Ben Cutting
-
కట్టింగ్ మెరుపు ఇన్నింగ్స్.. ఇమ్రాన్ తాహిర్ మాయాజాలం
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో చాలా రోజుల తర్వాత బౌలర్ల హవా నడిచింది. లీగ్‌లో భాగంగా నిన్న (మార్చి 12) జరిగిన రెండు మ్యాచ్‌ల్లో నాలుగు జట్ల బౌలర్లు పేట్రేగిపోయారు. ఫలితంగా గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న పరుగుల ప్రవాహానికి పాక్షికంగా బ్రేక్ పడింది. నిన్న మధ్యాహ్నం ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ ఓ మోస్తరు స్కోర్ (179/8) నమోదు చేయగా.. ఛేదనలో జల్మీ బౌలర్ల ధాటికి ఇస్లామాబాద్ యునైటెడ్ (166 ఆలౌట్) చేతులెత్తేసింది. రాత్రి జరిగిన మ్యాచ్‌లోనూ దాదాపు ఇదే సీన్ రిపీటయ్యింది. లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ జట్టు.. ముహమ్మద్ అక్లక్ (51), ఇమాద్ వసీం (45), తయ్యబ్ తాహిర్ (40), బెన్ కట్టింగ్ (33) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఖలందర్స్.. ఇమాద్ వసీం (2/26), అకీఫ్ జావిద్ (2/8), మహ్మద్ ఉమర్ (2/20), జేమ్స్ ఫుల్లర్ (1/29), ఇమ్రాన్ తాహిర్ (2/24) చెలరేగడంతో 18.5 ఓవర్లలో 110 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. కాగా, ఈ పీఎస్ఎల్ సీజన్లో ట్రెండ్‌ను పరిశీలిస్తే.. దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఇరు జట్లు సునాయాసంగా 200 పరుగుల మైలురాయిని దాటాయి. క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే ముల్తాన్ సుల్తాన్స్ రికార్డు స్థాయిలో 262 పరుగులు చేయగా.. ఛేదనలో అదే స్థాయిలో రెచ్చిపోయిన గ్లాడియేటర్స్ 253 పరుగులు చేసి లక్ష్యానికి 10 పరుగులు దూరంలో నిలిచిపోయింది. ఈ సీజన్ మ్యాచ్‌ల గురించి చెప్పుకుంటు పోతే 240, 242, 243, 244, 226.. ఇలా ఆయా జట్లు పలు మార్లు 250 పరుగుల మైలురాయి వరకు రీచ్ అయ్యాయి. ప్రస్తుత సీజన్లో బ్యాటర్లు శతక్కొట్టుడులోనూ టాప్‌లో నిలిచారు. మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, జేసన్ రాయ్, రిలీ రొస్సొ, ఫకర్ జమాన్, ఉస్మాన్ ఖాన్ వంటి బ్యాటర్లు విధ్వంసకర శతకాలతో విరుచుకుపడి ఆయా జట్లు భారీ స్కోర్లు చేయడానికి దోహదపడ్డారు. మరోవైపు లీగ్ కూడా చివరి అంకానికి చేరింది. మార్చి 15 లాహోర్ ఖలందర్స్-ముల్తాన్ సుల్తాన్స్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుండగా.. ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మీ మార్చి 16న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఆ తర్వాత ఎలిమినేటర్-2, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. -
పాత గొడవను గుర్తుచేసి కౌంటర్ ఇద్దామనుకున్నాడు.. బెడిసికొట్టింది
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్ 2022)లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం తనకు చేసిన అవమానాన్ని గుర్తుతెచ్చుకున్న బ్యాట్స్‌మన్ సదరు బౌలర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. అయితే చివరికి ఆ ప్లాన్ తనకే బెడిసి కొట్టింది. ఆ బ్యాట్స్‌మన్ ఆస్ట్రేలియా డాషింగ్ ఆల్‌రౌండర్ బెన్ కటింగ్ అయితే.. బౌలర్ పాకిస్తాన్ క్రికెటర్ సోహైల్ తన్వీర్. చదవండి: IPL 2022 Auction: నన్నంటే కొనలేదు.. అతడిని కూడానా.. నిజంగా షాకయ్యా! విషయంలోకి వెళితే.. 2018లో కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో తన్వీర్ గయానా అమెజాన్ వారియర్స్ తరపున.. బెన్ కటింగ్ సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియోట్స్ తరపున ప్రాతినిధ్యం వహించారు. కాగా బెన్ కటింగ్‌ను ఔట్ చేసిన తర్వాత సోహైల్ తన్వీర్ కటింగ్‌ను చూస్తూ తన రెండు చేతులతో మిడిల్ ఫింగర్ చూపించాడు. దీనిని బెన్ కటింగ్ నాలుగేళ్లుగా మనసులో పెట్టుకున్నాడని తాజా ఘటనతో అర్థమైంది. మంగళవారం రాత్రి పెషావర్ జాల్మీ, క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా పెషావర్ జాల్మి ఇన్నింగ్స్ సమయంలో తన్వీర్ వేసిన 19వ ఓవర్లో బెన్ కటింగ్ మూడు సిక్సర్లతో హోరెత్తించాడు. ఆ తర్వాత తన్వీర్వైపు తిరిగి రెండు చేతులు పైకెత్తి మిడిల్ ఫింగర్ చూపించి నాలుగేళ్ల క్రితం తనకు జరిగిన అవమానాన్ని సరిచేశానని భావించాడు. ఇది ఇంతటితో ముగిసిపోలేదు. నసీమ్ షా వేసిన చివరి ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి బెన్ కటింగ్ బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద తన్వీర్కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక తన్వీర్ ఊరుకుంటాడా.. వెంటనే తన రెండు చేతులు పైకెత్తి మిడిల్ ఫింగర్ చూపించి దెబ్బకు దెబ్బ తీశాడు. ఆ విధంగా తన్వీర్.. కటింగ్‌పై మరోసారి పైచేయి సాధించినట్లయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2022: కేన్ మామ 'బకరా' అయ్యే అవకాశాలు ఎక్కువ.. ఇక మ్యాచ్‌లో పెషావర్ జాల్మి 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ 58, తలాత్ 51, బెన్ కటింగ్ 36 పరుగులు చేశాడు. క్వెటా గ్లాడియేటర్స్ బౌలింగ్‌లో నసీమ్ షా 4 వికెట్లు తీశాడు. కుర్రమ్ షెహజాద్, గులామ్ ముదస్సార్, ఇఫ్తికార్ అహ్మద్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన క్వెటా గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. విల్ స్మీద్ 99 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. అయితా మిగతావారు పెద్దగా రాణించకపోవడంతో క్వెటా ఓటమిపాలైంది. The entire Sohail Tanvir vs Ben Cutting battle. From 2018 to 2022. pic.twitter.com/XuV18PyiZ3 — Haroon (@hazharoon) February 15, 2022 -
ఔటయ్యాడని తెగ ఫీలైపోయింది.. ఆరా తీస్తే
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో(పీఎస్ఎల్) ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ బెన్ కటింగ్ పీఎస్ఎల్లో పెషావర్ జాల్మీ తరపున ఆడుతున్నాడు. కరాచీ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కటింగ్.. కరాచీ బౌలర్ మహ్మద్ నబీ వేసిన బంతిని డిఫెన్స్ ఆడాలనుకున్నాడు. కానీ బంతి ప్యాడ్లను తాకి పక్కకు వెళ్లింది. ఇంతలో వెనకాల వికెట్లపై ఉన్న బెయిల్స్ కింద పడిపోయాయి. బెన్ కటింగ్ తన కాళ్లతో వికెట్లను తాకాడేమోనని ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అప్పీల్ చేశారు. చదవండి: Under-19 Worldcup: అదరగొట్టిన భారత సంతతి కుర్రాడు.. ఎవరీ నివేథన్ రాధాకృష్ణన్ ఇదే సమయంలో పీఎస్ఎల్లో యాంకర్‌గా వ్యవహరిస్తున్న ఎరిన్ హాలండ్ ఒక వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. బెన్ కటింగ్ ఔట్ అయ్యాడని తలకు చేతులు పెట్టి ''ఎంత పని జరిగింది'' అంటూ తెగ ఫీలయిపోయింది. అయితే కటింగ్ ఔట్ కాలేదని తెలియడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని నవ్వడం మొదలుపెట్టింది. ఏంట్రా ఇది కటింగ్ ఔటైతే యాంకరమ్మ ఎందుకు ఫీలయ్యిందని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఆ యాంకర్ ఎవరో కాదు.. స్వయానా బెన్ కటింగ్ అర్థాంగి. ఆమె ఇచ్చిన హావభావాలు అక్కడి కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో షేర్ చేయడం.. అది కాస్త వైరల్‌గా మారిపోవడం జరిగిపోయింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. వాస్తవానికి బెయిల్స్ పడిపోవడంలో బెన్ కటింగ్ పాత్రేమి లేదు. మహ్మద్ నబీ డెలివరీ వేయగానే.. అది కటింగ్ ప్యాడ్లను తాకి వెనక్కి వెళ్లింది. ఇదే సమయంలో కటింగ్ కాస్త వెనక్కి జరగడం.. వికెట్ కీపర్ మహ్మద్ కమ్రాన్ అక్మల్ కూడా బంతిని అందుకునే ప్రయత్నంలో బెయిల్స్‌కు దగ్గరగా వచ్చాడు. పొరపాటున కమ్రాన్ చేతి బెయిల్స్‌ను తాకాయి. ఇది తెలియని మిగతా ఆటగాళ్లు అప్పీల్‌కు వెళ్లగా.. కమ్రాన్ అసలు విషయం చెప్పాడు. దీంతో జట్టు తమ అప్పీల్‌ను వెనక్కి తీసుకుంది. చదవండి: Under-19 World Cup: గ్రౌండ్లోకి రావడానికి నానాతంటాలు.. అంత కష్టమెందుకు ఈ మ్యాచ్‌లో బెన్ కటింగ్ 22 బంతుల్లో 24 పరుగులు చేశాడు.ఇక మ్యాచ్ లో పెషావర్ జాల్మీ 9 పరుగుల తేడాతో కరాచీ కింగ్స్‌పై విజయం సాధించింది. పెషావర్‌కు సీజన్లో రెండో విజయం కాగా.. కరాచీ కింగ్స్‌కు వరుసగా నాలుగో ఓటమి కావడం విశేషం. It’s alright, Erin 🤗 #HBLPSL7 l #LevelHai l #KKvPZ @erinvholland pic.twitter.com/Rorv0FGVcG — PakistanSuperLeague (@thePSLt20) February 4, 2022 -
'గట్టిగానే తగిలినట్టుంది.. ఏం కాలేదని కవర్ చేశాడు'
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో భాగంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ బెన్ కటింగ్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే..అడిలైడ్ ఓవల్ వేదికగా అడిలైడ్ స్ట్రైకర్స్, సిడ్నీ థండర్స్ మధ్య జరిగింది. అడిలైడ్ స్ట్రైకర్స్ పేస్ బౌలర్ డానియెల్ వొర్రాల్ షార్ట్‌పిచ్ బంతి విసిరాడు. క్రీజులో ఉన్న బెన్ కటింగ్ దానిని కింద కొట్టాలని చూశాడు. కానీ బంతి మిస్ అయి హెల్మెట్‌కు బలంగా తగిలింది. డేనియల్ ఏమైనా అయిందా అన్నట్లు అడగ్గా.. దానికి కటింగ్ ఏం కాలేదంటూ చేతితో 'థంప్స్ అప్(ఓకే)' సింబల్ చూపించాడు. చదవండి: Brett Lee: కొడుకనే కనికరం లేకుండా క్లీన్‌బౌల్డ్ అయితే కొద్ది సెకన్ల వ్యవధిలోనే బెన్ కటింగ్ తన హెల్మెట్ తీసి గాయమైందా అన్నట్లు పరిశీలించుకోవడం కెమెరాలకు చిక్కింది. కానీ పెద్దగా తగలకపోవడంతో కటింగ్ బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అయితే బెన్ కటింగ్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు వినూత్నరీతిలో స్పందించారు.'' దెబ్బ గట్టిగానే తగిలినట్టుంది.. కానీ భలే కవర్ చేశాడు..'' అంటూ కామెంట్స్ పెట్టారు. కాగా బెన్ కటింగ్ 32 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 22 పరుగుల తేడాతో విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. జేసన్ సంగా 55 బంతుల్లోనే 91 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. చదవండి: Team India New Year Celebrations: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌తో అదరగొట్టిన టీమిండియా Yikes! A quick thumbs up from Cutting after that nasty blow to the helmet #BBL11 pic.twitter.com/d7viKgsf74 — cricket.com.au (@cricketcomau) December 31, 2021