Megastar Chiranjeevi Review Of Vaishnav Tej's Konda Polam Movie - Sakshi
Sakshi News home page

Kondapolam: ‘కొండపొలం’ మూవీపై చిరంజీవి రివ్యూ

Published Fri, Oct 8 2021 7:54 AM | Last Updated on Fri, Oct 8 2021 12:39 PM

Megastar Chiranjeevi Review On Kondapolam Movie - Sakshi

‘ఉప్పెన‌’లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మెగా మేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌ హీరోగా నటించిన రెండో చిత్రం ‘కొండపొలం’. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఒక్క రోజు ముందే అంటే గురువారం ఈ సినిమాను చూసిన మెగాస్టార్‌  చిరంజీవి, అందరికి కంటే ముందే రివ్యూ ఇచ్చేశారు. సినిమా వీక్షించిన తర్వాత చిరంజీవి మాట్లాడుతూ.. అందమైన ప్రేమ కథతో అద్భుతమైన సందేశం ఇచ్చారని ప్రశంసించారు. 

‘సాధారణంగా క్రిష్ సినిమాలంటే డిఫరెంట్ జోనర్ మూవీస్ అని అనుకుంటాం. ఈ సినిమాకు చూసిన వారు థ్రిల్‌కు లోన‌వుతార‌నే మాట వాస్తవం. నేనైతే కొండపొలంకు సంబంధించిన పుస్త‌కం ఏదీ చ‌ద‌వలేదు. వైష్ణ‌వ్ ఓరోజు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ‘మామా.. క్రిష్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో ‘కొండ‌పొలం’ అనే సినిమా చేస్తున్నాను’ అన‌గానే.. నేను ‘వెంటనే సినిమా చెయ్. ఎందుకంటే క్రిష్ డైరెక్ష‌న్ అంటేనే వెరైటీ ఆఫ్ మూవీ చేసే అవ‌కాశం దొరుకుతుంది. మంచి పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉంటుంది. సినిమాలో మంచి ఎమోష‌న్‌కు ఛాన్స్ ఉంటుంది అన్నాను. నేనెదైతే అన్నానో.. వైష్ణ‌వ్ తేజ్ నటన కానీ, క్యారెక్ట‌రైజేష‌న్ కానీ అన్నీ డిఫ‌రెంట్‌గా ఉన్నాయి.

క్రిష్‌ సినిమాల‌ను నేను ముందు నుంచి చూస్తూ వ‌స్తున్నాను. ఒక సినిమాకు మ‌రో సినిమాకు సంబంధం ఉండ‌దు. ‘కొండ‌పొలం’ విష‌యానికి వ‌స్తే, గ‌త చిత్రాల కంటే విభిన్నంగా ఉంది. చ‌క్క‌టి ర‌స్టిక్ ల‌వ్‌స్టోరి. ఈ ప్ర‌కృతిని ఎలా కాపాడుకోవాలో చెప్పిన క‌థాంశం. మంచి మెసేజ్‌తో కూడిన ల‌వ్‌స్టోరి. ఆర్టిస్టుల విష‌యానికి వ‌స్తే వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ నటనను బాగా ఎంజాయ్ చేశాను. ఇలాంటి సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆహ్వానించాలి, ఆద‌రించాలి. ‘కొండ‌పొలం’ మూవీ త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని నేను ప్ర‌గాఢంగా న‌మ్ముతున్నాను. క్రిష్‌కు, నిర్మాత‌ల‌కు, వైష్ణ‌వ్, ఇత‌రుల‌కు ఆల్ ది బెస్ట్‌’ అని చిరంజీవి అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement