Jiocinema TRP Ratings Broken During Gill Batting GT Vs MI Q2 - Sakshi
Sakshi News home page

#ShubmanGill: ధోనితో సమానంగా గిల్‌.. రికార్డులు బద్దలు

Published Sat, May 27 2023 5:00 PM | Last Updated on Sat, May 27 2023 6:58 PM

Jio Cinema-TRP Ratings Broken-During Gill Bating GT Vs MI Q2 Beats MSD - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌ వరుసగా రెండో ఏడాది ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌ 62 పరుగుల తేడాతొ విజయాన్ని అందుకుంది. కాగా మాములుగానే ఈ సీజన్‌లో ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌ను కోటికి తగ్గకుండా వీక్షిస్తున్నారు. గడిచిన రెండేళ్లలో నమోదవ్వని టీఆర్‌పీ రేటింగ్‌ ఈసారి నమోదవుతుంది.


Photo: IPL Twitter

ముఖ్యంగా  ఈ సీజన్‌లో సీఎస్‌కే ఆడిన ప్రతీ మ్యాచ్‌కు వ్యూయర్‌షిప్‌ కనీసం రెండుకోట్లు దాటుతుంది. అందునా కేవలం ధోనిని చూడడం కోసమే ఇదంతా. ఇక తెరపై ధోని కనిపిస్తే టీఆర్పీ రేటింగ్స్‌ బద్దలవడం ఖాయం. ఇప్పటివరకు ఈ సీజన్‌లో ధోని బ్యాటింగ్‌ను 2.5 కోట్ల మంది వీక్షించారు. తాజాగా ఆ రికార్డును గిల్‌ సమం చేశాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ బ్యాటింగ్‌ను దాదాపు 2.5 కోట్లకు పైగా వీక్షించడంతో సరికొత్త రికార్డు నమోదయింది.


Photo: IPL Twitter

అతను బ్యాటింగ్‌ చేస్తున్నంతసేపు జియో సినిమా వ్యూయర్‌షిప్‌ 2.5 కోట్లకు తగ్గలేదు. ఇక మ్యాచ్‌లో గిల్‌ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో గిల్‌కు ఇది మూడో సెంచరీ కాగా.. 60 బంతుల్లో 129 పరుగులు చేసిన గిల్‌ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గిల్‌ ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో మూడు సెంచరీలు చేసిన యంగెస్ట్‌ ప్లేయర్‌గా.. టీమిండియా నుంచి రెండో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతకముందు కోహ్లి, బట్లర్‌లు ఒకే సీజన్‌లో నాలుగేసి సెంచరీలు బాది సంయుక్తంగా తొలి స్థానంలో కొనసాగుతున్నారు. 

చదవండి: ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత అరుదైన ఘనత.. ధోని తర్వాత శుభ్‌మన్‌ గిల్‌దే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement