viral photo
-
Viral: నారీశక్తి.. చంటిబిడ్డతో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
నాణేనికి రెండు వైపుల మాదిరే.. సోషల్ మీడియాలో రెండు పార్శ్వాలు ఉంటాయి. మంచిని ఎక్కువగా చర్చించినప్పుడు మధ్యలో చెడును.. అలాగే చెడుపై ఎక్కువగా చర్చ జరిగినప్పుడు మధ్యలో మంచి ప్రస్తావననూ తెస్తుంటుంది. అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఓ అమ్మ విషయంలోనూ ఇదే జరుగుతోంది ఇప్పుడు.ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటన జరిగిన మరుసటి రోజు.. అక్కడ ఓ మహిళా కానిస్టేబుల్ విధుల్లో ఉంది. ఆ టైంలో ఆమె తన చంటిబిడ్డతో కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో.. అందంగా ఎడిట్ చేసిన ఆమె ఫొటో సైతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. చాలామంది అమ్మ గొప్పతనమంటూ ఆ ఫొటోలు స్టేటస్‌గా పెట్టుకున్నారు కూడా. మరోవైపు..This picture is representative of what Bharat truly is - young, responsible and hardworking. Balancing family and work. Instilling same values to the next generation. While we celebrate rich celebrities as icons, we tend to forget the real women of Bharat - young mothers who… pic.twitter.com/uZSCpTPIzm— Tejasvi Surya (@Tejasvi_Surya) February 17, 2025రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం ఈ ఫొటోకు స్పందించారు. నిజమైన భారత్ ఇదేనని, నారీ శక్తికి ఆమె ప్రతిరూపమంటూ కొనియాడారు. RPF ఇండియా కూడా ఎక్స్ అకౌంట్లో ఆ వీడియోను పోస్ట్ చేసింది. తన విధులతో పాటు తల్లిగా బాధ్యతను విస్మరించని కానిస్టేబుల్ రీనా గొప్ప యోధురాలు అంటూ గర్వంగా ప్రకటించుకుంది. అదే సమయంలో విమర్శలు మొదలయ్యాయి.She serves, she nurtures, she does it all—A mother, a warrior, standing tall…Constable Reena from 16BN/RPSF performing her duties while carrying her child, representing the countless mothers who balance the call of duty with motherhood every day.#NariShakti #HeroesInUniform… pic.twitter.com/enzaw0iDYo— RPF INDIA (@RPF_INDIA) February 17, 2025ప్రముఖ నగరాల్లో రైల్వేస్టేషన్లలో ఏమేరు రద్దీ ఉంటుందో చూస్తున్నదే. అలాగే ఈ మధ్య అయితే తోపులాట, తొక్కిసలాట ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వారిని నియంత్రించాల్సిన బాధ్యత.. ఇలాంటి కానిస్టేబుళ్లకే ఉంటుంది. అలాంటప్పుడు ఆమె అలా తన బిడ్డ ప్రాణాలు పణంగా పెట్టి మరీ విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే.. బిడ్డల సంరక్షణ కోసం ఆర్పీఎఫ్ స్టేషన్లలో ఉండే సదుపాయాల్ని ఆమె వినియోగించుకోవాల్సిందని సూచిస్తున్నారు. మరోవైపు.. నారీశక్తి అని పిలడడంపైనా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా బిడ్డతో విధులకు హాజరుకావడాన్ని అన్యాయంగా అభివర్ణిస్తున్నారు. అధికారులైనా ఈ విషయంలో చొరవ చూపాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. ఇక.. బిడ్డ పెంపకం విషయంలోనూ ఆమెకు ఉన్న ఇబ్బందుల గురించీ, ఆమెపై ఉన్న బాధ్యతల గురించీ కొందరు ప్రస్తావిస్తున్నారు.Quit romanticising women doing it all by themselves. She should have help raising her baby when she's on duty, she absolutely doesn't need to do this alone, she's doing it because she has no choice, because men barely help with raising a child. Call it what it is: she's solidly… pic.twitter.com/G7M6LGXdOM— Dr. Ruchika Sharma (@tishasaroyan) February 17, 2025అదే సమయంలో.. ఆమెకు ఉన్న సవాళ్లను ప్రస్తావిస్తూ కొందరు పోస్టులు పెడుతుండడం గమనార్హం. అయినా సరే మహిళలు ఎక్కడా వెనుకడుగేయకుండా, ఆ సవాళ్లను లెక్కచేయకుండా ఈ పోటీ ప్రపంచంతో పోటీపడుతుండటం.. అన్నింటికి మించి అటు అమ్మగా, ఇటు ఆర్పీఫ్ కానిస్టేబుల్‌గా మెప్పించడం గొప్ప విషయమని వాదిస్తున్నారు. -
మెహిందీ ఫంక్షన్‌కి, పర్ఫెక్ట్ మ్యాచ్ మస్టర్డ్ ఎల్లో ఘరారా (ఫోటోలు)
-
ప్రధాని మోదీ పక్కన ‘లేడీ ఎస్పీజీ’ వైరల్ : తప్పులో కాలేసిన కంగనా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పక్కన ఉన్న మహిళా కమాండో ఫోటో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో లేడీ ఎస్పీజీ అంటూ ఈ ఫోటోను షేర్ చేయడం మరింత చర్చకు దారి తీసింది. ప్రధాని భద్రతా విభాగం ఎస్పీజీలోకి కొత్తగా మహిళా కమాండో చేరిందంటూ సందడి మొదలైంది. అసలు సంగతి ఏంటంటే..బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పార్లమెంట్ వద్ద నరేంద్రమోదీతో పక్కన బ్లాక్ డ్రెస్‌లో నడుస్తున్న ఒక ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పోస్ట్ చేశారు. దీంతో ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఎస్పీజీ అంటూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై భద్రతా వర్గాలు స్పందించాయి. కొన్ని మహిళా ఎస్పీజీ కమాండోలు 'క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్'లో సభ్యులుగా ఉన్నారని వెల్లడించాయి. అలాగే ఆ ఫోటోలో కనిపించిన మహిళ ఎస్పీజీ బృందంలో భాగమని అనుకోవడం తప్పు అని కూడా భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేటాయించిన వ్యక్తిగత భద్రతా అధికారి అని వెల్లడించాయి. అయితే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్న ఈ అధికారి పేరు లేదా ఇతర వివరాలు మాత్రం వెల్లడించలేదు.కాగా భారత ప్రధానమంత్రి, మాజీ ప్రధాన మంత్రులు, వారి కుటుంబాలకు భద్రత కల్పించేందుకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ 1985లో ఏర్పాటైంది. ఇది అత్యున్నత ప్రొఫెషనల్ భద్రతా సంస్థ. -
హడలెత్తిస్తున్న ఇంటి అద్దె!.. నెలకు ఇన్ని లక్షలా..
భారతదేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా పుంజుకుంటోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో భూములు, అపార్ట్మెంట్ల ధరలు భారీగా ఉన్నాయి. అపార్ట్మెంట్స్ అద్దెలు కూడా ఈ నగరాల్లో అమాంతం పెరిగిపోతున్నాయి. ఇటీవల దీనికి సంబందించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జైపూర్‌కు చెందిన ఉత్కర్ష్ గుప్తా.. తన ఎక్స్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ముంబైలో మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఇందులో 2 బీహెచ్‌కే హౌస్ అద్దె నెలకు రూ.1.35 లక్షలు. దీనికోసం రూ.400000 డిపాజిట్ చేయాలి అని ఉండటం చూడవచ్చు. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే.. వాషింగ్ మెషీన్ టాయిలెట్ గదిలోనే ఉండటం చూడవచ్చు.ఇదీ చదవండి: దేశంలోనే పెద్ద కరెన్సీ నోటు.. ఎందుకు రద్దు చేశారంటే?ప్రస్తుతం ఈ పోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు ఇది బ్రిలియంట్ ఐడియా అని చెబుతుంటే.. మరొకరు ఇది బాత్రూమేనా అని అంటున్నారు. మరికొందరు దాని అద్దె కూడా చాలా ఎక్కువని చెబుతున్నారు. మొత్తానికి దీన్ని చూస్తే ముంబైలో అద్దెలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.Only in Mumbai, you can front load your washing machine while top loading your commode.At an affordable price of 1.35L per month! pic.twitter.com/texU5hUwMC— Utkarsh Gupta (@PaneerMakkhani) September 22, 2024 -
ఇటలీ ప్రధానితో డేటింగ్? స్పందించిన మస్క్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇటీవల వీరు ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. ఇద్దరు వారు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటున్న ఫొటోలు చక్కర్లు కొడుతుండటంతో నెట్టింట్లో రూమర్లు గుప్పుమన్నాయి. ఇద్దరూ డేటింగ్లో ఉన్నట్లు పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఓ నెటిజన్ స్పందిస్తూ ‘వీరు డేట్‌కు వెళ్తారని అనుకుంటున్నారా?’ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో మస్క్ తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. తమ మధ్య డేటింగ్ జరగడం లేదంటూ ఆయన పోస్టు చేశారు.Do you think They’ll date? 🤣 pic.twitter.com/XXs1U45kjb— Tesla Owners Silicon Valley (@teslaownersSV) September 24, 2024కాగా మంగళవారం న్యూయార్క్‌లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో.. అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డును మస్క్ మెలోనీకి అందజేశారు. మస్క్ ఆమెకు పురస్కారాన్ని అందజేస్తూ ప్రశంసలతో ముంచెత్తారు. ఇటలీ ప్రధానికి అవార్డును అందజేయడం గర్వంగా భావిస్తున్నట్లు మస్క్ అన్నారు. కనిపించే అందం కన్నా..ఆమె మనసు మరింత అందమైందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నాయకుల గురించి కొన్ని పదాలను ఎప్పుడూ చెప్పలేం. కానీ, మెలోనీ అలా కాదని, ఆమె నిజాయతీ గల విశ్వసనీయమైన వ్యక్తిగా ప్రశంసించారు. -
బాలీవుడ్ నటీ షబానా అజ్మీ ఇష్టపడే ఫుడ్స్ ఇవే..!
అంతర్జాతీయ గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి, భారత పార్లమెంటు సభ్యురాలు షబానా అజ్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె నటిగా ప్రేక్షకులను మెప్పించి ఎన్నో అవార్డులు అందుకుంది. పైగా యూఎస్ గుడ్‌విల్ అంబాసిడర్ కూడా. ఎప్పటికప్పుడూ తనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో షేర్ చేసుకుంటారు. అలానే తాజాగా తన ఫుడ్ ట్రిప్‌కి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. అంతేగాదు అక్కడ ఒక చోటే బ్రేక్ తీసుకుని మరీ ఇష్టంగా తిన్న తన ఫేవరెట్ ఫుడ్ గురించి కూడా చెప్పుకొచ్చారు. తాను పూణే నుంచి తిరుగు పయనంలో ఓ ప్రముఖ ఫుడ్ కోర్టు వద్ద ఆగమని, అక్కడ తాను తనకెంతో ఇష్టమైన వడపావ్ ఆస్వాదించనట్లు చెప్పుకొచ్చారు. అలాగే అక్కడ మహారాష్ట్ర వంటకాలు కూడా చాలా బాగుంటాయని తెలిపారు. ఆమె నటించిన 'కైఫీ ఔర్ మెయిన్' తారాగణంతో కలసి ఫోటోలకు ఫోజులిచ్చారు షబానా అజ్మీ. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Shabana Azmi (@azmishabana18) (చదవండి: మహిళలు తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!) -
పీవీ సింధు ఒలింపిక్ చీరపై దుమారం
అట్టహాసంగా ప్రారంభమైన ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫ్లాగ్ బేరర్‌గా అరుదైన గౌరవాన్ని సాధించింది. మువ్వన్నెల చీరలో భారత పతాకాన్ని చేబూని భారత అథ్లెట్ల బృందానికి సారథ్యం వహించింది. దీనికి సంబందించిన ఫోటోలను పీవీ సింధు సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన జీవితంలో ఇంతకంటే గొప్ప గౌరవం మరేదీ ఉండదంటూ తన ఆనందాన్ని ప్రకటించింది.Hello Tarun Tahiliani!I have seen better Sarees sold in Mumbai streets for Rs.200 than these ceremonial uniforms you’ve ‘designed’.Cheap polyester like fabric, Ikat PRINT (!!!), tricolors thrown together with no imagination Did you outsource it to an intern or come up with it… https://t.co/aVkXGmg80K— Dr Nandita Iyer (@saffrontrail) July 27, 2024భారతీయ ఒలింపిక్ యూనిఫాంపై దుమారంఅయితే అంతర్జాతీయ క్రీడా వేదికపై పీవీ సింధు కట్టుకున్న చీరపై దుమారం రేగింది. తరుణ తహిలియానీ డిజైన్ చేసిన దుస్తులు చాలా పేలవంగా ఉన్నాయంటూ బెంగళూరుకు చెందిన రచయిత డాక్టర్ నందితా అయ్యర్ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. మీరు ‘డిజైన్ చేసిన’ ఈ యూనిఫామ్‌ల కంటే మెరుగైన చీరలు రూ.200లకు ముంబై వీధుల్లో అమ్మడం నేను చూశాను. చౌకైన పాలిస్టర్ వస్త్రంతో, ఇకత్ ప్రింట్((!!!) త్రివర్ణమనే ఊహకు అందకుండా గజిబిజిగా అద్దిన రంగులతో అధ్వాన్నంగా ఉందంటూ విమర్శించారు. అంతేకాదు ఇంటర్న్‌కి అవుట్సోర్స్ చేశారా? లేక ఆఖరి 3 నిమిఫాల్లో హడావిడిగా డిజైన్ చేశారా? అంటూ ఆమె మండి పడ్డారు. భారతదేశ సుసంపన్నమైన నేత సంస్కృతికి, చరిత్రకు ఇది అవమానం అటూ నందితా అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు ఈ డిజైనర్ దుస్తులను ధరించిన క్రీడాకారిణి పట్ల అగౌరవం కాదని కూడా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో భారతీయ ఒలింపిక్ యూనిఫాంపై ఎన్ఐఎఫ్టీ బెంగళూరు మాజీ డైరెక్టర్ సుసాన్ థామస్ (అఫ్సర్నామా) ఇన్‌స్టాగ్రామ్‌లో దృక్కోణాన్ని కూడా ప్రస్తావించారు. కాగా ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారిగా ఫ్యాషన్ రాజధాని పారిస్‌లో, నదిలో జరిగిన సంబరాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ శరత్ కమల్ భారతీయ జెండా బేరర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బాక్ సహా దిగ్గజ అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారు.TEAM INDIA IS HERE TO WIN 🇮🇳🫶💙#OpeningCeremony #Paris2024 #Olympic2024 #Paris #ParisOlympics #ParisOlympics2024 #paris2024olympics #Olympics #Olympics2024Paris #OlympicGames pic.twitter.com/7ELyTEFpMV— Ankit Avasthi Sir 🇮🇳 (@ankitavasthi01) July 27, 2024ప్రారంభ వేడుక కోసం ప్రఖ్యాత డిజైనర్ తరుణ్ తహిలియాని భారతీయ అథ్లెట్ల కోసం ప్రపంచ వేదికపై భారతీయ వారసత్వాన్ని హైలైట్ చేసే అసాధారణమైన దుస్తులను రూపొందించారు. పురుష అథ్లెట్లు తెల్లటి కుర్తా , నారింజ , ఆకుపచ్చ నక్సీ వర్క్‌తో అలంకరించబడిన బూండీ జాకెట్ ధరించగా. ఈ జాకెట్లపై 'ఇండియా' ఇన్ స్రిప్ట్, ఒలింపిక్ లోగో ఉన్న పాకెట్స్ కూడా ఉన్నాయి. మహిళలకు మూడు రంగుల మేళవింపుతో చీర, జాకెట్టును డిజైన్ చేశారు. -
హృదయ విదారకం.. ఆ తల్లికి పురిటినొప్పి బాధల్లేవ్!
ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి.. పురిటినొప్పులు పడని స్థితిలో ఉన్న తన తల్లి గర్భం చీల్చుకుని బయటకు వచ్చాడు. ఎందుకంటే.. అప్పటికే ఆమె ఊపిరి ఆగిపోయింది కాబట్టి. ఇదొక్క సంఘటనే కాదు.. 9 నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇలాంటి విషాదకర దృశ్యాలెన్నో. హమాస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ తాజాగా గాజాలో ఓ ఆస్పత్రిపై దాడులు జరిపింది. అక్కడ ప్రసవానికి సిద్ధంగా ఉన్న నిండు గర్భిణీ అయిన ఒలా అద్నన్ హర్బ్ అల్ కుర్ద్ తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా.. దారిలోనే ఆమె కన్నుమూసింది. అయితే.. https://t.co/LpqLJTuEpp #unido #hostages #ceasefire Gaza hospital says newborn saved from dead mother's wombHe was placed in an incubator and transferred to Al-Aqsa Hospital in Deir el-Balah.— chemTrailActivist (@chemTrailActivi) July 20, 2024వైద్యులకు ఆల్ట్రాసౌండ్లో కడుపులోని బిడ్డ గుండె చప్పుడు వినిపించింది. దీంతో.. అత్యవసరంగా ఆపరేషన్ చేసి ఆ బిడ్డను బయటకు తీశారు. ఆ బిడ్డ బతకదని వైద్యులు తొలుత భావించారట. ఇంక్యూబేటర్లో పెట్టి డీర్ ఎల్-బలాహ్లోని మరో ఆస్పత్రికి తరలించారట. కానీ, ఏదో అద్భుతం జరిగినట్లు కోలుకుంటున్నాడని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా కోలుకున్నాక వలంటీర్లకు ఆ బిడ్డను అప్పజెప్తామని తెలిపారు వాళ్లు. యుద్ధం ఎంత వినాశకరమో, దాని పరిణామాలెంత భయంకరంగా ఉంటాయో చెప్పడానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ హృదయ విదారక సంఘటనే నిదర్శనం. -
ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్.. ఫొటో వైరల్..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడిపారు. ఓమ్నీ వ్యాన్ స్టీరింగ్‌ను తన చేతుల్లోకి తీసుకుని కేసీఆర్ డ్రైవింగ్ చేసి అందరినీ అశ్చర్యపరిచారు. కేసీఆర్ డ్రైవింగ్ చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వ్యాన్‌ను స్వయంగా కేసీఆరే నడపటం వెనుక కథ వేరే ఉంది.కాగా గతేడాది డిసెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి కేసీఆర్ కాలు జారిపడ్డ సంగతి తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యులు కేసీఆర్‌ను సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా కేసీఆర్ నడుస్తున్నారు. అయితే మ్యానువల్ కారు నడిపి చూడమని డాక్టర్లు సూచించడంతో తన పాత ఓమ్నీ వ్యాన్‌ను కేసీఆర్ గురువారం నడిపారు.కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడుపుతూ ఎర్రవల్లి పొరుగు గ్రామాలను సందర్శించారు. రోడ్లపై కనబడిన వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ తన వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. కేసీఆర్ పలుకరింపుతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. -
Viral Photo: స్టూడెంట్ రాక్, టీచర్ షాక్.. గుండె నిండా అమ్మాయిలే
ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు చిటికెలో అందరికీ తెలిసిపోతున్నాయి. టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, కామెడీ, ఫన్నీ విషయాలు ఎప్పటికప్పుడుసామాజిక మాధ్యామాల్లో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ విద్యార్ధి పరీక్షలో రాసిన సమాధానం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.పరీక్షల్లో అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియని సమయంలో చాలా మంది విద్యార్ధులు సినిమా పాటలు, సంబంధం లేని కథలు రాస్తుంటారు. అయితే ఓ ఓ విద్యార్థి పరీక్షలో రాసిన జవాబును చూసి టీచర్ షాక్ అయ్యారు. గుండె బొమ్మ వేసి, దాని పనితీరును రాయమని అడిగిన ప్రశ్నకు ఆ విద్యార్థి గుండె బొమ్మను సరిగానే వేశాడు కానీ.. కాని అందులోని నాలుగు గదులను వివరించే బదులు వాటిని ఐదుగురు అమ్మాయిలకు అంకితం చేశాడు.గుండెలోని భాగాల పేర్లకు బదులుగా నాలుగు గదుల్లో హరిత, ప్రియ, పూజ, రూప, నమిత అంటూ పేర్లు రాశాడు.. అంతేకాదు గుండె పనితీరు స్థానంలో ఆ అమ్మాయిలు అతనికి ఏ విధంగా సంబంధమో వివరించాడు.ప్రియ తనతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేస్తుందని, ఆమెను ఇష్టపడుతున్నాడని రాశాడు. ఇక రూప అందంగా క్యూట్‌గా ఉంటుందని, స్నాప్‌చాట్‌లో తనతో టచ్‌లో ఉంటుందని పేర్కొన్నాడు. పక్కింట్లో ఉండే నమిత పొడవాటి జుట్టు, పెద్దపెద్ద కళ్లతో తనను ఆకర్షిస్తుందని తెలిపాడు. పూజ తన మాజీ ప్రేమికురాలని, ఆమెను ఎప్పటికీ మరచిపోలేనని కన్నీరు కారుస్తున్న ఎమోజీని జత చేశాడు. చివరిగా హరిత తన క్లాస్మేట్ అని పేర్కొన్నాడు.ఆ సమాధానం చదివిన టీచర్ జవాబును కొట్టివేసి గుండె బొమ్మకు మాత్రం మార్కులు వేశారు. అతడి తల్లిదండ్రులను స్కూల్‌కు తీసుకురావాల్సిందిగా ఆ విద్యార్థిని ఆదేశించారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఇది ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు,విద్యార్థి రాసిన జవాబును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. . ‘స్టూడెంట్ రాక్.. టీచర్ షాక్’ అంటూ ఓ నెటిజన్ కామెంట చేయగా... ‘గుండె బొమ్మను బాగా గీసినందుకు మరో రెండు మార్కులు ఇచ్చి ఉండొచ్చు కదా’ అంటూ మరో నెటిజన్ స్పందించారు. -
అవును నిజమే.. నేను కూడా!: రోహిత్ శర్మతో గిల్.. పోస్ట్ వైరల్
టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్.. కెప్టెన్ రోహిత్ శర్మతో తనకు ఉన్న అనుబంధాన్ని చాటుకున్నాడు. ఓ అందమైన ఫొటోతో తమ గురించి వస్తున్న రూమర్లకు చెక్ పెట్టాడు.కాగా ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శుబ్‌మన్ గిల్.. బ్యాటర్‌గానూ ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన పన్నెండు మ్యాచ్‌లలో కలిపి 426 పరుగులు చేయగలిగాడు.ఇక గిల్ సారథ్యంలో కేవలం ఐదు మ్యాచ్‌లే గెలిచిన గుజరాత్ ఎనిమిదో స్థానంలో నిలిచి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు.. ఓపెనర్‌గానూ విఫలం కావడంతో శుబ్‌మన్ గిల్‌పై ఐపీఎల్-2024 ప్రభావం గట్టిగానే పడింది.టీ20 ప్రపంచకప్-2024 ఈవెంట్‌కు ఎంపిక చేసిన భారత ప్రధాన జట్టులో గిల్‌కు చోటు దక్కలేదు. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి బరిలోకి దిగగా.. బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ స్థానం సంపాదించాడు.దీంతో ఓపెనింగ్ బ్యాటర్ గిల్‌కు కేవలం రిజర్వ్ ప్లేయర్‌గా అవకాశం దక్కింది. ఈ క్రమంలో లీగ్ దశలో అమెరికాలో మ్యాచ్‌లు పూర్తైన అనంతరం.. ఆవేశ్ ఖాన్(పేసర్)తో పాటు గిల్‌ను రిలీజ్ చేసింది బీసీసీఐ.అయితే, ఇందుకు శుబ్‌మన్ గిల్ క్రమశిక్షణా రాహిత్యమే కారణమని.. రోహిత్‌తో విభేదాల నేపథ్యంలో ఇన్‌స్టాలో కెప్టెన్‌ను అన్‌ఫాలో చేశాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంపై ఇప్పటికే భారత బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్ క్లారిటీ ఇవ్వగా.. గిల్ సైతం స్పందించాడు.అవును నిజమే.. సామీతో పాటు నేను కూడారోహిత్ శర్మతో కలిసి ఆత్మీయంగా దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘సామీ(సమైరా), నేను.. క్రమశిక్షణగా ఎలా ఉండన్న అంశం గురించి రోహిత్ శర్మ నుంచి నేర్చుకుంటున్నాం’’ అని క్యాప్షన్ జతచేశాడు. ఇందులో రోహిత్ తన ముద్దుల కుమార్తె సమైరా శర్మను ఎత్తుకుని ఉన్నాడు. ఇలా ఒక్క ఫొటోతో వదంతులకు బ్రేక్ వేశాడు గిల్.ఇక వరల్డ్‌కప్-2024లో ఇప్పటికే సూపర్-8లో అడుగుపెట్టిన టీమిండియా.. తదుపరి మ్యాచ్‌లన్నీ వెస్టిండీస్‌లో ఆడనుంది. కాగా భారత్, పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్, అమెరికా గ్రూప్-ఏలో ఉండగా.. ఈ గ్రూపు నుంచి భారత్, అమెరికా సూపర్-8కు అర్హత సాధించాయి. మిగతా మూడు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.చదవండి: Saurabh Netravalkar: నేత్రావల్కర్ భార్య: తెలుగు మూలాలున్న అమ్మాయి! బ్యాగ్రౌండ్ ఇదే -
కేన్స్ రెడ్ కార్పెట్‌పై సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్న నటి!
ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకకు వివిధ సెలబ్రెటీలు, ప్రముఖులు విచ్చేసి రెడ్ కార్పెట్‌పై వివిధ రకాల గౌనులు, డిజైనర్‌వేర్‌లతో మెరిశారు. అయితే అస్సాంకి చెందిన ప్రఖ్యాత నటి ఐమీ బారుహ్ మాత్రం ఈ ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వించేలా చేసింది. దేశీ సంప్రదాయ చీర కట్టులో తళ్లుక్కుమని భారతీయలు ఆత్మగౌరవమే ఈ చీరకట్టు అని చాటి చెప్పింది. ఐమీ బారుహ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సాంప్రదాయ అస్సామీ దుస్తులు ధరించి రెడ్‌కార్పెట్‌పై వయ్యారంగా నడిచి వచ్చింది. ఆమె అస్సామీ సంప్రదాయ చీట్టు స్టైల్ చూపురులను చూపుతిప్పుకోనివ్వలేదు. అక్కడున్నవారంతా సంప్రదాయ అస్సామీ సంస్కృతికి కనెక్ట్ అయ్యేలా ఐమీ బారుహ్ ఆహార్యం ఉంది. ఆ చీర అహోం రాజవంశ కాలం నాటి ముగాట్టు. దానిపై పురాతన గోజ్ బోటా డిజైన్ నాటి సంస్కృతిని అద్దం పట్టేలా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.అలాగే ఐమీ చేతికి ధరించిన గమ్ఖరు అనేది అస్సాం శ్రేయస్సు, రక్షణకు సాంప్రదాయ చిహ్నం. ఐమీ ఈ వేడుకలో అస్సాం చేనేత పరిశ్రమ కళాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ చీర పత్తి, గుణ నూలు మిశ్రమంతో తయారైన ఐదు వేర్వేరు రంగుల దారాలతో రూపొందించారు. ఈ మేరకు ఐమీ సోషల్ మీడియా పోస్ట్‌లో.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐకానిక్ రెడ్ కార్పెట్‌పై మూడవసారి అడుగుపెడుతున్నందుకు గర్వంగా భావిస్తున్నాను.ఒక అస్సామిగా గుర్తింపు, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా మా వారసత్వాన్ని సూచించే రెండు వందల ఏళ్లనాటి సంప్రదాయ డిజైన్‌తో కూడిన చేనేత చీర, మణికట్టుపై గమ్ఖారు ధరించి ర్యాంప్‌పై నడవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మీ అందరి ఆదరాభిమానాలకు ధన్యావాదాలు అని రాసుకొచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.(చదవండి: అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?) -
హిమ శిఖరాల్లో పెళ్లి సందడి!..వణికించే చలిలో ఫోజులిస్తున్న జంట!
జీవితంలో ఒక్కసారి జరిగే మధురమైన ఘట్టం 'పెళ్లి'. అది తమ జీవితంలో మరుపురాని గుర్తులా ఉండేలా గ్రాండ్‌గా చేసుకోవాలనుకుంటోంది యువత. అందుకోసం తమ తాహతకు తగ్గా రేంజ్లో డీజే మ్యూజిక్‌లు లేదా అందమైన టూరిస్ట్ ప్రదేశాల్లోనూ చేసుకుంటారు. విభిన్నంగా ఉండాలని ఆరాటపడుతుంటారు. అలానే ఇక్కడొక జంట ఏకంగా ఎముకలు కొరికే మంచు శిఖరాల్లో పెళ్లి జరగాలనుకుంది. అందుకని ఎక్కడకు వెళ్లారంటే..ఈ జంట ఏకంగా స్విట్జర్లాండ్‌లో జెర్మాట్‌లోని ఆల్ఫైన్ శిఖరాల వద్ద గ్రాండ్‌గా వివాహ వేడుకను జరుపుకుంది. బంధువుల, స్నేహితు ఆశ్వీరాదల నడుమ ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యింది. గజగజ వణికించే చలిలో చక్కటి వయోలిన్ మ్యూజిక్, ఆ చుట్టూ ఉన్న వాతావరణానికి తగ్గట్లు మిల్కీ వైట్ పెళ్లి దుస్తులతో పైనుంచి భువిపైకి వచ్చిన దేవతాల్లా ఉన్నారు. అక్కడొక పెద్ద మంచు క్యూబ్ సెట్టింగ్‌లో వధువరులిద్దరు చక్కగా కెమరాలకు ఫోజలిలస్తూ నిలబడ్డారు. మంచు శిఖరాలే తమ పెళ్లికి సాక్ష్యంగా.. ఏకంగా రెండు వేలకు పైగా ఎత్తులో ఈ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. చుట్టూ ఉన్న తెల్లటి మంచుకి తగ్గట్టూ పూల డెకరేషన్ ఓ రేంజ్లో అదరహో అన్నంతగా అద్భుతంగా ఉంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఈ వెడ్డింగ్ అడ్వెంచర్ అదిరిపోయింది బాస్, నిజజీవితంలో ఇలా మంచులో పెళ్లి చేసుకునే జంటను చూస్తానని అనుకోలేదంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by LEBANESE WEDDINGS (@lebaneseweddings) (చదవండి: ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్టరీనే!) -
RCB Vs PBKS: సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం నాటి మ్యాచ్‌లో ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో పంజాబ్ అభిమానులతో పాటు ఆ జట్టు మేనేజ్మెంట్కు సైతం భంగపాటు తప్పలేదు. అయితే, జట్టు పరాభవం నేపథ్యంలోనూ పంజాబ్ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా వ్యవహరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.కోహ్లి వికెట్ పడగానే కాగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను ఆర్సీబీ 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక ఈ విజయంలో విరాట్ కోహ్లిదే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 7 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేశాడు.Going..Going..GONE!Virat Kohli clobbers that delivery into the stands in grand fashion! 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/Y5eVp7Q6fN— IndianPremierLeague (@IPL) May 9, 2024అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రిలీ రొసోవ్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఈ ఆర్సీబీ ఓపెనర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా చప్పట్లు కొడుతూ కోహ్లి వికెట్‌ను సెలబ్రేట్ చేసుకుంది. అయితే, ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు.The Punjab Kings bounce back with crucial breakthroughs, especially the big one of Virat Kohli 👏👏#RCB 238/5 with 5 deliveries leftWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/9mu2bMjrWV— IndianPremierLeague (@IPL) May 9, 2024లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లంతా విఫలం కావడంతో ఆ జట్టుకు పరాజయమే ఎదురైంది. ఈ నేపథ్యంలో నిరాశకు లోనైనా ప్రీతి జింటా హుందాగా వ్యవహరించింది.సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్‌ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న సమయంలో.. మ్యాచ్‌ను తాము లాగేసుకున్నందుకు ప్రీతి జింటాకు సారీ చెప్పాడు. ఇందుకు బదులుగా కోహ్లితో కరచాలనం చేస్తూ... ‘‘మరేం పర్లేదు’’ అన్నట్లుగా నవ్వులు చిందించిందామె.ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకాను ప్రీతి జింటాతో పోలుస్తూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. సంజీవ్ గోయెంకాకు చురకలుమ్యాచ్ ఓడటమే కాదు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినా ప్రీతి ఆ బాధ బయటకు తెలియకుండా నవ్వుతూ కవర్ చేసిందని.. ఆమెను చూసి గోయెంకా చాలా నేర్చుకోవాలని చురకలు అంటిస్తున్నారు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఓటమి నేపథ్యంలో ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు బహిరంగంగానే చీవాట్లు పెట్టిన విషయం తెలిసిందే. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్Preity Zinta with Virat Kohli at the post match presentation ceremony. ❤️ pic.twitter.com/z1G2L1IIr8— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2024Virat Kohli said Sorry to Preity Zinta when he met with her in post match award presentation & Preity Zinta smiles.- King Kohli winning the hearts of everyone, He's a pure soul. ❤️🐐 pic.twitter.com/2h2JFnZsyz— Tanuj Singh (@ImTanujSingh) May 10, 2024 -
మనవరాలితో అదానీ మురిపెం : బిలియనీర్ ఫోటో వైరల్
అసలు కంటే వడ్డీ ముద్దు అనేది నానుడి. అంటే బిడ్డలతో పోలిస్తే మనవలు మనవరాళ్లపైనే తల్లితండ్రులకు ఎక్కువప్రేమ అభిమానం ఉంటుంది అని. చాలా సందర్బాల్లో ఇది అక్షరాలా అనిపిస్తుంది. ఇందులో బడా పారిశ్రామికవేత్తలైనా, సెలబ్రిటీలైనా ఎవ్వరూ అతీతులు కారు. తాజాగా బిలియనీర్, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ తన ముద్దుల మనవరాలిని చూసి తెగమురిసిపోతున్నారు. నీ కళ్లలోని మెరుపుతో పోలిస్తే ఈ ప్రపంచంలోని సంపద అంతా దిగ దుడుపే అన్నట్టు రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరలవుతోంది. 14 నెలల మనవరాలు కావేరిని ఎత్తుకున్న ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు. ప్రపంచంలో ఇంతకుమించిన సంపద ఏముందంటూ ఒక కవితా పదాలను రాయడం విశేషంగా నిలిచింది. ప్రస్తుతం ఇంటర్నెట్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. "ఇన్ ఆంఖోన్ కీ చమక్ కే ఆగే దునియా కీ సారీ దౌలత్ ఫీకీ హై. (నీ కళ్ల మెరుపులో ప్రపంచంలోని సంపద అంతా మసకబారుతుంది)" అంటూ ఉద్వేగంతో రాసుకొచ్చారు. గౌతమ్ అదానీ- ప్రీతి అదానీ దంపతులకు ఇద్దరు కుమారులు కరణ్, జీత్. వీరిలో పెద్ద కుమారుడు కరణ్- పరిధి ముద్దుల తనయ కావేరి. కాగా లండన్‌లోనే సైన్స్ మ్యూజియంలో న్యూ అదానీ గ్రీన్ ఎనర్జీ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ చిన్నారితో ఫోటో తీసుకున్నారు. తన జీవితంలో మనవరాళ్లతో గడపడమే తనకు పని ఒత్తిడి (బిగ్గెస్ట్ స్ట్రెస్ రిలీవర్స్) పెద్ద ఉపశమనం అని గతంలో పేర్కొన్నారు. "నా మనుమరాళ్లతో సమయం గడపడం చాలా ఇష్టం, వారు నా ఒత్తిడిని తగ్గిస్తారు. నాకు రెండు ప్రపంచాలు ఒకటి ఉద్యోగం, రెండోది. కుటుంబం, కుటుంబమే నాకు గొప్ప శక్తి’’ గౌతమ్ అదానీ. इन आँखों की चमक के आगे दुनिया की सारी दौलत फीकी है। 🙏 pic.twitter.com/yd4nyAjDkR — Gautam Adani (@gautam_adani) April 2, 2024 -
స్టైయిలిష్ లుక్‌లో స్లిమ్‌గా కనిపిస్తున్న బోనీ కపూర్! ఎలా తగ్గారంటే..?
చిత్ర నిర్మాత, దివంగత నటి శ్రీదేవి భర్త బోని కపూరు స్లిమ్‌గా కనిపిస్తున్నారు. చాలా బరువు ఉండే ఆయన మంచి ఫిట్నెస్ లుక్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. తాను బరువుత తగ్గేందుకు ఎలాంటి కసరత్తులు చేశారో వెల్లడించారు. అంతేగాదు తనలా అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇంతకీ బోనీ కపూర్ వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందంటే.. గతంలో 2004లో శ్రీదేవితో కలిసి ఉన్న ఫోటోల్లో బోనీ కపూర్ చాలా లావుగా, ఏజ్డ్ పర్సన్‌లా కనిపించారు. ఆ తర్వాత కూడా శ్రీదేవి చనిపోయిన తర్వాత పలు సందర్భాల్లో కెమరాకు చిక్కిన పోటోల్లో కూడా లావుగానే ఉన్నారు. అలాంటి ఆయాన అనూహ్యంగా 12 కిలోలలకు పైగా బరువు తగ్గడమే గాక న్యూలుక్లో కనిపిస్తున్నారు. బోనీ కపూరేనా అనిపించలా కొత్త స్టయిలిష్ లుక్‌లో దర్శనమిచ్చారు. 20 ఏళ్ల క్రితం ఉన్న బోనీకపూర్‌కి ఈ న్యూలుక్లో ఉన్న బోనీ కపూర్‌కి ఎంత తేడా అని షాకయ్యేలా విజయవంతంగా బరువుతగ్గి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఈ మేరకు బోనీకపూర్ మాట్లాడుతూ.."బరువు తగ్గేందుకు తాను చాలా కష్టపడ్డానని అన్నారు. అలాగే తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారే తొందరగా బరువు తగ్గగలరని అన్నారు. అందుకోసం క్రమశిక్షణతో కూడిని జీవనశైలిని అవలంభించాల్సి ఉంటుందన్నారు. తాను బరువు తగ్గే క్రమంలో నటి జాన్వీ కపూర్ ఉత్సహాపరిచేలా ప్రోత్సహించిన విషయాన్ని కూడా పంచుకున్నారు. జాన్వీ సోషల్ మీడియాలో "నా పాపా బరువు తగ్గడంలో విజంయ సాధించినందుకు గర్వంగా ఉంది." అని పోస్ట్ చేసింది. ఇలా తన పిల్లలు ఇచ్చిన ప్రోత్సాహమే తనను తొందరగా బరువు తగ్గేలా చేసేందుకు దోహదపడిందన్నారు. అలాగే తన మొదటి భార్య కుమార్తె అన్షులా కపూర్ కూడా బరువు తగ్గే ప్రయత్నంలో కష్టాలను ఎదుర్కొన్నట్లు వివరించారు. ఆమెకి ప్రేరణ కలిగించేలా తాను బరువు తగ్గేందుకు ఉపక్రమించినట్లు తెలిపారు. అయితే తన కూతురు కూడా చక్కగా బరువు తగ్గి న్యూలుక్ మంచి ఫిట్నెస్తో అందంగా ఉందని చెప్పడమే గాకా ఆమె ఫోటోలను కూడా షేర్ చేశారు. తనలా బరువు తగ్గాలనుకునేవారు తగ్గలేకపోతున్నాననే నిరాశకు లోనవ్వకూడదు. చివరి నిమిషం వరకు ఆశను కోల్పోకుండా ఉత్సాహభరితంగా కసరత్తులు చేస్తే దెబ్బకు బరువు తగ్గడం ఖాయ అని అన్నారు. అందుకు తానే నిదర్శనమని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నారు." బోనీ కపూర్. View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) (చదవండి: సెలబ్రెటీలు తాగే బ్లాక్ వాటర్ ఏంటీ? నార్మల్ వాటర్ కంటే మంచిదా..!) -
అతడితో చహల్ భార్య ధనశ్రీ ఫొటో.. రచ్చ రచ్చ.. పదే పదే ఇలా?
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మ మరోసారి విమర్శల పాలయ్యారు. యూట్యూబర్, కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చున్న ఈ డాక్టరమ్మ తీరు చహల్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ‘‘చహల్ భయ్యా కూడా మీతో పదే పదే ఇదే తరహాలో వ్యవహరిస్తే భరించగలరా? లేదంటే.. ప్రచార యావ కోసం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటివి చేస్తున్నారా?’’ అంటూ తీవ్ర స్థాయిలో ధనశ్రీని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది?! టీమిండియా బౌలర్‌గా కెరీర్ తారస్థాయిలో ఉన్న సమయంలో ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్నాడు చహల్. డిసెంబరు 22, 2020లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో.. స్వతహాగా కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ తొలుత తనకు నృత్య పాఠాలు నేర్పిందని.. ఈ క్రమంలోనే తాము ప్రేమలో పడి పెళ్లిదాకా వచ్చినట్లు చహల్ ఓ సందర్భంలో తెలిపాడు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ధనశ్రీకి భర్తతో కలిసి దిగిన ఫొటోలు, అతడితో కలిసి చేసిన రీల్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం అలవాటు. అలాగే తన వృత్తిగత విషయాలను ఆమె షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో గతేడాది తన ఇన్‌స్టా అకౌంట్లో చహల్ ఇంటి పేరును ఆమె తొలగించడంతో విడాకుల వదంతులు తెరమీదకు వచ్చాయి. అదే సమయంలో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో ధనశ్రీ సన్నిహితంగా మెలగడమే ఇందుకు కారణమని కొంతమంది నెటిజన్లు అసభ్యకరరీతిలో కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో యజువేంద్ర చహల్- ధనశ్రీ వర్మ స్పందిస్తూ.. విడాకుల విషయాన్ని కొట్టిపారేశారు. అయినప్పటికీ ధనశ్రీ చర్యలను జడ్జ్ చేయడం మానలేదు నెటిజన్లు. చహల్‌కు అప్పట్లో ఉన్న క్రేజ్ దృష్ట్యానే అతడిని ఆమె పెళ్లాడిందనే తమ సొంత అభిప్రాయాలను వీరి బంధానికి ఆపాదిస్తూ ఇష్టారీతిన కథనాలు అల్లేశారు. తాజాగా ధనశ్రీ వర్మ దిగిన ఓ ఫొటో మరోసారి ఇలాంటి ట్రోల్స్‌కు కారణమైంది. ధనశ్రీ ప్రస్తుతం ఝలక్ దిఖ్లాజా అనే టీవీ షోలో భాగమయ్యారు. ఈ క్రమంలో మరో కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్‌తో అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటో బయటకు వచ్చింది. ప్రతీక్ స్వయంగా ఈ పిక్చర్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నెటిజన్లు ధనశ్రీ తీరును విమర్శిస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం వృత్తిగతం(యాక్టింగ్, డ్యాన్స్)గా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలాంటి ఫొటోలను చేయడాన్ని తప్పుపట్టని వారు.. ఒక్క ఫొటోతో ఒకరి వ్యక్తిత్వాన్ని ఎలా నిర్ణయిస్తారు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఝలక్ దిఖ్లా జా షోలో ఫైనల్స్ వరకు వెళ్లిన ధనశ్రీ వర్మ విజేతగా నిలవలేకపోయింది. ఈ సీజన్లో ఫైనల్ వరకూ వచ్చిన మనీషా రాణి అనే మరో ఫిమేల్ కంటెస్టెంట్ ట్రోఫీని అందుకున్నారు. What will be the Dhanashree Verma reaction if Yuzvendra Chahal does this constantly with his ladies friends ? We all are human and any husband who loves his wife will be hurt by these incidents. This is utter nonsense, and needs to be stopped. pic.twitter.com/xKW2tf7K9v — Sujeet Suman (@sujeetsuman1991) March 2, 2024 I wouldn't post such an intimate pic on instagram even if it was with my wife #ShameOnDhanshree #YuziChahal pic.twitter.com/9pEhXEmtAi — brigadier🇮🇳 (@brigadierdude) March 2, 2024 -
ఈ కుర్రాడిని నమ్మినందుకు ధన్యవాదాలు.. ‘రాంచి హీరో’ భావోద్వేగం
India vs England, 4th Tes: రాంచి టెస్టు హీరో ధ్రువ్ జురెల్ భావోద్వేగానికి లోనయ్యాడు. తనపై నమ్మకం ఉంచినందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా రాజ్‌కోట్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ధ్రువ్ జురెల్. వికెట్ కీపర్ బ్యాటర్‌గా తుదిజట్టులో చోటు దక్కించుకున్న ఈ యూపీ ఆటగాడు.. అరంగేట్ర మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. రాజ్‌కోట్‌లో కీపింగ్ నైపుణ్యాలతో పాటు బ్యాటింగ్ మెరుపులనూ చూపించాడు 23 ఏళ్ల జురెల్. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులతో మెరవగా.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరమే లేకుండా సహచరులు జట్టును గెలిపించారు. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 ఇలా అరంగేట్రంలో అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయిన ధ్రువ్ జురెల్.. నాలుగో టెస్టులో మాత్రం అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జట్టు కష్టాల్లో మునిగిపోయిన తొలి ఇన్నింగ్స్‌లో విలువైన 90 పరుగులు సాధించాడు. సెంచరీ చేజారినా అంతకంటే గొప్ప ఇన్నింగ్సే ఆడాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్(52- నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కీలక సమయంలో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా.. 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా టీమిండియాను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకుంటూ జురెల్ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘‘రోహిత్ భయ్యా, రాహుల్ సర్.. ఈ కుర్రాడిని నమ్మినందుకు మీకు ధన్యవాదాలు’’ అంటూ వాళ్లిద్దరు తన ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోలు పంచుకున్నాడు. కాగా ధ్రువ్ జురెల్ తండ్రి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. Thank you Rohit bhaiya, Rahul sir for believing in this boy 🙏🇮🇳❤️ pic.twitter.com/pBlojvB10p — Dhruv Jurel (@dhruvjurel21) February 26, 2024 కొడుకును కూడా తనలాగే సైనికుడిని చేయాలని భావించారు. కానీ జురెల్ మాత్రం క్రికెట్‌పై మక్కువతో అనేక కష్టనష్టాలకోర్చి టీమిండియా తరఫున ఆడే స్థాయికి చేరుకున్నాడు. చదవండి: #Sarfaraz Khan: గోల్డెన్ డకౌట్.. అయినా సర్ఫరాజ్ అలా!.. -
Viral Photo: ఢిల్లీలో టెస్లా క్రాస్‌బ్రీడ్.. మస్క్ చూస్తే ఏడుస్తాడు!
ఢిల్లీలోని కరోల్ బాగ్ ఏరియాలో ఓ టెస్లా కారు కనిపించి ఆశ్చర్యపరిచింది. అయితే ఇది అసలైన టెస్లా కారు కాదు. వేరే కంపెనీ కారుకు టెస్లా లేబుల్ తగిలించి తిప్పుతున్నారు. ఇది భారత్ పే మాజీ ఎండీ ఆష్నీర్ గ్రోవర్ కంట్లో పడింది. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. భారత్ పే మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అవకాశం దొరికినప్పుడల్లా ఇంటర్నెట్లో వినోదభరితమైన, అబ్బురపరిచే విషయాలను పంచుకొంటుంటారు. ఇదే క్రమంలో టెస్లా లోగోతో ఉన్న బీవైడీ అట్టో3 కారు ఫొటోను షేర్ చేశారు. ‘బహుశా ప్రపంచంలోనే తొలి క్రాస్ బ్రీడ్ టెస్లా కారు ఇదేనేమో’ అంటూ కాప్షన్‌ను జోడించారు. దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. దేశంలో క్రియేటివిటీకి కొదవ లేదని ఓ యూజర్ కామెంట్లు పెట్టారు. ఇక మరో నెటిజన్ స్పందిస్తూ.. ఈ ఫొటో చూస్తే టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్ ఓ మూలన కూర్చుని ఏడుస్తాడని కామెంట్ చేశాడు. World’s first ‘cross - breed’ Tesla ! Some Delhi boy literally ‘built his dream’ in Karol Bagh @Tesla pic.twitter.com/zxuilgyvAV — Ashneer Grover (@Ashneer_Grover) February 3, 2024 -
గుండె తరుక్కుపోయే చిత్రం.. ఇలాంటి ఒక్క చిరునవ్వు చాలు!
Gaza Viral Photo: ఇక్కడి ఫొటో చూడండి.. ఓ వైపు రాకెట్ల దాడులు.. మరోవైపు బాంబు దాడులు అయినా చెక్కు చెదరని అమాయక చిరునవ్వు లోకం గురించి ఏం తెలుసని అంత ధీమా? ఈ చిన్నారుల నవ్వు చూడండి. యుద్ధం గురించి తెలియని వయసు. ఓ తమ ప్రాంతం చిధ్రమై పోతున్నా అర్థంకాని వయసు. ఆ క్షణంలో వాళ్లకేం అక్కర్లేదు. గుండెకు హత్తుకున్న ఆ స్నేహం తప్పా. ఈ యుద్ధంలో అమ్మ తప్పిపోయి ఉండొచ్చు. నాన్న ప్రాణమే పోయి ఉండొచ్చు. యుద్ధం వీళ్లను అనాథనూ చేసి ఉండొచ్చు. దిక్కులు బిక్కటిట్లేలా వీళ్లు రోదించి ఉండొచ్చు. కానీ, ఓదార్చే చెయ్యి పక్కన ఉంది కదా అందుకే ఫొటోకు నవ్వుతూ ఫోజు ఇచ్చారేమో. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా సామాన్యులు కడగళ్లపాలవుతున్నారు. మృతుల్లో చిన్నారులే ఎక్కువగా ఉన్నారనే నివేదికలు ప్రపంచాన్ని చలింపజేస్తోంది. యుద్ధంతో చితికిపోయి ఉన్న గాజాకు.. ఈ చిన్నారుల నవ్వులు మళ్లీ ప్రాణం పోస్తే.. యుద్ధం ఓడిపోయినట్లే కదా!. -
రొమాంటిక్ ఫోటో క్లిక్ చేసిన ఏఐ కెమెరా.. వావ్ అంటున్న నెటిజన్లు!
ఆధునిక కాలంలో టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనిని ఉపయోగించుకుంటూ మనుషులు తమ పనిని మరింత సులభతరం చేసుకుంటున్నారు. కేరళ ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం చేయడానికి ఈ ఏడాది ప్రారంభంలో సుమారు 726 ఏఐ కెమెరాలను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఆ ఫోటోలను గమనించి చలానాలు విధిస్తున్నారు. ఇటీవల ఒక AI ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏఐ కెమెరా తీసిన ఫోటోలో ఓ క్యూట్ రొమాంటిక్ జంటను చూడవచ్చు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హైరిజల్యూషన్ కెమెరా రాత్రి సమయంలో కూడా అద్భుతంగా వైట్ అండ్ బ్లాక్ ఫోటో తీసింది. ఇందులో బైక్ రైడర్ హెల్మెట్ ధరించాడు, వెనుక ఉన్న అమ్మాయి హెల్మెట్ ధరించలేదు. ఈ కారణంగా వారికి జరిమానా విధించారు. ఈ ఫోటోలు అమ్మాయి నవ్వుతుండటం చూడవచ్చు. వండి భ్రాంతన్‌మార్ తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ ఫోటో పోస్ట్ చేస్తూ.. డబ్బులిచ్చి పెట్టుకునే పెయిడ్ ఫోటోగ్రాఫర్లు కూడా ఇంతమంచి ఫోటో తీయలేరేమో? అయితే ఇది కలర్ ఫోటో అయితే ఇంకా బాగుండేదని వెల్లడించాడు. అయితే జరిమానా అందుకున్న వ్యక్తి ఇలాగే భావించాడా? లేదా అనే తెలియాలి. ఇదీ చదవండి: యూజ్లెస్ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్ అయ్యాను.. ఏఐ కెమెరాలు అందుబాటులోకి వచ్చిన తరువాత కేరళలో ప్రమాదాలలలో మరణించే వారి సంఖ్య దాదాపు సగానికి తగ్గింది. ఈ ప్రాజెక్టు కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం 232 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ట్రాఫిక్ ఉల్లంఘన సంఖ్య కూడా బాగా తగ్గింది. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. 500, టూ వీలర్ మీద ముగ్గురు వ్యక్తులు వెళ్తే రూ. 1,000. డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా రైడింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తే రూ. 2000 జరిమానా విధించబడుతుంది. View this post on Instagram A post shared by Vandibhranthanmar (@vandi_bhranthanmar) -
‘ప్రియతమా మన ప్రేమ శాశ్వతం’: ఇజ్రాయెల్ ప్రేమ జంట ఫోటో వైరల్
Israeli couple takes final pic’of their love ఇజ్రాయిల్‌లోని సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్లో 260 మంది ఊచకోత ఘటనలో ఇజ్రాయెల్ ప్రేమ జంట తీసుకున్న ఫైనల్ ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. అప్పటివరకు ఉల్లాసంగా సాగుతున్న ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌పై రాకెట్ల వర్షం కురిపించి వందలాది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఘటనలో అనూహ్యంగా ఒక ప్రేమ జంట ప్రాణాలతో బతికి బయటపడటం విశేషంగా నిలిచింది. ఇక చచ్చిపోతా మనుకుని, చివరగా తమ ప్రేమను ప్రకటించుకున్న ఈ లవ్‌బర్డ్స్ ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని గాజా స్ట్రిప్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న గ్రామీణ ప్రాంతంలో మ్యూజిక్ ఫెస్ట్ జరిగింది. సెప్టెంబర్ 29-అక్టోబర్ 6 జరిగిన ఈ ఫెస్ట్‌పై హమాస్ మిలిటెంట్ల దాడిలో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేకమందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకెళ్లారు. ఉగ్రవాదుల నుండి రక్షించుకునే క్రమంలో వీరు పొదల్లో దాక్కొన్నారు. అయితే ఇక తాము ప్రాణాలతో తిరిగి వెళ్లే అవకాశం లేదని భావించిన అమిత్, నిర్ నేలపై పడుకుని, ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ సెల్పీ తీసుకున్నారట. తాము బ్రతకకపోతే తమ ప్రేమ శాశ్వతంగా నిలిచిపోవాలనే ఆశతో ఫోటో తీసుకున్నారట. అయితే అదృష్టవశాత్తూ అమిత్, నిర్ ఇద్దరూ ప్రాణాలతో బయటపడటంతో కథ సుఖాంతమైంది. కానీ ఆ సమయంలో తీసుకున్న ఫోటో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. (హృదయాన్ని మెలిపెట్టే ఘటన: ఆ నవ్వు ముఖం ఇక చూడలేం!) View this post on Instagram A post shared by Jewish Lives Matter (@jewishlivesmatter) జ్యూయిష్ లైవ్స్ మేటర్ ఇన్స్టాగ్రామ్ పేజీ బుధవారం వారి ఫోటోను క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది, “ఇజ్రాయెల్‌లో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్లో అమిత్ , నిర్ అనే జంట తీసుకున్న ఫైనల్ పిక్ ఇది. లక్కీగా వారు ప్రాణాలతో బైటపడ్డారు. కానీ ఈ ఫోటో మాత్రం వారికి జీవితాంతం మదిలో నిలిచిపోతుంది అంటూ కమెంట్ చేసింది. దీనిపై నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తూ, ఆ జంటకు అభినందలు తెలిపారు. ఎంత అద్భుతం, ఈ చీకటిలో వారి ప్రేమ సంతోషం ఎంత బాగా మెరుస్తోంది. అని ఒకరు. ఇంత అందమైన ,ఆశాజనకమైన విషయాన్ని ఈ మధ్య కాలంలో తాను చూడలేదని మరొకరు చెప్పారు. నా గుండె పగిలిపోయింది. మా ప్రజలపై జరుగుతున్న హింసను ప్రపంచమంతా చూస్తున్న క్రమంలో నిజంగా ఈ అందమైన బహుమతికి ధన్యవాదాలు మరొకరు రాశారు. -
ఆలయంలో అలా ప్రధాని మోదీ.. బీఆర్ఎస్ నేతపై ఫైర్
ఢిల్లీ: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ ఫొటోను వైరల్ చేసిన బీఆర్ఎస్ నేతపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మంగళవారం మహారాష్ట్ర పూణే పర్యటన సందర్భంగా ఓ ఆలయాన్ని సందర్శించారాయన. ఆ టైంలో ఆయన విఘ్నేషుడి విగ్రహానికి వెన్ను చూపించారంటూ బీఆర్ఎస్ నేత వై సతీష్‌రెడ్డి తన ట్విటర్లో పోస్ట్‌చేసి మండిపడ్డారు. మోదీ జీ, మన దేవతలకు వెన్ను చూపడం అగౌరవంగా పరిగణించబడుతుంది. మీరు ఎవరిని ఎదుర్కొంటున్నారు? అంటూ ట్వీట్ చేశారాయన. దీనిపై పలువురు రాజకీయనేతలు కూడా స్పందించారు. మోదీపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో.. బీజేపీ శ్రేణులు కౌంటర్‌కు దిగాయి. ఫ్యాక్ట్ చెక్ పేరిట అసలు విషయాన్ని బయటపెట్టాయి. Modi ji, it is considered disrespectful to show our backs to our deities. Whom are you facing? Irony! pic.twitter.com/qcv8qIThkf — YSR (@ysathishreddy) August 1, 2023 इस तस्वीर के बारे में आपकी क्या राय है? pic.twitter.com/ENDNfigB19 — Srinivas BV (@srinivasiyc) August 1, 2023 మోదీ వినాయకుడి ముందర పరికర్మ చేస్తున్న టైంలో స్క్రీన్‌షాట్ తీసి.. దానిని ఇలా వైరల్ చేశారు. ఆ విషయాన్నే బీజేపీ నేతలు ప్రస్తావించారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పుణే శివాజీ రోడ్లో ఉన్న దగ్దుషేత్ హల్వాయి గణేష్ దేవాలయం.. మహారాష్ట్రలో అత్యధిక హుండీ ఆదాయం వచ్చే ఆలయాల్లో ఒకటి. నవరాత్రుల సమయంలో లక్షల మంది దర్శిస్తుంటారు. రాష్ట్రపతులు, ప్రధానులు, మాజీలు తరచూ ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు కూడా. सुखकर्ता दुखहर्ता वार्ता विघ्नाची। 🙏🏻 pic.twitter.com/yGLViOOJdg — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 1, 2023 𝐓𝐑𝐔𝐓𝐇.. Just taken a snapshot from the Pooja and spreading it as if he was posing for pics. Shameful. https://t.co/aB0pZFEe7B pic.twitter.com/1zScdoNb1p — 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) August 2, 2023 -
Viral: ఈ తాత కథ మీలో ఎవరికైనా ఎరుకేనా?
Viral Photo: కొందరి క(వ్య)థలు.. ఇట్టే ఆకట్టుకుంటాయి. కదిలిస్తాయి. భావోద్వేగానికి గురి చేస్తాయి. ఆ కథలను చెప్పడానికి పెద్దగా వర్ణనలు అక్కర్లేదు. కేవలం అక్కడ కనిపించే పరిస్థితులు చాలూ. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మధ్య ఒక ఫొటో విపరీతంగా వైరల్ అవుతుండడం చాలామంది చూసే ఉంటారు. ఒక వృద్ధుడు ఒక పాత కిరాణ దుకాణంలో ఉండగా.. పైన కనిపించే రాతలు ఆకట్టుకునేలా.. అంతకు మించి ఆలోచింపజేసేలా ఉన్నాయి. ‘‘నమ్మండి.. నేను వ్యాపారంలో నష్టపోలే. బదలు ఇచ్చి.. మధ్యవర్తిగా ఉండి నష్టపోయాను. నా సాయం తీసుకున్నవారు పొలాలు కొన్నారు. నేను మాత్రం పొలం అమ్ముకున్నాను’’ అని ఆ చిన్న కిరాణంపైన రాసి ఉంది. ఇది ఏ కాలానికైనా వర్తించే కఠిన వాస్తవం ఇదని పలువురు కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది నెటిజన్స్.. ఈ దుకాణం తమకు తెలుసని, వరంగల్ పక్కన నెక్కొండ అనే చిన్న పల్లెటూరిలో ఈ తాత ఉన్నాడని, తన అనుభవమే ఆయన అలా రాతలుగా చూపించారని అంటున్నారు. ఇంతకీ ఈ తాత పేరు, ఆయన కథ ఏంటి?.. ఆయనకు జరిగిన నష్టం ఏంటో ఎవరికైనా తెలిస్తే చెప్పరు! ఇదీ చదవండి: చావు అంచుల దాకా వెళ్తే.. రక్షించాడు -
'మిస్టర్ రజనీ ఎందుకు ఎక్స్‌ట్రాలు చేస్తున్నావ్!'
టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ఈ లక్నో కెప్టెన్ మోకాలి గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. భార్య అతియా శెట్టితో కలిసి జర్మనీకి వెళ్లి మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం రీహాబిలిటేషన్ పేరుతో బీసీసీఐ బెంగళూరు ఎన్సీఏ అకాడమీకి పంపింది. ప్రస్తుతం ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్న కేఎల్ రాహుల్ అందుకు తగ్గట్టుగా జిమ్ వర్కౌట్స్ చేస్తు చెమటలు కక్కాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోను రాహుల్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. రాహుల్ పెట్టిన ఫోటోలపై అభిమానులు స్పందించారు. టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ సైతం రాహుల్ పోస్టుకు స్పందిస్తూ సరదాగా టీజ్ చేశాడు. ''ఏంటి మిస్టర్ రజనీ(కేఎల్ రాహుల్) చాలా ఎక్స్‌ట్రాలు చేస్తున్నావ్.. చూడలేకపోతున్నాం'' అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఇక గాయం కారణంగా డబ్ల్యూటీసీకి దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను బీసీసీఐఘ ఎంపిక చేసింది. కానీ ఫైనల్ మ్యాచ్‌కు అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ కూడా బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలోనే ఉన్నాడు. విండీస్ టూర్‌కు ఎంపిక కావడంతో బ్యాటింగ్‌లో టెక్నిక్స్ మెరుగుపరుచుకునేందుకు ఇషాన్ ఎన్సీఏలో శిక్షణ తీసుకుంటున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు బెంచ్‌కే పరిమితమైన ఇషాన్ విండీస్ గడ్డపై పరుగుల వరద పారించేందుకు తహతహలాడుతున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టి20లు ఆడనుంది. మొదటి టెస్టు జూలై 12-16 తేదీల్లో విండ్సర్ పార్క్ స్టేడియంలో, రెండో టెస్టు 20-24 మధ్య క్వీన్స్ పార్ట్ ఓవల్ వేదికగా జరగనున్నాయి. వన్డే సిరీస్ జూలై 27న మొదలు కానుంది. మొదటి వన్డేకు కింగ్స్టన్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. రెండో వన్డే జూలై 29న అదే స్టేడియంలో జరగనుంది. భారత్, వెస్టిండీస్ జట్లు ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో మూడో వన్డే ఆడతాయి. ఐదు టీ 20ల సిరీస్ ఆగష్టు 3న ప్రారంభమవుతుంది. ఆగష్టు 6, 8, 12, 13న మిగతా టి20 మ్యాచ్‌లు ఉన్నాయి. View this post on Instagram A post shared by KL Rahul👑 (@klrahul) చదవండి: 'మెక్కల్లమ్ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా' భార్య ఆట చూద్దామని వస్తే నిరాశే మిగిలింది -
కీర్తీ ఇతను ఎవరమ్మా? ప్రేమికుడా, లేక నెటిజన్లు ట్రోలింగ్
తమిళసినిమా: నటీమణుల మీద రకరకాల వదంతులు రావడం సహజమే. ఇక్కడ నిప్పు లేనిదే పొగరాదు అనే సామెత కూడా వినిపిస్తూ ఉంటుంది. ఇక హీరోయిన్ల ప్రేమ పెళ్లి గురించి రకరకాల ప్రచారం జరుగుతుండడం, వాటిని వాళ్లు ఖండించడం షరా మామూలే. ఇటీవల ఇలాంటి ప్రచారం కీర్తిసురేష్‌పై ఎక్కువగా జరుగుతోంది. అనతి కాలంలోనే దక్షిణాది కథానాయకిగా పేరు తెచ్చుకున్న మలయాళీ కుట్టి ఈమె. ప్రారంభ దశలోనే మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రి బయోపిక్‌లో అద్భుత అభినయాన్ని చాటి, విమర్శకులను సైతం మెప్పించి, జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. అంతేకాకుండా చాలా తక్కువ కాలంలోనే హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇలా నటిగా సక్సెస్ఫుల్పై సాగిస్తున్న కీర్తిసురేష్ వ్యక్తిగతంగా నెటిజన్లు కార్నర్‌కు గుర్తించిందని చెప్పక తప్పదు. ముఖ్యంగా ప్రేమ విషయంలో ఈమైపె రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. కీర్తిసురేష్ ప్రేమలో పడిందని త్వరలోనే పెళ్లి బాజా మోగనుందని ఆ మధ్య ప్రచారం జరిగింది. గోవాకు చెందిన ఒక వ్యాపారవేత్త ప్రేమలో పడిందని ఆ వ్యక్తితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని మరో వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ అయితే దానికి ఆమె తండ్రి సురేష్ వివరణ ఇచ్చారు. కీర్తిసురేష్‌తో ఉన్న వ్యక్తి తమ కుటుంబ సన్నిహితుడేనని తాము గోవాకు వెళ్లినప్పుడల్లా అతను తమకు అన్ని రకాలుగా సహకరిస్తారని, అయితే తను కీర్తిసురేష్ ప్రేమికుడు కాదని స్పష్టం చేశారు. లేకపోతే తాజాగా కీర్తిసురేష్ ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కీర్తీ ఇతను ఎవరమ్మా? ప్రేమికుడా, లేక స్నేహితుడా అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. -
'తప్పేముంది.. రెండింటికి సమన్యాయం చేశాడు'
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు రసకందాయంలో పడింది. ఆట ఆఖరిరోజు విజయానికి ఇంగ్లండ్‌కు ఏడు వికెట్లు అవసరం కాగా.. ఆసీస్ మరో 174 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మేరకు ఐదోరోజు ఆటలో తొలి సెషన్ కీలకం కానుంది. తొలి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగుతారా.. లేక ఆసీస్ బ్యాటర్లు సమర్థంగా రాణించి ఆసీస్‌కు విజయాన్ని అందిస్తారా అనేది చూడాలి. బజ్‌బాల్ క్రికెట్లో జోరుమీదున్న ఇంగ్లండ్‌కు ఆసీస్ ముకుతాడు వేస్తుందో లేక చతికిలపడుతుందో చూడాలి. ఇక ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ చర్య నవ్వులు పూయిస్తోంది. బౌలింగ్‌కు వచ్చిన రాబిన్సన్ తన కాళ్లకు వేర్వేరు షూ వేయడం ఆసక్తి కలిగించింది. సంబంధం లేకుండా ఎడమకాలికి అడిడాస్(Adidas)వేసిన రాబిన్సన్.. తన కుడికాలికి రాజోర్(Razor) షూ వేసుకున్నాడు. మధ్య ఓవర్లలో బౌలింగ్‌కు వచ్చిన సందర్భంలో ఓలీ రాబిన్సన్ ఇలా మిస్‌మ్యాచ్ షూ వేసుకొచ్చి సీరియస్‌గా సాగిపోతున్న మ్యాచ్‌లో తన చర్యతో అందరిని నవ్వించాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ఇందులో తప్పేముంది.. బహుశా రెండింటికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యుంటాడు.. అందుకే ఇలా వేసుకొచ్చి సమన్యాయం చేశాడు. 281 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 34, నైట్ వాచ్‌మన్ స్కాట్ బొలాండ్ 13 పరుగులతో ఆడుతున్నారు. స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లు తీశాడు. ఆసీస్ విజయానికి 174 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంగ్లండ్‌కు ఏడు వికెట్లు కావాలి. pic.twitter.com/abYYFCVMub — Out Of Context Cricket (@GemsOfCricket) June 18, 2023 చదవండి: ఔటయ్యి కూడా చరిత్రకెక్కిన జో రూట్ -
స్కూల్ఫ్రెండ్ను పెళ్లాడనున్న సీఎస్కే స్టార్
సీఎస్కే స్టార్ పేసర్ తుషార్దేశ్ పాండే త్వరలో ఒక ఇంటివాడు కానున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, స్కూల్ ఫ్రెండ్ నభా గడ్డంవార్‌తో సోమవారం కుటుంబసభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు పలువురు చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు హాజరయ్యారు. తుషార్, నభా ఎంగేజ్మెంట్ ఫొటోను సీఎస్కే బ్యాట్స్‌మెన్ శివమ్ దూబే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్కూల్ డేస్ నుంచి తుషార్, నభాకు మధ్య పరిచయం ఉందట. నభాతో ఎంగేజ్మెంట్ గురించి తుషార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. స్కూల్ క్రష్ నుంచి తన భార్యగా నభా ప్రమోషన్ పొందనుందని పేర్కొన్నాడు. కొత్త జంటకు సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్‌తో పాలు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. తమ ఎంగేజ్మెంట్ ఫొటోలను తుషార్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా రూ. 20 లక్షల బేస్ ధరకు తుషార్ దేశ్‌పాండే ను చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది. తనకు ధరకు పదింతల న్యాయం చేశాడు తుషార్. అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టిన తుషార్ ధోని నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సీజన్లో 16 మ్యాచుల్లో 21 వికెట్లు తీశాడు. ఒకానొక దశలో పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు. అద్భుత బౌలింగ్‌తో చెన్నై కప్ గెలవడంతో తుషార్ దేవ్‌పాండే తన వంతు పాత్రను పోషించాడు. గత సీజన్లో పెద్దగా అవకాశాలు రాకా బెంచ్‌కు పరిమితమైన తుషార్ ఈ సీజన్లో మాత్రం చెలరేగిపోయాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Tushar Deshpande (@tushardeshpande96) చదవండి: విభిన్నంగా ఆడి వరల్డ్‌కప్ కొట్టబోతున్నాం: రోహిత్ -
గాల్లో డబుల్ డెక్కర్: భలే డిజైన్ చేశారు.. ఫొటో వైరల్
డబుల్ డెక్కర్ బస్సులు, రైళ్లు చూశాం. కానీ డబుల్ డెక్కర్ విమానాల గురించి ఎప్పుడైనా విన్నారా? తాజాగా విమానంలో డబుల్ డెక్కర్ సీటు ఫొటో ఒకటి వైరల్ అయ్యింది. ఈ సరికొత్త సీటు డిజైన్‌పై ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అలెజాండ్రో నూనెజ్ విసెంట్ అనే 23 ఏళ్ల డిజైనర్ ఈ డబుల్ డెక్కర్ సీట్లను రూపొందించారు. ‘చైస్ లాంజ్’ ఎయిర్‌ప్లేన్ సీట్ ప్రోటోటైప్ ఫొటో మొదటగా 2022లో విడుదలైంది. జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ఎక్స్‌పోలో దీన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈ డబుల్ డెక్కర్ సీట్లపై రెడిట్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒక్కో యూజర్ ఒక్కోలా స్పందించారు. ఈ మిశ్రమ స్పందనలపై డిజైనర్ నూనెజ్ విసెంట్ మాట్లాడుతూ డబుల్ డెక్కర్ సీటు స్థలాన్ని ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుందని, విమానంలో ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని సీఎన్ఎన్ వార్తా సంస్థతో ఆయన పేర్కొన్నారు. The double-decker airplane seat is back https://t.co/CK2nnh12kC pic.twitter.com/OKqgpmxiCn — CNN (@CNN) June 9, 2023 -
#ShubmanGill: లవ్ ప్రపోజ్‌కు పడిపోయాడు.. రనౌట్ మిస్ చేశాడు!
ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో బ్యాటింగ్‌లో వీరవిహారం చేసి 890 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న శుబ్‌మన్ గిల్ డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు. 13 పరుగులు మాత్రమే చేసి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అయితే తాజాగా ఫీల్డింగ్‌లోనూ గిల్ విఫలమయ్యాడు. ఈజీ రనౌట్ చేసే చాన్స్‌ను చేజేతులా జారవిడిచాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ సమయంలో ఇది జరిగింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో సిరాజ్ బౌలింగ్‌లో మార్నస్ లబుషేన్ ఆడిన షాట్ నేరుగా శుబ్‌మన్ గిల్ చేతుల్లోకి వెళ్లింది. సమన్వయ లోపంతో మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా ఇద్దరూ కూడా ఒకే వైపు పరుగెత్తారు. మూడో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుబ్‌మన్ గిల్, మెల్లిగా లేచి బంతి అందుకుని వికెట్ కీపర్ వైపు బంతి వేసేందుకు కావాల్సినంత సమయం ఉంది. అయితే బంతిని ఆపగానే కంగారుపడిన శుబ్‌మన్ గిల్ బ్యాటర్లు ఎటువైపు ఉన్నారనే విషయాన్ని కూడా గమనించకుండా బౌలింగ్ ఎండ్‌వైపు బంతి త్రో చేశాడు. అటు వైపు బంతిని ఆపేందుకు కూడా ఎవ్వరూ లేకపోవడంతో రనౌట్ ఛాన్స్ మిస్ అయింది. అయితే ఈ సంఘటనకి ముందు గ్రౌండ్లో ఉన్న ఓ యువతి, శుబ్‌మన్ గిల్‌కి మ్యారేజ్ ప్రపోజ్ చేసింది. ''శుబ్‌మన్ గిల్ మ్యారీ మీ'' అని రాసి ఉన్న ఫ్లకార్డును కెమెరావైపు ప్రదర్శించింది. వాస్తవానికి గిల్ దీనిని పట్టించుకోలేదు. కానీ అభిమానులు ఊరికే ఉండరుగా. గిల్ ఆ పిల్ల ప్రపోజల్ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని రనౌట్ చాన్స్ మిస్ చేశాడంటూ ట్రోల్ చేశారు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో ఫాలోఆన్ గండం దాటుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్ హాఫ్ సెంచరీలతో రాణించి ఏడో వికెట్‌కు 109 పరుగులు జోడించి టీమిండియాను ఫాలోఆన్ ముప్పు నుంచి తప్పించారు. ఆసీస్‌కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ భారీ ఆధిక్యం లభించింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన గిల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తరహా ఆటతీరు నమోదు చేస్తే అభిమానుల ఆగ్రహానికి గురవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు మ్యాచ్‌లో విజయావకాశాలు ఆసీస్‌కే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 80 పరుగులతో ఆడుతున్న ఆసీస్ మొత్తంగా 253 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండురోజులు సమయం ఉండడంతో టీమిండియా ఏ మేరకు పోరాడుతుందనేది ఆసక్తిగా మారింది. Proposal for Shubman Gill at the Oval. pic.twitter.com/76hpNoPlbi — Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2023 చదవండి: 'సామాన్యుడు కాడు వీడు'.. టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ షాట్ -
వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్
సాక్షి, ముంబై: ఐపీఎల్ 2023లో చెన్నై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసుకున్నసంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ డక్ వర్త్ లూయిస్ పద్దతిన 5 వికెట్ల తేడాతో విజయం . ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో జడేజా (6 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 15 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. (IPL 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్‌వర్త్ ఎంతో తెలుసా?) ముఖ్యంగా చివరి 2 బంతులకు 10 పరుగులు చేయాల్సిన ఉండగా, చెలరేగిన జడేజా వరుసగా 6, 4 కొట్టి జట్టుకు మర్చిపోలేని విజయాన్ని అందించాడు. జడ్డూ బాయ్ పెర్ఫామెన్స్‌కు ఫిదా అయిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భావోద్వేగానికి గురవడమే కాదు..ఎన్నడూ లేని విధంగా మ్యాచ్‌ను గెలిపించిన జడేజాను ఎత్తుకొని సంబరాలు చేసుకున్నాడు మిస్టర్ కూల్. (ఐపీఎల్ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్‌వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు) దీనికితోడు భర్త ప్రతిభకు ముగ్ధురాలైన జడేజా భార్య భర్త కాళ్లకు దణ్నం పెట్టి, గట్టిగా కౌగిలించుకుని మరీ మురిసిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Long live true love and patriarchy #IPLFinals #RavindraJadeja #Rajputboy pic.twitter.com/KXuY3kywGv — History Of Rajputana (@KshatriyaItihas) May 29, 2023 దీనిపై ఏఐ ఆర్టిస్ట్ సాహిద్ కూడా సెలబ్రేట్ చేశారు. ఇటీవలి కాలంలో అనేకమంది సినీ, రాజకీయ సెలబ్రిటీలు, క్రీడాకారుల ఫోటోలను ఆకర్షణీయంగా మల్చిన సాహిద్ ఇపుడు జడేజాను ఎంచుకోవడం విశేషం. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ వారెవ్వా జడేజా అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by SAHID (@sahixd) -
సచిన్‌తో గిల్ ముచ్చట.. పండగ చేసుకున్న గాసిప్ రాయుళ్లు
శుబ్‌మన్ గిల్.. ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే పేరు. ఐపీఎల్ 16వ సీజన్లో వరుస శతకాలతో విజృంభిస్తోన్న గిల్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. కీలక మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన గిల్‌కు సీజన్లో ఇది మూడో శతకం కావడం విశేషం. 60 బంతుల్లో 129 పరుగులు చేసిన గిల్ ఐపీఎల్లో ప్లేఆఫ్‌లో అత్యధిక స్కోరు చేసిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌తో శుబ్‌మన్ గిల్ ముచ్చటించాడు. గిల్ ఇన్నింగ్స్‌కు ముగ్దుడైన సచిన్ అతన్ని ప్రత్యేకంగా పిలిపించుకొని అభినందించాడు. రోజురోజుకు మరింత రాటుదేలుతున్న గిల్ మెరుగైన బ్యాటింగ్ కోసం సచిన్ సలహాలు తీసుకున్నట్లు తెలిసింది. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకోవడం కెమెరాలకు చిక్కింది. దీంతో గాసిప్ రాయుళ్లు రంగంలోకి దిగారు. సచిన్ కూతురు సారా టెండూల్కర్‌తో గిల్ ప్రేమాయణం నడుపుతున్నట్లు పుకార్లు వస్తున్న నేపథ్యంలో సచిన్, గిల్ ముచ్చటపై గాసిప్ రాయుళ్లు తమకు తోచిన విధంగా కామెంట్ చేశారు. ''ఇది ఒక ఫ్యామిలీ మూమెంట్'' అని కొందరు పేర్కొంటే.. ''అల్లుడు ఇన్నింగ్స్ చూసి మామ గర్వపడుతున్నాడు... అందుకే పిలిపించుకొని మరీ అభినందిస్తున్నాడు.'' అంటూ కామెంట్ చేశారు. కాగా గిల్- సచిన్ ముచ్చటిస్తున్న ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ శుబ్‌మన్ గిల్ మాత్రం ఎప్పటిలాగే ఇలాంటి చెత్త రూమర్లకు స్పందించకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అటు సచిన్ కూడా గాసిప్ రాయుళ్ల విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని అర్థమవుతుంది. Shubman Gill with Sachin Tendulkar. pic.twitter.com/Tk5Y2aImE4 — Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2023 Shubhman gill with sasur jii... Correct your caption — PakkaSanatani🕉️ 🚩🇮🇳🇮🇳 (@sanatanhistya) May 26, 2023 A proud Father-in-law ❤️🤭 — Shubham_Srivastava 🇮🇳 (@4u_shubh365) May 26, 2023 చదవండి: ధోనితో సమానంగా గిల్.. రికార్డులు బద్దలు -
'ఈసారి కప్ మనదే'.. రోహిత్ శర్మ సిగ్నల్!
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ అత్యంత విజయమవంతమైన జట్టు. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ఘనత ఆ జట్టు సొంతం. ఇప్పటివరకు ఫైనల్లో అడుగుపెట్టిన ఆరు సందర్భాల్లో ఐదుసార్లు టైటిల్‌ను గెలిచి కానీ వెళ్లలేదు. ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరుకోవడానికి మరో అడుగు దూరంలో ఉంది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2లో గెలిస్తే ఏడోసారి ఫైనల్లో అడుగుపెట్టనుంది. అయితే గతంలో ముంబై ఇండియన్స్ ఆరుసార్లు ఫైనల్ చేరిన సందర్భాల్లో ఒక్కసారి మినహా మిగతా ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఒకవేళ ఈసారి ఫైనల్‌కు వస్తే మాత్రం ముంబై ఆరోసారి విజేతగా నిలవడం గ్యారంటీ అని ఆ జట్టు అభిమానులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ చేసిన నెంబర్ సిగ్నల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ ఆడేందుకు హోటల్ రూం నుంచి బస్‌లో బయలుదేరిన సమయంలో.. ముంబై కెప్టెన్ రోహిత్ బస్సు కిటికీలోనుంచి అభిమానులను చూస్తూ ఆరు సంఖ్యను సిగ్నల్‌గా చూపిస్తూ ఈసారి కప్ మనదే అన్నట్లుగా సైగ చేశాడు. రోహిత్ అలా చూపించగానే ముంబై ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. ఈ సీజన్లో తొలి అంచె పోటీల్లో ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచి అసలు ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ రెండో అంచె పోటీల్లో ముంబైకి ఎక్కడలేని బలం వస్తోంది. ఏ జట్టైనా ఆది నుంచి ఓటమలు ఎదురైతే డీలా పడడం చూస్తాం. కానీ ముంబై అలా కాదు.. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని రెండో అంచె పోటీల్లో వరుస విజయాలు సాధించి ఒక్కసారిగా ప్లేఆఫ్ రేసులోకి వచ్చింది. ఆర్సీబీ లక్నో చేతిలో ఓడిపోవడం.. అదే సమయంలో ముంబై ఎస్ఆర్హెచ్పై గెలవడంతో నాలుగో జట్టుగా ప్లేఆఫ్‌లో అడుగుపెట్టింది. ఇక ఎలిమినేటర్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ను 81 పరుగుల తేడాతో చిత్తు చేసి భారీ విజయాన్ని దక్కించుకొని క్వాలిఫయర్-2కు చేరుకుంది. అయితే క్వాలిఫయర్-2లో గుజరాత్‌ను ఓడించి ఫైనల్‌కు వచ్చిందా కప్ కొట్టకుండా మాత్రం పోదు. గత రికార్డులు కూడా అవే చెబుతున్నాయి. చూద్దాం మరి ముంబై ఇండియన్స్ ఆరోసారి కప్ కొడుతుందో లేదో.. Rohit Sharma gives signal to their fans, Hopefully 6th trophy loading 😌.#MIvsGT pic.twitter.com/LG88i1z8My — 𝗥𝗼𝗵𝗶𝘁 𝗦𝗵𝗮𝗿𝗺𝗮 𝗙𝗮𝗻𝗰𝗹𝘂𝗯 (@LoyleRohitFan45) May 26, 2023 చదవండి: వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు వెళ్లేదెవరంటే? -
డాట్ బాల్ స్థానంలో చెట్టు గుర్తు?.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ను స్టార్స్టోర్ట్స్లో ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్‌లో ఒక్కో డాట్ బాల్‌ను సదరు బ్రాడ్కాస్ట్ సంస్థ స్కోరుబోర్డులో ఒక్కో చెట్టు గుర్తును చూపించింది. అదేంటి డాట్ బాల్ అనగానే స్కోరు బోర్డును సున్నా కనిపించాలి గాని ఇలా చెట్టు కనిపించడం ఏంటని అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే దీని వెనుక బీసీసీఐ చేసిన ఒక గొప్ప ఆలోచన బయటకొచ్చింది. అదేంటంటే.. Green Initiative(పర్యావరణం పెంపొందించడానికి) పేరిట బీసీసీఐ ఒక వినూత్న కార్యం చేపట్టింది. ఐపీఎల్ 2023లో ప్లేఆఫ్స్‌లో అన్ని డాట్ బాల్స్‌ను కలిపి 500 మొక్కలు నాటాలని నిర్ణయించుకుంది. బీసీసీఐ ఆలోచనను అభినందించిన స్టార్స్టోర్ట్స్ యాజమాన్యం గుజరాత్, సీఎస్కే ప్లేఆఫ్ మ్యాచ్‌లో నమోదైన డాట్ బాల్స్ స్థానంలో చెట్టు గుర్తును ఉంచేలా ప్రణాళిక రూపొందించింది.ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ పర్యావరణాన్ని కాపాడేందుకు బీసీసీఐ చేసిన గొప్ప ఆలోచనను మెచ్చుకుంటున్నారు. Qualifier 1 | #GTvCSK What's that Tree for @JioCinema??#IPLPlayOffs #CricketTwitter pic.twitter.com/TYiOy8tczr — Anika🇮🇳 (@SportsIndia036) May 23, 2023 చదవండి: ఐపీఎల్ 2023లో ఫ్లాప్ అయిన టాప్-5 విదేశీ ఆటగాళ్లు -
రూ.2 కోట్ల స్పోర్ట్స్ కారు.. క్షణాల్లో కాలి బూడిదైంది..
న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. రూ.2 కోట్లకు పైగా విలువ చేసే పోర్షె లగ్జరీ స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొట్టి కాలి బూడిదైంది. క్షణాల్లోనే అగ్నికి ఆహుతైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మన్కీరత్ సింగ్(35) అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున ఈ కారులో వెళ్తున్నాడు. ఈ సమయంలో అదపుతప్పి రోడ్డుపక్కన చెట్టును ఢీకొట్టాడు. దీంతో ఇంజిన్‌లో నుంచి మంటలు చెలరేగాయి. మన్కీరత్ ఎలాగోలా కాలిన గాయాలతో బయటపడ్డాడు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే కారుమాత్రం కాలిబుడిదైంది. వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో కారు భాగాలు 100 మీటర్ల దూరం వరకు వెళ్లిపడ్డాయి. చక్రాలు ఊడిపోయాయి. ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయే క్రమంలో మన్కీరత్ సింగ్ కారుపై నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అతను గోల్ఫ్ కోర్స్ రోడ్డులోని సెక్టార్ 56 నుంచి సికందేర్పూర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చదవండి: వామ్మో.. అర్ధరాత్రి ఇదేం పని.. బైక్‌లో పెట్రోల్ తీసి నిప్పంటించిన మహిళ.. -
ఆస్ట్రేలియా తీరంలో వింతచేప.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలోని విక్టోరియా నైరుతి తీరానికి భారీ పరిమాణంలోని వింత చేప ఒకటి కొట్టుకు వచ్చింది. దీనిని కేత్ రాంప్టన్, టామ్ రాంప్టన్ అనే దంపతులు తొలుత గుర్తించారు. చేప దాదాపు రెండు మీటర్ల పొడవు ఉంది. వీరిద్దరూ వెటర్నరీ డాక్టర్లే అయినా, ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి చేపను వారు చూసి ఉండలేదు. ఒడ్డుకు కొట్టుకొచ్చిన చేప అప్పటికే మరణించి ఉంది. రాంప్టన్ దంపతులు ఈ చేప ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు దీని గురించి కొంత అధ్యయనం చేయడంతో ఆసక్తికరమైన విశేషాలు బయటపడ్డాయి. ఇది ‘ఓషన్ సన్‌ఫిష్’ అని తేలింది. ‘ఓషన్ సన్‌ఫిష్’ జాతికి చెందిన చేపలు సైజులో భారీవే అయినా, సముద్రాల్లో వీటి సంఖ్య చాలా తక్కువ. అరుదైన చేపలు కావడంతో వీటి గురించి చాలామందికి తెలీదు. ఇవి పూర్తిగా ఎదిగితే, నాలుగు మీటర్ల పొడవు, రెండున్నర మీటర్ల వెడల్పు వరకు పెరుగుతాయని, దాదాపు రెండున్నర వేల కిలోల బరువు ఉంటాయని మెరైన్ బయాలజిస్టులు చెబుతున్నారు. ఇవి ఉష్ణమండల తీరాల వద్ద అప్పుడప్పుడు కనిపిస్తుంటాయని వారు అంటున్నారు. చదవండి: చెరువులో వింత జీవి.. ఒకటి, రెండు కాదు ఏకంగా ఇరవైనాలుగు కళ్లు! -
Video: బాణసంచా వెలుగుల్లో కొత్త సచివాలయం.. అదరహో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. సచివాలయ ఆవరణలో బాణసంచా పేల్చి చేసిన సంబురాలు అబ్బురపరిచాయి. రంగు రంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో కాంతూలీనిన కొత్త సెక్రెటేరియేట్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Big Day In Telangana Today… ❤️ Opening of New Telangana’s Secretariat 👏 Not Graphics like in other states 😀 It’s A Reality… The Best in India… Thanks to Visionary KCR Garu ✊️#Telangana #Secretariat 😍@KTRBRS pic.twitter.com/YQR07zozon — Govardhan Reddy Dharmannagari (@DGRforBRS) April 30, 2023 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. కొత్త సెక్రటేరియట్‌కు వచ్చిన కేసీఆర్‌కు అధికారులు ఘనస్వాగతం పలికారు. పోలీసులు తమ గౌరవవందనంతో సీఎంను ఆహ్వానించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్లోకి అడుగుపెట్టిన కేసీఆర్.. నిర్ణీత ముహూర్తానికి తన కుర్చీలో కూర్చున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. మొత్తం ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంతో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణకు గుండెకాయలాంటి సచివాలయాన్ని ప్రారంభించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అందరికీ నూతన సచివాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పరిపాలన కేంద్రం అత్యద్భుతంగా రూపుదిద్దుకుందని అన్నారు. తనతో పనిచేసిన, కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. సీఎం కేసీఆర్ కొత్త సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో తొలి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ శాఖకు సంబంధించి ఉన్నతాధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకోనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: కొంతమంది పిచ్చి కూతలు కూశారు -
Delhi Metro: లుంగీ అనుకుని స్కర్ట్ వేసుకున్నారా ఏంటి భయ్యా..?
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో తరచూ ఏదో ఒక ఘటనతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఇద్దరు యువకులు రోటీన్‌కు భిన్నంగా స్కర్ట్ ధరించి ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. స్నేహితులైన వీరిద్దరూ ఏం చక్కా అమ్మాయిలు వేసుకునే స్కర్టులతో మెట్రో ఎక్కారు. రిలాక్స్‌గా కన్పిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీరిని చూసిన తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. కొందరైతే పగలబడి నవ్వారు. కాగా.. ఈ ఫొటోలపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వచ్చాయి. వీరిద్దరూ లుంగీ అనుకుని పొరపాటున స్కర్ట్ ధరించారేమో అని ఓ యూజర్ ఛలోక్తులు విసిరాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. స్కర్ట్లు అమ్మాయిలే ధరించాలని రూల్ ఏమైనా ఉందా? సౌకర్యంగా ఉంటే అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు. అందులో తప్పేముంది అని వీరికి మద్దతు తెలిపారు. లుంగీకంటే ఇవే బాగున్నట్టున్నాయ్ ఫ్రీగా.. అని మరో యూజర్ రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Sameer Khan (@sameerthatsit) చదవండి: సోలో సెయిలింగ్ రేస్‌లో చరిత్ర సృష్టించిన భారత ఇండియన్ నేవీ ఆఫీసర్ -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 110 ఏళ్ల తర్వాత కన్పించిన పులి.. ఫొటో వైరల్..
చండీగడ్: హరియాణా యుమునానగర్ జిల్లాలోని కలెసర్ నేషనల్ పార్కులో 110 ఏళ్ల తర్వాత పులి కన్పించింది. పార్కులో ఏర్పాటు చేసిన కెమెరాలో పులి దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో హరియాణా అటవీ శాఖ మంత్రి, అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. చివరిసారిగా ఈ పార్కులో 1913లో పులి కన్పించదని, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కన్పించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ఈ పులి కాలి గుర్తులను పరిశీలించి దాని వయసు, లింగం వంటి ఇతర విషయాలు తెలుసుకోవాలని అటవీ అధికారులను మంత్రి ఆదేశించారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. ఈ పులి ఏప్రిల్ 18, 19 తేదీల్లో ఈ పార్కులో కన్పించింది. అయితే వన్యమృగం ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లోని రాజాజీ నేషనల్ పార్కు నుంచి కలెసర్ పార్కులోకి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే హిమాచల్ సింబల్బరా నేషల్ పార్కు కూడా కలెసర్ పార్కు పక్కనే ఉంది. దీంతో ఈ మూడు పార్కుల్లో పులి సంచరిస్తోందని, కానీ కలెసర్ పార్కులోనే నివాసముంటుందని అధికారులు భావిస్తున్నారు. కొద్ది రోజుల పాటు దీని కదలికలు పరిశీలిస్తే దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు. కాగా.. కలెసర్ నేషనల్ పార్కు ఎన్నో వన్యమృగాలకు నిలయంగా ఉంటోంది. 11,570 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ ప్రాంతంలో చిరుత పులులు, ఏనుగులు, ఇతర రకాల అడవీ జంతువులు నివసిస్తున్నాయి. అయితే పులి కన్పించండం మాత్రం 110 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చదవండి: ఆవు కడుపున సింహం పిల్ల! చూసేందుకు క్యూ కడుతున్న జనాలు -
#RCB: మాస్టర్ ప్లాన్.. ఆర్సీబీ పేరుతో అడ్డుపుల్ల!
ఐపీఎల్లో దురదృష్టమైన జట్టుగా పేరు పొందింది ఆర్సీబీ. కప్ అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికి ఆఖరి నిమిషంలో ఒత్తిడికి లోనవ్వడంతో టైటిల్ అందని ద్రాక్షలానే మిగిలిపోతుంది. ప్రతీసారి ఈ సాలా కప్ నమ్దే అంటూ బరిలోకి దిగే ఆర్సీబీ లీగ్ దశ వరకు బాగానే ఆడుతున్నా ప్లేఆఫ్ దశలో మాత్రం చతికిలపడుతూ వస్తోంది. గత మూడు సీజన్లుగా ఇదే తంతు. మూడుసార్లు ఐపీఎల్లో రన్నరప్‌గా నిలిచిన ఆర్సీబీ కనీసం ఈసారైనా టైటిల్ కొట్టాలని కోరుకుందాం. ఈ విషయం పక్కనబెడితే.. బుధవారం కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌కు హాజరైన ఒక చిన్నారి చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్సీబీ టైటిల్ కొట్టేవరకు నేను స్కూల్లో జాయిన్ అవను అంటూ ప్లకార్డు ప్రదర్శించడం ఆసక్తి రేపింది. మ్యాచ్ జరుగుతుండగా ఆ చిన్నారి ప్లకార్డు పట్టుకొని అటు ఇటు తిరగడం హైలెట్‌గా నిలిచింది. ఇదంతా ఒక వ్యక్తి వీడియో తీసి ట్విటర్లో షేర్ చేయగా చిన్నారి ట్రెండింగ్‌లో నిలిచింది. ఇది చూసిన అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేశారు. ''వాళ్లు టైటిల్ కొట్టినా.. కొట్టకపోయినా డబ్బులు వస్తాయి.. నువ్వు చదువుకుంటేనే గౌరవం వస్తుంది''.. ''ఈ చిన్నారి కోరిక తీరాలని కోరుకుందాం''.. ''ఆర్సీబీ కప్ గెలిస్తే ఓకే.. ఒకవేళ గెలవకపోతే పరిస్థితి ఏంటో మరి ఆలోచించుకో.. స్కూల్ ఎగ్గొట్టడానికి ఆర్సీబీ పేరుతో మాస్టర్ ప్లాన్ వేశావుగా'' అంటూ పేర్కొన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. గత మూడు మ్యాచ్‌ల్లో కోహ్లి స్టాండిన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సీజన్లో ఆర్సీబీ 8 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో ఐదో స్థానంలో ఉంది. చదవండి: ఎవర్రా మీరంతా?.. వదిలేస్తే వంద పరుగులైనా తీస్తారేమో! Dear RCB, please win IPL for your fans ❤ pic.twitter.com/0PHQoyshQe — leisha (@katyxkohli17) April 26, 2023 -
ధోనిని హత్తుకున్న ఫొటో షేర్ చేసిన కోహ్లి! తలైవాకు బిగ్గెస్ట్ ఫ్యాన్‌బాయ్!
IPL 2023- RCB Vs CSK: మహేంద్ర సింగ్ ధోని.. విరాట్ కోహ్లి.. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేర్లు. ఒకరు భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందిస్తే.. మరొకరు తన ఆట, కెప్టెన్సీతో అభిమానుల మనసు కొల్లగొట్టిన వారు. ఇక ఈ టీమిండియా మాజీ సారథుల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిస్టర్ కూల్ ధోని అంటే కోహ్లికి మాటల్లో చెప్పలేనంత అభిమానం. అన్నలా అండగా నిలబడి టీమిండియాలో కీలక బ్యాటర్‌గా.. కెప్టెన్‌గా ఎదగడంలో అతడికి ధోని అన్ని విధాలా సహకరించాడు. కోహ్లి ప్రతిభ నిరూపించుకునే క్రమంలో వరుస అవకాశాలు రావడానికి దోహదం చేస్తూ అన్నలా అండగా నిలబడ్డాడు. ఇక తనకు సరైన వారసుడు కోహ్లినే అని నమ్మిన తలైవా.. అతడిని కెప్టెన్ చేయడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా.. తన ‘జూనియర్’ సారథ్యంలో ఆడాడు కూడా! తలైవాను కలిసిన కింగ్ అంతేకాదు కెరీర్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న వేళ కోహ్లికి మద్దతుగా నిలిచాడు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లినే స్వయంగా వెల్లడించాడు. తనకు అన్నయ్యలా మారిన ఇలాంటి గొప్ప నాయకుడు మరెవరూ ఉండరంటూ సందర్భం వచ్చినపుడల్లా అభిమానం చాటుకుంటూనే ఉంటాడు. ఇక తాజాగా మరోసారి ధోనిపై ప్రేమను కురిపిస్తూ షేర్ చేసిన ఫొటో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఐపీఎల్-2023లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఇద్దరు దిగ్గజాలు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 8 పరుగుల తేడాతో సీఎస్కే చేతిలో ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే.. మ్యాచ్ సందర్భంగా ధోనిని కలిసిన కోహ్లి అతడితో సరదాగా ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్.. ‘‘ఇద్దరు దిగ్గజాలు’’ అంటూ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇదిలా ఉంటే.. ధోనిని ఆత్మీయంగా హత్తుకున్న ఫొటోను విరాట్ కోహ్లి మ్యాచ్ అనంతరం తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘తలాకు బిగ్గెస్ట్ ఫ్యాన్‌బాయ్’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. చదవండి: హ్యాట్సాఫ్.. ఆర్సీబీకి దొరికిన ఆణిముత్యం! 38 ఏళ్ల వయసులో.. నొప్పిని భరిస్తూనే.. Virat Kohli: దూకుడు ఎక్కువైంది.. కోహ్లికి ఊహించని షాకిచ్చిన బీసీసీఐ! A legendary duo 🙌@imVkohli 🤝 @msdhoni ❤️ 💛#TATAIPL | #RCBvCSK pic.twitter.com/5sOQDkdBLb — IndianPremierLeague (@IPL) April 17, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వైరల్‌గా వెడ్డింగ్ కార్డు.. దయచేసి పెళ్లికి రావొద్దు.. ఇదేం పద్ధతి!
ప్రస్తుత డిజిటల్ యుగంలోనూ పెళ్లి వేడుక అంటే కచ్చితంగా ఆహ్వాన పత్రికలు అచ్చేయిస్తున్నారు చాలా మంది. తమ బంధు మిత్రులు, స్నేహితులు, ప్రియమైన వారి ఇంటికి వెళ్లి లేదా పోస్టు ద్వారా పెళ్లి పత్రికను అందజేస్తారు. కుటుంబ సమేతంగా తప్పకుండా వివాహానికి రావాలని సంతోషంగా చెబుతుంటారు. అయితే ఈ పెళ్లి పత్రికే ఇప్పుడు ఓ కుటుంబం పరువు పోయేలా చేసింది. ప్రింటింగ్ కంపెనీ చేసిన చిన్నపొరపాటు వీరిని బంధమిత్రుల ఆగ్రహానికి గురి చేసింది. ఆహ్వాన పత్రికలో ఒక్క పదం మిస్ కావడం వల్ల మొత్తం అర్థమే మారిపోయింది. 'నేను ప్రేమతో ఈ ఆహ్వాన పత్రికను పంపిస్తున్నాను. మీరు మా పెళ్లికి రావడం మర్చిపోండి' అని వెడ్డింగ్ కార్డుపై ప్రింట్ అయింది. 'పెళ్లికి రావడం మర్చిపోకండి' అనే పదానికి బదులు ఒక్క అక్షరం మిస్ అయి మర్చిపోండి అని అచ్చయింది. దీంతో పెళ్లి కార్డు రిసీవ్ చేసుకుని చదివిన బంధువులు అవాక్కయై నోరెళ్లబెట్టారు. పెళ్లికి రావొద్దని పెళ్లి పత్రికలోనే చెప్పడం ఏంటి? బిత్తర పోయారు. ఈ పెళ్లి కార్డును ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. 'ఇదిగో నాకొక వివాహ ఆహ్వాన పత్రిక వచ్చింది. కానీ ఇది చూశాక పెళ్లికి వెళ్లాలో వద్దో ఏమీ అర్థం కావడం లేదు' అని అతడు రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు కొందరు ఆహ్వానితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లికి రావొద్దని మొహం మీదే చెప్పడం ఏంటి అని మండిపడ్డారు. ఇది నిజంగా అతిథులను అవమానించడమే, మీరు పెళ్లికి వెళ్లడం వారికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. ప్రేమ మాత్రం వాళ్లింటి దగ్గర, విందు మాత్రం వేరే చోటనా? అసలు ఎవరు ఈ పత్రిక ఇచ్చింది. అని మరో నెటిజన్ స్పందించాడు. ఇది నిజంగా అమమానించడమే పెళ్లికి తప్పకుండా పిలవాల్సిందిపోయి, మోహం మీదే రావొద్దని చెబుతారా? అని మరో యూజర్ కామెంట్ చేశాడు. మరొకరు స్పందిస్తూ పెళ్లికి రావడం మర్చిపో అని చెప్పడం మొట్టమొదటి సారి చూస్తున్నా..అని అన్నారు చదవండి: ఎండదెబ్బకు గబ్బిలాలు విలవిల.. వాటర్ స్ప్రే కొడుతున్న గ్రామస్థులు.. -
మొదట ముద్దుపెట్టాడు.. ఔటైతే సంబరపడ్డాడు
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు మొదలైంది. అయితే టాస్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హార్ధిక్ పాండ్యాకు.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అంటే చాలా ఇష్టం. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. తాజాగా పంజాబ్, గుజరాత్ మ్యాచ్ సందర్భంగా ఇద్దరు ప్రత్యర్థులుగా తలపడ్డారు. టాస్ వేయడానికి ముందు ఇద్దరు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో గబ్బర్ను హగ్ చేసుకున్న పాండ్యా అతని చెంపపై ముద్దుపెట్టడం అభిమానులకు ఆనందం కలిగించింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ఇదే పాండ్యా ధావన్ ఔటైనప్పుడు తెగ సంబరపడిపోయాడు. ఇందుకు ఒక కారణం ఉంది. ధావన్ ఈ సీజన్లో భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. 8 పరుగులకే వెనుదిరగడంతో పాండ్యాకు ఎక్కడిలేని సంతోషం కలిగింది. అందుకే ధావన్‌వైపు చూస్తూ రెండు చేతులను పైకి లేపి సాధించాం అన్నట్లుగా గట్టిగా అరిచాడు. ఇది చూసిన అభిమానులు.. ''ఏంటో ఈ పాండ్యా సిత్రాలు.. మొదట ముద్దుపెట్టాడు.. ఔటైతే సంబరపడ్డాడు.'' అంటూ కామెంట్ చేశారు. Hardik Pandya with Shikhar Dhawan. What a lovely picture! pic.twitter.com/eb1jcVBTjb — Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నిరుపేదలుగా మారిన బిల్ గేట్స్, ట్రంప్.. ‘ఇంత ఘోరంగా ఉన్నారేంటి!’
న్యూయార్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమలోని సృజనాత్మకను బయటకి తీస్తున్నారు. మిడ్ జర్నీ అనే కృత్రిమ మేధను వినియోగించి గోకుల్ పిళ్లై అనే ఆర్టిస్ట్ కోటీశ్వరుల్ని నిరుపేదలుగా మార్చేస్తున్నారు. కుబేరుల్ని మురికివాడల్లోకి తెస్తున్నారు. బిల్ గేట్స్, డొనాల్డ్ ట్రంప్, మార్క్ జుకర్‌బర్గ్, ఎలన్ మస్క్ వంటి బిలియనీర్స్ సరైన బట్టలు కూడా లేకుండా మురికి మురికిగా ఆ ఫొటోల్లో దర్శనమిస్తున్నారు. భారత వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ ఫొటోలను గోకుల్ పిళ్లై ఆన్లైన్లో షేర్ చేస్తూ ‘స్లమ్ డాగ్ మిలియనీర్స్’ అని క్యాప్షన్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో అవి వైరల్‌గా మారాయి!. View this post on Instagram A post shared by Gokul Pillai (@withgokul) ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడుతున్నారు. వీరందరిలో ఎలాన్ మస్క్ మాత్రం నిరుపేద అవతారంలో కూడా సూపర్ రిచ్‌గా కన్పిస్తున్నారని ఓ యూజర్ చమత్కరించాడు. ఎంతైనా మస్క్ మస్కే అంటు నవ్వులు పూయించాడు. కాగా.. కొద్ది రోజుల క్రితం మార్క్ జుకర్‌బర్గ్‌కు సంబంధించిన ఓ ఏఐ ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ అధునాతన సాంకేతికతో రూపొందించిన ఫొటోలు నిజమైన ఫొటోలోకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటున్నాయి. దీంతో అసలు ఫొటోలు, ఎడిట్ చేసిన ఫొటోల మధ్య తేడా కూడా కనిపెట్టలేని పరిస్థితి నెలకొంది. చదవండి: అమిత వేగంతో దూసుకెళ్తూ.. అడుగుకో నక్షత్రాన్ని పుట్టిస్తూ.. -
హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన మహిళా పోలీసులు.. నెటిజన్ల ఫైర్..
ముంబై: ద్విచక్రవాహనం నడిపేవారు హెల్మెట్ ధరించడం మన దేశంలో తప్పనిసరి. ఈ రూల్ అందరికీ వర్తిస్తుంది. మోటారు వాహన చట్టం సెక్షన్ 129లో ఈ నిబంధన ఉంది. దీంతో హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుంది. అయితే ముంబైలో ఇద్దరు మహిళా పోలీసులు హెల్మెట్ ధరించకుండానే స్కూటీ నడపడం చూసిన ఓ వ్యక్తి వెంటనే ఫొటో తీశాడు. ఓ సాధారణ పౌరుడు ఇలా చేస్తే ఉరుకుంటారా అని అధికారులను ప్రశ్నిస్తూ ఈ ఫొటోను ట్వీట్ చేశాడు. ఏకంగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో ముంబై పోలీసులను కూడా ట్యాగ్ చేశాడు. ట్రాఫిక్ నిబంధనలు వీళ్లకు వర్తించవా? వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోరా అని ఫైర్ అయ్యాడు. MH01ED0659 What if we travel like this ?? Isn't this a traffic rule violation ?@MumbaiPolice @mieknathshinde @Dev_Fadnavis pic.twitter.com/DcNaCHo7E7 — Rahul Barman (@RahulB__007) April 8, 2023 దీనిపై నెటిజన్లు కూడా స్పందించారు. ఈ మహిళా పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరికొందరేమో.. రూల్స్ ఎప్పుడూ సామాన్యులకే వర్తిస్తాయి, చట్టాలు చేసేవారికి, చట్టపరిరక్షకులకు అవి వర్తించవు అని అసహనం వ్యక్తం చేశారు.సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరగడంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు ఈ విషయంపై స్పందించారు. ఆ ఫొటో సరిగ్గా ఎక్కడ తీశారో చెప్పాలని పోస్టు చేసిన వ్యక్తిని అడిగారు. దీంతో అతడు ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే (దాదర్) అని బదులిచ్చాడు. అనంతరం ఈ మహిళా పోలీసులపై చర్యలు తీసుకుంటామని, మాతుంగా ట్రాఫిక్ డివిజన్ పోలీసులకు ఈ మేరకు ఆదేశాలు జారే చేశామని చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్లు శాంతించారు.భారత్‌లో హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే జరిమానా విధిస్తారు. ఇదే తప్పును పదే పదే రిపీట్ చేస్తే.. డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తారు. అరుదైన సందర్బాల్లో మూడు నెలల వరకు జైలు శిక్ష కూడా విధిస్తారు. చదవండి: ఒక్క బైక్‌పై ఐదుగురు యువకులు.. ఇదేం సరదా.. మైండ్ దొబ్బిందా..? -
'భయ్యా.. నీకున్న సౌలత్ మాకుంటే ఎంత బాగుండు'
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సాయి సుదర్శన్(62 నాటౌట్) టాప్ క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోకోగా.. కిల్లర్ మిల్లర్ 16 బంతుల్లో 31 నాటౌట్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో దుమ్ము దులిపిన గిల్ ఈ మ్యాచ్‌లో మాత్రం కేవలం 14 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే సోషల్ మీడియాలో గిల్ ఒక అభిమానికి ఇచ్చిన రిప్లై అందరిని ఆకట్టుకుంది. విషయంలోకి వెళితే.. ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు వస్తున్న క్రికెట్ ఫ్యాన్స్‌కు అందించే టికెట్స్ ధరలు రకరకాలుగా ఉన్నాయి. వాటిలో ఒకటి రూ. 20 వేల టికెట్ కూడా ఉంది. వీఐపీ ప్రీమియమ్ లాంజ్ టికెట్ అయిన దీనిని కొనుగోలు చేసిన వారికి రాచ మర్యాదలు చేస్తారు. పార్కింగ్ ఏరియా నుంచి ప్రీమియమ్ లాంజ్‌లోకి వెళ్లడానికి ఒక కార్‌ను కేటాయించారు. అందులో ఎక్కి స్టేడియం లోపల నుంచి ప్రీమియమ్ సూట్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక అభిమాని సీజన్ ఆరంభ మ్యాచ్ అయిన గుజరాత్ టైటాన్స్, సీఎస్కే మ్యాచ్‌కు రూ.20 వేల టికెట్ కొని మ్యాచ్‌ను ఎంజాయ్ చేశాడు. ప్రీమియమ్ లాంజ్ టికెట్ కొన్న విషయంతో పాటు ప్రీమియమ్ సూట్ కార్లో ఎక్కి లాంజ్‌కు చేరుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ ఫోటోకు వినూత్న స్పందన వచ్చింది తాజాగా గిల్ అభిమాని పెట్టిన ఫోటోపై ఫన్నీగా స్పందించాడు. ''భాయ్ నీకిచ్చిన సౌలత్ మాకుంటే ఎంత బాగుండు.. ఇలాంటి వాటికి పెట్టి పుట్టుండాలి. మైదానంలోకి ఎంటర్ అవ్వాలంటే మేం నడవాల్సిందే. కానీ ఇతనికి ఆ అవసరం లేకుండా నేరుగా లాంజ్ దగ్గరికి చేరడానికి కార్ సూట్ ఇచ్చారు. మేం కూడా డ్రెసింగ్‌రూమ్ నుంచి గ్రౌండ్లోకి ఎంటర్ కావడానికి ఇలా కార్ కేటాయిస్తే బాగుండేది నడిచే బాధ తప్పేది.. '' అంటూ పేర్కొన్నాడు. గిల్ ఇచ్చిన రిప్లై సూపర్ ఫన్నీగా ఉందని కొందరు అంటే.. మరి నడవడానికి కూడా ఇంత బద్దకమా అంటూ మరికొందరు పేర్కొన్నారు. చదవండి: Chahal-Umran Malik: 'మాట తప్పాడు.. చాలా బ్యాడ్‌గా అనిపిస్తోంది' -
మీరు సూపర్ మేడం.. ఐఏఎస్ అధికారిణిపై నెటిజన్ల ప్రశంసల వర్షం..
లక్నో: సామాన్య ప్రజలు తమ సమస్యల గోడు వినిపించేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగుతుంటారు. ఒక్కోసారి వారిని పట్టించుకునేవారే ఉండరు. ఉన్నత అధికారులను నేరుగా కలిసే అవకాశమే తక్కువ. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ దెహత్ జిల్లాలో ఓ ఐఏఎస్ అధికారిణి సౌమ్య పాండే మాత్రం తన సింప్లిసిటీతో నెటిజన్ల మనసులు దోచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పథకం ద్వారా ఎలక్ట్రిక్ బైక్ కొనేందుకు తనకు సాయం చేయాలని వెళ్లిన ఓ పెద్దాయన ధనీరామ్ సమస్యను ఆమె దగ్గరుండి తెలుసుకున్నారు. ఎండలోనూ అతని దగ్గరకు వెళ్లి వివరాలు అడిగి కచ్చితంగా సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. చీఫ్ డెవలెప్మెంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న సౌమ్య.. ఈ విషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దివ్యాంగుడైన ధనీరామ్ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసేందుకు అవసరమైన సాయం అంధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సౌమ్య పాండే.. ధనీరామ్ దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడుతున్న ఫొటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంత పెద్ద హోదాలో ఉండి సామాన్యుడితో సౌమ్య పాండే ప్రవర్తించిన విధానంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. నవ భారత్‌లో సరికొత్త ఉత్తర్‌ప్రదేశ్ ఇది.. చూడండి ఐఏఎస్ అధికారి సామాన్యుడి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు ఎలా తీసుకుంటున్నారో.. అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. చదవండి: రాహుల్ గాంధీకి నిరాశ.. కోర్టులో దక్కని ఊరట.. ఏప్రిల్ 13 వరకు బెయిల్ -
NMACC పార్టీలో టిష్యూ పేపర్ బదులుగా, రూ.500 నోటా? నిజమా?
సాక్షి, ముంబై: బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ‘నీతా ముఖేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం (NMACC)’ ప్రారంభం వేడుకల్లో మరో విషయం ఆసక్తికరంగా మారింది. టిష్యూ పేపర్లలా రూ. 500నోట్లను ఉంచారన్న వార్త ఇంటర్నెట్లో తెగ వైరల్ అయింది. (NMACC: డాన్స్‌తో ఇరగదీసిన షారూక్, గౌరీ, ఇక ప్రియాంక చోప్రా డాన్స్‌కైతే ) బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు, ఇతర ప్రముఖులు సందడి చేసిన అంబానీల గ్రాండ్ పార్టీపై ఒక ట్విటర్ యూజర్ ఒక పోస్ట్ పెట్టారు. అంబానీ జీ కే పార్టీ మే టిష్యూ పేపర్ కీ జగహ్ 500 కే నోట్స్ హోతే హై (sic)’’ అని ట్వీట్ చేశాడు. దీంతో రుచి కరమైన వంటకాలతో పాటు కరెన్సీ నోట్లు వడ్డించారా అంటూ నెటిజన్ల కామెంట్లు వైరలయ్యాయి. (అమ్మ విషయంలో అది చాలా బాధగా ఉంటుంది: ఇన్ఫీ నారాయణమూర్తి ) నీతా అంబానీ కలల ప్రాజెక్ట్ లాంచింగ్ సందర్భంగా వడ్డించిన తీపి పదార్థంపైనే ఈ చర్చ అన్నమాట. అతిథులకు వడ్డింయిన ఖరీదైన వంటకాలకు తోడు, ఈ స్వీటు, కరెన్సీ నోట్లతోపాటు ఉండటంతో ఈ ప్రత్యేక స్వీట్ ఫొటో హాట్ టాపిక్‌గా నిలిచింది. మీమ్స్‌తో నెటిజన్లు సందడి చేశారు. Ambani ji ke party mein tissue paper ki jagah 500 ke notes hote hain 😭 pic.twitter.com/3Zw7sKYOvC — R A T N I S H (@LoyalSachinFan) April 2, 2023 అయితే అసలు విషయం ఏమిటంటే.. ఈ స్వీట్ పేరు ‘దౌలత్ కి చాట్’ (daulat ki chaat) ఉత్తర భారతదేశంలో చాలా ఇష్టపడే వంటకం. ప్రత్యేకంగా శీతాకాలంలో ఎక్కువ సేవిస్తారట. బాగా మరిగించిన పాలను చల్లబరిచిన తర్వాత తయారు చేస్తారు. పిస్తా, కోవా,బాదం,చక్కెర తదితర రిచ్ ఇంగ్రీడియెంట్స్‌తో గార్నిష్ చేస్తారంటూ ఫుడ్ ఎక్స్పర్ట్స్, కొంతమంది నెటిజన్లు స్పందించారు. ఈ స్వీట్ ఢిల్లీలో కూడా చాలా పాపులర్ అని ఒకరు. ఇది చాలా రెస్టారెంట్లలో ఇది దొరుకుతుందని మరికొంతమంది వ్యాఖ్యానించారు. ఈ ఫుడ్ ఐటమ్ చుట్టూ పెట్టిన కరెన్సీ నోట్లు కూడా నకిలీవే అంటూ మరొకరు రిప్లై ఇచ్చారు. దీంతో అంబానీ పార్టీలో కరెన్సీ నోట్ల వడ్డన అనే ఊహాగానాలకు చెక్ పడింది. కాగా శుక్రవారం సాయంత్రం మొదలైన ఈ గ్రాండ్ ఈవెంట్ ఉత్సవాలు మూడురోజుల పాటుసాగాయి. నీతా అంబానీ స్వయంగా ప్రదర్శించిన నృత్యప్రదర్శనతోపాటు, బాలీవుడ్, హాలీవుడ్ తారల డ్యాన్స్‌లు, షారూక్, గౌరీ డాన్స్, ప్రియాంక చోప్రా, రణవీర్ స్టెప్పులు, టాలీవుడ్ ఆస్కార్ విన్నర్ సాంగ్ నాటునాటు పాటకు రష్మిక, అలియా నృత్యం, అలాగే శనివారం జరిగిన ఈవెంట్లో ఆస్కార్ విజేత ముంబైకి వచ్చి పింక్ కార్పెట్‌పై అలరించిన సంగతి తెలిసిందే. @Ruhaani77 pic.twitter.com/At1f4ZXr5Z — garima (@badanpesitaree) April 2, 2023 -
ఐపీఎల్‌కు ముందు కోహ్లీ చేతికి సరికొత్త టాటూ.. దీని అర్థం తెలుసా?
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి టాటూలు అంటే చాలా ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన శరీరంపై ఇప్పిటికే ఆకర్షణీయమైన పచ్చబొట్లు చాలా ఉన్నాయి. అయితే తాజాగా ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభోత్సావానికి ముందు కోహ్లీ చేతికి సరికొత్త టాటూ కన్పించడం అభిమానులను సర్ప్రైజ్ చేసింది. అలాగే ఈ టాటూ అర్థం ఏమై ఉంటుందా అనే ఎగ్జైట్మెంట్ కూడా నెలకొంది. అయితే ఈ టాటూ అసలు అర్థం ఏంటి? దాని వెనకాల ఎంత శ్రమ ఉంది? ఎందుకంత ప్రత్యేకత? అనే విషయాలు.. ఈ టాటు కోహ్లీకి వేసిన ప్రముఖ కళాకారుడు, ఏలియన్స్ టాటూ వ్యవస్థాపకుడు సన్నీ భానుశాలి స్వయంగా వివరించారు. 'మా టాటూలు నచ్చి కోహ్లీ స్వయంగా మా స్టూడియోకు వచ్చారు. మా పనితీరును తెలియజేసే ఫొటోలతో మా దగ్గరకు వచ్చారు. నా టాటూలకు పెద్ద అభిమానినని చెప్పారు. క్రికెట్లో సూపర్‌స్టార్ అయిన కోహ్లీ లాంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఇంత సింపుల్‌గా ఉంటారని అనుకోలేదు. అసలు కోహ్లీలో గర్వం లేదు. చాలా ఒదిగి ఉంటారు. సాధారణ వ్యక్తిలా ప్రవర్తిస్తారు. ఇంత మంచి ఆటిట్యూడ్ ఉన్న అతన్ని కచ్చితంగా ప్రశంసించాల్సిందే. ఇక నా పనితీరు నచ్చి కొత్త టాటూ వేయాలని కోహ్లీ నన్ను అడిగారు. తన పాత టాటూను కవర్ చేస్తూ కొత్తది ఉండాని చెప్పారు.' అని సన్నీ పేర్కొన్నారు. ఇక కోహ్లీ కొత్త టాటూ అర్థం కూడా చెప్పాడు సన్నీ. అన్ని విషయాల పరస్పర అనుసంధానాన్ని, సృష్టి మూలాన్ని సూచించేలా, ఉన్నతమైన వాటిని, ఏకత్వాన్ని, జీవిత నిర్మాణాన్ని, అన్నింటికీ మూలాన్ని తెలియజేస్తూ కోహ్లీ ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా ఈ టాటూను చాలా చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు వివరించారు. ఈ టాటూను చూసి కోహ్లీ మురిసిపోయాడని, అతనికి ఇది చాలా బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. 'ఈ టాటూ కోహ్లీకి ఎంత విలువైందో నాకు బాగా తెలుసు. అందుకే చాలా శ్రమించి నా మనసుపెట్టి అంకితభావంతో దీన్ని రూపొందించా. టాటూలో ప్రతీది అద్భుతంగా పర్ఫెక్ట్గా వచ్చింది. రెండు రోజులు, రెండు చోట్లకు వెళ్లి కోహ్లీకి ఈ టాటూ వేశా' అని సన్నీ పేర్కొన్నాడు. తొలిరోజు ముంబైలోనే కోహ్లీ అపాయింట్మెంట్ ఇచ్చాడని, ఆ తర్వాత మరో రోజు బెంగళూరుకు వెళ్లి టాటూ పూర్తి చేసినట్లు సన్నీ చెప్పాడు. కోహ్లీకి టాటూ వేసే సమయంలో స్టూడియోను మూసి వేసి భద్రతా కారణాల దృష్ట్యా భారీగా బౌన్సర్లను కూడా మోహరించినట్లు చెప్పాడు. టాటూ కోసం ఎన్ని గంటలు పట్టినా.. కోహ్లీ చాలా సహనంతో ఉన్నాడని, అసలు ఒక్క క్షణం కూడా అలసిపోయినట్లు కన్పించలేదని సన్నీ తెలిపాడు. టాటూ పూర్తైన తర్వాత చూసుకుని కోహ్లీ మైమరచిపోయాడని, ఆనంద పరవశంలో మునిగిపోయాడని వివరించాడు. ఈ టాటూ జీవితకాలం తనతో పాటు ఉంటుందని కోహ్లీకి తెలుసన్నాడు. చదవండి: ఐపీఎల్లో జయదేవ్ ఉనద్కట్ సరికొత్త రికార్డు! ఏకైక భారత క్రికెటర్‌గా -
నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా.. ఫొటోలు వైరల్..
భోపాల్: గతేడాది నమీబియా నుంచి మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కుకు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. కీడ్ని సమస్యతో ఈ పార్కులోని సషా అనే చీతా చనిపోయిన మూడు రోజులకే మరో చీతా ప్రసవించడం గమనార్హం. తల్లి, నాలుగు చీతా కూనలకు సంబంధించిన ఫోటో, వీడియోను కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ ట్విట్టర్లో షేర్ చేశారు. Congratulations 🇮🇳 A momentous event in our wildlife conservation history during Amrit Kaal! I am delighted to share that four cubs have been born to one of the cheetahs translocated to India on 17th September 2022, under the visionary leadership of PM Shri @narendramodi ji. pic.twitter.com/a1YXqi7kTt — Bhupender Yadav (@byadavbjp) March 29, 2023 దేశంలో అంతరించిపోయిన చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా నుంచి 8 చీతాలను గతేడాది సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా తీసుకొచ్చారు. వీటీలోనే ఒకటి చనిపోయింది. మిగతావి ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ 8 చీతాల తర్వాత దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను కూడా భారత్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇవి క్వారంటైన్లో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేస్తారు. చదవండి: రాజస్థాన్ హై కోర్టు కీలక తీర్పు.. 71 మంది చనిపోయిన పేలుళ్ల కేసు నిందితులు నిర్దోషులుగా విడుదల.. -
వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. చూస్తే గుండె గుభేల్..!
ఇంటర్నెట్లో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు చూస్తే ఒక్కోసారి గుండె ఆగినంత పని అవుతుంది. ముఖ్యంగా పాములు, అనకొండలకు సంబంధించిన దృశ్యాలు భయంకరంగా ఉంటాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ పైథాన్ వీడియోను చూస్తే మీరు హడలెత్తిపోవడం ఖాయం. సాధారణంగా అందరు పాము జాతుల్లో అనకొండ అతిపెద్దది అయి ఉంటుందని అనుకుంటారు. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద పాము రెటిక్యులేటెడ్ పైథాన్. దక్షిణ, ఆగ్నేయ ఆసియా వీటికి నిలయం. తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో ఈ పాముదే. The reticulated python (Malayopython reticulatus) is a python species native to South and Southeast Asia, It is the world's longest snake pic.twitter.com/gvTWFLA3Nq — Science girl (@gunsnrosesgirl3) March 25, 2023 అత్యంత భారీ సైజులో, నమ్మశక్యంగానీ రీతిలో ఉన్న రెటిక్యులేటెడ్ పైథాన్.. ఓ ఇంట్లో తిరుగుతూ కన్పించడం నెటిజన్లను విస్మయానికి గురి చేసింది. దీన్ని చూసిన కొందరికి దిమ్మతిరిగిపోయింది. ఇది నిజంగా పామేనా లేక గ్రాఫిక్సా అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ ఆయిన ఈ పాము వీడియోకు 50 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో నిడివి 17 సెకన్లు మాత్రమే ఉంది. పాము మెల్లగా ఓ ఇంటి గోడపై నుంచి లోనికి వెళ్లింది. ఎంత పెద్ద ధైర్యవంతుడైనా సరే.. ఈ పాము పరిమాణాన్ని చూస్తే హడలిపోయేలా ఉంది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలను పోస్టు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మరికొందరు హమ్మయ్య.. లక్కీగా ఈ పాము మా ఇంట్లో లేదు అని నవ్వులు పూయించారు. చదవండి: ఓ రేంజ్లో రివేంజ్ తీర్చుకున్న మహిళ.. ఏకంగా 20 ఏళ్లు కాపుగాసి.. -
నటి హరితేజ షాకింగ్ లుక్ వైరల్.. ఇలా మారిపోయిందేంటి?
ప్రముఖ నటి, యాంకర్ హరితేజ ఆన్ స్క్రీన్‌పైనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ మహా చలాకీగా ఉంటుంది. సినిమాల్లో తన యాక్టింగ్‌తో అలరించే ఆమె బుల్లితెర షోలలో తనదైన పంచ్ డైలాగులతో కడుపుబ్బా నవ్విస్తుంది. అంతేకాదు సటైరికల్ కామెంట్స్‌తో ఇంచుమించు మరో సూర్యకాంతంలా పేరు సంపాదించుకుందంటూ ఓ ఈవెంట్లో ఏకంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అన్న విషయం తెలిసిందే. అలా వచ్చిన క్రేజ్‌తో బిగ్‌బాస్ ఆఫర్ కొట్టేసింది. మొదటి సీజన్లో పార్టిసిపెంట్‌గా వెళ్లి మంచి పేరు సంపాదించుకున్న ఆమె అనంతరం అదే క్రేజ్‌ను కొనసాగించలేకపోయింది. ఇక 2021లో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన హరితేజ తరచూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ని పలకరిస్తుంది. తన ఫొటోలు, కూతురు ఫొటోలు షేర్ చేస్తూ నెట్టంట సందడి చేస్తుంది. ఈక్రమంలో ఆమె షాకింగ్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా ఆరింది. ఆఫర్స్ లేక ఇంటికే పరిమితమైన హరితేజ బరువెక్కిన సంగతి తెలిసిందే. అయితే సడెన్‌గా ఆమె బక్కచిక్కి కనిపిచింది. తాజాగా తన లంగావోణి ఫొటోలు షేర్ చేయగా.. అందులో చాలా సన్నగా కనిపించి షాకిచ్చింది. ఇక హరితేజను ఇలా చూసి ఆమె ఫాలోవర్స్ అంతా అవాక్కవుతున్నారు. సడెన్‌గా ఇంత చేంజ్ ఏంటీ? అంటూ ఆమె పోస్ట్‌పై స్పందిస్తున్నారు. అంతేకాదు ఆమె డైట్ ప్లాన్ ఏంటని కూడా ఆరా తీస్తున్నారు. ఇలా అస్సలు బాలేవు.. కాస్తా బొద్దుగా ఉంటేనే బాగున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా కూచిపూడి డ్యాన్సర్ అయిన హరితేజ యాంకరింగ్ చేస్తూ, సీరియల్స్‌లో నటించే చాన్స్ కొట్టేసింది. మనసు-మమతతో మంచి గుర్తింపు పొందిన ఆమె ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అందరి బంధువయ, దమ్ము, దువ్వాడ జగన్నాధం, అనగనగా ఓ ధీరుడు , విన్నర్ , అత్తారింటికి దారేది , ఉంగరాల రాంబాబు , రాజా ది గ్రేట్ వంటి హిట్ చిత్రాల్లో సహానటి పాత్రలు పోషించింది. చదవండి: వేడుకగా చరణ్ బర్త్‌డే పార్టీ.. టాలీవుడ్ తారల సందడి డైరెక్టర్‌తో ఏడేళ్లు ప్రేమ, పెళ్లి.. పెళ్లైన వారానికే నరకం చూశా: నటి జయలలిత -
జిన్‌పింగ్‌కి వంగి నమస్కరిస్తూ చేతిని ముద్దాడిన పుతిన్!ఇది నిజమేనా?
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మూడు రోజుల రష్యా పర్యటన కోసం సోమవారమే మాస్కో చేరకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అక్కడికి చేరుకున్న జిన్‌పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమై.. ఉక్రెయిన్ యుద్ధ శాంతి ప్రణాళిక చర్చలతో సహా పలు విషయాలను చర్చించనున్నారు. వాస్తవానికి ఈ యుద్ధంలో పాల్గొన్న ఇరు పక్షాలు తమ ఆందోళనలను విరమించి యుద్ధానికి ముగింపు పలికేలా చేయడమే ఈ పర్యటన లక్ష్యం. ఐతే ఉన్నతస్థాయి దౌత్య చర్చల మధ్య పుతిన్ జిన్‌పింగ్‌కి వంగి వంగి నమస్కరిస్తూ.. చేతిని ముద్దాడుతున్న పోటో ఒక్కసారిగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి సమయంలో ఈ ఫోటో మరిన్ని విభేదాలకు తావిచ్చేలా ఉడటంతో ఇది అసలు నిజమా? లేక ఫేక్ ఫోటోనా అని తనిఖీ చేయడం ప్రాంభించారు నిపుణులు. ఆ తర్వాత ఇది నకిలీదని తేలింది. ఆర్టిఫషియల్ టెక్నాలజీతో రూపొందించిన ఫోటో అని నిర్థారించారు. దీనిపై క్షణ్ణంగా విచారణ జరిపిన అమండా ఫ్లోరియన్ అనే అమెరికన్ జర్నలిస్ట్ ఇలాంటి ఫోటోలు హాంకాంగ్, పోలాండ్, ఉక్రెయిన్ మూలాలకు సంబంధించన సైట్లో దాదాపు 239 ఫోటోలను చూశానని, ఇది నకిలీదని తేల్చి చెప్పారు. ఇది నకిలీ ఫోటోనే అని ఫ్రెంచ్ టెక్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇమేజ్ డిటెక్టర్ సాయంతో నిర్థారించిందని తెలిపారు. ఆ ఫోటోను నిశితంగ పరిశీలిస్తే మనకు స్పష్టంగా అవగతమవుతుందని అన్నారు. ఉక్రెయిన్ వివాదా పరిష్కారం కోసం, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేసేందుకు జరగుతున్న భేటీని కాస్త దెబ్బతీసేలా ఈ ఫోటో ఉందన్నారు. ఈ ఫోటో కారణంగా ఇరు దేశాల మధ్య విభేదాలు సృష్టించి, సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉందన్నారు. ఈ మేరకు సదరు జర్నలిస్ట్ మాట్లాడుతూ..ఇలాంటి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నప్పుడూ..నెటిజన్లకు ఏది నకిలీ ఏది రియల్ అనేది తెలుసుకోవడం అత్యంత కీలకమని చెప్పారు. లేదంటే తప్పుడూ సమాచారం వ్యాప్తి చెందడమే గాక ఇరు దేశాల మద్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే పరిస్థితికి దారితీసుందని హెచ్చరించారు. అదీగాక సరిగ్గా చైనా అధ్యక్షుడు పర్యటనలో ఉండగా ..ఇలాంటి ఫోటోలు మరింత వివాదాలకు తెరితీసే ఆస్కారం ఏర్పడుతుందన్నారు. కాబట్టి అలాంటి వాటికి చెక్‌పెట్టేలా జాగ్రత్తగా ఉండటమేగాక, పూర్తిగా తెలుసుకున్నాకే ఇలాంటి ఫోటోలను షేర్ చేయమని సదరు జర్నలిస్ట్ నెటిజన్లను కోరారు. Wait a minute.... WTF is this? 👀 pic.twitter.com/FekVlBfZ63 — MAKS 22🇺🇦 (@Maks_NAFO_FELLA) March 20, 2023 (చదవండి: హాట్ టబ్‌లో సేద తీరుతున్న జంటపై సడెన్‌గా మౌంటైన్ లయన్ దాడి..ఆ తర్వాత..) -
హోటల్లో షాకిచ్చిన వెయిటర్.. కస్టమర్ కూల్‌గా ఏం చేశాడంటే!
దక్షిణాదిలో ప్రజలు తమ టిఫిన్ సెక్షన్లో ఎక్కువగా తినే వంటకాల జాబితాలలో మసాల దోస ఖచ్చితంగా ఉంటుంది. ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే దోసలందు మసాల దోస టేస్ట్ వేరయా అన్నట్లు ..దాని తిని ఆశ్వాదించాల్సిందే తప్ప మాటలతో చెప్పలేము. అంతటి ప్రాముఖ్యమున్న వంటకానికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తికి ఆకలి వేసి ముంబైలోని కృష్ణ ఛాయా హోటల్‌కు వెళ్లాడు. తనకు ఇష్టమైన మసాల దోస ఆర్డర్ చేశాడు. కాసేపటి తర్వాత వెయిటర్ తన ఆర్డర్‌ను తీసుకువచ్చి ఇచ్చాడు. అయితే అది చూసి సదరు వ్యక్తి షాక్ అయ్యాడు. ఎందుకంటే.. తాను ఆర్డర్ చేసిన మసాలా దోశను.. మసాలా విడిగా, దోశను విడిగా సర్వ్ చేశాడు ఆ వెయిటర్. ఆకలి మీద ఉన్న ఆ వ్యక్తి సాంబర్, చట్నీతో దోశ తిని సరిపెట్టుకున్నాడు. మరి మిగిలిన మసాలాను ఏం చేశాడన్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. తన ట్వీట్లో.. "నేను ఒక ఫుడ్ బ్లాగర్ని. నిన్న కృష్ణ ఛాయా దగ్గర మసాలా దోసె ఆర్డర్ చేసాను. లోపల ఏం జరిగిందో తెలియదు గానీ వాళ్ళు మసాల దోసకు బదులుగా.. దోస విడిగా, మసాలా విడివిడిగా సర్వ్ చేశారు. నేను దోసె తిన్నాను. విడిగా ఇచ్చిన మసాలాను ఇంటికి తీసుకెళ్లి ఫ్రిజ్‌లో ఉంచాను. ఆ తర్వాత రోజు దాచిన మసాలతో నా ఇంట్లో మసాల దోశ చేసుకుని తిన్నాను. టెస్ట్ ఓహోహో!" అని మసాల దోశ ఫోటోని షేర్ చేశాడు. ఆ వ్యక్తి పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు అతని క్రియేటివికి ఫిదా అయ్యి కామెంట్ల వర్షం కురిపించారు. Main bhi food blogger. I ordered a masala dosa from Krishna Chhaya yesterday. They sent the dosa and masala separately. I ate the dosa. Refrigerated the masala. And made my own masala dosas at home today. Ohoho! pic.twitter.com/Xbxvw4E1Ms — Ramki (@ramkid) March 19, 2023 -
కోహ్లి విషయంలో స్మిత్ మొన్న అలా.. నిన్న ఇలా! బీసీసీఐ ట్వీట్ వైరల్
India vs Australia, 4th Test: టీమిండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇరు జట్ల మధ్య పోటాపోటీ క్రికెట్ ప్రేమికులకు మజా అందిస్తుంది. ఇక బోర్డర్- గావస్కర్ ప్రతిష్టాత్మక ట్రోఫీ గురించి చెప్పేదేముంది. సంప్రదాయ క్రికెట్లో ఇరు మేటి జట్లు తలపడుతుంటే ముచ్చటగా ఉంటుంది. అయితే, అదే సమయంలో స్లెడ్జింగ్ చేస్తూ శ్రుతిమించే ఆటగాళ్లను చూస్తే కాస్త చిరాకేస్తుంది. కానీ.. ఈసారి టీమిండియా- ఆసీస్ టెస్టు సిరీస్‌లో పిచ్ గురించి మినహా పెద్దగా మాటల యుద్ధాలు కనిపించలేదు. అందుకు భిన్నంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి- ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ మధ్య ‘బ్రొమాన్స్’ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తున్నాయి. మొన్న అలా చాలా కాలం తర్వాత టెస్టుల్లో కోహ్లి అర్ధ శతకం నమోదు చేసిన తర్వాత స్మిత్ అతడికి దగ్గరికి వచ్చి బ్యాట్ చెక్ చేస్తూ.. ఆ తర్వాత ఇద్దరూ నవ్వుకుంటున్న దృశ్యాలు వైరల్ అయిన విషయం తెలిసిందే. బీజీటీ- 2023లో ఆఖరిదైన అహ్మదాబాద్ టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఆదివారం నాటి నాలుగో రోజు ఆటలో రన్‌మెషీన్ కోహ్లి హాఫ్ సెంచరీని శతకంగా మలిచిన సంగతి తెలిసిందే. కెరీర్లో 75వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేసిన కోహ్లి.. డబుల్ సెంచరీ దిశగా పయనించగా టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో 186 పరుగుల వద్ద బ్రేక్ పడింది. వెన్నుతట్టి.. దీంతో కోహ్లి పెవిలియన్ చేరుతున్న సమయంలో అతడిని అభినందించిన స్మిత్.. కోహ్లి చేతిలో చెయ్యి వేసి శభాష్ అన్నట్లుగా వెన్నుతట్టాడు. తన పట్ల స్మిత్ ఆప్యాయతకు బదులుగా కోహ్లి చిరునవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను.. ‘‘పరస్పర గౌరవం.. ఆరాధ్య భావన’’ అంటూ బీసీసీఐ ట్విటర్లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఫొటో ఎంత బాగుందో! ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘స్మిత్ నిన్ను ఇలా చూస్తుంటే బాగుంది. కింగ్ కోహ్లిని నువ్వు అభినందించిన తీరు మా హృదయాలు గెలుచుకుంది. ఆటలో మాత్రమే ప్రత్యర్థులు.. ఆటగాళ్లంతా ఒక్కటే అని మరోసారి నిరూపితమైంది. ఈ ఫొటో ఎంత బాగుందో!’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా భారత్- ఆస్ట్రేలియా మధ్య 75 ఏళ్ల అనుబంధాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మార్చి 9న అహ్మదాబాద్ టెస్టు ఆరంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు ఆట సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ- ఆంటోనీ ఆల్బనీస్ స్టేడియానికి విచ్చేసి ఆటగాళ్లను కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ నేపథ్యంలో కోహ్లి- స్మిత్ ఫొటో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే.. 1205 రోజుల తర్వాత... అహ్మదాబాద్ టెస్టులో శతకం బాదిన కోహ్లి పలు రికార్డులు సృష్టించాడు. ఈ క్రమంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చదవండి: 21 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు అనుకున్నది సాధించిన సంజూ శాంసన్ Ind vs Aus- Ahmedabad Test: ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా! ఇంకా మరెన్నో.. 📸 Respect and admiration 👏👏#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/e5QJcj4OiL — BCCI (@BCCI) March 12, 2023 -
సుధామూర్తి సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు
సుధామూర్తి.. భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్తాపకులు నారాయణమూర్తి భార్య, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్తగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. విద్యావేత్త, రచయితగా, సామాజిక సేవకురాలిగా అనేక కార్యక్రమాలను నిర్వహించి మంచి పేరును సంపాదించారు. అంతేగాక ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ రంగాలలో ఆమె అందించిన సేవలకుగానూ భారత ప్రభుత్వం సుధామూర్తిని పద్మభూషన్, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. అయితే సంపన్న కుటుంబం, వేల కోట్ల ఆస్తులు, ఉన్నత స్థాయిలో ఉన్న సూధామూర్తి ఎప్పుడూ గర్వాన్ని ప్రదర్శించుకోరు. మాటల్లోనూ, చేతల్లోనూ ఎంతో నిరాడంబరత ప్రదర్శిస్తూ అందరి మన్ననలు అందుకుంటారు. తాజాగా మరోసారి ఆమె తన సింస్లిసిటీతో వార్తల్లోకెక్కారు. కేరళ తిరువనంతపురంలోని అట్టుకల్ భగవతి ఆలయంలో మంగళవారం జరిగిన ప్రసిద్ధ పొంగళ(Pongala) పండుగకు వేలాది మంది మహిళలు తరలివచ్చారు. ఈ వేడుకలను తిలకించేందుకు సుధామూర్తి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆమె అనేకమంది మహిళల మధ్య కూర్చొని పొంగళి (బియ్యం,కొబ్బరి, బెల్లంతో చేసే తీపి వంటకం) తయారు చేసి దేవతకు సమర్పించారు. అంతేగాక భక్తులకు ప్రసాదం వడ్డించడంలోనూ సాయం చేశారు. అయితే సుధామూర్తి వద్ద భద్రత, వీఐపీ హడావిడి లేకపోవడంతో తనను ఎవరూ గుర్తించలేకపోయారు. మహిళలందరితోపాటే గుడి వద్ద మండుతున్న ఎండలో కూర్చొని నైవేద్యాన్ని సిద్ధం చేస్తున్న ఆమె ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. A totally humbling experience. This is Sudha Murthy, Rishi Sunak's(PM) mother in-law!!!#SudhaMurthy #RishiSunak pic.twitter.com/ZrEAAHnds7 — Viren Patel (@shaakbhaji) March 11, 2023 సుధామూర్తి ఇంత సింపుల్‌గా కనిపించడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. భర్త, అల్లుడు గొప్ప స్థానంలో ఉన్నా ఆమెలో ఒకింత కూడా గర్వం నిపించడం లేదని ప్రశంసిస్తున్నారు. కాగా అత్యధికంగా మహిళలు తరలివచ్చే అట్టుకల్ పొంగళ పండుగకు తాను రావడం ఇదే తొలిసారి అని మూర్తి తెలిపారు. ఎంతో మంది మహిళలు కలిసి ఈ వేడుకలు చేసుకుంటున్నారని, అంతా ఒక్కటే అనే సందేశమిచ్చేదే ఈ వేడుక అని పేర్కొన్నారు. అందరూ సమానమేనన్న ఈ భావన తనకెంతో నచ్చిందన్నారు. i am proudly say that the women empower of india sri sudha murthy to lead our generation to power missile her is the founder of infosys nd everyone learns alot from her how to respect our culture traditions simplicity 🙏 @AskAnshul @SriSri @NameisNani @imVkohli @narendramodi pic.twitter.com/VTxAHxEprO — Rakurthi Suresh (@SureshnaiduR) March 10, 2023 చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. అంతటితో ఆగకుండా.. -
ఆమిర్ ఖాన్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన! ఆయనకు ఏమైంది?
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కొంతకాలంగా బయటకు రావడం లేదు. ఇటీవల ఆయన నటించిన లాల్ సింగ్ చద్ధా మూవీ అనంతరం ఆయన మీడియా ముందుకు పెద్దగా రావడం లేదు. అలాగే షూటింగ్స్‌లో సైతం పాల్గొనడం లేదనే సమాచారం. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ జైపూర్ జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఆమిర్ ఖాన్ సందడి చేశారు. చదవండి: మహేశ్ మేకప్ మ్యాన్ ఇంట విషాదం.. స్వయంగా వెళ్లి పరామర్శించిన నమ్రత! రాజస్థాన్‌లో జరిగిన ప్రముఖ ఆసియానెట్ కె మాధవన్ కుమారుడి వివాహానికి కమల్ హాసన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, కరణ్ జోహార్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా బాగా వైరల్ అవుతున్నాయి. స్టార్స్ అంత ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్‌కు కనుల విందుగా ఉంది. ఈ వివాహ వేడుకులో అక్షయ్, మోహన్ లాల్లు డాన్స్ చేస్తుండగా పక్కనే ఆమిర్ నిలబడి కనిపించాడు. చదవండి: అందుకే సినిమాలు చేయడం మానేశా: నటి హేమ అయితే అక్కడ ఆయన చేతితో స్టిక్ పట్టుకుని ఉన్నాడు. ఆయన చేతితో స్టిక్ పట్టుకుని జాగ్రత్తగా నడుస్తూ కనిపించాడు. దీంతో ఆయనకు ఏమైందా అని అభిమానులంత ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎందుకు స్టిక్ పట్టుకుని నడుస్తున్నారు? ఆయన కాలికి ఏమైంది? అంటూ ఫ్యాన్స్, నెటిజన్ల నుంచి ప్రశ్న వర్షం కురుస్తోంది. అయితే ఆమిర్‌కు ఏమైందనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మరి దీనిపై ఆమిర్ స్పందించాలని, తన ఆరోగ్యంపై అప్డేట్ ఇవ్వాలని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
North Korea: కిమ్ సైన్యంలో 'జాంబీలు'.. ఫొటో వైరల్..!
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. ఇటీవల సైనిక పరేడ్‌ను అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరేడ్‌లో శక్తిమంతమైన ఆయుధాలతోపాటు అత్యాధునిక, భారీ అణు క్షిపణులను ప్రదర్శించి శత్రు దేశాలకు తన సత్తా ఏంటో తెలిసేలా చేశారు. అయితే సైనిక పరేడ్‌లో పాల్గొన్న ఓ యూనిట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అదే జాంబీ యూనిట్. కిమ్ సైనిక పరేడ్‌లో జాంబో యూనిట్‌ను చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. జాంబీల్లా కన్పిస్తున్న ఈ సైనికుల పరేడ్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. మొహానికి రంగులు వేసుకుని ఒళ్లంతా పచ్చగడ్డి కప్పుకున్నట్లుగా కన్పించిన సైనిక వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. ఈ పరేడ్‌లో క్షిపణులు, అత్యాధునిక ఆయుధాలు, రాకెట్ల కంటే జాంబీ యూనిట్‌ను చూసినప్పుడే తాను భయపడ్డాని అతను చెప్పుకొచ్చాడు. కాగా.. కొరియన్ పీపుల్ రివల్యూషన్ ఆర్మీ వార్షికోత్సవం సందర్భంగా కిమ్ బుధవారం ఘనంగా సైనిక పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పదేళ్ల కూతురు కిమ్ జూ అయే కూడా పాల్గొన్నారు. దీంతో కిమ్ తర్వాతే ఈమే ఉత్తర కొరియాను పాలించేందుకు సన్నద్ధమవుతోందనే ప్రచారం ఊపందుకుంది. కిమ్ జూ అయే బహిరంగంగా ప్రజలకు కనిపించడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. చదవండి: యద్ధాన్ని ఆపేలా పుతిన్‌ని మోదీ ఒప్పించగలారా? -
'అలా చూస్తూ ఉండిపోయావు.. ఎవరు పిల్లా నువ్వు?'
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా ఇప్పటికి ధోనికి అభిమానులు ఎక్కువే. అందుకు ధోని కళ్లలో కనిపించే కూల్‌నెస్, చిరునవ్వే కారణం. ధోని లుక్స్‌కు, నవ్వుకు ఎంతటి వారైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. ఈ జాబితాలో ఎందరో యువతులు, మహిళలు కూడా ఉన్నారు. మరి అలాంటి ధోని తమ కళ్ల ముందు నుంచి పోతుంటే అతనితో సెల్ఫీలు, ఫోటోలు దిగడానికి ఎగబడడం సహజంగా చూస్తుంటాం. తాజాగా ఎక్కడ జరిగిందో సరిగ్గా తెలియదు కానీ.. ధోని కూల్ స్మైల్, చిరునవ్వుకు ఒక యువతి ఫ్లాట్ అయిపోయింది. ఒక ప్రమోషన్‌కు సంబంధించిన కార్యక్రమం ముగించుకొని తన కారు దగ్గరికి వస్తున్న సమయంలో ధోని ఆ యువతి కంట పడ్డాడు. అంతే పక్కన పరిసరాలను మరిచిపోయి ధోనిని అలా చూస్తూ ఉన్నచోటనే బొమ్మలా నిలబడిపోయింది. ఆ సమయంలో సదరు యువతి ధోనిని చూస్తూ ఇచ్చిన చిరునవ్వు అందరిని ఆకట్టుకుంది. ధోనిని కవరేజ్ చేయడానికి వచ్చిన ఒక ఫోటోగ్రాఫర్ ఆ యువతి ఫోటోలను కూడా క్లిక్‌మనిపించాడు. ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కాసేపటికే వైరల్‌గా మారాయి. ''నీ నవ్వుతో మా మనుసులు దోచేశావు.. ఎవరు పిల్లా నువ్వు''.. అని ఒకరు కామెంట్ చేస్తే.. ''ధోని భయ్యాను చూసి నువ్వు ఫ్లాట్ అయితే.. నీ అందాన్ని చూసి నేను ఫ్లాటయ్యా'' అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేయడం ఆసక్తి కలిగించింది. చదవండి: ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నిన ధోని.. వీడియో వైరల్ 'జబ్బలు చరుచుకున్నారు.. ఇప్పుడేమైంది' -
అమ్మను హత్తుకున్న మధురజ్ఞాపకం! ఆయన వల్లే ఇదంతా అంటూ భావోద్వేగం
India vs Australia, 1st Test- KS Bharat: ‘‘నేను ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టినపుడు ఇక్కడి వరకు చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. సుదీర్ఘ ప్రయాణంలో.. ఇప్పుడిలా.. నా టెస్టు జెర్సీని చూసిన క్షణాలు అత్యంత విలువైనవి. నాకిది గర్వకారణం! ఈ ప్రయాణం భావోద్వేగాలతో కూడుకున్నది’’ అంటూ వికెట్ కీపర్ బ్యాటర్ కోన శ్రీకర్ భరత్ ఉద్వేగానికి లోనయ్యాడు. దేశవాళీ క్రికెట్లో ఆంధ్ర జట్టుకు ఆడుతున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆస్ట్రేలియాతో మొదటి టెస్టు సందర్భంగా అరంగేట్రం చేశాడు. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యుల నడుమ టీమిండియా క్యాప్ అందుకున్న భరత్.. తన తల్లిని హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఆయన వల్లే ఇదంతా.. ఈ నేపథ్యంలో భరత్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ‘‘నేనిక్కడివరకు వచ్చానంటే అందుకు కారణం మా కోచ్ జై క్రిష్ణారావు. నాపై నాకు నమ్మకం లేని సమయంలో ఆయన నాపై విశ్వాసం ఉంచారు. నిజానికి నాపై నాకంటే ఆయనకే ఎక్కువ నమ్మకం. ఆయన వల్లే ఇదంతా! ఒక్కరోజులో ఇదేమీ సాధ్యం కాలేదు. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చాను. 2018లో ఇంగ్లండ్‌తో ఇండియా-ఏ తరఫున ఆడినపుడు రాహుల్ సర్ నన్ను మొదటిసారి చూశారు. చాలా సేపు మేము మాట్లాడుకున్నాం. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఆడటమే నాకు ముఖ్యం. నేనెప్పుడూ అలాగే ఆలోచించాలని ఆయన నాతో చెబుతూ ఉంటారు’’ అని 29 ఏళ్ల కేఎస్ భరత్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: IND vs AUS: తొలి బంతికే సిరాజ్ వికెట్.. రోహిత్, ద్రవిడ్ రియాక్షన్ మామూలుగా లేదుగా! వీడియో వైరల్ KS Bharat: కేఎస్ భరత్ అరంగేట్రం.. సీఎం జగన్ శుభాకాంక్షలు View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్ జంట.. బేబీ ఫొటో వైరల్..
తిరువనంతపురం: కేరళ కోజికోడ్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ జంట జియా పావల్, జహద్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. కొద్ది రోజుల క్రితమే వీరికి సంబంధించిన ప్రెగ్నెన్సీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాగా.. కోజికోడ్ మెడికల్ హాస్పిటల్లో బుధవారం ఉదయం జహద్ సిజేరియన్ ద్వారా ప్రసవించింది. పుట్టింది ఆడ బిడ్డా లేక.. మగబిడ్డా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తమ బిడ్డ ఫొటోను జియా సోషల్ మీడియాలో షేర్ చేశారు. బేబీ 2.9 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు కావాలనే తమ కల ఇన్నాళ్లకు నెరవేరినందుకు సంతోషంగా ఉందని, ఆనంద బాష్పాలు వస్తున్నాయని భావోద్వేగానికి లోనయ్యారు. తమకోసం ప్రార్థించిన వారికి, మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పుట్టుకతో మగ అయిన జియా శస్త్రచికిత్స చేయించుకొని స్త్రీగా మారుతోంది. పుట్టుకతో స్త్రీ అయిన జహద్ శస్త్ర చికిత్సతో పురుషుడిగా మారాలనుకున్నాడు. అయితే ఇంతలోనే జహద్ గర్భం దాల్చడంతో ఇద్దరూ ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
17 గంటలపాటు ఆ శిథిలాల కిందే.. తమ్ముడి కోసం ఆ చిన్నారి..
టర్కీలో ఘోరమైన భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భవనాలన్నీ పేకమేడల్లా కూలిపోయి శిథిలాల నగరంగా మారింది. ఎటు చూసినా మనసును కలిచి వేసే దృశ్యాలే. తల్లులను పోగొట్టుకున్న చిన్నారులు ఒకవైపు పిల్లలను పోగొట్టుకుని గర్భశోకంతో ఆక్రందనలు చేస్తున్న తల్లిదండ్రులు మరోవైపు. అక్కడి కన్నీటి రోదనలు ప్రకృతే విలపించేలా విషాదంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఒక వైరల్ ఫోటో అందరి హృదయాలను ద్రవింపచేసింది. ఆ ఫోటోలో ఇద్దరు చిన్నారులు శిథిలాల కింద తమను కాపాడే వారి కోసం బిక్కు బిక్కుమంటూ ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు ఉంది. అందులో ఆ చిన్నారి తన తమ్ముడి తలపై చేయి వేసి శిథిలాల కింద నలిగిపోకుండా కాపాడుతోంది. వాళ్లు అలా శిథిలాల కింద సుమారు 17 గంటల పాటు చిక్కుపోయినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఫోటోను ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మహ్మద్ సఫా ట్విట్టర్లో షేర్ చేశారు. ఆయన ట్విట్టర్లో.." ఆ ఏడేళ్ల బాలిక తమ్ముడిని రక్షించుకోవడానికి పడుతున్న తాపత్రయం మనసును పిండేస్తుంది. ఈ ఫోటోని ఎవరూ షేర్ చేయలేదు, ఆ చిన్నారి చనిపోక మునుపే షేర్ చేయండి. ఆ చిన్నారులు బతకాలని కోరుకుందాం. పాజిటివ్‌గా ఆలోచిద్దాం" అని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు తమ్ముడి మీద ఆ చిన్నారికి ఉన్న ప్రేమకు ఫిదా అవుతూ..ఏ అక్క చేయని సాహసం చేస్తోంది ఆ చిన్నారి. వారిద్దరూ బతకడమే గాక ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ..ట్వీట్లు చేశారు. The 7 year old girl who kept her hand on her little brother's head to protect him while they were under the rubble for 17 hours has made it safely. I see no one sharing. If she were dead, everyone would share! Share positivity... pic.twitter.com/J2sU5A5uvO — Mohamad Safa (@mhdksafa) February 7, 2023 (చదవండి: ఆ విమానం కూలి మంటల్లో చిక్కుకుంది..కానీ ఆ ఇద్దరు పైలట్లు..) -
‘హీరో’కు ఏమాత్రం తీసిపోడు! ఏం మాట్లాడుతున్నారు? నిజంగానే..
MS Dhoni New Look Viral: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌కు మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన ఈ మిస్టర్ కూల్‌కు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొన్నప్పటికీ అతడికి ఉన్న ఫాలోయింగ్ ఇసుమంత కూడా తగ్గలేదనడంలో అతిశయోక్తి లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న ధోని.. ఇప్పటికీ తన ఆటతో అలరిస్తూనే ఉన్నాడు. ఇక ఇటీవల రాంచిలో న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా అక్కడికి రాగా తలా.. తన ఎంట్రీతో భారత ఆటగాళ్లను సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తన సతీమణి సాక్షితో కలిసి సొంతమైదానంలో జరుగుతున్న మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాడు. దీంతో కెమెరాలన్నీ ధోనిపైనే ఫోకస్ అయ్యాయంటే అతడి మేనియా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. తాజాగా ధోనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీస్ డ్రెస్‌లో పోలీస్ డ్రెస్‌లో లాఠీ చేతబట్టి సహచరులతో కలిసి ధోని నడుస్తున్నట్లుగా ఉన్న ఆ చిత్రం అభిమానులను కట్టిపడేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘సినీ హీరోకు ఏమాత్రం తగ్గకుండా ఉన్నాడు. సింగం సిరీస్‌లో తదుపరి నువ్వే కథానాయికుడివి. రోహిత్ శెట్టి కన్ను నీపై పడటం ఖాయం భయ్యా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. MS Dhoni as a police officer in an ad. pic.twitter.com/nleS9DR8bh — Johns. (@CricCrazyJohns) February 2, 2023 అయితే, ధోని ఫ్యాన్స్ మాత్రం.. ‘‘ఏం మాట్లాడుతున్నారు.. హీరోలా ఉండటమేంటి.. నిజ జీవితంలో హీరో తను’’ అని అభిమానం చాటుకుంటున్నారు. కాగా ఈ ఫొటో ఓ టీవీ యాడ్‌కు సంబంధించినదిగా సమాచారం. ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని భారత జట్టు 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. సైనికుడిగానూ.. ఇక టీమిండియా తరఫున 350 వన్డేలు, 98 టీ20లు, 90 టెస్టులు ఆడిన జార్ఖండ్ డైనమైట్ ధోని 17 వేల పరుగులు సాధించాడు. ఆగష్టు 15, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తలా.. సీఎస్కే కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. కాగా క్రీడా రంగంలో.. ధోని సేవలను గుర్తించిన కేంద్రం అతడికి టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించింది. సినీ రంగంలో.. ఇదిలా ఉంటే.. ధోని ఇటీవలే సినిమా రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భార్య సాక్షితో కలిసి ‘ధోని ఎంటర్టైన్మెంట్’అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. తమ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి సినిమాకి సంబంధించిన ప్రకటనను ఇటీవలే విడుదల చేశారు. ‘ఎల్జీఎం’ (లెట్స్ గెట్స్ మ్యారీడ్) పేరిట కోలీవుడ్ సినిమా నిర్మించనున్నారు. చెన్నైకి ప్రాతినిథ్యం వహిస్తున్న తలా ఇలా అక్కడి సినీ పరిశ్రమపై దృష్టి పెట్టడం గమనార్హం. చదవండి: Joginder Sharma: రిటైర్మెంట్ ప్రకటించిన 2007 టి20 ప్రపంచకప్ హీరో Ind Vs Aus: నాలుగురన్నరేళ్ల పైనే అయింది.. టెస్టుల్లో రీ ఎంట్రీపై హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు -
వాళ్లిద్దరు నిజంగా కలిశారా..?
Fact Check.. టీమిండియా యంగ్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం జట్టులో భవిష్యత్తు ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. తనకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న గిల్ మూడు ఫార్మట్లలోనూ(టెస్టు, వన్డే, టి20లు) కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. ఓపెనింగ్ స్థానంలో వస్తూ సెంచరీలతో దడ పుట్టిస్తున్న గిల్ రానున్న కాలంలో జట్టులో కీలక బ్యాటర్‌గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవలీ న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే, టి20 సిరీస్‌లోనూ శుబ్‌మన్ గిల్ అదరగొట్టాడు. ముఖ్యంగా టి20 ఆటకు సరిపోడు అని విమర్శలు వచ్చిన వేళ.. కివీస్‌తో జరిగిన మూడో టి20లో 63 బంతుల్లోనే 126 పరుగులు నాటౌట్.. సుడిగాలి ఇన్నింగ్స్‌తో గట్టి సమాధానమిచ్చాడు. తనపై ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉన్నా ఈ ఇన్నింగ్స్‌తో అవన్నీ తొలగిపోయినట్లేనని చెప్పకనే చెప్పాడు గిల్. టీమిండియా మాజీ క్రికెటర్లు సహా కోహ్లి లాంటి వరల్డ్ క్లాస్ క్రికెటర్ ఫ్యూచర్ స్టార్ క్రికెటర్ అంటూ గిల్‌పై పొగడ్తలు కురిపించాడు. కచ్చితంగా భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో గిల్ పాత్ర కీలకం కానున్నట్లు స్పష్టంగా తెలియరానుంది. ఈ విషయం పక్కనబెడితే.. సోషల్ మీడియాలో శుబ్‌మన్ గిల్‌కు సంబంధించిన ఒక ఫోటో బాగా వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరోయిన్, నటి సారా అలీఖాన్‌తో గిల్ ప్రేమాయణం నడుపుతున్నట్లు కొన్నాళ్ల నుంచి రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై అటు గిల్.. ఇటు సారా ఇద్దరు నోరు మెదపలేదు. అయితే మీడియా కంట పడకుండా వీరిద్దరు తమ ప్రేమాయణం కొనసాగిస్తునట్లు క్రికెట్ ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉండగానే.. బుధవారం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గిల్.. సారా అలీఖాన్‌లు సీరియస్‌గా మాట్లాడుకుంటున్న ఫోటోలు బయటికి వచ్చాయి. అయితే వాళ్లిద్దరు నిజంగా కలుసుకున్నారా లేదంటే ఇదంతా గాసిప్ రాయుళ్ల ఎడిటింగ్ పనేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే తాజాగా చక్కర్లు కొడుతున్న ఫోటో పాతదేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. నిజానికి సారా అలీఖాన్ అహ్మదాబాద్‌కు రాలేదని.. ఇప్పుడు బయటికి వచ్చిన ఫోటో ఎడిటింగ్ అని.. ఎయిర్‌పోర్ట్‌లో కూర్చొని మాట్లాడుకుంటున్నట్లుగా క్రియేట్ చేశారని నెటిజన్లు పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం గతేడాది కూడా ఇలాంటి ఫోటోనే ఒకటి సోషల్ మీడియాలో పెట్టారని.. అది ఇప్పటిది మాత్రం కాదని కుండబద్దలు కొట్టారు. ఏది ఏమైనా గిల్-సారా అలీఖాన్‌లు మధ్య ప్రేయాయణం నడుస్తుందా లేదా అన్నది పక్కనబెడితే.. వీరికి సంబంధించిన వార్తలతో మాత్రం కొంతమంది బతికేస్తున్నారంటూ నెటిజన్లు పేర్కొన్నారు. ఇక గిల్, సారా అలీఖాన్‌లు కలిసి జైపూర్‌లోని ఒక రెస్టారెంట్లో తొలిసారి కనిపించడంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య ఏదో సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పంజాబీ నటి సోనమ్ భజ్వాతో టీవీ చాట్ షో సందర్భంగా గిల్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఒక అమ్మాయితో డేటింగ్లో ఉన్నట్లు.. ఆమె పేరు సారా అని మాత్రమే చెప్పాడు. అయితే సారా అని పేరు చెప్పి ముందు వెనకాల ఏం చెప్పకుండా అభిమానులను కన్ఫ్యూజ్ అయ్యేలా చేశాడు. దీంతో కొంతమంది గిల్.. సారా అలీఖాన్‌తో కాకుండా సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్‌తో రిలేషిన్షిప్ కొనసాగిస్తున్నట్లు పుకార్లు పుట్టించారు. అయితే శుబ్‌మన్ గిల్ చెల్లెలలు షహనీల్కు సారా టెండూల్కర్ మంచి స్నేహితురాలు. వారిద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో తరచు యాక్టివ్‌గా ఉంటారు. ఈ స్నేహం కూడా గిల్, సారా టెండూల్కర్లు ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే సారా టెండూల్కర్, శుబ్‌మన్ గిల్లు దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వీరిద్దరు ఒకరినొకరు ఫాలో కాకపోవడంతో రిలేషన్షిప్ వార్తలకు కూడ బ్రేక్ పడినట్లయింది. దీంతో గిల్.. సారా అలీఖాన్తోనే డేటింగ్లో ఉన్నాడని.. వారిద్దరి ప్రేమాయణం నడుస్తుందంటూ మరోసారి సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. చదవండి: గిల్‌పై ఇషాన్ కిషన్ ఆగ్రహం.. ఏం పట్టనట్లుగా చహల్ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. పఠాన్‌ను ఉతికారేసిన విండీస్ స్టార్ -
'జొకోవిచ్.. మీ తండ్రి చేసిన పని సిగ్గుచేటు'
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో సెమీస్‌కు దూసుకెళ్లి జోష్ మీదున్న జొకోవిచ్‌కు అతని తండ్రి రూపంలో చేదు అనుభవం ఎదురైంది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా టోర్నీలో రష్యా, బెలారస్‌కు చెందిన జెండాలను నిర్వాహకులు నిషేధించారు. తాజాగా రష్యా జెండా.. జొకోవిచ్ తండ్రి సర్డాన్ జోకొవిచ్ను చిక్కుల్లో పడేసింది. స్టేడియాల్లోకి జెండాలు నిషేధం కావడంతో రష్యా మద్దతుదారులు.. స్టేడియం బయట తమ దేశ జెండాలతో నిరసనలు చేస్తున్నారు. ఇదే సమయంలో బుధవారం జొకోవిచ్ క్వార్టర్స్ మ్యాచ్ చూసేందుకు అతని తండ్రి సర్డాన్ జొకోవిచ్ రాడ్లివర్ ఎరినాకు వచ్చాడు. ఈ సమయంలో రష్యా జెండాలు పట్టుకున్న అభిమానులతో కలిసి ఫోటోలు దిగాడు. ఈ ఫోటోల వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపింది. అంతేకాదు రష్యా వర్ధిల్లాలి అనే నినాదం చేయడం.. మ్యాచ్ కు జెడ్ అనే అక్షరం ఉన్న టీషర్ట్ వేసుకొని వచ్చిన వ్యక్తితో కనిపించడం జొకోవిచ్ తండ్రిని మరింత వివాదంలోకి నెట్టింది. ఆ తర్వాత పుతిన్ ఫొటో ఉన్న రష్యా జెండా పట్టుకున్న ఓ వ్యక్తి పక్కనే సర్డాన్ జోకొవిచ్ నిలబడిన వీడియో ఒకటి యూట్యూబ్ లో కనిపించింది. సాధారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో ఆయా దేశాల జెండాలు పట్టుకోవడం తప్పేమీ కాదు. అయితే ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో రష్యాతోపాటు బెలారస్ జెండాలను నిషేధించారు. మ్యాచ్ చూడటానికి రష్యా జెండాలతో వచ్చిన నలుగురు వ్యక్తులను వెంటనే స్టేడియం నుంచి బయటకు పంపించేశారు. అయితే ఇప్పుడో స్టార్ ప్లేయర్ తండ్రే ఇలా నిరసనకారులకు మద్దతుగా నినాదాలు చేయడం కొత్త వివాదానికి దారి తీసింది. సర్డాన్ జోకొవిచ్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి''. జొకోవిచ్.. మీ తండ్రి చేసిన పని సిగ్గు చేటు'' అంటూ కొందరు తీవ్రంగా స్పందించారు. ^Sorry, not half, 3/8 #AusOpen semifinalists are flagless since Rublev didn't make it...though obviously the debates over Rybakina's nationality and what it means in this context are well-worn. — Ben Rothenberg (@BenRothenberg) January 25, 2023 Seems he was not the only one. @TennisAustralia What’s going on there? https://t.co/ZuAQ1kNHmU — Alex Dolgopolov (@TheDolgo) January 25, 2023 చదవండి: Hulk Hogan: అసభ్యకర ట్వీట్ చేసిన రెజ్లింగ్ స్టార్.. ఆపై తొలగింపు టాప్‌లెస్‌గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది' -
ధోని కొత్త లుక్ అదుర్స్.. ఫోటో వైరల్
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని కొత్త అవతారంలో అదుర్స్ అనిపిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ధోని బయట పెద్దగా కనబడడం లేదు. కేవలం ఐపీఎల్ ఉన్నప్పుడు మాత్రమే దర్శనమిస్తున్నాడు. మరో రెండు నెలల్లో ఐపీఎల్ మొదలవనున్న నేపథ్యంలో ధోని తన ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. ఇటీవలే ధోని ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా తన ప్రాక్టీస్ ముగించుకొని బయటకు వస్తున్న ధోని తెల్ల గడ్డం, నల్లజుట్టుతో సాల్ట్ అండ్ పెపర్ లుక్‌లో అభిమానుల కంటపడ్డాడు. ధోనీ ఇలా కొత్తగా కనిపించడం చాలా మందిని ఆకర్షించింది. నిజానికి ఒక రోజు ముందు కూడా ధోనీ ఫొటోలను కొందరు అభిమానులు తీశారు. కానీ దూరం నుంచి కావడంతో అతన్ని స్పష్టంగా గుర్తించలేకపోయారు. ఇక ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. గతేడాది కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. అయితే ఈసారి మాత్రం ధోనికి చివరి ఐపీఎల్ కానుందని చాలా మంది అభిమానులు జోస్యం చెబుతున్నారు. ధోని సారధ్యంలో సీఎస్కే ఇప్పటివరకు నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇక గతేడాది రవీంద్ర జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పటికి అతను మధ్యలోనే వైదొలగడంతో తిరిగి ధోనినే జట్టును నడిపించాడు. గత సీజన్లో సీఎస్కే 14 మ్యాచ్‌లాడి నాలుగింటిలో మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంలో నిలిచింది. New look of MS Dhoni during the practice session ahead of IPL 2023 pic.twitter.com/5V7qARShxp — Johns. (@CricCrazyJohns) January 20, 2023 MS Dhoni practicing at nets ahead of IPL 2023 !! 😍💥#MSDhoni • #IPL2023 • #WhistlePodu pic.twitter.com/Ai1FGVosGP — Nithish MSDian 🦁 (@thebrainofmsd) January 19, 2023 చదవండి: రూల్స్ భ్రష్టు పట్టించారు.. క్రీడాస్పూర్తికి విరుద్ధం -
జూనియర్ ఎన్టీఆర్‌తో సూర్య, దేవిషా!.. బ్రదర్ అంటూ ట్వీట్.. వైరల్
Suryakumar Yadav- Junior NTR: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను కలిశాడు. తారక్‌తో కలిసి సతీసమేతంగా ఫొటో దిగాడు. ప్రపంచ వేదికపై మరోసారి భారతీయ సినిమా సత్తాను చాటిన ఆర్ఆర్ఆర్ సినిమా పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలవడం పట్ల సూర్య హర్షం వ్యక్తం చేశాడు. బ్రదర్ అంటూ ట్వీట్ ఈ సందర్భంగా తారక్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. భార్య దేవిషా శెట్టి, ఎన్టీఆర్ నడుమ తాను నిలబడి ఉన్న ఫొటోను పంచుకున్న సూర్య.. ‘‘మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది సోదరా! ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలిచినందుకు మీకు మరోసారి శుభాకాంక్షలు’’ అని ట్విటర్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ హైదరాబాద్‌కు వచ్చాడు. ఉప్పల్‌లో మ్యాచ్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టీమిండియా- కివీస్ మధ్య తొలి వన్డే జరుగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇరు జట్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు టీమిండియా క్రికెటర్లు ఎన్టీఆర్‌ను కలవడం విశేషం. కాగా టీ20లలో నంబర్ 1గా ఎదిగిన సూర్యకుమార్.. ఇటీవల స్వదేశంలో ముగిసిన శ్రీలంకతో సిరీస్‌లో సత్తా చాటాడు. నిర్ణయాత్మక మూడో టీ20లో సెంచరీతో చెలరేగి జట్టు, సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మూడో వన్డేలో చోటు దక్కించుకున్నా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సూర్య.. కివీస్‌తో వన్డేల్లో అవకాశం రావడం కష్టంగానే కనిపిస్తోంది. It was so lovely meeting you, brother! Congratulations once again on RRR winning the Golden Globe award 🤩 pic.twitter.com/6HkJgzV4ky — Surya Kumar Yadav (@surya_14kumar) January 17, 2023 ఇక రామ్ చరణ్, జూనియర్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పాటను చంద్రబోస్ రచించగా.. ప్రేమ్‌రక్షిత్ నృత్యరీతులు సమకూర్చారు. చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. సూర్యకుమార్‌కు నో ఛాన్స్! కిషన్‌కు చోటు Murali Vijay: సెహ్వాగ్‌లా నాక్కూడా ఆ ఫ్రీడం దొరికి ఉంటే కథ వేరేలా ఉండేది! నా విషయంలో.. -
ఎయిర్ ఇండియా విమానం భోజనంలో రాయి.. ఫొటో వైరల్..
తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనతో ఎయిర్ ఇండియా సంస్థపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ సంస్థ మరో వివాదంలో చిక్కుకుంది. ఈ విమానంలో ప్రయణించిన ఓ మహిళ చేసిన భోజనంలో రాయి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. విమానంలో రాళ్లు లేని భోజనాన్ని కూడా ప్రయాణికులకు అందించలేరా? ఇంత నిర్లక్ష్యమేంటి? ఈ విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకెళ్లా అని సర్వప్రియ సంగ్వాన్ ట్వీట్ చేశారు. You don’t need resources and money to ensure stone-free food Air India (@airindiain). This is what I received in my food served in the flight AI 215 today. Crew member Ms. Jadon was informed. This kind of negligence is unacceptable. #airIndia pic.twitter.com/L3lGxgrVbz — Sarvapriya Sangwan (@DrSarvapriya) January 8, 2023 ఈ ట్వీట్ చూసిన చాలా మంది నెటిజన్లు ఎయిర్ ఇండియాపై విమర్శలు గుప్పించారు. విమానయాన పరిశ్రమలో ఒకప్పుడు ప్రమాణాలకు మారుపేరు అయిన టాటా జేఆర్డీ సంస్థ.. అంతర్జాతీయ గౌరవం పొందింది. ఇప్పుడు మళ్లీ ఈ పరిశ్రమలోకి వచ్చి ప్రమాణాల విషయంలో ఈ స్థాయికి పడిపోయింది. ప్రయాణికులకు సరైన సేవలు అందించలేరా? నిర్వహణ లోపమా? అని ఓ యూజర్ ప్రశ్నించాడు. ఆ రాయి ఉన్న ఆహారం తని మీ పన్ను విరిగిపోయి ఉంటుంది అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మహిళ ట్వీట్‌పై ఎయిర్ ఇండియా స్పందించింది. ఈ విషయంపై తాము ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. తక్షణమే క్యాటరింగ్ టీం దృష్టికి దీన్ని తీసుకెళ్తామంది. తమ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చినందుకు అభినందించింది. చదవండి: వలపు వలలో చిక్కి రూ.28 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. చివరకు.. -
షాకింగ్.. విమానంలోకి పామును తీసుకెళ్లబోయిన మహిళ.. ఫొటో వైరల్..
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ మహిళ పామును విమానంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఎలాగోలా ఎంట్రెన్స్ గేటు వద్ద తప్పించుకుని విమానాశ్రయంలోకి వెళ్లినప్పటికీ ఎక్స్-రే మెచీన్ వద్ద దొరికిపోయింది. బ్యాగును స్కాన్ చేసిన సెక్యూరిటీ సిబ్బంది లోపల పామును చూసి షాక్ అయ్యారు. ఫ్లోరిడాలోని టాంపా ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరిగింది. ఈ మహిళ తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది 'బోవా కన్స్ట్రిక్టర్' పామును. ఇది పిల్ల పాము. 4 అడుగులుంది. దీనికి ఎమోషనల్‌గా దగ్గరయ్యానని, అందుకే పెంచుకునేందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు మహిళ చెప్పింది. ఈ పాముకు 'బార్తోలోమ్యూ' అని ముద్దుపేరు కూడా పెట్టుకుంది. బోవా కన్స్ట్రిక్టర్ పాములు చూడటానికి కొండచిలువలా కన్పిస్తాయి. ఇవి 13 అడుగుల వరకు పెరుగుతాయి. ఈ పాము విషపూరితం కానందు వల్ల అమెరికాలో చాలా మంది వీటిని సరదాగా ఇళ్లలోనే పెంపుడు జంతువుల్లా చూసుకుంటారు. చదవండి: విమానంలో మరో ప్రయాణికుడి వీరంగం.. -
Rishabh Pant: బ్రదర్ అంటూ వార్నర్ భావోద్వేగం.. ఫొటో వైరల్
David Warner- Rishabh Pant: టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్‌ను ఉద్దేశించి ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ భావోద్వేగపూరిత సందేశం పోస్ట్ చేశాడు. ‘‘ నీకు మేమంతా ఉన్నాం బ్రదర్’’ అంటూ పంత్‌పై అనురాగాన్ని చాటుకున్నాడు. కాగా భారత స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్.. డిసెంబరు 30న ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కు వెళ్తున్న సమయంలో అతడు ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ జరగగా.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, ఈ ఘటనలో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లో చికిత్స పూర్తైన తర్వాత ముంబైకి ఎయిర్‌లిఫ్ట్ చేసింది బీసీసీఐ. ప్రస్తుతం అతడు కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో పంత్ త్వరగా కోలుకోవాలంటూ అతడి మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో పంత్ ‘సహచర ఆటగాడు’ వార్నర్ సైతం.. ‘‘త్వరగా కోలుకో బ్రదర్’’’ అంటూ అతడితో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంత్, వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. గతేడాది వార్నర్‌ను ఢిల్లీ కొనుగోలు చేయగా.. పంత్ కెప్టెన్సీలో అతడు మ్యాచ్‌లు ఆడాడు. ఇక ప్రమాదం బారిన పడ్డ పంత్ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన నేపథ్యంలో అతడి స్థానంలో వార్నర్ ఢిల్లీ జట్టు పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. చదవండి: IND vs SL: శ్రీలంకతో మూడో టీ20.. అర్ష్‌దీప్, గిల్‌కు నో ఛాన్స్! మరో పేసర్ ఎంట్రీ Hardik Pandya: ఓడినా పర్లేదా?! కోహ్లి, రోహిత్.. ఇప్పుడు హార్దిక్ ఎందుకిలా చేస్తున్నారు? డీకే స్ట్రాంగ్ రిప్లై -
ఆరెంజ్ కలర్ శారీలో మీనాక్షి తళుకులు! చీర, నగల ధర ఎంతంటే!
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’తో పలకరించిన హీరోయిన్ మీనాక్షీ చౌదరి. హిట్- 2తో హిట్ కొట్టిన ఆమె.. తెలుగు సినీ రంగంలో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సృష్టించుకున్నట్టే... ఫ్యాషన్ వరల్డ్‌లోనూ తనదైన మార్క్‌ను క్రియేట్ చేసుకుంది. ఆమెకు నచ్చిన బ్రాండ్స్‌లో ఇవి కొన్ని.. లేబుల్ సోనమ్ లుథ్రియా.. ముంబై ఎస్ఎన్డీటీ యూనివర్సిటీ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన సోనమ్ లుథ్రియా.. 2012లో తన పేరు మీదే ఓ బొటిక్‌ను ప్రారంభించింది. సంప్రదాయ, క్యాజువల్ వేర్‌ను అందించటం ఈ బ్రాండ్ ప్రత్యేకత. ఫ్యాబ్రిక్‌పై సోనమ్కున్న పట్టు.. ఆమెను టాప్ మోస్ట్ డిజైనర్స్‌లో ఒకరిగా చేర్చింది. ఆఫ్ బీట్ ఫ్యూజన్ వేర్, డ్రేప్, ప్రింట్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్‌తో ఏ వయసు వారికైనా నచ్చే, నప్పే డిజైన్స్ ఇక్కడ లభిస్తాయి. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. కర్ణిక జ్యూయెల్స్.. ఫ్యాషన్‌కు తగ్గ ఆభరణాలతోనే అందం మరింత పెరుగుతుందన్న మాటను బలంగా నమ్మింది కర్ణిక జ్యూయెల్స్ ఫౌండర్ నిత్యారెడ్డి. అందుకే, ఎప్పటికప్పడు ఆకట్టుకునే అందమైన, వైవిధ్యమైన డిజైన్స్‌ను రూపొందిస్తూ కర్ణిక జ్యూయెల్స్ను వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సెలిబ్రిటీ బ్రాండ్స్‌గా నిలిపింది. అన్ని రకాల గోల్డ్, సిల్వర్, గోల్డ్ ప్లేటేడ్ నగలతో పాటు, ఫ్యూజన్, నక్షీ, నవరతన్, స్వరోవ్స్కీ వంటి ఇతర బ్రాండ్ల నగలూ ఇక్కడ లభిస్తాయి. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. వాట్సప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా కొనుగోలు చేసే వీలుంది. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: లేబుల్ సోనమ్ లూథ్రియా. ధర: రూ. 25,500 జ్యూయెలరీ బ్రాండ్: కర్ణిక జ్యూయెల్స్ ధర: రూ. 33,000 నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు ఎవరూ నిన్ను ఆపలేరు. అలాగే ముందు మనకు మనం అందంగా ఉన్నామని నమ్మాలి. అప్పుడే మన అందం మరింత అందంగా కనపడుతుంది. – మీనాక్షీ చౌదరి -దీపికా కొండి -
Bavuma-Marco Jansen: 'వీడేంట్రా బాబు ఇంత పొడుగున్నాడు'
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులోనూ ఓటమిపాలైన సౌతాఫ్రికా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోయింది. ఇక మూడో టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రొటీస్ భావిస్తుంటే.. ఆసీస్ మాత్రం క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. సౌతాఫ్రికా మాత్రం నాలుగో స్థానానికి పడిపోయి అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. ఈ సంగతి పక్కనబెడితే.. సోషల్ మీడియలో ఒక ఫోటో ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది. ఇది కేవలం సరదా కోసం మాత్రమే రాసుకొచ్చాం. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ బవూమా, మార్కో జాన్సెన్లు క్రీజులో ఉన్నారు. సాధారణంగా బవుమా చాలా పొట్టిగా ఉంటాడు. ఇక మార్కో జాన్సెన్ చాలా పొడగరి.. దాదాపు ఆరున్నర అడుగులు ఉంటాడు. యాదృశ్చికమో ఏమో తెలియదు కానీ బవుమా.. మార్కో జాన్సెన్ వైపు అదో రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అదెలా ఉందంటే.. ''వీడేంటి ఇంత పొడుగున్నాడు అనేలా''.. ఫోటో చూడగానే మీకు కూడా అలాగే కనిపిస్తుంది. అందుకే ఈ ఫోటో ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది. మాములుగానే తమకంటే హైట్ ఎక్కువుంటేనే తెగ బాధపడిపోయే పొట్టోళ్లు.. తమకు సాధ్యం కాని ఎత్తులో ఉన్న వ్యక్తులను చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. పాపం బవుమా పరిస్థితి కూడా అదే. అందుకే అతని వైపు చూస్తూ బవుమా కచ్చితంగా అదే అనుకొని ఉంటాడు. ఇక వాస్తవానికి వస్తే.. బవుమా రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నాడు. నిజానికి మార్కో జాన్సెన్‌తో రివ్యూ విషయమై మాట్లాడుతున్నాడు. ఆ సమయంలోనే ఒక ఫోటోగ్రాఫర్ ఇలా క్లిక్‌మనిపించాడు. ఒక్క ఫోటోతో మనం ఇంకో విధంగా ఊహించుకునేలా చేసిన ఫోటోగ్రాఫర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చదవండి: WTC: పోతే పోయింది.. మనకు మాత్రం మేలు చేసింది పది రోజులైనా కిక్కు దిగలేదు.. చుట్టుముట్టేశారు -
MS Dhoni: అప్పుడే దుబాయ్ వెళ్లావా? ధోనితో ఫొటో వైరల్
MS Dhoni- Rishabh Pant: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం పంత్.. ఐపీఎల్ 2023 మినీ వేలం ముగించుకున్న ధోని దుబాయ్ చేరుకున్నారు. అక్కడ ధోని కుటుంబాన్ని కలుసుకున్న పంత్.. వారితో కలిసి డిన్నర్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ధోని భార్య సాక్షి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. లక్షల్లో లైకులు వస్తున్నాయి. ఇక టీమిండియా ఫ్యాన్స్ ఈ ఫొటోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘హే పంత్.. అప్పుడే దుబాయ్‌కు వెళ్లిపోయావా? నీ గురువు ధోనితో కలిసి హాలీడే ట్రిప్ ఆస్వాదిస్తున్నావ్ కదా! చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది’’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో రిషభ్ పంత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ విలువైన 93 పరుగులు చేశాడు. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోని వేలంలో తన వ్యూహాలు అమలు చేశాడు. బెన్ స్టోక్స్ వంటి కీలక ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో సఫలమై.. భవిష్యత్ కెప్టెన్‌ను తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. చదవండి: Babar Azam: పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజం! సెహ్వాగ్‌లా అలా! 1089 రోజుల తర్వాత ఏకంగా డబుల్ సెంచరీ.. తొలి బ్యాటర్‌గా! కానీ అంతలోనే.. View this post on Instagram A post shared by Sakshi Singh (@sakshisingh_r) -
పక్క సీట్లో సీరియల్ కిల్లర్.. భయంతో వణికిపోయిన మహిళ.. ఫొటో వైరల్..
విమానంలో తన పక్కన కూర్చున్న పెద్దాయన్ను ఓ మహిళా ప్రయాణికురాలు కాస్త అనుమానంగా, భయంగా చూస్తున్న ఈ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమె పరిస్థితిని వర్ణిస్తూ బోలెడు కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇంతకీ అందుకు కారణం ఏమిటంటారా? ఆ వ్యక్తి మరెవరో కాదు.. 1970లు, 1980లలో భారత్ సహా వివిధ దేశాల్లో సుమారు 30 హత్యలకు పాల్పడిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ (78). డబ్బు కోసం విదేశీ పర్యాటకులను ప్రత్యేకించి యువతులనే టార్గెట్ చేసి హతమార్చిన కిరాతకుడు. ఓ హత్య కేసులో సుమారు 20 ఏళ్లు నేపాల్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించిన అతన్ని.. వృద్ధాప్య సంబంధ అనారోగ్య కారణాల దృష్ట్యా ఆ దేశ సుప్రీంకోర్టు తాజాగా విడుదల చేసింది. దీంతో స్వదేశమైన ఫ్రాన్స్‌కు దోహా మీదుగా వెళ్లేందుకు ఇలా ఖతార్ ఎయిర్వేస్ విమానం ఎక్కినప్పుడు ఓ ప్రయాణికుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీనిపై నెటిజన్లు స్పందించారు. ‘మీరు ఆ మహిళ స్థానంలో కూర్చొనే సాహసం చేయగలరా?’ అని ఒకరు సవాల్ చేయగా ‘నేను కూడా ఆ మహిళలాగే భయంభయంగా చూస్తుంటా’ అని మరొకరు పేర్కొన్నారు. పండుగ సీజన్లో విమాన టికెట్ బుక్ అయిందన్న ఆనందం చివరకు ఇలా నీరుగారిపోయిందని మరొకరు వ్యాఖ్యానించగా ఇది ఆ మహిళ జీవితంలో అత్యంత భయానకమైన సందర్భమని ఇంకొకరు పోస్టు చేశారు. భారత జాతీయుడైన తండ్రికి, వియత్నాం జాతీయురాలైన తల్లికి శోభరాజ్ 1944లో జన్మించాడు. వియత్నాంలో అతను పుట్టిన ప్రాంతం అప్పట్లో ఫ్రాన్స్ వలసరాజ్యం కావడంతో అతనికి పుట్టుకతోనే ఫ్రెంచ్ పౌరసత్వం లభించింది. చదవండి: Japan Snow Storm: జపాన్‌లో మంచు తుఫాన్ విధ్వంసం..17 మంది మృతి -
వైట్‌హౌస్‌లో క్రిస్మస్ వేడుకలు..డెకరేషన్లో బిజీగా ఉన్న బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జిల్ బైడెన్ దంపతులు వైట్‌హౌస్‌లో క్రిస్మస్ చెట్టును చక్కగా అలంకరించారు. అందుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసి నెటిజన్లతో పంచుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో తాము కిస్మస్ చెట్టుకు కొన్ని తుది మెరుగులు దిద్దుతున్నాం. అందరూ ఈ క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారని ఆశిస్తున్నా అని ట్వీట్ చేశారు. బైడెన్ ఈ వారం ప్రారంభంలోనే వైట్‌హౌస్ నుంచి క్రిస్మస్ ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో పెరుగుతున్న విభజిత అమెరికాను, రాజకీయాలను కలుషితం చేస్తున్న వాటిని పరస్పరం వ్యతిరేకించే ప్రక్షాళనతో తాజాగా ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. డెమొక్రాటిక్ నాయకుడు బైడెన్ ఇటీవల ప్రతిపక్ష రిపబ్లికన్లకు వ్యతిరేకంగా మరింత దూకుడు వైఖరిని అవలంభించారు. ఈ క్రిస్మస్ సీజన్లో కొన్ని క్షణాలు నిశబ్దంగా ఆలోచించి మన హృదయంలో ఒకరినోకరు స్వచ్ఛంగా చూసుకోవాలనేదే ఆశ. అంతేగాదు క్రిస్మస్ చెట్లను పూలతో, దీపాలతో చక్కగా అలంకరించి చేసుకునే ఈ పండుగ నాడు డెమొక్రాటిక్ లేదా రిపబ్లికన్లుగా కాదు తోటి అమెరికన్లు లేదా తోటి మానవులు అన్న భావంతో సహృదయంతో ఈ పండుగను ఆనందంగా చేసుకోవాలన్నారు. Just a few finishing touches! Hope you and your loved ones are having a great Christmas Eve. pic.twitter.com/zdCjjRrI9o — President Biden (@POTUS) December 25, 2022 (చదవండి: అమెరికాలో భారత సంతతి వ్యక్తి ఘనత.. తొలి సిక్కు మేయర్‌గా రికార్డ్) -
విద్యార్థి గొంతులోకి దూసుకెళ్లిన జావెలిన్.. ఫొటో వైరల్..
భువనేశ్వర్: ఒడిశా బలంగీర్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో అపశ్రుతి చోటుచేసుకుంది. క్రీడా పోటీల్లో భాగంగా ఓ విద్యార్థి విసిరిన జావెలిన్.. మరో విద్యార్థి గొంతులోకి దూసుకెళ్లింది. బల్లెం అతడి మెడ ఎడమ భాగం నుంచి లోపలికి దూసుకెళ్లి కుడి భాగం నుంచి బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: బార్‌పై రైడ్.. సీక్రెట్ రూంలో 17 మంది మహిళలు.. -
షాకింగ్.. నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. ఫొటో వైరల్..
భోపాల్: మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఆర్తి కుశ్వాహా అనే మహిళకు జన్మించిన ఆడ శిశువుకు నాలుగు కాళ్లున్నాయి. చిన్నారి 2.3 కేజీల బరువు ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కమ్లా రాజా ఆస్పత్రిలో ఆర్తి కుశ్వాహ బుధవారం ప్రసవించింది. అయితే పుట్టిన బిడ్డకు నాలుగు కాళ్లు ఉండటం చూసి వైద్యులు షాక్ అయ్యారు. విషయం తెలియగానే జయారోగ్య హాస్పిటల్ గ్రూప్ సూపరింటెండెంట్ డా.ఆర్కే ధాకడ్.. వైద్య బృందంతో వెళ్లి చిన్నారిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పుట్టుకతోనే శిశువుకు నాలుగు కాళ్లు ఉన్నాయి. ఆమెకు శారీరక వైకల్యం ఉంది. కొన్ని పిండాలు అదనంగా ఏర్పడుతాయి. దీనిని వైద్య శాస్త్ర భాషలో చెప్పాలంటే ఇస్కియోపాగస్ అంటారు. పిండం రెండు భాగాలుగా విభజించబడినప్పుడు శరీరం రెండు చోట్ల అభివృద్ధి చెందుతుంది. ఈ ఆడ శిశువు నడుము కింది భాగం రెండు అదనపు కాళ్లతో అభివృద్ధి చెందింది. కానీ ఆ కాళ్లు క్రియారహితంగా ఉన్నాయి. అని డా. ధాకడ్ వివరించారు. శిశువుకు ఇంకా వేరే శరీర భాగాల్లో వైకల్యం ఉందా? అని పరిశీలించిన అనంతరం ఆమె ఆరోగ్యంగా ఉంటే ఇన్‌యాక్టివ్‌గా ఉన్న రెండు కాళ్లను శస్త్ర చికిత్స చేసి తొలగిస్తామని ధాకడ్ చెప్పారు.అప్పుడు చిన్నారి సాధారణ జీవితాన్ని గడపవచ్చని పేర్కొన్నారు. చదవండి: లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్‌ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు -
విజయ్ సేతుపతి షాకింగ్ లుక్ వైరల్, అవాక్కవుతున్న ఫ్యాన్స్
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగానే కాదు విలన్‌గానూ సత్తా చాటుతున్నాడు. భాషతో సంబంధం లేకుండా పాత్ర ప్రాధాన్యతను బట్టి అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. వెండితెరపై ఆయన విలక్షణ నటనకు ప్రతి ప్రేక్షకుడు ఫిదా అవుతున్నారు. ఇక ఉప్పెన మూవీతో తెలుగులో విలన్‌గా పరిచమైన ఆయన త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విజయ్ సేతుపతి. చదవండి: పెళ్లయిన డైరెక్టర్‌ను ధన్య బాలకృష్ణ సీక్రెట్ పెళ్లి చేసుకుందా? నటి సంచలన వ్యాఖ్యలు ఇదిలా ఉంటే స్టార్ నటుడిగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఆయన లావుగా ఉండటం వల్ల తరచూ బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంటుంటాడు. కాస్తా శరీరంపై శ్రద్ధ పెట్టాలని, డైట్ ఫాలో అవ్వు బ్రో అంటూ నెటిజన్లు ఆయనకు సూచిస్తుంటాడు. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి నయా లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో విజయ్ సేతుపతి స్లీమ్‌గా హీరోలా కనిపించి ట్రోలర్స్‌కి షాకిచ్చాడు. ఇక ఆయన కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. దీంతో ఆయన ఫొటోను పలు సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్స్ పేజీలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vijay Sethupathi (@actorvijaysethupathi) -
చెట్టు ఒకటే.. పువ్వు ఒకటే.. కానీ మూడు రంగులు..
శాయంపేట: చెట్టు ఒకటే.. పువ్వు ఒకటే.. కానీ.. సమయాన్నిబట్టి రంగులు మారుతోంది. అదే మందార ముటాబిలిసి పువ్వు ప్రత్యేకత. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన వన ప్రేమికుడు కోమనేని రఘు తన ఇంటి ఆవరణలో దక్షిణ చైనా, తైవాన్ దేశాలకు చెందిన మందార ముటాబిలిసి అనే మొక్కను నాటాడు. దీనిని కాన్ఫెడరేట్ గులాబీ, డిక్సీ రోజ్‌మల్లో, కాటన్ రోజ్ లేదా కాటన్ రోజ్‌మల్లో అని కూడా పిలుస్తారని ఆయన తెలిపారు. ఆదివారం ఈ మొక్కకు అరుదైన పుష్పం వికసించింది. ఉదయం తెలుపు, మధ్యాహ్నం గులాబీ, సాయంత్రం ఎరుపు రంగులోకి మారడం ఈ పువ్వు ప్రత్యేకత. ఒకేరోజు మూడు రంగుల్లో వికసించడంతో స్థానికులు చూసేందుకు ఆసక్తి కనబరిచారు. చదవండి: టాప్‌గేర్‌లో ఎంసెట్... రివర్స్‌లో జేఈఈ -
షాకింగ్.. తోకతో జన్మించిన చిన్నారి.. ఫొటో వైరల్..
మెక్సికోలో ఓ శిశువు తోకతో జన్మించింది. దాని పొడవు రెండు అంగుళాలు(5.7 సెంటీమీటర్లు) ఉంది. తమ దేశంలో ఇప్పటివరకు ఇలాంటి కేసు నమోదు కాలేదని వైద్యులు తెలిపారు. పాప తోక ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే తల్లిదండ్రులు, పాప ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి సమస్యలు లేవు. తోకను సూదితో తాకినప్పుడు చిన్నారి ఏడ్చిందని వైద్యులు చెప్పారు. రెండు నెలల తర్వాత దాన్ని చిన్న సర్జరీ చేసి తొలగించినట్లు తెలిపారు. అదే రోజు పాపను డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. తల్లిగర్భంలో ఉన్నప్పుడే శిశవుల్లో తోక వంటి ఆకృతి ఏర్పడుతుందని, అయితే 9 నెలలు నిండేసరికి అది ఎముకగా మారి లొపలికి వెళ్లిపోతుందని వైద్య నిపుణులు చెప్పారు. అత్యంత అరుదైన సందర్భాల్లోనే ఇలా తోకలతో శిశువులు జన్మిస్తారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 2017 నాటికి ఇలా తోకతో జన్మించిన శిశువుల సంఖ్య 195గా ఉంది. అయితే మెక్సిలో మాత్రం ఇదే తొలి కేసు. ఎక్కువగా మగ శిశువులకు ఇలా జరుగుతుంది. మెదడు, పుర్రె వృద్ధి సమస్యల ప్రభావంతోనే చిన్నారులు ఇలా తోకతో జన్మిస్తారని ఓ అధ్యయనం పేర్కొంది. కానీ వైద్యులు మాత్రం దీనికి కచ్చితమైన కారణాలు వెల్లడించలేదు. చదవండి: కరోనా తర్వాత ప్రపంచానికి మరో ఉపద్రవం.. అన్నింటికంటే డేంజర్..?