Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం లక్నో సూపర్‌జెయింట్స్ ఏడు వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌పై ఘన విజయాన్ని సాధించింది. అయితే ఎస్‌ఆర్‌హెచ్ ఓటమికి ప్రధాన కారణం మాత్రం అభిషేక్ శర్మ. అతను వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్. అప్పటివరకు లక్నో స్కోరు 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులతో ఉంది. కాస్త టైట్‌గా బౌలింగ్ చేస్తే ఎస్‌ఆర్‌హెచ్‌కు పట్టు చిక్కేది.
ఈ సమయంలో తెలివిగా ఆలోచించాల్సిన కెప్టెన్ మార్క్రమ్ అనవసర తప్పిదం చేశాడు. పార్ట్‌టైమ్ బౌలర్ అయిన అభిషేక్ శర్మను గుడ్డిగా నమ్మి బౌలింగ్ అప్పజెప్పాడు. ఈ తప్పిదం ఎస్‌ఆర్‌హెచ్‌ను ముంచడంతో పాటు మ్యాచ్‌ను కోల్పోయేలా చేసింది. అసలు ఏ మాత్రం పసలేని బౌలింగ్‌ను లక్నో బ్యాటర్లు చీల్చి చెండాడారు.
Photo: IPL Twitter
తొలుత మార్కస్ స్టోయినిస్ రెండు సిక్సర్లు బాది ఔట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన పూరన్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. అయితే చెత్త బౌలింగ్‌తో అభిషేక్ శర్మ దారుణంగా ట్రోల్‌కు గురయ్యాడు. ''యష్ దయాల్ చివర్లో ఐదు సిక్సర్లు ఇచ్చుకుంటే.. నువ్వు మాత్రం మధ్యలోనే ఐదు సిక్సర్లు ఇచ్చుకొని మ్యాచ్‌ను ముంచావ్.. ఒక పార్ట్‌టైమ్ బౌలర్‌ని నమ్మితే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి..'' అంటూ కామెంట్ చేశారు.
ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు ఇచ్చుకున్న అభిషేక్ శర్మ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో అభిషేక్ శర్మ చేరిపోయాడు. ఇంతకముందు ఇదే సీజన్‌లో యష్ దయాల్(గుజరాత్ టైటాన్స్).. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు సమర్పించుకోగా.. శివమ్ మావి(కేకేఆర్).. 2022లో లక్నోతో మ్యాచ్‌లో, హర్షల్ పటేల్(ఆర్‌సీబీ).. 2021లో సీఎస్‌కేతో మ్యాచ్‌లో, షెల్డన్ కాట్రెల్(పంజాబ్ కింగ్స్).. 2020లో రాజస్తాన్‌తో మ్యాచ్‌లో, రాహుల్ శర్మ(పుణే వారియర్స్).. 2012లో ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సమర్పించుకున్నారు.
The incredible Stoinis 🔥 😤 with some Super Giant hits 🙌#SRHvLSG #IPLonJioCinema #TATAIPL #IPL2023 #EveryGameMatters | @LucknowIPL @MStoinis pic.twitter.com/WTCMrUyOUQ
— JioCinema (@JioCinema) May 13, 2023
.@SunRisers abhi shaken by Pooran Power 🙌 #SRHvLSG #TATAIPL #IPLonJioCinema #IPL2023 #EveryGameMatters | @LucknowIPL pic.twitter.com/wwAAqnGKVQ
— JioCinema (@JioCinema) May 13, 2023
Comments
Please login to add a commentAdd a comment