అందుకే అత్యుత్సాహం పనికి రాదంటారు.. | BBL: Fan-Gets Hit-On-Nose Missing Catch Sydney Thunder vs Brisbane Heat | Sakshi
Sakshi News home page

Big Bash League: అందుకే అత్యుత్సాహం పనికి రాదంటారు..

Published Wed, Dec 28 2022 3:38 PM | Last Updated on Wed, Dec 28 2022 5:14 PM

BBL: Fan-Gets Hit-On-Nose Missing Catch Sydney Thunder vs Brisbane Heat - Sakshi

మనకు రానిది ప్రయత్నించి కొన్నిసార్లు చేతులు కాల్చుకున్న సందర్బాలున్నాయి. తాజాగా ఒక అభిమాని క్యాచ్‌ అందుకోవడం సాధ్యం కాదని తెలిసినా అత్యుత్సాహం ప్రదర్శించి అనవసరంగా ముక్కు పచ్చడి చేసుకున్నాడు. ఇదంతా బిగ్‌బాష్‌ లీగ్‌ సీజన్‌-12లో చోటు చేసుకుంది.

విషయంలోకి వెళితే.. ఇక మంగళవారం బ్రిస్బేన్‌ హీట్‌, సిడ్నీ థండర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. సిడ్నీ థండర్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో జట్టు ఓపెనర్‌ మాథ్యూ గిల్క్స్‌ దూకుడుగా ఆడుతున్నాడు. 56 పరుగుల వద్ద ఉన్నప్పుడు మిచెల్‌ స్వీప్సన్‌ బౌలింగ్‌లో లాంగాన్‌ దిశగా భారీ సిక్సర్‌ బాదాడు. అయితే బంతి నేరుగా స్టాండ్స్‌వైపు దూసుకొచ్చింది. అయితే స్టాండ్స్‌లో నిలబడిన ఒక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు.

తనవైపు వస్తున్న క్యాచ్‌ను అందుకోవాలని ప్రయత్నించాడు. కానీ పాపం క్యాచ్‌ పట్టడంలో విఫలం కావడంతో బంతి నేరుగా అతన్ని ముక్కు మీద గట్టిగా తాకి పక్కకు పడింది. అయినా కూడా తనకేం కాలేదన్నట్లుగా అంతా ఒకే అని సింబల్‌ చూపించాడు. అయితే కాసేపటికే సదరు అభిమాని ముక్కు నుంచి రక్తం దారలా కారసాగింది. ఇది గమనించిన బ్యాటర్‌ మాథ్యూ గిల్క్స్‌ అతని వైపు చూడగా.. ముక్కుకు కర్చీఫ్‌ అడ్డుపెట్టుకున్న అభిమాని పర్లేదులే అన్నట్లుగా సైగ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌ పొజిషన్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బ్రిస్బేన్‌ హీట్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కొలిన్‌ మున్రో 43 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. పియర్సన్‌ 27, గ్జేవియర్‌ బార్‌లెట్‌ 28 నాటౌట్‌ రాణించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ థండర్స్‌ ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండానే కేవలం 11.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. అలెక్స్‌ హేల్స్‌ 59 నాటౌట్‌, మాథ్యూ గిల్క్స్‌ 56 నాటౌట్‌ జట్టును గెలిపించారు.

చదవండి: Ashwin-Shreyas Iyer: మొన్న గెలిపించారు.. ఇవాళ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపారు

దెబ్బ అదుర్స్‌.. ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement