Cricket fan
-
58 గంటల ప్రయాణం.. తీరా వస్తే టికెట్ దొరకలేదు; కట్‌చేస్తే
అభిమానం అనేది ఒక వ్యక్తిని ఎంత దూరమైనా ప్రయాణం చేసేలా చేస్తోంది. మనకిష్టమైన హీరో సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలన్న కుతూహలం ఉంటుంది. ఒకవేళ మనకు దగ్గర్లో ఉన్న సినిమా థియేటర్లో టికెట్ దొరక్కపోతే.. వంద కిలోమీటర్లు దూరం ఉన్నా సరే వెర్రి అభిమానం అంత దూరం మనల్ని తీసుకెళ్తుంది. అలా చూసినప్పుడే మనకు ఆత్మసంతృప్తి. క్రికెట్లో కూడా అలాంటి పిచ్చి అభిమానం ఉన్న ఫ్యాన్స్ కొందరుంటారు. ఆ కోవకు చెందిన వాడే మిస్టర్ మాట్. తస్మానియాకు చెందిన మాట్కు క్రికెట్ అన్నా.. ఆస్ట్రేలియా జట్టు అన్నా విపరీతమైన అభిమానం. ఆ వెర్రి అభిమానమే అతన్ని తస్మానియా నుంచి వయా చైనా, సైప్రస్‌లు మీదుగా ఇంగ్లండ్‌కు తీసుకొచ్చింది. 58 గంటల పాటు నిరంతరాయంగా ప్రయాణం చేసిన మ్యాట్ లార్డ్స్‌కు చేరుకున్నాడు. కానీ మ్యాట్‌కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. యాషెస్ సిరీస్ ను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇంగ్లండ్, ఆస్ట్రేలియా అభిమానులైతే టి20ల కంటే ఎక్కువగా యాషెస్‌ను ఆదరిస్తారు. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన తొలి టెస్టు రసవత్తరంగా సాగడంతో లార్డ్స్ టెస్టుపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీంతో టికెట్లన్నీ ఆన్ లైన్ లో మూడు రోజుల ముందే ముగిశాయి. అయితే 58 గంటలు ప్రయాణించి లార్డ్స్ కు వచ్చిన మ్యాట్.. స్టేడియంలోకి ఎంట్రీ కావడానికి టికెట్ ను ముందుగా బుక్ చేసుకోలేదు.లార్డ్స్ కు చేరుకున్నాకా అతడికి టికెట్ దక్కలేదు. దీంతో అతడు లార్డ్స్ స్టేడియం ముందు ''నాకు ఒక టికెట్ కావాలి. నేను లార్డ్స్ లో మ్యాచ్ చూసేందుకు గాను 58 గంటలు జర్నీ చేసి వచ్చాను. దయచేసి నాకు ఒక టికెట్ ఇప్పించండి.''అని ప్లకార్డు పట్టుకుని నిల్చున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ ఫ్యాన్స్ అయిన బర్మీ ఆర్మీని మ్యాట్ ఒక టికెట్ ఉంటే ఇప్పించండి అంటూ బతిమాలుకున్నాడు. దీంతో బర్మీ ఆర్మీలోని ఒక వ్యక్తి అతని అభిమానానికి కరిగిపోయి తన టికెట్‌ను అతనికి ఇచ్చేశాడు. దీంతో రెండో టెస్టు తొలి రోజున మూడో సెషన్లో అతను గ్రౌండ్లోకి చేరుకొని మ్యాచ్ వీక్షించి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Can we help Aussie Matt out? He’s travelled from Tasmania with no ticket!#Ashes pic.twitter.com/h1pZ3p4xJj — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 28, 2023 ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా క్రితం రోజు స్కోరుకు మరో 76 పరుగులు జోడించి 416 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ సెంచరీతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. మూడో సెషన్లో ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 178 పరుగులు చేసింది. బెన్ డకెట్ 86, ఓలీ పోప్ 39 పరుగులతో ఆడతున్నారు. ఇంగ్లండ్ ఓవర్‌కు 4 పరుగులకు పైగా రన్‌రేట్‌తో పరుగులు సాధిస్తుండడం విశేషం. చదవండి: టెస్టుల్లో 32వ సెంచరీ.. ఆస్ట్రేలియన్ దిగ్గజం సరసన Ashes 2023: కామెంటరీ కంటే ఐస్‌క్రీం ఎక్కువైపోయిందా! -
ధోనిలా ఉన్నాడు.. 2040లో ఇదే జరగొచ్చు!
ఐపీఎల్ 16వ సీజన్ సక్సెక్ క్రెడిట్లో కొంతభాగం సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఇవ్వాల్సిందే. కేవలం ధోని కోసమే ఈ సీజన్‌ను చూస్తున్నవాళ్లు చాలామందే ఉన్నారు. ధోనికిదే లాస్ట్ సీజన్ అని రూమర్స్ వచ్చినవేళ అతని ఆటను చూడడం కోసం ఎగబడ్డారు. సీఎస్కే మ్యాచ్ ఆడుతుందంటే చాలు జియో సినిమాలో వీక్షకుల సంఖ్య సుమారు రెండుకోట్లు ఉంటుంది. అయితే లక్నోతో మ్యాచ్ సందర్భంగా టాస్ సమయంలో ధోని తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు. ఇదే నా చివరి ఐపీఎల్ అని మీరు డిసైడ్ అయ్యారు.. నేను కాదు అంటూ తెలివైన సమాధానం ఇచ్చాడు. దీన్నిబట్టి ధోని రిటైర్మెంట్ ఈ సీజన్లో మాత్రం ఉండే అవకాశం లేదని అర్థమయింది. ఈ సంగతి పక్కనబెడితే సోషల్ మీడియాలో ధోనికి సంబంధించిన ఒక ఫోటో చక్కర్లు కొడుతుంది. నెరిసిన గడ్డం.. సీఎస్కే జెర్సీ.. అవే చూపులతో స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్ చూస్తున్న ఒక అభిమాని అచ్చం ధోనిలా కనిపించాడు . దూరం నుంచి చూస్తే అరె నిజంగా ధోనినే అనిపిస్తోంది. అయితే ఫ్రేమ్‌లో ఆ వ్యక్తి కాస్త పక్కకు జరగ్గానే ముఖ కవళికల్లో మార్పు కనిపించింది. ఈ సీజన్లో సీఎస్కే, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన 41వ మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. అయితే ఆ ఫోటోను తీసిన ఒక అభిమాని ట్విటర్లో షేర్ చేయగా.. ఒక అభిమాని తనదైన శైలిలో క్యాప్షన్ పెట్టాడు. ''టైమ్ ట్రావెల్లో ముందుకెళ్లి చూడండి.. 2040లో ధోని ఇలాగే ఐపీఎల్ మ్యాచ్‌ను చూస్తూ ఉంటాడు.. ఆ అద్బుత దృశ్యం 18 ఏళ్ల ముందే కనిపించింది'' అంటూ పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by @issa_vibe_dump చదవండి: 'రింకూ లాంటి ఫినిషర్ ఉండగా.. టెన్షన్ ఎందుకు దండగ' -
బట్లర్ మనసు దోచిన గుజరాత్ చిన్నది..
ఐపీఎల్ 16వ సీజన్లో ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను గుజరాత్ తమ హోంగ్రౌండ్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడింది. సొంత మైదానంలో తమ జట్టు మ్యాచ్ ఆడుతుందంటే స్టేడియంలోకి వచ్చే ప్రేక్షకుల మద్దతు మొత్తం సదరు జట్టుకే ఉంటుంది. అయితే ఒక గుజరాత్ చిన్నది మాత్రం రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ మనసును దోచేసింది. విషయంలోకి వెళితే.. గుజరాత్, రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్‌కు ఒకరోజు ముందు(అంటే శనివారం) నెట్ ప్రాక్టీస్ సెషన్ జరిగింది. ప్రాక్టీస్‌లో ఇరుజట్లు పాల్గొన్నాయి. బట్లర్ తన ప్రాక్టీస్ ముగించుకొని వెళ్తున్న సమయంలో ఒక యువతి బట్లర్ వద్దకు వచ్చింది. బట్లర్‌తో మాట్లాడుతూ.. ''నేను మీకు వీరాభిమానిని.. మీ ఆటంటే నాకు చాలా ఇష్టం.. ఐ లవ్ యూ'' అంటూ పేర్కొంది. ఆమె మాటలకు ముగ్దుడైన బట్లర్ యువతితో మాట్లాడాడు. ''ఐపీఎల్‌ను ఎంజాయ్ చేస్తున్నారా అని అడగ్గా.. ''సూపర్‌గా ఎంజాయ్ చేస్తున్నా.. నాది గుజరాత్ అయినప్పటికి మీకు పెద్ద ఫ్యాన్‌ను. మీకోసమే రేపటి(ఆదివారం) మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు మద్దతు ఇవ్వబోతున్నా'' అని పేర్కొంది. దీనికి బట్లర్.. ''అంటే రేపు మ్యాచ్‌లో పింక్ డ్రెస్ వేసుకోబోయేది నువ్వొక్కదానివే అనుకుంటా అని నవ్వుతూ పేర్కొన్నాడు. ఆ తర్వాత బట్లర్ ఆటోగ్రాఫ్ తీసుకున్న సదరు యువతి బట్లర్‌తో సెల్ఫీ దిగింది. కాగా దీనికి సంబంధించిన వీడియోనూ రాజస్తాన్ రాయల్స్ ట్విటర్లో షేర్ చేసుకుంది. ప్రస్తుతం బట్లర్ మనసు దోచిన గుజరాత్ యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “I love you so much!” 💗 pic.twitter.com/0rL3v0z0km — Rajasthan Royals (@rajasthanroyals) April 15, 2023 చదవండి: ఎవరికి చిక్కని బట్లర్.. ఏడేళ్లలో రెండోసారి మాత్రమే -
'భయ్యా.. నీకున్న సౌలత్ మాకుంటే ఎంత బాగుండు'
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సాయి సుదర్శన్(62 నాటౌట్) టాప్ క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోకోగా.. కిల్లర్ మిల్లర్ 16 బంతుల్లో 31 నాటౌట్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో దుమ్ము దులిపిన గిల్ ఈ మ్యాచ్‌లో మాత్రం కేవలం 14 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే సోషల్ మీడియాలో గిల్ ఒక అభిమానికి ఇచ్చిన రిప్లై అందరిని ఆకట్టుకుంది. విషయంలోకి వెళితే.. ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు వస్తున్న క్రికెట్ ఫ్యాన్స్‌కు అందించే టికెట్స్ ధరలు రకరకాలుగా ఉన్నాయి. వాటిలో ఒకటి రూ. 20 వేల టికెట్ కూడా ఉంది. వీఐపీ ప్రీమియమ్ లాంజ్ టికెట్ అయిన దీనిని కొనుగోలు చేసిన వారికి రాచ మర్యాదలు చేస్తారు. పార్కింగ్ ఏరియా నుంచి ప్రీమియమ్ లాంజ్‌లోకి వెళ్లడానికి ఒక కార్‌ను కేటాయించారు. అందులో ఎక్కి స్టేడియం లోపల నుంచి ప్రీమియమ్ సూట్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక అభిమాని సీజన్ ఆరంభ మ్యాచ్ అయిన గుజరాత్ టైటాన్స్, సీఎస్కే మ్యాచ్‌కు రూ.20 వేల టికెట్ కొని మ్యాచ్‌ను ఎంజాయ్ చేశాడు. ప్రీమియమ్ లాంజ్ టికెట్ కొన్న విషయంతో పాటు ప్రీమియమ్ సూట్ కార్లో ఎక్కి లాంజ్‌కు చేరుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ ఫోటోకు వినూత్న స్పందన వచ్చింది తాజాగా గిల్ అభిమాని పెట్టిన ఫోటోపై ఫన్నీగా స్పందించాడు. ''భాయ్ నీకిచ్చిన సౌలత్ మాకుంటే ఎంత బాగుండు.. ఇలాంటి వాటికి పెట్టి పుట్టుండాలి. మైదానంలోకి ఎంటర్ అవ్వాలంటే మేం నడవాల్సిందే. కానీ ఇతనికి ఆ అవసరం లేకుండా నేరుగా లాంజ్ దగ్గరికి చేరడానికి కార్ సూట్ ఇచ్చారు. మేం కూడా డ్రెసింగ్‌రూమ్ నుంచి గ్రౌండ్లోకి ఎంటర్ కావడానికి ఇలా కార్ కేటాయిస్తే బాగుండేది నడిచే బాధ తప్పేది.. '' అంటూ పేర్కొన్నాడు. గిల్ ఇచ్చిన రిప్లై సూపర్ ఫన్నీగా ఉందని కొందరు అంటే.. మరి నడవడానికి కూడా ఇంత బద్దకమా అంటూ మరికొందరు పేర్కొన్నారు. చదవండి: Chahal-Umran Malik: 'మాట తప్పాడు.. చాలా బ్యాడ్‌గా అనిపిస్తోంది' -
చారిత్రాత్మక విజయం.. ఆఫ్గన్ సుందరి మళ్లీ వచ్చేసింది
పాకిస్తాన్‌తో జరిగిన టి20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్ 2-1 తేడాతో గెలిచి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. టి20ల్లో పాకిస్తాన్‌పై ఆఫ్గన్‌కు ఇదే తొలి టి20 సిరీస్ విజయం కావడం విశేషం. దీంతో అఫ్గానిస్తాన్ క్రికెట్ ప్రేమికులు చారిత్రాత్మక విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అందులో ఆఫ్గన్ సూపర్ ఫ్యాన్.. అందాల సుందరి వజ్మా ఆయూబి కూడా ఉంది. వజ్మా అయూబీ అనగానే టక్కున గుర్తొచ్చేది ఆసియా కప్ 2022.అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌కు వజ్మా అయూబీ హాజరైంది. ఆమె అందానికి ఆరోజు స్టేడియానికి వచ్చిన వారితో పాటు టీవీల్లో మ్యాచ్ చూసినవారు కూడా ఫిదా అయ్యారు. అంతగా కుర్రకారు మనసులు దోచుకుంది. అఫ్గానిస్తాన్ అభిమాని అయిన వాజ్మా బౌండరీ లైన్ వద్ద అఫ్గాన్ జెండా పట్టుకొని ఆటగాళ్లతో పాటు వీక్షకులను తన అందరంతో కట్టిపడేసింది. కాగా మ్యాచ్ గెలిచిన తర్వాత అఫ్గానిస్తాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. ''కంగ్రాట్స్ బ్లూ టైగర్స్'' అంటూ వాజ్మా ఆయూబీ తన ట్విటర్లో పేర్కొంది. అప్పట్లో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన చివరి టి20 మ్యాచ్ సందర్భంగా వజ్మా అయూబీ మరోసారి ప్రత్యక్షం అయింది. తమ దేశం చారిత్రక సిరీస్ విజయాన్ని అందుకోవడంతో తన ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. సిరీస్ విజయం అనంతరం అప్గానిస్తాన్ జెండా పట్టుకొని గట్టిగా అరుస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సోషల్ యాక్టివిస్ట్ అయిన వజ్మా అయూబీ దుబాయ్‌లోనే నివాసం ఉంటుంది. ఎంటర్ప్రెన్యుర్గా రాణిస్తున్న ఈమెకు లమన్ పేరుతో సొంతంగా ఫ్యాషన్ లేబుల్ కంపెనీ నడుపుతోంది. That winning moment Alhamdulillah. Now you guys know why do I keep losing my voice after every Afghanistan match 😂 #AFGvsPAK pic.twitter.com/WV8lF6LGiz — Wazhma Ayoubi (@WazhmaAyoubi) March 27, 2023 Congratulations blue tigers #AFGvsBAN #AsiaCup2022 pic.twitter.com/ia7X8slfjJ — Wazhma Ayoubi (@WazhmaAyoubi) August 30, 2022 చదవండి: Asia Cup IND Vs AFG: టీమిండియాతో అఫ్గానిస్తాన్ మ్యాచ్.. కళ్లన్నీ ఆ యువతిపైనే! రిషబ్ పంత్ స్థానంలో బెంగాల్ సంచలనం! -
'అందమైన భార్య ఉన్నా ఇదే చెప్తావా?'
నాగ్‌పూర్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ చూడడానికి వచ్చిన ఒక అభిమాని తన చర్యతో అందరిని ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లి అంటే విపరీతమైన అభిమానం అనుకుంటా. కట్టుకున్న భార్య కంటే విరాట్ కోహ్లినే ఎక్కువ ఇష్టపడుతాను అంటూ ప్లకార్డు ప్రదర్శించడం ఆసక్తి కలిగించింది. అయితే దీనిపై కొందరు అభిమానులు ఫన్నీ సెటైర్లు వేశారు.. ''బాగానే ఉంది సంబరం.. ఒకవేళ నీకు అందమైన భార్య ఉంటే అప్పుడు కూడా ఇలాగే చెప్తావా''.. ''ఇంటికెళ్లిన తర్వాత నీకు బడితపూజ ఖాయం భయ్యా''.. కోహ్లి మీద అభిమానంతో కట్టుకున్న భార్యను అవమానిస్తావా'' అంటూ కామెంట్స్ చేశారు. మరికొందరు మాత్రం గతంలో కోహ్లి సెంచరీ సాధించేంతవరకు పెళ్లి చేసుకోనని భీష్మించి కూర్చొన్న ఒక అభిమాని ఫోటోను రీట్వీట్ చేశారు. ఎంతైనా అభిమానం వెర్రిగానే ఉంటుంది. ముఖ్యంగా మన టీమిండియా ఫ్యాన్స్ అభిమానించడంలో ముందు వరుసలో ఉంటారు. సదరు క్రికెటర్ బాగా ఆడితే చప్పట్లు.. ఆడకపోతే చివాట్లు పెట్టడం సహజం. ఇక తొలి టెస్టు రసవత్తరంగా సాగుతుంది. తొలిరోజు టీమిండియా బౌలర్లు ఆసీస్ బ్యాటర్ల పని పడితే.. రెండోరోజు ఆటలో ఆసీస్ బౌలర్లు ఆధిపత్యం చూపిస్తున్నారు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో మెరవడం కాస్త ఊరటనిచ్చే అంశం. తన ఫామ్మై వస్తున్న విమర్శలకు సెంచరీతో సమాధానమిచ్చాడు రోహిత్. జట్టులో అంతా విఫలమైనప్పుడు ఆడడం తన స్పెషాలిటీ అని రోహిత్ మరోసారి నిరూపించాడు. 212 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు రీఎంట్రీ టెస్టులో మొదట బౌలింగ్‌తో అదరగొట్టి ఐదు వికెట్లతో రాణించిన జడేజా.. బ్యాటింగ్‌లోనూ ఫిఫ్టీతో మెరిశాడు. ప్రస్తుతం టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. జడేజా 51, అక్షర్ పటేల్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ ఐదు వికెట్లతో చెలరేగాడు. And yes, that’s his wife next to him. #INDvAUS #BGT2023 pic.twitter.com/FHv8GlA1uS — Adam Collins (@collinsadam) February 10, 2023 చదవండి: లియోన్ అనుకుంటే డెబ్యూ బౌలర్ ఇరగదీశాడు -
ILT20 2023: తిరిగిస్తాడనుకుంటే పారిపోయాడు
అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20 క్రికెట్లో హాస్యాస్పద సన్నివేశం చోటుచేసుకుంది. బ్యాటర్ కొట్టిన బంతి స్టేడియం అవతల పడింది. అయితే స్డేడియం బయట ఉన్న వ్యక్తి దానిని క్యాచ్‌గా తీసుకున్నాడు. ఆ తర్వాత బంతిని తీసుకొని అక్కడినుంచి పారిపోయాడు. చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేకపోయినప్పటికి సదరు వ్యక్తి చర్య నవ్వులు పూయించింది. ఎంఎఐ ఎమిరేట్స్, డెసర్ట్ వైపర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది జరిగింది. ఎమిరేట్స్ బ్యాటింగ్ సమయంలో మౌస్లే డీప్‌స్క్వేర్ లెగ్ దిశగా బంతిని స్టాండ్స్ బయటికి పంపించాడు. బంతి వెళ్లి నేరుగా రోడ్డుపై పడింది. ఆ తర్వాత ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని తీసుకున్నాడు. స్టేడియంలోకి తిరిగి విసురుతాడనుకుంటే.. బంతితో అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ తర్వాత కాసేపటికే కీరన్ పొలార్డ్ భారీ సిక్సర్ కొట్టాడు. ఈసారి కూడా బంతి స్టేడియం అవతల పడింది. ఆ వ్యక్తి మళ్లీ కనిపిస్తాడేమో అని చూస్తే బంతిని తీసుకోవడానికి ఎవరు రాలేదు. దీనికి సంబంధించిన వీడియోను ఐఎల్టి20 తన ట్విటర్లో షేర్ చేసింది. సిక్సర్ల వర్షం కురుస్తోంది.. మీరు ఏ టైప్ క్రికెట్ లవర్స్.. 1). తీసుకొని పారిపోవడం..2). తీసుకొని తిరిగిచ్చేయడం .. మీరే ఎంపిక చేసుకొండి అంటూ కామెంట్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఎంఐ ఎమిరేట్స్ 157 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోరు చేసింది. మహ్మద్ వసీమ్ 86, ఆండ్రీ ఫ్లెచర్ 50, కీరన్ పొలార్డ్ 50, మౌస్లే 31 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన డెసర్ట్ వైపర్స్ 84 పరుగులకే కుప్పకూలింది. ఎమిరేట్స్ బౌలింగ్‌లో ఫజల్లా ఫరుఖీ మూడు వికెట్లు తీయగా.. జహూర్ ఖాన్, ఇమ్రాన్ తాహిర్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. When it’s raining 6️⃣s, There are 2 types of cricket lovers.. 1. Pick and run 🏃♂️ 2. Pick and return Which category are you? Book your tickets now : https://t.co/sv2yt8acyL#DPWorldILT20 #ALeagueApart #DVvMIE pic.twitter.com/P0Es01cMz8 — International League T20 (@ILT20Official) January 29, 2023 చదవండి: కాఫీ బ్యాగులతో ఆసీస్ క్రికెటర్; తాగడానికా.. అమ్మడానికా? రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ ఓపెనర్ -
71 కాస్తా 74.. మూడేళ్ల శపథం నుంచి పెళ్లి వరకు
టీమిండియా సూపర్‌స్టార్.. కింగ్ కోహ్లి ఈ ఏడాదిని అద్భుతంగా ఆరంభించాడు. కొత్త ఏడాది ప్రారంభమైన రెండు వారాల వ్యవధిలోనే రెండు శతకాలు కొట్టి తన ఫామ్‌ను కొనసాగించాడు. 74వ సెంచరీతో.. శతకాల వేట కొనసాగిస్తున్న కోహ్లి.. ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లోనూ ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేసి కప్‌ను అందుకోవాలని కోరుకుందాం. అయితే గడిచిన మూడేళ్లు కోహ్లికి గడ్డుకాలం. 2019లో చివరిసారి సెంచరీ సాధించిన కోహ్లి.. మూడేళ్ల పాటు ఒక్క సెంచరీ అందుకోలేకపోయాడు. ఒకానక దశలో సెంచరీ కాదు కదా కనీసం అర్థ సెంచరీ మార్క్ అందుకోవడంలోనూ విఫలం కావడంతో అతని ఆటపై సందేహాలు నెలకొన్నాయి.కోహ్లి తప్పుకోవాల్సిన సమయం వచ్చేసిందంటూ విమర్శనాస్రాలు సంధించారు. ఇక కోహ్లి అభిమానులైతే అతని సెంచరీ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. ఆ అభిమానం ఎంతదూరం వెళ్లిదంటే.. కొంతమంది అభిమానులు కోహ్లి సెంచరీ కొట్టేవరకు తమ టూర్లను వాయిదా వేసుకోవడం.. లేదంటే గడ్డం చేసుకోకపోవడం.. గర్ల్‌ఫ్రెండ్స్‌తో డేట్‌కు వెళ్లమని శపథాలు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరొక అభిమాని చర్య విపరీతంగా వైరల్ అయింది. కోహ్లి 71వ సెంచరీ(మూడు ఫార్మాట్లు కలిపి) చేసేవరకు తాను పెళ్లి చేసుకోనంటూ సదరు అభిమాని టీమిండియా మ్యాచ్ సందర్భంగా మైదానంలో ప్లకార్డు పట్టుకొని కనిపించాడు. అన్నట్లుగానే కోహ్లి సెంచరీ సాధించేవరకు పెళ్లి చేసుకోలేదు. అయితే గతేడాది ఆసియాకప్ సందర్భంగా అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి 71వ సెంచరీ అందుకున్నాడు. దీంతో అభిమాని కల నెరవేరినప్పటికి పెళ్లికి ముహుర్తాలు లేకపోవడంతో నాలుగు నెలలు ఆగాల్సి వచ్చింది. అయితే ఈ గ్యాప్‌లోనే కోహ్లి మరో రెండు సెంచరీలు బాది ఆ సంఖ్యను 74కు పెంచుకున్నాడు.యాదృశ్చికంగా కోహ్లి 74వ సెంచరీ కొట్టిన రోజునే సదరు అభిమాని వివాహం జరిగింది. ఇంకేముంది తన అభిమాని ఆటగాడు సెంచరీ చేసిన రోజునే తన పెళ్లి కూడా జరగడంతో అతని ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. అందుకే పెళ్లి తంతు ముగియగానే అదే పెళ్లి బట్టల్లో సరాసరి ఇంటికి వచ్చి కోహ్లి సెంచరీ ఫీట్‌ను టీవీలో చూస్తూ పరవశించిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆ వ్యక్తి ట్విటర్లో షేర్ చేయడంతో తెగ వైరల్ అయ్యాయి. ఇక కోహ్లి శ్రీలంకతో వన్డే సిరీస్‌లోనే రెండు సెంచరీలు బాది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇప్పటివరకు వన్డేల్లో కోహ్లి 46 సెంచరీలు బాదాడు. సచిన్ 49 వన్డే సెంచరీల రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం మూడు సెంచరీల దూరంలో మాత్రమే ఉన్నాడు. కోహ్లి ఇప్పుడున్న ఫామ్ దృశ్యా అది పెద్ద కష్టమేమి అనిపించడం లేదు. ఇక న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న దృశ్యా కోహ్లి మరో సెంచరీ చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇరుజట్ల మధ్య బుధవారం(జనవరి 18న) ఉప్పల్ వేదికగా తొలి వన్డే జరగనుంది. ఉప్పల్ మైదానంలో కోహ్లికి ఘనమైన రికార్డు ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో ఉప్పల్‌లో జరిగిన టి20 మ్యాచ్‌లో కోహ్లి (63 పరుగులు) అర్థసెంచరీతో రాణించాడు. King Kohli with his 74th international hundred - the GOAT. pic.twitter.com/B93e7X1vYL — Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2023 చదవండి: షార్ట్ టెంపర్‌కు మారుపేరు.. అభిమానిపై తిట్ల దండకం న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. సూర్యకుమార్‌కు నో ఛాన్స్! కిషన్‌కు చోటు -
అందుకే అత్యుత్సాహం పనికి రాదంటారు..
మనకు రానిది ప్రయత్నించి కొన్నిసార్లు చేతులు కాల్చుకున్న సందర్బాలున్నాయి. తాజాగా ఒక అభిమాని క్యాచ్ అందుకోవడం సాధ్యం కాదని తెలిసినా అత్యుత్సాహం ప్రదర్శించి అనవసరంగా ముక్కు పచ్చడి చేసుకున్నాడు. ఇదంతా బిగ్‌బాష్ లీగ్ సీజన్-12లో చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇక మంగళవారం బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. సిడ్నీ థండర్స్ ఇన్నింగ్స్ సమయంలో జట్టు ఓపెనర్ మాథ్యూ గిల్క్స్ దూకుడుగా ఆడుతున్నాడు. 56 పరుగుల వద్ద ఉన్నప్పుడు మిచెల్ స్వీప్సన్ బౌలింగ్‌లో లాంగాన్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. అయితే బంతి నేరుగా స్టాండ్స్‌వైపు దూసుకొచ్చింది. అయితే స్టాండ్స్‌లో నిలబడిన ఒక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. తనవైపు వస్తున్న క్యాచ్‌ను అందుకోవాలని ప్రయత్నించాడు. కానీ పాపం క్యాచ్ పట్టడంలో విఫలం కావడంతో బంతి నేరుగా అతన్ని ముక్కు మీద గట్టిగా తాకి పక్కకు పడింది. అయినా కూడా తనకేం కాలేదన్నట్లుగా అంతా ఒకే అని సింబల్ చూపించాడు. అయితే కాసేపటికే సదరు అభిమాని ముక్కు నుంచి రక్తం దారలా కారసాగింది. ఇది గమనించిన బ్యాటర్ మాథ్యూ గిల్క్స్ అతని వైపు చూడగా.. ముక్కుకు కర్చీఫ్ అడ్డుపెట్టుకున్న అభిమాని పర్లేదులే అన్నట్లుగా సైగ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. పియర్సన్ 27, గ్జేవియర్ బార్లెట్ 28 నాటౌట్ రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండానే కేవలం 11.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. అలెక్స్ హేల్స్ 59 నాటౌట్, మాథ్యూ గిల్క్స్ 56 నాటౌట్ జట్టును గెలిపించారు. Anyone know this guy who can let us know if his nose is all good?! 🫣@KFC #BucketMoment #BBL12 pic.twitter.com/YVjvgg6a9v — KFC Big Bash League (@BBL) December 27, 2022 చదవండి: Ashwin-Shreyas Iyer: మొన్న గెలిపించారు.. ఇవాళ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపారు దెబ్బ అదుర్స్.. ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్ -
అభిమానంతో రోహిత్ వద్దకు.. ఒక్క హగ్ అంటూ కన్నీటిపర్యంతం
జార్వో.. గుర్తున్నాడా. అరె ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది. 2021లో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినప్పుడు పదే పదే మైదానంలోకి దూసుకొచ్చి హల్చల్ చేశాడు. జార్వో 69 టీషర్ట్ ధరించి సిరీస్‌లో పలుమార్లు అంతరాయం కలిగించాడు. దీంతో అతన్ని మైదానం నుంచి నిషేధం విధించినప్పటికి.. జైలుకి వెళ్లినప్పటికి అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. అయితే మొత్తంగా మాత్రం తన చర్యలతో అప్పట్లో హాట్‌టాపిక్‌గా నిలిచాడు. తాజాగా టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా-జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అభిమాని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వద్దకు దూసుకొచ్చాడు. జింబాబ్వే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక టీనేజ్ అభిమాని సెక్యూరిటీ కళ్లు కప్పి క్రీజులోకి దూసుకొచ్చాడు. ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ దగ్గరికి వచ్చి అతన్ని హత్తుకునే ప్రయత్నం చేశాడు. ఈలోగా సెక్యూరిటీ సిబ్బంది అతన్ని బయటికి లాక్కెళ్లారు. ఈ సమయంలో ఒక్క షేక్ హ్యాండ్ లేదా కనీసం హగ్ ఇవ్వాల్సిందిగా రోహిత్ వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం కాస్త బాధను కలిగించింది. అయితే అనుమతి లేకుండా మైదానంలోకి దూసుకురావడం తప్పుగా పరిగణిస్తారు. ఎంత అభిమానం ఉన్న ఆటగాళ్లు కూడా తమ భద్రత దృశ్యా ఎవరిని దగ్గరికి రానియ్యరు. రోహిత్ కూడా అదే పద్దతిని ఫాలో అయ్యాడు. కాగా సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించి గ్రౌండ్లోకి ఎంటర్ అయినందుకు ఆ కుర్రాడికి క్రికెట్ ఆస్ట్రేలియా రూ.6 లక్షల 50 వేల భారీ జరిమానా విధించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ ప్రపంచకప్‌లో అభిమానులు మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్లోకి రావడం ఇది రెండో సారి. దీంతో ఆటగాళ్ల భద్రతపై క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకుంటున్న చర్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: ఏమా కొట్టుడు.. 'మిస్టర్ 360' పేరు సార్థకం అన్నీ కుదిరితే ఫైనల్లో టీమిండియా, పాకిస్తాన్! A fan entered into a stadium during India vs zim match....#INDvsZIM #T20worldcup22 #T20WorldCup #SuryakumarYadav #semis #RohitSharma𓃵 #ViratKohli𓃵 follow for more tweets pic.twitter.com/fWvKNIky63 — Santoshgadili (@Santoshgadili3) November 6, 2022 Little fan didn't get chance to meet Rohit Sharma... Nice gesture from Captain Rohit he talked with him...#RohitSharma𓃵 #T20worldcup22 #T20WorldCup pic.twitter.com/eQ4Pw6UJt2 — 𝖲𝖺𝗎𝗋𝖺𝖻𝗁🤍 (@Cricket_Gyaani_) November 6, 2022 A fan invaded the field today to meet Rohit Sharma, he was in tears when he came close to Rohit. The fan has been fined 6.5 Lakhs INR for invading the field. pic.twitter.com/CmiKIocTHf — Mufaddal Vohra (@mufaddal_vohra) November 6, 2022 -
'లెగ్ స్పిన్ బౌలింగ్ వేయాలా'.. రిజ్వాన్ అదిరిపోయే రిప్లై
పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ తన కెరీర్లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ మ్యాచ్ గెలిచింది అంటే ఆ మ్యాచ్‌లో రిజ్వాన్ మెరిసి ఉంటాడనేలా అభిమానుల్లో పాతుకుపోయింది. పాక్ జట్టుకు రిజ్వానే బలం.. బలహీనత. అతను ఆడని రోజున పాకిస్తాన్ పూర్తిగా విఫలం కావడం గమనించాం. దీంతో రిజ్వాన్ పాకిస్తాన్ బ్యాటింగ్‌కు వెన్నుముకలా మారిపోయాడు. మహ్మద్ రిజ్వాన్‌కు తోడుగా కెప్టెన్ బాబర్ ఆజం కూడా రాణించడం సానుకూలాంశం. ఈ ఇద్దరు విఫలమైతే పాక్ కష్టాల్లో పడినట్లే. టీమిండియాతో తలపడేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతుంది. అక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా జరగనున్న బ్లాక్బాస్టర్ మ్యాచ్ కోసం అభిమానులతో పాటు ఇరు దేశాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో టీమిండియా నుంచి మ్యాచ్‌ను లాగేసింది మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజంలు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈసారి కూడా ఎలాగైనా టీమిండియాతో మ్యాచ్‌లో రాణించాలని రిజ్వాన్ పట్టుదలతో ఉన్నాడు. అందుకు తగ్గట్లుగానే అతని ప్రాక్టీస్ కొనసాగుతుంది. ఈ విషయం పక్కనబెడితే.. రిజ్వాన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు పాక్ ఓపెనర్ ఇచ్చిన సమాధానం క్రికెట్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది. రిజ్వాన్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఒక భారత అభిమాని అతని దగ్గరకు వచ్చి.. నేను నీకు లెగ్ స్పిన్ బౌలింగ్ చేయాలా అని అడిగాడు. మొదట రిజ్వాన్ ఆ వ్యక్తిని పట్టించుకోలేదు. కానీ సదరు వ్యక్తి మరోసారి అదే ప్రశ్న వేయడంతో స్పందించిన రిజ్వాన్.. పెషావర్‌కు వచ్చి బౌలింగ్ చెయ్యు అంటూ ఫన్నీగా పేర్కొన్నాడు. దీంతో భారత అభిమాని నవ్వుల్లో మునిగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐసీసీ మేజర్ టోర్నీల్లో(వన్డే వరల్డ్‌కప్, టి20 ప్రపంచకప్) పాకిస్తాన్‌పై టీమిండియాకు మంచి రికార్డు ఉంది. వన్డే ప్రపంచకప్‌లో ఇరుజట్లు తలపడిన ఏడుసార్లు టీమిండియాదే విజయం. ఇక టి20 ప్రపంచకప్‌లోనూ ఆరుసార్లు తలపడితే టీమిండియా నాలుగుసార్లు, పాక్ ఒక్కసారి మాత్రమే నెగ్గింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. చదవండి: భారత్-పాక్ మ్యాచ్‌పై స్పందించిన డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం 'భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేస్తాం' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జోరుగా వర్షం.. టీమిండియా ఆటగాడి కోసం రెండు గంటల నిరీక్షణ
క్రికెటర్లకు అభిమానులు ఉండడం సహజం. కానీ కొందరు వీరాభిమానులు ఉంటారు.. తమ అభిమాన ఆటగాడిని కలవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఇలాంటివి ఇంతకముందు చాలానే చూశాం. తాజాగా అలాంటి ఘటనే జరిగినప్పటికి పైన చెప్పుకున్న వాటితో పోల్చలేనప్పటికి చెప్పుకునే విషయమైతే దాగుంది. విషయంలోకి వెళితే.. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ఉంటున్న షిజారా.. టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌కు వీరాభిమాని. టీమిండియా మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టింది. వన్డే సిరీస్‌కు ధావన్ నాయకత్వం వహించనుండగా.. రోహిత్, కోహ్లి, బుమ్రా, భువనేశ్వర్, పంత్, కేఎల్ రాహుల్, పాండ్యాలు వన్డేలకు విశ్రాంతినిచ్చింది. మొదట మూడు వన్డేలు జరగనుండడంతో ధావన్ నాయకత్వంలో యువ క్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్, రుతురాజ్, దీపక్ హుడా, సంజూ శాంసన్‌లు పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో భారీ వర్షం కారణంగా ఇండోర్ ప్రాక్టీస్‌కే పరిమితమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. కాగా శ్రేయాస్ అయ్యర్ వచ్చిన విషయం తెలుసుకున్న షిజారా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఇండోర్ సెంటర్‌కు చేరుకుంది. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికి దాదాపు రెండు గంటల పాటు శ్రేయాస్ అయ్యర్ కోసం ఎదురుచూసిన షిరాజా తాను అనుకున్నది సాధించింది. వేరొకరి ద్వారా విషయం తెలుసుకున్న అయ్యర్ ఆమెను కలిసి తన ఆటోగ్రాఫ్‌తో కూడిన ఒక చిన్న బ్యాట్‌ను అందించాడు. దీంతో సంతోషంలో మునిగిపోయిన షిరాజా.. ''రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ను చూద్దామని వచ్చా. కానీ వాళ్లు రాలేదు..అయితే నా అభిమాన క్రికెటర్ సంతకం మాత్రం పొందగలిగాను.. శ్రేయాస్ అయ్యర్ కోసం తన రెండు గంటల నిరీక్షణ ఫలించింది'' అంటూ యూట్యూబ్ చానెల్‌కు చెప్పుకొచ్చింది. అయితే జూలై 29 నుంచి జరగనున్న టి20 సిరీస్‌కు కోహ్లి, బుమ్రా మినహా మిగతావాళ్లు టీమిండియాతో చేరనున్నారు. వన్డే సిరీస్‌లో ఆడనున్న ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, అర్షదీప్‌సింగ్, ఆవేశ్ ఖాన్, దీపక్ హుడాలకు ఎంతగానో ఉపయోగపడనుంది. రానున్న టి20 ప్రపంచకప్‌కు టీమిండియా జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. చదవండి: పక్కవాళ్లు చెప్పేవరకు సోయి లేదు.. ఇంత మతిమరుపా? -
సెంచరీ కోసం కోహ్లి కూడా ఇంతలా తపించి ఉండడు..
విరాట్ కోహ్లి సెంచరీ చేసి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. అదిగో చేస్తాడు.. ఇదిగో చేస్తాడు అని మనం అనుకుంటున్న ప్రతీసారి నిరాశపరుస్తూనే వస్తున్నాడు. అతని సెంచరీ కోసం అటు అభిమానులు కూడా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసి ఆశలు వదిలేసుకున్నారు. తాజాగా జరుగుతున్న ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ వరుసగా విఫలమవుతున్నాడు. దీంతో బీసీసీఐ వెస్టిండీస్‌తో జరగనున్న టి20, వన్డే సిరీస్‌లకు కోహ్లిని పక్కనబెట్టింది. ఇదిలా ఉంటే కోహ్లి వీరాభిమాని ఒకరు అతను సెంచరీ చేయాలని ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహార పొట్లాలను అందించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ వీరాభిమాని అయిన ఓ మహిళ.. అతడి పేరు మీద ఆహార పొట్లాలను అందజేస్తున్నది. కోహ్లీ ఎలాగైనా సెంచరీ కొట్టాలని గత కొద్దిరోజులుగా ఆకలితో అలమటించేవారికి అన్నం పెడుతున్నది. ట్విటర్ లో ఓ నెటిజన్ ఇందుకు సంబంధించిన విషయాన్ని షేర్ చేశాడు. ఫామ్ కోల్పోయి అందరి చేత మాటలు పడుతుంటే ఆమె మనసు విలవిల్లాడింది. వంద ఇన్నింగ్స్‌లకు పైగా సెంచరీ కొట్టలేక చతికిలపడుతున్న కోహ్లీకి పుణ్యం దక్కాలని ఆమె ప్రయత్నిస్తున్నది. ఆ పొట్లాల మీద ‘కోహ్లీ 71వ సెంచరీ కోసం’ అని రాసి ఉండటం గమనార్హం. తాను పుణ్యం చేస్తేనైనా ఆ పుణ్యఫలం కోహ్లికి అంది తద్వారా అతడు మళ్లీ మునపటి కోహ్లీలా అదరగొడతాడని సదరు మహిళ విశ్వాసం. అందులో భాగంగానే రోడ్లమీద ఉంటూ ఆహారం కోసం అలమటిస్తున్న చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులకు ఆహార పొట్లాలను పంచుతున్నది. మరి ఈ పుణ్యం కోహ్లీకి దక్కి వచ్చే మ్యాచుల్లో అయినా అతడు సెంచరీ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. A Virat Kohli fan distributing foods to some hungry people's and children so that his wish Virat Kohli scored his 71st Century. Nice gesture from Virat's fan and this is Crazy fan following of Kohli. 💥🔥#CricketTwitter #ViratKohli𓃵 #WestIndies #KingKohli #INDvsENG pic.twitter.com/tHs8sir7ZB — Heinnnnnnn Sachiiiiiiiiiiiiiiii (@PranshuThakur00) July 14, 2022 చదవండి: IRE vs NZ: కివీస్ కొంపముంచిన టవల్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! గంగూలీ, జై షా పదవుల్లో కొనసాగుతారా? వారంలో వీడనున్న ఉత్కంఠ -
ప్రేమించే వారికోసం ఎంతదూరమైనా.. అదీ ధోని అంటే!
ఐపీఎల్ 2022 సీజన్లో మనకు వింటేజ్ ధోని కనిపించిన సంగతి తెలిసిందే. ఫినిషర్ అనే పదానికి నిర్వచనం చెబుతూ పలుమార్లు మంచి ఇన్నింగ్స్‌లతో మెరిశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో అయితే ధోని తన దనాధన్ ఇన్నింగ్స్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు. వరుస ఓటములతో డీలా పడిన సీఎస్కే ఈ సీజన్లో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఈ విషయం పక్కనబెడితే.. ధోనికి ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే రేంజ్లో ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత ధోని మిలటరీ ట్రైనింగ్‌లో భాగంగా చాలా క్యాంప్స్ను సందర్శిస్తుంటాడు. తాజాగా రాంచీ ఎయిర్‌పోర్ట్‌లో ధోని తన అభిమానిని కలుసుకొని ఆమెను సంతోషంలో ముంచెత్తాడు. ఆ అభిమాని పేరు లావణ్య పిలానియా. పుట్టుకతోనే అంగవైకల్యం బారిన పడిన లావణ్య ధోని అంటే విపరీతమైన అభిమానం. అందునా ధోని బొమ్మను గీసి అతనికి కానుకగా ఇవ్వాలని భావించింది. ఇది తెలుసుకున్న ధోని లావణ్యను స్వయంగా కలుసుకున్నాడు. ఈ సందర్భంగా లావణ్య తాను గీసిన బొమ్మను ధోనికి చూపించింది. కాగా ధోని లావణ్య చేతులను దగ్గరికి తీసుకోవడం.. కన్నీళ్లను తుడవడం.. తన బొమ్మ గీసినందుకు అభినందించడం లావణ్యకు తెగ సంతోషం కలిగించాయి. దీంతో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ధోనితో ఉన్న క్షణాలను పోస్ట్ చేసింది. ''ఆయన నా చేతులు తడుముతూ.. ఏడ్వకూడదు.. జీవితాన్ని ఆనందంగా గడపాలి. అని పేర్కొన్నారు. ఆ తర్వాత తన బొమ్మ గీసినందుకు థాంక్యూ చెప్పారు. తన విలువైన సమయాన్ని నాకోసం కేటాయించారు.. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నువ్వు సంతోషంగా ఉన్నావా అని ధోని భయ్యా నన్ను అడిగినప్పుడు.. నా దగ్గర రియాక్షన్ లేదు.. ఎందుకంటే ఆయన మాటలు విలువ కట్టలేనివి. మే 31 2022.. కచ్చితంగా నా జీవితంలో మరిచిపోలేని రోజు అవుతుంది'' అని భావోద్వేగంతో రాసుకొచ్చింది. చదవండి: చారిత్రక లార్డ్స్ స్టేడియానికి అవమానం.. 'వినడానికి ఇబ్బందిగా ఉంది' View this post on Instagram A post shared by LAVANYA PILANIA (@heartqueen_lavanya) -
క్రికెట్‌కు వీరాభిమాని.. ఇతని స్టైల్ వేరు
అనకాపల్లి: అతనొక చిరు వ్యాపారి. ఐస్‌క్రీమ్ పార్లర్ నడుపుతూ స్వయం ఉపాధి పొందుతున్న మధ్య తరగతికి చెందిన వ్యక్తి. చిన్నప్పుడు క్రికెట్ అంటే ఏమిటో తెలియదు. అలాంటిది ఇప్పుడు క్రికెట్ వీరాభిమానిగా మారిపోయాడు. ఎంతలా అంటే.. తలపై ఇండియా అనే అక్షరాలతో గుండు గీసుకునే అంతలా.! అతనే అనకాపల్లి గవరపాలెంలో నివాసం ఉంటున్న పి.శ్రీనివాసరావు. వ్యవసాయ కుటుంబానికి చెందిన శ్రీనివాసరావు అనకాపల్లి పట్టణంలోని గౌరీ గ్రంథాలయం పక్కన ఐస్‌క్రీమ్ పార్లర్ నడుపుతున్నాడు. సుమారు మూడు దశాబ్దాల కిందట శ్రీనివాసరావు సొంతూరైన సబ్బవరం మండలంలోని నల్లరేగులపాలెం పరిసరాల్లో చెరువుల్లో క్రికెట్ ఆడుతున్న వారిని చూసి.. అలా ఆటపై ఆసక్తి పెంచుకున్నాడు. అక్కడి నుంచి క్రికెట్ అంటే ప్రాణమిచ్చేలా మారిపోయాడు. శ్రీనివాసరావు ప్రతి విషయంలోనూ క్రికెట్ మార్క్ కనిపించేలా వ్యవహరిస్తుంటాడు. ఇండియా ఆడిన మ్యాచ్‌లంటే అమితాశక్తి. అందుకే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ప్రాంతాల్లో జరిగే క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించేందుకు వెళ్తుంటాడు. ఇండియా విజేతగా నిలిస్తే.. అతని షాపు వద్ద సందడే సందడి. ఇండియా, ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న రోజుల్లో శ్రీనివాసరావు ఇండియా క్రికెట్ జట్టు జెర్సీని ధరించి.. క్రికెట్ ప్లేయర్‌లాగే తయారవుతాడు. ఇండియా అనే అక్షరాలు వచ్చే విధంగా తల వెంట్రుకలను కత్తిరించుకుంటాడు. మిగిలిన భాగాన్ని గుండు గీసుకుంటాడు. గెడ్డంను సైతం ఇండియా, ఐపీఎల్ అక్షరాలు వచ్చే విధంగా ట్రిమ్మింగ్ చేసుకుంటాడు. ఆర్థికంగా ఇబ్బందులున్నా క్రికెట్ మ్యాచ్ అంటే మాత్రం ఎంతో సందడిగా కనిపిస్తాడు. క్రికెట్‌కు సంబంధించిన అంశాలతో నిత్యం కనిపించే శ్రీనివాసరావును అందరూ ఆసక్తిగా తిలకిస్తుంటారు. -
12వ ఆటగాడికి జెర్సీ గిఫ్ట్‌గా.. ఎవరా వ్యక్తి?
మొహలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 222 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కోహ్లి వందో టెస్టు అన్న మాటేగాని మొత్తం జడేజా మ్యాచ్‌గా మారిపోయింది. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కోహ్లికి మంచి బహుమతి అందించాడు. మొదట బ్యాటింగ్‌లో 175 పరుగులు నాటౌట్, ఆ తర్వాత బౌలింగ్‌లో తన మ్యాజిక్ ప్రదర్శిస్తూ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు.. మలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు.. ఓవరాల్‌గా తొమ్మిది వికెట్లు తన ఖాతాలో వేసుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇక కోహ్లికి తన వందో టెస్టులో ఒకసారే బ్యాటింగ్ అవకాశం వచ్చినప్పటికి 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే బ్యాటింగ్‌లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదని అనుకున్నాడేమో.. ఫీల్డింగ్ చేసే సమయంలో ఫ్యాన్స్‌ను ఎంకరేజ్ చేయడం వైరల్‌గా మారింది. ముఖ్యంగా అల్లుఅర్జున్ పుష్ప సినిమాలోని డైలాగులు చెబుతూ ఆడియెన్స్‌ను సంతోషంలో మునిగిపోయేలా చేశాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి టీమిండియా అన్అఫీషియల్ 12వ ఆటగాడికి తన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ఆ అన్ అఫీషియల్ 12వ ఆటగాడు ఎవరనే కదా మీ డౌటు.. అతనే ధరమ్వీర్ పాల్. ఎవరీ ధరమ్వీర్ పాల్... మధ్యప్రదేశ్‌కు చెందిన ధరమ్వీర్ పాల్ పుట్టుకతోనే పోలియో బారిన పడ్డాడు. క్రికెట్‌ను ప్రాణంగా భావించే ధరమ్వీర్ టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్‌కు వస్తుంటాడు. అంగవైకల్యం తనకు ఇష్టమైన క్రికెట్‌ను ఏనాడు ఆపలేదని.. అందుకే టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్‌కు ఎంతదూమైనా వెళ్తుంటానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే పలువురు టీమిండియా ఆటగాళ్లకు ధరమ్వీర్ పాల్ అభిమానిగా మారిపోయారు. ఆ లిస్ట్‌లో కోహ్లి కూడా ఉన్నాడు. దీంతో ధరమ్‌వీర్‌ను ఫ్యాన్స్ టీమిండియా అన్ అఫీషియల్ 12వ ఆటగాడిగా పిలుస్తుంటారు. ఇక మొహలీలో మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా బస్సులో బయలుదేరేందుకు సిద్ధమైంది. ఇదే సమయంలో ధరమ్వీర్ పాల్ బస్సు దగ్గరికి వచ్చాడు. ఇది గమనించిన కోహ్లి బస్సు నుంచి కిందకు దిగి అతని వద్దకు వచ్చి తన జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. కాగా దీనికి సంబంధించిన వీడియోనూ ధరమ్వీర్ తన ఫేస్బుక్లో షేర్ చేసుకున్నాడు. ''థాంక్యూ సో మచ్ చాంపియన్.. నువ్వు ఎప్పటికి నా చాంపియన్‌వే.. ఇంకా కొన్నేళ్లు నీ ఆట నిరంతరాయంగా సాగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా'' అంటూ కోహ్లికి సందేశాన్ని అందించాడు. ఇక 2017లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ధరమ్వీర్ కొన్ని ముఖ్యవిషయాలు వెల్లడించాడు. సచిన్ పాజీ, ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్, సెహ్వాగ్, కోహ్లి లాంటి ఆటగాళ్లతో మంచి సంబంధాలున్నాయి. ఎన్నోసార్లు నాకు సాయమందించారు. వారికి కృతజ్ఞతుడిగా ఉంటాను అని చెప్పుకొచ్చాడు. ఇక మధ్యప్రదేశ్ దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ధరమ్వీర్ పాల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండడం విశేషం. చదవండి: Ind Vs Sl- Rohit Sharma: టీమిండియా భారీ విజయం.. రోహిత్ శర్మ సరికొత్త రికార్డు! -
27 రోజుల తర్వాత ట్వీట్ చూసి షాక్.. వార్నర్ క్షమాపణ
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు క్రికెట్‌ను బ్యాలెన్స్ చేస్తూనే.. వీలున్నప్పుడల్లా వీడియోలతో అభిమానులను అలరిస్తుంటాడు. అంతేకాదు వార్నర్‌కు జాలిగుణం ఎక్కువ. ఎవరైనా కష్టం వచ్చింది అంటూ తనకు ట్వీట్ చేస్తే వెంటనే స్పందిస్తాడు. అలాంటి వార్నర్ మొదటిసారి ఒక అభిమాని ట్వీట్‌కు సకాలంలో స్పందించలేదు. 27 రోజుల తర్వాత ఆ ట్వీట్‌ను చూసి షాకైన వార్నర్.. తన వీరాభిమానికి క్షమాపణ చెప్పాడు. చదవండి: 'చిన్ననాటి జ్ఞాపకాలు.. మా నాన్న షెడ్లో దొరికాయి' విషయంలోకి వెళితే.. వేదాంతి హరీష్ కుమార్ డేవిడ్ వార్నర్‌కు డైహార్డ్ ఫ్యాన్. నవంబర్ 27న తొలిసారి ట్విటర్లో ''హాయ్.. హౌ ఆర్ యూ వార్నర్..'' అంటూ ట్వీట్ చేశాడు. ఇలా ఒకటి.. రెండు రోజులు కాదు.. ఏకంగా 27 రోజుల పాటు ప్రతీరోజు వార్నర్‌కు ట్వీట్ పెడుతూనే ఉన్నాడు. కానీ యాషెస్ సిరీస్‌లో బిజీగా ఉన్న వార్నర్ హరీష్ కుమార్ ట్వీట్‌కు రిప్లై ఇవ్వలేదు. తాజాగా వార్నర్ తన వీరాభిమాని ట్వీట్ చూసి షాకయ్యాడు. ఆ తర్వాత వెంటనే.. ''సారీ.. ఎలా ఉన్నావు బ్రదర్'' అంటూ రీట్వీట్ చేశాడు. వార్నర్ నుంచి రిప్లై వచ్చిందని తెలియగానే ఎగిరి గంతేసిన హరీష్ కుమార్.. ''27 రోజులకు నన్ను గుర్తించావు.. థాంక్యూ వార్నర్ భయ్యా'' అంటూ కామెంట్ చేశాడు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ వార్నర్‌ను ఫన్నీగా ట్రోల్ చేశారు.'' ఏంటి వార్నర్ భయ్యా రిప్లై ఇవ్వడానికి ఇంత సమయం పట్టిందా.. పాపం నీ వీరాభిమాని ఎంత ఫీలయ్యాడో'' అంటూ పేర్కొన్నారు. ఇక యాషెస్ సిరీస్‌లో బిజీగా ఉన్న వార్నర్ బ్యాట్స్‌మన్‌గా దుమ్మురేపుతున్నాడు. తొలి టెస్టులో 94 పరుగులు చేసిన వార్నర్ రెండో టెస్టులోనూ 95 పరుగులు చేశాడు. రెండుసార్లు సెంచరీ మిచ్ చేసుకున్నప్పటికి వార్నర్ ఫామ్‌లో ఉండడం ఆసీస్‌కు కలిసొచ్చే అంశం. ఇక వరుసగా రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది. డిసెంబర్ 26 నుంచి బాక్సింగ్ డే రోజున మూడోటెస్టు ప్రారంభం కానుంది. చదవండి: మ్యాచ్ చివరి బంతికి ఊహించని ట్విస్ట్ Sorry how are you https://t.co/JvjnPjtfgw — David Warner (@davidwarner31) December 23, 2021 -
ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు క్రికెట్ అంటే పిచ్చి
Twitter CEO Parag Agrawal Huge Cricket Fan.. ట్విటర్ నూతన సీఈవోగా పరాగ్ అగర్వాల్ ఎంపికైనప్పటి నుంచి నెటిజన్లు ఆయన కోసం గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరాగ్ గురించి ఆసక్తికర ఫోటోలు, విషయాలు బయటపడ్డాయి. నవంబర్ 29న జాక్ డోర్సీ నుంచి సీఈవో బాధ్యతలు తీసుకున్న పరాగ్ అగర్వాల్‌కు క్రికెట్ అంటే ప్రాణం. 2011 వన్డే ప్రపంచకప్ సందర్భంగా పరాగ్ అగర్వాల్ టీమిండియా ఆడిన ప్రతీ మ్యాచ్‌ను ఎంకరేజ్ చేసిన ఫోటోలు తాజాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు 2011 వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచిన తర్వాత పరాగ్ భారత్ జెండా పట్టుకొని వీధుల్లో తిరిగిన ఫోటోలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక 2011 వన్డే ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: Twitter CEO Parag Agarwal: అమెరికాలో ‘మన’ ఆరుగురి హవా, టాలెంట్ భారత్‌ది.. బెన్ఫిట్ అమెరికాది! -
Ind Vs Pak: భారత్ ఓటమి... గుండెపోటుతో అభిమాని మృతి
సాక్షి, బెంగళూరు (యశవంతపుర): టీ 20 ప్రపంచ కప్‌లో భారత్ ఓటమి చెందడంతో ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. కొడగు జిల్లా సోమవారపేట తాలూకా దొడ్డబళె గ్రామానికి ఉదయ్ (50) క్రికెట్ అభిమాని. ఆదివారం రాత్రి జరిగిన భారత్–పాకిస్తాన్ మ్యాచ్ తిలకిస్తూ భారత్ ఓటమి అంచున ఉండటంతో ఉదయ్ తీవ్ర ఒత్తిడికి గురికావడంతో గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కాగా, ఆదివారం జరిగిన పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ ఏ మాత్రం తడబాటు లేకుండా, వికెట్ నష్టపోకుండా అలవోకగా విజయాన్ని అందుకుంది. చదవండి: (నేరగాడిగా చిత్రీకరించే ఆ వ్యాఖ్యలు నొప్పించాయి: విజయ్ ఆవేదన) -
వీరాభిమాని నం.1
గాలే: ‘మరి కొద్ది రోజుల్లో కరోనా ముగిసిపోతుంది... వచ్చే నెల రోజుల్లో అంతా సర్దుకుంటుంది... ఇంగ్లండ్ జట్టు వచ్చి సిరీస్ ఆడుతుంది...’ ఇలా ఆశపడుతూనే అతను ఏకంగా పది నెలలు శ్రీలంకలోనే గడిపేశాడు. ఎట్టకేలకు ఆ వీరాభిమాని కోరిక తీరింది. ఆ అభిమాని పేరు రాబ్ లూయిస్. ఇంగ్లండ్ క్రికెట్ జట్టంటే పడి చస్తాడు. ఇదే ఉత్సాహంతో అతను గత ఏడాది మార్చిలో శ్రీలంకలో జరిగే ఇంగ్లండ్ సిరీస్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకొని సిద్ధమైపోయాడు. ఆటగాళ్లు వెళ్లక ముందే అక్కడికి చేరుకొని ఎపుడెపుడా అని ఆట కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో కరోనా వచ్చేసింది... ప్రపంచమంతా మారిపోయింది. ఇంగ్లండ్ పర్యటన కూడా వాయిదా పడింది. ఇటు శ్రీలంక నుంచి బయటకు వెళ్లేందుకు ఆంక్షలు, అటు ఇంగ్లండ్‌లో పరిస్థితి తీవ్రం. దాంతో 37 ఏళ్ల లూయిస్ లంకలోనే ఆగిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుందని అతను ఊహించలేదు. త్వరలోనే సిరీస్ జరుగుతుందనే లూయిస్ కూడా ఆశిస్తూ వచ్చాడు. వృత్తిరీత్యా వెబ్ డిజైనర్ అయిన అతను ఆన్లైన్లోనే కొంత మొత్తం సంపాదించడం, లంక కరెన్సీ విలువ చాలా తక్కువ కావడంతో అదృష్టవశాత్తూ అతనికి ఆర్థికపరంగా ఇబ్బంది ఎదురు కాలేదు. చివరకు గురువారం ఇంగ్లండ్–శ్రీలంక మధ్య తొలి టెస్టు ప్రారంభం కావడంతో అతని కోరిక నెరవేరింది. అయితే ఇదీ అంత సులువుగా దక్కలేదు. బయో బబుల్ కారణంగా ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో గాలే స్టేడియం చుట్టుపక్కల నుంచి ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడి నుంచే చూసేందుకు ప్రయత్నించాడు. చివరకు మైదానం పక్కనే ఉన్న ప్రఖ్యాత ‘డచ్ ఫోర్ట్’ ఎక్కి అతను వీక్షించాడు. అన్నింటికి మించి శనివారం డబుల్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం రూట్ ప్రత్యేకంగా రాబ్ లూయిస్ వైపు తిరిగి తన బ్యాట్ చూపించడంతో అతని ఇన్నాళ్ల బాధ ఒక్కసారిగా దూరమైంది! తన గురించి తెలుసుకొని ఇంగ్లండ్ క్రికెటర్లు ఫోన్లో మాట్లాడారని చెప్పిన లూయిస్ ... సిరీస్ ముగిసిన తర్వాత వారితో కలిసి బీర్ తాగాలని కోరుకుంటున్నాడు! -
విరాట్ కోహ్లికి ప్రేమతో..
-
విరాట్ కోహ్లికి ప్రేమతో..
2016లో డిసైడ్ అయ్యాడు. విరాట్ కోహ్లిపై తనకున్న ప్రేమాభిమానాన్ని, గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నాడు. కానీ ఏం చేయాలో పాలు పోలేదు. చివరికి ఒంటిపై 16 ట్యాటూలు వేయించుకోవాలని ఫిక్స్ అయ్యాడు. కానీ ట్యాటూలకు కావాల్సిన డబ్బులు లేవు. దీంతో పైసా పైసా పోగుచేసి తాను అనుకున్నది సాధించాడు. విరాట్ కోహ్లికి సంబంధించిన ఫోటోలతో పాటు అతడి జెర్సీ నంబర్ 18తో సహా శరీరంపై 16 చోట్ల పచ్చబోట్టు పొడిపించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు పింటు బెహరా అనే ఓ అభిమాని. కటక్: వెస్టిండీస్‌తో నిర్ణయాత్మకమైన చివరి వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లిని పింటు బెహరా అనే ఓ అభిమాని కలిశాడు. అయితే రెగ్యులర్ ఫ్యాన్‌గానే ట్రీట్ చేస్తున్న సమయంలో చొక్కా విప్పి తన ఒంటిపై ఉన్న ట్యాటూలను కోహ్లికి చూపించాడు. దీంతో కోహ్లి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఒంటి నిండా కోహ్లికి సంబంధించిన మొత్తం 16 ట్యాటూలు ఉన్నాయి. ఇందులో కోహ్లి జెర్సీ నంబర్ 18 కూడా ఉండటం విశేషం. ఇక ఈ ట్యాటూలపై పింటు బెహరా స్పందించాడు. ‘నేను క్రికెట్ ప్రేమికుడిని. విరాట్ కోహ్లి అంటే పిచ్చి అభిమానం. ఆటపై అతడికున్న డెడికేషన్‌కు, బ్యాటింగ్ స్టైల్‌తో నా మనసు గెలుచుకున్నాడు. అయితే అతడిపై నాకున్న అభిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని 2016లో భావించాను. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి ఒంటినిండా ట్యూటూలు వేయించుకోవాలని డిసైడ్ అయ్యాను. అయితే దానికి చాలా ఖర్చు అవుతుందని తెలిసి నిరుత్సాహపడ్డాను. అయితే పైసా పైసా పోగుచేసి రూ.లక్ష జమచేసి ఈ ట్యాటూలు వేయించుకున్నాను. స్వదేశంలో కోహ్లి ఆడే ప్రతి మ్యాచ్‌కు నేను తప్పకుండా వెళతాను. ఆర్థిక పరిస్థితి కారణంగా విదేశాల్లో జరిగే మ్యాచ్‌లకు వెళ్లలేకపోతున్నాను. అవకాశం వస్తే కోహ్లికి మద్దతుగా విదేశాలకు కూడా వెళ్లడానికి సిద్దం’అంటూ బెహరా పేర్కొన్నాడు. ప్రస్తుతం పింటు బెహరాకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవతున్నాయి. -
ఆ పొడగరిని చూసేందుకు పోటెత్తిన జనం..
లక్నో : వెస్టిండీస్, ఆప్ఘనిస్తాన్ క్రికెటర్లు బస చేసిన హోటళ్ల వైపు కన్నెత్తి చూడని జనం ఇరు జట్ల మధ్య జరిగే వన్డే మ్యాచ్‌లను చూసేందుకు వచ్చిన ఆప్ఘన్ అభిమానిని మాత్రం చూసేందుకు క్యూ కడుతున్నారు. 8.2 అడుగుల పొడవున్న షేర్ ఖాన్‌ను చూసేందుకు ఆయన బస చేసిన హోటల్‌కు జనం పోటెత్తారు. అత్యంత పొడగరి షేర్ ఖాన్‌కు ఆయన ఎత్తు కారణంగా పలు హోటళ్లు రూం ఇచ్చేందుకు నిరాకరించాయి. దీంతో విసుగుచెందిన షేర్ ఖాన్ పోలీసుల సాయం కోరగా వారు హోటల్ రాజధానిలో రూం ఇప్పించారు. కాబూల్‌కు చెందిన అత్యంత పొడగరి ఖాన్‌ను చూసేందుకు హోటల్ వెలుపల వందలాది మంది గుమికూడారు. పొడగరిని చూసేందుకు దాదాపు 200 మందికి పైగా వచ్చారని, దీంతో షేర్ ఖాన్ డిస్ట్రబ్ అయ్యారని హోటల్ యజమాని రణు చెప్పారు. హోటల్ వెలుపల జనం పెద్దసంఖ్యలో గుమికూడటంతో ఆప్ఘన్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం ఆయనను పోలీసులు ఎస్కార్ట్‌గా నిలిచి స్టేడియంకు తీసుకువెళ్లారు. మరో నాలుగైదు రోజులు షేర్ ఖాన్ నగరంలో ఉంటారని హోటల్ యజమాని తెలిపారు. -
క్రికెటర్ బిల్లు కట్టిన అభిమాని
కరాచీ: పాకిస్థాన్ టి20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది మరోసారి పతాక శీర్షికలకు ఎక్కాడు. అభిమానితో బిల్లు కట్టించడంతో అతడు మళ్లీ వార్తల్లో నిలిచాడు. న్యూజిలాండ్ తో మ్యాచ్ లు ఆడేందుకు పాకిస్థాన్ టీమ్ అక్లాండ్ చేరుకుంది. అక్కడ దిగిన తర్వాత సహచర ఆటగాడు అహ్మద్ షెహజాద్ తో కలిసి అక్కాండ్ విమానాశ్రయంలోని మెక్ డొనాల్డ్ రెస్టరెంట్ కు వెళ్లాడు ఆఫ్రిది. బిల్లు చెల్లించే సమయంలో అమెరికా డాలర్లు ఇవ్వడంలో రెస్టరెంట్ సిబ్బంది తీసుకోలేదు. న్యూజిలాండ్ కరెన్సీయే కావాలని వారు కోరారు. అక్కడే ఉన్న పాకిస్థాన్ క్రికెట్ అభిమాని వకాస్ నవీద్ తన దగ్గరున్న డబ్బుతో వారి బిల్లు చెల్లించాడు. ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీయడంతో వీటిని పాకిస్థాన్ చానళ్లు పదేపదే ప్రసారం చేశాయి. దీనిపై ఆఫ్రిది వివరణ ఇచ్చాడు. తమ దగ్గరనున్న అమెరికా డాలర్లను న్యూజిలాండ్ కరెన్సీలోకి మార్చుకోవడం మర్చిపోయామని ఆఫ్రిది తెలిపాడు. తమను ఆహ్వానించడానికి వచ్చిన అభిమాని బిల్లు చెల్లించాడని చెప్పాడు. ఏదేమైనా మీడియా మరోసారి వినోదం అందించిందని వ్యంగ్యంగా అన్నాడు. పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు తాను పెద్ద ఫ్యాన్ అని వకార్ నవీద్ తెలిపాడు.