగా ముహూర్తం జరుపుకుంది. సుప్రసిద్ధ దర్శకు డు త్రివిక్రమ్, హీరో సాయి ధర్మ తేజ్, హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు), దర్శకుడు సుధీర్ వర్మ, మరో దర్శకుడు కల్యాణ్ (అనగనగా ఒక రాజు) లు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు దృశ్యానికి దర్శకత్వం త్రివిక్రమ్ వహించారు. హీరో సాయిధర్మ తే జ్ క్లాప్ ఇవ్వగా,దర్శకుడు సుధీర్ వర్మ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్ ను నిర్మాత ఎస్.నాగవంశీ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ కు అందించారు. చిత్రం ముహూర్తం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రచారచిత్రాన్ని విడుదల చేసింది చిత్రం యూనిట్. ఇందులో "రేయ్ రాముడు లంక మీద పడ్డం ఇనుంటావ్. అదే పది తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టుంటదో సూస్తావా..." అని చిత్రంలో ప్రతినాయక పాత్ర హెచ్చరిక గా అంటే.. "ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్పా.. ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు.. సూస్కుందాం రా.. తలలు కోసి సేతికిస్తా నాయాలా..!" అంటూ కథానాయకుడు మరింత గా హెచ్చరించడం చూడొచ్చు. పదునైన ఈ సంభాషణలకు సమకూర్చిన నేపథ్య సంగీతం మరింత పౌరుషాన్ని పెంచినట్లయింది. ఈ మూవీని 2023 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ #PVT04 ~ #ProductionNo16 begins with a pooja ceremony today✨ Shoot begins soon! 🎬🎥 ▶ https://t.co/h0m5jrbdl4 Directed by #SrikanthNReddy Produced by @vamsi84 & #SaiSoujanya#PanjaVaisshnavTej @sreeleela14 @SitharaEnts @Fortune4Cinemas Sankranthi 2023 Release ⚡ pic.twitter.com/UxGDdh35Wm — Sithara Entertainments (@SitharaEnts) June 22, 2022 -
స్టూడెంట్స్‌గా హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పరీక్షలు
మన తెలుగు హీరోలు కొందరు స్టూడెంట్స్‌గా మారి బాక్సాఫీస్ ఎగ్జామ్‌కు రెడీ అవుతున్నారు. ప్రేక్షకులే ఇన్విజిలేటర్స్‌గా సాగే ఈ బాక్సాఫీస్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయి, వసూళ్ల మార్కులు తెచ్చుకోవడానికి ఎవరికి తగ్గట్లు వారు రెడీ అవుతున్నారు. కొన్ని ఎగ్జామ్ డేట్స్ (రిలీజ్ డేట్స్) కూడా ఫిక్సయ్యాయి. మరి.. ఈ విద్యార్థుల వివరాల్లోకి ఓ లుక్కేయండి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రామ్‌చరణ్ అమృత్‌సర్‌కి వెళ్లొచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. చరణ్ అక్కడికి కాలేజీ స్టూడెంట్‌గా వెళ్లారు. ఈ హీరో ఇలా కాలేజీకి వెళ్లింది శంకర్ సినిమా కోసమే. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్ పాత్రలో షేడ్స్ ఉంటాయి. స్టూడెంట్ లీడర్, ఐఏఎస్ ఆఫీసర్ పాత్రల్లో రామ్‌చరణ్ కనిపిస్తారు. ఆల్రెడీ కాలేజీ బ్యాక్‌డ్రాప్ సీన్లను అమృత్‌సర్‌లో చిత్రీకరించారు. కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. మరోవైపు నాగచైతన్య కూడా స్టూడెంట్‌గా ‘థ్యాంక్యూ’ సినిమా కోసం క్లాస్‌రూమ్‌కి వెళ్లారు. ‘మనం’ తర్వాత దర్శకుడు విక్రమ్ కె. కుమార్, హీరో నాగ చైతన్యల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘థ్యాంక్యూ’. నాగచైతన్య, మాళవికా నాయర్ హీరోయిన్లుగా, అవికా గోర్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో నాగచైతన్య మూడు వేరియేషన్స్ ఉన్న పాత్ర చేశారు. స్టూడెంట్‌గానూ నాగచైతన్య కనిపిస్తారు. చైతూ స్కూల్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు అవికా గోర్ స్కూల్ స్టూడెంట్‌గా, కాలేజీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మాళవికా నాయర్ కూడా కాలేజీ స్టూడెంట్‌గా కనిపిస్తారు. ఓ వ్యక్తి జర్నీగా రూపొందిన ఈ చిత్రం జూలై 8న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇంకోవైపు ఆది, సత్యదేవ్ కూడా స్టూడెంట్ రోల్స్ చేశారు. ‘గుర్తుందా..శీతాకాలం’ చిత్రం కోసం కాలేజీకి వెళ్లారు సత్యదేవ్. నాగశేఖర్ ఈ సినిమాకు దర్శకుడు. తమన్నా, కావ్యాశెట్టి, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటించారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలే ఈ సినిమా కథను మలుపు తిప్పుతాయి. ఈ చిత్రం జూలై 15న రిలీజ్ కానుంది. ఇక ‘తీస్మార్ ఖాన్’ కోసం ఆది సాయికుమార్ స్టూడెంట్ అవతారం ఎత్తారు. కల్యాణ్ జి. గోగణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించారు. ఇందులో స్టూడెంట్, రౌడీ, పోలీసాఫీసర్.. ఇలా త్రీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు ఆది సాయికుమార్. ఇక ‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రంగ రంగ వెభవంగా..’. ఇది కంప్లీట్ క్యాంపస్ మూవీ అని తెలుస్తోంది. ఇందులో మెడికల్ స్టూడెంట్స్ పాత్రల్లో కనిపిస్తారు హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతికా శర్మ. ‘అర్జున్ రెడ్డి’ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా చేసిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత వస్తుంది. ఈ చిత్రాలే కాదు.. మరికొన్ని క్యాంపస్ డ్రామాలు కూడా వెండితెరపై ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. -
పంజా వైష్ణవ్ 'కొత్తగా లేదేంటి?' ఫుల్ సాంగ్ విన్నారా?
‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. గిరీశాయ దర్శకత్వం వహించారు. కేతికా శర్మ హీరోయిన్గా నటించారు. బాపినీడు.బి సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘కొత్తగా లేదేంటి..’ అంటూ సాగే లవ్ డ్యూయెట్ సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. శ్రీమణి రాసిన ఈ పాటను అర్మాన్ మాలిక్, హరిప్రియ పాడారు. ఈ పాట ప్రేమికులకు కనెక్ట్ అయ్యేలా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. చదవండి: రిపీట్ ఆడియన్స్ ఉంటారు.. రాసి పెట్టుకోండి ప్రాజెక్ట్ కెలో దీపికా పదుకోన్‌తో పాటు మరో హీరోయిన్! -
వైష్ణవ్ తేజ్ 'కొత్తగా లేదేంటి ?' ప్రొమో విడుదల..
Vaishnav Tej Ranga Ranga Vaibhavanga Movie Song Promo Release: మెగా మేనల్లుడు, యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ మొదటి చిత్రం 'ఉప్పెన'తోనే పెద్ద హిట్ అందుకున్నాడు. తర్వాత కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి 'కొండపొలం' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాల్లో వైష్ణవ్ తేజ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'రంగ రంగ వైభవంగా'. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో 'రొమాంటిక్' బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. మెడికల్ స్టూడెంట్స్ మధ్య వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే ఇటీవల టాకీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీలోని 'కొత్తగా లేదేంటి ?' అనే లిరికల్ సాంగ్ ప్రొమోను రిలీజ్ చేశారు. పూర్తి పాటను మే 6న విడుదల చేయనున్నారు మేకర్స్. శ్రీమణి రాసిన ఈ సాంగ్‌ను ఆర్మన్ మాలిక్, హరిప్రియ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకుల్ని మరింత ఆకట్టుకుంటుంది. చదవండి: 'రంగ రంగ వైభవంగా' ఫస్టు సింగిల్ రిలీజ్ -
జీవితంలో 2 పుట్టిన రోజులుంటే.. ఆ రోజే నాకు మరో బర్త్‌డే: కృతిశెట్టి ఎమోషనల్
‘ఉప్పెన’ మూవీతో ఒక్కసారిగా టాలీవుడ్లో మెరిసింది కృతిశెట్టి. తొలి సినిమానే బ్లాక్‌బస్టర్ హిట్ కావడం, బంగర్రాజు, శ్యామ్ సింగరాయ్ కూడా మంచి విజయం సాధించడంతో బేబమ్మ హ్యాట్రిక్ కొట్టింది. దీంతో ఇండస్ట్రీలో లక్కీ గర్ల్‌గా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్ వారియర్, మాచేర్ల నియోజకం’ వంటి ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇదిలా ఉంటే గతేడాది ఆమె నటించిన ఉప్పెన సినిమా విడుదలై నిన్నటి(ఫిబ్రవరి 12) ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బేబమ్మ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. చదవండి: నాన్న పీస్ డేని చెడగొట్టే మిషన్‌లో బిజీ, సితార పోస్ట్ వైరల్ ‘జీవితంలో మనకంటూ రెండు పుట్టిన రోజులు ఉంటే, అందులో ఒకటి... మనం పుట్టినరోజు. ఇంకొకటి.. మనం కెరీర్లో ఏం చేయాలో ఎంచుకున్న రోజు. ఏడాది క్రితం నటిగా పరిశ్రమలో అడుగుపెట్టాను. నేను ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నా.. కాబట్టి ఈరోజు నాకిది మరో పుట్టినరోజుగా భావిస్తున్నా. నేను ఎంతో ఇష్టపడి నటిని అవ్వడం ఒక ఎత్తైయితే, మీ అందరూ ప్రేమ, అభిమానంతో నన్ను ఆదరించడం నాకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఇదే నన్ను ముందుకు తీసుకెళ్తుంది. చదవండి: నేను ఆ టైప్ కాదు, నటినని నా బాయ్‌ఫ్రెండ్ వదిలేశాడు: హీరోయిన్ ఈ ప్రయాణాన్ని గుర్తుండేలా చేసిన నా అభిమానులకు కృతజ్ఞతలు. ఇకపై మరింత కష్టపడి మంచి పాత్రలతో అలరిస్తానని మాట ఇస్తున్నా. థాంక్యూ ఆల్’ అంటూ రాసుకొచ్చింది. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా గతేడాది 2021 ఫిబ్రవరి 12న విడుదలైంది. కరోనా సమయంలో విడుదలైన ఈ టాలీవుడ్ బాక్సాఫీసుకు బ్లాక్‌బస్టర్ హిట్ అందించింది. చిన్న సినిమాగా విడుదలైన ఉప్పెన రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ రిలీజ్ డేట్ వచ్చేసింది
మెగా మేనల్లుడు, యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. బుచ్చిబాబు సన దర్శకత్వలో వైష్ణవ్-కృతిశెట్టి జంటగా తెరకెక్కిన ఉప్పెన మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో వైష్ణవ్ నటన పరంగా సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీర ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. ఈ మూవీకి గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నాడు. చదవండి: ‘ఖిలాడి’ మూవీ రివ్యూ ఇందులో వైష్ణవ్ సరసన ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను మే 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా రంగ రంగ వైభవంగా మూవీ నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చదవండి: Jagapathi Babu: 60వ పుట్టిన రోజు సందర్భంగా జగపతి బాబు కీలక నిర్ణయం Get Ready to meet Rishi & Radha❤️ in Theaters near you!#RangaRangaVaibhavanga in theaters from May 27th! A Rockstar @ThisIsDSP Musical 🎹 Directed by @GIREESAAYA #RRVonMay27#PanjaVaisshnavTej #Ketikasharma #RRVTheFilm @SVCCofficial @BvsnP pic.twitter.com/Ez2BlRJKLS — Panja Vaisshnav Tej (@VaisshnavTej) February 11, 2022 -
'రంగ రంగ వైభవంగా' ఫస్టు సింగిల్ రిలీజ్
Telusa Telusa Song From Ranga Ranga Vaibhavanga Is Out: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'రంగరంగ వైభవంగా'. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తెలుసా తెలుసా అనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. 'తెలుసా తెలుసా ఎవరికోసం ఎవరు పుడతారో .. ఎవరికి ఎవరేమి అవుతారో' అంటూ ఈ పాట సాగుతుంది. శంకర్ మహదేవన్ ఈ పాటను పాడారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకుంటుంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడదులపై త్వరలోనే అప్డేట్ రానుంది. -
వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా పోస్టర్ చూశారా?
Vaisshnav Tej and Ketika Sharma First Look Released: వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకుడు. కేతికా శర్మ హీరోయిన్. బాపినీడు .బి సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం∙టైటిల్ ప్రకటించి ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేశారు. ‘‘యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించేలా రూపొందుతోన్న చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం టీజర్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
మెగా మేనల్లుడికి హీరోయిన్ బటర్ ఫ్లై కిస్!
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తొలి సినిమాతోనే వంద కోట్ల క్లబ్లో చేరి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలకు సంతకం చేశాడు. ఈ క్రమంలో వచ్చిన 'కొండపొలం' పెద్దగా విజయం సాధించలేకపోయింది. తాజాగా తన మూడో సినిమాను అధికారికంగా ప్రకటించాడు వైష్ణవ్. గిరీశాయ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు 'రంగ రంగ వైభవంగా' అనే టైటిల్‌కు ఫిక్స్ చేశారు. ఈ మేరకు సోమవారం(జనవరి 24) టైటిల్ టీజర్‌ను కూడా వదిలారు. ఇందులో యంగ్ బ్యూటీ కేతిక శర్మ వైష్ణవ్‌తో జోడీ కట్టింది. అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏం తీసుకురానక్కర్లేదు అంటూ హీరోకు బటర్ ఫ్లై కిస్‌ను బహుమతిగా ఇచ్చింది. ఇది నెక్స్ట్ లెవల్లో ఉందన్న హీరో డైలాగ్‌తో టీజర్ పూర్తైంది. ఇది మరో రొమాంటిక్ లవ్ స్టోరీ అని, ఇది కూడా ఉప్పెనంత విజయాన్ని సాధించాలని కోరుకుంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. శామ్‌దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
క్యూట్ వీడియోతో వైష్ణవ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన నిహారిక
మెగా మేనల్లుడు, యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ నేటితో 32వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. నేడు(జనవరి 13) వైష్ణవ్ బర్త్‌డే. ఈ సందర్భంగా అతడికి మెగా ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక వైష్ణవ్ బర్త్‌డే సందర్భంగా అతడి కొత్త ప్రాజెక్ట్స్‌ను ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. ఇక ఫ్యాన్స్‌తో పాటు వైష్ణవ్‌కు సినీ సెలబ్రెటీలు కూడా విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో మెగా డాటర్ నిహారిక వైష్ణవ్‌కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఆమె ఓ క్యూట్ వీడియోను షేర్ చేస్తూ ఈ మెగా మేనల్లుడికి విషెస్ చెప్పింది. ఈ వీడియోలో నిహారిక, వైష్ణవ్‌లు చిన్న పిల్లల్లా కొట్టకుంటూ కనిపించారు. పిల్లలు ఆడుకునే ప్లెయింగ్ నెట్లో కూర్చుని బాల్స్‌తో వీరిద్దరూ కొట్టుకుంటున్న వీడియోను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనికి ‘ఈ వీడియో మన ఇద్దరి మధ్య బాండింగ్‌ను నిర్వచిస్తుంది(ఎప్పుడూ గొడవ పడుతూ, పక్కవారికి ఇబ్బంది లేకుండా సైలెంట్ జోక్స్‌తో మా వెర్రిలో మేముంటాం). మాటల కంటే చర్యలు పెద్దవి అనడానికి ఇది ఉదాహరణ. నేను ఇంతవరకు చూడని స్వచ్చమైన మనసు, వ్యక్తిత్వం నీది. ఇతరులకు అవసరం ఉన్నప్పడు సాయం చేసే మొదటి వ్యక్తివి నీవే. ధైర్యంతో, కష్టపడి పని చేసే వ్యక్తిత్వమే నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది వైషు. అందుకే నేనెప్పుడూ నీకు పెద్ద అభిమానిని. హ్యాపీ బర్త్‌డే వైషుగా. మై రాక్‌స్టార్’ అంటూ రెడ్ హర్ట్ ఎమోజీని జత చేసి షేర్ చేసింది నిహారిక. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వీరిద్దరి బాండింగ్ చూసి మెగా ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. అంతేగాక ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ వైష్ణవ్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
టీవీలో అదరగొట్టిన 'కొండపొలం'
మెగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి . దసరా కానుకగా అక్టోబర్ 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ హిట్ అందుకోలేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా రీసెంట్గా స్టార్ మాలో ప్రసారమైంది. బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి టీఆర్పీ దక్కించుకుంది కొండపొలం. అర్బన్ ఏరియాలో 12.34 టీఆర్పీ రాగా అర్బన్, రూరల్ ప్రాంతాల్లో మొత్తం కలిపి 10.54 రేటింగ్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రమే ఆడిన కొండపొలం ఈ స్థాయిలో రేటింగ్ రాబట్టుకోవడం విశేషమే అంటున్నారు సినీలవర్స్. ఇక ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, సాయిచంద్, హేమ, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. -
ప్రముఖ బ్యానర్లో వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా
మెగా మేనల్లుడు మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ఆయన హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపు దిద్దుకోవటానికి రంగం సిద్ధమైంది. నేడు(జనవరి 13) వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రనిర్మాత నిర్మాణ సంస్థ లు ఈ మేరకు అధికారిక ప్రకటన ను ఓ వీడియో రూపంలో విడుదల చేశాయి. తొలిచిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం అనిపిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు. ఇప్పటికే ధనుష్ హీరోగా తెలుగు, తమిళం లో నిర్మితమవుతున్న 'సార్', నవీన్ పోలిశెట్టి హీరో గా మరోచిత్రం, సిద్దు జొన్నలగడ్డ హీరోగా ' డిజే టిల్లు', చిత్రాలు సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో నిర్మిత మవుతున్న విషయం విదితమే. -
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ‘కొండపొలం’, ఎక్కడంటే..
Kondapolam Movie Streaming Now On OTT: మెగా హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు. కోట శ్రీనివాసరావు, సాయిచంద్, హేమ, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 8 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: ఎంఎస్ చివరి క్షణాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న బ్రహ్మానందం ఈ మూవీ విడుదలైన రెండు నెలల తర్వాత కొండపోలం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఇంజనీరింగ్ చదివిన ఓ యువకుడు పట్టణంలో ఉద్యోగం తెచ్చుకోలేక ఇంటికి తిరిగి రావడం, భయపడుతూనే కొండపొలం వెళ్లడం, అక్కడ జరిగిన సంఘటనలతో మానసికంగా ఎలా బలంగా మారాడు? యూపీఎస్సీ పరీక్షల్లో ఐఎఫ్ఎస్కు ఎలా ఎంపికయ్యాడన్నదే ఈ సినిమా కథ. ఇందులో రకుల్ ఒబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో నటించి అందరిని మెప్పించింది. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు -
‘కొండ పొలం’మూవీ రివ్యూ
టైటిల్ : కొండ పొలం నటీనటులు : వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయిచంద్, కోట శ్రీనివాసరావు, హేమ, అంటోని, రవిప్రకాశ్ తదితరులు నిర్మాణ సంస్థ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు: సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి సంగీతం : ఎమ్ ఎమ్ కీరవాణి సినిమాటోగ్రఫీ : జ్ఞాన శేఖర్ వీఎస్ ఎడిటింగ్: శ్రావన్ కటికనేని విడుదల తేది : అక్టోబర్ 8,2021 ఉప్పెన’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రెండో చిత్రం ‘కొండపొలం’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం కథేంటంటే..? కడప జిల్లాకు చెందిన కఠారు రవీంద్ర యాదవ్ అలియాస్ రవీంద్ర(వైష్ణవ్ తేజ్) బీటెక్ పూర్తి చేసి, ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వెళ్తాడు. ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం లేకపోవడంతో అతనికి ఉద్యోగం లభించదు. దీంతో అతను తిరిగి పల్లెకు వస్తాడు. నాలుగేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమైన రవీంద్రకు తాత రోశయ్య(కోట శ్రీనివాసరావు) ఓ సలహా ఇస్తాడు. కరువు కారణంగా అల్లాడుతున్న ఊరి గొర్రెల మందతో కొంతమంది కొండపొలం(గొర్రెల మందలను తీసుకొని అడవుల్లోకి వెళ్లడం)చేస్తున్నారని, తమ గొర్రెలను కూడా తీసుకొని వారితో నల్లమల అడవుల్లోకి వెళ్లమని చెబుతాడు. పెద్ద చదువులు చదివిన రవీంద్ర.. తాత సలహాతో నాన్న గురప్ప (సాయి చంద్)కు సహాయంగా అడవికి వెళ్తాడు. దాదాపు 45 రోజుల పాటు అడవితో సహజీవనం చేసిన రవీంద్రలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆ అడవి అతనికి నేర్పిన పాఠాలేంటి? తన చదువు కోసం తండ్రి పడిన కష్టాలేంటి? ‘కొండపొలం’అనుభవంతో జీవితంలో ఎదురైన కష్టాలను ఎదుర్కొని ఏవిధంగా ఫారెస్ట్ ఆపీసర్ అయ్యాడు? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే... మంచి చదువు ఉండి కూడా ఆధునిక ప్రపంచంతో పోటీపడలేక, గొర్రెల కాపరిగా మారిన యువకుడు రవీంద్ర పాత్రలో వైష్ణవ్ తేజ్ ఒదిగిపోయాడు. ‘ఉప్పెన’లో మత్స్యకార కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపించి వైష్ణవ్... కొండపొలంలో గొర్రె కాపరుల సామాజిక వర్గానికి చెందిన యువకుడిగా కనిపించాడు. ఇక, అదే సామాజిక వర్గం, వృత్తి కలిగిన అమ్మాయి ఓబులమ్మ పాత్రలో రకుల్ ప్రీత్ అద్భుత నటను కనబరిచింది. కొన్ని సన్నివేశాల్లో వైష్ణవ్‌ని డామినేట్ చేసిందనిపిస్తుంది. ఆమె పాత్ర తీరే అలా ఉండడం అందుకు కారణం. అడవికి వచ్చిన రవీంద్రలో పట్టుదల ఏర్పడటానికి పరోక్షంగా కారణమైన ఓబులమ్మ పాత్రకు న్యాయం చేసింది రకుల్. రవీంద్ర తండ్రి గురప్ప పాత్రలో సాయిచంద్ పరకాయ ప్రవేశం చేశాడు. ఓ గొర్రెల కాపరి ఎలా ఉంటాడో అచ్చం అలానే తెరపై కనిపించాడు. రవీంద్రతో పాటు అడవికి వెళ్లే ఇతర పాత్రల్లో రవి ప్రకాశ్, హేమ, మహేశ్ విట్ట, రచ్చ రవి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే... అడవుల పరిరక్షణ, జంతువులను వేటాడే వేటగాళ్ల మీద, స్మగ్లర్ల మీద తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మృగరాజు’నేపథ్యం కూడా ఇదే. అయితే పశువులు ప్రాణాలను కాపాడుకోవడం కోసం అడవి వెళ్లే గొర్రెకాపరులు, అక్కడ వారి జీవన పద్దతిపై ఇంతవరకు ఏ చిత్రమూ రాలేదు. ఆ రకంగా చూస్తే ‘కొండపొలం’ ఓ కొత్త సినిమా అనే చెప్పాలి. ప్రకృతి పరిరక్షణ, అడవిపై ఆధారపడిన కొన్ని వర్గాల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ, సామాజిక స్పృహతో ‘కొండపొలం’చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’నవల ఆధారంగా అదే పేరుతో వెండితెరకెక్కించారు. ఈ మూవీకి కథ, మాటలు కూడా సన్నపురెడ్డి అందించడం గమనార్హం. అయితే నవలలో లేని ఓబులమ్మ పాత్రను ఈ సినిమా కోసం రచయిత సన్నపురెడ్డి సృష్టించారు. గొర్రె కాపరుల జీవిత చిత్రాన్ని తెరపై చాలా సహజసిద్దంగా ఆవిష్కరించారు. గొర్రెలను తమ సొంత బిడ్డలుగా భావించే గొర్రెకాపరులు..వాటికి ఆహారం అదించడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి కొండపొలం చేయడం అంటే మామూలు విషయం కాదు. అడవితో మనిషికి ఉండే బంధాన్ని చక్కడ చూపించాడు డైరెక్టర్. పిరికి వాడైన హీరో.. తన గొర్రెలను కాపాడుకోవడం కోసం పులితో పోరాటం చేయడం సినిమాకు హైలైట్. అయితే ‘కొండపొలం’నవల చదివినప్పుడు కలిగే ఉత్కంఠ, భావోద్వేగాలు ఈ సినిమాలో పండకపోవడం మైనస్. అలాగే కొన్ని సాగదీత సీన్స్ సినిమా స్థాయిని తగ్గిస్తాయి. ఫస్టాఫ్‌లో సాగినంత వేగం.. సెకండాఫ్‌లో లేదు. ఓబులమ్మ-రవీంద్ర ప్రేమ కథ ఆకట్టుకుంటుంది. ఇక సినిమాకి ప్రధాన బలం సన్నపురెడ్డి సంభాషణలు. ‘ఏ భాషలో మాట్లాడినా అది గుండెను చేరుతుంది. కానీ మాతృభాషలో మాట్లాడితే మనసుకు చేరుతుంది’,‘అవతలి వాళ్ళ చెప్పులో కాలు పెడితే కానీ తెలియదు అందులో ఎన్ని ముళ్ళు ఉన్నాయో’,‘అడవికి చుట్టంచూపుగా వెళ్ళాలి అంతేకానీ చెట్లు నరకడం, జీవాలను చంపడం చేయకూడదు’లాంటి డైలాగ్స్ హృదయాన్ని తాకడంతో పాటు ఆలోచింప చేస్తాయి. కీరవాణి సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలతో పాటు నేపథ్య సంగీతం అదిరిపోయింది. ‘రయ్ రయ్ రయ్యారే’అంటూ తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫి బాగుంది. అడవి అందాలను చక్కగా చూపించాడు. ఎడిటర్ శ్రవణ్ కటికనేని తన కత్తెరకు పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. కమర్షియల్‌గా ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియదు కానీ.. ఓ మంచి సందేశాత్మక మూవీని చూశామనే అనుభూతి మాత్రం ప్రేక్షకుడికి కలుగుతుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘కొండపొలం’ మూవీ ట్విటర్ రివ్యూ
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రెండో చిత్రం ‘కొండపొలం’. ‘ఉప్పెన’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వైష్ణవ్ నటిస్తున్న చిత్రం.. క్రిష్ లాంటి టాలెంటెడ్ డైరక్టర్ తెరకెక్కించడంతో ‘కొండపొలం’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గొర్రెల కాపరుల జీవనం, సంస్కృతిని ఓ అందమైన ప్రేమ కథ మధ్య అల్లి చెప్పినట్లు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. ఇందులో గొర్రెల కాపరిగా వైష్ణవ్ కనిపిస్తుండగా, అదే సామాజిక వర్గానికి చెందిన యువతిగా రకుల్ నటిస్తోంది. ఎన్నో అంచనాల మధ్య ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: ‘కొండపొలం’ మూవీ రివ్యూ ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Just watched #KondaPolam A beautiful rustic love story with a powerful message. I love how Krish always deals with different genres & picks pertinent issues & extracts fantastic performances from artists.I trust this film will win as much acclaim & awards as it will get rewards. pic.twitter.com/tv4bZTv07q — Chiranjeevi Konidela (@KChiruTweets) October 7, 2021 #KondaPolam REVIEW 👇👍#PanjaVaisshnavTej #RakulPreetSingh #KondaPolamReview #KondaPolamMovie #Rakul #RakulPreet #VaisshnavTej pic.twitter.com/LUssnhol3o — Filmatic Corner (@FILMATICCORNER) October 8, 2021 #KondaPolam superb reviews so far Looks another blockbuster for Vaishnav@Rakulpreet #RakulPreet #VaishnavTej pic.twitter.com/NKpoXoYkXt — Telugu Cinema Fun (@TCinemaFun) October 8, 2021 #KondaPolam Movie Review : కొండపొలం మూవీ రివ్యూ 👌👌#PanjaVaisshnavTej #KondaPolamreview #Thetelugunews @DirKrish @Rakulpreet @KChiruTweets https://t.co/BBlYiIg2em — The Telugu News (@TheTeluguNews1) October 8, 2021 #KondaPolam trending in India 👌👍#KondaPolamInTheaters 🐅⛰️ Book Tickets🎟 https://t.co/QgtzJAW2Pd#RoaringKondaPolam #PanjaVaisshnavTej @RakulPreet @DirKrish @mmkeeravaani @Gnanashekarvs @YRajeevReddy1 #JSaiBabu @FirstFrame_ent @MangoMusicLabel pic.twitter.com/ScWOUE67bY — AN Media (@anmediaoffl) October 8, 2021 #KondaPolam review should be like must avoided film of the year — Mr.T (@navadheepchowd3) October 8, 2021 #KondaPolam 1st half Rod — Ramakrishna (@krkrishnagoud) October 8, 2021 Krish sir mark first half.#KondaPolam — Pk3Vk (@pk3vk) October 8, 2021 Mega Tiger Second Blockbuster Anta 🐆#KondaPolam — Sanjay Sahu (@bhaaagi_) October 8, 2021 -
‘కొండపొలం’ మూవీపై చిరంజీవి రివ్యూ
‘ఉప్పెన’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రెండో చిత్రం ‘కొండపొలం’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఒక్క రోజు ముందే అంటే గురువారం ఈ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి, అందరికి కంటే ముందే రివ్యూ ఇచ్చేశారు. సినిమా వీక్షించిన తర్వాత చిరంజీవి మాట్లాడుతూ.. అందమైన ప్రేమ కథతో అద్భుతమైన సందేశం ఇచ్చారని ప్రశంసించారు. ‘సాధారణంగా క్రిష్ సినిమాలంటే డిఫరెంట్ జోనర్ మూవీస్ అని అనుకుంటాం. ఈ సినిమాకు చూసిన వారు థ్రిల్‌కు లోనవుతారనే మాట వాస్తవం. నేనైతే కొండపొలంకు సంబంధించిన పుస్తకం ఏదీ చదవలేదు. వైష్ణవ్ ఓరోజు నా దగ్గరకు వచ్చి ‘మామా.. క్రిష్‌గారి దర్శకత్వంలో ‘కొండపొలం’ అనే సినిమా చేస్తున్నాను’ అనగానే.. నేను ‘వెంటనే సినిమా చెయ్. ఎందుకంటే క్రిష్ డైరెక్షన్ అంటేనే వెరైటీ ఆఫ్ మూవీ చేసే అవకాశం దొరుకుతుంది. మంచి పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉంటుంది. సినిమాలో మంచి ఎమోషన్‌కు ఛాన్స్ ఉంటుంది అన్నాను. నేనెదైతే అన్నానో.. వైష్ణవ్ తేజ్ నటన కానీ, క్యారెక్టరైజేషన్ కానీ అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. క్రిష్ సినిమాలను నేను ముందు నుంచి చూస్తూ వస్తున్నాను. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం ఉండదు. ‘కొండపొలం’ విషయానికి వస్తే, గత చిత్రాల కంటే విభిన్నంగా ఉంది. చక్కటి రస్టిక్ లవ్‌స్టోరి. ఈ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో చెప్పిన కథాంశం. మంచి మెసేజ్‌తో కూడిన లవ్‌స్టోరి. ఆర్టిస్టుల విషయానికి వస్తే వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ నటనను బాగా ఎంజాయ్ చేశాను. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆహ్వానించాలి, ఆదరించాలి. ‘కొండపొలం’ మూవీ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. క్రిష్‌కు, నిర్మాతలకు, వైష్ణవ్, ఇతరులకు ఆల్ ది బెస్ట్’ అని చిరంజీవి అన్నారు. -
మహేశ్.. ప్రభాస్‌లా నాకూ చేయాలని ఉంది: వైష్ణవ్ తేజ్
‘‘మా మామయ్యలు (చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్), అన్నయ్య (సాయితేజ్)కు ప్రేక్షకుల్లో ఇమేజ్ రావడం చూశాను. కానీ నాకో ఇమేజ్ వస్తే ఎలా రియాక్ట్ రావాలో ఆలోచించలేదు. ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు అందరూ నన్ను చూస్తుంటే బిడియంగా ఉంటుంది’’ అన్నారు హీరో వైష్ణవ్ తేజ్. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. ‘బిబో’ శ్రీనివాస్ సమర్పణలో జె. సాయిబాబు, వై. రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ చెప్పిన విశేషాలు. ► క్రిష్‌గారి సినిమాలన్నా, మేకింగ్ అన్నా నాకు చాలా ఇష్టం. ‘వేదం, గమ్యం’ సినిమాలు బాగా నచ్చాయి. క్రిష్‌గారు ఫోన్ చేసినప్పుడు సినిమా కోసమని అనుకోలేదు. పైగా అప్పటికి నా ‘ఉప్పెన’ విడుదల కాలేదు. నేను ఆయన ఇంటికి వెళ్లాక ‘కొండపొలం’ కథ చెప్పారు. నా రెండో సినిమాకే క్రిష్ వంటి సీనియర్‌తో పని చేసే అవకాశం రావడం సంతోషంగా అనిపించింది. ► ‘కొండపొలం’ అనే అంశమే కొత్తది. నేనెప్పుడూ వినలేదు. క్రిష్‌గారు కొత్త కథ చెప్పాలనుకున్నారు.. పైగా నాకూ కథ కొత్తగా అనిపించడంతో ఒప్పుకున్నాను. ఈ సినిమా కోసం కొండలు ఎక్కేవాళ్లం, రెండు మూడు కిలోమీటర్లు నడిచేవాళ్లం. అదేం పెద్ద కష్టంగా అనిపించలేదు. అయితే ఎండలో రోజంతా మాస్కులు పెట్టుకుని చేయడం కష్టంగా అనిపించింది. ఏమీ లేని స్థాయి నుంచి ఎన్నో కష్టాలను దాటుకుని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదగడమే ‘కొండపొలం’ కథ. అడవితో, అక్కడ ఉన్న ఓబులమ్మతో ప్రేమలో పడతాడు. ఈ కథ, పాత్రలు చాలా కొత్తగా అనిపిస్తాయి. పెద్ద హీరోల సినిమాలు చూసినప్పుడు నాకూ అలాంటి కమర్షియల్ కథలు చేయాలనిపిస్తుంది. ప్రభాస్, మహేశ్‌బాబు అన్నల్లా నాక్కూడా కొట్టాలనిపిస్తుంది (సినిమాలో విలన్లను). మా ఫ్యామిలీకి కూడా నన్ను అలా చూడటం ఇష్టం. అదే సమయంలో కొత్త పాత్రలు చేయాలనిపిస్తుంది. ► ‘కొండపొలం’ కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్స్ చేయలేదు. కొన్ని పదాలు మాత్రం యాసలోనే మాట్లాడాలని క్రిష్‌గారు చెప్పారు.. అలానే చేశాను. నా రెండో సినిమాకే కీరవాణిగారితో పని చేయడం నా అదృష్టం. ► కథకు తగ్గట్టు సినిమా తీశారా? లేదా? అని ఇప్పుడే చెప్పేంత అనుభవం నాకు లేదు. నా నటన గురించి నేను జడ్జ్ చేసుకోవడం కంటే దర్శకుడు, ప్రేక్షకులు చెబితేనే బాగుంటుంది. కొన్నిసార్లు బాగా చేశామని మనసు చెబుతుంది.. అలాంటప్పుడు మానిటర్ చూస్తాను. ఓటీటీ ఆఫర్లు వస్తే నటిస్తాను. ప్రస్తుతానికి గిరి సాయితో (తమిళ ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు) ఓ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రం తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ సినిమా ఉంటుంది. ‘రిపబ్లిక్’ చిత్రంలో అన్నయ్య ఐఏఎస్‌గా చేశారు. ‘కొండపొలం’ మూవీలో నేను ఐఎఫ్ఎస్. ‘రిపబ్లిక్, కొండపొలం’ సినిమాకు సంబంధం ఉండదు. అన్నయ్య బాగున్నారు.. భయపడాల్సిన పనిలేదు. ఫిజియోథెరపీ జరుగుతోంది.. త్వరలోనే ఆస్పత్రి నుంచి బయ టకు వస్తారు. అడవిలో ఎక్కువ రోజులు షూటింగ్ చేయడంతో చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా మనకు అడవి ఎంతో ఆక్సిజన్‌ను ఇస్తుంది. అలాంటి అడవుల్లో ఎక్కువగా చెత్త వేయకూడదనిపించింది. ‘కొండపొలం’ షూటింగ్లో మొదట్లో గొర్రెల భాషను అర్థం చేసుకోలేకపోయాను. తల పొట్టేలు నడిచినట్టుగానే మిగతా గొర్రెలు కూడా నడుస్తాయి. వాటికి ఇష్టమైన పచ్చళ్లతో వాటిని కంట్రోల్ చేశాం. -
ఛాలెంజింగ్ పాత్రలు ఇష్టం
‘‘కొన్ని సన్నివేశాలకో, పాటలకే పరిమితం అయ్యే పాత్రలు చేయాలనుకోవడం లేదు. ఛాలెంజింగ్ పాత్రలు చేయాలనుకుంటున్నాను.. అందుకే సెలెక్టివ్‌గా ఉంటున్నాను. ఓబులమ్మ పాత్ర నన్ను ఎగై్జట్ చేయడంతో ‘కొండపొలం’ సినిమా చేశాను’’ అని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. బిబో శ్రీనివాస్ సమర్పణలో వై.రాజీవ్‌రెడ్డి, జె.సాయిబాబు నిర్మించిన ఈ సినిమా రేపు(8న) విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రకుల్ ప్రీత్‌సింగ్ పంచుకున్న విశేషాలు... ► ‘కొండపొలం’ కథ చెప్పేందుకు క్రిష్‌గారు ఇంటికి వచ్చినప్పుడు నేను షార్ట్, టీషర్ట్‌లో ఉన్నాను. ‘చాలా యంగ్‌గా ఉన్నావ్.. వైష్ణవ్ తేజ్ పక్కన యంగ్ గర్ల్ కావాలనుకున్నా.. అలాగే ఉన్నావ్’ అంటూ క్రిష్‌గారు ఎగై్జట్ అయ్యారు. ఆయన కథ చెబుతున్నప్పుడే వెంటనే ఓకే చెప్పేశాను. గొర్రెల కాపర్ల గురించి ‘కొండపొలం’ లాంటి చిత్రం ఇంత వరకూ ఇండియాలో రాలేదు. ► ‘కొండపొలం’ లో పూర్తిస్థాయిలో గొర్రెలు కాసే పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తాను. అడవిలో గొర్రెలను కంట్రోల్ చేయడానికి నేను, వైష్ణవ్ మొదట్లో చాలా కష్టపడ్డాం. అయితే షూటింగ్ స్టార్ట్ చేసిన నాలుగైదు రోజుల్లోనే ఎలా కంట్రోల్ చేయాలో తెలిసింది. ► ‘కొండపొలం’ చూడటానికి ఈజీగా ఉంటుంది. కానీ, షూట్ చేయడం చాలా కష్టమైంది. కీరవాణిగారి సంగీతం అద్భుతంగా ఉంది. ► ఈ నెల 10న నా పుట్టినరోజు. అయితే ఆ రోజు ఎటువంటి సెలబ్రేషన్స్ చేసుకోవడం లేదు. షూటింగ్లో ఉంటాను. ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఏదీ అంగీకరించలేదు. ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలు కూడా చేయాలని ఉంది. కరణం మల్లీశ్వరీ బయోపిక్ చేస్తున్నాననే వార్తల్లో వాస్తవం లేదు. ► నాకు డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదు. కానీ మనం ఒక్క సినిమా చేస్తే అది జీవితాంతం ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవాలి. ఒక డీడీఎల్జే (దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే), ఒక ‘బాహుబలి’ లాంటి సినిమాలు చేస్తే చాలనిపిస్తోంది. అలాంటి కేటగిరిల్లో ‘కొండపొలం’ కూడా ఉంటుందని నమ్ముతున్నాను. సాయి తేజ్‌తో నేరుగా మాట్లాడలేదు. వైష్ణవ్ తేజ్ నుంచి తేజు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాను. -
ప్రతి తెలుగువాడు గర్వపడే సినిమా ఇది: డైరెక్టర్ క్రిష్
‘‘కొండపొలం’ ఫైనల్ కాపీ చూసినప్పుడు ‘ఇదీ సినిమా అంటే’ అనిపించింది. ప్రతి తెలుగువాడు గర్వపడే సినిమా ఇది. ప్రేక్షకులు కూడా ఇదే మాట అంటారు’’ అని డైరెక్టర్ క్రిష్ అన్నారు. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. బిబో శ్రీనివాస్ సమర్పణలో వై. రాజీవ్‌రెడ్డి, జె. సాయిబాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో క్రిష్ మాట్లాడుతూ..‘‘కీరవాణిగారు మా సినిమాకి ఓ గైడ్‌లా పని చేశారు. ‘కొండపొలం’ హిట్ అనేది నాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమాకి చాలా అవసరం. ఇప్పుడున్న థియేటర్లకి, మా మనుగడకు అవసరం. చాలా గొప్ప సినిమా, చాలా జాగ్రత్తగా తీశానని బలంగా నమ్మాను.. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు’’ అన్నారు. వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ...‘‘నా మొదటి చాప్టర్ ‘ఉప్పెన’ అయితే రెండో చాప్టర్ ‘కొండపొలం’. ఈ చిత్రంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. క్రిష్, రాజీవ్, జ్ఞానశేఖర్గార్లకు మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఈ సినిమా షూటింగ్లో సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ వాళ్లు చాలా కష్టపడ్డారు.. వారందరి కష్టమే ఈ ‘కొండపొలం’. జీవితంలో ఎన్నిసార్లు కింద పడ్డా లేవాలనే ఒక స్ఫూర్తిని మా సినిమా కలిగిస్తుంది. రవీంద్ర అనే ఓ మంచి పాత్రను నాకు ఇచ్చినందుకు క్రిష్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘వరుణ్ తేజ్ రెండో సినిమా ‘కంచె’, వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం ‘కొండపొలం’ మేమే నిర్మించాం. ‘కొండపొలం’తో వైష్ణవ్ స్టార్ అవుతాడు. రకుల్ ఎంతో అంకితభావంతో ఓబులమ్మ పాత్రకు న్యాయం చేసినందుకు థ్యాంక్స్. క్రిష్‌కి గ్రేట్ ఫిల్మ్ ఇది’’ అన్నారు. రచయిత సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘కొన్ని జీవితాలను చూసి నేను రాసిన పాత్రలకు క్రిష్‌గారు తెరపై జీవం పోసి, సినిమాగా తీశారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో కెమెరామ్యాన్ జ్ఞానశేఖర్, దర్శకులు హరీష్ శంకర్, బుచ్చిబాబు, లక్ష్మీకాంత్ చెన్నా, పాటల రచయిత చంద్రబోస్, నటి హేమ, ‘మ్యాంగో మీడియా’ రామ్, నటులు సాయిచంద్, రవి, మహేశ్ విట్టా తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కొండపొలం ప్రీ రిలీజ్ ఈవెంట్
-
ఫిల్మ్ మేకింగ్‌లో నాకు నచ్చింది అదే!
‘‘దర్శకులంతా కలిసినప్పుడు పుస్తకాల గురించి చర్చించుకుంటాం. అలా కరోనా సమయంలో ఓసారి డైరెక్టర్స్ అందరం కలిసినప్పుడు ‘కొండపొలం’ నవల గురించి ఇంద్రగంటి మోహనకృష్ణ, సుకుమార్ గార్లు చెప్పడంతో చదివాను.. బాగా నచ్చడంతో సినిమాగా తీశా’’ అని దర్శకుడు క్రిష్ అన్నారు. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. బిబో శ్రీనివాస్ సమర్పణలో వై. రాజీవ్‌రెడ్డి, జె. సాయిబాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా క్రిష్ చెప్పిన విశేషాలు. ►సాహసం నేపథ్యంలో ఓ కథ చెప్పాలనుకున్నాను. ఆ సమయంలో ‘సప్తభూమి, కొండపొలం’ పుస్తకాలు చదివా. ‘కొండపొలం’ బాగా నచ్చడంతో ఆ నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిని కలిసి హక్కులు తీసుకున్నాం. ‘కొండపొలం’ హక్కులు కొన్నావా? అని సుకుమార్ అడిగారు. నేను తీసుకున్నానని చెప్పడంతో వదిలేశారు. లేకుంటే ఆయన తీసుకోవాలనుకున్నారు. ‘సప్తభూమి’ నవల హక్కులు కొనేందుకు ట్రై చేశాం.. కానీ కుదరలేదు. ►రచయితకు విపరీతమైన పరిధి ఉంటుంది. పుస్తకం రాయడం వేరు.. సినిమాగా తీయడం వేరు. సన్నపురెడ్డి ‘కొండపొలం’ అద్భుతమైన కథ.. స్క్రీన్‌ప్లే చక్కగా ఉంటుంది. ఆ కథలో ఓబులమ్మ పాత్ర ఉండదు. కానీ దానికి అందమైన ప్రేమకథను జోడిస్తే బాగుంటుందని ఓబులమ్మ పాత్రను క్రియేట్ చేశాం. దాన్ని సన్నపురెడ్డికి చెప్పాను.. ఆయనే ఈ సినిమాకు కథనం రాయడం వల్ల నాకు సులభం అయ్యింది. ►వైష్ణవ్‌ను తన పదో తరగతి అప్పుడో ఇంటర్లోనో చూశాను. ‘కొండపొలం’ అనుకున్నప్పుడు తనను ఓ పార్టీలో చూశా. అప్పటికింకా తన ‘ఉప్పెన’ చిత్రంలోని ‘నీ కళ్లు నీలి సముద్రం..’ పాట రాలేదనుకుంటాను. ఆ పాట చూడమన్నాడు.. చూడగానే వైష్ణవ్ తేజ్ కళ్లు బాగా అట్రాక్ట్ చేశాయి. కొండపొలం’లో రవీంద్ర పాత్రకు వైష్ణవ్ తేజ్ సరిపోతాడనిపించింది. వైష్ణవ్‌ని ఇంటికి పిలిపించి సినిమా గురించి చెప్పాను. వైష్ణవ్‌కి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాననే యాటిట్యూడ్ ఉండదు. నేర్చుకోవాలనే తపన ఎంతో ఉంది.. అందుకే ‘ఉప్పెన’, ‘కొండపొలం’ లాంటి కథలు ఎంచుకున్నాడు. ►ఓబులమ్మ పాత్రకు రకుల్ ప్రీత్ సరిపోతారని కెమెరామేన్ జ్ఞానశేఖర్ చెప్పారు. ఈ కథను రకుల్‌కు చెబుతున్నప్పుడే ఆమె హావాభావాలు చూసి ఈ పాత్రకు సరిపోతుందనుకున్నాను. తనకూ కథ నచ్చడంతో పాత్ర కోసం మరింత సన్నబడింది. ►గొర్రెలను అడవులకు తీసుకెళ్తే పులులు వస్తాయని గోవాలో షూటింగ్‌కి పర్మిషన్ ఇవ్వలేదు. నల్లమలలో తీద్దామనుకుంటే కోవిడ్ వల్ల కుదరలేదు. అందుకే వికారాబాద్ అడవుల్లో చేశాం. కొండపై దాదాపు 1000 గొర్రెలతో షూటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఉదయం 6:30 గంటలకే అందరం సెట్స్‌లో ఉండేవాళ్లం. ఈ సినిమా చూస్తుంటే మనం కూడా గొర్రెల కాపరిలా భావిస్తాం.. అంతలా కథలో లీనమవుతాం. ►‘కొండపొలం’ కోసం సంగీత దర్శకునిగా ముందుగా కీరవాణిగారి తనయుడు కాలభైరవకి ఫోన్ చేశాను. ‘కొండపొలం’ చదివి కీరవాణిగారు ఎగై్జట్ అయ్యారు. మీ కంటే ముందు ఓ మ్యూజిక్ డైరెక్టర్‌కు ఫోన్ చేశానని కీరవాణిగారికి చెప్పడంతో ఎవరు? అన్నారు. కాలభైరవ అంటే నవ్వారు. ‘ఎవరు కావాలో నువ్వే తేల్చుకో?’ అనడంతో ‘మీరే కావాలి’ అన్నాను. ∙ఫిల్మ్ మేకింగ్‌లో నాకు నచ్చింది రచనే. ఇప్పుడు నేను హాట్ స్టార్‌కు ఓ కథ రాస్తున్నాను. నేను చేసే ప్రతి సినిమా ఓ కొత్త అధ్యాయంలా ఉంటే ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ‘అతడు అడవిని జయించాడు’ స్ఫూర్తితో వెంకటేశ్‌గారితో అడవి నేపథ్యంలో సినిమా చేయాల్సింది... కానీ కుదర్లేదు. -
గాజువాకలో వైష్ణవ తేజ్, కృతిశెట్టి సందడి
అక్కిరెడ్డిపాలెం (గాజువాక): ఉప్పెన ఫేం వైష్ణవ తేజ్, కృతిశెట్టి గాజువాకలో సందడి చేశారు. కొత్తగాజువాకలో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రారంభ కార్యక్రమానికి వీరు రావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. గాజువాక ప్రధాన రహదారి జనంతో స్తంభించింది. అభిమానులనుద్దేశించి వైష్ణవ తేజ్ మాట్లాడుతూ తొలిచిత్రమే అఖండ విజయం సాధించిందని, దానికి కారణం అభిమానులేనని పేర్కొన్నారు. అభిమానులు మెచ్చే చిత్రాలు చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. క్రిష్ దర్శకత్వంలో నటించిన కొండపొలం చిత్రం ఈ నెల 8న విడుదలవుతుందన్నారు. ఆ చిత్రాన్ని ఆదరించాలన్నారు. కృతిశెట్టి మాట్లాడుతూ..విశాఖలో ఉప్పెన షూటింగ్ జరిగిందని, ఇక్కడ ఎన్నో సుందర ప్రాంతాలకు ఫిదా అయ్యాయని చెప్పారు. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటిస్తున్నానని, మరికొన్ని చర్చల దశలో ఉన్నాయని కృతి పేర్కొన్నారు. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ వస్త్ర ప్రపంచంలో మరింత రాణించాలని వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి ఆకాంక్షించారు. -
కొండపొలం ఆడియో లాంచ్ ఈవెంట్ ఫోటోలు
-
దేశం గర్వపడేలా చేసే కుర్రాడి కథ ఇది: వైష్ణవ్ తేజ్
‘‘నేను సినిమా తీసింది ఒకెత్తు అయితే.. కీరవాణిగారి సంగీతం మరో ఎత్తు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కీరవాణిగార్లు అద్భుతమైన పాటలు రాశారు. ఆత్మన్యూనత భావం ఉన్న రవీంద్ర అనే యువకుడు తనకు దక్కాల్సినదాన్ని ఎలా సాధించుకున్నాడు అనేది కథ. రాజీవ్ వల్లే ఇలాంటి సినిమాలు తీయగలుగుతున్నాను’’ అన్నారు క్రిష్. వైష్ణవ్ తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కొండపొలం’. ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా కర్నూలులో జరిగిన ఆడియో విడుదల వేడుకలో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ – ‘‘అద్భుతమైన సంగీతాన్ని అందించిన కీరవాణిగారే ఈ రోజు హీరో. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవలను తెరపైకి తీసుకుని వచ్చేందుకు క్రిష్ చాలా కష్టపడ్డారు. ఎప్పుడూ తలెత్తుకుని దేశం గర్వపడేలా చేయాలని క్రిష్ చెబుతుంటారు. తలెత్తుకుని ఉంటూ దేశం గర్వపడేలా చేయాలనుకునే ఓ కుర్రాడి కథ ఇది’’ అన్నారు. ‘‘అపనమ్మకం ఉన్నప్పుడు పాడుకునేలా ఈ చిత్రంలో ఓ మంత్రాన్ని (రయ్...రయ్..) కంపోజ్ చేశాను’’ అని కీరవాణి అన్నారు. ‘‘కీరవాణిగారితో మళ్లీ సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు రాజీవ్‌రెడ్డి. ‘‘నల్లమల అడవుల్లో నలభై రోజులు ఉండి, అక్కడి సంఘటనలతో ‘కొండపొలం’ నవల రాశాను. రాయలసీమ కథ సినిమాగా రావడం మనకెంతో గర్వకారణం. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కథ అని ఆలోచిస్తారు. ఒకటి రెండు శాతమే ఉండే ఫ్యాక్షన్‌ను తీసేసి 98 శాతం ఉండే రైతులు, గొర్రెల కాపర్లు, అట్టడుగువర్గాల వారి కష్టాల గురించి చెప్పే కథ ఇది’’ అన్నారు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రేపు కర్నూల్లో ‘కొండపొలం’ ఆడియో ఫంక్షన్
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కొండపొలం’. ఇందులో రకుల్ హీరోయిన్గా నటిస్తోంది. ఎమ్ఎమ్ కిరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ రోజు విడుదలైన ఈ మూవీలో సెకండ్ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ‘కొండపొలం’ ఆడియో రిలీజ్ ఈవెంట్ రేపు కర్నూల్లో జరగనుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. కర్నూల్లోని సంతోష్ నగర్ కాలనీలోని కన్వెన్షన్ హాల్లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కాగా అక్టోబర్ 8న ఈ మూవీ థియేటర్లో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. #KondaPolam Audio Release Event on 2nd Oct 5PM onwards in KURNOOL 🔥 An @mmkeeravaani Musical🎶 Roaring in Theatres from Oct 8th 💥🐅#KondaPolamOct8 #PanjaVaisshnavTej @RakulPreet @Gnanashekarvs @YRajeevReddy1 #JSaiBabu @FirstFrame_ent @MangoMusicLabel pic.twitter.com/iHFF36AGwp — Krish Jagarlamudi (@DirKrish) October 1, 2021 -
కొండపొలం నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల
Shwaasalo Lyrical Video From Kondapolam: వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఓ..ఓ ఓబులమ్మా సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాటని విడుదల చేశారు. ‘శ్వాసలో.. హద్దుల్ని దాటాలన్న ఆశ. ఆశలో.. పొద్దుల్ని మరిచే హాయి మోశా’అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కీరవాణి సంగీతం అందించినీ పాటను యామిని ఘంటసాల, పీవీఎస్ఎన్ రోహిత్ ఆలపించారు. ఈ పాటలో వైష్ణవ్, రకుల్ మధ్య కెమిస్ట్రీని ఆసక్తికరంగా చూపించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. -
వైష్ణవ్ తేజ్ ‘కొండ పొలం’ మూవీ స్టిల్స్
-
ఆకట్టుకుంటున్న ‘కొండపొలం’ ట్రైలర్, వైష్ణవ్‌ను ఆటపట్టిస్తున్న రకుల్..
Vaishnav Tej Kondapolam Trailer Out: మెగా హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్‌లు జంటగా నటిస్తున్న చిత్రం ‘కొండపొలం’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్, టీజర్, లిరికల్ సాంగ్‌కు విశేష స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ‘కొండపొలం’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. Embark on the Astounding Journey of #KondaPolam - "An Epic Tale of Becoming" ▶️ https://t.co/qlLNaZIJ9C#KondaPolamTrailer Out Now!#KondaPolamOct8#PanjaVaisshnavTej @Rakulpreet @mmkeeravaani @YRajeevReddy1 #JSaiBabu @FirstFrame_ent @MangoMusicLabel — Krish Jagarlamudi (@DirKrish) September 27, 2021 ట్రైలర్ విషయానికొస్తే.. ట్రైలర్ విషయానికొస్తే.. వైష్ణవ్, రకుల్‌ల జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్ కనిపించాడు. అడవి నేపథ్యం నుంచి బాగా చదువుకున్న యువకుడు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో అతడు ఎదుర్కొ అవమానాలను ట్రైలర్లో చూపించారు. ఇక రకుల్, వైష్ణవ్ మధ్య సాగే సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ‘చదువుకున్న గొర్రె చదువురాని మరో గొర్రెతో మాట్లాడటం చూశావా?’ అంటూ రకుల్.. వైష్ణవ్ ఆటపట్టిస్తూ చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకుంటోంది. ఇక గొర్రెల కోసం వైష్ణవ్ చేసే సాహస సన్నివేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. చదవండి: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అడివి శేష్ వర్షంలో సైక్లింగ్ చేసిన సమంత.. వీడియో వైరల్ -
దయచేసి అందరూ హెల్మెట్ వేసుకొని వెళ్లండి: వైష్ణవ్ తేజ్
Vaishnav Tej Emotional Speech At Republic Pre Release Event:మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రిపబ్లిక్’.హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఈ సినిమా గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాదు. అన్నయ్య కోలుకోవాడనికి కారణం డాక్టర్లు అయితే, మీ అందరి ప్రేమాభిమానాలతోనే త్వరగా కోలుకుంటున్నాడు. యాక్సిడెంట్ స్పాట్లో వెంటనే ఆంబులెన్స్‌కు ఫోన్ చేసి హాస్పిటల్‌కి తీసుకెళ్లిన వాళ్లంత ప్రత్యేకంగా ధన్యవాదాలు. దయచేసి అందరూ బైక్‌పై హెల్మెట్ వేసుకొని వెళ్లండి. ఒక తమ్ముడిగా, అన్నయ్యలా,కొడుకులా చెబుతున్నా. ప్లీజ్ మీ అందరిలా ఎవరికి ఏమైనా అయినా మేమందరం బాధపడతాం' అంటూ వైష్ణవ్ ఎమోషనల్ అయ్యాడు. ఇక రిపబ్లిక్ సినిమా అక్టోబరు 1న విడుదల కానుంది. ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్గా నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె. భగవాన్, జె. పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. -
సెట్స్‌లో పుట్టినరోజు జరుపుకున్న ఉప్పెన భామ కృతి శెట్టి..
-
‘కొండపొలం’ ఫస్ట్ సాంగ్.. ఆకట్టుకున్న వైష్ణవ్, రకుల్ లవ్ ట్రాక్
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్-వైష్ణవ్‌తేజ్‌ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘కొండపొలం’. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్, టీజర్లకు విశేషణ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ‘ఓ..ఓ ఓబులమ్మా.. బుట్ట చెండు ఆటలో నా పూల కొమ్మా’ అంటూ సాగే ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గొర్రెల కాపరిగా వైష్ణవ్ తేజ్.. రకుల్‌ను ఊహించుకుంటూ ఈ పాట పాడుతుంటే.. లంగావోణిలో రోలు తప్పితూ ఈ పాటలో గొంతు కలిపింది రకుల్. ఈ సాంగ్‌లో వైష్ణవ్-రకుల్ మధ్య కెమిస్ట్రీ బాగా పడింది. చదవండి: హీరోయిన్ రకుల్‌ని ఇలా ఎప్పుడైనా చూశారా? వీరి లవ్ ట్రాగ్ పాటకు అట్రాక్షన్‌గా నిలిచిందని చెప్పుకొవచ్చు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను గాయకులు సత్య యామిణి, పీవీఎన్ఎస్ రోహిత్‌లు ఆలపించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రీ, చంద్రబోస్‌లు పాటకు సాహిత్యం అందించారు. కొండపొలం నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన విధానం ఆధారంగా క్రిష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: రోడ్డుపై కనువిందు చేస్తున్న ఎన్టీఆర్ లంబోర్ఘిని, చరణ్ ఫెరారీ.. -
హీరోయిన్ రకుల్‌ని ఇలా ఎప్పుడైనా చూశారా?
Rakul Preet Singh As Obulamma : క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్-వైష్ణవ్‌తేజ్‌ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కొండపొలం. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మోషన్ పోస్టర్‌తో పాటు రకుల్ లుక్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.ఇందులో రకుల్ ఓబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుంది. కొండపాలెం నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన విధానం ఆధారంగా క్రిష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సింగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) చదవండి : వైరల్ : చిరంజీవి ఇంట్లో గ్రాండ్‌గా రాఖీ సెలబ్రేషన్స్ వైష్ణవ్ తేజ్-క్రిష్ మూవీ టైటిల్ ఇదే, ఫస్ట్‌లుక్ విడుదల -
వైష్ణవ్ తేజ్-క్రిష్ మూవీ టైటిల్ ఇదే..
‘ఉప్పెన’ మూవీతో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న వైష్ణవ్ రెండవ చిత్రం ప్రముఖ దర్శకుడు జాగర్లమూడితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొండపాలెం నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ టైటిల్‌ను ‘కొండపొలం’గా ఖారారు చేసి ఈ మేరకు శుక్రవారం ఉదయం మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. గడ్డం, మాస్‌లుక్‌లో పంజా వైష్ణవ్ ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: Nani Tuck Jagadish: థియేటర్ల యాజమానుల అసంతృప్తి కాగా అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన విధానం ఆధారంగా క్రిష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. వైష్ణవ్ తేజ్‌కు జంటగా రకుల్ ప్రీత్‌సింగ్ సందడి చేయనున్నారు. ఇందులో రకుల్ ఓబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సింగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: మళ్లీ వాయిదా పడిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ! -
వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమా: రిలీజ్ డేట్ ఫిక్స్.. టైటిల్ అదేనా!
తొలి సినిమా ‘ఉప్పెన’తోనే బాక్సాఫీస్ బద్దలు కొట్టిన హీరో వైష్ణవ్‌తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ యంగ్ హీరో.. తనదైన నటనతో ఒక్క సినిమాతోనే లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు.ఉప్పెన’సినిమా చూసిన వాళ్లంతా వైష్ణవ్‌కు ఇది తొలి సినిమా అంటే నమ్మలేరు. అంతలా నటించాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఇక తన రెండో సినిమాకి ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించాడు. అడవి నేపథ్యంలో సాగే ఈ మూవీని ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది. (చదవండి: అధ్యక్ష భవనంలో తాలిబన్ల జల్సాలు.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్) తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించింది చిత్ర బృందం. అక్టోబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మవీ.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్ని జరుపుకుంటుంది. ఈ మూవీ టైటిల్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘కొండపొలం’అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న కారణంగా అదే పేరుని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. (చదవండి: క్యూట్‌గా నవ్వులు చిందిస్తున్న ఈ కవలలు ఎవరో తెలుసా?) -
కొత్త సినిమా స్టార్ట్ చేసిన మెగాహీరో
‘ఉప్పెన’ ఫేమ్ వైషవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో స్టార్ట్ అయ్యింది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్‌ను తెరకెక్కింన గిరీశాయ ఈ త్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఉప్పెన’తో యువతకు దగ్గరైన వైష్ణవ్ తేజ్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేసే కథతో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రూపొందిస్తున్నాం. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా శిష్యుడు గిరీశాయ ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు’ అని అన్నారు. కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. -
మెగా హీరోకు నాగార్జున భారీ రెమ్యూనరేషన్, ఎంతంటే!
స్టార్ హీరో నాగార్జున్ అక్కినేని మెగా హీరోకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ముట్టజెపుతున్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా నాగార్జున ఇండస్ట్రీలో హీరోగానే కాక నిర్మాతగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో పలు సినిమాలు, సీరియల్స్, షోలో నిర్వహిస్తుంటాడు. తన బ్యానర్లో నటించే నటీనటులకు పారితోషికంలో ఎలాంటి బేరాలు ఉండవు. ఆ షో, సినిమాను బట్టి నటుల డిమాండ్‌ను చూసి పారితోషికం అందిస్తాడు నాగ్. ఈ క్రమంతో తాజాగా మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్‌కు కూడా ఏకంగా 5 కోట్ల రూపాలయ పారితోషికం ఇస్తున్నట్లు టాలీవుడ్లో టాక్. కాగా తొలి సినిమా ‘ఉప్పెన’తో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న వైష్ణవ్ ఒక్కసారిగా అందరి దృష్టి ఆకర్షించాడు. దీంతో దర్శక-నిర్మాతలు క్యూ కడుతూ వైష్ణవ్‌కు అవకాశాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున సైతం వైష్ణవ్‌తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో వైష్ణవ్ హాకీ ఆటగాడిగా కనిపించనున్నాడట. ఈ మూవీతో పృథ్వీ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. కాగా వైష్ణవ్, క్రిష్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
నిహారిక ఫోన్లో వైష్ణవ్ తేజ్ పేరు ఏమని ఉంటుందో తెలుసా?
మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సినిమా కబుర్లతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పుటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం భర్త జొన్నలగడ్డ చైతన్యతో కలిసి వెకేషన్ ట్రిప్‌లో సందడి చేస్తోంది. భర్తతో కలిసి టూర్లు చుట్టోస్తూ.. మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా చైతన్య- నిహారిక జంట వెకేషన్ ట్రిప్‌లో భాగంగా పాండిచ్చేరి అందాలను ఆస్వాదిస్తున్నారు.కాగా ప్రస్తుతం నిహారిక పాండిచ్చేరిలో దిగిన ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే నిహారిక ఇటీవలె ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె జవాబిచ్చింది. ఇందులో ఓ నెటిజన్..వైష్ణవ్ తేజ్ పేరును మీ ఫోన్ కాంటాక్ట్ నేమ్స్ లో ఏమని ఫీడ్ చేసుకున్నారు అని నిహారికను అడిగాడు. దీనికి స్పందించిన నిహారిక...వైష్ణవ్ తేజ్ పేరును హీరోబాబు అని సేవ్ చేసుకున్నట్టు చెప్పింది. అంతేకాకుండా ఉప్పెన సినిమా విడుదల కాకముందే తాను వైష్ణవ్ పేరును ఇలా సేవ్ చేసుకున్నట్లు పేర్కొంది. ఇక డెబ్యూ మూవీతోనే వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే నటుడిగా ఆకట్టుకున్న వైష్ణవ్‌కు ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి. -
ఒకే బెడ్‌పై ముగ్గురు మెగా హీరోలు..వరుణ్ దొంగ చూపులు.. ఫోటో వైరల్
ఇంట్లో ముగ్గురు, నలుగురు పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. ముఖ్యంగా నిద్రపోయే సమయంలో బెడ్‌పై ఒకే చోటు కోసం పిల్లలు కొట్టుకోవడం సర్వసాధారణం. ఎంత తిట్టుకున్న, కొట్టుకున్న సరే రాత్రి అయితే చాలు అంతా ఒకే చోట నిద్రపోతారు. అలా తాము కూడా వరుణ్, వైష్ణవ్లతో కలిసి ఒకే బెడ్‌పై నిద్రపోయేవాడినని చెబుతున్నాడు మెగా మేనల్లుడు సాయి తేజ్. ఇప్పటికి కూడా ఆ అలవాటు పోలేదంటూ బెడ్‌పై వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లతో కలిసి నిద్రపోతున్న ఫోటోని తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు . అందులో వైష్ణవ్ అర్దనగ్నంగా పడుకొని ఉండగా, వరుణ్ దొంగచూపులు చూస్తున్నాడు. ‘కొన్ని ఎప్పటికి మారువు’అంటూ సాయితేజ్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. కాగా, మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్, బన్నీ, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ అంతా ఒకే ఏజ్ గ్రూపు వాళ్లు. చిన్నప్పటి నుంచి కలిసిపెరిగారు. అందుకే వీళ్లు కజిన్స్‌లా కాకుండా ఫ్రెండ్స్‌గా ఉంటారు. ఈ గ్యాంగ్‌లో నిహారిక కూడా ఉంటుంది. ఆమెను మరదల్లా కాకుండా చెల్లిగానే చూసేవాళ్లమని గతంలో కొన్ని ఇంటర్యూల్లో సాయితేజ్, అల్లు అర్జున్ చెప్పారు. View this post on Instagram A post shared by Sai Dharam Tej (@jetpanja) -
ఆ హీరోయిన్ని ప్రేమిస్తున్నా : వైష్ణవ్ తేజ్
తొలి సినిమా ‘ఉప్పెన’తోనే బాక్సాఫీస్ బద్దలు కొట్టిన హీరో వైష్ణవ్‌తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ యంగ్ హీరో.. తనదైన నటనతో ఒక్క సినిమాతోనే లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ‘ఉప్పెన’సినిమా చూసిన వాళ్లంతా వైష్ణవ్‌కు ఇది తొలి సినిమా అంటే నమ్మలేరు. అంతలా నటించాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. తొలి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ యంగ్ హీరో తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా తమ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటినీ వైష్ణవ్ ముందు ఉంచారు నెటిజన్లు. వాటన్నింటికీ ఓపికగా సమాధానం ఇచ్చాడు వైష్ణవ్. ఈ క్రమంలో ‘సోనాక్షి సిన్హా అంటే మీకు ఎందుకు ఇష్టం’అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఆమె అంటే ఇష్టం కాదు ప్రేమని చెప్పాడు. ఇప్పటికీ ఆమెను ప్రేమిస్తూనే ఉన్నానని వైష్ణవ్ అన్నాడు. ఇక అభిమాన హీరో ఎవరని ప్రశ్నించగా.. రజనీ కాంత్ అని, ఆయన నటించిన శివాజీ మూవీని చాలా సార్లు చూశానని చెప్పాడు. సమంత గురించి ఏమైనా చెప్పండని ఓ నెటిజన్ అడగ్గా.. ఫ్యామిలీ మేన్-2లో సమంత నాకెంతో నచ్చేసిందన్నాడు. కృతిశెట్టిలో నటన కాకుండా దాగి ఉన్న మరో టాలెంట్ ఏంటని ప్రశ్నించగా.. ఆమె మంచి సింగర్ అని చెప్పాడు. తన తరువాతి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నానని, ఆ తర్వాత గిరీశయ్య దర్శకత్వంలో మరో సినిమా పట్టాలెక్కనుందని తెలిపాడు. చదవండి: బన్నీ అస్సలు తగ్గట్లేదుగా.. క్రేజీ ప్రాజెక్టులతో దండయాత్రకు రెడీ ఆ హీరోయిన్ను కాపీ కొడతాను: సమంత -
మెగా హీరో వైష్ణవ్ తేజ్ అభిమాన హీరో ఎవరంటే..
తొలి చిత్రం ఉప్పెనతో భారీ సక్సెస్ అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఈ మూవీలో తనదైన నటనతో తెలుకు ప్రేక్షకులను మెప్పించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. దీంతో వైష్ణవ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఉప్పెన రిలీజ్ కాకముందే క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాను పూర్తి చేశాడు. అయితే అది ఇంకా రిలీజ్ కాలేదు. ఈ కుర్ర హీరో కోసం దర్శకనిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్ట్స్‌కు సంతకం చేసిన వైష్ణవ్ తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌చాట్ నిర్వహించాడు. అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు అతడు సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో మీ అభిమాన హీరో ఎరవని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు రాజనీకాంత్ సర్ అని సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే మెగా హీరోల్లో ఎవరిని అడిగిన ఫస్ట్ మెగాస్టార్ పేరు చెబుతారు. ఆయనే తమకు స్ఫూర్తి అని పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక వైష్ణవ్ రజనీకాంత్ పేరు చెప్పడంతో ఆ నెటిజన్ షాక్ అయ్యాడు. వెంటనే ఆయన సినిమాలో ఏ సినిమా ఇష్టమని అడగ్గా.. శివాజి అని సమాధానం ఇచ్చాడు వైష్ణవ్. అలాగే మలయాళ నటి నజ్రియా నజీమ్ తన ఫేవరేట్ యాక్ట్రస్ అని కూడా చెప్పుకొచ్చాడు. చదవండి: కొత్త డైరెక్టర్‌తో వైష్ణవ్ సినిమా: రోల్ ఏంటంటే? -
కొత్త డైరెక్టర్‌తో వైష్ణవ్ సినిమా: రోల్ ఏంటంటే?
హీరో వైష్ణవ్ తేజ్ హాకీ స్టిక్ పట్టుకుని బరిలో దిగనున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారట. ఇదంతా వైష్ణవ్ హీరోగా నటించనున్న తర్వాతి చిత్రం కోసమే అనే సంగతి అర్థమై ఉంటుంది. తొలి సినిమా ‘ఉప్పెన’తో ఘన విజయం అందుకున్న వైష్ణవ్ తేజ్ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాతగా ఓ సినిమా, అన్నపూర్ణ స్టూడియోస్‌పై హీరో నాగార్జున నిర్మాతగా మరో సినిమా చేయనున్నారాయన. నాగార్జున నిర్మించే చిత్రం క్రీడల నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం. పృథ్వీ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ సినిమా హాకీ నేపథ్యంలో రూపొందనుందట. ఇందులో వైష్ణవ్ తేజ్ హాకీ ప్లేయర్ పాత్ర చేయనున్నారని టాక్. అసలు సిసలైన హాకీ ప్లేయర్‌గా ఒదిగిపోవడానికి వైష్ణవ్ కసరత్తులు మొదలుపెట్టారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్ వార్త. -
ఆ హిట్ డైరెక్టర్‌తోనే వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ మూవీ
తొలి సినిమా ఉప్పెన తోనే బాక్సాఫీస్ బద్దలు కొట్టిన మెగా హీరో వైష్ణవ్ తేజ్. తొలి చిత్రంతోనే తనదైన నటనతో సముద్రమంత క్రేజ్ సంపాదించుకొని ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు. దీంతో వైష్ణవ్ తేజ్‌కి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఉప్పెన రిలీజ్ కాకముందే క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాను పూర్తి చేశాడు. అయితే అది ఇంకా రిలీజ్ కాలేదు. తొలి సినిమాతోనే బంపర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కుర్ర హీరో కోసం దర్శకనిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. ఇప్పటికే తమిళ 'అర్జున్ రెడ్డి' దర్శకుడు గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలె దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం పూర్తయ్యింది. ఇది కాకుండా మైత్రీ మూవీస్ బ్యానర్ లో రెండు సినిమాల డీల్ కి కూడా ఓకె చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం వైష్ణవ్..తన నాలుగో సినిమాను భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములతో చేయనున్నాడు. వైష్ణవ్ కోసం వెంకీ కుడుముల మంచి కథను రెడీ చేశాడని, దీనికి వైష్ణవ్ కూడా ఓకే చేసినట్లు సమాచారం. నితిన్ కెరియర్లోనే భీష్మ మంచి కంబ్యాక్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మెగా హీరోకు కూడా మరో బంపర్ హిట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. మరి ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా ఎవరు ఉంటారన్నది ఇంకా ఫైనల్ కాలేదు. చదవండి : పెళ్లికి రెడీ అవుతున్న అరియానా! వరుడు ఎవరంటే.. యాంకర్ అనసూయ భర్త జాబ్ ఏంటో తెలుసా? -
బుల్లితెరపై ‘ఉప్పెన’ రికార్డ్.. స్టార్ హీరోలతో సమానంగా!
ఉప్పెన.. ఇటీవల కాలంలో వచ్చిన తెలుగు సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన మూవీ. రికార్డుల మీద రికార్డులను తన పేరు మీద లిఖించుకుంటోంది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రధాన పాత్రలో బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ కలిసి నిర్మించిన ఈ చిత్రం వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, విలన్‌గా విజయ్ సేతుపతి నటన సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. వెండితెరపై ఓ ఊపు ఊపిన ఉప్పెన.. ఇటు బుల్లితెరపై కూడా తన హవాను కొనసాగించింది. థియేటర్స్ లో 50 రోజులు ఆడిన ఈ చిత్రం ఈ మద్యే నెట్ ఫ్లిక్స్ లోనూ విడుదలైంది. అక్కడా మంచి వ్యూస్ సాధిస్తుంది. తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా స్టార్ మా ఛానెల్లో ప్రసారమయ్యింది. తొలిసారి ప్రసారమైన ఉప్పెనకు ఏకంగా 18.5 టీఆర్పీ రేటింగ్ దక్కింది. డెబ్యూ హీరోల సినిమాలకు ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఈమధ్య కాలంలో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల తర్వాత ఎక్కువ రేటింగ్ పొందిన చిత్రం ఇదే . ఇక అదే రోజున ప్రసారం అయిన విజయ్ మాస్టర్ సినిమాకు 4.86 రేటింగ్ వచ్చింది. చదవండి: మరోసారి ‘బేబమ్మ’తో వైష్ణవ్ తేజ్ రొమాన్స్! లాక్‌డౌన్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ Blockbuster response for #Uppena continues UPPENA TV PREMIERE delivers phenomenal 18.5 ratings 💥#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @ThisIsDSP @aryasukku @SukumarWritings @MythriOfficial pic.twitter.com/tOPMelkR3l — BARaju (@baraju_SuperHit) April 29, 2021 -
మరోసారి ‘బేబమ్మ’తో వైష్ణవ్ తేజ్ రొమాన్స్!
చిత్రపరిశ్రమలో కాంబినేషన్‌కి భారీ రెస్పాన్స్ ఉంటుంది. ఒక సినిమా హిట్ అయితే చాలు ఆ దర్శకుడికి, హీరో కాంబోలో మరో సినిమా రావాలని కోరుకుంటారు సినీ అభిమానులు. అలాగే హీరో, హీరోయిన్లు కూడా మరోసారి కలిసి నటిస్తే..ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. అందుకే దర్శక, నిర్మాతలు సైతం అలాంటి జోడీలతో సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతుంటారు. ప్రేక్షకులు కూడా అలాంటి జోడీలను ఆదరిస్తుంటారు. ఇటీవల కాలంలో సిల్వర్ స్క్రీన్‌పై బాగా పాపులర్ అయిన జోడీ ఏదైనా ఉంటదే.. అది వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలదే. ‘ఉప్పెన’లో వీరిద్దరు చేసిన రొమాన్స్ ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చింది. వైష్ణవ్, కృతిల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. దీంతో ఈ ఇద్దరికి వరుసగా భారీ ఆఫర్లు వస్తున్నాయి. అందం, అభినయంతో ప్రతి ఒక్కరి మనసును దోచుకున్న ఈ ‘బేబమ్మ’.. మరోసారి వైష్ణవ్‌తో జోడీ కట్టనున్నందని టాక్. ఉప్పెన సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వైష్ణవ్, కృతితో కలిసి మరో సినిమాను చేయబోతున్నట్లు సమాచారం. అంతే కాదు ఈ సినిమాతో సుకుమార్ టీమ్ నుంచి మరో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ మూడో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వంలోనటించిన తన రెండో సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇక కృతిశెట్టి విషయానికి వస్తే.. నాని హీరోగా తెరకెక్కుతున్న ‘శ్యామ్ సింగరాయ్’తో పాటు సుధీర్‌బాబు– మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. అంతేగాక, రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ నటించే అవకాశాన్ని దక్కించుకుంది. -
అయ్యో.. ‘ఉప్పెన’ కోసం బేబమ్మ ఇంత కష్టపడిందా?
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ ప్రేమ కథా చిత్రం ఈ ఏడాది టాలీవుడ్లో విడుదలైన బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. వైష్ణవ్ తేజ్ నటన, కృతిశెట్టి అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామిని సృష్టించింది. ఇక ఈ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత మేకింగ్ వీడియోలని ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తుంది చిత్రబృందం. ఇప్పటికే ‘జల జల పాతం నువ్వు’పాటతో పాటు..పలు సన్నివేశాల మేకింగ్ వీడియోని విడుదల చేసిన చిత్రబృందం.. తాజాగా మరో మేకింగ్ వీడియోని విడుదల చేసింది. అందులో డైలాగ్స్ చెప్పడానికి ‘బేబమ్మ’ఎంత కష్టపడిందో చూడొచ్చు. మీడియా ముందు సైలెంట్‌గా కనిపించే దర్శకుడు బుచ్చిబాబు..లొకేషన్లో మాత్రం చాలా హుషారుగా ఉన్నాడు. యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు క్లాస్రూమ్ సీన్లను ఎలా చిత్రీకరించారో ఈ వీడియోలో చూడొచ్చు. చదవండి: ‘జలజల పాతం’ మేకింగ్ కష్టాలు, వీడియో వైరల్ -
ఖమ్మంలో ‘బేబమ్మ’ సందడి.. ‘ఉప్పెన’లా ఎగసిపడ్డ జనం
‘ఉప్పెన’ మూవీతో మెగా మేనల్లుడు పంజా వైష్ణశ్ తేజ్, కృతి శెట్టీలు హీరోహీరోయిన్లుగా వెండితెరకు పరిచమయ్యారు. మొదటి చిత్రంతోనే వైష్ణవ్, కృతీలు భారీ సక్సెస్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఆర్సీగా వైష్ణవ్ తన అమాయకంతో, బేబమ్మగా కృతి అందం, అభినయనంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. దీంతో ఈ క్యూట్ జోడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందని చెప్పడంలో అతిశయోశక్తి లేదు. దీనికి ఈ తాజా సంఘటనే ఉదాహరణ. ఖమ్మంలోని కేఎల్ఎం షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు బేబమ్మ-ఆర్సీలు ముఖ్య అతిథులుగా హజరై షోరూంను ప్రారంభించారు. దీంతో వీరిని చూసేందుకు జనం వేల సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వైష్ణవ్, కృతీలను చూసేందుకు ‘ఉప్పెన’లా ఎగిసిపడ్డ జనసంద్రాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా లాక్డౌన్ తర్వాత విడుదలై సినిమాల్లో ‘ఉప్పెన’ 100 కోట్ల క్లబ్లో చేరిన మొదటి సినిమాగా గుర్తింపు పొందింది. దీంతో ఈ మూవీ హీరోహీరోఇయన్, దర్శకుడు పలు కార్యక్రమాల్లో పాల్గొంటు బిజీ అయిపోయారు. వీరికి ఉప్పెన నిర్మాతల నుంచి విలువైన బహుమతులు అందాయి. ఇటీవల బచ్చిబాబు సనాకు మైత్రీ మూవీ మేకర్స్ విలువైన బెంజ్ కారు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. Khammam lo KLM shopping mall opening lo Uppena Hero Heroines ni choodadaaniki Uppenalaa egasipadina janam... pic.twitter.com/76OgBVLPcX — BARaju (@baraju_SuperHit) April 3, 2021 చదవండి: ‘ఉప్పెన’ డిలీటెడ్ సీన్.. ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్ ఎన్టీఆర్ కొత్త సినిమా: 60 ఏళ్ల మాజీ వృద్ధ ఆటగాడిగా..! -
ఫ్యామిలీకి దగ్గరయ్యేలా...
‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా మూడో సినిమా షురూ అయింది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్‌ను తెరకెక్కించిన గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. కేతికా శర్మ హీరోయిన్ . బాపినీడు సమర్పణలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వైష్ణవ్ తేజ్ తల్లి విజయ దుర్గ కెమెరా స్విచాన్ చేయగా, ఆయన సోదరుడు, హీరో సాయితేజ్ క్లాప్ ఇచ్చారు. ‘‘ఉప్పెన’తో యూత్‌కు దగ్గరైన వైష్ణవ్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేసే కథతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రూపొందించనున్నాం’’ అన్నారు బీవీయస్‌యన్ ప్రసాద్. -
సెట్స్‌పైకి వైష్ణవ్ కొత్త సినిమా
-
సెట్స్‌పైకి వైష్ణవ్ కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరంటే..
తొలి సినిమా ఉప్పెన తోనే బాక్సాఫీస్ బద్దలు కొట్టిన హీరో వైష్ణవ్ తేజ్. తొలి చిత్రంతోనే తనదైన నటనతో సముద్రమంత క్రేజ్ సంపాదించుకొని ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు. దీంతో వైష్ణవ్ తేజ్‌కి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. మెగా కాంపౌండ్ హీరో కోసం దర్శకనిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. ఉప్పెన రిలీజ్ కాకముందే క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరపుకుంటోంది. ఇందులో వైష్ణవ్‌కు జోడీగా రకుల్ ప్రీత్ నటించింది. ఇప్పటికే పలు సినిమాలు వైష్ణవ్ చేతిలో ఉన్నాయి. తాజాగా వైష్ణవ్ చేస్తున్న మూడో సినిమా గురించి అప్డేట్ వచ్చేసింది. అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌ను డైరెక్ట్ చేసిన గిరీశయ్యతో చేస్తున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. శుక్రవారం సాయి ధరమ్ తేజ్ క్లాప్ కొట్టి ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో వైష్ణవ్ సరసన 'రొమాంటిక్' బ్యూటీ కేతిక శర్మ నటిస్తుంది. ప్రస్తుతం ఈమె ఆకాష్ పూరీ హీరోగా రూపొందుతున్న 'రొమాంటిక్' మూవీలోనూ నటిస్తుంది. తొలి సినిమాతోనే లక్కీ హీరో అనిపించుకున్న వైష్ణవ్‌తో సినిమా అనగానే కేతిక వెంటనే ఓకే చేసిందట. మరి రెండవ సినిమాతో వైష్ణవ్..మరో హిట్‌ను అందుకుంటాడా అన్నది చూడాల్సి ఉంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చదవండి : వైష్ణవ్ తేజ్ తొలి పారితోషికం ఎంతంటే? ‘ఉప్పెన’ డిలీటెడ్ సీన్.. ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్ -
బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 8 హిట్ సినిమాలు ఇవే
కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఈ మహమ్మారి ఎఫెక్ట్‌కు 9 నెలల పాటు థియేటర్స్ మూసేశారు. ఇలాంటి తరుణంలో ప్రేక్షకులు మళ్లీ థియేర్లకు వస్తారా? సినిమా థియేటర్లు మళ్లీ హౌస్‌ఫుల్ అవుతాయా?అని చిత్ర పరిశ్రమ పెద్దలు ఒకింత భయాందోళనకు గురవుతుండగా.. మేము అండగా ఉంటామని ధైర్యాన్ని నూరిపోశారు తెలుగు ప్రేక్షకులు. సినిమాలు విడుదల చేయండి, థియేటర్స్‌కి తప్పకుండా వస్తామని భరోసా ఇచ్చారు. అన్నట్లుగానే గత మూడు నెలలుగా విడుదలైన సినిమాలన్నింటిని ఆదరించి చిత్ర పరిశ్రమే షాకయ్యేలా చేశారు. సినిమా సందడి మళ్లీ మొదలైంది. చూస్తుండగానే ఈ ఏడాదిలో మూడు నెలలు గడిచిపోయాయి. ఈ మూడు నెలల్లో టాలీవుడ్లో దాదాపు 66 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో మంచి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నేటితో మొదటి మూడు నెలలు ఫినిష్ అయ్యాయి.మరి ఫస్ట్ క్వార్టర్లో ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాయో చూద్దాం. కిర్రాక్ అనిపించిన ‘క్రాక్’ థియేటర్లు రీఓపెన్ అయ్యాక వచ్చిన తొలి బిగ్ మూవీ ‘క్రాక్’. కరోనా భయానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా రారా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీకి భరోసా ఇచ్చిన చిత్రమిది. జనవరి 9నదసంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించి నిర్మాతలలో నమ్మకం పెంచేసింది. రవితేజ, శ్రుతీహాసన్ హీరోహీరోయిన్లగా నటించిన ఈ సినిమా దాదాపు 38 కోట్లు వసూలు చేసింది. పోలీసు అధికారి పోత రాజు వీర శంకర్‌గా మాస్ మహారాజా రవితేజ చించేశాడు. చాలా రోజుల తర్వాత మాస్ మహారాజాలోని ఫైర్ తెరపై కనిపించింది. గతంలో 'డాన్ శ్రీను', 'బలుపు' లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. విజయ్ ‘మాస్టర్’ పాఠాలు బాగున్నాయి విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ‘ఇళయదళపతి’ విజయ్ ఈ ఏడాది ‘మాస్టర్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు సినిమా కాకపోయినా కూడా టాలీవుడ్లో మంచి విజయం సాధించింది మాస్టర్. జనవరి 13న విడుదలైన ఈ సినిమా సినిమా దాదాపు 12 కోట్ల షేర్ వసూలు చేసి, తెలుగులో కూడా విజయ్‌కు భారీ మార్కెట్ ఉందని నిరూపించింది. ఈ సినిమాలో విలన్‌గా నటించిన విజయ్ సేతుపతికి మంచి మార్కులు పడ్డాయి. పర్వాలేదనిపించిన ‘రెడ్’ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన ‘రెడ్’ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ‘నేను శైలజ', ‘ఉన్నది ఒకటే జిందగీ' తర్వాత కిశోర్ తిరుమల,రామ్ కాంబోలో హ్యాట్రిక్‌గా వచ్చిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా.. సేఫ్‌జోన్‌లోకి వెళ్లింది. యాంకర్ ప్రదీప్ తొలి ప్రయత్నం ఫలించింది యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘30’రోజుల్లో ప్రేమించడం ఎలా. తొలి సినిమాతోనే మంచి హిట్ కట్టాడు. ఈ సినిమా కూడా హిట్ అయిందా అనే అనుమానాలు చాలా మందికి రావచ్చు. కానీ పెట్టిన బడ్జెట్.. అమ్మిన రేట్లతో పోలిస్తే మాత్రం యాంకర్ ప్రదీప్ తొలి సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి.కొందరు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు కూడా తీసుకొచ్చింది. రికార్డులు షేక్ చేసిన జాంబి రెడ్డి కరోనా క్రైసిస్ లో కూడా జాంబీలంటూ.. వచ్చి టాలీవుడ్ రికార్డులు షేక్ చేసింది జాంబి రెడ్డి. హాలీవుడ్ కాన్సెప్ట్ తో డిఫరెంట్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిబ్రవరి 5న విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లని రాబట్టి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. మెగా మేనల్లుడి రికార్డు.. ‘ఉప్పెన’లా వచ్చిన కలెక్షన్లు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఉప్పెన. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతోమంది నిర్మాతలకు ధైర్యం నూరిపోసిన సినిమా ఇది. బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఉప్పెన ఏకంగా 51 కోట్లు షేర్ వసూలు చేసింది. అల్లరి నరేశ్ నట విశ్వరూపానికి ‘నాంది’ 8 ఏళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న అల్లరి నరేశ్‌కు ‘నాంది’తో మంచి విజయం దక్కింది. ‘నా ప్రాణం పోయిన పర్వాలేదు.. న్యాయం గెలవాలి.. న్యాయమే గెలవాలి’ అంటూ అల్లరి నరేశ్ చేసిన నటనకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. నరేశ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమా 6.5 కోట్ల షేర్ వచ్చింది. చేసిన బిజినెస్‌తో పోలిస్తే సినిమా లాభాల్లోకి వచ్చేసింది. బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ‘జాతి రత్నాలు’ నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ జాతిరత్నాలు. అనుదీప్ దర్శకత్వంలో వచ్చినఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. మహాశివరాత్రి సందర్భంగా మార్చ్ 11న విడుదలైన జాతి రత్నాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్లో కూడా పెద్ద సినిమాలకు రానీ కలెక్షన్స్‌తో రాబట్టింది.నిర్మాతలకు దాదాపు 40 కోట్ల లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. -
‘ఉప్పెన’ డిలీటెడ్ సీన్.. ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టీ జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం వంద కోట్లపైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. సినిమా విడుదలైన నెలన్నర రోజుల తర్వాత డిలీటెడ్ సీన్స్‌ని ఒక్కక్కటిగా యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంది చిత్ర బృందం. తాజాగా విడుదల చేసిన రెండు డిలీటెడ్ సన్నివేశాలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కాలనీ అమ్మాయితో వైష్ణవ్ తేజ్ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. బేబమ్మకు లవ్ లెటర్ ఇచ్చేందుకు ఆశీ పడే ప్రయత్నాలు ఫన్నీగా ఉన్నాయి. అంతేకాదు ఈ సీన్లో గోదావరి జిల్లాలో పాడుకునే జానపద పాటను కూడా పెట్టాడు దర్శకుడు బుచ్చిబాబు. అది కూడా చాలా బాగుంది. అలాగే విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల మధ్య వచ్చే సీన్ కూడా అదిరిపోయింది. సినిమా నిడివిని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు సన్నీవేశాలను తొలగించారు. ఇంకా ఇలాంటి సన్నివేశాలు ఎన్ని ఉన్నాయో చూడాలి మరి. -
ఆ అకౌంట్లను నమ్మొద్దు: వైష్ణవ్ తేజ్
‘‘సోషల్ మీడియాలో నాకు ఎలాంటి అధికారిక అకౌంట్స్ లేవు. నా పేరుతో ఉన్న ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్‌ను దయచేసి ఎవరూ ఫాలో కావొద్దు’’ అని హీరో పంజా వైష్ణవ్ తేజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘కొందరు తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికి నా పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించి ఉపయోగిస్తున్నారు’’ అన్నారు వైష్ణవ్. తొలి చిత్రం ‘ఉప్పెన’తో ఘనవిజయం అందుకున్న వైష్ణవ్ తేజ్ ద్వితీయ చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు. కాగా వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతీశెట్టి హీరోయిన్గా నటించిన ఉప్పెన సినిమా ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం వంద కోట్ల మైలురాయిని అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో సినిమా యూనిట్ విజయోత్సవ సంబరాలు కూడా జరుపుకుంది. చదవండి: రంగ్‌దే ప్రీ రిలీజ్: చీఫ్ గెస్ట్‌గా త్రివిక్రమ్, కారణం అదేనట! -
ఉప్పెన సక్సెస్ పార్టీ.. మెగాస్టార్, బన్నీ సందడి
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టీ జంటగా నటించిన ‘ఉప్పెన’ సినిమా రిలీజ్ అయ్యి నెల దాటినా మూవీపై క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. సినిమాకు చెందిన ఏదో ఒక విషయం రోజూ వార్తల్లో నానుతుంది. ఇటీవల ‘జలజల జలపాతం నువ్వు’ అంటూ సాగే వీడియో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పాట అత్యధిక వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. తాజాగా ఉప్పెన సినిమా విజయోత్సవ సంబరాలు చేసుకుంది. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్‌తోపాటు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, పాటు అల్లు అర్జున్, సాయి తేజ్, సుకుమార్, హరీష్ శంకర్, గోపిచంద్ మలినేని, పలువురు దర్శకులు, నిర్మాతలు, తదితరులు వేడుకలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ‘ఉప్పెన’ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఇందులో కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం, శ్రీమణి రాసిన పాటలు సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయి. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాపై సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపించారు. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ టాక్ అందుకొని ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు రాబట్టింది. అంతేకాకుండా టాలీవుడ్లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగానూ ఉప్పెన రికార్డులు సృష్టించింది. ప్రతీ అంశం ఉప్పెన విజయంలో భాగమై సునామీలా వసూళ్లు కురిపిస్తుంది. చదవండి: ట్రెండింగ్‌లో 'ఉప్పెన' వీడియో సాంగ్.. ‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌తో వైష్ణవ్ తేజ్ సినిమా -
ఉప్పెన విజయోత్సవంలో సినీ ప్రముఖుల సందడి..
-
ట్రెండింగ్‌లో 'ఉప్పెన' వీడియో సాంగ్..
సినిమాకు పాటలతోనే మాంచి హైప్ వస్తుందీ రోజుల్లో. అందుకు '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?', 'ఉప్పెన' సినిమాలే లేటెస్ట్ ఉదాహరణ. ఇందులోని పాటలు ఎంత హిట్టయ్యాయో, సినిమాలు అంతకు మించి సూపర్ డూపర్ హిట్టయ్యాయి. కేవలం పాటల కోసమే పని గట్టుకుని థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఇదిలా వుంటే.. గురువారం సాయంత్రం 'ఉప్పెన' చిత్రం నుంచి జలజలజలపాతం నువ్వే.. వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను శ్రేయాఘోషల్, జాస్ప్రీత్ జాజ్ మనోహరంగా ఆలపించారు. అప్పట్లో కేవలం లిరికల్ సాంగ్‌ను మాత్రమే రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా ఈ మెలోడి పూర్తి వీడియోను విడుదల చేసింది. ఇది 39 లక్షల పై చిలుకు వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. కాగా వైష్ణవ్ తేజ్, ఉప్పెన జంటగా నటించిన చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడమే కాక వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమాపై పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే! చదవండి: వంద కోట్లు: రికార్డులు తిరగరాసిన ఉప్పెన -
‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌తో వైష్ణవ్ తేజ్ సినిమా
డైరెక్టర్‌గా అనుదీప్ కేవీ, హీరోగా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాలతోనే టాలీవుడ్‌కు బ్లక్‌బస్టర్ హిట్ అందించారు. ఫుల్ లెన్త్ కామెడీగా అనుదీప్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ మూవీ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుండగా, వైష్ణవ్ ‘ఉప్పెన’ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్ రాబట్టి 100 కోట్ల క్లబ్లో చేరింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ మూవీ సెక్సెస్‌లో మునిగి తెలుగుతూ ఫుల్ జోష్ మీద ఉన్నారు. అయితే అనుదీప్-వైష్ణవ్ కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ పడిందట. ఇప్పటికే నిర్మాత బీవీఎస్ఎస్ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌కు అడ్వాన్స్ కింద కొంత మొత్తం కూడా చెల్లించాడట. ప్రస్తుతం వైష్ణవ్ క్రిష్ జాగర్లమూడితో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన వెంటనే అనుదీప్ వైష్ణవ్ మూడవ సినిమాను సట్స్‌పైకి తీసుకేళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా మార్చి 11న విడుదలై కలెక్షన్ వర్షం కురిపిస్తుండగా ఇక ఫిబ్రవరి 12న విడుదలైన ‘ఉప్పెన’ బ్లక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. చదవండి: అప్పుడే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ జాతి రత్నాలు ట్రైలర్ చూసి సరదాగా నవ్వుకోండి -
మేనల్లుడికి చిరంజీవి ఖరీదైన బహుమతి
తొలి సినిమా ఉప్పెనతో సూపర్ సక్సెస్ అందుకుని గాల్లో తేలిపోతున్నాడు హీరో వైష్ణవ్ తేజ్. ఈ సినిమా రిలీజై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ అతడి మీద అభినందనల వర్షం కురుస్తూనే ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి అయితే ఉప్పెన టీమ్‌ను కొనియాడటమే కాకుండా ఆ మధ్య చిత్రయూనిట్‌కు కానుకలు సైతం పంపాడు. ఈ క్రమంలో హీరోయిన్ కృతి శెట్టిని మెచ్చుకుంటూ లేఖ పంపాడు. అలాగే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌కు సైతం లేఖతో పాటు ఓ చిరు కానుక పంపాడు. మెగాస్టార్ నుంచి బహుమతులు అందుకున్న వీళ్లిద్దరూ ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు. తాజాగా ఈసారి చిరు నుంచి కానుకను అందుకునే అదృష్టం వైష్ణవ్ తేజ్‌కు దక్కింది. చిరంజీవి తన మేనల్లుడికి ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీంతో ఆ గడియారాన్ని చేతికి ధరించిన ఫొటోను అభిమానులతో పంచుకుంటూ థ్యాంక్స్ మామా అని రాసుకొచ్చాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన బుచ్చిబాబు సానా దర్శకుడిగా తొలి చిత్రం ఉప్పెనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆయువుపట్టుగా నిలిచింది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాలను మెప్పించిన ఈ చిత్రం రూ.100 కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. చదవండి: సెంచరీ మార్క్: రికార్డులు తిరగరాసిన ఉప్పెన వైష్ణవ్ తేజ్ తొలి పారితోషికం ఎంతంటే? -
అప్పుడే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైష్ణవ్ తేజ్
పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. తొలిసారిగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 12వ తేదీన విడుదలై బాక్సాఫిసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మూవీ 100 కోట్ల రూపాయల బడ్జేట్‌లో చేరి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమాతో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇంత వరకు ఏ డెబ్యూ హీరోకి రాని వసూళ్లను రాబట్టి అప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేశాడు వైష్ణవ్. దీంతో వైష్ణవ్‌కు ప్రముఖ దర్శకనిర్మాతల నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే వైష్ణవ్ ‘ఉప్పెన’తో పాటు దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ షూటింగ్ ‘ఉప్పెన’ విడుదలకు ముందే కంప్లీట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరపుకుంటోంది. అంతేగాక వైష్ణవ్ తన మూడవ సినిమాకు కూడా సంతకం చేశాడట. మనం ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నూతన దర్శకుడి డైరెక్షన్లో వైష్ణవ్ తదుపరి సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమచారం. ఇక వీటితో పాటు వైష్ణవ్ నిర్మాత బీవీ ఎస్ఎన్ ప్రసాద్ నిర్మిచే మరో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీంతో తొలి సినిమాతోనే అంత్యంత క్రేజ్‌ను సంపాదించుకున్న వైష్ణవ్ వరుస సినిమాలతో టాలీవుడ్లో ఫుల్ బిజీ అయిపోయినట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ మూవీ దర్శకుడికి, హీరోయిన్ కృతి శేట్టికి కూడా పలు దర్శకనిర్మాతల నుంచి ఆఫర్లు, ఖరిదైన బహుమతులు అందుతున్న సంగతి తెలిసిందే. చదవండి: మూవీలో చరణ్ అన్న అలా చేయమని చెప్పాడు: వైష్ణవ్ రికార్డులు తిరగరాసిన ఉప్పెన -
100 కోట్ల క్లబ్లో చేరిన ‘ఉప్పెన’
మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 12వ తేదీన విడుదలైన బాక్సాపీస్ వద్ద దుమ్మురేపుతోంది. లాక్డౌన్ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. మొదటి రోజే ఈ మూవీ రికార్డు స్టాయిలో ప్రపంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం వాటిని నిజం చేస్తూ సూపర్ హిట్‌గా నిలిచింది. సినిమా విడుదలకు ముందే ఇది వంద కోట్ల సినిమా అవుతుందని డైరెక్టర్ సుకుమార్ జోస్యం చెప్పారు. ఇప్పుడు అక్షరాలా అదే నిజమైంది. ఉప్పెన చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ విషయాన్ని'ఉప్పెన' నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఉప్పెన వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 'ఓ మంచి సినిమాను ఏదీ ఆపలేదని మరోసారి ఈ ఉప్పెనతో రుజువైంది. మీ ఉప్పెనంత ప్రేమకి ధన్యవాదాలు'' అని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాతో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇంత వరకు ఏ డెబ్యూ హీరోకి రాని వసూళ్లను రాబట్టి అప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేశారు. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించగా, దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. చదవండి : (ఆ యాడ్స్‌లో ఉన్న చిన్నారి ‘బేబమ్మే’!) (ఉప్పెన విజయం: వైష్ణవ్, ‘బేబమ్మ’కు భారీ గిఫ్ట్) Time and again it is proved that nothing can stop Good Cinema ❤️#100CroreGrossForUppena 🌊 మీ ఉప్పెనంత ప్రేమకి ధన్యవాదాలు 🙏❤️#BlockbusterUppena#Uppena#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @ThisIsDSP @aryasukku @SukumarWritings @adityamusic pic.twitter.com/lAWjiaVjc4 — Mythri Movie Makers (@MythriOfficial) March 6, 2021 -
మూవీలో చరణ్ అన్న అలా చేయమని చెప్పాడు: వైష్ణవ్
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన చిత్రం ‘ఉప్పెన’. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్ల సునామి సృష్టించి బ్లక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక హీరో, హీరోయిన్, దర్శకుడికి ‘ఉప్పెన’ తొలిసినిమా కావడం, ఇది రూ. 100 కోట్ల వసూళ్లను రాబట్టడంతో వీరి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక హీరోయిన్ కృతీ శేట్టి, హీరో వైష్ణవ్ తేజ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనాలకు మూవీ మేకర్స్ నుంచే కాకుండా పలువురు సినీ ప్రముఖుల నుంచి భారీ స్థాయిలో బహుమతులు అందుతున్నాయి. ఇక మూవీ టీం సెక్సెస్ మీట్లలో పాల్గొంటూ ఫుల్ బీజీ అయిపోయింది. ఈ కార్యక్రమాలకు హాజరవుతున్న టాప్ హీరోలు, దర్శకులంతా హీరోహీరోయిన్, దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో హీరో నటన చాలా బాగుందని, ముఖ్యం తన కళ్లు, కనుబోమ్మలతో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మూవీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయంటు వైష్ణవ్ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక మొదటి సినిమాతోనే వైష్ణవ్ భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవడంతో మెగా హీరోలంతా తెగ సంబరపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణవ్ ఓ అసక్తికర విషయం చెప్పాడు. ‘ఉప్పెన’ మూవీ షూటింగ్ ప్రారంభించే ముందు బావ రామ్ చరణ్ తనకు ఓ సలహా ఇచ్చాడని వెల్లడించారు. ‘రామ్ చరణ్ అన్న మూవీలో నా కనుబొమ్మలను ఎంత వీలైత అంత ఉపయోగించమని చెప్పారన్నాడు. ఇలా చేస్తే మూవీలో నీకంటూ ప్రత్యేక గుర్తింపు వస్తుందని, అది మూవీ సక్సెస్‌కు బాగా ఉపయోగపడుతుందని చెప్పినట్లు వైష్ణవ్ వెల్లడించాడు. ఇక ఇటీవల ‘ఉప్పెన’ గ్రాండ్ సక్సెస్ మీట్ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చెర్రీ మాట్లాడుతూ.. వైష్ణవ్‌ను నాన్న బాబాయ్ సినిమాల్లోకి రమ్మని తరచూ ప్రోత్సహించారని చెప్పాడు. అంతేగాక నటనపై పట్టు సాధించేందుకు పవన్ కల్యాణ్ బాబాయ్ వైష్ణవ్‌ను విదేశాలకు పంపించాడని, నాన్న ఉప్పెన కథ నాలుగుసార్లు విన్నట్లు చరణ్ చెప్పుకొచ్చాడు. చదవండి: ‘ఉప్పెన’ టీమ్‌కు అల్లు అర్జున్ ప్రశంసలు ఆ యాడ్స్‌లో ఉన్న చిన్నారి ‘బేబమ్మే’! ‘ఉప్పెన’ మేకింగ్ వీడియో కూడా అదుర్స్! -
‘ఉప్పెన’ టీమ్‌కు అల్లు అర్జున్ ప్రశంసలు
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి నటించిన ఉప్పెన చిత్రంపై టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన చిత్రం ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఇన్ని రోజులు షూటింగ్‌లతో బిజీగా ఉన్న బన్నీ ఆలస్యంగా ఉప్పెన సినిమాను చూశారు. ఈ సందర్భంగా మూవీపై తన అభిప్రాయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ఇంత గొప్ప విజయాన్ని అందుకున్నందుకు ఉప్పెన టీం అభినందనలు తెలిపారు. ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు అద్భుతంగా చిత్రీకరించాడని, ఇలాంటి సినిమాను తీసినందుకు బుచ్చిబాబు అంటే గౌరవం ఏర్పడిందదన్నారు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు ఆత్మవంటిదన్నారు. విజయ్ సేతుపతి తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని మెచ్చుకున్నారు. ముఖ్యంగా హీరో వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్ గురించి ప్రశంసించారు. ఓ డెబ్యూ చిత్రంలో ఇంతగొప్పగా నటించిన మరో హీరోను నేను చూడలేదంటూ కొనియాడారు. అలాగే అలాగే హీరోయిన్ కృతి శెట్టి.. విజయ్ సేతుపతి నటన గురించి ప్రశంసించారు. కథను నమ్మి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఉప్పెన సినిమా.. కథలపై వాళ్లకున్న నమ్మకాన్ని, ధైర్యాన్ని తెలియజేస్తుందని తెలిపారు. డీఓపీ, టెక్నికల్ టీం పనితనం బాగుందన్నారు. ఉప్పెన సినిమా తనకు చాలా బాగా నచ్చిందని.. ఇలాంటి అద్భుతమైన సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా బన్నీ ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలోనే పుష్ప సినిమాలో నటిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Watched #Uppena. My respect to @BuchiBabuSana for delivering such a wonderful film. Great work by DOP & technical crew. The music by @ThisIsDSP was the soul of the movie. Huge respect for @VijaySethuOffl garu who took the film to another level with his magnetic aura. pic.twitter.com/cIlPwZKRCN — Allu Arjun (@alluarjun) March 4, 2021 చదవండి: హైదరాబాద్ రోడ్లపై దర్శనమిచ్చిన అల్లు అర్జున్ శ్రద్ధా కపూర్ పెళ్లి; వాళ్లకు ఇష్టమైతే నేను సిద్ధమే! -
రెమ్యునరేషన్ భారీగా పెంచిన ‘బేబమ్మ’.. మరీ అంతా!
తొలి సినిమా ‘ఉప్పెన’తోనే కుర్రాళ్ల ఆరాధ్య దేవతలా మారిపోయింది కృతిశెట్టి. అమాయకపు కళ్లు, సొట్టబుగ్గలతో ఆకట్టుకునే మనోహర రూపం, సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు కట్టిపడేసి ఉప్పెనంత విజయాన్ని సొంతం చేసుకుంది. బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసిన ఈ ముంబై చిన్నది... వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారిపోయింది. ఇప్పటికే నేచురల్ స్టార్ నానితో శ్యామ్ సింగరాయ్, సుధీర్‌బాబు– మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రంలో ఆమె హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక, రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు ఫిల్మీ దునియాలో టాక్ వినిపిస్తోంది. ఇటు తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా కృతికి ఆఫర్లు వస్తున్నాయట. ఇదిలా ఉంటే.. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఉప్పెన వసూళ్ల సునామీ కొనసాగుతోంది. దీంతో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా హీరో వైష్ణవ్ తేజ్, బేబమ్మకు భారీ మొత్తాన్ని బహుమతిగా ఇస్తున్నట్లు సమాచారం. ఆశీకి రూ. కోటి, బేబమ్మకు 25 లక్షలు ఇచ్చినట్లు టీ-టౌన్ టాక్. ఈ నేపథ్యంలో తనకున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడిందట కృతిశెట్టి. ఇల్లు ఉండగానే దీపం చక్కబెట్టుకోవాలన్న చందంగా రెమ్యునరేషన్‌ను ఏకంగా కోటి రూపాయలకు పెంచిందంటూ గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. ఏదేమైనా మొదటి సినిమాకు పది లక్షల లోపు తీసుకున్న బేబమ్మ.. స్టార్ హీరోయిన్ల మాదిరి ఇప్పటి నుంచే భారీ మొత్తం డిమాండ్ చేయడం సాహసమే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: ఓటీటీలోకి ఉప్పెన.. రూ.7 కోట్లకు కొనుగోలు -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘ఉప్పెన’ టీం
సాక్షి, తిరుమల: ‘ఉప్పెన’ సినిమాతో భారీ విజయం అందుకున్నారు హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతీ శెట్టి, దర్శకుడు బుచ్చి బాబు. వీరందరికి టాలీవుడ్లో ఇది డెబ్యూ చిత్రం కావడం విశేషం. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం.. అదే రేంజ్లో వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ‘ఉప్పెన’ ఘన విజయం సాధించడంతో దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం వెంకటేశ్వర స్వామీ ఆశీస్సుల కోసం తిరమల వెళ్లారు. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతీ శెట్టి, నిర్మాత నవీన్, డైరెక్టర్ బుచ్చిబాబు తదితరులు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరంతా కాలినడకన కొండెక్కి స్వామిని దర్శించుకున్నారు. హీరో, హీరోయిన్లు కాలినడకన తిరుమల కొండ మెట్లెక్కుతున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలువుతున్నాయి. అనంతరం వీరంతా వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. ‘ఉప్పెన’ టీంతో పాటు తుడా చైర్మన్ చెవి రెడ్డి కూడా ఉన్నారు. శ్రీవారిని దర్శించుకున్న శివన్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తొలిసారి ప్రైవేట్ సంస్థలకు చెందిన ఐదు ఉపగ్రహాలను ప్రయోగించనున్న సంగతి తెలిసిందే. పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ ద్వారా ఈ నెల 28 ఉదయం షార్ నుంచి రోదసిలోకి ఉపగ్రహాలను పంపనున్నారు. ఈ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్, ఎంపీ మార్గాని భరత్ తదితరులు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: వరంగల్‌లో ఉప్పెన టీం సందడి -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు..
-
నాని నో చెప్పాడు.. వైష్ణవ్ ఓకే చేశాడు
ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోలను దృష్టిలో పెట్టుకుని కథలు సిద్ధం చేసుకునేవారు. ఒకవేళ సదరు హీరోకు ఈ కథ నచ్చకపోతే అది అటకెక్కెది. మరి కొందరు హీరోలు తాము అస్సలు అడుగుపెట్టని జానర్ చిత్రాలు చేయాలంటే వెనకంజ వేసేవారు. అభిమానులు తమను అలాంటి చిత్రాల్లో అంగీకరిస్తారో లేదో.. ఎందుకొచ్చిన తలనొప్పి అని ఊరుకునేవారు. ప్రయోగాల జోలికి వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. జానర్‌తో సంబంధం లేకుండా హీరోలు సినిమాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. కొత్త కథ అయితే చాలు అంటున్నారు. ఇక గతంలోలా ఓ హీరో కథను రిజెక్ట్ చేస్తే దాన్ని పక్కన పెట్టడం లేదు. మరో హీరోకు ఆ స్టోరి వినిపిస్తున్నారు దర్శక నిర్మాతలు. సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. తాజాగా ఇదే సీన్ రిపీట్ అయ్యింది టాలీవుడ్లో. నాచురల్ స్టార్ నాని రిజెక్ట్ చేసిన ఓ కథను హీరో వైష్ణవ్ తేజ్ అంగీకరించారట. ఆ వివరాలు.. తాజాగా నిర్మాత భోగవల్లి ప్రసాద్ కొత్త దర్శకుడితో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట. యాక్షన్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు తొలుత నానిని హీరోగా అనుకున్నారట. కారణాలు తెలయదు కానీ నాని ఈ కథను రిజెక్ట్ చేశాడట. దాంతో ఈ స్టోరిని మెగా హీరో వైష్ణవ్ తేజ్‌కు వినిపించారట దర్శకుడు. అతడు ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించాడని సమాచారం. త్వరలోనే ఇది పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉప్పెన విజయంతో మంచి ఫామ్‌లో ఉన్న వైష్ణవ్ వరుసగా సినిమాలు అంగీకరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జంగిల్ బుక్’ సినిమాను పూర్తి చేశాడు ఈ మెగా హీరో. తరువాత అన్నపూర్ణ బ్యానర్లో ఓ చిత్రం.. దాని తర్వాత భోగవల్లి ప్రసాద్ బ్యానర్లో తెరకెక్కించే చిత్రాల్లో నటించనున్నాడు. నాని వద్దనకున్న చిత్రం వైష్ణ్వ్కి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి మరి అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇక వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ చిత్రం 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో దీన్ని తమిళం, హిందీలో రిమేక్ చేయనున్నారు. బుచ్చిబాబు దర్శకత్వలో వచ్చిన ఉప్పెన చిత్రంలో కృతీ శెట్టి, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. చదవండి: టీజర్: ఫైటింగ్‌కు పెళ్లి కొడుకు రెడీ! డీఎస్పీ, కృతీశెట్టికి చిరంజీవి స్పెషల్ సర్ప్రైజ్ -
ఉప్పెన విజయం: వైష్ణవ్, ‘బేబమ్మ’కు భారీ గిఫ్ట్
డెబ్యూ మూవీతోనే భారీ హిట్‌ని తమ ఖాతాలో వేసుకున్నారు ‘ఉప్పెన’ హీరో, హీరోయిన్, దర్శకుడు. వైష్ణవ్ తేజ్, ‘బేబమ్మ’ కృతీ శెట్టి, దర్శకుడు బుచ్చిబాబుకి ఇండస్ట్రీలో ఉప్పెననే తొలి చిత్రం. భారీ అంచానాల మధ్య విడుదలైన ఈ చిత్రం అదే రేంజ్లో కలెక్షన్స్ సాధించింది. ఇప్పటి వరకు దాదాపు 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉప్పెన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ హీరో, హీరోయిన్లకు ఊహించని.. భారీ సర్ప్రైజ్ ఇచ్చారట. సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో వీరిద్దరికి భారీ ఎమౌంట్ గిఫ్ట్‌గా ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో హీరో వైష్ణవ్ తేజ్‌కి కోటి రూపాయలు.. హీరోయిన్ కృతీ శెట్టికి 25 లక్షల రూపాయలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఇప్పటికే చెక్స్‌ని హీరో, హీరోయిన్లకు ఇచ్చినట్లు సమాచారం. ఇక త్వరలోనే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుకు కూడా ఖరీదైన బహుమతి ఇవ్వనున్నారట. గతంలో బుచ్చి బాబుకు కారు లేదా ఇల్లుని ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ‘ఉప్పెన’ చిత్రానికి గాను వైష్ణవ్ తేజ్ 50 లక్షల రూపాయల పారీతోషికం తీసుకోగా.. గిఫ్ట్‌గా అంతకు రెట్టింపు అందుకోవడం విశేషం. ఏది ఏమైనా ఉప్పెన విజయం ఈ మెగా హీరోకు ఇండస్ట్రీలో బలమైన పునాది వేసిందనే చెప్పాలి. ఇక ఈ చిత్రం నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో అల్లు అర్జున్ పుష్ప, మహేష్ బాబు సర్కార్ వారి పాట వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఉన్నాయి. చదవండి: బాలీవుడ్లో రీమేక్ కానున్న ‘ఉప్పెన’ వైష్ణవ్ తేజ్ తొలి పారితోషికం ఎంతంటే? -
‘ఉప్పెన’ మేకింగ్ వీడియో కూడా అదుర్స్!
మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి పలు రికార్డులను తిరగరాసింది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ను లాభాల్లో ముంచెత్తింది. లాక్డౌన్ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగానూ నిలిచింది. దేవీశ్రీ సంగీతం, విజయ్ సేతుపతి నటన ఈ సినిమా విజయానికి ప్లస్ అయింది. విలన్ పాత్రలో కనిపించిన విజయ్ సేతుపతి యాక్టింగ్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. అంతేకాకుండా టాలీవుడ్లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగానూ ఉప్పెన రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఉప్పెన మేకింగ్ వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మొదటి సినిమాతోనే ఎంతో పరిణతితో నటించిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా టీజర్లు, పాటలు సినిమా విడుదలకు ముందే పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. కరోనా నిబంధనల సడలింపుతో ఉప్పెన 100 శాతం ఆక్యుపెన్సీతో విడుదలైంది. ఇలా ప్రతీ అంశం ఉప్పెన విజయంలో భాగమై సునామీలా వసూళ్లు కురిపిస్తుంది. దీంతో ఈ సినిమాను ఇప్పుడు తమిళం, హిందీ భాషల్లోనూ రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి : (ఓటీటీలోకి ఉప్పెన.. రూ.7 కోట్లకు కొనుగోలు) (వైష్ణవ్ తేజ్ తొలి పారితోషికం ఎంతంటే?) -
వైష్ణవ్ తేజ్ తొలి పారితోషికం ఎంతంటే?
తొలి సినిమా ప్రభావం హీరోల మీద గట్టిగానే ఉంటుంది. అది హిట్టయిందంటే చాలు దర్శకనిర్మాతలు అతడితో కలిసి పని చేసేందుకు తహతహలాడుతుంటారు. ఒకవేళ ఫస్ట్ మూవీయే ఫ్లాప్ అయిందంటే ఆ హీరోతో సినిమా అంటేనే వెనకడుగు వేస్తారు. కానీ ఇక్కడ వైష్ణవ్ తేజ్ నటించిన మొట్టమొదటి సినిమా ఉప్పెనంత విజయాన్ని నమోదు చేసుకుని అతడికి స్పెషల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. పైగా మెగా కాంపౌండ్ నుంచి వచ్చాడన్న పేరు ఉండనే ఉంది. దీంతో అతడు తన క్రేజ్‌ను బాగానే క్యాష్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో చేయబోయే సినిమాకు రూ.75 లక్షలు తీసుకోనున్నాడు. అయితే ఉప్పెన రిలీజ్‌కు ముందే ఈ డీల్ కన్ఫార్మ్ అయింది. అలాగే నిర్మాత భోగవల్లి ప్రసాద్ కాంబినేషన్లో రానున్న చిత్రానికి ఏకంగా రూ.2.5 కోట్లు తీసుకుంటున్నాడట. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆశి బాబు మూడో సినిమాకే ఇంత పారితోషికం తీసుకుంటున్నాడా? అని షాకవుతున్నారు. ఈ క్రమంలో అతడి తొలి రెమ్యునరేషన్ ఎంత ఉండొచ్చని గుసగుసలు పెడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం తొలి సినిమా ఉప్పెన కోసం అతడు అక్షరాలా రూ.50 లక్షలు తీసుకున్నాడట. ఇది కొంత ఆశ్చర్యంగానే ఉన్నప్పటికీగా మెగా హీరో అంటే ఆ మాత్రం ఉంటుందిలే అని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. చదవండి: ‘ఉప్పెన’ ఎలా ఉందో ఒకే ముక్కలో తేల్చేసిన మహేశ్ రామ్ చరణ్ రికార్డులను తుడిచిపెట్టిన ‘ఉప్పెన’.. -
బాలీవుడ్లో రీమేక్ కానున్న ‘ఉప్పెన’
మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈ నెల 12న విడుదలై బాక్సాపీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రం... లాక్డౌన్ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. దేవీశ్రీ సంగీతం, విజయ్ సేతుపతి నటన ఈ సినిమా విజయంలో సగ భాగం అయింది. ఇప్పటికే ఈ సినిమా రూ.70 కోట్ల కలెక్షన్లు సాధించి సత్తా చాటుతోంది. దీంతో ఈ సినిమాను ఇప్పుడు తమిళం, హిందీ భాషల్లోనూ రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే తన కుమారుడు సంజయ్‌ను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేయాలని తమిళ సూపర్‌స్టార్ విజయ్ భావిస్తున్న్ట్లట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర బృందంతో ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొదట ఈ సినిమాను టాలీవుడ్‌తో పాటు తమిళ్లో కూడా విడుదల చేయాలని భావించినా విజయ్ సేతుపతి మాత్రం వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. కథ బాగుందని, డబ్ చేయడం కంటే రీమేక్ చేస్తే మంచి వసూళ్లను రాబడుతుందని సలహా ఇచ్చారట. అంతేకాకుండా తమిళ రీమేక్ రైట్స్‌ను స్వయంగా విజయ్ సేతుపతి తీసుకోబుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ ఉప్పెనను రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా ఉప్పెన రీమేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. చదవండి : (‘ఉప్పెన’పై మహేశ్ బాబు రివ్యూ) (బాప్రే.. కేజీఎఫ్ 2 తెలుగు రైట్స్‌కి అన్ని కోట్లా?) -
ఓటీటీలోకి ఉప్పెన.. రూ.7 కోట్లకు కొనుగోలు
‘ఉప్పెన'తో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ రికార్డులను తిరగరాస్తున్నాడు. ఇంత వరకు ఏ డెబ్యూ హీరోకి రాని వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టిస్త్నునాడు. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. ఒక డెబ్యూ హీరోల పేరిట బాలీవుడ్లో ఉన్న రికార్డ్‌ను కూడా వైష్ణవ్ బీట్ చేశాడు. విడుదలైన రెండు రోజులకే ఈ సినిమాకు ఏకంగా 18 కోట్ల షేర్ వచ్చిందంటే రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ ఈ సినిమాను నిర్మించాడు. మరోవైపు ‘ఉప్పెన’ ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో కోలీవుడ, బాలీవుడ్‌లోకి కూడా రీమేక్ చేయడానికి సన్నహాలు మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే ఈ సూపర్ హిట్ మూవీని ఓటీటీలోకి కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ.7 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నట్టు సమాచారం. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. చదవండి : ‘ఉప్పెన’పై మహేశ్ బాబు రివ్యూ -
‘ఉప్పెన’పై మహేశ్ బాబు రివ్యూ
మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు దర్శకుడిగా పరిచమైన చిత్రం ‘ఉప్పెన’. ఈ నెల 12న విడుదలై అద్భత విజయాన్ని అందుకున్న ఈ మూవీ గురించి ఇప్పుడు ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. ఈ సినిమాపై ఇప్పటికే బాలయ్య మొదలు చాలా మంది సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ జాబితాలో తాజాగా సూపర్ స్టార్ మహేశ్ కూడా చేరాడు. ఇటీవల ‘ఉప్పెన’ సినిమాను వీక్షించిన మహేశ్.. ఇదో అద్భుత సినిమా అంటూ చిత్ర యూనిట్‌ని కొనియాడాడు. ఉప్పెన సినిమాకు పని చేసిన వాళ్లలో ఒక్కొక్కరిని ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ‘ఉప్పెన.. ఒక్క మాటలో చెప్పాలంటే క్లాసిక్! బుచ్చిబాబు సానా.. మీరు కలకాలం గుర్తుండిపోయే అరుదైన చిత్రాన్ని రూపొందించారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది’, ‘కొత్త వాళ్లైన వైష్ణవ్, కృతిశెట్టి అద్భుత నటన నా మనసును హత్తుకుంది’, ‘ఉప్పెనకు హార్ట్ దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా ఆల్‌టైమ్ గ్రేట్ మ్యూజిక్ స్కోర్స్‌లో ఒకటిగా గుర్తుండిపోతుంది. ఇప్పటి వరకు నువ్వు అందించిన సంగీతంలో ఇది అత్యుత్తమం డీఎస్పీ. ఇలానే మంచి మ్యూజిక్ అందిస్తూ ఉండండి’, ‘ఇక చివరిగా ఉప్పెన లాంటి సినిమాను నిర్మించిన సుకుమార్ గారికి, మైత్రీ మూవీ మేకర్స్‌కి హ్యాట్సాఫ్. నేను చెప్పినట్టుగా ఇది కలకాలం గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి. మీ అందరినీ చూసి నాకు చాలా గర్వంగా ఉంది’అని ట్విటర్ వేదికగా ఉప్పెన టీంను ప్రశంసించాడు. ఇక సూపర్ స్టార్ మహేశ్ ప్రశంసతో ఉప్పెన టీం గాల్లో తేలిపోతుంది. #Uppena... One word... CLASSIC! @BuchiBabuSana you've made one of those rare timeless films... Proud of you! — Mahesh Babu (@urstrulyMahesh) February 22, 2021 It’s really heartwarming when you see two newcomers come up with stellar performances.... #VaisshnavTej and @IamKrithiShetty... you guys are stars! — Mahesh Babu (@urstrulyMahesh) February 22, 2021 And finally hats off to @aryasukku garu and @MythriOfficial for backing a project like Uppena. Like I said it’s one of those timeless films... Proud of you guys! — Mahesh Babu (@urstrulyMahesh) February 22, 2021 చదవండి : ‘ఉప్పెన’ మూవీ రివ్యూ డీఎస్పీ, కృతీశెట్టికి చిరంజీవి స్పెషల్ సర్ప్రైజ్ -
వరంగల్‌లో ఉప్పెన టీం సందడి
సాక్షి, వరంగల్ చౌరస్తా : ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’ సినిమా హీరో వైష్ణవ్‌తేజ్ , హీరోయిన్ కృతిశెట్టి వరంగల్‌లో సందడి చేశారు. వరంగల్‌లోని రాధికా థియేటర్లో చిత్రం విడుదల కాగా, సోమవారం సాయంత్రం హీరో, హీరోయిన్లతో పాటు ఇతర చిత్రబృందం ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు. అలాగే, సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తొలుత వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి తదితరులు హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించారు. వారితో ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ పూజలు చేయించి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ చరిత్ర, శిల్పకళ విశేషాలను వివరించారు. ఆ తర్వాత వైష్ణవ్‌తేజ్ మాట్లాడుతూ అల్లు అర్జున్ నటించిన రాణిరుద్రమదేవి సినిమా ద్వారా కాకతీయ రాజుల గొప్పతనం తెలిసిందని తెలిపారు. అలాగే, వరంగల్‌లోని భద్రకాళి గుడిని కూడా సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. అర్చకులు టక్కరసు సత్యంసురేష్‌శర్మ, సుధాకరశర్మతో పాటు గంగు మణికంఠశర్మ, ప్రణవ్, లింగబత్తిని రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
'ఉప్పెన' విజయోత్సవ వేడుక ఫోటోలు
-
ఉప్పెన సాంగ్: ఆశి-బేబమ్మల డ్యాన్స్
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: కరోనాతో ఏడాదిగా సినీ పరిశ్రమ పూర్తిస్థాయిలో నష్టపోయిన తరుణంలో ‘ఉప్పెన’ సినిమా విడుదలవడం, అభిమానులు, ప్రేక్షకులు దానిని పెద్దహిట్ చేయడం తెలుగుసినీ ఇండస్ట్రీకి ప్రాణం పోసినట్టయ్యిందని మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అన్నారు. బుధవారం రాత్రి స్థానిక వీఎల్‌పురంలో మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్స్‌లో శ్రేయాస్ మీడియాస్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఉప్పెన’ సినిమా విజయోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ సారధ్యంలో ఒక్కొక్కపాట సినిమాకు ప్రాణం పోసిందన్నారు. విజయసేతుపతి, హీరోయిన్ కృతిశెట్టి వారి నటనతో ఆకట్టుకున్నారన్నారు. తొలి సినిమా ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు మంచి దర్శకుడిగా, వైష్ణవ్‌తేజ్ మంచినటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. హీరో వైష్ణవ్‌తేజ్ మాట్లాడుతూ సినిమాను పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు, మెగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ కృతిశెట్టి మాట్లాడుతూ హలో రాజమండ్రి, అందరికీ నమస్కారం బాగున్నారా.. మీరిచ్చిన సపోర్టుకు చాలా థ్యాంక్స్ అన్నారు. Watch Aasi-Bebamma Dance For Nee Kannu Neeli Samudram #UppenaBlockbusterCelebrations Watch Live here - https://t.co/JhAdRek5XV#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @aryasukku @ThisIsDSP @SukumarWritings @MythriOfficial pic.twitter.com/3IMsR44J5x — BARaju (@baraju_SuperHit) February 17, 2021 దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ తన గురువు సుకుమార్, రామ్‌చరణ్ ఇచ్చిన సపోర్టు వల్లే ఉప్పెన సినిమా పెద్ద హిట్ సాధించిందన్నారు. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమా ‘నీలిసముద్రం.. ప్రేక్షకుల మనస్సు అందులో పడవ ప్రయాణం’ అంటూ పాడి అలరించారు. రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్‌విప్ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ మార్గాని ఎస్టేట్ గ్రౌండ్లో ఉప్పెన సినిమా విజయోత్సవసభ జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. హీరో రామచరణ్‌ను చిరంజీవి ఫ్యాన్స్ తరఫున యేడిద బాబి ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించారు. ముందుగా యాంకర్ శ్యామల వ్యాఖ్యాతగా వ్యవహరించగా, శ్రేయాస్ మీడియా సీఈవో శ్రీనివాస్, డిస్ట్రిబ్యూటర్లు వింటేజ్ శివకుమార్, రామకృష్ణ, ఎల్వీఆర్, సతీష్ పాల్గొన్నారు. చదవండి: Mythri Movies: ఉప్పెన దర్శకుడికి బంపరాఫర్! -
ఈ హిట్‌తో తెలుగు సినిమాకి ప్రాణం పోశారు
‘‘కరోనా నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఈ సమయంలో ‘ఉప్పెన’ సినిమాని హిట్ చేయడం ద్వారా తెలుగు సినిమాకు ప్రేక్షకులు ప్రాణం పోశారు’’ అన్నారు రామ్‌చరణ్. పంజా వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజైంది. రాజమహేంద్రవరంలో బుధవారం ఉప్పెన విజయోత్సవం జరిగింది. ఈ వేడుకలో రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘తెలుగుతో పాటు ఇతర భాషల్లోని సినిమాలకు కూడా ‘ఉప్పెన’ హిట్ ఓ ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. వైష్ణవ్ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గురువును (సుకుమార్) మించిన శిష్యుడు అని బుచ్చిబాబు నిరూపించుకున్నాడు’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు వైష్ణవ్ తేజ్. ఈ వేడుకలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు. -
హృతిక్ రోషన్ రికార్డులను బ్రేక్ చేసిన 'ఉప్పెన’
వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమైన ‘ఉప్పెన’ చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మెదటి రోజే ఈ మూవీ రికార్డు స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయల షేర్ రాబట్టగా.. ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు రూ.50 కోట్లు వసూలు చేసి రికార్డు స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించి ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. టాలీవుడ్లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగా ఉప్పెన నిలిచింది.ఇప్పటి వరకు డెబ్యూ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు రామ్ చరణ్ పేరు మీదే ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2007లో వచ్చిన చిరుతతో చరణ్ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సినిమా 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అయితే 14 ఏళ్లుగా ఆ రిక్డార్డును ఎవరూ టచ్ చేయలేకపోయారు. తాజాగా మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో వారసుడే చిరుత కలెక్షన్లను పూర్తిగా తుడిచేశాడు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ రికార్డులను సైతం బద్దలు కొట్టాడు. ఉప్పెన సినిమాతో ఆల్ ఇండియా రికార్డులను బ్రేక్ చేశాడు. హృతిక్ రోషన్ తొలి చిత్రం ‘కహో నా ప్యార్ హై’ సినిమా ఇండియా వైడ్‌గా రూ.41 కోట్లు (నెట్) వసూలు చేసింది. భారత సినీ చరిత్రలో 21 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును ఇప్పుడు ఉప్పెన బద్దలుకొట్టింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఏప్పెన రూ.42 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి కొత్త రికార్డులను నమోదు చేసింది. చదవండి : (గుడ్‌న్యూస్: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే.) (Mythri Movies: ఉప్పెన దర్శకుడికి బంపరాఫర్!) -
అదేంటో తెలుసుకోలేను.. బుచ్చిబాబుపై సుకుమార్ ఎమోషనల్
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా హీరోగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. ఈ నెల 12న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. టాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లను రాబట్టిన తొలి డెబ్యూ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ ఈ సినిమాను నిర్మించాడు. ఇక తన ప్రియ శిష్యుడి తొలి సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సుకుమార్ ఆనందంతో ఉబ్బితబ్బి పోతున్నారు. తన పేరుని నిలబెట్టినందకు గర్వంగా ఉందంటూ ఓ ఎమోషనల్ కవిత రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘నువ్వు నన్ను గురువు చేసేసరికి.. నాకు నేను శిష్యుడినై పోయాను. ఇంత గొప్ప సినిమా తీయడానికి, నువ్వు నా దగ్గర ఏం నేర్చుకున్నావా..?? అని.. నాకు నేను శిష్యుడ్ని అయిపోతే తప్ప అదేంటో తెలుసుకోలేను.. నాలోకి నన్ను అన్వేషించుకునేలా చేసిన సా‘నా’బుచ్చిబాబును ఉప్పెనంత ప్రేమతో అభినందిస్తూ.. ఇట్లు సుకుమార్ ఇంకో శిష్యుడు’అని బుచ్చిబాబు తన భూజాలనే ఒరిగి ఉన్న ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Sukumar B (@aryasukku) చదవండి : రాధేశ్యామ్ : ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసం 6కోట్లు! భర్తకు ఖరీదైన కారు గిఫ్టిచ్చిన లాస్య -
రామ్ చరణ్ రికార్డులను తుడిచిపెట్టిన ‘ఉప్పెన’..
వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ‘ఉప్పెన’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే ఈ మూవీ రికార్డు స్టాయిలో ప్రపంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయల షేర్ రాబట్టగా.. ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు రూ.50 కోట్లు వసూలు చేసి రికార్డు స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఉప్పెన చిత్రం మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పేరిట ఉన్న రికార్డులను తుడిచిపెట్టింది. ఇప్పటి వరకు డెబ్యూ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు రామ్ చరణ్ పేరు మీదే ఉంది. 14 ఏళ్లుగా దీన్నెవరూ టచ్ చేయలేకపోయారు. కాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2007లో వచ్చిన చిరుతతో చరణ్ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. చిరంజీవి కొడుకు కావడంతో చెర్రీ తొలి సినిమా చిరుతకు అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడి చరణ్‌కు మంచి విజయాన్ని అందించిందది. 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి అత్యధిక కలెక్షన్లు సాధించిన డెబ్యూ హీరోగా చరిత్ర సృష్టించాడు రామ్ చరణ్. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ స్థాయిలో వసూళ్లు ఎవరూ సాధించలేకపోయారు. తాజాగా మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో వారసుడే చిరుత కలెక్షన్లను పూర్తిగా తుడిచేశాడు. కేవలం మూడు రోజుల్లోనే రూ.50 కోట్లు సాధించి చెర్రీ పేరిట ఉన్న రికార్డును వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూడు రోజుల్లోనే తిరగరాశాడు. ఇదిలా ఉండగా చిరుత రికార్డులను బయటి హీరో కాకుండా మెగా హీరోనే క్రాస్ చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగా పవర్ అంటే ఈ లెవల్లో ఉంటుందని అంటున్నారు. చదవండి: గుడ్‌న్యూస్: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే ‘ఉప్పెన’ వీకెండ్ కలెక్షన్ రూ. 50 కోట్లు -
‘ఉప్పెన’ వీకెండ్ కలెక్షన్ రూ. 50 కోట్లు
మెగా హీరో వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే ఈ మూవీ రికార్డు స్టాయిలో ప్రపంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. అదే రికార్డు స్థాయిలో వీకెండ్‌కు కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇవాళ దర్శకుడు బుచ్చిబాబు సన పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు మైత్రీ మూవీస్ ట్విటర్ వేదికగా భాకాంక్షలు తెలుపుతూ ‘ఉప్పెన’ వీకెండ్ కలెక్షన్లను వెల్లడించింది. ‘మా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, అలాగే ‘ఉప్పెన’ 50 కోట్ల కలెక్షన్లు రాబట్టిన సందర్భంగా ఆయనకు అభినందనలు’ అంటూ మైత్రీ మూవీస్ ట్వీట్ చేసింది. కాగా క్రియోటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకుని సక్సెస్ టాక్‌తో ముందుకెళుతుంది. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. Wishing our Director @BuchiBabuSana a Very Happy Birthday ♥ What better gift than a 50Cr Gross Blockbuster Weekend 🌊 - Team #Uppena #HBDBuchiBabuSana pic.twitter.com/by376EaiEo — Mythri Movie Makers (@MythriOfficial) February 15, 2021 చదవండి: గుడ్‌న్యూస్: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే ‘ఉప్పెన’ ఫస్ట్ డే కలెక్షన్లు.. ఆల్‌టైమ్ రికార్డు -
గుడ్‌న్యూస్: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే
మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఉప్పెన సినిమాకు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. ఫిబ్రవరి 12 విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకొని సక్సెస్ టాక్‌తో ముందుకెళుతుంది. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. తాజాగా ఉప్పెన సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రాబోతుందనే విషయం తెరమీదకు వచ్చింది. కరోనా భయంతో ఇంటికే పరిమితమైన ప్రజలు సినిమాలను ఓటీటీలో చూపేందుకు మొగ్గు చూపించారు. అందుకే ఓటీటీ సంస్థలు సైతం భారీ ధరలు పెట్టి సినిమాలను కొంటున్నాయి. క్రాక్, మాస్టర్ లాంటి సినిమాల విషయంలో ఇదే జరిగింది. ప్రస్తుతం ఉప్పెన సినిమాను ఓటీటీలో ఎప్పుడు విడుదల చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. సినిమా రిలీజ్ అయిన సమయంలో రెండు మూడు వారాల్లోనే ఉప్పెన డిజిటల్లోకి వస్తుందనే వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం ఈ సినిమా 40 నుంచి 60 రోజుల టైమ్ గ్యాప్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగతా సినిమాలతో పోలీస్తే ఉప్పెన కాస్త ఆలస్యంగానే ఓటిటిలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 26 నుంచి ప్రారంభం కానున్నదని ఒకవైపు టాక్ వినిపిస్తోంది. అదే విధంగా ఏప్రిల్ 11 నుంచి దర్శనం ఇవ్వనుందని మరోవైపు వినికిడి. ఈ రెండింటిలో ఏది వాస్తవమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. ఇక విడుదలకు ముందే పాటలతో భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఉప్పెన మూవీ డిజిటల్ హక్కుల కోసం అమెజాన్, ఆహా సంస్థలు కూడా పోటీ పడగా.. నెట్ ప్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఉప్పెన’ ఫస్ట్ డే కలెక్షన్లు.. ఆల్‌టైమ్ రికార్డు కూతురి గిఫ్ట్‌ను చూసి మురిసిపోతున్న మహేష్ -
‘ఉప్పెన’ ఫస్ట్ డే కలెక్షన్లు.. ఆల్‌టైమ్ రికార్డు
చిరంజీవి మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ‘ఉప్పెన’ చిత్రం తొలి రోజు భారీ వసూళ్లను రాబట్టింది. ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. నైజాంలో రూ.3.08 కోట్లు, వైజాగ్‌లో రూ.1.43 కోట్లు, ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో వరుసగా రూ. 0.98 కోట్లు, రూ. 0.81 కోట్లు రాబట్టింది. మొదటి రోజు భారీ స్థాయలో కలెక్షన్లు రాబట్టడంతో వైష్ణవ్ తేజ్ డెబ్యూ హీరోగా తొలిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగా ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. ఎక్కడ ఎంత వసూలు చేసిందనే విషయానికి వస్తే.. ► నైజాం.. రూ.3. 08 కోట్లు ►వైజాగ్ రూ. 1. 43 కోట్లు ►ఈస్ట్ రూ. 0.98 కోట్లు ► వెస్ట్ రూ. 0.81 కోట్లు ► క్రిష్ణా రూ. 0.62 కోట్లు ► గుంటూరు రూ. 0.65 కోట్లు ► నెల్లూరు రూ. 0.35 ► ఏపీ మొత్తం రూ. 4. 87 కోట్లు ► సీడెడ్ రూ. 1. 35 కోట్లు ► నైజాం+ ఏపీ రూ. 9.3 కోట్లు ►కర్ణాటక రూ.52 లక్షలు ►తమిళనాడు రూ.16 లక్షలు ►ఓవర్ సీస్లో రూ.34 లక్షలు కాగా మొన్నటి వరకు థియేటర్స్‌లో 50-50 ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేది. అయితే ఉప్పెన 100 శాతం ఆక్యుపెన్సీతో విడుదలైంది. అంతేగాక నేడు రేపు వీకెండ్ కావడంతోపాటు వాలెంటైన్స్ డే కూడా ఉండటంతో ప్రేమికులు ఉప్పెన చిత్రానికి క్యూ కట్టే అవకాశం ఉంది. పైగా మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునే అంశాలు ఉప్పెన చిత్రంలో చాలానే ఉండటంతో ‘ఉప్పెన’ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పే ఛాన్స్ ఉంది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శ్రీమణి రాసిన 'నీ కన్ను నీలి సముద్రం' పాట భారీ హిట్ కొట్టి ఈ సినిమాకు మరింత విజయాన్ని తెచ్చి పెట్టడంలో కృషి చేసింది. చదవండి: ‘ఉప్పెన’మూవీ రివ్యూ దిశా సోదరి గురించి తెలిస్తే ప్రశంసించక మానరు! -
‘ఉప్పెన’ మూవీ రివ్యూ
టైటిల్ : ఉప్పెన జానర్ : లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా నటీనటులు : పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల తదితరులు నిర్మాణ సంస్థ : మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాతలు : నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ దర్శకత్వం : బుచ్చిబాబు సానా సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ : శ్యామ్ దత్ ఎడిటర్ : నవీన్ నూలి విడుదల తేది : ఫిబ్రవరి 12, 2021 తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మెగా’ఫ్యామిలీ ఓ ప్రత్యేకస్థానం ఉంది. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వడమే. అంతేకాదు, వాళ్లలో చాలా మంది టాలీవుడ్లో స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో కుర్రాడు కూడా సినీ రంగ ప్రవేశం చేశాడు. అతడే.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సుప్రీంహీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్. ‘మెగా’ఇమేజ్‌ని మోస్తూ ‘ఉప్పెన’సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు వైష్ణవ్ తేజ్. చిరంజీవి కుటుంబం నుంచి మరో వారసుడు వస్తుండటంతో మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులకు కూడా ‘ఉప్పెన’పై ఆసక్తి బాగా పెరిగింది. దానికి తోడు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇన్ని అంచనాల నడుమ శుక్రవారం (ఫిబ్రవరి 12న) విడుదలైన ఈ చిత్రం ఏమేరకు ఆకట్టుకుంది? 99 శాతం కొత్తవాళ్లతో వచ్చిన ఉప్పెన.. బాక్సాఫీస్ పై విరుచుకుపడుతుందా? లేదా?, వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? అనేది రివ్యూలో చూద్దాం. కథ ఉప్పాడ గ్రామంలోని మత్య్సకార కుటుంబానికి చెందిన ఓ పేదింటి యువకుడు ఆశీ అలియాస్ ఆశీర్వాదం(పంజా వైష్ణవ్ తేజ్). తండ్రి చేసే చేపల వ్యాపారానికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆయనకు గ్రామ పెద్ద, వ్యాపారవేత్త శేషారాయణం(విజయ సేతుపతి) కూతురు బేబమ్మ అలియాస్ సంగీత(కృతి శెట్టి) అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి బేబమ్మను ప్రేమిస్తుంటాడు. కానీ ఈ విషయం బేబమ్మకు తెలియదు. మరోవైపు శేషారాయణంకు పరువు అంటే ప్రాణం. పరువు కోసం ఎంతటి దారుణానికికైనా పాల్పడుతాడు. ప్రాణం పోయినా పర్వాలేదు.. పరువు పోకూడదనే మూర్ఖుడు. తన కూతురు ఎక్కడ ప్రేమలో పడి తన పరువు తీస్తుందనే భయంతో కుర్రాళ్ల గాలి తగలకుండా ఉమెన్స్ కాలేజీలో జాయిన్ చేయిస్తాడు. తన కూతురు కోసం స్పెషల్‌గా గ్రామానికి ఓ బస్సును కూడా వేయిస్తాడు. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల బేబమ్మ.. ఆశీతో ప్రేమలో పడిపోతుంది. ఓ సంఘటన వల్ల రాయణంకు తన కూతురు ప్రేమలో పడిన విషయం తెలిసి బేబమ్మను కట్టడి చేసే ప్రయత్నం చేస్తాడు. దీంతో బేబమ్మ ఆశీతో కలిసి లేచిపోతుంది. అయితే ఓ కారణం వల్ల ఆశీ.. బేబమ్మను తిరిగి రాయణంకు అప్పగిస్తాడు. తను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే బేబమ్మను ఆశీ ఎందుకు తిరిగి అప్పగించాడు? పరువు కోసం ప్రాణాలు ఇచ్చే శేషారాయణం.. తన కూతురి ప్రేమను అంగీకరించాడా లేదా? ప్రేమ దక్కించుకునే క్రమంలో ఆశి ఏం కోల్పోయాడు? చివరకు ఈ జంట ఎలా ఒక్కటైందనేదే మిగతా కథ. నటీనటులు చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన వైష్ణవ్ తేజ్‌కు హీరోగా తొలి సినిమా ఇది. కానీ సగటు ప్రేక్షకులు వైష్ణవ్‌కు ఇది తొలి సినిమా అని గుర్తుపట్టలేరు. అంతలా నటించాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఆశి అనే ఓ పేదింటి కుర్రాడి క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. మొదటి సినిమానే అయినా హీరో ఎంతో పరిణితితో నటించాడు. ఎమోషనల్ సీన్లను అవలీలగా చేసేశాడు. ఇక బేబమ్మ పాత్రకు ప్రాణం పోసింది కృతి శెట్టి. తొలి సినిమాయే అయినా.. చాలా అనుభవం ఉన్న హీరోయిన్లా నటించింది. ఇక వైష్ణవ్ తేజ్ తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర విజయ్ సేతుపతిది. శేషారాయణం అనే విలన్ పాత్రలో ఈ విలక్షణ నటుడు ఇన్వాల్వ్ అయిపోయాడు. సేతుపతి యాక్టింగ్ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. విశ్లేషణ పరువు ప్రతిష్టలు, ప్రేమతో కూడిన సినిమాలు టాలీవుడ్లో చాలా వచ్చాయి. గొప్పింటి అమ్మాయిని పేదింటి అబ్బాయి ప్రేమించడం, పరువు కోసం ఆ ప్రేమకు హీరోయిన్ నాన్న అడ్డుపడడం. చివరకు ఎలాగోలా హీరో హీరోయిన్లు ఒక్కడవ్వడం చాలా సినిమాల్లో చూశాం. ఇలాంటి సినిమాలు సర్వసాధారణం కూడా. ఈ కథనే కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు బుచ్చిబాబు. విజయసేతుపతి లాంటి విలక్షణ నటుడిని, మెగా కుటుంబం నుంచి ఓ హీరోని తన కథకు సెలెక్ట్ చేసుకోవడంలోనే దర్శకుడు సగం విజయవంతం అయ్యాడని చెప్పొచ్చు. తొలి సినిమా అయినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టించకుండా అనుకున్న కథను కళ్లకు కట్టినట్లుగా తెరపై చూపించాడు. తనదైన స్క్రీన్‌ప్లేతో పాత స్టోరీకి ట్రీట్మెంట్ కాస్త డిఫరెంట్‌గా ఇచ్చాడు. అయితే సినిమా చూస్తున్నంత సేపు పలు సినిమాల్లోని సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు కూడా రొటీన్‌గా సాగుతాయి. ఫస్టాఫ్ చూస్తే నిడివి ఎక్కువైందనే భావన కలుగుతుంది. సెకాండాఫ్‌లో కూడా చాలా సీన్లు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. క్లైమాక్స్‌లో రీవీల్ అయ్యే ఓ సీక్రెట్ మాత్రం ఈ మూవీకి హైలెట్ అని చెప్పొచ్చు. ఆశీ తండ్రి జాలయ్య సంబంధించిన సన్నివేశాలు ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు వచ్చే సన్నివేశాలు భావోద్వోగాన్ని రేకెత్తిస్తాయి. చివర్లో కృతి శెట్టి, విజయ్ సేతుపతి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాకు మరో హైలైట్ ఏంటంటే.. దేవిశ్రీ ప్రాసాద్ సంగీతం. తనదైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమా రేంజ్‌ని పెంచేశాడు. విలన్‌కు సంబంధించిన కొన్ని సీన్లకు తన బీజియంతో ప్రాణం పోశాడు. శ్యామ్ దత్ విజువల్స్ బాగున్నాయి. నవీనూలి ఎడిటింగ్ పర్వాలేదు. సెకాండాఫ్‌లో కొన్ని చోట్లు తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తంగా ప్రేమకు సరికొత్త నిర్వచనం చెప్పి మెప్పించడంలో దర్శకుడు కాస్త సఫలమైయ్యాడనే చెప్పొచ్చు. ప్లస్ పాయింట్స్ : విజయ్ సేతుపతి, వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి నటన స్క్రీన్‌ప్లే సంగీతం మైనస్ పాయింట్ రొటీన్ స్టోరీ ఫస్టాఫ్ సాగదీత సీన్లు - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మా ఊళ్లో నన్ను సుకుమార్ అని పిలుస్తారు!
‘‘నేను ఎప్పుడూ మా ఇంటి గడప నుంచే కథ వెతుకుతాను. మా ఇంటి లోపల ఏదైనా కథ ఉందా? మా వీధి, మా ఊరు, మా స్నేహితులు.. ఇలా ముందు నా దగ్గర కథే వెతుక్కుంటాను. కల్మషం లేని భావోద్వేగాలతో కూడిన కథే మట్టి కథ. ‘ఉప్పెన’ అలాంటి సినిమాయే’’ అన్నారు బుచ్చిబాబు. వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉప్పెన’. మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన విశేషాలు.. ► నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సుకుమార్‌గారు నా లెక్కల మాస్టర్. సినిమాల్లోకి వెళ్లబోతున్నానని చాలా తక్కువమంది స్టూడెంట్స్‌తో ఆయన చెప్పుకునేవారు. వారిలో నేను ఒకడిని. సుకుమార్‌గారు ఇండస్ట్రీకి వచ్చి ‘ఆర్య’ సినిమా తీశారు. డైరెక్ట్‌గా సినిమా అంటే మా ఇంట్లో పంపించరని, నేను ఎమ్బీఏ చదువుకుంటూ సుకుమార్‌గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు సినిమాలు చేశాను. ► కొన్ని తమిళ సినిమాలు డిఫరెంట్‌గా ఉంటాయి. అలాంటి కథలను మన కంటెంట్‌తో కూడా చెప్పవచ్చు కదా అనిపిస్తుంటుంది. లక్కీగా ‘ఉప్పెన’ సినిమా అలాంటిదే. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో అల్లుకున్న ఫ్యామిలీ డ్రామా ‘ఉప్పెన’ సినిమా. కూతురిది ఉప్పెనంత ప్రేమ. తండ్రిది ఉప్పెనంత కోపం. ప్రేమకు హద్దులు లేవని చెప్పడమే ఈ సినిమా కథ. ► చిరంజీవిగారికి ఈ కథ చెప్పినప్పుడు ‘హిట్ ఫార్ములా. నువ్వు తీయడాన్ని బట్టి ఉంటుంది. వైషూ (వైష్ణవ్‌తేజ్) నువ్వు చేస్తావా? లేక నన్ను చేయమంటావా?’ అని వైష్ణవ్ తేజ్‌తో అన్నారు. అంటే.. ఆయన సినిమా చేస్తారని కాదు. అదొక కాంప్లిమెంట్. సినిమా కథ బాగుందని చెప్పడం చిరంజీవిగారి అభిప్రాయం. ► క్యాస్ట్ గురించిన అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. కానీ పరిధి మేరకు ఉన్నాయి. సెన్సార్ వారు ఒక్క కట్ కూడా చెప్పలేదు. దాదాపు 70మందికి పైగా ఈ సినిమా చూశారు. సినిమా బాగోలేదని ఎవరూ చెప్పలేదు. ‘ఇప్పుడు నా కొడుకు చిన్నవాడు. భవిష్యత్‌లో డైరెక్టర్ అవుతాడో లేదో తెలీదు. నా పెద్దకొడుకు (బుచ్చిని ఉద్దేశించి) సినిమా తీశాడనుకుంటాను’ అని సుకుమార్ అన్నారు. సుకుమార్‌గారితో నాది 20 ఏళ్ల పరిచయం. మా ఊళ్లో నన్ను సుకుమార్ అని పిలుస్తుంటారు. ఒక డైరెక్టర్‌గా కన్నా కూడా సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా నాకు పేరువస్తే హ్యాపీ ఫీల్ అవుతాను. ► ‘నాన్నకు ప్రేమతో...’ సినిమా షూటింగ్ స్పెయి¯Œ లో జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్‌కు కథ చెప్పాను. అది ‘ఉప్పెన’ కథ కాదు. మైత్రీమూవీ మేకర్స్ సంస్థలో మరో సినిమా చేయబోతున్నాను. -
అందుకే ‘ఉప్పెన’ ఈవెంట్‌కి రాలేదు: నాగబాబు
మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 12న విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వేడుకకు చిరంజీవి తప్ప మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ రాలేదు. దానికి గల కారణమేంటో తెలియజేస్తూ మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ చానల్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘వైష్ణవ్ ఇండస్ట్రీకి రాకముందు చదువుకుంటావా? లేక ఇండస్ట్రీకి వస్తావా? అని నేను చాలాసార్లు అడిగాను. కానీ.. ఏదీ కన్ఫర్మ్గా చెప్పకపోయేవాడు. ఓ సారి నేను సీరియస్‌గా సినిమాల్లోకి వస్తావా అని అడిగినా కూడా స్పష్టమైన సమాధానం చెప్పలేదు. అలాంటిది.. ఓ రోజు నా దగ్గరకు వచ్చి ‘ఉప్పెన’ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. మొత్తానికి.. వైష్ణవ్ సినిమాల్లోకే వచ్చాడు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. కళ్యాణ్ బాబు సూచనలతో థాయ్ బాక్సింగ్ నేర్చుకొని వచ్చాడు వైష్ణవ్ తేజ్. మంచి ఫిట్నెస్ ఉన్న కుర్రోడు. పైగా మంచితనం ఎక్కువ. మా నిహారికకు, వరుణ్ తేజ్‌కి వైష్ణవ్ అంటే చాలా ఇష్టం. మా అన్నయ్య, తమ్ముడు కళ్యాణ్ బాబు కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేశారు. కాబట్టి ఆ స్టాండర్డ్స్ రీచ్ కావాలంటే వరుణ్ గానీ, తేజ్ గానీ, వైష్ణవ్ గానీ చాలా కష్టపడాలి. ఇక ‘ఉప్పెన’ మూవీ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. మొన్ననే చరణ్ వరుణ్ నిహారిక ఈ సినిమా చూశారు. చాలా బాగుందని చెప్పారు. కథ చాలా రియలిస్టిక్‌గా ఉంది వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాలోనే చాలా బాగా నటించాడు.మొన్న జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మా ఫ్యామిలీ నుంచి ఎవ్వరమూ అటెండ్ కాలేదు. ఇంటిల్లిపాది వెళ్లడం కంటే.. వాడిని వాడిగా ప్రొజెక్ట్ చేయాలనే అలా చేశాము. కాకపోతే.. మా అందరికీ పెద్ద దిక్కు కాబట్టి మా అన్నయ్యను పిలిచారు. ఆ రకంగా వైష్ణవ్ ఆయన బ్లెస్సింగ్స్ దక్కాయి. ఉప్సెన మంచి హిట్ అవుతుదంనే నమ్మకం ఉంది. వైష్ణవ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయండి’అని నాగబాబు చెప్పుకొచ్చారు. -
నా పరువు నిలబెట్టావ్... గర్వంగా ఉందన్నారు
‘‘ఏ పనినైనా ప్రేమతో చేస్తూ వంద శాతం కష్టపడతాను. అది ప్యాషన్ కూడా అయ్యుండొచ్చు. దాన్ని కూడా ప్రేమ అనే అనుకుంటాను. అందరిలా నాకు ఫెయిల్యూర్ భయం ఉంటుంది’’ అని వైష్ణవ్ తేజ్ అన్నారు. చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించిన సినిమా ‘ఉప్పెన’. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో వైష్ణవ్ తేజ్ చెప్పిన విశేషాలు. ► నా లైఫ్ జర్నీ కాస్త అటూ ఇటూగా ఉంటుంది. మొదట్లో యాక్టింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. సైంటిస్ట్, ఆస్ట్రోనాట్, ఫార్ములా రేసర్, ఫొటోగ్రాఫర్, 3డీ యానిమేటర్, మూవీ డైరెక్టర్... ఇలా చాలా అనుకున్నాను. నా కెరీర్‌ను నేను డిసైడ్ చేసుకోవడానికి చాలా టైమ్ పట్టింది. ఓ నాలుగైదేళ్లు నాలో నేను మదనపడ్డాను. లైఫ్‌లో ఏం చేయాలో సరిగా అర్థం కావడం లేదని అమ్మతో చెబుతుండేవాడిని. అసలు ఇవన్నీ ఎందుకు? నలుగురికి ఉపయోగపడకుండా ఈ ప్రాణాలు వృథాగా పోవడం దేనికి అని ఆర్మీకి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాను. ఆర్మీ అప్లికేషన్, అర్హతలను గురించి ఇంటర్నెట్లో బ్రౌజింగ్ చేశాను. ► ఆర్మీకి వెళ్లడానికి సన్నబడ్డాను. సోషల్ మీడియాలో ఆ ఫొటోలను సరదాగా షేర్ చేశాను. సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. ‘నాకేమీ రాదు. నేర్పిస్తే చేస్తాను. వంద శాతం కష్టపడతాను’ అని చెప్పాను. ఆ సినిమాలు ఎందుకో వర్కౌట్ కాలేదు. ఆ సమయంలో బుచ్చిగారు ‘ఉప్పెన’ సినిమా కథతో వచ్చారు. కథ నచ్చింది. అయితే చేయగలనా? అనిపించింది. చిరంజీవి మావయ్యకు చెప్పాను. ‘చాలామంది అవకాశాల కోసం స్ట్రగుల్ అవుతుంటారు. నీకొచ్చిన అవకాశాన్ని గౌరవించి ప్రయత్నించు. ఒకవేళ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోతే అప్పుడు వేరే ఏదైనా ట్రై చెయ్’ అన్నారు. ఇలా ఎవరూ నాకు చెప్పలేదు. అది నాకు బాగా స్ట్రయిక్ అయ్యింది. మా మామయ్యల మాట నాకు అల్టిమేటమ్. నేను కూడా ఆలోచిస్తాను. కానీ వారి మాట వింటాను. ► నెల రోజులు యాక్టింగ్ క్లాసులకు వెళ్లాను. హీరో క్యారెక్టర్ యాస, పాత్ర కోసం దాదాపు 40 రోజులు కష్టపడ్డాను. ఈ సినిమా సెట్లో నేను చాలా నేర్చుకున్నాను. విజయ్ సేతుపతిగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. నటనలో నాకు కొన్ని మెళకువలు చెప్పారు. సినిమా షూటింగ్ పూర్తి చేసి వెళ్లే ముందు మా టీమ్‌లో కొంతమందికి వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చారు. ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. కృతీశెట్టి వారంలో తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేసి, తెలుగులో డైలాగ్స్ చెప్పింది. అది చూసి నేను కూడా ఇతర భాషలు నేర్చుకోవాలని అనుకున్నాను. ► దేవిశ్రీ ప్రసాద్‌గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా సినిమాకు ఇంత బజ్ రావడానికి ముఖ్య కారణం ఆయనే. ‘ఉప్పెన’ ఓటీటీలో విడుదలవుతుందేమోనని నేను కూడా అనుకున్నాను. డైరెక్టర్ బుచ్చిబాబు థియేటర్స్‌లోనే విడుదల చేయాలని పట్టుబట్టారు. అలాగే టీమ్ కూడా సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేద్దామని అనుకున్నారు. క్లైమాక్స్ గురించి సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు అర్థం అవుతుంది. ప్రేమకథా చిత్రాలు చాలా వచ్చాయి. కానీ ‘ఉప్పెన’ డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన పాయింట్ ఉంది. సినిమా అందరికీ నచ్చుతుంది. ► జానీ, శంకర్‌దాదా, అందరివాడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేశాను. చిన్నప్పుడు బాగా సిగ్గుగా ఉండేవాడిని. ఇప్పుడు నాలో మార్పు వచ్చింది. నాకు యాక్ష¯Œ సినిమాలంటే ఇష్టం. హిందీ చిత్రం ‘ఉరి: ది సర్జికల్‌స్ట్రైక్’ లాంటి సినిమాలంటే ఇష్టం. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా వస్తే చేస్తాను. ► ప్రతి సినిమాను నేను కొత్తగానే భావిస్తాను. ‘ఉప్పెన’ సినిమాలో నేను చేసిన పాత్ర వేరు. క్రిష్‌గారి డైరెక్షన్లో రూపొందిన సినిమాలో చేసిన క్యారెక్టర్ వేరు. కొన్ని కొత్త ఆఫర్స్ ఉన్నాయి. వాటి గురించి త్వరలో చెబుతాను. ► నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ‘ఉప్పెన’ సినిమాను మా కుటుంబసభ్యులు చూశారు. ‘నాకు చాలా గర్వంగా ఉంది రా.. నా పరువు నిలబెట్టావ్’ అని చిరంజీవిగారు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ► ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చాలా బాగా మాట్లాడానని చాలామంది అంటున్నారు. అలా మాట్లాడతానని నేను కూడా ఊహించలేదు. క్యాలిక్యులేటెడ్‌గా మాట్లాడటం నాకు రాదు. -
ఉప్పెన కథ విని షాకయ్యా: చిరంజీవి
‘‘ఉప్పెన’ చూసిన వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి అందరికీ ఈ సినిమా గురించి చెప్పాలనిపించింది. ఈ సినిమా అంత బాగా నచ్చింది. అతిశయోక్తి కాదు.. ఇది దృశ్యకావ్యం’’ అన్నారు చిరంజీవి. వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సన దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు నిర్మించాయి. ఈ నెల 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ – ‘‘సంవత్సరం పాటు చీకట్లో ఉంది ఇండస్ట్రీ. థియేటర్స్ మూసేయాల్సిన పరిస్థితి. మబ్బు కమ్ముకున్నట్లు అనిపించింది. మళ్లీ శుభారంభం వచ్చింది. థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. కానీ థియేటర్స్‌కి ప్రేక్షకులు వస్తారా? లేదా? అని మేం ఆలోచిస్తుంటే.. ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చారు. సినిమాయే ప్రథమ వినోదం అని నిరూపించారు. ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు. ‘ఉప్పెన’ గురించి చెప్పాలంటే... ఈ కథ విన్నప్పుడు షాకయ్యాను. కరెక్షన్స్ చేయడానికి, ఇన్‌ఫుట్స్ ఇవ్వడానికి ఏమీ లే దు. ఈ కథ అంత బాగా చేశారు. ఎన్నో ప్రేమకథలు చూశాం. కానీ ఇందులో ఉన్న ఎమోషన్స్ మనల్ని కట్టిపడేస్తాయి. మైత్రీ వాళ్లకు ఇది మరో ‘రంగస్థలం’ అవుతుంది. బుచ్చిబాబు దర్శకత్వ ప్రతిభను మెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. ఈ సినిమా తమిళ దర్శకుడు భారతీరాజాను గుర్తు చేసింది. మన మట్టికథలు, నేటివ్ కథలు రావాలి. ‘ఉప్పెన’ మన నేటివ్ కథ. విజయ్ సేతుపతి విలక్షణ నటుడు. హీరోగానే కాదు... పాత్ర బావుంటే ఏ పాత్రైనా చేస్తాడు. మొదటి సినిమాలోనే కృతి బాగా చేసింది. కచ్చితంగా సూపర్‌స్టార్ అవుతుంది. వైష్ణవ్ మా అందరికీ గర్వకారణం. అంత బాగా చేశాడు. బుచ్చిబాబు తనలోని నటనను రాబట్టుకోవడమే కాకుండా, పరిశ్రమకు మంచి నటుడిని అందించారు. వైష్ణవ్ కళ్లల్లో కళ ఉంటుంది. ‘శంకర్ దాదా’లో చిన్న వేషం వేశాడు. అప్పుడే అనిపించింది.. వీడు మంచి యాక్టర్ అవుతాడని. మొదటి సినిమాకే ఇలాంటి సంస్థలో యాక్ట్ చేయడం వైష్ణవ్ అదృష్టం. ఈ సినిమాను పెద్ద రేంజ్‌కి తీసుకెళ్లింది దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. తన పాటలతో సినిమాపై ప్రత్యేక ఆసక్తిని తీసుకొచ్చాడు దేవి. మైత్రీ మూవీస్ అందరికీ నచ్చిన నిర్మాణ సంస్థ. త్వరలోనే వాళ్ల బ్యానర్లో, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. లవ్ యు బుచ్చీ సుకుమార్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. ఈ సినిమా కథను ఆరు గంటలు కూర్చొని చర్చించారు. ఆయన్ను మహావృక్షం అంటారు... అది ఎందుకో అర్థం అవుతోంది. మెగాఫ్యామిలీలో ఆయన జడ్జ్మెంట్ వల్లే చాలామంది హీరోలు రావడం జరిగిందని ‘ఉప్పెన’ సినిమా కథను డిస్కస్ చేసిన తర్వాత అర్థం అయ్యింది. ఆయన చెప్పిన కొన్ని కరెక్షన్స్‌తో ఇంత మంచి సినిమా వచ్చింది. వైష్ణవ్తేజ్ది మంచి ఎక్స్‌ప్రెసివ్ ఫేస్. వైష్ణవ్ మాట్లాడిన తీరు చూస్తుంటే భవిష్యత్‌లో మంచి పొలిటిషియన్ కూడా అవుతాడేమో. నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసి, డైరెక్టర్స్ అయిన అందరికీ ఒకటి చెబుతుండేవాడిని. ఎవర్నీ కూడా నేను నా శిష్యులుగా చెప్పుకోలేను అని. ఎవరు వచ్చినా నాకు ఏదో ఒకటి నేర్పి వెళ్లిపోతున్నారు. బుచ్చిబాబుని మాత్రం శిష్యుడని చెప్పుకుంటాను. ఎందుకంటే లెక్కలు చెప్పాను కాబట్టి. అదే నిజం అయ్యింది. తన తోటివారు ఉద్యోగులై బాగా సంపాదించుకుంటున్నారు. వీడు ఏమైపోతాడో అని వాళ్ల అమ్మగారు కంగారు పడుతుండేవారు. నేను ఆవిడను ఓదార్చేవాడిని. నాకు బుచ్చి ‘ఉప్పెన’ కథ చెప్పగానే నా రూమ్ అంతా గంభీరం అయిపోయింది. అంత అద్భుతంగా చెప్పాడు. అప్పుడే రవిగారికి ఫోన్ చేసి, ఇది చిన్న సినిమా కాదు. వందకోట్ల సినిమా అని చెప్పాను. నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడని కాదు. వాడికి లెక్కలు చెప్పినందుకు గర్వపడుతున్నాను. లవ్ యూ బుచ్చి. బుచ్చిబాబు ఏం కావాలంటే అది జరిగింది సినిమాలో. దేవి ఇచ్చిన ఒక్కో సాంగ్ ఒక్కో ఆణిముత్యం. ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట ‘ఫేస్ ఆఫ్ ది మూవీ’. నిర్మాతలు బడ్జెట్‌కు వెనకాడలేదు. అందుకే ఇది ఇంతమంచి సినిమా అయ్యింది’’ అన్నారు. మా మావయ్యలకు రుణపడి ఉంటాం వైష్ణవ్‌తేజ్ మాట్లాడుతూ– ‘‘మా అమ్మగారి గురించి మాట్లాడాలి. ఐ లవ్ యూ మా. నువ్వు చేసిన అన్ని త్యాగాలకు థ్యాంక్స్. నువ్వు లేకపోతే మేం (సాయిధరమ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్) లేం. అలాగే మా ముగ్గురు మావయ్యలు మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, నాగేంద్ర మావయ్యలు లేకపోతే నేను, మా అన్నయ్య (సాయిధరమ్‌తేజ్) లేం. మాకు ఏం కావాలన్నా చేసి పెడుతూ ఉండేవారు. నేను, మా అన్న మా ముగ్గురు మావయ్యలకు రుణపడి ఉంటాం. ఈ సినిమాకు కథే హీరో. నేను ఓ క్యారెక్టర్ చేసానంతే. మంచి కథను నా దగ్గరకు తెచ్చినందుకు బుచ్చిసార్కు థ్యాంక్స్. ఖర్చుకు వెనకాడకుండా నిర్మించిన నిర్మాతలకు, హీరోయిన్ కృతీశెట్టితో పాటు టీమ్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఈ సినిమాకు సోల్ దేవిశ్రీ ప్రసాద్‌గారు. ఆయన పాటల వల్లే మాకు ఇంతమంచి గుర్తింపు. చంద్రబోస్, లిరిసిస్ట్ శ్రీమణిగార్లకు థ్యాంక్స్. సినిమాలో ఉప్పెనంత ప్రేమ, ఉప్పెనంత ఎమోషన్స్ ఉన్నాయి. అందరూ ఇంటికి తీసుకుని వెళ్తారని అనుకుంటున్నాను. ఈ సినిమా నాకు చాలా నేర్పించింది’’ అన్నారు. బుచ్చిబాబు మాట్లాడుతూ – ‘‘సుక్కూ సార్... థ్యాంక్యూ. మీ వల్లే నేను దర్శకుడినయ్యాను. ఎలా రాశానో అలానే తీసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. చిరంజీవిగారు ‘ఉప్పెన’ కథ విని మంచి సలహాలు ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్‌గారికి, మా టీమ్ అందరికీ ధన్యవాదాలు. పవన్ కల్యాణ్‌లా పెద్ద స్టార్ అవుతాడు వైష్ణవ్’’ అన్నారు. ‘‘మొదటి సినిమాకే ఇలాంటి అవకాశం రావడం చాలా అదృష్టంగా అనిపిస్తుంది. వైష్ణవ్ బెస్ట్ కో స్టార్’’ అన్నారు కృతీ శెట్టి. విజయ్ సేతుపతి, కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్, చంద్రబోస్, బాబీ, వెంకీ కుడుముల, శివ నిర్వాణ తదితరులు మాట్లాడారు. గోపీచంద్ మలినేని, హరీశ్ శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (చదవండి: ఉప్పెన ట్రైలర్ వచ్చేసింది..) (చదవండి: ‘ఉప్పెన’ మరో సాంగ్.. ఆకట్టుకుంటున్న మెలోడీ) -
'ఉప్పెన' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
-
పవన్ కల్యాణ్ నా గుండెల్లో ఉంటాడు: హీరో
సాక్షి, హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో వెండితెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. మెగా మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తొలిసారి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఉప్పెన. కృతీ శెట్టి కథానాయిక. ఫిబ్రవరి 12న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చిత్రయూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా తనకెంతో నేర్పించిందని చెప్పుకొచ్చాడు. షూటింగ్ సమయంలో లైట్ పెట్టేటప్పుడు ఒకతని కాలు విరిగిపోయినా సరే అలాగే రెండు రోజులు పని చేశాడని చెప్తూ లైట్మన్లకు, కాస్ట్యూమ్ డిజైనర్లకు, సౌండ్ డిపార్ట్మెంట్కు, ఇలా ప్రతి ఒక్క విభాగానికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపాడు. 'ఉప్పెన' సినిమాలో కథే హీరో అని చెప్పాడు. తను కేవలం ఓ ప్రధాన పాత్ర పోషించానని పేర్కొన్నాడు. కృతీ శెట్టి వారంలోనే తెలుగు నేర్చుకుందని ప్రశంసించాడు. తన మీద నమ్మకముంచిన సుకుమార్‌కు ధన్యవాదాలు తెలిపాడు. సినిమాకు అసలు ప్రాణం దేవి శ్రీప్రసాద్.. ఆయన పాటల వల్లే మా అందరికీ గుర్తింపు వచ్చిందన్నాడు. ఇంతలో అక్కడి అభిమానులు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అని అరుస్తుండటంతో "పపర్ స్టార్ ఎప్పటికీ నా గుండెల్లో ఉంటాడు" అని పేర్కొన్నాడు. దీంతో అభిమానుల కేరింతలు, ఈలలతో సభాప్రాంగణం హోరెత్తిపోయింది. కాగా ఇంత మంది జనాల ముందుకు రావడం వైష్ణవ్‌కు ఇదే తొలిసారి కావడంతో కొంత బెరుకుగా కనిపించాడు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సెలబ్రిటీలు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. (చదవండి: ఉప్పెన పెద్ద విజయం సాధించాలి: జూ. ఎన్టీఆర్) (చదవండి: దర్శకుడు సుక్కు నా అన్నయ్య: డీఎస్పీ) -
2021ని ఇరగదీయాలని డిసైడ్ అయ్యాను..
‘‘2021ని ఇరగదీయాలని డిసైడ్ అయి, ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాను. ఈ సంవత్సరం మ్యూజికల్‌గా నాకు అద్భుతంగా ఉంటుంది. డీయస్పీ (దేవిశ్రీ ప్రసాద్) లో కొత్త వెర్షన్‌ని చూస్తారు’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఆయన సంగీతం అందించిన చిత్రం ‘ఉప్పెన’. చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రమిది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఫిబ్రవరి 12న ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుంది. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన విశేషాలు. ► ‘ఉప్పెన’ పాటలు అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో టాప్‌లో ఉండడం ఎలా అనిపిస్తోంది? అందరూ ఈ పాటలు ఎంజాయ్ చేస్తున్నారు. ‘మీ మ్యూజిక్ వల్లే సినిమాకు ఈ రేంజ్ వచ్చింది’ అని టీమ్ అందరూ చెప్పడం అన్నింటికంటే సంతోషమైన విషయం. ఈ క్రెడిట్ టీమ్‌కే దక్కుతుంది. బుచ్చిబాబు మంచి కథ చేశాడు. దానికి తగ్గట్టు మ్యూజిక్ ఇచ్చాను నేను. ► మీరు ప్రేమకథలకు సంగీతం ఇచ్చి చాలా రోజులైనట్టుంది? అవును. కెరీర్ ప్రారంభంలో వరుసగా లవ్‌స్టోరీ సినిమాలు చేశాను. ఇప్పుడు ప్రేమకథా సినిమాలే తగ్గిపోయాయి. పెద్ద కమర్షియల్ సినిమాలు, కొత్త కాన్సెప్ట్ సినిమాలు, లార్జర్ దెన్ లైఫ్ సినిమాలే వస్తున్నాయి. ప్రేమకథలు రావాలి. ‘ఉప్పెన’ మంచి ప్రేమకథ. వరుసగా కమర్షియల్ సినిమాలు, టాప్ స్టార్స్ సినిమాలు చేస్తున్న నాకు ‘ఉప్పెన’ మంచి రిలీఫ్‌లా అనిపించింది. ఈ కథ, కథనం ఫ్రెష్‌గా అనిపించాయి. ఈ సినిమా తర్వాత నేను చేసిన నితిన్ ‘రంగ్ దే’ కూడా పూర్తిస్థాయి ప్రేమకథే. ► సినిమాలో దర్శకుడు సుకుమార్ అసోసియేట్ అయితే మీ మ్యూజిక్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిపోతుంది. ఏంటా సీక్రెట్? సుకుమార్ ఆలోచనా విధానమే కొత్తగా ఉంటుంది. ఆయన కథలు కూడా అంతే డిఫరెంట్‌గా ఉంటాయి. అలాంటి కొత్త సబ్జెక్ట్ మీద ఎవరు పని చేసినా డిఫరెంట్ మ్యూజిక్కే వస్తుంది. అది మొదటి విషయం. రెండోది మా ఇద్దరి మధ్య ఉన్న బంధం, ఒకరినొకరం అర్థం చేసుకున్న విధానం. సుక్కు నా అన్నయ్య. ‘పుష్ప’ పని మీద వచ్చినప్పుడు బుచ్చిబాబును తీసుకొచ్చి ‘ఉప్పెన’ కథ వినిపించాడు సుక్కు. ► లాక్డౌన్లో ఏం చేశారు? లాక్డౌన్లో ఈ ప్రపంచం మొత్తంలో ఎవరైనా బిజీగా ఉన్నారంటే అది నేనే అనుకుంటాను. ‘ఒకేసారి నాలుగైదు సినిమాలు చేసినప్పుడు కూడా కనిపించేవాడివి, ఇప్పుడు కనిపించడం కూడా లేదు కదరా’ అనేవారు మా అమ్మ. ఇంతకు ముందు చేయడానికి కుదరనవన్నీ లాక్డౌన్లో చేశాను. యూట్యూబ్‌లో చూస్తూ యావిడ్ (ఎడిటింగ్ సాఫ్ట్వేర్) చాలా త్వరగా నేర్చుకున్నాను. ప్రస్తుతం ఏం నేర్చుకోవాలన్నా ఇంటర్నెట్లో దొరుకుతుంది. సరిగ్గా వాడుకోవాలే కానీ చాలా చాలా నేర్చుకోవచ్చు. నేర్చుకుంటావా? నాశనమైపోతావా నీ ఇష్టం. నాకు ఫొటోగ్రఫీ చాలా ఇష్టం. కెమెరాలు చాలా కొనిపెట్టుకున్నాను. అవన్నీ బయటకు తీశాను. డ్రోన్ కెమెరా నేర్చుకున్నాను. పాటలు రాస్తూ, పాటల ఐడియాలు రెడీ చేసి పెట్టుకున్నాను. నాకు మ్యూజిక్ ఇచ్చే కిక్ ఇంకేదీ ఇవ్వదు. వీడియో కాల్స్‌లో సినిమా పాటల రికార్డింగ్ చేశాను. భవిష్యత్తుకి సంబంధించి ఇంకా ప్లాన్స్ ఉన్నాయి. అవన్నీ మెల్లిగా చెబుతాను. ► పెళ్లి విషయం కూడా చెబుతారా? ఆ ఒక్కటీ అడక్కండి (నవ్వుతూ). ► లాక్డౌన్ చాలా నేర్పింది అని చాలా మంది అన్నారు. మీరు నేర్చుకున్న విషయాలు? లాక్డౌన్లో నేను ముఖ్యంగా తెలుసుకున్న విషయాలు రెండు. ఒకటి.. టైమ్ చాలా విలువైనది. చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. రెండోది.. మనల్ని ప్రేమించేవాళ్లకు వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఈ రెండూ జీవితంలో చాలా ముఖ్యమైనవి. వీటిని కోల్పోతే తిరిగి తెచ్చుకోలేం. ఆరోగ్యం జాగ్ర త్తగా చూసుకోవాలి. ► మీరు ట్యూన్స్ చాలా ఫాస్ట్‌గా ఇచ్చేస్తారట.. దర్శకుడు ట్యూన్ చెబుతున్నప్పుడు ఆ క్షణంలో ఏది అనిపిస్తే అది వాయిస్తుంటాను. చాలాసార్లు ట్యూన్స్ అలానే ఒకే అవుతాయి. ట్యూన్స్ అవలీలగా ఇచ్చినా దాని వెనక ఎంతో శ్రమ ఉంటుంది. చాలా సంవత్సరాల కృషి ఉంటుంది. చిన్నతనం నుంచి నేర్చుకున్న సంగీతం, పడ్డ తపన ఆ సందర్భంలో ఉపయోగపడతాయి. అవుట్‌పుట్ త్వరగా వచ్చినంత మాత్రాన ఈజీ అని కాదు. బిడ్డను కనడం అరగంట పనే కదా అనేయగలమా? పది నెలల శ్రమను తీసివేయలేం కదా. ఇది కూడా అలానే. -
ఉప్పెన పెద్ద విజయం సాధించాలి
‘‘ఉప్పెన’ ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా అంతే బాగుంటుందని ఆశిస్తున్నాను. ఈ చిత్రం తప్పకుండా పెద్ద విజయం సాధించాలి’’ అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. పంజా వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ని జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. బుచ్చిబాబు సానా మాట్లాడుతూ –‘‘ఈ కథను నేను మొదటగా చెప్పింది ఎన్టీఆర్గారికే. ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫోన్ చేసి ఎలా వస్తోంది? అని అడిగేవారు. కథ విని ఆయన ఇచ్చిన ఎనర్జీతో ఈ కథని చిరంజీవి, విజయ్ సేతుపతి, దేవిశ్రీ ప్రసాద్‌గార్లకు కూడా చెప్పాను. అందమైన, ఉద్వేగభరితమైన ప్రేమకథగా తెరకెక్కిన చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు ఆకర్షణ’’ అన్నారు. ఈ చిత్రానికి సీఈవో: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై, అశోక్ బి. -
ఉప్పెన ట్రైలర్: ‘మరీ ఇంత అందగత్తె పుట్టిందంటే..’
సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదల కానుంది. ఉప్పెనలో మంగళూరు బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుండగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌సేతుపతి నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రమోషన్స్‌లో రామ్ చరణ్, మహేశ్ బాబు భాగస్వామ్యం అవ్వగా తాజాగా మరో స్టార్ హీరో ప్రమోషన్స్‌లో ఎంటర్ అయ్యాడు. ఉప్పెన ట్రైలర్‌ను గురువారం సాయంత్రం ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్విటర్లో ఉప్పెన ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. చదవండి: ‘ఉప్పెన’ మరో సాంగ్.. ఆకట్టుకుంటున్న మెలోడీ ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ‘ప్రేమంటే ఓ లైలా-మజ్నులా, దేవదాసు-పార్వతిలా, రొమియో-జూలియట్‌లా అదో మాదిరిలా ఉండాలిరా’ అంటూ హీరో చెప్పే డైలాగ్‌తో మొదలవ్వగా.. ప్రేమ, ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో పడే కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. అలాగే ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి చెప్పే డైలాగులు, పవర్ఫుల్ విలనిజం ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో మరోసారి మ్యాజిక్ చేశాడని చెప్పవచ్చు. మొత్తంగా ప్రేమ, పరువు, కోపం, బాధ ఇలా అన్ని ఎమోషన్లను టచ్ చేసి చూపించారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్-సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ సాధించి రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి స్పందన రావడంతో రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: రిహన్నా ట్వీట్.. గూగుల్‌లో ఏం సెర్చ్ చేశారంటే? -
జూ.ఎన్టీఆర్ వాయిస్‌తో ఉప్పెన ట్రైలర్!
మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తొలిసారి హీరోగా నటిస్తున్న చిత్రం "ఉప్పెన". కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్రైలర్‌కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారట. మొత్తానికి వైష్ణవ్ సినిమా రిలీజ్ అవకముందే అందరి నుంచి సపోర్ట్ అందుతోంది. (చదవండి: ‘వీడు ముసలోడు అవ్వకూడదే’) ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాలర్‌ట్యూన్లు, రింగ్టోన్లు ఎక్కడా చూసినా ఈ పాటలే మార్మోగిపోయాయి. మరీ ముఖ్యంగా 'నీ కన్ను నీలి సముద్రం..' పాట సంగీత సముద్రంలో అందరితో పడవ ప్రయాణం చేయించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ చిత్రం వాలంటైన్స్ డేకు రెండు రోజుల ముందుగా అంటే ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. సముద్రతీర ప్రాంతంలోని గ్రామంలో ఓ పేదింటి అబ్బాయికీ, ఓ సంపన్న కుటుంబానికి చెందిన కాలేజీ అమ్మాయికీ మధ్య ఏర్పడే ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే పాయింట్‌తో ఈ చిత్రం ఉంటుంది. మరి పాటలను ఆదరించిన ప్రేక్షకులు సినిమాను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. (చదవండి: మహేశ్‌తో స్పెషల్ సాంగ్: మోనాల్ క్లారిటీ!) -
‘ఉప్పెన’ మరో సాంగ్.. ఆకట్టుకుంటున్న మెలోడీ
మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రేక్షకుల మందుకు రానుంది. రాక్‌స్టార్ దేవిశ్రీపసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల కాగా, తాజాగా నాలుగో పాటను రిలీజ్ అయింది. జల జల జలపాతం అంటూ సాగే పాటను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. శ్రీమణి సాహిత్యం అందించగా జస్ప్రీత్ జస్, శ్రేయా ఘోషల్ ఆలపించారు.కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’, ‘ధక్ ధక్ ధక్’, ‘రంగులద్దుకున్న’ పాటలకు విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానే ఆకట్టుకుంది. | -
ఉప్పెన రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్లలో సందడి!
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఉప్పెన. కీర్తీ శెట్టి ఫీమెల్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఉప్పెనకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక ఇటీవల విడుదల అయిన ఉప్పెన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాగే ఇప్పటికే విడుదలైన మూడు పాటలు కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకున్నాయి. ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఎంత ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తర్వాత విడుదలైన ‘దక్ దక్ దక్’ పాట కూడా అంతే హిట్ అయ్యింది. చదవండి: ‘ఉప్పెన’టీజర్‌పై రామ్‌చరణ్ ఆసక్తికర ట్వీట్ తాజాగా ఈ సినిమా యూనిట్ అభిమానులకు శుభవార్తనందించింది. ఉప్పెనను ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విటర్లో వెల్లడించింది. దీంతో సినిమా అభిమానులు ఆనందంతో మునిగి తేలుతున్నారు. కాగా షిబ్రవరి 19న నితిన్ నటించిన చెక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం కంటే ముందే ఉప్పెన థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఉప్పెనలోని పాటలు, టీజర్‌ను బట్టి చూస్తే సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. హీరోగా వైష్ణవ్ తేజ్‌కు ఇది మొదటి సినిమా కావడంతో అతనికి ఎంత వరకు విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 12 వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ఆర్ఆర్ఆర్: రాజమౌళి కాపీ కొట్టారట! Sailing soon to the Theatres near you #Uppena Releasing on Feb 12th ❤️#UppenaOnFeb12th 🌊#PanjaVaisshnavTej @IamKrithiShetty @BuchiBabuSana @aryasukku @ThisIsDSP @NavinNooli @MythriOfficial @SukumarWritings @adityamusic pic.twitter.com/7MK16dn1Xq — BARaju (@baraju_SuperHit) January 26, 2021 -
‘ఉప్పెన’టీజర్‌పై రామ్‌చరణ్ ఆసక్తికర ట్వీట్
మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఉప్పెన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎంతో ఆసక్తికరంగా మలిచిన ఈ టీజర్ ప్రేక్షకలోకాన్ని బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా ఉప్పెన టీజర్ చూసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘టీజర్ చాలా బాగుంది. మై బ్రదర్ పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జంట చాలా ఫ్రెష్‌గా అనిపిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబుకు, నిర్మాణ సంస్థ మైత్రికి, ఇతర టెక్నీషియన్స్‌కు శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్’ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. This teaser is so beautiful !! My brother #PanjaVaisshnavTej and @IamKrithiShetty make a really fresh pair👍 Wishing the best to @BuchiBabuSana, @MythriOfficial & the entire team of #Uppena. All the best! https://t.co/OH235Lnust — Ram Charan (@AlwaysRamCharan) January 15, 2021 ఇక ఈ మూవీలో తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. శనివారం (జనవరి 16) ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర బృందం ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో విజయ్ సేతుపతి పెద్దమనిషి తరహాలో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఖద్దర్ చొక్కా, పంచె ధరించిన విజయ్ సేతుపతి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపిస్తున్నారు. ఆయన మరో చేతిలో నల్ల కళ్లద్దాలు ఉన్నాయి. Wishing our 'Rayanam' aka @VijaySethuOffl Garu a very Happy Birthday - Team #Uppena 🌊 Just wait to see him in our Trailer, It'll be 🔥🔥#HBDVijaySethupathi#PanjaVaisshnavTej @IamKrithiShetty @BuchiBabuSana @aryasukku @ThisIsDSP @SukumarWritings @adityamusic pic.twitter.com/ZnLa1rCMAR — Mythri Movie Makers (@MythriOfficial) January 16, 2021 -
హ్యాపీ బర్త్‌డే బంగారు.. ఐ లవ్ యూ..
పెళ్లి చేసుకుని అత్తారింటిలో అడుగుపెట్టిన మెగా డాటర్ నిహారిక కొణిదెలకు సంబంధించిన ప్రతి విషయం ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె మేనబావ, సాయి ధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ బర్త్ డే సందర్భంగా నిహారిక చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బుధవారం (జనవరి 13) వైష్ణవ్ పుట్టిన రోజు సందర్భంగా నీహ... ‘హ్యాపీ బర్త్‌డే బంగారు!! నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు.. నువ్వు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణించాలని ఆశిస్తున్న. ఆల్ ద వెరీ బెస్ట్ వైష్గా’ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. కాగా, వైష్ణవ్ పుట్టిన రోజు సందర్భంగా అతడు హీరోగా వస్తున్న ‘ఉప్పెన’ మూవీ టీజర్ ఇవాళ విడుదలైంది. (చదవండి: అనసూయ ట్వీట్.. మెగా ఫ్యామిలీలో కలకలం!) కాగా వైష్ణవ్ నీహరికకు మేనబావ అనే విషయం తెలిసిందే. మెగా కుటుంబంలో బావలు, మరదళ్లు అనే తేడా లేకుండా అందరూ అన్నాచెల్లెల్లుగా మెలుగుతుంటారు. ప్రతి వేడుకకు అందరూ ఒకచోట చేరి సందడి చేస్తుంటారు. కాగా గతేడాది జొన్నలగడ్డ చెతన్యతో నిహారిక వివాహం రాజస్తాన్ జోధ్‌పూర్ ప్యాలేస్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తన భర్త చైతన్యతో కలిసి సందడి చేస్తున్న ఫొటోలతో పాటు జిమ్‌కు, షికార్లకు వెళ్లిన ఫొటోలను ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యాక్టివ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త జంట వివాహం ఇటీవల హానీమూన్‌కు మాల్దీవులకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను : నిహారిక) Happiest birthday bangaaru!! You know how much I love you, and I can’t wait to see you rock in this film industry! All the very very best! Vaishaaggaaa!! @vaishnavtej 😘😘🤗🐒 pic.twitter.com/L3fhBmn50G — Niharika Konidela (@IamNiharikaK) January 13, 2021 -
‘వీడు ముసలోడు అవ్వకూడదే’
మెగా వారసుడు వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతీ శెట్టి హీరోహీరోయిన్లు దర్శకుడు బచ్చిబాబు సనా రూపొందించిన చిత్రం ‘ఉప్పెన’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇవాళ వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఉప్పెన టీజర్ విడుదల చేసింది. నిమిషం నిడివి గల ఈ టీజర్లోనే సినిమా ఎలా ఉండబోతుందనేది దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. సాధారణంగా ప్రతి సినిమా కథ లాగే పేదింటి అబ్బాయి.. పెద్దింటి అమ్మాయి మధ్య సాగే ప్రేమకథ ఇది. (చదవండి: ‘ఉప్పెన’ మరో సాంగ్.. మెస్మరైస్ చేసిన దేవిశ్రీ) ఇక టీజర్ విషయానికోస్తే.. దేవుడే వరాలు ఇస్తాడని నాకు అర్థమైంది. ఎవరికి పుట్టామో తెలుస్తుంది కానీ, ఎవరికోసం పుట్టామో నాకు చిన్నప్పుడే తెలిసిపోయింది.. అని హీరో చెప్పే డైలాగ్‌తో ప్రారంభం అవుతుంది. ‘వీడు ముసలోడు అవ్వకూడదే’ అని చెప్పే హీరోయిన్ ఆకట్టుకుంటుంది. ఇందులో వైష్ణవ్ మీసాలు తిప్పుతూ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. వాస్తవానికి ఉప్పెన గతేడాది వేసవిలో విడుదల కావాల్సింది. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడింది. ఆ తర్వాత దర్శకుడు ఓటీటీ ప్లాట్‌ఫాంపై విడుదల చేయాలని చూస్తున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించినా.. థియేటర్లు తెరుచుకొవడంతో సినిమాను బిగ్‌స్క్రీన్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీస్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. (చదవండి: ‘నీ కన్ను నీలి సముద్రం’.. మరో రికార్డు) -
‘ఉప్పెన’ మరో సాంగ్.. మెస్మరైస్ చేసిన దేవిశ్రీ
మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. రాక్‌స్టార్ దేవిశ్రీపసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా, తాజాగా మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్‌బాబు విడుదల చేశాడు. ‘ఉప్పెన సినిమా నుంచి అందమైన మెలోడి ‘రంగులద్దుకున్న’ను విడుదల చేస్తున్నాను. నా ఫేవరేట్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌కి, సుకుమార్ గారికి, వెండితెరకు పరిచయమవుతోన్న పంజా వైష్ణవ్ తేజ్‌కి, కృతి శెట్టికి, బుచ్చిబాబు సానాకు, మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని మహేశ్‌బాబు ట్వీట్ చేశారు. ఇక పాట విషయానికొస్తే.. ఇదొక మెలోడీ సాంగ్. ‘రంగులద్దుకున్నా తెల్లరంగులవుదాం. పూలు కప్పుకున్నా కొమ్మలల్లె ఉందాం..’ అంటూ ప్రకృతి అందాల మధ్య సాగుతున్న ఈ పాట సినిమాపై అంచనాలు మరింత పెంచేలా ఉంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందిచగా,యాజిన్ నిజర్, హరిప్రియ ఆలపించారు. ఈ పాటను దివంగత గానగంధర్వుడు ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు అంకితమిచ్చారు. కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’, ‘ధక్ ధక్ ధక్’ పాటలకు విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానే ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో ఈ పాట ఏకంగా140 మిలియన్ వ్యూస్ దాటింది. ఇప్పుడు ఈ మూడో పాట ఎన్ని వ్యూస్ తెచ్చిపెడుతుందో చూడాలి. -
మెగా హీరో సినిమాకు మహేష్ సాయం..
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఉప్పెన. ఈ సినిమాతో వైష్ణవ్ హీరోగా పరిచయం కానున్నారు. కీర్తీ శెట్టి ఫీమెల్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే థియేటర్లలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం కానున్నారు. సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఉప్పెనకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. చదవండి: గాజులు ఘల్లుమన్నవే కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలవ్వగా ఇవి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకున్నాయి. ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఎంత ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తర్వాత విడుదలైన ‘దక్ దక్ దక్’ పాట కూడా అంతే హిట్ అయ్యింది. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేయనున్నారు. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా. ఉప్పెన సినిమాలోని ‘రంగులద్దుకున్న’ అనే పాటను మహేష్ బాబు నవంబర్ 11న సాయంత్రం 4.05 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. మరి ఈ పాట ఏ స్థాయిలో ఉండనుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. చదవండి: మెగా హీరో సినిమా.. కీలక పాత్రలో రానా? Get ready to dive into the ocean of Love ❤️#Ranguladdhukunna will be on your favorite songs playlist from 11th Nov @ 4:05 PM Thank you Superstar @urstrulyMahesh garu 🎶#Uppena 🌊#PanjaVaisshnavTej @IamKrithiShetty#BuchiBabuSana @ThisIsDSP @aryasukku @adityamusic pic.twitter.com/QtoeXmNQvM — Mythri Movie Makers (@MythriOfficial) November 4, 2020 -
మెగా హీరో సినిమా.. కీలక పాత్రలో రానా?
సాక్షి, హైదరాబాద్: ‘భల్లాలదేవ’ రానా దగ్గుబాటి ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘అరణ్య’ ఈ సంక్రాంతికి విడుదలకానుంది. మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలో రానా కనిపించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో రాబోతున్న మెగా థ్రిల్లర్ సినిమాలో అతిథి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా దర్శకుడు క్రిష్ ‘పంజా’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో వైష్ణవ్‌కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. (చదవండి: రానా సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చేశాడుగా !) ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం క్రిష్ రానాను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్‌తో తనకున్న అనుబంధం నేపథ్యంలో రానా వెంటనే ఒకే చెప్పినట్లు సమాచారం. ఇక అంతా ఒకే అయితే భల్లాలదేవ.. మెగా హీరో వైష్ణవ్ సినిమాలో పవర్ ఫుల్ గెస్ట్ పాత్రతో ప్రేక్షకులను అలరించనున్నాడు. అడవి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రకుల్ గిరిజన యువతిగా నటిస్తోంది. ప్రస్తుతం ‘పంజా’ హైదరాబాద్‌లోని వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుగుతోంది. రానా ‘విరాటపర్వం’, ‘1945’ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. యాక్షన్ ఎంటటైనర్తో రూపొందిన ‘అరణ్య’ 2021 సంక్రాంతికి విడుదల కానుండగా.. ‘1945’ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు రానా. (చదవండి: ఏం జరిగినా పని ఎప్పటికీ ఆగదు: రకుల్) -
ఏం జరిగినా పని ఎప్పటికీ ఆగదు: రకుల్
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ స్టార్ రకుల్ ప్రీత్ సింగ్ నెల రోజుల విరామం అనంతరం తిరిగి షూటింగ్లో పాల్గొన్నారు. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో ఆమె సోమవారం పాల్గొన్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ వివారాబాద్ అడవుల్లో జరుపుతున్నారు. ప్రస్తుతం కొన్ని రెయిన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా సుశాంత్ ఆత్మహత్యతో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో నార్కోటిక్ అధికారులు సెప్టెంబర్ 25న రకుల్‌ను విచారించిన విషయం తెలిసిందే. సుశాంత్ కేసులో రియాను అరెస్టు చేసిన ఎన్సీబీ ఆమె స్టేట్మెంట్ల ఆధారంగా రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్లను కూడా విచారించింది. రకుల్‌ను అధికారులు ప్రశ్నించిన అనంతరం ఆమె మళ్లీ ఇప్పటి వరకు షూటింగ్ పాల్గొనలేదు. చదవండి: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ భామలకు క్లీన్ చిట్? తాజాగా మళ్లీ షూటింగ్ ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. వర్షం పడుతున్న సమయంలో సెట్లో క్రిష్, వైష్ణవ్ తేజ్ గొడుగు పట్టుకొని ఉన్న రెండు వీడియోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నారు.‘ వర్షంలో షూటింగ్ అంటే కెమెరాలను, మనల్ని మనం రక్షించుకోవాలి. కేవలం కోవిడ్ మాత్రమే కాదు హైదరాబాద్ వర్షాలను ఎదర్కొని రెయిన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నాం. ఏం జరిగినా పని(షూటింగ్) మాత్రం ఆపలేం.’ అని పేర్కొన్నారు. అలాగే రకుల్ నితిన్ హీరోగా నటిస్తున్న చెక్ సినిమాలోనూ రకుల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమెతోపాటు ప్రియా ప్రకాశ్ వారియర్ హిరోయిన్‌గా కనిపించనున్నారు. చదవండి: చివరి షెడ్యూల్లో చెక్