పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో(పీఎస్‌ఎల్) ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ బెన్ కటింగ్ పీఎస్‌ఎల్‌లో పెషావర్ జాల్మీ తరపున ఆడుతున్నాడు. కరాచీ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కటింగ్.. కరాచీ బౌలర్ మహ్మద్ నబీ వేసిన బంతిని డిఫెన్స్ ఆడాలనుకున్నాడు. కానీ బంతి ప్యాడ్లను తాకి పక్కకు వెళ్లింది. ఇంతలో వెనకాల వికెట్లపై ఉన్న బెయిల్స్ కింద పడిపోయాయి. బెన్ కటింగ్ తన కాళ్లతో వికెట్లను తాకాడేమోనని ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అప్పీల్ చేశారు.
చదవండి: Under-19 Worldcup: అదరగొట్టిన భారత సంతతి కుర్రాడు.. ఎవరీ నివేథన్ రాధాకృష్ణన్
ఇదే సమయంలో పీఎస్‌ఎల్‌లో యాంకర్‌గా వ్యవహరిస్తున్న ఎరిన్ హాలండ్ ఒక వింత ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. బెన్ కటింగ్ ఔట్ అయ్యాడని తలకు చేతులు పెట్టి ''ఎంత పని జరిగింది'' అంటూ తెగ ఫీలయిపోయింది. అయితే కటింగ్ ఔట్ కాలేదని తెలియడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని నవ్వడం మొదలుపెట్టింది. ఏంట్రా ఇది కటింగ్ ఔటైతే యాంకరమ్మ ఎందుకు ఫీలయ్యిందని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఆ యాంకర్ ఎవరో కాదు.. స్వయానా బెన్ కటింగ్ అర్థాంగి. ఆమె ఇచ్చిన హావభావాలు అక్కడి కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో షేర్ చేయడం.. అది కాస్త వైరల్‌గా మారిపోవడం జరిగిపోయింది.
ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. వాస్తవానికి బెయిల్స్ పడిపోవడంలో బెన్ కటింగ్ పాత్రేమి లేదు. మహ్మద్ నబీ డెలివరీ వేయగానే.. అది కటింగ్ ప్యాడ్లను తాకి వెనక్కి వెళ్లింది. ఇదే సమయంలో కటింగ్ కాస్త వెనక్కి జరగడం.. వికెట్ కీపర్ మహ్మద్ కమ్రాన్ అక్మల్ కూడా బంతిని అందుకునే ప్రయత్నంలో బెయిల్స్‌కు దగ్గరగా వచ్చాడు. పొరపాటున కమ్రాన్ చేతి బెయిల్స్‌ను తాకాయి. ఇది తెలియని మిగతా ఆటగాళ్లు అప్పీల్‌కు వెళ్లగా.. కమ్రాన్ అసలు విషయం చెప్పాడు. దీంతో జట్టు తమ అప్పీల్‌ను వెనక్కి తీసుకుంది.
చదవండి: Under-19 World Cup: గ్రౌండ్‌లోకి రావడానికి నానాతంటాలు.. అంత కష్టమెందుకు
ఈ మ్యాచ్‌లో బెన్ కటింగ్ 22 బంతుల్లో 24 పరుగులు చేశాడు.ఇక మ్యాచ్ లో పెషావర్ జాల్మీ 9 పరుగుల తేడాతో కరాచీ కింగ్స్‌పై విజయం సాధించింది. పెషావర్‌కు సీజన్‌లో రెండో విజయం కాగా.. కరాచీ కింగ్స్‌కు వరుసగా నాలుగో ఓటమి కావడం విశేషం.
It’s alright, Erin 🤗 #HBLPSL7 l #LevelHai l #KKvPZ @erinvholland pic.twitter.com/Rorv0FGVcG
— PakistanSuperLeague (@thePSLt20) February 4, 2022
Comments
Please login to add a commentAdd a comment