BBL 2021: Ben Cutting 'Nasty' Blow On His Helmet Gave ThumbsUp, Video Viral - Sakshi
Sakshi News home page

BBL 2021: 'గట్టిగానే తగిలినట్టుంది.. ఏం కాలేదని కవర్‌ చేశాడు'

Published Sat, Jan 1 2022 11:38 AM | Last Updated on Sat, Jan 1 2022 1:28 PM

Cricket Fans Troll Ben Cutting Nasty Blow On His Helmet Gave ThumbsUp - Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌ 2021)లో భాగంగా ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ బెన్‌ కటింగ్‌ చర్య సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే..అడిలైడ్‌ ఓవల్‌ వేదికగా అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, సిడ్నీ థండర్స్‌ మధ్య జరిగింది. అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ పేస్‌ బౌలర్‌ డానియెల్‌ వొర్రాల్‌ షార్ట్‌పిచ్‌ బంతి విసిరాడు. క్రీజులో ఉన్న బెన్‌ కటింగ్‌ దానిని కింద కొట్టాలని చూశాడు. కానీ బంతి మిస్‌ అయి హెల్మెట్‌కు బలంగా తగిలింది. డేనియల్‌ ఏమైనా అయిందా అన్నట్లు అడగ్గా.. దానికి కటింగ్‌ ఏం కాలేదంటూ చేతితో 'థంప్స్‌ అప్‌(ఓకే)' సింబల్‌ చూపించాడు.

చదవండి: Brett Lee: కొడుకనే కనికరం లేకుండా క్లీన్‌బౌల్డ్‌

అయితే కొద్ది సెకన్ల వ్యవధిలోనే బెన్‌ కటింగ్‌ తన హెల్మెట్‌ తీసి గాయమైందా అన్నట్లు పరిశీలించుకోవడం కెమెరాలకు చిక్కింది. కానీ పెద్దగా తగలకపోవడంతో కటింగ్‌ బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అయితే బెన్‌ కటింగ్‌ వ్యవహరించిన తీరుపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు వినూత్నరీతిలో స్పందించారు.'' దెబ్బ గట్టిగానే తగిలినట్టుంది.. కానీ భలే కవర్‌ చేశాడు..'' అంటూ కామెంట్స్‌ పెట్టారు. కాగా బెన్‌ కటింగ్‌ 32 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఇక మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్‌ 22 పరుగుల తేడాతో విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ థండర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. జేసన్‌ సంగా 55 బంతుల్లోనే 91 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది.

చదవండి: Team India New Year Celebrations: న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌తో అదరగొట్టిన టీమిండియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement