Big Bash League (BBL)
-
పదకొండేళ్ల తర్వాత తొలి హాఫ్ సెంచరీ.. అదీ 40 బంతుల్లో!
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డేవిడ్ వార్నర్(David Warner) ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్(Big Bash League- బీబీఎల్)తో బిజీగా ఉన్నాడు. ఈ టీ20 లీగ్‌లో సిడ్నీ థండర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్నర్.. అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. ఎట్టకేలకు అర్ధ శతకం సాధించాడు. దాదాపు పదకొండేళ్ల అనంతరం బీబీఎల్‌లో తొలిసారి యాభై పరుగుల మార్కును అందుకున్నాడు.కెప్టెన్‌గా వార్నర్అయితే, విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన పొట్టి ఫార్మాట్లో(T20 Cricket) సుదీర్ఘ విరామం తర్వాత హాఫ్ సెంచరీ బాదిన వార్నర్ భాయ్.. అందుకోసం ఏకంగా 40 బంతులు తీసుకోవడం గమనార్హం. కాగా డిసెంబరు 15 బీబీఎల్ 2024-25 సీజన్ ఆరంభమైంది. ఈ క్రమంల డిసెంబరు 17న వార్నర్ కెప్టెన్సీలో తమ తొలి మ్యాచ్ ఆడిన సిడ్నీ థండర్ రెండు వికెట్ల తేడాతో అడిలైడ్ స్ట్రైకర్స్‌ను ఓడించింది.ఆరంభ మ్యాచ్‌లలో విఫలంనాటి మ్యాచ్‌లో వార్నర్ కేవలం ఏడు పరుగులే చేశాడు. అనంతరం.. సిడ్నీ సిక్సర్స్‌తో తలపడ్డ సిడ్నీ థండర్(Sydney Thunder) ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ వార్నర్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం పదిహేడు పరుగులే చేసి నిష్క్రమించాడు.ఆ తర్వాత మెల్బోర్న్తో స్టార్స్‌తో మ్యాచ్‌లో వార్నర్ 19 పరుగులే చేసినా.. సామ్ బిల్లింగ్స్(72 నాటౌట్) కారణంగా.. సిడ్నీ థండర్ 18 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో సోమవారం నాటి మ్యాచ్‌లో మెల్బోర్న్ గ్రెనేడ్స్తో మ్యాచ్‌లో మాత్రం వార్నర్ బ్యాట్ ఝులిపించాడు.ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడుసిడ్నీలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మెల్బోర్న్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్ ఆదిలోనే కామెరాన్ బాన్‌క్రాఫ్ట్(8) వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్ బ్యాటర్ షెర్ఫానే రూథర్‌ఫర్డ్(11), ఒలివర్ డేవిస్(10), సామ్ బిల్లింగ్స్(10) కూడా విఫలమయ్యారు.ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ గాడిన పెట్టే బాధ్యత తీసుకున్న ఓపెనర్ వార్నర్ నెమ్మదిగా ఆడాడు. వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ.. 40 బంతుల్లో యాభై పరుగులు మార్కుకు చేరుకున్నాడు. ఆ తర్వాత మరో పదిహేడు బంతుల్లోనే 36 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.మొత్తంగా 57 బంతులు ఎదుర్కొని పది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో వార్నర్ 86 పరుగులు సాధించాడు. అతడి తోడుగా మాథ్యూ గిల్క్స్(23 నాటౌట్) కూడా రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో సిడ్నీ థండర్ నాలుగు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.2013లో చివరగాకాగా డేవిడ్ వార్నర్ బీబీఎల్‌లో చివరగా 2013లో అర్థ శతకం నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్నర్ ప్రస్తుతం ఫ్రాంఛైజీ క్రికెట్లో ఆడుతున్నాడు. అయితే, ఐపీఎల్లో గతంలో మంచి రికార్డులే ఉన్నా మెగా వేలం 2025లో మాత్రం వార్నర్‌పై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.ఒకవేళ బీబీఎల్‌లో గనుక పరుగుల వరద పారిస్తే.. అతడు ఐపీఎల్లో తిరిగి పునరాగమనం చేసే అవకాశం ఉంటుంది. కాగా తమ ఆటగాళ్లు ఎవరైనా గాయపడిన సందర్భంలో ఫ్రాంఛైజీలు .. వారి స్థానంలో అన్‌సోల్డ్‌గా ఉన్న క్రికెటర్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఓపెనర్‌గా ఘనమైన రికార్డు ఉన్న వార్నర్ సేవలను పంజాబ్ కింగ్స్ లేదంటే లక్నో సూపర్ జెయింట్స్ వాడుకునే అవకాశం ఉంది.చదవండి: థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పే..; బీసీసీఐ ఉపాధ్యక్షుడి స్పందన ఇదేDavid Warner's first BBL half-century since 2013! 👏Things you love to see! #BBL14 pic.twitter.com/Uzjq8jamp3— KFC Big Bash League (@BBL) December 30, 2024 -
ఇదెక్కడి బాదుడురా సామీ.. 10 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 140 పరుగులు
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (జనవరి 22) జరుగుతున్న నాకౌట్ (ఛాలెంజర్) మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ ఓపెనర్ జోష్ బ్రౌన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 57 బంతుల్లోనే 10 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 140 పరుగులు బాదాడు. తొలి బంతి నుంచే శివాలెత్తిన బ్రౌన్.. బిగ్‌బాష్ లీగ్‌లో రెండో వేగవంతమైన సెంచరీని (41 బంతుల్లో) నమోదు చేశాడు. బ్రౌన్ విధ్వంసం ధాటికి ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హిట్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. Josh Brown scored an insane 140 in just 57 balls with 12 sixes for Brisbane Heat in the BBL....!!! 🤯 pic.twitter.com/O2hZWNKyLu — Mufaddal Vohra (@mufaddal_vohra) January 22, 2024 బ్రిస్బేన్ ఇన్నింగ్స్‌లో బ్రౌన్, కెప్టెన్ నాథన్ మెక్ స్వీని (33) మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. చార్లీ వాకిమ్ 7, మ్యాట్ రెన్షా 6, మ్యాక్స్ బ్రయాంట్ 9, పాల్ వాల్టర్ 0, జిమ్మీ పియర్సన్ 4 పరుగులు చేయగా.. మైఖేల్ నెసర్ 6, జేవియర్ బార్ట్లెట్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. అడిలైడ్ స్ట్రయికర్స్ బౌలర్లలో డేవిడ్ పేన్, బాయ్స్, లాయిడ్ పోప్ తలో రెండు వికెట్లు.. థామ్టన్ ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, బిగ్‌బాష్ లీగ్ 2023-24 ఎడిషన్ చివరి అంకానికి చేరింది. ఈ మ్యాచ్‌తో ప్రస్తుత ఎడిషన్ రెండో ఫైనలిస్ట్ ఎవరో తేలిపోతారు. బ్రిస్బేన్ హీట్, అడిలైడ్ స్ట్రయికర్స్లో గెలిచిన జట్టు ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్‌తో తలపడేందుకు అర్హత సాధిస్తుంది. సిడ్నీ సిక్సర్స్ క్వాలిఫయర్‌లో విజయం సాధించి, ఫైనల్ బెర్త్ సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. జనవరి 24న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
గ్లెన్ మాక్స్వెల్ సంచలన నిర్ణయం?
BBL 2024- Glenn Maxwell: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు సారథ్యం వహిస్తున్న అతడు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ఇప్పటికే జట్టు యాజమాన్యానికి తెలియజేసినట్లు ఆసీస్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా జాన్ హేస్టింగ్స్ రిటైర్మెంట్ తర్వాత బీబీఎల్ సీజన్ 8 సందర్భంగా మాక్సీ మెల్బోర్న్ స్టార్స్ నాయకుడిగా పగ్గాలు చేపట్టాడు. తొలి రెండు సీజన్లలో కెప్టెన్‌గా అదరగొట్టిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్.. టీమ్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అయితే, ఆ రెండు పర్యాయాల్లో తొలుత మెల్బోర్న్ రెనెగేడ్స్.. తర్వాత సిడ్నీ సిక్సర్స్ చేతిలో మెల్బోర్న్ స్టార్స్ ఓడిపోయింది. ఆఖరి మెట్టుపై బోల్తా పడి టైటిల్‌ను చేజార్చుకుంది. అనంతర ఎడిషన్లలో నిరాశజనక ప్రదర్శన కనబరిచిన స్టార్స్.. బీబీఎల్ 12 సీజన్లో కెప్టెన్ మాక్స్వెల్ సేవలు కోల్పోయింది. కాలు విరిగిన కారణంగా మాక్సీ గతేడాది సీజన్‌కు దూరం కాగా.. తాజాగా జరుగుతున్న పదమూడో ఎడిషన్‌తో తిరిగి జట్టుతో చేరాడు. ఈ క్రమంలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం 243 పరుగులు మాత్రమే చేసి.. ఏడు వికెట్లు తీయగలిగాడు. కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. మాక్సీ సారథ్యంలో తొలి మూడు మ్యాచ్‌లు ఓడి హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసిన మెల్బోర్న్ స్టార్స్.. తర్వాత కోలుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఫామ్‌లోకి వచ్చింది. కానీ.. ఆ తర్వాత పాత కథే పునరావృతమైంది. మరుసటి మూడు మ్యాచ్‌లలో వరుసగా ఓడి ఫైనల్ చేరే అవకాశాలు చేజార్చుకుంది మెల్బోర్న్ స్టార్స్. తద్వారా పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తీవ్రంగా నిరాశచెందిన మాక్స్వెల్ కెప్టెన్సీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్సైట్ తన కథనంలో పేర్కొంది. కాగా ఐదేళ్లపాటు మెల్బోర్న్ స్టార్స్ సారథిగా కొనసాగిన గ్లెన్ మాక్స్వెల్.. 35 మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు. అదే విధంగా అతడి ఖాతాలో 31 ఓటములు కూడా ఉన్నాయి. కాగా మాక్సీ స్టార్స్‌తో కాంట్రాక్ట్ కూడా రద్దు చేసుకోవాలని భావిస్తుండగా.. ఫ్రాంఛైజీ మాత్రం అతడితో మరో రెండేళ్లు బంధం కొనసాగించాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బీబీఎల్ చరిత్రలో మెల్బోర్న్ స్టార్స్ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవకపోవడం గమనార్హం. చదవండి: చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు, బ్యాటర్లు.. తొలిరోజే 302 రన్స్ ఆధిక్యం! తిలక్ రీ ఎంట్రీతో.. -
ఆసీస్ స్టార్ ప్లేయర్ మార్ష్ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు, బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ ఓపెనర్ షాన్ మార్ష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫామ్‌లో (బిగ్‌బాష్ లీగ్) ఉండగానే ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మార్ష్ తాజాగా అన్ని రకాల క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. బీబీఎల్‌లో జనవరి 16న సిడ్నీ థండర్స్‌తో జరిగే మ్యాచ్ తనకు చివరిదని స్పష్టం చేశాడు. మంచి ఫామ్‌లో ఉండటంతో పాటు తన చివరి మ్యాచ్‌లో (బిగ్‌బాష్ లీగ్) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన షాన్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో అందరూ షాకయ్యారు. మార్ష్.. తన చివరి మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌పై 49 బంతుల్లో 10 బౌండరీల సాయంతో 64 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. మార్ష్ తన రెనెగేడ్స్ సహచరుడు, ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే తాను కూడా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 2008-19 మధ్యలో షాన్ మార్ష్ ఆస్ట్రేలియా తరఫున 38 టెస్ట్‌లు, 73 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. ఇందులో అతను 13 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 5000 పైచిలుకు పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ అదరగొట్టిన మార్ష్ 2008-17 మధ్యలో వివిధ ఫ్రాంచైజీల తరఫున 71 మ్యాచ్‌లు ఆడి సెంచరీ, 20 హాఫ్ సెంచరీల సాయంతో 132 స్ట్రయిక్‌రేట్‌తో 2477 పరుగులు చేశాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన మార్ష్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్).. ఆ సీజన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా (616 పరుగులు) నిలిచాడు. ఆసీస్ దిగ్గజ ఆటగాడు జెఫ్ మార్ష్ పెద్ద కొడుకైన 40 ఏళ్ల షాన్ మార్ష్.. ప్రస్తుత ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు స్వయానా అన్న అవుతాడు. -
హెలికాప్టర్లో నేరుగా గ్రౌండ్లో ల్యాండ్ అయిన వార్నర్..!
బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రైవేట్ హెలికాప్టర్లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ల్యాండ్ అయ్యాడు. సొదరుడి వివాహానికి హాజరైన వార్నర్.. అక్కడి నుంచి నేరుగా తాను ఆడబోయే మ్యాచ్‌కు వేదిక అయిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు హెలికాప్టర్లో చేరుకున్నాడు. Full journey of David Warner in Helicopter to SCG for Big Bash match. 🔥 - What an entry.....!!!!pic.twitter.com/TwTsQe9954 — Johns. (@CricCrazyJohns) January 12, 2024 సాధారణంగా ఏ క్రికెటర్‌కు కూడా ఇలాంటి అవకాశం లభించదు. వార్నర్ కోసం బిగ్‌బాష్ లీగ్ యాజమాన్యం ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేసింది. టెస్ట్, వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక వార్నర్ ఆడనున్న తొలి మ్యాచ్ కావడంతో అతడి గౌరవార్దం ఈ ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు సిడ్నీ థండర్స్ చీఫ్ ప్రకటించాడు. గత బీబీఎల్ సీజన్ సందర్భంగా వార్నర్ సిడ్నీ థండర్స్‌తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగానే అతను ఇవాళ (జనవరి 12) సిడ్నీ సిక్సర్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో ఆడనున్నాడు. David Warner has arrived at SCG in Helicopter for the Big Bash match. - The entertainer is here....!!!!pic.twitter.com/7knZ9BUX58 — Johns. (@CricCrazyJohns) January 12, 2024 కాగా, వార్నర్ కొద్ది రోజుల కిందట ఇదే సిడ్నీ మైదానంలోనే తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. చివరి టెస్ట్ ప్రారంభానికి ముందు వార్నర్ వన్డేల నుంచి కూడా వైదొలుగుతన్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం వార్నర్ ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు టీ20 ఫార్మాట్లో మాత్రమే అందుబాటులో ఉంటాడు. బిగ్‌బాష్ లీగ్ అనంతరం వార్నర్ యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ఆడతాడు. ఈ లీగ్ అతను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా వార్నర్ అంతర్జాతీయ టీ20ల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. త్వరలో విండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు సైతం అందుబాటులో ఉంటానని వార్నర్ ప్రకటించాడు. వార్నర్ బిగ్‌బాష్ లీగ్‌లో ఇప్పటివరకు కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇందులో అతను ఓ సెంచరీ (102) సాయంతో 201 పరుగులు చేశాడు. -
ఏంటి బ్రో ఇది.. నాటౌట్‌కు ఔట్ ఇచ్చేసిన థర్డ్ అంపైర్! వీడియో వైరల్
బిగ్ బాష్ లీగ్ 2023-24లో భాగంగా శనివారం మెల్బోర్న్ వేదికగా సిడ్నీ సిక్సర్స్, మెల్బోర్న్ స్టార్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసింది. క్లియర్‌గా నాటౌట్ అయినప్పటికీ థర్డ్ అంపైర్ పొరపాటున ఔట్‌గా ప్రకటించేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అసలేం జరిగిందంటే? సిడ్నీ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ఇమాడ్ వసీం బౌలింగ్‌లో జేమ్స్ విన్స్ స్ట్రైయిట్ డ్రైవ్ షాట్ ఆడాడు. బౌలర్ వసీమ్ బంతి ఆపేందుకు ప్రయత్నించగా అతడి తాకుతూ బంతి నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న స్టంప్స్‌ను పడగొట్టింది. దీంతో బౌలర్‌తో పాటు మెల్బోర్న్ ఫీల్డర్లు రనౌట్‌కు అప్పీల్ చేశారు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫీర్ చేశారు. రిప్లేలో బంతి స్టంప్స్‌ను తాకే సమయానికి బ్యాటర్ క్రీజులోకి వచ్చినట్లు క్లియర్‌గా కన్పించింది. దీంతో థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెల్లడించడానికి సిద్దమయ్యాడు. అయితే అనూహ్యంగా బిగ్‌స్క్రీన్‌లో ఔట్ కన్పించింది. దీంతో ఒక్కసారిగా మైదానంలో గందరగోళం నెలకొంది. అయితే థర్డ్ నాటౌట్ బటన్‌కు బదులుగా తప్పుడు బటన్ నొక్కడంతో ఇలా జరిగింది. తన తప్పిదాన్ని గ్రహించిన థర్డ్ అంపైర్ వెంటనే నాటౌట్ బటన్ నొక్కడంతో బ్యాటర్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 157 పరుగుల లక్ష్యాన్ని సిడ్నీ సిక్సర్స్ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సిడ్నీ బ్యాటర్లలో జేమ్స్ విన్స్ (79) హాఫ్ సెంచరీతో రాణించాడు. కాగా మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. He's pressed the wrong button! 🙈@KFCAustralia #BucketMoment #BBL13 pic.twitter.com/yxY1qfijuQ — KFC Big Bash League (@BBL) January 6, 2024 -
ఊచకోత.. 28 బంతుల్లోనే..!
బిగ్‌బాష్ లీగ్ 2023-24లో మరో మెరుపు ఇన్నింగ్స్ నమోదైంది. అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (జనవరి 3) జరిగిన మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ ఆటగాడు లారీ ఈవాన్స్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొన్న ఈవాన్స్ 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 85 పరుగులు చేశాడు. ఈవాన్స్ తన హాఫ్ సెంచరీని కేవలం 18 బంతుల్లోనే పూర్తి చేశాడు. బీబీఎల్‌లో పెర్త్ స్కార్చర్స్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టి కావడం విశేషం. ఈవాన్స్ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈవాన్స్తో పాటు వైట్‌మ్యాన్ (31), ఆరోన్ హార్డీ (34), జోస్ ఇంగ్లిస్ (26) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో థార్టన్, ఓవర్టన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన స్ట్రయికర్స్.. కెప్టెన్ మాథ్యూ షార్ట్ (44 బంతుల్లో 74; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నంతసేపు లక్ష్యం దిశగా సాగింది. అయితే షార్ట్ ఔటైన అనంతరం స్ట్రయికర్స్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో 19.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటై, 42 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లాన్స్ మోరిస్ (4-0-24-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో స్ట్రయికర్స్ పతనాన్ని శాశించాడు. జై రిచర్డ్స్‌సన్ (2/31), ఆండ్రూ టై (2/35), బెహ్రెన్‌డార్ఫ్ (1/24) తలో చేయి వేశారు. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్‌లో షార్ట్‌తో పాటు క్రిస్ లిన్ (27), థామస్ కెల్లీ (29), ఆడమ్ హోస్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
కొత్త రకం షాట్‌ను పరిచయం చేసిన మ్యాక్స్‌వెల్
ఆసీస్ విధ్వంసకర వీరుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ టోర్నీ ఏదైనా తనదైన మార్కు షాట్లతో విరుచుకుపడటం సహజం. తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లోనూ అతను అలాంటి ఓ వినూత్న షాట్‌నే ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు. స్కూప్ షాట్‌ను రివర్స్‌లో ఉండే ఈ షాట్ ఆడి మ్యాక్సీ బౌండరీ సాధించాడు. ఈ షాట్‌ను చూసి అతని అభిమానులు మ్యాడ్ మ్యాక్సీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. క్రికెట్లో ఇదో కొత్త రకం షాట్ అంటూ కితాబునిస్తున్నారు. ఈ షాట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. లీగ్‌లో భాగంగా మెల్బోర్న్ రెనెగేడ్స్‌తో ఇవాళ (జనవరి 2) జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ ఈ వెరైటీ షాట్‌ను ఆడాడు. Glenn Maxwell inventing new shots in cricket. - The Mad Maxi. 💪💥pic.twitter.com/lTZcdWCA1n — Johns. (@CricCrazyJohns) January 2, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. పలు మార్లు వర్షం అంతరాయం కలిగించడంతో 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్ 7 వికెట్ల నష్టానికి 97 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. ఛేదనలో మ్యాక్స్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో మెల్బోర్న్ స్టార్స్ మరో 11 బంతులు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాక్స్‌వెల్‌తో పాటు థామస్ రోజర్స్ (46 నాటౌట్) రాణించాడు. స్టార్స్ ఇన్నింగ్స్‌లో డేనియల్ లారెన్స్ (7), వెబ్‌స్టర్ (14) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. రెనెగేడ్స్ బౌలర్లలో టామ్ రోజర్స్, పీటర్ సిడిల్లకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు డికాక్ (23), జేక్ ఫ్రేసర్ (14), మెకెంజీ (18), రోజర్స్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయడంతో రెనెగేడ్స్ అతికష్టం మీద 97 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో రాణించిన మ్యాక్సీ బంతితోనూ (3-0-8-1) సత్తా చాటాడు. స్టార్స్ బౌలర్లలో డేనియల్ లారెన్స్ 2, జోయెల్ పారిస్, ఇమాద్ వసీం, స్టీకిటీ, వెబ్‌స్టర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుత సీజన్లో మ్యాక్స్‌వెల్ నేతృత్వంలోని మెల్బోర్న్ స్టార్స్‌కు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. -
ఆంక్షల ఫలితం... అఫ్గాన్ స్టార్ క్రికెటర్‌పై వేటు!
జాతీయ జట్టుకు తొలి ప్రాధాన్యత ఇవ్వకుండా ఫ్రాంచైజీ టి20 లీగ్‌లవైపు మొగ్గుచూపుతున్న తమ దేశ క్రికెటర్లు ముజీబ్ ఉర్ రెహ్మన్, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫరూఖీలపై గతవారం అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ఆంక్షలు విధించింది. ఇవి అమల్లోకి రావడంతో ఆ్రస్టేలియాలో ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ టి20 లీగ్‌లో మంగళవారం మెల్బోర్న్ స్టార్స్‌తో మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగెడ్స్ తరఫున ఆడాల్సిన ముజీబ్‌ను ఆ జట్టు తప్పించింది. ఈ సీజన్లో రెనెగెడ్స్ తరఫున ఆడిన ఏకైక మ్యాచ్‌లో ముజీబ్ 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IND-W vs AUS-W: విజయంతో ప్రారంభించాలని... -
BBL 2023: రాణించిన క్రిస్ జోర్డన్, బెన్ మెక్‌డెర్మాట్
బిగ్‌బాష్ లీగ్ 2023లో భాగంగా ఇవాళ (జనవరి 1) జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్, సిడ్నీ థండర్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్‌పై హరికేన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన థండర్.. క్రిస్ గ్రీన్ (33 నాటౌట్), డేనియల్ సామ్స్ (25), బాన్‌క్రాఫ్ట్ (21), ఒలివర్ డేవిస్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. హరికేన్స్ బౌలర్లు క్రిస్ జోర్డన్ (2/20), నిఖిల్ చౌదరీ (2/26), పాట్రిక్ డూలీ (2/33), నాథన్ ఇల్లిస్ (1/39) థండర్ పతనాన్ని శాశించారు. అనంతరం ఛేదనకు దిగిన హరికేన్స్.. బెన్ మెక్‌డెర్మాట్ (53 నాటౌట్) అర్ధసెంచరీతో సత్తా చాటడంతో 18.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. కాలెబ్ జువెల్ (31), రైట్ (34) రాణించగా.. ఆఖర్లో ఆండర్సన్ (12 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. థండర్ బౌలర్లలో డేనియల్ సామ్స్, తన్వీర్ సంగా, నాథన్ మెక్‌అండ్రూ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో హరికేన్స్ రన్‌రేట్‌ను కాస్త మెరుగుపర్చుకుని ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడిన థండర్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. -
స్టోయినిస్ ఊచకోత.. న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పిన మెల్బోర్న్
బిగ్‌బాష్ లీగ్ 2023లో భాగంగా అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ అద్భుత విజయం సాధించింది. ఆస్ట్రేలియా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ మెల్బోర్న్ స్టార్స్ సూపర్ విక్టరీ సాధించారు. స్టోయినిస్ ఊచకోతతో (19 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెల్బోర్న్ న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది. స్టోయినిస్ విధ్వంసం ధాటికి అడిలైడ్ నిర్ధేశించిన 206 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. క్రిస్ లిన్ విధ్వంసం.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్.. క్రిస్ లిన్ (42 బంతుల్లో 83 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మాథ్యూ షార్ట్ (32 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృస్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మెల్బోర్న్ కెప్టెన్ మ్యాక్స్‌వెల్ 2 వికెట్లతో రాణించాడు. Brilliant fireworks in Adelaide during BBL match on New Year's Eve.pic.twitter.com/2khkPbaSoO — Mufaddal Vohra (@mufaddal_vohra) December 31, 2023 పోటాపోటీగా విరుచుకుపడిన లారెన్స్, వెబ్‌స్టర్, స్టోయినిస్.. 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్.. డేనియల్ లారెన్స్ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), వెబ్‌స్టర్ (48 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (17 బంతుల్లో 28; 5 ఫోర్లు) పోటాపోటీగా రాణించడంతో 19 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అడిలైడ్ బౌలర్లలో కెమారూన్ బాయ్స్ (4-0-15-1) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ తీశాడు. -
BBL: ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ! చివరికి ఏమైందంటే?
Big Bash League 2023-24: Sydney Sixers vs Adelaide Strikers: ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు తేడాతో గెలిచిన జట్టు పట్టరాని సంతోషంలో మునిగిపోతే.. ఓడిన జట్టుకు అంతకంటే బాధ మరొకటి ఉండదు.. బిగ్ బాష్ లీగ్ జట్లు సిడ్నీ సిక్సర్స్- అడిలైడ్ స్ట్రైకర్స్ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా నేతృత్వంలో ప్రస్తుతం బీబీఎల్ 2023-24 సీజన్ నడుస్తోంది. డిసెంబరు 7న మొదలైన ఈ టీ20 లీగ్.. జనవరి 24 నాటి ఫైనల్‌తో ముగియనుంది. ఇదిలా ఉంటే.. బీబీఎల్‌లో భాగంగా సిడ్నీ- అడిలైడ్ జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపింది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అడిలైడ్ స్ట్రైకర్స్ సిడ్నీ సిక్సర్స్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో సిడ్నీ బ్యాటర్ జోర్డాన్ సిల్క్ 45 బంతుల్లో 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ ఫిలిప్(16 బంతుల్లో 25 పరుగులు)తో కలిసి జట్టును గట్టెక్కించాడు. వీరిద్దరి ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో అడిలైడ్ స్ట్రైకర్స్ ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్ మాథ్యూ షార్ట్ (48 బంతుల్లో 55), జెమ్మీ ఓవర్టన్ (28 బంతుల్లో 31 పరుగులు(నాటౌట్)) ఇన్నింగ్స్ వృథా అయింది. గెలుపొందాలంటే చివరి బాల్‌కు మూడు పరుగులు తీయాల్సి ఉండగా.. ఓవర్టన్ రెండు పరుగులు మాత్రమే తీయగలిగాడు. దీంతో విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది అడిలైడ్ జట్టు. ఇక.. అదే ఒక్క పరుగు తేడాతో గెలుపొందిన సిడ్నీ సిక్సర్స్ సంబరాలు అంబరాన్నంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టీ20 ఫార్మాట్ అంటేనే సంచలనాలకు మారుపేరు అన్న విషయం మరోసారి రుజువైందంటూ నెటిజన్లు ఈ సందర్భంగా కామెంట్లు చేస్తున్నారు. SIXERS WIN BY ONE RUN! A final ball THRILLER at the SCG 🔥 📺 WATCH #BBL13 on Ch. 501 or stream via @kayosports https://t.co/bO5P5ypyKo ✍ BLOG https://t.co/miU8FhOoSJ 📲 MATCH CENTRE https://t.co/Hb1Gh6RhzI pic.twitter.com/qYG0apuOIl — Fox Cricket (@FoxCricket) December 22, 2023 1️⃣ run win are most disheartening for the loosing side and most satisfying for the winning side 😀#ViratKohli #INDvsSA #BBL13 #Sixers#INDvAUS #KLRahul #CricketTwitter pic.twitter.com/KThpQd5noi — Sujeet Suman (@sujeetsuman1991) December 22, 2023 -
IPL 2024: ఆర్సీబీ ఆటగాడికిపై నిషేధం
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొనుగోలు చేసిన ఆటగాడిపై బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) నిర్వహకులు నిషేధం విధించారు. బీబీఎల్ 2023-24లో సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ పేసర్ టామ్ కర్రన్‌ను నాలుగు మ్యాచ్‌ల పాటు నిషేధించారు. బీబీఎల్‌లో భాగంగా డిసెంబర్ 11న హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌ను బెదిరించినందుకు గాను టామ్ కర్రన్‌పై చర్యలకు తీసుకున్నట్లు బీబీఎల్ నిర్వహకులు వెల్లడించారు. హోబర్ట్తో మ్యాచ్‌కు ముందు రిహార్సల్స్ సందర్భంగా కర్రన్ అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడని బీబీఎల్ నిర్వహకులు తెలిపారు. మ్యాచ్‌కు ముందు పిచ్‌పై బౌలింగ్ చేసేందుకు కర్రన్ ప్రయత్నించగా అంపైర్ వారించాడని, అయినా కర్రన్ లెక్క చేయకుండా అంపైర్ వైపు బౌలింగ్ చేయబోయాడని పేర్కొన్నారు. కర్రన్ చర్యను లెవెల్ 3 నేరం కింద పరిగణించి, అతనిపై నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. Tom Curran has been banned for four BBL games after intimidating the umpire during pre-match practice.pic.twitter.com/OwvVYkb7kz — CricTracker (@Cricketracker) December 21, 2023 కాగా, డిసెంబర్ 11న హోబర్ట్తో జరిగిన మ్యాచ్‌లో కర్రన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన కర్రన్ కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాటింగ్‌లోనూ ఓ బౌండరీ బాది తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే, దుబాయ్‌లోని కోకోకోలా ఎరీనా వేదికగా డిసెంబర్ 19న జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో ఆర్సీబీ జట్టు టామ్ కర్రన్‌ను 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. 28 ఏళ్ల టామ్ కర్రన్ ఐపీఎల్లో వివిధ జట్ల తరఫున 13 మ్యాచ్‌లు ఆడాడు. గత సీజన్ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న సామ్ కర్రన్‌కు టామ్ అన్న అవుతాడు. టామ్ ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 2 టెస్ట్‌లు, 29 వన్డేలు, 30 టీ20 ఆడాడు. -
BBL 2023: అటూ ఇటూ కాకుండా..! వైరల్ వీడియో
క్రికెట్లో కాయిన్‌తో టాస్ వేయడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే కాయిన్‌తో కాకుండా మరో విధంగానూ టాస్ వేసే పద్దతి ఒకటుందన్న విషయం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్‌బాష్ లీగ్‌లో రొటీన్‌కు భిన్నంగా కాయిన్‌తో కాకుండా బ్యాట్‌తో టాస్ వేస్తారు. 2018 సీజన్ నుంచి బీబీఎల్‌లో ఈ నూతన ఒరవడి అమల్లో ఉంది. Toss happened for the 2nd time in the BBL due to the bat flip. 😂 pic.twitter.com/kcL9wNjAA1 — Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2023 బీబీఎల్ 2023లో భాగంగా సిడ్నీ థండర్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 12) జరుగుతున్న మ్యాచ్‌కు ముందు కూడా కాయిన్‌తో కాకుండా బ్యాట్‌తోనే టాస్ వేశారు. అయితే ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టాస్ వేసే క్రమంలో ఫలితం ఎటూ తేల్చకుండా బ్యాట్ మధ్యేమార్గం (బ్యాట్ ఫ్లిప్) ఎంచుకుంది. దీంతో నిర్వహకులు టాస్‌ను మరోసారి వేయాల్సి వచ్చింది. బీబీఎల్‌లో బ్యాట్ ఫ్లిప్ కావడం కొత్తేమీ కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో ఇలా జరిగింది. ఇదిలా ఉంటే సిడ్నీ థండర్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కూడా టాస్ మాదిరే ఆసక్తికరంగా సాగుతుంది. గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడుతుంది. బ్రిస్బేన్ నిర్ధేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సిడ్నీ ఒకింత తడబాటుకు లోనవుతుంది. కెప్టెన్ క్రిస్ గ్రీన్ (30 నాటౌట్) సిడ్నీను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. 17.4 ఓవర్ల తర్వాత సిడ్నీ స్కోర్ 125/7గా ఉంది. సిడ్నీ గెలుపుకు 14 బంతుల్లో 27 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 3 వికెట్లు మిగిలి ఉన్నాయి. -
ప్రమాదకరంగా మారిన పిచ్.. 6 ఓవర్ల తరువాత మ్యాచ్ రద్దు! వీడియో వైరల్
ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్-2023లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గిలాంగ్ లోని సైమండ్స్ స్టేడియంలో ఆదివారం మెల్ బోర్న్ రెనిగేడ్స్ - పెర్త్ స్కార్చర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను పిచ్ సమస్య కారణంగా రద్దు చేశారు. ఏమి జరిగిందంటే? ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మెల్ బోర్న్ రెనిగేడ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఇన్నింగ్స్ రెండో బంతికే స్టీపెన్ (0)ను టామ్ రోజర్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వెంటనే మరో ఓపెనర్ కూపర్ కొన్నోలీ(6) కూడా పెవిలియన్‌కు చేరాడు. అయితే ఇన్నింగ్స్ ఆరంభం నుంచి బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతూ వస్తోంది. ఈ క్రమంలో పెర్త్ స్కాచర్స్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన విల్ సదర్లాండ్ బౌలింగ్‌లో మొదటి మూడు బంతులు మరీ ఎక్కువగా బౌన్స్ అయ్యాయి. బ్యాటర్లతో సహా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో పెర్త్ స్కార్చర్స్ బ్యాటర్లు పరిస్థితిని అంపైర్లు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అంపైర్లు.. ఇరు జట్ల సారథులతో చర్చించి మ్యాచ్‌ను అర్థాంతరంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి గిలాంగ్ లో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో కవర్స్ లీక్ అయ్యి నీరు పిచ్ పై చేరి ఉంటుందని, అందుకే బంతి ఎక్కువగా బౌన్స్ అయిందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. Here's the delivery that prompted the discussions. Quinton de Kock's reaction 🫢 #BBL13 pic.twitter.com/1Tbq5YRjnq — KFC Big Bash League (@BBL) December 10, 2023 -
స్పిన్ మ్యాజిక్ అంటే ఇదేనేమో.. జనాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి..!
మహిళల బిగ్‌బాష్ లీగ్ 2023 ఎడిషన్‌లో భాగంగా మెల్బోర్న్ స్టార్స్‌తో ఇవాళ (అక్టోబర్ 27) జరుగుతున్న మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ స్పిన్ బౌలర్ చార్లీ నాట్ అద్భుతం చేసింది. ఈ మ్యాచ్‌లో బ్రిస్భేన్ హీట్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్ స్టార్స్‌కు చార్లీ నాట్ ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ బౌల్ చేసిన నాట్ (రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్).. నాలుగో బంతికి సోఫియా డంక్లీను క్లీన్ బౌల్డ్ చేసి, బ్యాటర్‌తో పాటు ప్రేక్షకులంతా అవాక్కయ్యేలా చేసింది. అక్కడెక్కడో ఆఫ్ వికెట్ అవతల పడ్డ బంతి గింగిరాలు తిరుగుతూ వికెట్లను గిరాటు వేయడంతో (మిడిల్ స్టంప్, లెగ్ స్టంప్‌కు) ఆశ్చర్యపోవడం అందరివంతైంది. బ్యాటర్ అలాగే బంతిని చూస్తూ నిశ్చేష్టురాలిగా మిగిలిపోయింది. బంతి అంతలా మెలికలు తిరుగుతూ మాయ చేయడంతో బౌలర్ ముఖంలోనూ వింతహావభావాలు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు స్పిన్ మాయ అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే నాట్ వేసిన బంతిని స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ వేసిన బాల్ ఆఫ్ ద సెంచరీతో పోలుస్తున్నారు. మొత్తానికి స్పిన్ మ్యాజిక్కు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. Spin 🤯pic.twitter.com/AD2DRB3mYM — CricTracker (@Cricketracker) October 27, 2023 కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్భేన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. బ్రిస్భేన్ ఇన్నింగ్స్‌లో జార్జియా వాల్ (48 నాటౌట్), చార్లీ నాట్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మెల్బోర్న్ బౌలర్లు సదర్‌ల్యాండ్, క్యాప్సీ తలో 2 వికెట్లు.. కిమ్ గార్త్, ఇల్లింగ్‌వర్త్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్.. 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే 48 బంతుల్లో మరో 73 పరుగులు చేయాల్సి ఉంది. అలైస్ క్యాప్సీ (44 నాటౌట్) పోరాడుతుంది. బ్రిస్భేన్ బౌలర్లలో చార్లీ నాట్, నికోలా హ్యాంకాక్, జెస్ జోనాస్సెన్, సారా గ్లెన్ తలో వికెట్ పడగొట్టారు. -
Punjab Kings: బెయిర్‌స్టో స్థానాన్ని భర్తీ చేయనున్న ఆసీస్ విధ్వంసకర బ్యాటర్
పంజాబ్ కింగ్స్.. గాయపడిన తమ డాషింగ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో స్థానాన్ని ఆస్ట్రేలియా విధ్వంసకర ప్లేయర్‌తో భర్తీ చేసింది. గత బిగ్‌బాష్ లీగ్ సీజన్లో ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు గెలుచుకున్న అడిలైడ్ స్ట్రయికర్స్ ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్‌ను పంజాబ్ కింగ్స్ బెయిర్‌స్టో రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఇవాళ (మార్చి 25) అధికారికంగా వెల్లడించింది. గోల్ఫ్ ఆడుతూ కిందపడిన బెయిర్‌స్టో.. పాత గాయం తిరగబెట్టడంతో కొద్ది రోజులుగా రిహాబ్‌లో ఉన్నాడు. గాయం ఎంతకీ మానకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పంజాబ్ అతన్ని తప్పించి షార్ట్‌ను ఎంపిక చేసింది. పంజాబ్ కింగ్స్.. 2022 మెగా వేలంలో బెయిర్‌స్టోను రూ. 9.75 భారీ ధర వెచ్చింది సొంతం చేసుకుంది. తనకు చెల్లించిన డబ్బుకు న్యాయం చేస్తూ.. బెయిర్‌స్టో గత సీజన్లో మెరుగ్గా రాణించాడు. Matthew Short 👀pic.twitter.com/Bh7hOtNivO — CricTracker (@Cricketracker) March 25, 2023 2022 ఐపీఎల్లో 11 ఇన్నింగ్స్‌లు ఆడిన బెయిర్‌స్టో 144.57 స్ట్రయిక్ రేట్‌తో 253 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక, మాథ్యూ షార్ట్ విషయానికొస్తే.. ఈ అడిలైడ్ బ్యాటర్ గత బీబీఎల్ సీజన్లో 14 ఇన్నింగ్స్‌ల్లో 144 స్ట్రయిక్ రేట్‌తో 458 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. 𝐓𝐫𝐢𝐩𝐥𝐞 the swag, 𝐓𝐫𝐢𝐩𝐥𝐞 the Jazba! 🤩 The King of Kings, D𝐇𝐇𝐇awan has arrived! 𝐀𝐫𝐞 𝐲𝐨𝐮 𝐫𝐞𝐚𝐝𝐲 to 𝐛𝐫𝐞𝐚𝐤 𝐢𝐭 𝐝𝐨𝐰𝐧? 👑#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings @SDhawan25 pic.twitter.com/A36DgrmhFY — Punjab Kings (@PunjabKingsIPL) March 25, 2023 -
చరిత్ర సృష్టించిన ఆండ్రూ టై .. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా!
టీ20 క్రికెట్లో ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా టై రికార్డులకెక్కాడు. బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చెర్స్‌కు ఆడుతున్న టై.. ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై జేమ్స్ బేజ్లే ఔట్ చేసి ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక అరుదైన రికార్డును అతడు కేవలం 211 మ్యాచ్‌ల్లోనే సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు ఆఫ్గానిస్తాన్ స్టార్ పేసర్ రషీద్ ఖాన్ పేరిట ఉండేది. రషీద్ తన టీ20 కెరీర్లో 213 మ్యాచుల్లో 300 వికెట్లు పడగొట్టాడు. తాజామ్యాచ్తో రషీద్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో మూడో స్థానంలో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ ఉన్నాడు. మలింగ 222 మ్యాచుల్లో 300 వికెట్లు సాధించాడు. ఐదో సారి ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చెర్స్ బిగ్‌బాష్ లీగ్-2023 ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చెర్స్ నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన స్కార్చర్స్.. ఐదో సారి టైటిల్‌ను ఎగిరేసుకుపోయింది. 176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. పెర్త్ టైటిల్ సాధించడంలో ఆ జట్టు కెప్టెన్ అష్టన్ టర్నర్ కీలక పాత్ర పోషించాడు. 32 బంతులు ఎదుర్కొన్న టర్నర్ 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేశాడు. అదే విధంగా ఆఖరిలో నిక్ హాబ్సన్(7 బంతుల్లో 18 నాటౌట్), కూపర్ కొన్నోలీ(11 బంతుల్లో 25 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడారు. No player has reached 300 T20 wickets faster than Andrew Tye 👏 pic.twitter.com/DMEpXNHOQB — 7Cricket (@7Cricket) February 4, 2023 చదవండి: W T20 WC 2023: మహిళల పోరుకు సర్వం సిద్దం.. తొలి మ్యాచ్‌లోనే పాక్‌తో భారత్ ఢీ GAME OVER. WHAT A GAME.@ScorchersBBL are BBL champions!#BBL12 pic.twitter.com/wfcVqfYpZc — 7Cricket (@7Cricket) February 4, 2023 -
టర్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బిగ్‌బాష్ లీగ్ ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చర్స్
బిగ్‌బాష్ లీగ్-2023 ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చర్స్ జట్టు నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన స్కార్చర్స్.. ఐదవసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. పెర్త్ బ్యాటర్లలో కెప్టెన్ అష్టన్ టర్నర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 32 బంతులు ఎదుర్కొన్న టర్నర్ 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేశాడు. అదే విధంగా ఆఖరిలో నిక్ హాబ్సన్(7 బంతుల్లో 18 నాటౌట్), కూపర్ కొన్నోలీ(11 బంతుల్లో 25 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో జేవియర్ బార్ట్లెట్, మాథ్యూ కుహ్నెమాన్, జాన్సెన్ తలా వికెట్ సాధించారు. రాణించిన బ్రెయింట్, మెక్‌స్వీనీ ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. బ్రిస్బేన్ బ్యాటర్లలో మెక్‌స్వీనీ(41), బ్రెయింట్(14 బంతుల్లో 31) పరుగులతో రాణించారు. ఇక పెర్త్ బౌలర్లలో బెహ్రెండోర్ఫ్, కెల్లీ రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దీ, టై తలా వికెట్ సాధించారు. చదవండి: 'ఉమ్రాన్‌కు అంత సీన్ లేదు.. పాక్‌లో అలాంటోళ్లు చాలా మంది ఉన్నారు’ -
నెసర్ ఆల్‌రౌండ్ షో.. స్టీవ్ స్మిత్ లేని సిక్సర్స్‌ను కొట్టి ఫైనల్‌కు చేరిన హీట్
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన ఛాలెంజర్ గేమ్‌లో బ్రిస్బేన్ హీట్.. సిడ్నీ సిక్సర్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి, తుది సమరంలో పెర్త్ క్కార్చర్స్తో ఢీకి సిద్ధమైంది. లోకల్ (ఆసీస్) స్టార్ ఆటగాళ్లంతా ఇండియా టూర్ (4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్)కు వెళ్లడంతో చప్పగా సాగిన ఇవాల్టి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిక్సర్స్.. కున్నెమన్ (3/17), స్పెన్సర్ జాన్సన్ (3/28), మైఖేల్ నెసర్ (2/28), మెక్ స్వీనీ (1/21) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 116 పరుగులు మాత్రమే చేసింది. The winning moment! From the man who stole the show. What a performance by Michael Neser and the @HeatBBL #BBL12 #BBLFinals pic.twitter.com/zWuwlsv8QE — KFC Big Bash League (@BBL) February 2, 2023 డేనియల్ హ్యూస్ (23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 117 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హీట్‌ను.. నెసర్ (32 బంతుల్లో 48 నాటౌట్; 7 ఫోర్లు) అజేయమైన ఇన్నింగ్స్‌తో విజయతీరాలకు చేర్చాడు. ఆరంభంలో ఈ జట్టు కూడా వడివడిగా వికెట్లు కోల్పోయినా నెసర్ ఒక్కడే నిలబడి, ఒంటిచేత్తో తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. హీట్ టీమ్ 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జోష్ బ్రౌన్ (20) ఓ మోస్తరుగా రాణించాడు. సిక్సర్స్ బౌలర్లలో నవీద్ 2, స్టీవ్ ఓకీఫ్, సీన్ అబాట్, డ్వార్షుయిష్ తలో వికెట్ దక్కించుకున్నారు. THE BOYS ARE GOING TO THE SHOW! 🎥 @marnus3cricket (Instagram) #BBL12 #BBLFinals pic.twitter.com/4Q79Fihd8O — KFC Big Bash League (@BBL) February 2, 2023 ఆల్‌రౌండర్ ప్రదర్శనతో చెలరేగిన నెసర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఫిబ్రవరి 4న జరిగే ఫైనల్లో బ్రిస్బేన్ హీట్ టీమ్.. పెర్త్ స్కార్చర్స్‌తో టైటిల్ కోసం పోరాడుతుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు ముందు వరకు స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్ లాంటి విధ్వంసకర వీరుల మెరుపులతో బీబీఎల్ కళకళలాడింది. ప్రస్తుతం ఈ ఆటగాళ్లంతా భారత పర్యటనలో ఉండటంతో లీగ్ కళావిహీనంగా, ఎలాంటి మెరుపులు లేకుండా చప్పగా సాగుతుంది. ఫైనల్ మ్యాచ్ కూడా దాదాపుగా ఇలాగే సాగవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. Ice cool under pressure, Michael Neser's batting tonight was something to behold. @KFCAustralia | #BBL12 | #BBLFinals pic.twitter.com/ZROhw7aWIW — KFC Big Bash League (@BBL) February 2, 2023 -
ఒక్క బంతికే 16 పరుగులు.. ఎంత పని చేశావయ్యా స్టీవ్ స్మిత్
సాధారణంగా ఓ బంతికి 7 పరుగులు (నోబాల్+సిక్స్), మహా అయితే 13 పరుగులు (నోబాల్+సిక్స్+సిక్స్) రావడం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఓ బంతికి ఏకంగా 16 పరుగులు వచ్చాయి. దీంతో ఇదెలా సాధ్యపడిందని క్రికెట్ ఫ్యాన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. వివరాల్లోకి వెళితే.. బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో భాగంగా సిడ్నీ సిక్సర్స్‌తో ఇవాళ (జనవరి 23) జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ బౌలర్ జోయల్ పారిస్ ఓ బంతికి 16 పరుగులు సమర్పించుకున్నాడు. సిక్సర్స్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 2వ ఓవర్ వేసిన పారిస్.. తొలి రెండు బంతులను డాట్ బాల్స్ వేశాడు. ఆ తర్వాత బంతిని స్టీవ్ స్మిత్ భారీ సిక్సర్‌గా మలిచాడు. ఈ బంతిని అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. 15 runs off one legal delivery! 😵💫 Steve Smith's cashing in once again in Hobart 🙌#BucketBall #BBL12 pic.twitter.com/G3YiCbTjX7 — KFC Big Bash League (@BBL) January 23, 2023 దీంతో బంతి కౌంట్ కాకుండానే సిక్సర్స్ జాబితాలో 7 పరుగులు చేరాయి. ఆతర్వాతి బంతికి కూడా 5 పరుగులు (వైడ్+ఫోర్) రావడంతో బంతి కౌంట్లోకి రాకుండానే సిక్సర్స్ ఖాతాలో 12 పరుగులు జమయ్యాయి. ఇక పారిస్ నెక్స్ వేసిన లీగల్ బంతిని స్మిత్ బౌండరీకి తరలించడంతో ఒక్క బంతి పూర్తయ్యే సరికి సిక్సర్స్ ఖాతాలో 16 పరుగులు వచ్చి పడ్డాయి. ఈ రేర్ ఫీట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ (33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 66 పరుగులు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్.. తమ కోటా ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితం కావడంతో 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హరికేన్స్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సిక్సర్స్ బౌలర్లలో జాక్సన్ బర్డ్, సీన్ అబాట్, హేడెన్ కెర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. నవీద్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. -
స్టీవ్ స్మిత్‌కు ఏమైంది, అస్సలు ఆగట్లేదు.. మరోసారి విధ్వంసం
Steve Smith: బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో ఆసీస్ మాజీ కెప్టెన్, సిడ్నీ సిక్సర్స్ ఓపెనర్ స్టీవ్ వీర విధ్వంసకర ఫామ్ కొనసాగుతోంది. ప్రస్తుత సీజన్లో ఓపెనర్ అవతారమెత్తిన స్మిత్.. వరుస మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. టెస్ట్ క్రికెటర్‌గా ముద్రపడిన స్టీవ్ ఈ సీజన్లో ప్రత్యర్ధి బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారి, ఊచకోత అన్న పదానికి బెస్ట్ ఎగ్జాంపుల్లా మారాడు. గత నాలుగైదు ఇన్నింగ్స్‌లుగా పట్టపగ్గాలు లేకుండా ఎడాపెడా సెంచరీలు, హాఫ్ సెంచరీలు బాదుతున్న స్మిత్.. ఇవాళ (జనవరి 23) హోబర్ట్ హరికేన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. తానాడిన గత రెండు మ్యాచ్‌ల్లో (అడిలైడ్ స్ట్రయికర్స్పై 56 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 101 పరుగులు, సిడ్నీ థండర్స్‌పై 66 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 125 నాటౌట్) సునామీ శతకాలతో చెలరేగిన స్మిత్.. ఇవాళ మరో మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేసి ప్రత్యర్ధి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. స్మిత్ తన హాఫ్ సెంచరీని కేవలం 22 బంతుల్లో పూర్తి చేశాడు. అతని టీ20 కెరీర్లో ఇదే వేగవంతమై హాఫ్ సెంచరీ కావడం విశేషం. స్మిత్‌తో పాటు హెన్రిక్స్ (23 నాటౌట్), వార్షుయిస్ (30) ఓ మోస్తరుగా రాణించడంతో సిక్సర్స్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి, 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కాగా, స్టీవ్ స్మిత్ తన సహజ సిద్దమైన ఆటకు భిన్నంగా చెలరేగుతుండటం పట్ల క్రికెట్ సర్కిల్స్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. ఇంతకీ స్మిత్‌కు ఏమైంది.. ఒక్కసారిగా గేర్ మార్చేశాడు.. బ్రేకులు వేసే ప్రయత్నాలు చేసినా ఆగట్లేదు అంటూ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కెరీర్లో ఎన్నడూ లేనంతంగా స్పీడ్‌ను పెంచిన స్మిత్ నుంచి భవిష్యత్తులో మరిన్ని సునామీ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చని అతని అభిమానులు చర్చించుకుంటున్నారు. 12 ఏళ్ల బీబీఎల్ కెరీర్లో ఒక్క సెంచరీ కూడా చేయని స్మిత్ కేవలం 5 రోజుల వ్యవధిలో రెండు విధ్వంసకర సెంచరీలు, ఓ మెరుపు హాఫ్ సెంచరీ బాదడంతో ఆసీస్ అభిమానుల ఆనందానికి అవదుల్లేకుండా పోతున్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క సెంచరీ కూడా చేయని స్మిత్.. ఐపీఎల్‌లోనూ సెంచరీ చేయడం విశేషం. -
ఫించ్ 'దంచి కొట్టుడు'.. 35 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో..!
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో భాగంగా ఇవాళ (జనవరి 22) పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ విధ్వంసకర ఇన్నింగ్స్ (35 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడాడు. స్కార్చర్స్ నిర్ధేశించిన 213 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఫించ్ వీరోచితంగా పోరాడినప్పటికీ తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఫించ్‌కు జతగా షాన్ మార్ష్ (34 బంతుల్లో 54; 7 ఫోర్లు, సిక్స్), విల్ సదర్లాండ్ (18 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) పోరాడినప్పటికీ మెల్బోర్న్ లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. Run fest at Perth, over 400 plus runs scored. Melbourne Renegades fell 10 runs short, great win for Perth Scorchers as they hold on as table toppers in BBL 12.#BBL12 #CricTracker pic.twitter.com/2ss6uBZcYh — CricTracker (@Cricketracker) January 22, 2023 ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఫించ్ చాలా రోజుల తర్వాత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంతిని ఇష్టం వచ్చినట్లు బాదుతూ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా ఆండ్రూ టై వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 3 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 31 పరుగులు పిండుకుని ప్రత్యర్ధిని గడగడలాడించాడు. Aaron Finch smashed 31 runs against Andrew Tye in the 18th over. Sensational stuff!#MelbourneRenegades #AaronFInch #AndrewTye pic.twitter.com/Ks6asNijvM — CricTracker (@Cricketracker) January 22, 2023 అయితే 19వ ఓవర్లో కేవలం 8 పరుగులే రావడంతో మెల్బోర్న్ ఓటమి ఖరారైంది. అయినప్పటికీ ఏమాత్రం తగ్గని ఫించ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఎడాపెడా ఫోర్, సిక్సర్ బాది 18 పరుగులు రాబట్టాడు. అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది. మెల్బోర్న్ ఇన్నింగ్స్ నిర్ణీత ఓవర్లలో 202/5 స్కోర్ వద్ద ఆగిపోయింది. పెర్త్ బౌలర్లలో టర్నర్ 2, డేవిడ్ పెయిన్, ఆండ్రూ టై, ఆరోన్ హర్డీ తలో వికెట్ పడగొట్టారు. .@AaronFinch5 with a huge six🔥pic.twitter.com/HiqnPl1d7u — CricTracker (@Cricketracker) January 22, 2023 తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్.. ఓపెనర్లు స్టీవీ ఎస్కినాజీ (29 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), బాన్‌క్రాఫ్ట్ (50 బంతుల్లో 95 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ గెలుపుతో పెర్త్ పాయింట్ల పట్టికతో అగ్రస్థానాన్ని (14 మ్యాచ్‌ల్లో 11 విజయాలతో 22 పాయింట్లు) మరింత పటిష్టం చేసుకుంది. మెల్బోర్న్ 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 7 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకుని నాలుగో స్థానంలో ఉంది. సిడ్నీ సిక్సర్స్ (19 పాయింట్లు), బ్రిస్బేన్ హీట్ (13), సిడ్నీ థండర్ (12), అడిలైడ్ స్ట్రయికర్స్ (10), హోబర్ట్ హరికేన్స్ (10), మెల్బోర్న్ స్టార్స్ (6) వరుసగా 2, 3, 5, 6, 7, 8 స్థానాల్లో ఉన్నాయి. -
ఆఖరి బంతికి సిక్సర్ కావాలి, స్ట్రయిక్‌లో స్టోయినిస్.. ఏం జరిగిందంటే..?
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో మరో రసవత్తర సమరం జరిగింది. గబ్బా వేదికగా బ్రిస్బేన్ హీట్-మెల్బోర్న్ స్టార్స్ మధ్య ఇవాళ (జనవరి 22) జరిగిన మ్యాచ్ ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగింది. మెల్బోర్న్ గెలవాలంటే ఆఖరి బంతికి సిక్సర్ బాదాల్సి ఉండింది. స్ట్రయిక్‌లో మార్కస్ స్టోయినిస్ ఉన్నాడు. గతంలో చాలా సందర్భాల్లో ఆఖరి బంతికి సిక్సర్ బాది తన జట్టును గెలిపించిన స్టోయినిస్ ఈసారి మాత్రం నిరాశపరిచాడు. స్పెన్సర్ జాన్సన్ వేసిన లో ఫుల్ టాస్ బంతిని స్టోయినిస్ భారీ షాట్‌గా మలిచేందుకు విఫలయత్నం చేశాడు. మెల్బోర్న్ కేవలం ఒక్క పరుగుతో మాత్రమే సరిపెట్టుకుని, 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు ఓవర్లో (ఇన్నింగ్స్ 19వ ఓవర్) 21 పరుగులు పిండుకున్న స్టోయినిస్ (23 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), హిల్టన్ కార్ట్‌రైట్ (24 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు) జోడీ ఆఖరి ఓవర్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్.. సామ్ హెయిన్ (41 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), పియర్సన్ (43 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మెల్బోర్న్ బౌలర్లలో లూక్ వుడ్ 2 వికెట్లు పడగొట్టగా.. కౌల్టర్ నైల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఛేదనలో మెల్బోర్న్ సైతం అద్భుతంగా పోరాడినప్పటికీ వారికి విజయం దక్కలేదు. జో క్లార్క్ (32 బంతుల్లో 31; 2 ఫోర్లు), థామస్ రోజర్స్ (20 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), క్యాంప్‌బెల్ (23 బంతుల్లో 25; 2 ఫోర్లు), స్టోయినిస్ (36 నాటౌట్), హిల్టన్ (33 నాటౌట్) తమ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. నిర్ణీత ఓవర్లలో మెల్బోర్న్ 3 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. బ్రిస్బేన్ బౌలర్లలో స్వెప్సన్ 2, జేమ్స్ బాజ్లీ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో బ్రిస్బేన్ 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 పరాజయాలతో (ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి (13 పాయింట్లు) ఎగబాకింది. -
3 రోజుల గ్యాప్‌లో మరో విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన స్టీవ్ స్మిత్
Steve Smith: బిగ్ బాష్ లీగ్ 2022-23 సీజన్లో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాడు. టెస్ట్ ప్లేయర్‌గా ముద్రపడిన స్మిత్ వరుస సెంచరీలతో విరుచుకుపడుతూ, తన జట్టు (సిడ్నీ సిక్సర్స్) విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. జనవరి 17 అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసిన స్మిత్.. ఇవాళ (జనవరి 21) సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో ఏకంగా 125 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 19 ఓవర్లలో సిడ్నీ సిక్సర్స్ 2 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా.. స్టీవ్ ఒక్కడే అందులో 80 శాతానికి పైగా పరుగులు సాధించాడు. అతడికి కెప్టెన్ హెన్రిక్స్ (36 బంతుల్లో 45 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మరో ఎండ్‌లో సహకరించాడు. స్మిత్ ఊచకోత ధాటికి థండర్స్ బౌలర్లు విలవిలలాడిపోయారు. గురిందర్ సంధు ఒక్కడే 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన థండర్స్.. సిక్సర్స్ బౌలర్లు స్టీవ్ ఒకీఫ్ (4/10), సీన్ అబాట్ (3/11), బెన్ వార్షుయిస్ (2/14), టాడ్ మర్ఫీ (1/18) థాటికి 14.4 ఓవర్లలో 62 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా సిక్సర్స్ 125 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. థండర్స్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ (16), జోయల్ డేవిస్ (10) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. పేస్ బౌలర్లకు స్వర్గధామమైన సిడ్నీ పిచ్‌పై స్టీవ్ స్మిత్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 3 రోజుల గ్యాప్‌లో రెండు సెంచరీలు బాదిన స్మిత్‌ను ఆకాశానికెత్తుతున్నారు. బీబీఎల్‌లో సిక్సర్స్ తరఫున నమోదైన రెండు సెంచరీలు స్మితే చేయడం విశేషం. 12 ఏళ్ల బీబీఎల్ కెరీర్లో ఒక్క సెంచరీ కూడా చేయని స్మిత్ కేవలం 3 రోజుల గ్యాప్‌లో రెండు సెంచరీలు చేయడంతో ఆసీస్ అభిమానులు కొనియాడుతున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క సెంచరీ కూడా చేయని స్మిత్.. ఐపీఎల్‌లోనూ సెంచరీ చేయడం విశేషం.