PHoto; IPL Twitter
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సోమవారం ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(58 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీ చేశాడు. ఐపీఎల్‌లో గిల్‌కు ఇదే తొలి శతకం. కాగా తన సెంచరీతో గుజరాత్ విజయంలో కీలకపాత్రో పోషించిన గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అవార్డు అందుకున్న సమయంలో తన ఇన్నింగ్స్ గురించి గిల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో మ్యాచ్ ఆడితే తనకు పూనకాలు వస్తాయని తెలిపాడు. సన్ రైజర్స్ తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన తాను.. ఇప్పుడు సెంచరీ కూడా అందుకున్నాని చెప్పాడు. భవిష్యత్ లో మరిన్ని సెంచరీలు సాధిస్తానని అన్నాడు.
''అభిషేక్ శర్మబౌలింగ్‌లో కొట్టిన సిక్స్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అతనికి ముందే చెప్పాను. నువ్వు బౌలింగ్ వేస్తే సిక్స్ కొడతానని. అన్నట్లుగానే సిక్స్ కొట్టాను.'' అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. దేశవాళీ క్రికెట్లో అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్ పంజాబ్ కు ఓపెనర్లుగా ఆడుతారు. ఈ చనువుతోనే గిల్ ఈ కామెంట్స్ చేశాడు.
తనకు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి ఆరాధ్య క్రికెటర్లని చెప్పిన గిల్.. వారి వల్లే క్రికెటర్ అయ్యానని చెప్పుకొచ్చాడు. తనకు క్రికెట్ అర్ధమైనప్పటి నుంచి కోహ్లీ నా హీరో. ఆట పట్ల అతడికి ఉన్న పిచ్చి, అంకితభావం, ఎనర్జీ నన్ను చాలా.. ప్రోత్సహించాయి. ఆటపై ఎంతో మక్కువ చూపేలా చేశాయని శుభ్‌మన్ గిల్ చెప్పాడు.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. శుభ్‌మన్‌కు తోడుగా సాయి సుదర్శన్(36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 47)రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, ఫరూఖీ, నటరాజన్ తలో వికెట్ తీశారు. లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులే చేసి ఓటమిపాలైంది.
చదవండి: గుజరాత్ ఇప్పటికే; పోటీలో ఏడుజట్లు.. ప్లేఆఫ్స్‌కు వెళ్లేదెవరు?
Comments
Please login to add a commentAdd a comment