Picture of Shubman Gill Intense-Talk-With Sachin Tendulkar Viral GT Vs MI Q2 - Sakshi
Sakshi News home page

#Sachin-Gill: సచిన్‌తో గిల్‌ ముచ్చట.. పండగ చేసుకున్న గాసిప్‌ రాయుళ్లు

Published Sat, May 27 2023 5:56 PM | Last Updated on Sat, May 27 2023 6:46 PM

Picture-Shubman Gill Intense-Talk-With Sachin Tendulkar Viral GT Vs MI Q2 - Sakshi

Photo: IPL Twitter

శుబ్‌మన్‌ గిల్‌.. ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే పేరు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో వరుస శతకాలతో విజృంభిస్తోన్న గిల్‌ గుజరాత్‌ టైటాన్స్‌ వరుసగా రెండోసారి ఫైనల్‌ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. కీలక మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన గిల్‌కు సీజన్‌లో ఇది మూడో శతకం కావడం విశేషం. 60 బంతుల్లో 129 పరుగులు చేసిన గిల్‌ ఐపీఎల్‌లో ప్లేఆఫ్‌లో అత్యధిక స్కోరు చేసిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇక మ్యాచ్‌ ముగిసిన అనంతరం టీమిండియా క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌తో శుబ్‌మన్‌ గిల్‌ ముచ్చటించాడు. 

గిల్‌ ఇన్నింగ్స్‌కు ముగ్దుడైన సచిన్‌ అతన్ని ప్రత్యేకంగా పిలిపించుకొని అభినందించాడు. రోజురోజుకు మరింత రాటుదేలుతున్న గిల్‌ మెరుగైన బ్యాటింగ్‌ కోసం సచిన్‌ సలహాలు తీసుకున్నట్లు తెలిసింది. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకోవడం కెమెరాలకు చిక్కింది. దీంతో గాసిప్‌ రాయుళ్లు రంగంలోకి దిగారు.

సచిన్‌ కూతురు సారా టెండూల్కర్‌తో గిల్‌ ప్రేమాయణం నడుపుతున్నట్లు పుకార్లు వస్తున్న నేపథ్యంలో సచిన్‌, గిల్‌ ముచ్చటపై గాసిప్‌ రాయుళ్లు తమకు తోచిన విధంగా కామెంట్‌ చేశారు. ''ఇది ఒక ఫ్యామిలీ మూమెంట్‌'' అని కొందరు పేర్కొంటే.. ''అల్లుడు ఇన్నింగ్స్‌ చూసి మామ గర్వపడుతున్నాడు... అందుకే పిలిపించుకొని మరీ అభినందిస్తున్నాడు.'' అంటూ కామెంట్‌ చేశారు. కాగా గిల్‌- సచిన్‌ ముచ్చటిస్తున్న ఫోటో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కానీ శుబ్‌మన్‌ గిల్‌ మాత్రం ఎప్పటిలాగే ఇలాంటి చెత్త రూమర్లకు స్పందించకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అటు సచిన్‌ కూడా గాసిప్‌ రాయుళ్ల విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని అర్థమవుతుంది.

చదవండి: ధోనితో సమానంగా గిల్‌.. రికార్డులు బద్దలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement