Bigg Boss Telugu 5 Launch Episode TRP Ratings: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ సెప్టెంబర్ 5న ఎంతో ఘనంగా ప్రారంభమైంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున ముచ్చటగా మూడోసారి ఈ షోను నడిపించే బాధ్యతను తన భుజానెత్తుకున్నాడు. బుల్లితెర ప్రేక్షకులకు ఐదు రెట్ల ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తానంటూ మురిపించాడు. అన్నట్లుగానే కంటెస్టెంట్లను ఆడిస్తూ వారి ఎమోషన్స్‌కు పరీక్ష పెడుతూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.
గ్రాండ్‌గా లాంచ్ చేసిన యంగ్ టైగర్
నిజానికి విదేశాల్లో విజయవంతం అయిన బిగ్‌బాస్ షోను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా? లేదా? అని మొదట్లో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బిగ్‌బాస్ తొలి సీజన్‌ను విజయవంతంగా నడిపించి ఆ అనుమానాలను పటాపంచలు చేశాడు. అందుకే అప్పట్లో లాంచ్ ఎపిసోడ్‌కు 16.18 టీఆర్పీ వచ్చింది. నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్‌లో తొలి ఎపిసోడ్‌కు 15.05 టీఆర్పీ వచ్చింది. అయితే మూడో సీజన్‌కు తాను హోస్ట్‌గా వ్యవహరించలేనని నాని చేతులెత్తేయడంతో బిగ్‌బాస్ నిర్వాహకులు కింగ్ నాగార్జునను సంప్రదించారు. ఇందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Thank you all for 5 much Love!!!❤️❤️❤️❤️❤️. You made Starmaa the unbeatable No 1 with BiggBoss Season 5 launch. #BiggBossTelugu5 @starmaa pic.twitter.com/x0iPYwCoUH
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 16, 2021
రికార్డు తిరగరాసిన నాగ్
నాగ్ ఎంతో గ్రాండ్‌గా మొదలు పెట్టిన మూడవ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌కు అనూహ్యంగా 17.92 టీఆర్పీ రేటింగ్ దక్కింది. ఇది బిగ్‌బాస్ షోకు మరింత బూస్ట్‌నిచ్చినట్లైంది. తర్వాత నాగ్ మరోసారి బిగ్‌బాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాలుగో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు ఏకంగా 18.5 టీఆర్పీ వచ్చింది. దీంతో తన రికార్డు తనే బద్ధలు కొట్టాడు నాగ్. ఐదో సీజన్‌తో ఆ రికార్డులు తిరగరాయడం ఖాయం అని అనుకున్నారంతా! కానీ అనూహ్యంగా గత సీజన్ కంటే ఈసారి లాంచ్ ఎపిసోడ్‌కు కాస్త తక్కువ రేటింగ్ నమోదైంది. 18 టీఆర్పీ వచ్చింది! ఈ విషయాన్ని నాగ్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు.
Thank you for the 5-Much Love!! ❤#BiggBossTelugu5 pic.twitter.com/2uhZQ0bb1d
— starmaa (@StarMaa) September 16, 2021
Comments
Please login to add a commentAdd a comment