Do You Know Vaishnav Tej Kondapolam Movie TRP Rating, Details Inside - Sakshi
Sakshi News home page

Kondapolam: బుల్లితెరపై రఫ్ఫాడించిన వైష్ణవ్‌ తేజ్‌ 'కొండపొలం'

Published Thu, Jan 13 2022 2:47 PM | Last Updated on Thu, Jan 13 2022 3:18 PM

Vaishnav Tej Kondapolam Movie Trp Rating - Sakshi

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’.  సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి . దసరా కానుకగా అక్టోబర్ 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కమర్షియల్‌ హిట్‌ అందుకోలేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా రీసెంట్‌గా స్టార్‌ మాలో ప్రసారమైంది. బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి టీఆర్పీ దక్కించుకుంది కొండపొలం.

అర్బన్‌ ఏరియాలో 12.34 టీఆర్పీ రాగా అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో మొత్తం కలిపి 10.54 రేటింగ్‌ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ దగ్గర అంతంత మాత్రమే ఆడిన కొండపొలం ఈ స్థాయిలో రేటింగ్‌ రాబట్టుకోవడం విశేషమే అంటున్నారు సినీలవర్స్‌. ఇక ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, సాయిచంద్‌, హేమ, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement