TRP rating
-
రికార్డు బద్ధలు కొట్టిన బిగ్‌బాస్.. ఈసారే అత్యధిక టీఆర్పీ!
బిగ్‌బాస్ ప్రారంభానికి ముందు తిట్టుకున్నవాళ్లే ఈ రియాలిటీ షోను ఎక్కువగా చూస్తూ ఉంటారు. జనాలకు పెద్దగా తెలియని ముఖాలను తీసుకొచ్చినా సరే కొద్దిరోజుల్లోనే వారు అందరికీ సుపరిచితులైపోతారు. అటు హౌస్‌లో కంటెస్టెంట్లు గొడవపడుతుంటే వారికోసం అభిమానులు సోషల్ మీడియాలో యుద్ధాలు చేస్తుంటారు. ఫస్ట్ సీజన్ లాంచ్ ఎపిసోడ్ రేటింగ్ ఎంతంటే?ఇకపోతే ఈసారి పెద్దగా అంచనాలు, హడావుడి లేకుండానే బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ (#BiggBossTelugu8) ప్రారంభమైంది. సెప్టెంబర్ 1న ప్రసారమైన ఈ షో లాంచింగ్ ఎపిసోడ్‌కు ఏకంగా 18.9 టీఆర్పీ వచ్చింది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు 16.18 టీఆర్పీ వచ్చింది. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్ ప్రారంభ ఎపిసోడ్‌కు 15.05 రేటింగ్ వచ్చింది.అత్యల్పంగా ఆ సీజన్లోమూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టారు. అలా మూడో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు 17.92, నాలుగో సీజన్‌కు 18.50, ఐదో సీజన్‌కు 18, ఆరో సీజన్‌కు అన్నింటికంటే తక్కువగా 8.86 రేటింగ్ వచ్చింది. ఏడో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు 18.1 రేటింగ్ వచ్చింది. ఎనిమిదో సీజన్ ఏకంగా 18.9 టీఆర్పీ రాబట్టి ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. మొత్తానికి నాగ్ తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ.. దారి తప్పిన బిగ్‌బాస్‌ను మళ్లీ పట్టాలెక్కించాడన్నమాట!5.9 billion minutes of record breaking viewing🔥🔥🔥 The power of ♾️ entertainment. BIGGBOSSTELUGU8 just shattered records of viewing minutes and ratings. Feeling thrilled and honored to witness your love which made Bigg Boss to reach incredible new heights! 🚀 We’re setting… pic.twitter.com/bqMvYtNstn— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 12, 2024మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆదిపురుష్ కి రికార్డు స్థాయిలో TRP
-
ధోనితో సమానంగా గిల్.. రికార్డులు బద్దలు
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో ఏడాది ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతొ విజయాన్ని అందుకుంది. కాగా మాములుగానే ఈ సీజన్లో ఒక ఐపీఎల్ మ్యాచ్‌ను కోటికి తగ్గకుండా వీక్షిస్తున్నారు. గడిచిన రెండేళ్లలో నమోదవ్వని టీఆర్పీ రేటింగ్ ఈసారి నమోదవుతుంది. Photo: IPL Twitter ముఖ్యంగా ఈ సీజన్లో సీఎస్కే ఆడిన ప్రతీ మ్యాచ్‌కు వ్యూయర్షిప్ కనీసం రెండుకోట్లు దాటుతుంది. అందునా కేవలం ధోనిని చూడడం కోసమే ఇదంతా. ఇక తెరపై ధోని కనిపిస్తే టీఆర్పీ రేటింగ్స్ బద్దలవడం ఖాయం. ఇప్పటివరకు ఈ సీజన్లో ధోని బ్యాటింగ్‌ను 2.5 కోట్ల మంది వీక్షించారు. తాజాగా ఆ రికార్డును గిల్ సమం చేశాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్‌ను దాదాపు 2.5 కోట్లకు పైగా వీక్షించడంతో సరికొత్త రికార్డు నమోదయింది. Photo: IPL Twitter అతను బ్యాటింగ్ చేస్తున్నంతసేపు జియో సినిమా వ్యూయర్షిప్ 2.5 కోట్లకు తగ్గలేదు. ఇక మ్యాచ్‌లో గిల్ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో గిల్‌కు ఇది మూడో సెంచరీ కాగా.. 60 బంతుల్లో 129 పరుగులు చేసిన గిల్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గిల్ ఐపీఎల్లో ఒకే సీజన్లో మూడు సెంచరీలు చేసిన యంగెస్ట్ ప్లేయర్‌గా.. టీమిండియా నుంచి రెండో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతకముందు కోహ్లి, బట్లర్లు ఒకే సీజన్లో నాలుగేసి సెంచరీలు బాది సంయుక్తంగా తొలి స్థానంలో కొనసాగుతున్నారు. 2.5 Crore was watching Shubman Gill bat on JioCinema. Joint peak in IPL 2023 - This is Gill Era. pic.twitter.com/JiMFLJI502 — Johns. (@CricCrazyJohns) May 26, 2023 His royal highness, first of his name, destroyer of bowling attacks, lord of the sixes - Prince Shubman Gill 💯#GTvMI #TATAIPL #IPLonJioCinema #IPLPlayoffs pic.twitter.com/HQns2Gq5mv — JioCinema (@JioCinema) May 26, 2023 చదవండి: ఐపీఎల్ చరిత్రలో అత్యంత అరుదైన ఘనత.. ధోని తర్వాత శుభ్‌మన్ గిల్‌దే..! -
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ఎంతవరకు విజయవంతం?
బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2023) తుది అంకానికి చేరుకుంది. ఇవాళ్టితో లీగ్ దశ మ్యాచ్‌లు ముగియనున్నాయి. ఆర్సీబీ, ముంబైలు తలపడనుండగా.. మరో మ్యాచ్‌లో యూపీ వారియర్జ్, ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ ఆఖరి మ్యాచ్ ఆడనున్నాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్, ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ ప్లేఆఫ్‌కు క్వాలిఫై కాగా.. ఆర్సీబీ వుమెన్, గుజరాత్ జెయింట్స్ లీగ్ దశలోనే నిష్క్రమించాయి. మరి మెన్స్ ఐపీఎల్‌లాగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్ విజయవంతమైందా అనేది ఆసక్తికరంగా మారింది. పురుషుల ఐపీఎల్‌తో పోలిస్తే డబ్ల్యూపీఎల్‌కు అంతగా ఆదరణ లేకపోయినప్పటికి తొలివారం ముగిసేసరికి ఎనిమిది మ్యాచ్‌లు జరిగాయి. అన్ని వర్గాలు(రూరల్, అర్బన్) కలిపి 50.78 మిలియన్ మంది వీక్షించినట్లు బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్జీ కౌన్సిల్(BARC- బార్క్) తెలిసింది.ఇందులో 15+ ఏజ్ గ్రూప్‌లో 40.35 మిలియన్ మంది ఉన్నట్లు పేర్కొంది. కాగా ఆర్సీబీ వుమెన్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌ను అత్యధికంగా వీక్షించారు. ఈ మ్యాచ్‌కు 0.41 రేటింగ్ నమోదైనట్లు తేలింది. గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ 0.40 రేటింగ్‌తో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత అత్యధికంగా వీక్షించిన వాటిలో వరుసగా ముంబై ఇండియన్స్ వుమెన్, గుజరాత్ జెయింట్స్ మ్యాచ్(0.26), ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ వుమెన్(0.24), ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్(0.34), ఆర్సీబీ వర్సెస్ యూపీ వారియర్జ్(0.33) టీఆర్పీ రేటింగ్స్ సాధించాయి. మరో విశేషమేమిటంటే ముంబై ఇండియన్స్ ఆడిన ప్రతీ మ్యాచ్‌కు మంచి టీఆర్పీ రేటింగ్ లభించింది. ఈ వారంతో ముగియనున్న డబ్ల్యూపీఎల్ వంద మిలియన్ వ్యూస్ సాధించడం కష్టమే అనిపిస్తుంది. ఓవరాల్‌గా 70 నుంచి 80 మిలియన్ల వ్యూస్ వచ్చే అవకాశం ఉన్నట్లు బార్క్ తెలిపింది. ఈ లెక్కన తొలిసారి నిర్వహిస్తున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్ విజయవంతమైనట్లే. ఎందుకంటే పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కు కాస్త ఆదరణ తక్కువే. అయినా కూడా తొలి సీజన్లో 80 మిలియన్ వ్యూస్ సంపాదించిందంటే ఒక లెక్కన సీజన్ విజయవంతమైనట్లే. చదవండి: టీమిండియాలో నో ఛాన్స్.. హిందీ సీరియల్లో నటిస్తున్న శిఖర్ ధావన్! -
టీవీలో అదరగొట్టిన 'కొండపొలం'
మెగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి . దసరా కానుకగా అక్టోబర్ 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ హిట్ అందుకోలేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా రీసెంట్గా స్టార్ మాలో ప్రసారమైంది. బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి టీఆర్పీ దక్కించుకుంది కొండపొలం. అర్బన్ ఏరియాలో 12.34 టీఆర్పీ రాగా అర్బన్, రూరల్ ప్రాంతాల్లో మొత్తం కలిపి 10.54 రేటింగ్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రమే ఆడిన కొండపొలం ఈ స్థాయిలో రేటింగ్ రాబట్టుకోవడం విశేషమే అంటున్నారు సినీలవర్స్. ఇక ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, సాయిచంద్, హేమ, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. -
బిగ్‌బాస్ టీఆర్పీ: ఆ రికార్డు తిరగరాయలేకపోయిన నాగ్!
Bigg Boss 5 Telugu Grand Finale TRP Rating: బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కానీ, భారీ టీఆర్పీ అందుకోవడంలో మాత్రం ఘోరంగా విఫలమైంది. సెప్టెంబర్ 5న అంగరంగ వైభవంగా ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ డిసెంబర్ 19న ముగిసింది. 19 మందితో ప్రారంభమైన ఈ షోలో నటుడు, యాంకర్ వీజే సన్నీ విజేతగా నిలవగా యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ రన్నరప్‌గా అవతరించాడు. తాజాగా ఈ షో గ్రాండ్ ఫినాలే టీఆర్పీ రేటింగ్ వివరాలను వెల్లడించింది స్టార్ మా. రాజమౌళి, రణ్‌బీర్ కపూర్, నాని, సాయిపల్లవి, కృతీ శెట్టి, రష్మిక మందన్నా, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్, అలియా భట్.. ఇలా ఎందరో సినీ ప్రముఖులు హాజరై సందడి చేసిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ను 6.2 కోట్ల మంది వీక్షించారని తెలిపింది. మొత్తంగా దీనికి 18.4 టీఆర్పీ వచ్చిందని స్పష్టం చేసింది. హాట్‌స్టార్‌లో లక్షలాది మంది సైతం గ్రాండ్ ఫినాలేను వీక్షించారని పేర్కొంది. కాగా బిగ్‌బాస్ నాల్గో సీజన్‌కు అత్యధికంగా 21.7 టీఆర్పీ వచ్చింది. ఈ రికార్డును నాగార్జున తిరగరాస్తాడనుకుంటే 18.4 రేటింగ్‌తో సరిపెట్టుకున్నాడు. ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తొలి సీజన్‌కు 14.13, రెండో సీజన్‌కు 15.05, మూడో సీజన్‌కు 18.29 టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. -
టీఆర్పీ రేటింగ్‌లో సత్తా చూపిన బిగ్‌బాస్ 5, కానీ..
Bigg Boss Telugu 5 Launch Episode TRP Ratings: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ సెప్టెంబర్ 5న ఎంతో ఘనంగా ప్రారంభమైంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున ముచ్చటగా మూడోసారి ఈ షోను నడిపించే బాధ్యతను తన భుజానెత్తుకున్నాడు. బుల్లితెర ప్రేక్షకులకు ఐదు రెట్ల ఎంటర్టైన్మెంట్ ఇస్తానంటూ మురిపించాడు. అన్నట్లుగానే కంటెస్టెంట్లను ఆడిస్తూ వారి ఎమోషన్స్‌కు పరీక్ష పెడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. గ్రాండ్‌గా లాంచ్ చేసిన యంగ్ టైగర్ నిజానికి విదేశాల్లో విజయవంతం అయిన బిగ్‌బాస్ షోను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా? లేదా? అని మొదట్లో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బిగ్‌బాస్ తొలి సీజన్‌ను విజయవంతంగా నడిపించి ఆ అనుమానాలను పటాపంచలు చేశాడు. అందుకే అప్పట్లో లాంచ్ ఎపిసోడ్‌కు 16.18 టీఆర్పీ వచ్చింది. నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్లో తొలి ఎపిసోడ్‌కు 15.05 టీఆర్పీ వచ్చింది. అయితే మూడో సీజన్‌కు తాను హోస్ట్‌గా వ్యవహరించలేనని నాని చేతులెత్తేయడంతో బిగ్‌బాస్ నిర్వాహకులు కింగ్ నాగార్జునను సంప్రదించారు. ఇందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. Thank you all for 5 much Love!!!❤️❤️❤️❤️❤️. You made Starmaa the unbeatable No 1 with BiggBoss Season 5 launch. #BiggBossTelugu5 @starmaa pic.twitter.com/x0iPYwCoUH — Nagarjuna Akkineni (@iamnagarjuna) September 16, 2021 రికార్డు తిరగరాసిన నాగ్ నాగ్ ఎంతో గ్రాండ్‌గా మొదలు పెట్టిన మూడవ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌కు అనూహ్యంగా 17.92 టీఆర్పీ రేటింగ్ దక్కింది. ఇది బిగ్‌బాస్ షోకు మరింత బూస్ట్నిచ్చినట్లైంది. తర్వాత నాగ్ మరోసారి బిగ్‌బాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాలుగో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు ఏకంగా 18.5 టీఆర్పీ వచ్చింది. దీంతో తన రికార్డు తనే బద్ధలు కొట్టాడు నాగ్. ఐదో సీజన్‌తో ఆ రికార్డులు తిరగరాయడం ఖాయం అని అనుకున్నారంతా! కానీ అనూహ్యంగా గత సీజన్ కంటే ఈసారి లాంచ్ ఎపిసోడ్‌కు కాస్త తక్కువ రేటింగ్ నమోదైంది. 18 టీఆర్పీ వచ్చింది! ఈ విషయాన్ని నాగ్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. Thank you for the 5-Much Love!! ❤#BiggBossTelugu5 pic.twitter.com/2uhZQ0bb1d — starmaa (@StarMaa) September 16, 2021 -
టీఆర్పీ రేటింగ్‌లో దూసుకుపోతున్న యంగ్ టైగర్ షో
బిగ్‌బాస్‌తో పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించే మరో రియాలిటీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. గత సీజన్లు స్టార్ మాలో ప్రసారమవుగా దీనికి హోస్ట్‌గా కింగ్ నాగార్జున, చిరంజీవిలు వ్యవహరించారు. అయితే ఈ సారి ఈ రియాలిటీ షో సరికొత్తగా ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో జెమిని టీవీలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. దీనికి హోస్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే బిగ్‌బాస్‌తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తనదైన మ్యానరిజం, చమత్కారంతో షోను ఆసక్తిగా మలుస్తున్నాడు. సోమవారం నుంచి బుధవారం వరకు ప్రతి రోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటలకు ప్రసారమయ్యే ఈ షో ఎన్నడూ లేని విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందట. చదవండి: ఈ నటుడిని గుర్తుపట్టారా? హీరోగా రెండు సినిమాల్లో నవ్వించాడు! దీంతో ఈ షో అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను రాబడుతూ మిగతా షోల కంటే ముందంజలో దూసుకుపోతుందట. కాగా ప్రిమియర్ ఎపిసోడ్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు 11.40 టీఆర్పీ రేటింగ్ రాగా, ఫస్ట్‌వీక్ 5.62 వచ్చిందట. ఇక రెండో వారం 6.48గా టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు షో నిర్వహకులు తెలిపారు. దీంతో గత సీజన్లతో పోలిస్తే ఈ సిజన్‌కు వచ్చిన టీఆర్పీ రేటింగ్ అత్యధికమట. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇదే హావాతో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ దూసుకుపోనుందని విశ్లేషకుల అంచన. కాగా ఎన్టీఆర్ తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులతో పాటు పలు సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీ చిత్రీకరణ జరుపుకుంటోంది. చదవండి: నా తల్లి పేరు కూడా అదే, అందుకే నామినేట్ చేయలేదు: షణ్నూ -
బుల్లితెరపై ‘ఉప్పెన’ రికార్డ్.. స్టార్ హీరోలతో సమానంగా!
ఉప్పెన.. ఇటీవల కాలంలో వచ్చిన తెలుగు సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన మూవీ. రికార్డుల మీద రికార్డులను తన పేరు మీద లిఖించుకుంటోంది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రధాన పాత్రలో బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ కలిసి నిర్మించిన ఈ చిత్రం వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, విలన్‌గా విజయ్ సేతుపతి నటన సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. వెండితెరపై ఓ ఊపు ఊపిన ఉప్పెన.. ఇటు బుల్లితెరపై కూడా తన హవాను కొనసాగించింది. థియేటర్స్ లో 50 రోజులు ఆడిన ఈ చిత్రం ఈ మద్యే నెట్ ఫ్లిక్స్ లోనూ విడుదలైంది. అక్కడా మంచి వ్యూస్ సాధిస్తుంది. తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా స్టార్ మా ఛానెల్లో ప్రసారమయ్యింది. తొలిసారి ప్రసారమైన ఉప్పెనకు ఏకంగా 18.5 టీఆర్పీ రేటింగ్ దక్కింది. డెబ్యూ హీరోల సినిమాలకు ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఈమధ్య కాలంలో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల తర్వాత ఎక్కువ రేటింగ్ పొందిన చిత్రం ఇదే . ఇక అదే రోజున ప్రసారం అయిన విజయ్ మాస్టర్ సినిమాకు 4.86 రేటింగ్ వచ్చింది. చదవండి: మరోసారి ‘బేబమ్మ’తో వైష్ణవ్ తేజ్ రొమాన్స్! లాక్‌డౌన్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ Blockbuster response for #Uppena continues UPPENA TV PREMIERE delivers phenomenal 18.5 ratings 💥#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @ThisIsDSP @aryasukku @SukumarWritings @MythriOfficial pic.twitter.com/tOPMelkR3l — BARaju (@baraju_SuperHit) April 29, 2021 -
కోవిడ్ టైమ్‌లో దేశం ఏం చూసింది?
ముంబై: కోవిడ్ మహమ్మారి కాలంలో భారత్‌లో టెలివిజన్ వీక్షణ తొమ్మిది శాతం పెరిగినట్టు టీవీ రేటింగ్ ఏజెన్సీ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్సీ) వెల్లడించింది. మొత్తం టీవీ వ్యూయర్షిప్లో న్యూస్ ఛానళ్ల వ్యూయర్షిప్ 27 శాతం పెరిగినట్టు ఈ అధ్యయనం గుర్తించింది. పంజాబీ, గుజరాతీ, మళయాళం, తమిళ్, మరాఠీ, హిందీ న్యూస్‌ఛానళ్లకు అత్యధికంగా 10.4 శాతం వ్యూయర్షిప్ నమోదైంది. గత ఏడాది తొలి అర్థ భాగంలోకంటే ద్వితీయార్థ భాగంలో ప్రకటనలు 34 శాతం పెరిగాయని కూడా ఈ అధ్యయనం గుర్తించింది. అదే సమయంలో ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ వీక్షణలో మాత్రం రెండు శాతం తగ్గుదల కనిపించింది. వారంలో టీవీ వీక్షించే సమయం ఆధారంగా ఈ శాతాన్ని లెక్కించారు. భారతీయులు ఏం చూశారు? కోవిడ్ కాలంలో భారత ప్రజలు దేన్ని వీక్షించారు ‘వాట్ ఇండియా వాచ్డ్’అనే కోణంలో ఈ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో కోవిడ్‌కి ముందు, కోవిడ్ సమయంలో, లాక్డౌన్ సమయంలో, లాక్డౌన్ అనంతరం, అలాగే 2020 ఏడాది చివర్లో భారతీయుల టీవీ వీక్షణపై ఈ అధ్యయనం చేశారు. ‘ద ఇయర్ ఆఫ్టర్ టూ థౌజండ్ అండ్ నైన్టీన్’అనే పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో 2020 మార్చి 25న భారత్‌లో లాక్డౌన్ విధించాక ప్రజలు తమ ఇళ్లకే పరిమితమై టీవీలకు అతుక్కుపోయి, టీవీల ద్వారా బాహ్యప్రపంచాన్ని వీక్షించేందుకు ప్రయత్నించారని ఈ సర్వే వెల్లడించింది. లాక్డౌన్ సమయంలో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, న్యూస్ ఛానళ్లను ఎక్కువగా వీక్షించినట్టు సర్వే పేర్కొంది. గత ఏడాది జనవరి–మార్చి కాలంతో పోలిస్తే మార్చి– జూన్ కాలంలో టీవీ వీక్షణం 23 శాతం పెరిగినట్టు ఈ అధ్యయనం గుర్తించింది. పిల్లల కార్యక్రమాల వీక్షణ 27 శాతం పెరిగింది. 2019తో పోల్చుకుంటే కోవిడ్ కాలంలో 2020లో జనరల్ ఎంటర్టెయిన్మెంట్ ఛానల్స్ వ్యూయర్షిప్ 9 శాతం పెరిగింది. సినిమా వీక్షణ 10 శాతం పెరిగింది. నాన్ ప్రైమ్ టైమ్ కార్యక్రమాల వీక్షణశాతం 2019లో 51 శాతం ఉంటే, లాక్డౌన్ కాలంలో (మార్చి 14 నుంచి జూలై 3 వరకు) 2020లో 53 శాతానికి పెరిగింది. టీవీ వీక్షకులు ఒక్క రోజులో టీవీల ముందు గడిపే సమయం 2019లో 3 గంటల 42 నిముషాలు ఉంటే 2020కి వచ్చేసరికి 4 గంటల 2 నిముషాలకు చేరుకుందని సర్వే వెల్లడించింది. లాక్డౌన్ ప్రధాన కారణం 2020లో కోవిడ్‌కి ముందు జనవరి 4 నుంచి మార్చి 13 వరకు టీవీ వ్యూయర్షిప్ ఆరుశాతం తగ్గినట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు,లాక్డౌన్ కాలంలో జాతీయంగా, అంతర్జాతీయంగా క్రీడాకార్యక్రమాలు నిలిచిపోవడంతో క్రీడాకార్యక్రమాల వీక్షణ తగ్గిపోయింది. జూలై 4 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు సంబంధించిన టీవీ వీక్షణ క్రమంగా పెరిగింది. 2020 చివరి నెలల్లో మొత్తం టెలివిజన్ వీక్షణ 6 శాతం పెరిగింది. 127 శాతం పెరిగిన ఐపీఎల్ 13 వ్యూయర్షిప్ ఐపీఎల్–13 నేపథ్యంలో క్రీడా సంబంధిత కార్యక్రమాల వీక్షణలో 127 శాతం పెరుగుదలను నమోదు చేసింది. టీవీ వీక్షకుల్లో అతిపెద్ద క్యాటగిరీ అయిన జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్(జీఈసీ) వీక్షకులు టీవీ చూసే సమయం 9 శాతం పెరిగింది. సినిమా చూసేవారిలో పదిశాతం పెరిగింది. చిన్నపిల్లల కార్యక్రమాల్లో 27 శాతం పెరుగుదల, సంగీత కార్యక్రమాల వీక్షణ 11 శాతం పెరిగింది. క్రీడల వీక్షించే సమయం –35 శాతం తగ్గినట్టు తేలింది. 2020 తొలి అర్థభాగంతో పోల్చుకుంటే 2020 ద్వితీయార్థ భాగంలో ప్రకటనలు 34 శాతం పెరిగాయి. 2020లోని మొత్తం ప్రకటనల్లో టాప్ 10 అడ్వర్టైజింగ్ సెక్టార్లు 80 శాతం ప్రకటనలు ఇచ్చాయి. భారీగా పెరిగిన ప్రభుత్వ ప్రకటనలు.. 2020 పోల్చుకుంటే 2019లో ప్రభుత్వ ప్రకటనలు 184 శాతం(2.7 రెట్లు) పెరిగాయి. ఐపీఎల్–12 తో పోల్చుకుంటే ఐపీఎల్–13 వీక్షకుల శాతం 23 శాతం పెరిగింది. మొత్తం 40,000 కోట్ల నిముషాల పాటు ఐపీఎల్‌ని వీక్షించారు. ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అబుదాబీలో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌ని అత్యధికంగా 11.2 బిలియన్ల సమయం వీక్షించినట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి రిపబ్లిక్ టీవీ సహా మరో రెండు ఛానళ్ళు టీఆర్పీ రేటింగ్‌ని తారుమారు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో స్వతంత్ర న్యూస్ చానళ్లకు సంబంధించిన వీక్లీ వ్యూయర్షిప్ డేటాని అక్టోబర్ మధ్య వరకు బీఏఆర్సీ వెల్లడించలేదు. మాజీ ప్రసార నిపుణులు పరితోష్ జోషి మాట్లాడుతూ భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగుతోందని అన్నారు. 2019లోనే వార్తా ప్రాధాన్యత కలిగిన ఘటనలు 2019లో ఇదే కాలంలో వార్తా ప్రాధాన్యత కలిగిన అనేక ఘటనలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికలు, పుల్వామాలో ఉగ్రదాడి, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాక్ నుంచి తిరిగి రాకలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి. అప్పుడు వార్తా వీక్షకుల సంఖ్య పెరగడానికీ, 2020లో వార్తా ఛానళ్ళ వీక్షకుల సంఖ్య తగ్గడానికి ఇదొక కారణమై ఉండొచ్చని రిపోర్టు వెల్లడించింది. అయితే లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇళ్ళకే పరిమితం కావడం వల్ల టీవీ వీక్షకుల శాతం 2019లో ఇదే కాలంతో పోల్చి చూస్తే 18 శాతం పెరిగినట్టు రిపోర్టు తేల్చింది. 2019తో పోల్చితే వార్తా వీక్షకుల సంఖ్య లాక్డౌన్ కాలంలో 90 శాతం పెరిగితే, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల వీక్షకుల సంఖ్య 8 శాతం మాత్రమే పెరిగింది. దూర్దర్శన్ ఛానళ్లలో ప్రసారం అయిన రామాయణ్, మహా భారత్ కార్యక్రమాల కారణంగా ఎంటర్టైన్మెంట్ వీక్షకులు పెరిగారు. -
టీఆర్పీలో నాగ్‌ను మించిపోయిన సమంత
100 శాతం ఎంటర్టైన్మెంట్ అంటూ వచ్చిన బిగ్‌బాస్ నాల్గో సీజన్ ఆ మాట మీద నిలబడలేకపోతోంది. అందులో సగమైనా వినోదాన్ని పంచేందుకు నానాతంటాలు పడుతోంది. పైగా బలమైన కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతూ ఉండటంతో షోపై జనాలకు విశ్వాసం సన్నగిల్లుతోంది. పస లేని పాత టాస్కులతో ప్రేక్షకుల సహనం నీరుగారిపోతోంది. వెరసి బిగ్‌బాస్ టీఆర్పీ రేటింగ్స్ సీరియల్స్‌ను కూడా దాటలేకపోతున్నాయి. వీకెండ్లో మాత్రం పర్వాలేదనింపించే టీఆర్పీలను దక్కించుకుంటున్నాయి. అయితే దసరా నాడు సమంత విజయవంతంగా నడిపించిన మారథాన్ ఎపిసోడ్‌కు 11.3 టీఆర్పీ రేటింగ్ దక్కడం విశేషం. ఆమె హోస్టింగ్ బాగోలేదని పెదవి విరిచిన వాళ్లకు ఈ రేటింగే చెంపపెట్టు సమాధానమిస్తోంది. (చదవండి: మోనాల్‌కు 30, అఖిల్‌కు 25.. పెళ్లి చేయలేం) కాగా ఈ సీజన్ ప్రారంభ ఎపిసోడ్‌కు 18.5 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అంటే దాదాపు 4.5 కోట్ల మంది వీక్షించారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. రోజులు గడిచేకొద్దీ టీఆర్పీ పెరగాల్సింది పోయి ప్రతివారం తగ్గుతూ వస్తున్నాయి. దీంతో బిగ్‌బాస్ షో ప్రారంభ శూరత్వంగానే మిగిలిపోయింది. ఏదేమైనా రేటింగ్స్ దారుణంగా క్షీణిస్తున్న తరుణంలో సమంత అడుగుపెట్టి షోకు కొత్త వన్నె తెచ్చారు. తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించారన్న మాటే కానీ ఎక్కడా తడబడలేదు. అందరినీ కలుపుకుపోతూ, ముద్దుముద్దుగా తెలుగు మాట్లాడుతూ ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేశారు. ప్రతివారం పదిలోపే సాగిలబడి కొట్టుకుంటున్న రేటింగ్‌ను 11.3కు తీసుకువచ్చారు. మామ నాగార్జున తనకు అప్పజెప్పిన పనిని శిరోధార్యంగా భావించి సమర్థవంతంగా పూర్తి చేసి ప్రశంసలు దక్కించుకున్నారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే 'జాను' తర్వాత ఆమె మరే సినిమా ఒప్పుకున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆమె నటించి, డబ్బింగ్ చెప్పిన "ఫ్యామిలీ మ్యాన్ 2" వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. (చదవండి: బిగ్‌బాస్: టీఆర్పీలో సరికొత్త రికార్డు) -
బిగ్‌బాస్: రెండో వారం పడిపోయిన టీఆర్పీ
బిగ్‌బాస్ నాల్గవ సీజన్ ఎంత గ్రాండ్‌గా ప్రారంభమైందో ప్రేక్షకులు కూడా అంతే గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. అసలే ఎంటర్టైన్మెంట్ కరువు కాలంలో ఉన్న వీక్షకులకు బిగ్‌బాస్ ఎడారిలో ఓయాసిస్సుగా కనిపించింది. దీంతో ఫస్ట్ ఎపిసోడ్ రోజు కంటెస్టెంట్లు ఎవరా అని టీవీలకు అతుక్కుపోయారు. అందరూ ఇంట్లో ఎంటరయ్యాక వీళ్లందరూ ఎవరా అని తల గోక్కున్నారు. ఇది వేరే విషయం. అయితే షో ప్రారంభ ఎపిసోడ్‌కు ఎన్నడూ రానంత టీఆర్పీ వచ్చిందని స్టార్ మా సగర్వంగా ప్రకటించింది. తొలి వారంలో షోను 4.5 కోట్ల మంది వీక్షించారని, 18.5 టీఆర్పీ నమోదు చేసిందని తెలిపింది. (గత సీజన్లను వెనక్కునెట్టిన బిగ్‌బాస్ ) తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఈ షోను చూశారని స్వయంగా నాగార్జునే వెల్లడించారు. అంతే కాకుండా దేశంలోనే ఏ బిగ్‌బాస్ షోకు రాని ప్రజాదరణ ఈ సీజన్‌కు వచ్చిందని తెలిపారు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియకు కూడా ఎన్నడూ లేనంతగా 6 కోట్ల ఓట్లు వచ్చాయని వెల్లడించారు. దీంతో లోపల ఉన్న కంటెస్టెంట్లు ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు. కానీ బిగ్‌బాస్ స్పీడుకు ఐపీఎల్ అడ్డుకట్ట వేసింది. ఆకాశాన్నంటిన టీఆర్పీలు ఇప్పుడు నేలపైకి దిగి వచ్చాయి. బిగ్‌బాస్ షోకు రెండో వారాంతం రేటింగ్ 10.7గా ఉంది. వారం మొత్తానికి కేవలం 8.05 రేటింగ్ వచ్చింది. (బిగ్‌బాస్ హౌస్‌లో తలనొప్పిగా మారుతోన్న గంగవ్వ!) -
గత సీజన్లను వెనక్కునెట్టిన బిగ్‌బాస్
కరోనా అందరికీ షాకులిస్తే బిగ్‌బాస్‌కు మాత్రం బాగా కలిసొచ్చింది. వినోదాలు, విహారాలు అంటూ బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో జనాలు టీవీలకు అతుక్కుపోయారు. పైగా టీవీల్లోనూ సరైన వినోదం కోసం వెతుకులాడుతున్న సమయంలో "వంద రెట్ల ఎంటర్టైన్మెంట్.. నెవర్ బిఫోర్" అంటూ బిగ్‌బాస్ ప్రేక్షకుల కంట పడ్డాడు. ఇంకేముందీ తెలుగు రాష్ట్రాల ప్రజలు షో చూడటం కోసం వేయి కళ్లతో ఎదురు చూశారు. తీరా ఆ రోజు రానే వచ్చింది. సెప్టెంబర్ ఆరున వేడుకలు, డ్యాన్సులు, కంటెస్టెంట్ల ఎంట్రీలతో షో ఘనంగా ప్రారంభమైంది. ప్రేక్షకులు ఛానల్ మార్చకుండా బిగ్‌బాస్ షోను చూస్తూ ఉండిపోయారు. దీంతో ముందు సీజన్ల టీఆర్పీ రికార్డులను కింగ్ నాగార్జున బద్ధలు కొడుతూ సరికొత్త రికార్డు సృష్టించారు. (చదవండి: బిగ్‌బాస్: ముందు తనే వెళ్లిపోతానన్న గంగవ్వ)) అలా షో ప్రారంభ ఎపిసోడ్‌కు 18.5 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ ఎపిసోడ్‌ను దాదాపు 4.5 కోట్ల మంది వీక్షించారు. అంటే ప్రతీ ముగ్గురిలో ఒకరు ఈ షోను చూశారు. బిగ్‌బాస్ ఆదరణ ఇంకా ఏమాత్రం తగ్గలేదని రుజువు చేస్తున్న ఈ టీఆర్పీ రేటింగ్స్‌ను స్టార్ మా సోషల్ మీడియాలో సగర్వంగా వెల్లడించింది. గత మూడు సీజన్లు కూడా దీనికన్నా తక్కువ టీఆర్పీలనే దక్కించుకోవడం గమనార్హం. కాగా ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన మొదటి సీజన్‌కు 16.18, నాని రెండో సీజన్‌కు 15.05, నాగ్ మూడో సీజన్‌కు 17.9 టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. (చదవండి: బిగ్‌బాస్: తొలివారం ఎలిమినేట్ అయ్యేది అతనే!) -
బన్నీ ఖాతాలో మరో అరుదైన రికార్డు
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అల..వైకుంఠపురుములో. సంక్రాంతి కానుకగా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం బన్ని కెరీర్లో అత్యధిక వసూళ్లను రాబట్టింది. పలు చోట్ల బాహుబలి రికార్డులు కూడా తిరగరాసిన ఈ చిత్రం తాజాగా బుల్లితెరపై సునామి సృష్టించింది. ఇటీవల టీవీలో ప్రసారం అయిన ఈ సినిమా అత్యధికంగా 29.4 టీఆర్పీ రేటింగ్ సంపాదించి రికార్డు బ్రేక్ చేసింది. తెలుగులో ఇదే అత్యధికం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇంతకు ముందు మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం టాలీవుడ్లో అత్యధిక టీఆర్పీ మూవీగా 23.4 టిఆర్పిని సాధించింది. ఇక బుల్లితెరపై కూడా తమ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ గీతా ఆర్ట్స్ సంస్థ ట్వీట్ చేసింది. (చదవండి : ఏంటి అన్నయ్య.. ప్రతిసారి కొత్త లుక్) కాగా, ఇప్పటికే ఈ సినిమా పలు రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. సినిమాలోని ప్రతి పాట ఓ సంచలనం. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్‌కి యూట్యూబ్‌లో వంద కోట్ల వ్యూస్ వచ్చాయి. తెలుగు సినిమా చరిత్రలో ఒక సినిమా ఆల్బమ్‌కి ఈ స్థాయిలో ఆదరణ రావడం ఇదే తొలిసారి. సినిమా విడుదలై దాదాపు తొమ్మిది నెలలు కావొస్తున్న రికార్డుల హోరు మాత్రం తగ్గడం లేదు. -
బిగ్ బాస్-2: నాని తగ్గట్లేదు బాస్
గతేడాది వచ్చిన బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. దానికి మొదటి కారణం యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడమే. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ నడిపిన తీరే ఈ షో సక్సెస్‌కు ప్రధాన కారణం. బిగ్ బాస్ రెండో సీజన్‌కు ఎన్టీఆర్ కాకుండా నాని హోస్ట్‌గా ఫిక్స్ అయ్యాక కొందరు నిరాశపడినా, మరికొందరు నాని కూడా తన సహజత్వంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలడని ఆశించారు. అయితే అనూహ్యంగా ఈ షోకు విశేష స్పందన లభించిందని తెలుస్తోంది. బిగ్‌బాస్ సీజన్-2 మొదటి వారం టీఆర్పీ రేటింగ్స్‌ను నిర్వాహకులు కాసేపటి క్రితమే విడుదల చేశారు. 15.1 రేటింగ్‌తో ప్రారంభమైందని తెలిపింది. టీవీ కార్యక్రమానికి సంబంధించి ఈ రేంజ్లో రావడం అరుదే. మొదటి సీజన్ సమయంలో ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసినప్పుడు 16 పాయింట్లతో ఆందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే నాని తన స్థాయిలో ఈ షోను విజయవంతం చేయటం గమనార్హం. ఈ షో ప్రారంభం రోజున ప్రతి ఇద్దరిలో ఒకరు చూశారని, ఓవరాల్‌గా మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60 శాతం మంది షోను చూశారని స్టార్ మా ప్రకటించుకుంది. #BiggBossTelugu2 Launches BIGG yet again!!! Congrats @NameisNani @EndemolShineIND & Team 👍 pic.twitter.com/7JCflIaohp — STAR MAA (@StarMaa) June 21, 2018 -
రేటింగ్‌ల కోసం రేప్‌లకు ప్రచారం!
కర్ణాటక హోంమంత్రి జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని బీజేపీ ధ్వజం బెంగళూరు: టీవీ చానళ్లు టీఆర్పీ రేటింగ్‌ల కోసం అత్యాచారాల ఘటనలకు విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నాయని కర్ణాటక హోంమంత్రి కేజే జార్జ్ వ్యాఖ్యానించటంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. హోంమంత్రి మీడియాపై నెపం వేసి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విధులు సక్రమంగా నిర్వర్తించటం చేతకాకుంటే పదవి నుంచి తప్పుకోవాలని జార్జ్‌కు సూచించింది. ‘మీడియాపై నిందలేసి ఆయన తప్పించుకోవాలని భావిస్తున్నారు. అసలు రేప్ ఘటనలు వెలుగులోకి రావటానికి చాలావరకు మీడియా కృషే కారణం’ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప గురువారం బెంగళూరులో చెప్పారు. హోంమంత్రి మాటలు ప్రభుత్వ నిస్సహాయతకు నిదర్శనమని య డ్యూరప్ప తెలిపారు. అధికారంలో కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదని ధ్వజమెత్తారు. మీడియాపై బురద చల్లటం సరికాదని మాజీ సీఎం, బీజేపీ నేత జగదీష్ షెట్టర్ సూచించారు. హోంమంత్రి వ్యాఖ్యల గురించి తనకు తెలియదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఎలాంటి సందర్భంలో ఆయన ఈ ప్రకటన చేశారో వివరణ కనుక్కుంటానని చెప్పారు. బెంగళూరు పాఠశాలల్లో ఇటీవల చిన్నారులపై తరచూ లైంగిక దాడుల ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో జార్జ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మీకు ఇలాంటి వార్తలే కావాలి. టీఆర్పీ పెంచుకునేందుకే వీటిని చూపుతున్నారు. మంచి వార్తలు చూపితే బాగుంటుంది’ అని జార్జ్ మీడియాను ఉద్దేశించి బుధవారం పేర్కొన్నారు.