బిగ్‌బాష్ లీగ్‌లో(బీబీఎల్) అద్భుత ఘటన చోటుచేసుకుంది. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ లెగ్ స్పిన్నర్ కామెరాన్ బోయ్స్ డబుల్ హ్యాట్రిక్‌తో మెరిశాడు. బీబీఎల్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించిన బోయ్స్.. ఓవరాల్‌గా టి20 క్రికెట్‌లో డబుల్ హ్యాట్రిక్ సాధించిన 10వ క్రికెటర్‌గా నిలిచాడు. సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఏడో ఓవర్ ఆఖరి బంతికి అలెక్స్ హేల్స్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ వేసిన బోయ్స్ వరుస మూడు బంతుల్లో జాసన్ సంఘా, అలెక్స్ రాస్, డేనియల్ సామ్స్‌లను వెనక్కి పంపాడు.
చదవండి: వికెట్ తీసి వింత సెలబ్రేషన్‌తో మెరిసిన బౌలర్
అలా నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డు అందుకున్నాడు. అయితే అలెక్స్ రోస్‌ను ఔట్ చేయడం ద్వారా హ్యాట్రిక్ సాధించిన బోయ్స్.. బీబీఎల్ ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బంతికే మరో వికెట్ తీసి డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. ఇక తాను వేసిన మూడో ఓవర్‌లో మరో వికెట్ తీసిన బోయ్స్.. ఓవరాల్‌గా నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
డబుల్ హ్యాట్రిక్ అంటే..
సాధారణంగా హ్యాట్రిక్ అంటే మూడు వరుస బంతుల్లో మూడు వికెట్లు తీయడం అని అందరికి తెలుసు. ఇక డబుల్ హ్యాట్రిక్ అంటే వరుసగా ఆరు వికెట్లు తీయడమని క్రికెట్ భాషలో అర్థం. కానీ ఆస్ట్రేలియా క్రికెట్‌లో మాత్రం.. నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీయడాన్ని డబుల్ హ్యాట్రిక్ పేరుతో పిలుస్తున్నారు. ఒక ఓవర్ చివరి బంతికి వికెట్.. తర్వాతి ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు.. ఓవరాల్‌గా 1,2,3.. లేదా 2,3,4 వికెట్లను డబుల్ హ్యాట్రిక్‌గా కౌంట్ చేయడం అక్కడ ఆనవాయితీ. ఇక ఐదు వరుస బంతుల్లో ఐదు వికెట్లు తీస్తే దానిని ట్రిపుల్ హ్యాట్రిక్ అని పేర్కొంటారు.
చదవండి: విండీస్ ప్లేయర్ "సూపర్ మ్యాన్ క్యాచ్"కు సలాం కొడుతున్న నెటిజన్లు
We still can't believe this happened!! A double hattie from Cameron Boyce!! #BBL11 pic.twitter.com/fQWsFakSnx
— KFC Big Bash League (@BBL) January 19, 2022
Comments
Please login to add a commentAdd a comment