Vaishnav Tej Ranga Ranga Vaibhavanga Movie Song Promo Release: మెగా మేనల్లుడు, యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ మొదటి చిత్రం 'ఉప్పెన'తోనే పెద్ద హిట్ అందుకున్నాడు. తర్వాత కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి 'కొండపొలం' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాల్లో వైష్ణవ్ తేజ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'రంగ రంగ వైభవంగా'. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో 'రొమాంటిక్' బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది.
మెడికల్ స్టూడెంట్స్ మధ్య వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే ఇటీవల టాకీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీలోని 'కొత్తగా లేదేంటి ?' అనే లిరికల్ సాంగ్ ప్రొమోను రిలీజ్ చేశారు. పూర్తి పాటను మే 6న విడుదల చేయనున్నారు మేకర్స్. శ్రీమణి రాసిన ఈ సాంగ్‌ను ఆర్మన్ మాలిక్, హరిప్రియ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకుల్ని మరింత ఆకట్టుకుంటుంది.
చదవండి: 'రంగ రంగ వైభవంగా' ఫస్టు సింగిల్ రిలీజ్
Ranga Ranga Vaibhavanga Movie: వైష్ణవ్ తేజ్ 'కొత్తగా లేదేంటి ?' ప్రొమో విడుదల..
Published Wed, May 4 2022 2:55 PM | Last Updated on Wed, May 4 2022 5:25 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment