సూపర్‌ సెంచరీతో నాటౌట్‌ .. కానీ జట్టును గెలిపించలేకపోయింది | Smriti Mandhana Smashes Maiden Century WBBL But Team Lose Match Viral | Sakshi
Sakshi News home page

Smriti Mandhana: సూపర్‌ సెంచరీతో నాటౌట్‌ .. కానీ జట్టును గెలిపించలేకపోయింది

Published Wed, Nov 17 2021 6:06 PM | Last Updated on Wed, Nov 17 2021 7:32 PM

Smriti Mandhana Smashes Maiden Century WBBL But Team Lose Match Viral - Sakshi

Smriti Mandhana Smash Maiden Century For Sydney Thunders But Lost Match.. వుమెన్స్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా బుధవారం సిడ్నీ థండర్స్‌, మెల్‌బోర్న్‌ రెనీగేడ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇద్దరు టీమిండియా వుమెన్‌ ప్లేయర్స్‌ దుమ్మురేపారు. స్మృతి మంధాన సూపర్‌ సెంచరీతో మెరవగా.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మొదట బ్యాటింగ్‌లో మెరుపులు.. ఆ తర్వాత బౌలింగ్‌లో తన ప్రతిభను చూపించింది. అయితే స్మృతి మంధాన సూపర్‌ సెంచరీ సాధించినప్పటికి జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయింది. సిడ్నీ థండర్స్‌కు చివరి ఓవర్‌లో 12 పరుగులు అవసరం కాగా.. మెల్‌బోర్న్‌ రెనీగేడ్స్‌ బౌలర్‌ హర్మన్‌ప్రీత్‌ మ్యాజిక్‌ బౌలింగ్‌ ప్రదర్శించడంతో నాలుగు పరుగులతో ఓటమి పాలైంది.

చదవండి: Smriti Mandhana: మెరిసిన స్మృతి మంధాన .. సిడ్నీ థండర్స్‌ ఘన విజయం

తొలుత బ్యాటింగ్‌ చేసిన మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌  నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (55 బంతుల్లో 88 పరుగులు, 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. ఎవెలిన్‌ జోన్స్‌ 42, జెస్‌ డఫిన్‌ 33 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ థండర్స్‌ వుమెన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. స్మృతి మంధాన 64 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులు నాటౌట్‌ ఊచకోత కోసినప్పటికి ఆఖరి ఓవర్లో ఒత్తిడి తట్టుకోలేక జట్టును గెలిపించలేకపోయింది. ప్రస్తుతం స్మృతి మంధాన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి: Wasim Jaffer: అస్సలు గ్యాప్‌ లేదుగా.. ఒకటి పోతే మరొకటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement