Shubman Gill's Epic Reaction As Fan Shares Experience Of Rs 20,000 Ticket For IPL 2023 Opener - Sakshi
Sakshi News home page

Shubman Gill: 'భయ్యా.. నీకున్న సౌలత్‌ మాకుంటే ఎంత బాగుండు'

Published Wed, Apr 5 2023 6:30 PM | Last Updated on Wed, Apr 5 2023 6:41 PM

Gill Epic Reaction-Fan Shares Experience Rs-20000 Ticket For IPL 2023 - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సాయి సుదర్శన్‌(62 నాటౌట్‌) టాప్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోకోగా.. కిల్లర్‌ మిల్లర్‌ 16 బంతుల్లో 31 నాటౌట్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో దుమ్ము దులిపిన గిల్  ఈ మ్యాచ్‌లో మాత్రం కేవలం 14 పరుగులు చేసి ఔటయ్యాడు.

అయితే సోషల్‌ మీడియాలో గిల్‌ ఒక అభిమానికి ఇచ్చిన రిప్లై అందరిని ఆకట్టుకుంది. విషయంలోకి వెళితే.. ఐపీఎల్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు వస్తున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌కు అందించే టికెట్స్‌ ధరలు రకరకాలుగా ఉన్నాయి. వాటిలో ఒకటి రూ. 20 వేల టికెట్‌ కూడా ఉంది. వీఐపీ ప్రీమియమ్‌ లాంజ్‌ టికెట్‌ అయిన దీనిని కొనుగోలు చేసిన వారికి రాచ మర్యాదలు చేస్తారు. పార్కింగ్‌ ఏరియా నుంచి ప్రీమియమ్‌ లాంజ్‌లోకి వెళ్లడానికి ఒక కార్‌ను కేటాయించారు. అందులో ఎక్కి స్టేడియం లోపల నుంచి ప్రీమియమ్‌ సూట్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.

అయితే ఒక అభిమాని సీజన్‌ ఆరంభ మ్యాచ్‌ అయిన గుజరాత్‌ టైటాన్స్‌, సీఎస్‌కే మ్యాచ్‌కు రూ.20 వేల టికెట్‌ కొని మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేశాడు.  ప్రీమియమ్‌ లాంజ్‌ టికెట్‌ కొన్న విషయంతో పాటు ప్రీమియమ్‌ సూట్‌ కార్‌లో ఎక్కి లాంజ్‌కు చేరుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఈ ఫోటోకు వినూత్న స్పందన వచ్చింది

తాజాగా గిల్‌ అభిమాని పెట్టిన ఫోటోపై ఫన్నీగా స్పందించాడు. ''భాయ్‌ నీకిచ్చిన సౌలత్‌ మాకుంటే ఎంత బాగుండు.. ఇలాంటి వాటికి పెట్టి పుట్టుండాలి. మైదానంలోకి ఎంటర్‌ అవ్వాలంటే మేం నడవాల్సిందే. కానీ ఇతనికి ఆ అవసరం లేకుండా నేరుగా లాంజ్‌ దగ్గరికి చేరడానికి కార్‌ సూట్‌ ఇచ్చారు. మేం కూడా డ్రెసింగ్‌రూమ్‌ నుంచి గ్రౌండ్‌లోకి ఎంటర్‌ కావడానికి ఇలా కార్‌ కేటాయిస్తే బాగుండేది నడిచే బాధ తప్పేది.. '' అంటూ పేర్కొన్నాడు. గిల్‌ ఇచ్చిన రిప్లై సూపర్‌ ఫన్నీగా ఉందని కొందరు అంటే.. మరి నడవడానికి కూడా ఇంత బద్దకమా అంటూ మరికొందరు పేర్కొన్నారు.

చదవండి: Chahal-Umran Malik: 'మాట తప్పాడు.. చాలా బ్యాడ్‌గా అనిపిస్తోంది'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement