Kondapolam Movie
-
టీవీలో అదరగొట్టిన 'కొండపొలం'
మెగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి . దసరా కానుకగా అక్టోబర్ 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ హిట్ అందుకోలేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా రీసెంట్గా స్టార్ మాలో ప్రసారమైంది. బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి టీఆర్పీ దక్కించుకుంది కొండపొలం. అర్బన్ ఏరియాలో 12.34 టీఆర్పీ రాగా అర్బన్, రూరల్ ప్రాంతాల్లో మొత్తం కలిపి 10.54 రేటింగ్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రమే ఆడిన కొండపొలం ఈ స్థాయిలో రేటింగ్ రాబట్టుకోవడం విశేషమే అంటున్నారు సినీలవర్స్. ఇక ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, సాయిచంద్, హేమ, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. -
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ‘కొండపొలం’, ఎక్కడంటే..
Kondapolam Movie Streaming Now On OTT: మెగా హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు. కోట శ్రీనివాసరావు, సాయిచంద్, హేమ, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 8 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: ఎంఎస్ చివరి క్షణాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న బ్రహ్మానందం ఈ మూవీ విడుదలైన రెండు నెలల తర్వాత కొండపోలం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఇంజనీరింగ్ చదివిన ఓ యువకుడు పట్టణంలో ఉద్యోగం తెచ్చుకోలేక ఇంటికి తిరిగి రావడం, భయపడుతూనే కొండపొలం వెళ్లడం, అక్కడ జరిగిన సంఘటనలతో మానసికంగా ఎలా బలంగా మారాడు? యూపీఎస్సీ పరీక్షల్లో ఐఎఫ్ఎస్కు ఎలా ఎంపికయ్యాడన్నదే ఈ సినిమా కథ. ఇందులో రకుల్ ఒబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో నటించి అందరిని మెప్పించింది. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు -
‘కొండపొలం’ మూవీని మొదట సుకుమార్ తీయాలనుకున్నాడట!, కానీ..
డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కొండ పొలం’. నిన్న(శుక్రవారం) విడుదలైన ఈ మూవీ మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఇందులో వైష్ణవ్ తేజ్- రకుల్ ప్రీత్ సింగ్‌లు హీరోహీరోయిన్లు నటించారు. కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమాను క్రిష్ అడవి నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించిన కొండపొలం కథాకథనాలతో పాటు సంగీతం కూడా ప్రధానమైన బలంగా నిలిచింది. అయితే మొదట ఈ ‘కొండ పొలం’ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తీయాలని అనుకున్నట్లు వినికిడి. ఎందుకంటే ఖాళీ దొరికితే పుస్తకాలు చదివే సుక్కు అలా ఒకసారి కొండపొలం నవల చదివాడట. దీంతో ఈ కథ ఆధారంగా ప్రయోగాత్మక చిత్రం రూపొందించాలని అప్పుడే అనుకున్నాడని సమాచారం. అయితే అప్పటికే తాను ‘పుష్ప’ మూవీ స్క్రిప్ట్‌ను సిద్దం చేయడంతో దానిపైనే ఆసక్తి పెట్టాడట. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న పుష్పను రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఫుల్ బిజీ ఆయిన సుక్కు ఇక కొండపొలంను పక్కన పెట్టినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అంతేగాక ‘పుష్ప’ మూవీ కూడా ఆటవి నేపథ్యంలో ఉండటంతో రెండు సినిమాలు ఒకే నేపథ్యంలోనివి అవుతాయని భావించి కొండపొలం తీయాలనే నిర్ణయాన్ని విరమించుకున్నాడట సుకుమార్. ఇదిలా ఉంటే ఈ సినిమా తీయడానికి కారణం సుకుమార్, హరీశ్ శంకర్ అని ఓ ఇంటర్వ్యూలో క్రిష్ చెప్పిన సంగతి తెలిసిందే. సుకుమార్ ఓ సందర్భంగా కొండపొలం నవలను తన దృష్టికి తీసుకువచ్చినట్లు క్రిష్ తెలిపాడు. ఇది తెలిసి నెటిజన్లు క్రియోటివ్‌గా ఆలోచిస్తూ కథతో ప్రయోగాలు చేసే సుక్కు కొండపొలం తీసి ఉంటే ఎలా ఉండేదో అని, మిస్ అయ్యాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
‘కొండ పొలం’మూవీ రివ్యూ
టైటిల్ : కొండ పొలం నటీనటులు : వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయిచంద్, కోట శ్రీనివాసరావు, హేమ, అంటోని, రవిప్రకాశ్ తదితరులు నిర్మాణ సంస్థ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు: సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి సంగీతం : ఎమ్ ఎమ్ కీరవాణి సినిమాటోగ్రఫీ : జ్ఞాన శేఖర్ వీఎస్ ఎడిటింగ్: శ్రావన్ కటికనేని విడుదల తేది : అక్టోబర్ 8,2021 ఉప్పెన’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రెండో చిత్రం ‘కొండపొలం’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం కథేంటంటే..? కడప జిల్లాకు చెందిన కఠారు రవీంద్ర యాదవ్ అలియాస్ రవీంద్ర(వైష్ణవ్ తేజ్) బీటెక్ పూర్తి చేసి, ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వెళ్తాడు. ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం లేకపోవడంతో అతనికి ఉద్యోగం లభించదు. దీంతో అతను తిరిగి పల్లెకు వస్తాడు. నాలుగేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమైన రవీంద్రకు తాత రోశయ్య(కోట శ్రీనివాసరావు) ఓ సలహా ఇస్తాడు. కరువు కారణంగా అల్లాడుతున్న ఊరి గొర్రెల మందతో కొంతమంది కొండపొలం(గొర్రెల మందలను తీసుకొని అడవుల్లోకి వెళ్లడం)చేస్తున్నారని, తమ గొర్రెలను కూడా తీసుకొని వారితో నల్లమల అడవుల్లోకి వెళ్లమని చెబుతాడు. పెద్ద చదువులు చదివిన రవీంద్ర.. తాత సలహాతో నాన్న గురప్ప (సాయి చంద్)కు సహాయంగా అడవికి వెళ్తాడు. దాదాపు 45 రోజుల పాటు అడవితో సహజీవనం చేసిన రవీంద్రలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆ అడవి అతనికి నేర్పిన పాఠాలేంటి? తన చదువు కోసం తండ్రి పడిన కష్టాలేంటి? ‘కొండపొలం’అనుభవంతో జీవితంలో ఎదురైన కష్టాలను ఎదుర్కొని ఏవిధంగా ఫారెస్ట్ ఆపీసర్ అయ్యాడు? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే... మంచి చదువు ఉండి కూడా ఆధునిక ప్రపంచంతో పోటీపడలేక, గొర్రెల కాపరిగా మారిన యువకుడు రవీంద్ర పాత్రలో వైష్ణవ్ తేజ్ ఒదిగిపోయాడు. ‘ఉప్పెన’లో మత్స్యకార కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపించి వైష్ణవ్... కొండపొలంలో గొర్రె కాపరుల సామాజిక వర్గానికి చెందిన యువకుడిగా కనిపించాడు. ఇక, అదే సామాజిక వర్గం, వృత్తి కలిగిన అమ్మాయి ఓబులమ్మ పాత్రలో రకుల్ ప్రీత్ అద్భుత నటను కనబరిచింది. కొన్ని సన్నివేశాల్లో వైష్ణవ్‌ని డామినేట్ చేసిందనిపిస్తుంది. ఆమె పాత్ర తీరే అలా ఉండడం అందుకు కారణం. అడవికి వచ్చిన రవీంద్రలో పట్టుదల ఏర్పడటానికి పరోక్షంగా కారణమైన ఓబులమ్మ పాత్రకు న్యాయం చేసింది రకుల్. రవీంద్ర తండ్రి గురప్ప పాత్రలో సాయిచంద్ పరకాయ ప్రవేశం చేశాడు. ఓ గొర్రెల కాపరి ఎలా ఉంటాడో అచ్చం అలానే తెరపై కనిపించాడు. రవీంద్రతో పాటు అడవికి వెళ్లే ఇతర పాత్రల్లో రవి ప్రకాశ్, హేమ, మహేశ్ విట్ట, రచ్చ రవి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే... అడవుల పరిరక్షణ, జంతువులను వేటాడే వేటగాళ్ల మీద, స్మగ్లర్ల మీద తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మృగరాజు’నేపథ్యం కూడా ఇదే. అయితే పశువులు ప్రాణాలను కాపాడుకోవడం కోసం అడవి వెళ్లే గొర్రెకాపరులు, అక్కడ వారి జీవన పద్దతిపై ఇంతవరకు ఏ చిత్రమూ రాలేదు. ఆ రకంగా చూస్తే ‘కొండపొలం’ ఓ కొత్త సినిమా అనే చెప్పాలి. ప్రకృతి పరిరక్షణ, అడవిపై ఆధారపడిన కొన్ని వర్గాల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ, సామాజిక స్పృహతో ‘కొండపొలం’చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’నవల ఆధారంగా అదే పేరుతో వెండితెరకెక్కించారు. ఈ మూవీకి కథ, మాటలు కూడా సన్నపురెడ్డి అందించడం గమనార్హం. అయితే నవలలో లేని ఓబులమ్మ పాత్రను ఈ సినిమా కోసం రచయిత సన్నపురెడ్డి సృష్టించారు. గొర్రె కాపరుల జీవిత చిత్రాన్ని తెరపై చాలా సహజసిద్దంగా ఆవిష్కరించారు. గొర్రెలను తమ సొంత బిడ్డలుగా భావించే గొర్రెకాపరులు..వాటికి ఆహారం అదించడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి కొండపొలం చేయడం అంటే మామూలు విషయం కాదు. అడవితో మనిషికి ఉండే బంధాన్ని చక్కడ చూపించాడు డైరెక్టర్. పిరికి వాడైన హీరో.. తన గొర్రెలను కాపాడుకోవడం కోసం పులితో పోరాటం చేయడం సినిమాకు హైలైట్. అయితే ‘కొండపొలం’నవల చదివినప్పుడు కలిగే ఉత్కంఠ, భావోద్వేగాలు ఈ సినిమాలో పండకపోవడం మైనస్. అలాగే కొన్ని సాగదీత సీన్స్ సినిమా స్థాయిని తగ్గిస్తాయి. ఫస్టాఫ్‌లో సాగినంత వేగం.. సెకండాఫ్‌లో లేదు. ఓబులమ్మ-రవీంద్ర ప్రేమ కథ ఆకట్టుకుంటుంది. ఇక సినిమాకి ప్రధాన బలం సన్నపురెడ్డి సంభాషణలు. ‘ఏ భాషలో మాట్లాడినా అది గుండెను చేరుతుంది. కానీ మాతృభాషలో మాట్లాడితే మనసుకు చేరుతుంది’,‘అవతలి వాళ్ళ చెప్పులో కాలు పెడితే కానీ తెలియదు అందులో ఎన్ని ముళ్ళు ఉన్నాయో’,‘అడవికి చుట్టంచూపుగా వెళ్ళాలి అంతేకానీ చెట్లు నరకడం, జీవాలను చంపడం చేయకూడదు’లాంటి డైలాగ్స్ హృదయాన్ని తాకడంతో పాటు ఆలోచింప చేస్తాయి. కీరవాణి సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలతో పాటు నేపథ్య సంగీతం అదిరిపోయింది. ‘రయ్ రయ్ రయ్యారే’అంటూ తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫి బాగుంది. అడవి అందాలను చక్కగా చూపించాడు. ఎడిటర్ శ్రవణ్ కటికనేని తన కత్తెరకు పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. కమర్షియల్‌గా ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియదు కానీ.. ఓ మంచి సందేశాత్మక మూవీని చూశామనే అనుభూతి మాత్రం ప్రేక్షకుడికి కలుగుతుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘కొండపొలం’ మూవీ ట్విటర్ రివ్యూ
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రెండో చిత్రం ‘కొండపొలం’. ‘ఉప్పెన’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వైష్ణవ్ నటిస్తున్న చిత్రం.. క్రిష్ లాంటి టాలెంటెడ్ డైరక్టర్ తెరకెక్కించడంతో ‘కొండపొలం’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గొర్రెల కాపరుల జీవనం, సంస్కృతిని ఓ అందమైన ప్రేమ కథ మధ్య అల్లి చెప్పినట్లు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. ఇందులో గొర్రెల కాపరిగా వైష్ణవ్ కనిపిస్తుండగా, అదే సామాజిక వర్గానికి చెందిన యువతిగా రకుల్ నటిస్తోంది. ఎన్నో అంచనాల మధ్య ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: ‘కొండపొలం’ మూవీ రివ్యూ ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Just watched #KondaPolam A beautiful rustic love story with a powerful message. I love how Krish always deals with different genres & picks pertinent issues & extracts fantastic performances from artists.I trust this film will win as much acclaim & awards as it will get rewards. pic.twitter.com/tv4bZTv07q — Chiranjeevi Konidela (@KChiruTweets) October 7, 2021 #KondaPolam REVIEW 👇👍#PanjaVaisshnavTej #RakulPreetSingh #KondaPolamReview #KondaPolamMovie #Rakul #RakulPreet #VaisshnavTej pic.twitter.com/LUssnhol3o — Filmatic Corner (@FILMATICCORNER) October 8, 2021 #KondaPolam superb reviews so far Looks another blockbuster for Vaishnav@Rakulpreet #RakulPreet #VaishnavTej pic.twitter.com/NKpoXoYkXt — Telugu Cinema Fun (@TCinemaFun) October 8, 2021 #KondaPolam Movie Review : కొండపొలం మూవీ రివ్యూ 👌👌#PanjaVaisshnavTej #KondaPolamreview #Thetelugunews @DirKrish @Rakulpreet @KChiruTweets https://t.co/BBlYiIg2em — The Telugu News (@TheTeluguNews1) October 8, 2021 #KondaPolam trending in India 👌👍#KondaPolamInTheaters 🐅⛰️ Book Tickets🎟 https://t.co/QgtzJAW2Pd#RoaringKondaPolam #PanjaVaisshnavTej @RakulPreet @DirKrish @mmkeeravaani @Gnanashekarvs @YRajeevReddy1 #JSaiBabu @FirstFrame_ent @MangoMusicLabel pic.twitter.com/ScWOUE67bY — AN Media (@anmediaoffl) October 8, 2021 #KondaPolam review should be like must avoided film of the year — Mr.T (@navadheepchowd3) October 8, 2021 #KondaPolam 1st half Rod — Ramakrishna (@krkrishnagoud) October 8, 2021 Krish sir mark first half.#KondaPolam — Pk3Vk (@pk3vk) October 8, 2021 Mega Tiger Second Blockbuster Anta 🐆#KondaPolam — Sanjay Sahu (@bhaaagi_) October 8, 2021 -
‘కొండపొలం’ మూవీపై చిరంజీవి రివ్యూ
‘ఉప్పెన’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రెండో చిత్రం ‘కొండపొలం’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఒక్క రోజు ముందే అంటే గురువారం ఈ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి, అందరికి కంటే ముందే రివ్యూ ఇచ్చేశారు. సినిమా వీక్షించిన తర్వాత చిరంజీవి మాట్లాడుతూ.. అందమైన ప్రేమ కథతో అద్భుతమైన సందేశం ఇచ్చారని ప్రశంసించారు. ‘సాధారణంగా క్రిష్ సినిమాలంటే డిఫరెంట్ జోనర్ మూవీస్ అని అనుకుంటాం. ఈ సినిమాకు చూసిన వారు థ్రిల్‌కు లోనవుతారనే మాట వాస్తవం. నేనైతే కొండపొలంకు సంబంధించిన పుస్తకం ఏదీ చదవలేదు. వైష్ణవ్ ఓరోజు నా దగ్గరకు వచ్చి ‘మామా.. క్రిష్‌గారి దర్శకత్వంలో ‘కొండపొలం’ అనే సినిమా చేస్తున్నాను’ అనగానే.. నేను ‘వెంటనే సినిమా చెయ్. ఎందుకంటే క్రిష్ డైరెక్షన్ అంటేనే వెరైటీ ఆఫ్ మూవీ చేసే అవకాశం దొరుకుతుంది. మంచి పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉంటుంది. సినిమాలో మంచి ఎమోషన్‌కు ఛాన్స్ ఉంటుంది అన్నాను. నేనెదైతే అన్నానో.. వైష్ణవ్ తేజ్ నటన కానీ, క్యారెక్టరైజేషన్ కానీ అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. క్రిష్ సినిమాలను నేను ముందు నుంచి చూస్తూ వస్తున్నాను. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం ఉండదు. ‘కొండపొలం’ విషయానికి వస్తే, గత చిత్రాల కంటే విభిన్నంగా ఉంది. చక్కటి రస్టిక్ లవ్‌స్టోరి. ఈ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో చెప్పిన కథాంశం. మంచి మెసేజ్‌తో కూడిన లవ్‌స్టోరి. ఆర్టిస్టుల విషయానికి వస్తే వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ నటనను బాగా ఎంజాయ్ చేశాను. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆహ్వానించాలి, ఆదరించాలి. ‘కొండపొలం’ మూవీ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. క్రిష్‌కు, నిర్మాతలకు, వైష్ణవ్, ఇతరులకు ఆల్ ది బెస్ట్’ అని చిరంజీవి అన్నారు.