
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. అయితే తాను క్యాచ్ పట్టేశానా అన్న విధంగా మ్యాక్సీ ఇచ్చిన హావభావాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. మెల్‌బోర్న్ స్టార్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇన్నింగ్స్ 16వ ఓవర్‌ను నాథన్ కౌల్టర్‌నీల్ వేశాడు. ఓవర్ నాలుగో బంతిని గుడ్‌లెంగ్త్‌తో వేయగా.. సామ్ హీజ్‌లెట్ మిడాఫ్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న మ్యాక్స్‌వెల్ వెనక్కి పరిగెట్టి.. డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. మ్యాక్సీ విన్యాసాన్ని తోటి ఆటగాళ్లు సహా మైదానంలోని ప్రేక్షకులు ఎంజాయ్ చేయగా.. అతను మాత్రం క్యాచ్ అందుకున్నాన్నా అనే భ్రమలోనే ఉండిపోవడం విశేషం. దీనిపై అభిమానులు వినూత్నరీతిలో స్పందించారు. ' మ్యాక్సీ నువ్వు క్యాచ్ పట్టేశావు.. భ్రమలో నుంచి బయటికి రా' అంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: IPL 2022 Auction: ఈ ఏడాది ఐపీఎల్‌లో వారి మెరుపులు లేనట్టేనా..?
ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బెన్ డకెట్ 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ 13.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. జో క్లార్క్ 62 పరుగులతో రాణించగా.. మ్యాక్స్‌వెల్ 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
GLENN MAXWELL!
— 7Cricket (@7Cricket) January 16, 2022
WHAT A CATCH! 😱#BBL11 pic.twitter.com/czENSVwG2s