PC: IPL Twitter
ఐపీఎల్-2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిన్న (మే 26) జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ 62 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా ముంబై ఫైనల్‌కు చేరకుండానే ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుభ్‌మన్ గిల్ విధ్వంసకర శతకంతో (60 బంతుల్లో 129; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన ముంబై.. మోహిత్ శర్మ (5/10) ధాటికి 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. సూర్యకుమార్ (38 బంతుల్లో 61), తిలక్ వర్మ (14 బంతుల్లో 43) మెరుపులు వృధా అయ్యాయి.
మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తమ బౌలర్లు అదనంగా 25 పరుగులు సమర్పించుకున్నప్పటికీ.. తమకున్న బ్యాటింగ్ సామర్థ్యం కారణంగా పాజిటివ్‌గానే బరిలోకి దిగామని అన్నాడు. గ్రీన్ (30), సూర్య (61), తిలక్ (43) అద్భుతంగా ఆడినప్పటికీ.. తగినంత భాగస్వామ్యాలు నమోదు చేయలేక, పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడం వల్ల ఓటమిపాలయ్యామని తెలిపాడు. ఛేదనలో సైతం వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటకీ.. తాము స్థాయికి తగ్గ ఆట ఆడలేదని అన్నాడు.
ఇషాన్ కిషన్ గాయం ఊహించనిదని, ఓవరాల్‌గా తాము స్థాయికి తగ్గ ఆట ఆడలేదని తెలిపాడు. శుభ్‌మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అతనిలా మాలో కూడా ఒకరు బ్యాటింగ్ చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని తెలిపాడు. మొత్తంగా గుజరాత్ బాగా ఆడిందని, గెలుపుకు వారు అర్హులని ప్రశంసించాడు. ఈ సీజన్‌లో బ్యాటింగే తమ అతిపెద్ద బలమని, కొందరు యువ ఆటగాళ్లు తదుపరి సీజన్‌లో స్టార్లుగా మారతారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ సీజన్‌లో అన్ని బౌలింగ్ జట్లకు సవాలు ఎదురైందని, గత మ్యాచ్‌లో ఏం జరిగిందో చూస్తే, మా బౌలర్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని అన్నాడు. ఓవరాల్‌గా శుభ్‌మన్‌కు క్రెడిట్ ఇవ్వాలని, టీమ్‌గా గుజరాత్ అద్భుతంగా ఆడిందని ప్రశంసించాడు.
చదవండి: గిల్ ప్రపంచ క్రికెట్‌ను ఏలుతాడు.. నేను ఆధారపడేది రషీద్‌పైనే: హార్ధిక్ పాండ్యా
Comments
Please login to add a commentAdd a comment