PSL
-
సూపర్ క్యాచ్ పట్టిన బాల్ బాయ్.. హగ్ చేసుకున్న స్టార్ బ్యాటర్! వీడియో
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో భాగంగా సోమవారం రావల్పిండి వేదికగా పెషావర్ జెల్మీ, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్లు తలపడ్డాయి. ఈ హైలోల్టేజ్ పోరులో పెషావర్‌ను 29 పరుగుల తేడాతో ఇస్లామాబాద్ చిత్తు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ ఆటగాడు, కివీస్ స్టార్ కోలిన్ మున్రో ఓ బాల్ బాయ్‌ను ఎత్తుకున్నాడు. ఏం జరిగిందంటే? పెషావర్ ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లో అమీర్ జమాల్ భారీ సిక్స్ బాదాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ అవతల ఉన్న ఓ బాల్ బాయ్ బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇది గమనించిన మున్రో అతడి దగ్గరకు వెళ్లి బంతిని ఎలా పట్టుకోవాలో కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ తర్వాత అదే ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లో పెషావర్ బ్యాటర్ ఆరిఫ్ యూకుడ్ అదే పొజిషన్లో సిక్సర్ బాదాడు. ఈ సారి మాత్రం బాల్‌బాయ్ ఎటువంటి తప్పిదం చేయలేదు. అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన మున్రో వెంటనే అతడి దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుని అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2024: ధోని సంచలన నిర్ణయం.. సీఎస్కే కెప్టెన్‌గా రుత్‌రాజ్ గైక్వాడ్!? From drop to dazzling catch! 😲 Ball boy redeems himself in #IUvPZ match and gets a warm hug from Colin Munro. #HBLPSL9 | #KhulKeKhel pic.twitter.com/ncTKJ0xPfr — PakistanSuperLeague (@thePSLt20) March 4, 2024 -
PSL 2024 తొలిసారిగా అలా షోయబ్ మాలిక్ జంట: సనాపై నెటిజన్ల ట్రోలింగ్
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో భార్య నటి సనా జావేద్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల మూడో పెళ్లి చేసుకున్న మాలిక్, సనా జావేద్ జంటగా కలిసి తొలిసారిగా బహిరంగంగా కనిపించారు. ముల్తాన్ విమానాశ్రయం హోటల్‌కు వెళుతున్న దృశ్యాలు హల్చల్ చేశాయి. దీనిపై కొంతమంది ఫ్యాన్స్ సానుకూలంగా స్పందించినప్పటికీ, మరికొందమంది మాత్రం నెగిటివ్‌గా కమెంట్స్ చేశారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) తొమ్మిదో ఎడిషన్‌లో భాగంగా ఆదివారం జరిగిన ముల్తాన్ సుల్తాన్స్ vs కరాచీ కింగ్స్ మ్యాచ్‌కు ఆమె హాజరైంది. ఈ సందర్బంగా కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మాలిక్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిపోయింది. గట్టిగా కేకలు వేస్తూ, ఉత్సాహంగా కనిపించింది. భర్త షోయబ్‌ను ఎంకరేజ్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు, చిత్రాలు వైరల్ గా మారాయి. మాజీ జీవిత భాగస్వాములను మోసం చేసిన ఈ జంటకు సిగ్గూ, శరం లేదంటూ కమెంట్ చేశారు. కొంచెం కూడా పశ్చాత్తాపం లేదంటూ విమర్శలకు దిగారు. అంతేకాదు షోయబ్ త్వరలో తన నాల్గవ భార్యను ఇంటికి తీసుకువస్తాడు, నిన్ను కూడా వదిలివేస్తాడంటూ విరుచుకుపడ్డారు. కాగా భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జాకు విడాకులిచ్చిన షోయబ్ మాలిక్ సనా జావేద్‌ను పెళ్లాడి అందర్నీ షాక్‌కు గురి చేశాడు. అలాగే 'ఖులా' ద్వారా విడిపోయారని సానియా మీర్జా తండ్రి స్వయంగా వెల్లడించారు. సనాకు ఇది రెండో పెళ్లికాగా, మాలిక్‌కు మూడో పెళ్లి. కాగా పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన కరాచీ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ మలన్ 52 పరుగులు చేయగా, రీజా హెండ్రిక్స్ 54 బంతుల్లో 79 పరుగులు చేశాడు. ఛేజింగ్‌లో కరాచీ వరుసగా వికెట్లు కోల్పోయింది.అయితే నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసిన మాలిక్ 35 బంతుల్లో 53 పరుగులు చేశాడు. కానీ 55 పరుగుల తేడాతో ఓడిపోయింది.మరోవైపు షోయబ్ మాలిక్ స్వార్థపరుడంటూ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ఆరోపించడం గమనార్హం.. -
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
ఇంగ్లండ్ యువ కెరటం హ్యారీ బ్రూక్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL), ద హండ్రెడ్ లీగ్ (THL)ల్లో సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. బ్రూక్‌కు ముందు ఈ మూడు లీగ్‌ల్లో సెంచరీలు చేసిన ఆటగాడే లేడు. హండ్రెడ్ లీగ్‌లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన బ్రూక్ నిన్న (ఆగస్ట్ 22) వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో (42 బంతులు 105; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) కదంతొక్కాడు. ఈ సెంచరీ హండ్రెడ్ లీగ్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ (41) కావడం విశేషం. దీనికి ముందు బ్రూక్ 2023 ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై శతకం (55 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదాడు. ఈ సెంచరీతో బ్రూక్ సన్‌రైజర్స్ యంగెస్ట్ సెంచూరియన్గానూ రికార్డుల్లోకెక్కాడు. 2023 ఐపీఎల్‌కు ముందు సన్‌రైజర్స్ బ్రూక్‌ను 13.25 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. పై పేర్కొన్న మూడు లీగ్‌ల్లో (ఐపీఎల్, పీఎస్ఎల్, హండ్రెడ్) బ్రూక్ తన తొలి సెంచరీని పీఎస్ఎల్లో సాధించాడు. 2022 పీఎస్ఎల్లో బ్రూక్, లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ.. ఇస్లామాబాద్ యునైటెడ్‌పై శతక్కొట్టాడు (49 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు). ఓవరాల్‌గా బ్రూక్ కెరీర్ చూసుకుంటే, 2022 జనవరిలో విండీస్‌తో జరిగిన టీ20తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 12 టెస్ట్‌ల్లో 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలతో 1181 పరుగులు.. 3 వన్డేల్లో ఫిఫ్టి సాయంతో 86 పరుగులు, 20 టీ20ల్లో హాఫ్ సెంచరీ సాయంతో 372 పరుగులు చేశాడు. బ్రూక్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున 11 మ్యాచ్‌ల్లో సెంచరీ సాయంతో 190 పరుగులు చేశాడు. -
దేశం క్లిష్ట పరిస్థితుల్లో.. వాళ్లకు ప్లాట్లు, ఖరీదైన ఫోన్లు?
పాకిస్తాన్ దేశం ఇప్పుడిప్పుడే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతోంది. ఇప్పటికి అక్కడ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే అక్కడి పాకిస్తాన్ ఆటగాళ్లకు మాత్రం ప్లాట్లు, ఖరీదైన ఐఫోన్లను గిఫ్ట్‌లుగా అందజేశారు. ఇప్పుడు ఈ వార్త పాక్‌లో సంచలనం రేపింది. విషయంలోకి వెళితే.. ఇటీవలే ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) తొమ్మిదో సీజన్ విజేతగా లాహోర్ ఖలండర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో షాహిన్ అఫ్రిది సేన విజయం సాధించి వరుసగా రెండోసారి పీఎస్ఎల్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. దీంతో సదరు ఫ్రాంఛైజీ ఓనర్ లాహోర్ ఖలండర్స్ సీవోవో సమీన్ రాణా ఆటగాళ్లకు అదిరిపోయే గిఫ్ట్ లు ఇచ్చింది. ప్లేయర్స్ అందరికీ ప్లాట్లు, ఐఫోన్లు ఇచ్చారు. ఈ ఫ్రాంఛైజీ ఓనర్ ఖలందర్స్ సిటీ అనే ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేపట్టింది. దీంతో తమ ప్లేయర్స్ కు అందులోనే ప్లాట్లు ఇచ్చింది. ఈ ప్లాట్లు, ఐఫోన్లు అందుకున్న వాళ్లలో స్టార్ ప్లేయర్స్ షాహీన్ షా అఫ్రిది, ఫఖర్ జమాన్, జమాన్ ఖాన్, ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఉన్నారు. ఒక్కొక్క ప్లేయర్ కు 5445 చదరపు అడుగుల ప్లాట్లు ఇచ్చారు. వీటి విలువ పాకిస్థాన్ కరెన్సీలో 92. 5 లక్షలు కాగా.. ఇండియన్ కరెన్సీలో రూ.27 లక్షలు. ఈ లీగ్ మొత్తం ఆడే అవకాశం రాకుండా బెంచ్ కే పరిమితమైన ప్లేయర్స్ కు కూడా ఈ ప్లాట్లు ఇచ్చారు. పీఎస్‌లో ఫైనల్లో బ్యాట్‌తోనూ, బంతితోను మెరిసి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి అదనంగా గిఫ్ట్‌లు అందించడం విశేషం. ఫైనల్లో మొదట బ్యాటింగ్‌లో 44 రన్స్.. ఆ తర్వాత బౌలింగ్ లో రాణించిన షాహిన్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. లాహోర్ టీమ్ లీగ్ గెలిచినందుకు ఒక ప్లాట్ అందుకున్న షాహీన్.. కెప్టెన్ గా వ్యవహరించినందుకు మరో రెండు ప్లాట్స్ అదనంగా అందుకోవడం విశేషం. ఇది చూసిన క్రికెట్ అభిమానులు.. ''దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పాక్ ఆటగాళ్లకు లభించిన గిఫ్ట్‌లను డబ్బుల రూపంలో దేశానికి అందిస్తే బాగుండేది'' అంటూ కామెంట్ చేశారు. Great Gesture from Lahore Qalandars - Appreciation for ALL "This is why we call it a FAMILY"#PSL08 #qalandarhum #SabSitarayHumaray #QalandarsCity pic.twitter.com/X4z2wxi7Tj — Lahore Qalandars (@lahoreqalandars) March 22, 2023 చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు సీనియర్ క్రికెటర్ గుడ్‌బై అభిమానులను పిచ్చోళ్లను చేశారు -
Danny Morrison: అప్పుడు ఇండియా యువతి.. ఇప్పుడు ఆసీస్ యువతి
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్ విజయవంతంగా నడుస్తోంది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మోరిసన్ లీగ్‌లో కామెంటేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ మాజీ క్రికెటర్ ఎక్కడ ఉంటే అక్కడ సందడి వేరుగా ఉంటుంది. ఆటలో గొప్ప బౌలర్‌గా పేరు పొందిన డానీ మోరిసన్ ఆట తర్వాత కూడా అదే జోష్‌ను కంటిన్యూ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా డానీ మోరిసన్ చర్య ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మార్చి 5న(ఆదివారం) కెట్టా గ్లాడియేటర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియన్ టీవీ ప్రజెంటర్.. మాజీ క్రికెటర్ బెన్ కటింగ్ భార్య ఎరిన్ హాలండ్‌తో కలిసి మోరిసన్ మాట్లాడాడు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే సడన్‌గా ఎరిన్ హాలండ్‌ను ఎత్తుకొని తన తొడపై కూర్చొబెట్టుకున్నాడు. ఈ చర్యతో ఎరిన్ హాలండ్ షాక్‌కు గురైనప్పటికి ఫన్నీగానే తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ ఎరిన్ హాలండ్ ట్విటర్లో షేర్ చేస్తూ.. ''లవ్ యూ అంకుల్ @SteelyDan66'' అని రాసుకొచ్చింది. దీనిపై స్పందించిన మోరిసన్.. ''నిన్ను నీ పాదాలపై నిల్చునేలా చేశాను మిసెస్ కటింగ్'' అంటూ రిప్లై ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''బెన్ కటింగ్ ఎక్కడున్నావు''.. ''బెన్ కటింగ్ చూశాడో నీ పని అయిపోతుంది మోరిసన్'' అంటూ ఫన్నీవేలో పేర్కొన్నారు. అయితే ఇలా చేయడం డానీ మోరిసన్‌కు కొత్తేం కాదు. గతంలో ఐపీఎల్‌లోనూ రెండు సందర్భాల్లో మోరిసన్ ఇలానే ప్రవర్తించాడు. ఒకసారి చీర్ లీడర్‌ను తన భుజాలపై మోసుకెళ్లిన మోరిసన్.. మరోసారి మాజీ ఐపీఎల్ ప్రజంటేటర్.. నటి కరిష్మా కొటక్‌ను కూడా తన తొడలపై కూర్చొబెట్టుకున్నాడు. అప్పట్లో దీనికి సంబంధించిన ఫోటో బాగా వైరల్ అయింది. తాజాగా పీఎస్ఎల్లోనూ సేమ్ సీన్ రిపీట్ చేసిన డానీ మోరిసన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇక 57 ఏళ్ల డానీ మోరిసన్ 1987లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 1994లో టీమిండియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీయడం ద్వారా మోరిసన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. 1997లో కివీస్ తరపున ఆఖరి మ్యాచ్ ఆడిన మోరిసన్ తన 10 ఏళ్ల కెరీర్లో 48 టెస్టుల్లో 160 వికెట్లు, 96 వన్డేల్లో 126 వికెట్లు పడగొట్టాడు. Love ya uncle @SteelyDan66 😂 @thePSLt20 pic.twitter.com/9reSq6ekdN — Erin Holland (@erinvholland) March 5, 2023 Just keeping you on your toes Mrs Cutting!!! 🤣💃 #PSL8 https://t.co/r1i5Oebc5l — Danny Morrison (@SteelyDan66) March 5, 2023 చదవండి: షాహిన్ అఫ్రిది చితక్కొటినా తప్పని ఓటమి.. -
తుపాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకు పడ్డ ఆజం ఖాన్.. 42 బంతుల్లోనే..
Pakistan Super League, 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో యువ బ్యాటర్ ఆజం ఖాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. క్వెటా గ్లాడియేటర్స్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 42 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 230కి పైగా స్ట్రైక్‌రేటుతో 97 పరుగులు సాధించాడు. తద్వారా ఇస్లామాబాద్ యునైటెడ్ భారీ స్కోరు చేసి గెలుపొందడంలో ఆజం ఖాన్ సహాయపడ్డాడు. అద్భుత ఆట తీరుతో 24 ఏళ్ల ఈ రైట్ హ్యాండర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. కాగా పీఎస్ఎల్-2023లో భాగంగా కరాచీ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఇస్లామాబాద్, క్వెటా గ్లాడియేటర్స్‌తో తలపడింది. ఆరంభంలో తడ‘బ్యా’టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇస్లామాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్ 8 పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్‌డౌన్ బ్యాటర్ వాన్ డెర్ డసెన్ ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ కోలిన్ మున్రో 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఐమల్ ఖాన్ అతడిని తొందరగానే పెవిలియన్‌కు పంపాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ షాదాబ్ ఖాన్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆజం ఖాన్ అద్భుత ఇన్నింగ్స్ ఇలాంటి సమయంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ కీపర్ ఆజం ఖాన్ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ తుపాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన తీరు ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ఆజంకు తోడుగా అసిఫ్ అలీ 42 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇస్లామాబాద్ 220 పరుగులు స్కోరు చేసింది. ఆరు వికెట్లు నష్టపోయి ఈ మేర భారీ స్కోరు సాధించింది. రెండో స్థానానికి ఇక లక్ష్య ఛేదనకు దిగిన క్వెటా గ్లాడియేటర్స్ 19.1 ఓవర్లలో 157 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఇస్లామాబాద్‌కు 63 పరుగుల తేడాతో విజయం దక్కింది. ఇస్లామాబాద్ బౌలర్లు ఫజల్హక్ ఫారూకీ(అరంగేట్రం), హసన్ అలీ మూడేసి వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్, షాబాద్ ఖాన్ షాదాబ్ ఖాన్ తలా రెండు వికెట్లు తీశారు. ఈ గెలుపుతో ఇస్లామాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. చదవండి: WTC NZ Vs SL: కివీస్‌తో సిరీస్‌కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో! T20 WC 2023 Final: సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఆఖరి పోరులో ఆసీస్‌తో.. Asif aur Azam ka kamaal 🪄 Just stand and admire. #SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/6zrlpJpM7Z — PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023 Epic finale to a sizzling innings 👏 #SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/VVY81pWBiq — PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023 -
WC 2023: భారత్‌లో వరల్డ్‌కప్ ట్రోఫీ గెలవడమే లక్ష్యం.. అంత సీన్ లేదు!
India- Pakistan- ODI World Cup 2023: వన్డే వరల్డ్‌కప్-2023 ట్రోఫీ గెలవడమే తన ప్రధాన లక్ష్యమని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అన్నాడు. కెరీర్లో తాను సాధించాల్సింది ఇంకెంతో ఉందని.. అయితే, అన్నిటికంటే భారత్‌లో జరుగనున్న మెగా టోర్నీలో జట్టును విజేతగా నిలపడమే ముఖ్యమని పేర్కొన్నాడు. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా బాబర్ నిలిచిన సంగతి తెలిసిందే. పెషావర్ కెప్టెన్‌గా.. అదే విధంగా.. సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ కూడా గెలుచుకున్నాడు. ప్రస్తుతం అతడు స్వదేశంలో జరుగుతున్న పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్‌తో బిజీగా ఉన్నాడు. పెషావర్ జల్మీ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఇక తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు మూడింట రెండు మ్యాచ్‌లు గెలిచిన బాబర్ బృందం.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో క్రికెట్ పాకిస్తాన్‌తో మాట్లాడిన బాబర్ ఆజం తన తదుపరి లక్ష్యాల గురించి చెప్పుకొచ్చాడు. భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీ నెగ్గాలి ‘‘నేను కెరీర్లో సాధించాల్సింది చాలా ఉంది. అయితే, ఇప్పుడు నా ప్రధాన లక్ష్యం పీఎస్ఎల్లో తొలి సెంచరీ నమోదు చేయడం.. అది కూడా ఈ ఏడాదే జరగాలి. అంతేకాకుండా ఇండియాలో జరుగనున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 టైటిల్ గెలవాలి. ప్రపంచకప్ ట్రోఫీ గెలిచిన జట్టుగా నా దేశానికి పేరు తీసుకురావాలి’’ అని బాబర్ ఆజం పేర్కొన్నాడు. కాగా ఆసియా వన్డే కప్-2023 నిర్వహణకు సంబంధించి బీసీసీఐ- పీసీబీ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అంతసీన్ లేదంటున్న టీమిండియా ఫ్యాన్స్ ఈ నేపథ్యంలో పాక్ నుంచి వేదికను తరలించే అంశంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ చర్చలు జరుపుతోంది. కాగా తమ దేశంలో ఆసియా కప్ ఆడేందుకు టీమిండియా రాకపోతే.. తాము కూడా భారత్‌లో వరల్డ్‌కప్ ఆడమంటూ గతంలో పీసీబీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక బాబర్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘భారత్‌లో టీమిండియా ఫేవరెట్. మా వాళ్లను దాటుకుని మీరు ట్రోఫీ సాధిస్తారా? అంత సీన్ లేదు. ఈసారి కప్ భారత్‌దే. నువ్వు ఇంకో మాట చెప్పు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ICC Rankings: ఆండర్సన్ ప్రపంచ రికార్డు! మళ్లీ ఎవరికీ సాధ్యం కాదేమో! అశ్విన్‌తో పొంచి ఉన్న ప్రమాదమిదే! Bumrah: ‘అలసిపోయాను సర్.. శారీరకంగా, మానసికంగా కూడా! స్లోగా బౌలింగ్ చేయనా?’ -
వాళ్లే టార్గెట్.. పేనియర్‌బైతో యాక్సిస్ బ్యాంక్ జట్టు
మారుమూల ప్రాంతాల్లోనూ రిటైలర్లు, ఇతర కస్టమర్లకు కరెంటు, పొదుపు ఖాతాలను తెరిచే దిశగా ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్, డిజిటల్ సర్వీస్ నెట్వర్క్ పేనియర్‌బై జట్టు కట్టాయి. ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ విధానంతో స్థానిక దుకాణాల ద్వారా కూడా సులువుగా ఖాతాల ను తెరిచేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని యాక్సిస్ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ మునీష్ షర్డా తెలిపారు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని వారు ఆర్థిక సర్వీసుల కోసం ప్రత్యేకంగా బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం ఉండని రీతిలో ఈ విధానాన్ని తీర్చిదిద్దినట్లు వివరించారు. ఖాతాను తెరిచేందుకు పలు పత్రాలు సమర్పించడం, సుదీర్ఘ ప్రక్రియలాంటి బాదరబందీ ఉండదని పేనియర్‌బై వ్యవస్థాపకులు ఆనంద్ కుమార్ బజాజ్ తెలిపారు. తమతో జట్టు కట్టిన స్థానిక చిన్న, మధ్య తరహా సంస్థలకు ఇకపై యాక్సిస్ బ్యాంక్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని, వారు తమ వ్యాపార లావాదేవీలను సమర్ధమంతంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. చదవండి: జనవరిలో మహీంద్రా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. మరో రికార్డ్ క్రియేట్ చేస్తుందా! -
పాక్ బౌలర్‌కు ఖరీదైన కారు గిఫ్ట్‌గా.. ఒక్కదానికే!
పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిదికి అదృష్టం బంగారంలా తగులుతోంది. ఈ ఏడాది షాహిన్ అఫ్రిది మంచి ఫామ్ కనబరుస్తున్న సంగతి తెలిసిందే. అఫ్రిది ప్రదర్శనను మెచ్చుకుంటూ తాను కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న లాహోర్ ఖలందర్స్ అఫ్రిదికి ఖరీదైన స్వాంకీ కార్‌ను గిఫ్ట్‌గా అందజేసింది. ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో (పీఎస్ఎల్) లాహోర్ ఖలందర్స్ చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. పీఎస్ఎల్లో లాహోర్ ఖలందర్స్ అడుగుపెట్టినప్పటి నుంచి వరుసగా నాలుగు సీజన్ల పాటు ఆఖరి స్థానానికే పరిమితమైంది. అయితే షాహిన్ అఫ్రిది కెప్టెన్‌గా అడుగుపెట్టడంతో లాహోర్ ఖలందర్స్ జట్టు తలరాత మారిపోయింది. తన బౌలింగ్‌తో.. కెప్టెన్సీతో జట్టును విజయపథంలో నడిపిన అఫ్రిది లాహోర్ ఖలందర్స్‌ను తొలిసారి చాంపియన్‌గా నిలిపాడు. దీనికి కృతజ్ఞతగా లాహోర్ ఖలందర్స్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. సీఈవో అతీఫ్ రాణా మాట్లాడుతూ.. ''మా కెప్టెన్ షాహిన్ అఫ్రిదికి కృతజ్ఞతలు. ఒక కెప్టెన్‌గా.. ఆటగాడిగా జట్టును ఎంత సమర్థవంతంగా నడిపాడనేది ఆసక్తికరం. కెప్టెన్‌గా ప్రతిభతో పాటు గొప్ప ప్రయత్నాలకు ఫలితం ఎలా లభిస్తుందనడానికి ఇది మంచి ఉదాహరణ. దీనిని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాం'' అంటూ పేర్కొంది. అయితే ఒక్క సీజన్లో జట్టును విజేతగా నిలిపినందుకే కారును గిఫ్ట్‌గా ఇస్తే.. ''మరి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు విజేతగా నిలిపిన రోహిత్ శర్మకు.. సీఎస్కేను నాలుగుసార్లు విజేతగా నిలిపిన ఎంఎస్ ధోనికి ఎన్ని కార్లు గిఫ్ట్‌గా ఇచ్చి ఉంటారు.. కేవలం ఒక్కదానికే ఇంత హడావిడి అవసమరమా'' అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. ఇక పీఎస్ఎల్ ఒక్కటే కాదు.. అంతర్జాతీయ క్రికెట్లోనూ షాహిన్ అఫ్రిది తనదైన ముద్ర వేస్తున్నాడు. ఇటీవలే షాహిన్ అఫ్రిది ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ కొల్లగొట్టాడు. అంతే సర్ గార్ఫీల్డ్ ట్రోపీని అందుకున్న అత్యంత చిన్న వయస్కుడిగా అఫ్రిది పేరు పొందాడు. ఇక 18 ఏళ్ల వయసులో 2022లో పీఎస్ఎల్లో అడుగుపెట్టిన అఫ్రిది ఆరంభం నుంచి లాహోర్ ఖలండర్స్ తరపునే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 36 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు. A token of appreciation to OUR CAPTAIN QALANDAR @iShaheenAfridi . Thank you for being such a good example of how talent combined with great efforts pays off. Keep up the great work!!#DamaDamMast #MainHoonQalandar #Dilse #CaptainQalandar pic.twitter.com/i0bqiOiqzx — Lahore Qalandars (@lahoreqalandars) June 15, 2022 చదవండి: Viral Video: క్రికెట్ చరిత్రలో ఇలాంటి క్యాచ్ చూసి ఉండరనుకుంటా! -
IPL 2022: మీకంత సీన్ లేదు.. 16 కోట్లు పెట్టి ఆటగాడిని కొనేవాళ్లు ఉన్నారా?
IPL- PSL: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజాకు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా గట్టి కౌంటర్ ఇచ్చాడు. ప్రపంచంలోని ఏ ఇతర లీగ్‌లు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు పోటీ ఇవ్వలేని పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో డ్రాఫ్ట్ మోడల్ కాకుండా వేలం నిర్వహించాలన్న రమీజ్ రాజా.. అలా అయితే ఐపీఎల్ సత్తా ఏమిటో తెలుస్తుందని ప్రగల్బాలు పలికాడు. ఈ మేరకు అతడు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ఆర్థికంగా మనం(పాకిస్తాన్ క్రికెట్) మరింత స్వతంత్రంగా మారాలంటే కొత్త ఆస్తులు కూడగట్టుకోవాలి. ప్రస్తుతం మనకు పీఎస్ఎల్, ఐసీసీ నిధులు తప్ప మరే ఇతర ఆదాయ మార్గాలు లేవు. వచ్చే ఏడాది నుంచి మనం ఆక్షన్ మోడల్(వేలం)అనుసరించాలి. మన ఎకానమీ పెరిగితే గౌరవం కూడా పెరుగుతుంది. అప్పుడు పీఎస్ఎల్ను కాదని ఐపీఎల్ ఎవరు ఆడతారో చూద్దాం’’ అని వ్యాఖ్యానించాడు. ఇందుకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన ఆకాశ్ చోప్రా.. రమీజ్ రాజాకు చురకలు అంటించాడు. ‘‘ఒకవేళ మీరు డ్రాఫ్ట్ సిస్టమ్ కాదని వేలానికి వెళ్లినా మీరు చెప్పింది జరుగదు. పీఎస్ఎల్లో 16 కోట్లకు అమ్ముడు పోయే ఆటగాడిని మనం చూడలేము. మీరు అన్న మార్కెట్ శక్తులే దీనిని ఆమోదించవు. పీఎస్ఎల్, బీబీఎల్, ది హండ్రెడ్, సీపీఎల్ ఏదీ కూడా ఐపీఎల్‌కు పోటీ ఇవ్వలేదు. ఈ పోలికలు అనవసరం’’ అని కౌంటర్ వేశాడు. కాగా పీఎస్ఎల్లో డ్రాఫ్ట్ సిస్టమ్‌లో భాగంగా ఒక్కో ఫ్రాంఛైజీ 16 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటుంది. వీటిలో ప్లాటినమ్, డైమండ్, గోల్డ్, సిల్వర్, ఎమర్జింగ్, సప్లిమెంటరీ అనే కేటగిరీలు ఉంటాయి. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2021 మినీ వేలంలో భాగంగా రాజస్తాన్ రాయల్స్ దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్‌ను 16.5 కోట్ల రూపాయలు వెచ్చించి అత్యధిర ధరకు కొనుగోలు చేసింది. చదవండి: PAK vs AUS: 23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్.. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటర్; సీన్ రిపీట్ -
మూడు సిక్సర్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. ఫలితం సూపర్ ఓవర్
పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిది బంతితోనే కాదు బ్యాట్‌తోను సత్తా చాటగలనని నిరూపించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు దిగిన అఫ్రిది ఆఖరి ఓవర్లో మూడు సిక్సర్లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. దీంతో ఫలితం సూపర్ ఓవర్ ద్వారా వచ్చింది. కానీ అఫ్రిదిని దురదృష్టం వెంటాడింది. సూపర్ ఓవర్లో తన జట్టు పరాజయం పాలైంది. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్ 2022)లో భాగంగా పెషావర్ జాల్మి, లాహోర్ ఖలందర్స్ మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. హైదర్ అలీ 35, షోయబ్ మాలిక్ 32 పరుగులు సాధించారు. చదవండి: ఎంతైనా పాక్ క్రికెటర్ కదా.. ఆ మాత్రం ఉండాలి అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ ఖలందర్స్ 96 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మహ్మద్ హఫీజ్‌తో కలిసి కెప్టెన్ షాహిన్ అఫ్రిది కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఏడో వికెట్‌కు ఈ ఇద్దరు కలిసి 33 పరుగులు జోడించారు. కాగా 12 బంతుల్లో 30 పరుగుల చేయాల్సిన దశలో హఫీజ్ ఔటయ్యాడు. 19వ ఓవర్లో షాహిన్ ఒక ఫోర్ సహా మొత్తం ఆరు పరుగులు రాబట్టడంతో.. లాహోర్ ఖలందర్స్‌కు ఆఖరి ఓవర్లో విజయానికి 23 పరుగులు కావాలి. కాగా మహ్మద్ ఉమర్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతి వైడ్ వెళ్లింది. మరుసటి బంతిని బౌండరీ తరలించాడు. రెండో బంతిని అఫ్రిది సిక్సర్ కొట్టడంతో 4 బంతుల్లో 13 పరుగులుగా మారిపోయింది. మూడో బంతిని లాంగాఫ్ దిశగా భారీ సిక్సర్‌గా మలవడంతో రెండు బంతుల్లో ఏడు పరుగులు కావాలి. ఐదో బంతికి పరుగు రాలేదు. ఆఖరి బంతికి సిక్స్ కొడితే డ్రా.. లేదంటే ఓటమి. ఈ దశలో అఫ్రిది డీప్ మిడ్‌వికెట్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. ఫలితం సూపర్ ఓవర్‌కు దారి తీసింది. కాగా 20 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన షాహిన్.. సెలబ్రేషన్స్‌లో భాగంగా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిని గుర్తుచేస్తూ ఫోజివ్వడం వైరల్‌గా మారింది. ఇక సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ ఐదు పరుగులు మాత్రమే చేయగలిగింది. పెషావర్ విజయానికి ఆరు పరుగులు మాత్రమే అవసరం. షోయబ్ మాలిక్ తొలి రెండు బంతులను ఫోర్‌గా మలచడంతో పెషావర్ జాల్మి విజయాన్ని అందుకుంది. చదవండి: నువ్వు ప్రపంచానికి కింగ్ కోహ్లివి కావొచ్చు.. కానీ నాకు మాత్రం THAT over. #HBLPSL7 l #LevelHai l #LQvPZ pic.twitter.com/o8AYrxjmNg — PakistanSuperLeague (@thePSLt20) February 21, 2022 -
ఒకరినొకరు భయంకరంగా గుద్దుకున్నారు..
పాకిస్తాన్ సూపర్‌లీగ్(పీఎస్ఎల్ 2022)లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్యాచ్ అందుకునే క్రమంలో ఆటగాళ్లు ఒకరినొకరు భయకరంగా గుద్దుకున్నప్పటికి తమ లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు. పెషావర్ జాల్మీ, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్‌లో ఇది జరిగింది. చేజింగ్‌కు దిగిన పెషావర్ జాల్మి ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే కమ్రాన్ అక్మల్ భారీ షాట్‌కు యత్నించాడు. అయితే బ్యాట్‌కు సరైన దిశలో తగలని బంతి ఫైన్‌లెగ్ దిశగా హైట్లోకి వెళ్లింది. చదవండి: 'అది నీ తప్పు కాదు'.. ఇషాన్ కిషన్‌తో మెసేజ్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఒకవైపు నుంచి.. షాహనావాజ్ దహాని మరో ఎండ్ నుంచి క్యాచ్ కోసం పరిగెత్తారు. ఇద్దరు ఎదురుఎదురుగా వచ్చి ఒకరినొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. అనవసరంగా క్యాచ్ మిస్ అయిందని మనం అనుకునేలోపే అద్భుతం జరిగింది. కిందపడుతూనే దహాని ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంకేముందు సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి. మహ్మద్ రిజ్వాన్ వచ్చి సారీ చెప్పడం.. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకోవడం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముల్తాన్ సుల్తాన్స్ 42 పరుగుల తేడాతో పెషావర్ జాల్మీపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. మసూద్ 68, రిజ్వాన్ 34, టిమ్ డేవిడ్ 34 రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పెషావర్ జాల్మీ 19.3 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. షోయబ్ మాలిక్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Virat Kohli: సెంచరీ చేస్తాడనుకుంటే డకౌట్ల రికార్డుతో మెరిశాడు 😄#HBLPSL7 l #LevelHai l #MSvPZ pic.twitter.com/3caWheCXaK — PakistanSuperLeague (@thePSLt20) February 10, 2022 -
ఔటయ్యాడని తెగ ఫీలైపోయింది.. ఆరా తీస్తే
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో(పీఎస్ఎల్) ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ బెన్ కటింగ్ పీఎస్ఎల్లో పెషావర్ జాల్మీ తరపున ఆడుతున్నాడు. కరాచీ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కటింగ్.. కరాచీ బౌలర్ మహ్మద్ నబీ వేసిన బంతిని డిఫెన్స్ ఆడాలనుకున్నాడు. కానీ బంతి ప్యాడ్లను తాకి పక్కకు వెళ్లింది. ఇంతలో వెనకాల వికెట్లపై ఉన్న బెయిల్స్ కింద పడిపోయాయి. బెన్ కటింగ్ తన కాళ్లతో వికెట్లను తాకాడేమోనని ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అప్పీల్ చేశారు. చదవండి: Under-19 Worldcup: అదరగొట్టిన భారత సంతతి కుర్రాడు.. ఎవరీ నివేథన్ రాధాకృష్ణన్ ఇదే సమయంలో పీఎస్ఎల్లో యాంకర్‌గా వ్యవహరిస్తున్న ఎరిన్ హాలండ్ ఒక వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. బెన్ కటింగ్ ఔట్ అయ్యాడని తలకు చేతులు పెట్టి ''ఎంత పని జరిగింది'' అంటూ తెగ ఫీలయిపోయింది. అయితే కటింగ్ ఔట్ కాలేదని తెలియడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని నవ్వడం మొదలుపెట్టింది. ఏంట్రా ఇది కటింగ్ ఔటైతే యాంకరమ్మ ఎందుకు ఫీలయ్యిందని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఆ యాంకర్ ఎవరో కాదు.. స్వయానా బెన్ కటింగ్ అర్థాంగి. ఆమె ఇచ్చిన హావభావాలు అక్కడి కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో షేర్ చేయడం.. అది కాస్త వైరల్‌గా మారిపోవడం జరిగిపోయింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. వాస్తవానికి బెయిల్స్ పడిపోవడంలో బెన్ కటింగ్ పాత్రేమి లేదు. మహ్మద్ నబీ డెలివరీ వేయగానే.. అది కటింగ్ ప్యాడ్లను తాకి వెనక్కి వెళ్లింది. ఇదే సమయంలో కటింగ్ కాస్త వెనక్కి జరగడం.. వికెట్ కీపర్ మహ్మద్ కమ్రాన్ అక్మల్ కూడా బంతిని అందుకునే ప్రయత్నంలో బెయిల్స్‌కు దగ్గరగా వచ్చాడు. పొరపాటున కమ్రాన్ చేతి బెయిల్స్‌ను తాకాయి. ఇది తెలియని మిగతా ఆటగాళ్లు అప్పీల్‌కు వెళ్లగా.. కమ్రాన్ అసలు విషయం చెప్పాడు. దీంతో జట్టు తమ అప్పీల్‌ను వెనక్కి తీసుకుంది. చదవండి: Under-19 World Cup: గ్రౌండ్లోకి రావడానికి నానాతంటాలు.. అంత కష్టమెందుకు ఈ మ్యాచ్‌లో బెన్ కటింగ్ 22 బంతుల్లో 24 పరుగులు చేశాడు.ఇక మ్యాచ్ లో పెషావర్ జాల్మీ 9 పరుగుల తేడాతో కరాచీ కింగ్స్‌పై విజయం సాధించింది. పెషావర్‌కు సీజన్లో రెండో విజయం కాగా.. కరాచీ కింగ్స్‌కు వరుసగా నాలుగో ఓటమి కావడం విశేషం. It’s alright, Erin 🤗 #HBLPSL7 l #LevelHai l #KKvPZ @erinvholland pic.twitter.com/Rorv0FGVcG — PakistanSuperLeague (@thePSLt20) February 4, 2022 -
ఇంత దరిద్రమైన ఎంట్రీ ఎప్పుడు చూడలేదు..
4 ఓవర్లలోనే 67 పరుగులు.. అబ్బా ఏం ఆడాడు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకుంటే 67 పరుగులు వచ్చింది బ్యాటింగ్‌లో కాదు.. బౌలింగ్‌లో. ఇంతకీ ఎవరా క్రికెటర్ అనుకుంటున్నారా.. పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది అఫ్రిది పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్( పీఎస్ఎల్లో) అడుగుపెట్టాడు. పీఎస్ఎల్లో క్వెటా గ్లాడియేటర్స్ తరపున ఆడుతున్న అఫ్రిది ఇస్లామాబాద్ యునైటెడ్‌తో మ్యాచ్ ద్వారా ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడాడు. అయితే అఫ్రిదికి తన ఎంట్రీ మ్యాచ్ ఒక పీడకలగా మిగిలిపోయింది. బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసిన అఫ్రిది 67 పరుగులిచ్చి ఒకే ఒక్క వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లోనైనా ఇరగదీశాడా అనుకుంటే అది లేదు. 8 బంతులు మింగి 4 పరుగులు చేసి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. చదవండి: PSL 2022: ఫఖర్ జమాన్ తొందరపడ్డావు.. కాస్త ఆగుంటే బాగుండేది దీంతో అభిమానులు అఫ్రిదిని ట్రోల్ చేస్తూ ఒక ఆట ఆడుకున్నారు. ''అబ్బా ఏం ఎంట్రీ ఇచ్చావ్.. మతి పోయింది.. అఫ్రిది క్రికెట్ ఆడడం ఆపేయ్.. నీ వయసువాళ్లు కామెంటేటరీ చెప్తున్నారు.. ఈ మధ్య కాలంలో ఇంత దరిద్రమైన ఎంట్రీ చూడలేదు'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ యునైటెడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కొలిన్ మున్రో(39 బంతుల్లో 72, 3 ఫోర్లు, 5 సిక్సర్లు), అజమ్ ఖాన్(35 బంతుల్లో 65, 2 ఫోర్లు, 6 సిక్సర్లు), పాల్ స్టిర్లింగ్(28 బంతుల్లో 58, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన క్వెటా గ్లాడియేటర్స్ 19.3 ఓవర్లలో 186 పరుగులుకు ఆలౌటైంది. ఆషన్ అలీ 50, మహ్మద్ నవాజ్ 47 పరుగులు చేశారు. And again! 🙌🏼 #HBLPSL7 l #LevelHai l #QGvIU pic.twitter.com/DQju1fJuDi — PakistanSuperLeague (@thePSLt20) February 3, 2022 It’s on!!! Munro delivers the 3️⃣rd six to @SAfridiOfficial 🔥 #HBLPSL7 l #LevelHai l #QGvIU pic.twitter.com/KbdvbD1QL7 — PakistanSuperLeague (@thePSLt20) February 3, 2022 -
ఫఖర్ జమాన్ తొందరపడ్డావు.. కాస్త ఆగుంటే బాగుండేది
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో(పీఎస్ఎల్ 2022) చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. లాహోర్ ఖలండర్స్ క్రికెటర్ ఫఖర్ జమాన్ తనను తానే ట్రోల్ చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. పెషావర్ జాల్మి ఇన్నింగ్స్ సమయంలో ఫఖర్ జమాన్ రెండుసార్లు సులువైన క్యాచ్‌లు జారవిడిచాడు. మొదటిసారి సహచర క్రికెటర్ మహ్మద్ హఫీజ్‌తో జరిగిన మిస్ కమ్యూనికేషన్ వల్ల ఫఖర్ క్యాచ్ జారవిడిచాడు. దీంతో హైదర్ అలీ బతికిపోయాడు. రెండోసారి షెర్ఫెన్ రూథర్‌ఫర్డ్ మిడాఫ్ దిశగా షాట్ ఆడాడు. ఈసారి కూడా జమాన్ క్యాచ్ తీసుకోవడంలో విఫలమయ్యాడు. కానీ తర్వాతి ఓవర్లోనే రూథర్‌ఫర్డ్‌ను మెరుపువేగంతో రనౌట్ చేసి తన పొరపాటును కవర్ చేసుకున్నాడు. అయితే అంతకముందు రెండు సులువైన క్యాచ్‌లు వదిలేసినందుకు ట్విటర్లో తనను తానే ట్రోల్ చేసుకుంటూ ఫోటోను షేర్ చేశాడు. ఫఖర్ చేసిన పనిపై క్రికెట్ ఫ్యాన్స్ వినూత్నంగా స్పందించారు. ఫఖర్ జమాన్ తొందరపడ్డావు.. కాస్త ఆగుంటే బాగుండేది.. అనవసరంగా ట్రోల్ చేసుకున్నావు.. అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లాహోర్ ఖలండర్స్ 20 పరుగుల తేడాతో పెషావర్ జాల్మిపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్(66), షఫీక్(41 రాణించగా.. ఆఖర్లో మహ్మద్ హఫీజ్(19 బంతుల్లో 37 నాటౌట్), రషీద్ ఖాన్(8 బంతుల్లో 22 నాటౌట్) మెరిశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పెషావర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 170 పరుగుల వద్దే ఆగిపోయింది. Haider Ali’s innings is cut short. @lahoreqalandars needed this! #HBLPSL7 l #LevelHai l #PZvLQ pic.twitter.com/BNWlmytTCs — PakistanSuperLeague (@thePSLt20) February 2, 2022 #NewProfilePic pic.twitter.com/6ThU7TqBpj — Fakhar Zaman (@FakharZamanLive) February 2, 2022 -
'నా కూతురు కోరిక.. అందుకే వింత సెలబ్రేషన్'
పాకిస్తాన్ సూపర్‌లీగ్(పీఎస్ఎల్)లో ఇస్లామాబాద్ యునైటెడ్స్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ బ్యాట్స్‌మన్ రిలీ రోసౌ వింత సెలబ్రేషన్స్‌తో మెరవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో రోసౌ హాఫ్ సెంచరీ పూర్తి చేశాకా.. పెవిలియన్‌వైపు చూస్తూ.. వెనక్కి తిరిగి నడుము కింది భాగాన్ని ఊపుతూ కనిపించాడు. ఇదేం సెలబ్రేషన్ అంటూ చూసినవాళ్లు తలలు పట్టుకున్నారు. తాజాగా దీనిపై రోసౌ క్లారిటీ ఇచ్చాడు. ''నా ఏడేళ్ల కూతురు కోరిక ఇది.. ఫిప్టీ కొట్టగానే ఈ విధంగా సిగ్నేచర్ ఇస్తానని నా చిట్టితల్లికి మాట ఇచ్చా.. అందుకే ఇలా చేశా'' అంటూ ట్విటర్లో పేర్కొన్నాడు. చదవండి: IPL 2022 Auction: మెగా వేలానికి ముందు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అంబటి రాయుడు ఈ మ్యాచ్‌లో రోసౌ 35 బంతుల్లో 67 పరుగులు నాటౌట్‌గా నిలిచి ముల్తాన్ సుల్తాన్ భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. అతని దెబ్బకు ముల్తాన్ సుల్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. మిగతావారిలో టిమ్ డేవిడ్(71), మసూద్ 43 పరుగులు చేశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ 19.4 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ముల్తాన్ సుల్తాన్స్ 20 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. చదవండి: IPL 2022 Auction: ధోని దృష్టికి జూనియర్ 'మలింగ'.. సీఎస్కే దక్కించుకోనుందా! .@Rileerr ki 50 celebration ka #LevelHai #HBLPSL7 l #LevelHai l #MSvIU pic.twitter.com/g4D060FC2s — PakistanSuperLeague (@thePSLt20) February 1, 2022 -
రెండుసార్లు ఆటగాడికి లైఫ్.. తొలిసారి టైటిల్ అందించాడు
అబుదాబి: అబుదాబి వేదికగా జరిగిన పాకిస్తాన్ సూపర్‌లీగ్(పీఎస్ఎల్-6) టైటిల్‌ను ముల్తాన్ సుల్తాన్స్ చేజెక్కించుకుంది. పెషావర్ జాల్మితో జరిగిన ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్ 47 పరుగులతో విజయం సాధించి తొలిసారి పీఎస్ఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. కాగా మ్యాచ్‌లో రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మక్సూద్ 35 బంతుల్లో 65 పరుగులు నాటౌట్‌గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతనికి రోసౌ 50 పరుగులతో ఆకట్టుకోగా.. మసూద్ 37, రిజ్వాన్ 30 పరుగులతో సహకరించారు. అనంతరం భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్ జాల్మి ఏదశలోనూ ఆకట్టుకోలేకపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఇమ్రాన్ తాహిర్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. పెషావర్ బ్యాటింగ్‌లో షోయబ్ మాలిక్ 48 పరుగలతో రాణించగా.. మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక మక్సూద్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను ఎగురేసుకుపోవడం విశేషం. గత నవంబర్‌లో కరోనా కారణంగా అర్థంతరంగా రద్దు చేసిన పీఎస్ఎల్-6ను అబుదాబి వేదికగా రీషెడ్యూల్ చేసి మ్యాచ్‌లను నిర్వహించిన సంగతి తెలిసిందే. చదవండి: PSL: ఒక్క ఓవర్లో 33 పరుగులు.. దెబ్బకు ప్లేఆఫ్ బెర్త్ -
ఒక్క ఓవర్లో 33 పరుగులు.. దెబ్బకు ప్లేఆఫ్ బెర్త్
అబుదాబి: పాకిస్తాన్ సూపర్‌లీగ్(పీఎస్ఎల్-6)లో శనివారం కరాచీ కింగ్స్, క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కరాచీ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్ వరకు ఆ జట్టు స్కోరు 5 వికెట్ల నష్టానికి 136గా ఉంది. కానీ తర్వాతి ఓవర్ ముగిసేసరికి జట్టు స్కోరు 169గా మారింది. దీనికి కారణం.. కరాచీ కింగ్స్ ఆటగాడు దానిష్ ఆజిజ్ పవర్ హిట్టింగ్. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఆజిజ్ 4,6,6,6,6(నో బాల్),2,2 తో విధ్వంసం సృష్టించాడు. అతని ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. దానిష్ ఆజిజ్ (13 బంతుల్లో 45 పరుగులు; 5 సిక్సర్లు, 2 ఫోర్లు)తో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షార్జీల్ ఖాన్ 45, వాల్టన్ 34* పరుగులతో అతనికి సహకరించారు. అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెటా గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులకే పరిమితమై 14 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కాగా ఈ విజయంతో కరాచీ కింగ్స్ ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోగా.. గ్లాడియేటర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్ 10 పాయింట్లతో సమానంగా ఉన్నా.. కరాచీతో పోలిస్తే నెట్ రన్‌రేట్ మెరుగ్గా లేకపోవడంతో లాహోర్ ఖలందర్స్ భారంగా టోర్నీని వీడాల్సి వచ్చింది. చదవండి: వార్న్‌కు స్పిన్ పాఠాలు.. నవ్వాపుకోలేకపోయిన సెహ్వాగ్ పీఎస్ఎల్: ఉస్మాన్ ఖవాజా మెరుపు సెంచరీ.. 11 ఏళ్ల రికార్డు బద్దలు What does @idanishaziz think of his score? @MZahed89 asked in our #AwamiPressConference #HBLPSL6 I #QGvKK I #MatchDikhao pic.twitter.com/AR2YDKtweL — PakistanSuperLeague (@thePSLt20) June 19, 2021 -
ఉస్మాన్ ఖవాజా మెరుపు సెంచరీ.. 11 ఏళ్ల రికార్డు బద్దలు
అబుదాబి: పాకిస్తాన్ సూపర్‌లీగ్( పీఎస్ఎల్-6)లో భాగంగా గురువారం పెషావర్ జాల్మి, ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్‌ను విజయం వరించింది. ఇస్లామాబాద్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా మెరుపు సెంచరీకి తోడు ఆసిఫ్ అలీ 14 బంతుల్లోనే 43 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. వీరికి తోడు కొలిన్ మున్రో 48, బ్రాండన్ కింగ్ 46 పరుగులతో రాణించడంతో ఇస్లామాబాద్ యునైటెడ్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మి ధీటుగానే బదులిచ్చింది. నిర్ణీత 20 ఓవర్ల ఆటలో 6 వికెట్లు నష్టపోయి 232 పరుగులు చేసి 15 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. షోయబ్ మాలిక్ 68, కమ్రాన్ అక్మల్ 53 పరుగులతో రాణించారు. ఇక పీఎస్ఎల్ చరిత్రలో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 200కు పైగా పరుగులు నమోదవ్వడం 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే. 2010లో కరాచీ డాల్ఫిన్స్, లాహోర్ ఈగల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 200కు పైగా స్కోర్లు నమోదు అయ్యాయి. ఈ విజయంతో ఇస్లామాబాద్ యునైటెడ్ 14 పాయింట్లతో టాప్ స్థానానికి ఎగబాకగా.. పెషావర్ జాల్మి 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. చదవండి: PSL: ఆటగాళ్ల బూతు పురాణం.. వీడియో -
PSL: ఆటగాళ్ల బూతు పురాణం.. వీడియో
అబుదాబి: పాకిస్తాన్ సూపర్‌లీగ్(పీఎస్ఎల్-6)లో ఆటగాళ్ల మధ్య బూతు పురాణం చోటుచేసుకుంది. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిది పరస్పరం ఒకరినొకరు దూషించుకున్నారు. మంగళవారం క్వెటా గ్లాడియేటర్స్, లాహోర్ ఖలండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. క్వెటా గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో షాహిన్ వేసిన బంతి సర్ఫరాజ్ హెల్మెట్‌ను తాకుతూ థర్డ్‌మన్ దిశగా వెళ్లింది. అప్పటికే అంపైర్ నోబాల్ అని ప్రకటించగా.. సర్ఫరాజ్ పరుగు తీసి నాన్‌స్ట్రైక్ ఎండ్‌కు చేరుకున్నాడు. షాహిన్ అఫ్రిదిని ఉద్దేశించి.. '' నాకే బౌన్సర్ వేస్తావా..'' అన్నట్లుగా కోపంతో చూశాడు. దీంతో బంతి వేయడానికి సిద్ధమవుతున్న అఫ్రిది వెనక్కి వచ్చి సర్ఫరాజ్‌ను తిడుతూ ముందుకు దూసుకొచ్చాడు. అయితే ఇంతలో లాహోర్ కెప్టెన్ సోహైల్ అక్తర్, సీనియర్ ఆటగాడు మహ్మద్ హపీజ్ వచ్చి వారిద్దరిని విడదీశారు. ఫీల్డ్ అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్దరికి సర్ది చెప్పి అక్కడినుంచి పంపించేశారు. ఓవర్ ముగిసిన అనంతరం హఫీజ్ సర్ఫారజ్ దగ్గరికి వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఒక సీనియర్ ఆటగాడిపై నియంత్రణ కోల్పోయి అఫ్రిది ఇలా చేయడంపై అభిమానుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్వెటా గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 158 పరుగులు చేసింది. గ్లాడియేటర్స్ బ్యాటింగ్‌లో వెథర్లాండ్ 48 పరుగులతో ఆకట్టుకోగా.. కెప్టెన్ సర్ఫరాజ 34, అజమ్ ఖాన్ 33 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ ఖలందర్స్ 18 ఓవర్లలో140 పరుగులకే ఆలౌట్ అయి 18 పరుగులతో ఓటమిని చవిచూసింది. చదవండి: ప్లీజ్ ఇలాంటివి వద్దు.. మంచినీరు మాత్రమే తాగండి: రొనాల్డో ఆస్పత్రి పాలైన డుప్లెసిస్ Exchange Of Words Between Sarfaraz Ahmed & Shaheen Shah Afridi#HBLPSL6 #PSL6 #qgvslq pic.twitter.com/PW1rV8E8UO — Cricket Posting (@Cricket_Posting) June 15, 2021 -
ఆస్పత్రి పాలైన డుప్లెసిస్
అబుదాబి: దక్షిణాఫ్రికా సీనియర్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ గాయపడ్డాడు. బౌండరీ లైన్ దగ్గర మరో ఆటగాడిని గట్టిగా ఢీ కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. అబుదాబి షేక్ జాయెద్ స్టేడియంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో డు ప్లెసిస్ కళ్లు తిరిగి పడిపోగా.. అతన్ని ఆస్పత్రికి తరలించారు. పాకిస్థాన్ సూపర్‌లీగ్ టోర్నీలో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మి జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. బంతిని బౌండరీ వద్ద డైవ్‌చేసి అడ్డుకునే క్రమంలో మరో ఆటగాడు మహమ్మద్ హస్నెయిన్ను ఢీ కొట్టాడు. హసనెయిన్ మోకాలి చిప్ప బలంగా తాకడంతో డు ప్లెసిస్ కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో అందరిలో టెన్షన్ నెలకొంది. ఆ వెంటనే వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. BREAKING - Faf du Plessis has been sent to hospital for a check-up after he collided with Mohammad Hasnain while fielding in PSL game.#FafduPlessis #PSL pic.twitter.com/QGMnvCCPG6 — AIPWA@ANI (@AIPWAANI5) June 12, 2021 డు ప్లెసిస్ గాయపడ్డ సంగతి తెలిసిన అభిమానులు.. అతను త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయిన డు ప్లెసిస్.. తిరిగి హోటల్ రూమ్‌కి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో డు ప్లెసిస్ జట్టు క్వెట్టా గ్లాడియేటర్స్ ఓటమి పాలైంది. ఇక శనివారమే డెన్మార్క్ ఫిన్లాండ్ ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా క్రిస్టియన్ ఎరిక్సెన్ మైదానంలోనే కుప్పకూలి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. చదవండి: కుప్పకూలిన ఫుట్‌బాల్ ప్లేయర్ -
హెల్మెట్‌కు తాకిన బంతి.. స్ట్రెచర్‌పై వెళ్లిన రసెల్
అబుదాబి: విండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్.. తన పవర్ హిట్టింగ్తో ఎంతోమంది బౌలర్లకు చుక్కలు చూపించాడు. బంతిని బలంగా బాదే రసెల్‌కు షార్ట్‌బాల్ ఆడడంలో కాస్త వీక్నెస్ ఉంది. తాజాగా అదే షార్ట్‌బాల్ అతని హెల్మెట్‌కు బలంగా తాకడం.. స్ట్రెచర్‌పై మైదానం వీడేలా చేసింది. వివరాలు.. శుక్రవారం క్వెటా గ్లాడియేటర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. అప్పటికే రెండు సిక్సర్లతో దూకుడు మీద కనిపించిన రసెల్‌కు ఇన్నింగ్స్ 14వ ఓవర్లో మహ్మద్ ముసా షార్ట్‌బాల్ వేశాడు. బంతి బౌన్స్ అయి రసెల్ హెల్మెట్‌కు బలంగా తాకింది. దాంతో తన హెల్మెట్ తీసిన రసెల్ గాయం తీవ్రతను చూసుకున్నాడు. ఫిజియో వచ్చి పరీక్షించి ఏం కాలేదు అన్నట్లుగా చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అదే తరహాలో వేసిన షార్ట్‌బాల్‌ను ఆడే షాట్ ఆడే ప్రయత్నంలో మహ్మద్ వసీమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ దశలో తల పట్టేయడంతో రసెల్ అలానే కింద కూర్చుండిపోయాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది స్ట్రెచర్ తీసుకొచ్చి రసెల్‌ను దానిపై పడుకోబెట్టి తీసుకెళ్లారు. కాగా రసెల్ గాయం తీవ్రత గురించి ఎక్స్‌రే తర్వాతే తెలియనుంది. దీనికి సంబంధించిన వీడియోనూ పీఎస్ఎల్ తన ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. అయితే రసెల్ గాయంపై అభిమానులు వినూత్నంగా స్పందించారు.'' రసెల్ ఇది ఐపీఎల్ కాదు.. పీఎస్ఎల్.. నువ్వు ఇంకా ఆ మాయలోనే ఉన్నట్లున్నావు..'' అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్వెటా గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. గ్లాడియేటర్స్ బ్యాటింగ్‌లో వెదర్లాండ్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా..అజమ్ ఖాన్ 26 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ 10 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించి 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కొలిన్ మున్రో (36 బంతుల్లోనే 90 పరుగులు; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. ఉస్మాన్ ఖవాజా 41 పరుగులతో అతనికి సహకరించాడు.ఈ విజయంతో ఇస్లామాబాద్ యునైటెడ్ 6 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా.. వరుసగా నాలుగో పరాజయంతో క్వెటా ఆఖరి స్థానంలో నిలిచింది. లాహోర్ ఖలాండర్స్ 10 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. చదవండి: అవసరమా.. ఇలాంటి ప్లేయర్స్ మనకు! 'బయోబబుల్ నా మెంటల్‌హెల్త్‌ను దెబ్బతీస్తుంది' One must always witness a Dre Russ show. This time cut short by @iMusaKhan 🪄 #MatchDikhao l #HBLPSL6 l #QGvIU pic.twitter.com/pemprmMbCj — PakistanSuperLeague (@thePSLt20) June 11, 2021 -
రషీద్ పాంచ్ పటాకా.. టాప్‌లో లాహోర్ ఖలందర్స్
అబుదాబి: యూఏఈ వేదికగా జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్ 6)లో లాహోర్ ఖలందర్స్ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఇస్లామాబాద్ యునైటెడ్‌పై బుధవారం థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసిన లాహోర్ గురువారం పెషావర్ జాల్మిపై 10 పరుగుల తేడాతో విజయం సాధించి మొత్తంగా 6 మ్యాచ్‌లాడి 5 విజయాలు.. ఒక ఓటమితో 10 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. గత మ్యాచ్‌లో సూపర్ బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈసారి బౌలింగ్‌లో అదరగొట్టాడు. మ్యాచ్‌లో ఐదు కీలక వికెట్లు తీసి మరోసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. పీఎస్ఎల్లో ఐదు వికెట్లు తీయడం రషీద్‌కు ఇదే తొలిసారి. రషీద్ ఐదు వికెట్లు తీసిన వీడియోనూ పీఎస్ఎల్ తన ట్విటర్లో షేర్ చేసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ 25 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో టిమ్ డేవిడ్ (36 బంతుల్లో 64, 3 ఫోర్లు, 5 సిక్సర్లు), బెన్ డంక్(33 బంతుల్లో 48, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా.. చివర్లో జేమ్స్ ఫాల్కనర్ 7 బంతుల్లో 22 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 160 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. షోయబ్ మాలిక్ 73 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతావారు ఎవరు పెద్దగా రాణించలేదు. చదవండి: దంచికొట్టిన రషీద్ ఖాన్.. ఆఖరి బంతికి విజయం 5️⃣ 🌟@rashidkhan_19 posted his career best figures in franchise cricket on a magical night of bowling. #HBLPSL6 | #MatchDikhao | #PZvLQ pic.twitter.com/rdkNi40jyB — PakistanSuperLeague (@thePSLt20) June 10, 2021 -
కోవిడ్‌కు ఇష్టమైన వ్యక్తులు ఉండరు బాస్: స్టెయిన్
న్యూఢిల్లీ: ఐపీఎల్-14 సీజన్ నిరవధికంగా వాయిదా పడటంతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. కొందరు ఐపీఎల్ వాయిదాను సమర్థిస్తుంటే మరికొంతమంది మాత్రం మజాను మిస్సయ్యామని ఫీలవుతున్నారు. ఇలా మధ్యలో ఆగిపోవడంతో తమ జట్లు టైటిల్ గెలిచే చాన్స్‌ను మధ్యలోనే కోల్పోయామని మీమ్స్ ద్వారా ఊదరగొడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎవరికి తోచింది వారు పోస్టులు పెడుతూ ఆడేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టైయిన్ను ట్యాగ్ చేసి మరీ ప్రశ్నలు సంధించాడు. 2020 ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన స్టైయిన్.. ఈఏడాది మాత్రం దూరంగా ఉన్నాడు. కానీ 2021 సీజన్ పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్ఎల్)లో మాత్రం పాల్గొన్నాడు. కాగా, మార్చి నెలలో పీఎస్ఎల్ కరోనా కారణంగా ఆగిపోవడంతో గత ఐపీఎల్ సీజన్‌ను కోడ్ చేస్తూ ఒక అభిమాని ట్వీట్ చేశాడు. స్టెయిన్ ఇప్పుడు చెప్పు పీఎస్ఎల్-ఐపీఎల్లో ఏది ఉత్తమం. ఏ టోర్నీని సమర్ధవంతంగా నిర్వహించారో వాస్తవం తెలుసుకో స్టెయిన్. అందుకు తగినంత సమయం కూడా ఉంది అని మార్చి 4వ తేదీన ట్వీట్ చేశాడు. అప్పుడు కేవలం నువ్వు చాలా సరదా మనిషివి అంటూ స్పందించిన స్టెయిన్.. తాజాగా ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత మళ్లీ ట్వీట్ చేశాడు. కోవిడ్ లెక్కచేయదు.. దానికి ఎవరూ ఇష్టమైన వ్యక్తులు ఉండరు’ అని ట్వీట్ చేశాడు. సదరు అభిమానికి సమయం చూసుకుని మరీ రిప్లై ఇచ్చినట్లు స్టెయిన్‌కు మరొకసారి ట్రోలింగ్ బారిన పడే అవకాశం లేకపోలేదు. More time at hand for @DaleSteyn62 to figure out which of PSL or IPL is better. Perhaps also accounting for the fact that once started, the IPL managed to finish! https://t.co/pTKKfAX3W9 — Aashish Chandorkar (@c_aashish) March 4, 2021 More time at hand for @DaleSteyn62 to figure out which of PSL or IPL is better. Perhaps also accounting for the fact that once started, the IPL managed to finish! https://t.co/pTKKfAX3W9 — Aashish Chandorkar (@c_aashish) March 4, 2021 Covid don’t care. It has no favorites. Get well to those sick and hopefully everyone else will get home safe and in good health. — Dale Steyn (@DaleSteyn62) May 4, 2021 -
ఐదేళ్ల తర్వాత క్రికెటర్ రీఎంట్రీ
కరాచీ: వివాదాస్పద క్రికెటర్ షార్జీల్ ఖాన్ ఐదేళ్ల తర్వాత పాకిస్తాన్ టి20 జట్టులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వేలతో జరిగే సిరీస్‌కు ఎంపికయ్యాడు. 2017లో పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా షార్జీల్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అతనిపై ఐదేళ్ల నిషేధం విధించారు. 2019లో షార్జీల్ భేషరతు క్షమాపణలు చెప్పడంతో పాక్ బోర్డు నిషేధాన్ని ఎత్తి వేసింది. నిషేధం తొలిగాక షార్జీల్ జాతీయ టి20 కప్‌లో, పాక్ సూపర్ లీగ్‌లో నిలకడగా రాణించి జట్టులోకి వచ్చాడు. ఫాలోఆన్‌లో జింబాబ్వే అబుదాబి: అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే క్రికెట్ జట్టు ఎదురీదుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 50/0తో ఆట మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే 287 పరుగులవద్ద ఆలౌటైంది. సికిందర్ రజా (85; 7 ఫోర్లు, సిక్స్), ప్రిన్స్ మాస్వెర్ (65; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ నాలుగు, అమీర్ హంజా మూడు వికెట్లు తీశారు. 258 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన అఫ్గానిస్తాన్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించకుండా జింబాబ్వేకు ఫాలోఆన్ ఇచ్చింది. ఆట ముగిసే సమయానికి జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే జింబాబ్వే మరో 234 పరుగులు చేయాలి. -
అఫ్రిది కూతురితో షాహిన్ అఫ్రిది నిశ్చితార్థం!
కరాచీ: పాకిస్తాన్ యువ పేసర్ షాహిన్ అఫ్రిది త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. అయితే అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది పెద్ద కూతురు అక్సా అఫ్రిది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇరువురు క్రికెటర్లు ఇంతవరకు స్పందించలేదు. అయితే పాకిస్తానీ లోకల్ మీడియా అందించిన వివరాలు ప్రకారం.. షాహిద్ అఫ్రిది తండ్రి అయాజ్ ఖాన్ పెళ్లి విషయమై షాహిద్ కుటుంబం వద్ద ప్రస్తావించారని..అందుకు వారు ఒప్పుకున్నట్లుగా సమాచారం. అయితే షాహిన్ ఇప్పుడిప్పుడే క్రికెటర్‌గా ఎదుగుతున్నాడని.. మా కూతురు అక్సా ఇంకా చదువుతుందని.. ఇప్పట్లో ఎంగేజ్మెంట్ ప్రస్తావన లేదని ఆఫ్రిది కుటుంబవర్గం తెలిపింది. అయితే వచ్చే రెండేళ్లలో మాత్రం వీరిద్దరి పెళ్లి జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇవన్నీ ఒట్టి పుకార్లేనని.. వారి కుటుంబాల మధ్య పెళ్లికి సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదంటూ ట్విటర్లో వార్తలు వచ్చాయి. దీనిపై పాకిస్తానీ జర్నలిస్ట్ ఇతిషామ్ ఉల్ హక్ స్పందిస్తూ.. ‘షాహిన్ ఆఫ్రిది, అక్సా అఫ్రిది నిశ్చితార్థం నిజమే.. రూమర్లు కాదని.. ఇరు కుటుంబాలు ఇప్పటికే అంగీకరించాయి. త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుంది. అయితే పెళ్లి మాత్రం అక్సా చదువు పూర్తయిన తర్వాత జరగనుంది’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. కాగా షాహిన్ అఫ్రిదితో మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. షాహిన్ లాహోర్ క్యూలాండర్స్‌కు.. షాహిద్ అఫ్రిది ముల్తాన్ సుల్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా షాహిన్ లీగ్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. చదవండి: వారు సహకరిస్తే బాగుండు.. సుందర్ తండ్రి ఎమోషనల్ దేవుడా.. పెద్ద గండం తప్పింది The reason behind this tweet is to clarify the suspicion caused by social media. Respect to both families; please do await their own official announcements as they are currently in talks.I would like to request all individuals to respect their privacy during this auspicious time. https://t.co/65IRygDxUw — Ihtisham Ul Haq (@iihtishamm) March 6, 2021 -
చెత్త ఫుడ్ అంటూ విమర్శలు.. క్లారిటీ ఇచ్చిన ఆటగాడు
కరాచీ: ఫిబ్రవరి 20న అట్టహాసంగా ప్రారంభమైన పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్ 2021) గురువారం అర్థంతరంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. లీగ్‌లో భాగంగా ఏడుగురు ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో పీసీబీ లీగ్‌ను వాయదా వేయాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా పీఎస్ఎల్ లీగ్‌పై మరో విషయం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. లీగ్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లకు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని.. ఎక్కడ పరిశుభ్రత పాటించడం లేదని.. అందుకే కరోనా కేసులు వెలుగు చూశాయంటూ ట్రోల్స్ చేశారు. దీనికి తోడూ ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ తన ట్విటర్లో పెట్టిన ఫోటోను ఒక వ్యక్తి రీట్వీట్ చేశాడు. ఆ ఫోటోలో రెండు ఎగ్స్, టోస్ట్ బ్రెడ్.. కనిపించాయి. హేల్స్ కూడా పీసీబీని ట్రోల్ చేస్తూ ఆ ఫోటో పెట్టాడంటూ సదరు వ్యక్తి కామెంట్స్ చేశారు. అయితే ఇది చూసిన హేల్స్.. చెత్త ఫుడ్ అంటూ విమర్శలు చేసినవారికి క్లారిటీ ఇస్తున్నట్లుగా తన కామెంట్స్‌లో తెలిపాడు. '' మీరు ఫోటోలో చూస్తున్నది నిజానికి మంచి క్వాలిటీతో ఉన్న ఆహారం. కాకపోతే వారిచ్చిన ఫుడ్ ఆర్డర్ ప్రకారం ఇవ్వలేదు.. ఇది కొంచెం ఫన్నీగా అనిపించింది.. అందుకే ఫోటోను షేర్ చేశా.. అంతేగాని ఫుడ్ క్వాలిటీని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. పీఎస్ఎల్ నిర్వాహకులు మా అందరిని ఆహ్లదకర వాతావరణంలోనే ఉంచింది. అనవసరంగా ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు.''అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అలెక్స్ హేల్స్ పీఎస్ఎల్లో ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చదవండి: పీఎస్ఎల్ 2021 వాయిదా.. వికెట్ తీయగానే జెర్సీ విప్పేసిన తాహిర్ It was one meal where the order was incorrect.. I found it funny, nothing more. The food and hospitality here has been excellent, hope this clears it up 👍🏼 — Alex Hales (@AlexHales1) March 4, 2021 -
పీఎస్ఎల్ 2021 వాయిదా..
కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్ 2021) వాయిదా వేస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గురువారం వెల్లడించింది. పీఎస్‌లో పాల్గొన్న 7గురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్ రావడంతో పీఎస్ఎల్ 2021ని వాయిదా వేస్తున్నట్లుగా పీసీబీ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 20న ఆరంభమైన పీఎస్ఎల్ మార్చి 22 వరకు కొనసాగాల్సింది. తాజా నిర్ణయంతో లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లతో పాటు క్వాలిఫయర్, ఎలిమినేటర్ సహా ఫైనల్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. గత ఏడాది కూడా పీఎస్ఎల్ ప్రారంభమై కరోనా కేసులతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో టోర్నీని వాయిదా వేశారు. మిగిలిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్ మ్యాచ్‌ను నవంబర్ 2020లో నిర్వహించారు. -
‘లాలా ఐ యామ్ సారీ’.. బౌలర్ క్షమాపణలు
ఇస్లామాబాద్: దాయాది దేశంలో రసవత్తరంగా సాగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2020 ఎలిమినేషన్ దశకు చేరుకుంది. లాహోర్ ఖలందర్, ముల్తాన్ సుల్తాన్ జట్ల మధ్య కరాచీలో ఆదివారం జరిగిన ఎలిమినేటర్-2 మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పాక్ దిగ్గజ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదిని డకౌట్ చేసిన లాహోర్ బౌలర్ హారిస్ రావూఫ్ అతనికి క్షమాపణలు చెప్పాడు. రెండో ఇన్నింగ్స్ 14 వ ఓవర్లో ఈ విశేషం చోటుచేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ జట్టు 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన ముల్తాన్ జట్టు 14 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకొచ్చిన అఫ్రిదిని రావూఫ్ మొదటి బంతికే డకౌట్ చేశాడు. రావూఫ్ విసిరిన ఇన్‌స్వింగర్ అఫ్రిది కాళ్ల మధ్యలోంచి చొచ్చుకెళ్లి వికెట్లను గిరాటేసింది. దాంతో తన ఫేవరెట్ ఆటగాడికి రావూఫ్ రెండు చేతులు జోడించి నవ్వుతూ దండం పెట్టాడు. ‘లాలా ఐ యామ్ సారీ’ అంటూ మ్యాచ్ అనంతరం వీడియోను జతచేస్తూ ట్వీట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయింది. కాగా, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 157 పరుగులే చేసిన ముల్తాన్ జట్టు పరాజయం పాలైంది. లాహోర్ జట్టు ఫైనల్స్‌కి చేరింది. నవంబర్ 17న కరాచీ కింగ్స్‌తో తలపడనుంది. (చదవండి: ఆస్ట్రేలియా టూర్‌పై కరోనా ప్రభావం!) LALA I'M SORRY 😭🙏🏾#HBLPSLV #PhirSeTayyarHain #MSvLQ pic.twitter.com/QoMJG5Lhht — PakistanSuperLeague (@thePSLt20) November 15, 2020 -
పాక్ అభిమానికి దిమ్మతిరిగే రిప్లై
కరాచీ: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ట్వీటర్లో ఆసక్తికర పోస్ట్‌లే కాకుండా, అదే తరహాలో రిప్లైలు ఇవ్వడంలో నీషమ్‌ది వినూత్న శైలి. తాజాగా ఒక పాకిస్తాన్ క్రికెట్ అభిమానికి నీషమ్ చాలా కూల్‌గా సమాధానం ఇచ్చాడు. ట్వీటర్లో నీషమ్‌ను ట్రోల్ చేసిన అలీ హైదర్ అనే పాక్ అభిమాని.. ‘మీరు ఎందుకు ఐపీఎల్ మాత్రమే ఆడతారు.. పీఎస్ఎల్ ఎందుకు ఆడరు?’ అని ప్రశ్నించాడు. ఇంకో అడుగు ముందుకేసిన సదరు అభిమాని ‘మీకు ఐపీఎల్ డబ్బుతో పాటు ఫేమ్‌ను కూడా తెచ్చుపెడుతుంది కదా.. అందుకేనా ఐపీఎల్‌కు ప్రాధాన్యం’ అని చమత్కరించాడు.(చదవండి:సీఎస్కే చేసిన పొరపాటు అదేనా?) దీనికి నీషమ్ అవుననే సమాధానాన్ని చెప్పకనే చెప్పేస్తూ.. ‘ దాంతో పాటు పీఎస్ఎల్ అనేది మా సమ్మర్ సీజన్లోనే ఆరంభమవడం కూడా కారణం కావొచ్చు కదా బాస్’ అంటూ పాక్ అభిమానికి రిప్లై ఇచ్చాడు. అంటే పీఎస్ఎల్ జరిగే షెడ్యూల్ మారితే తాను ఆడటానికి ఏమీ ఇబ్బంది ఉండకపోవచ్చనే సమాధానాన్ని నీషమ్ ఇచ్చాడు. దాంతో ఆ అభిమాని చేసేది లేక ఇక తిరిగి ఏమీ కౌంటర్ ఇవ్వలేకపోయాడు. ఈ ఏడాది ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ తరఫున నీషమ్ ఆడుతున్నాడు. గతేడాది చివర్లో జరిగిన వేలంలో నీషమ్‌ను 50 లక్షల రూపాయల కనీస ధరకు కింగ్స్ పంజాబ్ కొనుగోలు చేసింది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నీషమ్ ఆడగా, ఈ సీజన్లో పంజాబ్‌కు ఆడుతున్నాడు. కాగా, ఈసారి పలువురు న్యూజిలాండ్ ఆటగాళ్లు ఐపీఎల్‌కు సిద్ధమయ్యారు. నీషమ్ పంజాబ్‌కు లూకీ ఫెర్గ్యూసన్ కేకేఆర్‌కు ఆడుతుండగా, మెక్‌లాన్‌గెన్, ట్రెంట్ బౌల్ట్‌లు ముంబైకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కేన్ విలియమ్సన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. మిచెల్ సాంత్నార్ సీఎస్కేకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.(చదవండి: తొలి బంతికే భయపడ్డాను: కోహ్లి) -
‘నేను కారు ప్రమాదంలో చనిపోలేదు’
కరాచీ: తాను కారు ప్రమాదంలో చనిపోయినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను పాకిస్తాన్ వెటరన్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ ఖండించాడు. అందులో ఎటువంటి వాస్తవం లేదని, అదంతా ఫేక్ న్యూస్ అని తెలిపాడు. తాను క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్న ఇర్ఫాన్.. ఎటువంటి ఆధారాలు లేని తప్పుడు వార్తలను ఎందుకు వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆదివారం మహ్మద్ ఇర్ఫాన్ ట్వీటర్లో పలు పోస్టింగ్‌లు వెలుగు చూశాయి. కారు ప్రమాదంలో ఇర్ఫాన్ మృతి చెందాడంటూ కొంతమంది ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన ఇర్ఫాన్.. తాను క్షేమంగా ఉన్నట్లు తెలిపాడు. కొంతమంది కావాలని తప్పుడు వార్తలను సృష్టించారని మండిపడ్డాడు. (‘అతని వల్లే సచిన్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు’) అసలు ఇలా మరణించానంటూ ఎందుకు వైరల్ చేస్తున్నారో తనకైతే అర్థం కావడం లేదన్నాడు. ఇది తన కుటుంబాన్ని పూర్తిగా అయోమయానికి గురి చేయడమే కాకుండా తీవ్రంగా బాధించిందన్నాడు. ఈ క్రమంలోనే తన ఇంటికి లెక్కనేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయన్నాడు. వారందరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని, తాను, కుటుంబం క్షేమంగా ఉన్నట్లు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. ఈ తరహా ఫేక్ న్యూస్‌ను వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదనే విషయం దాన్ని సృష్టించిన వారు తెలుసుకోవాలన్నాడు. 38 ఏళ్ల మహ్మద్ ఇర్ఫాన్.. 2010లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరఫున అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్ తరఫున 4 టెస్టు, 60 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 10 వికెట్లు, వన్డేల్లో 83 వికెట్లు, టీ20ల్లో 16 వికెట్లను ఇర్పాన్ తీశాడు. 7 అడుగుల, 1 అంగుళం ఎత్తు ఇర్ఫాన్‌ది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత ఎత్తు కల్గిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. (సెంచరీ కొట్టకపోతే వేస్ట్!) -
‘అందులో ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ భేష్’
కరాచీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ క్రికెట్ లీగ్‌ల్లో కచ్చితంగా ఐపీఎల్‌దే టాప్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఐపీఎల్ పుట్టుక మొదలు ఇప్పటివరకూ ఆ క్యాష్ రిచ్ లీగ్‌కు ఆదరణ అంతకంతకూ పెరుగుతూనే పోతుంది కానీ ఎక్కడ దాని క్రేజ్ తగ్గిన దాఖలాలు లేవు. విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడటానికి ఎక్కువ మొగ్గుచూపుతున్నారంటే ఆ లీగ్ గురించి వేరే చర్చ కూడా అనవసరం. అయితే పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ మాత్రం పీఎస్ఎల్ను ఐపీఎల్‌తో పోల్చకూడదంటూనే తమ లీగ్‌పై ప్రేమ కురిపించాడు. ప్రధానంగా నాణ్యమైన బౌలింగ్ అంశానికొస్తే ఐపీఎల్ కంటే పీఎస్ఎలే ఉత్తమం అని అక్రమ్ చెప్పుకొచ్చాడు. ఇది తన అభిప్రాయం కాదని, కొంతమంది విదేశీ ఆటగాళ్లు తనతో చెప్పిన మాటనే చెబుతున్నానని అక్రమ్ స్పష్టం చేశాడు.(ముష్ఫికర్‌కు ‘నో’ చెప్పిన బీసీబీ ) ‘గత కొన్నేళ్లుగా పీఎస్ఎల్ను సీరియస్‌గా గమనిస్తున్నా. దానిలో భాగంగానే చాలా మంది విదేశీ ఆటగాళ్ల అభిప్రాయం కూడా తెలుసుకున్నా. ఐపీఎల్‌కు పీఎస్ఎల్కు ఉన్న తేడా ఏమిటి అని అడిగా. వారంత ఐపీఎల్లో నాణ్యమైన బౌలింగ్ లేదనడమే కాకుండా పీఎస్ఎల్లో ఒక క్వాలిటీ బౌలింగ్ ఉందన్నారు. ప్రత్యేకంగా బౌలింగ్ విషయంలో ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ ఎంతో ముందంజలో ఉందని వారు చెప్పారు’ అని మాజీ క్రికెటర్ బాసిత్ ఆలీతో యూట్యూబ్ చాట్‌లో అక్రమ్ పేర్కొన్నాడు. పీఎస్ఎల్ను ఐపీఎల్‌తో పోల్చలేం.. ఏది ఏమైనా పీఎస్ఎల్ను ఐపీఎల్‌తో పోల్చలేమని మరొక ప్రశ్నకు సమాధానంగా అక్రమ్ చెప్పాడు. ‘పీఎస్ఎల్ అనేది ఇప్పుడిప్పుడు వెలుగు చూస్తున్న లీగ్. ఐపీఎల్‌కు ఎప్పుడో ఒక గొప్ప వైభవం వచ్చేసింది. ఐపీఎల్ పుట్టి 12 ఏళ్లు అయ్యింది. పీఎస్ఎల్ అనేది ఇంకా ఐదేళ్ల బాలుడే. పీఎస్ఎల్కు అంకురార్పణ జరిగినప్పుడు ఇంత పెద్ద లీగ్ ఎలా నిర్వహిస్తారనుకున్నా. ఇప్పుడు ఆ లీగ్ వరల్డ్‌లో రెండో అతి పెద్ద టోర్నమెంట్‌గా ఉంది. ఐపీఎల్ తర్వాత స్థానం కచ్చితంగా పీఎస్ఎల్’అని అక్రమ్ తెలిపాడు. ఇక ఐపీఎల్ అతి పెద్ద క్యాష్ రిచ్ లీగ్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. పీఎస్ఎల్లో పలు ఫ్రాంచైజీలతో కలిసి పని చేశాడు. అందులో ఇస్లామాబాద్ యునైటెట్, కరాచీ కింగ్స్‌లు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా కరాచీ కింగ్స్‌కు అక్రమ్ సేవలందిస్తున్నాడు. ఇక ఐపీఎల్లో 2016 వరకూ కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలింగ్ కోచ్‌గా అక్రమ్ కొనసాగాడు.(విదేశాల్లో ఐపీఎల్2020? బీసీసీఐ సమాలోచన) -
‘నా క్రేజే వేరు.. బ్రాండ్ వాల్యూ రెట్టింపు చేస్తా’
కరాచీ: తమ దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా తనకున్న క్రేజ్ ప్రత్యేకమని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తనకు తాను కితాబు ఇచ్చేసుకున్నాడు. పాకిస్తాన్ ప్రజల చేత అత్యంత ప్రేమించబడే వ్యక్తులలో తాను కూడా ఒకడినని అక్తర్ పేర్కొన్నాడు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అక్తర్ అంటే ఒక ఫేమస్ పేరనే విషయం తెలుసుకోవాలన్నాడు. ఇక్కడ అక్తర్ గుర్తింపు పొందిన క్రికెటర్ అనే విషయం అందరికీ తెలిసినా ఈ వ్యాఖ్యల వెనుక కారణం మాత్రం వ్యాపార కోణం ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో తాను కూడా ఒక జట్టుకు యజమాని కావాలని ఉవ్విళ్లూరడమే అక్తర్ వ్యాఖ్యల వెనుకున్న ఉద్దేశం. పీఎస్ఎల్ విలువను తన పేరుతో పెంచుతానని అక్తర్ వ్యాఖ్యానించాడు. ‘పాకిస్తాన్‌లోనే కాదు... నేను వరల్డ్‌వైడ్ బాగా ఫేమస్. నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ సెపరేటు. ప్రజలకు నాకు గురించి బాగా తెలుసు. పీఎస్ఎల్ బ్రాండ్ వాల్యూ పెరగాలంటే నాకు అందులో ఒక జట్టు ఉంటే బాగుంటుంది. పీఎస్ఎల్లో నాకు పెట్టుబడులు పెట్టే అవకాశం వస్తే పీఎస్ఎల్ బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోతుంది. రెండు పీఎస్ఎల్ రెండు జట్లను పీసీబీ తీసుకోవాలి. అందులో ఒక జట్టు కోసం నేను బిడ్ వేస్తా’ అని అక్తర్ చెప్పుకొచ్చాడు. (హెడ్ లైన్స్ కాదు.. ఆర్టికల్ మొత్తం చదువు) కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని అతాలకుతలం చేస్తున్న సమయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగడం ఒక్కటే మార్గమని ఇటీవల షోయబ్ అక్తర్ సూచించాడు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రపంచమంతా లాక్డౌన్లో పడిపోయిన సమయంలో ఒకరికోసం ఒకరు నిలబడాలంటూ పేర్కొన్నాడు. ఇక్కడ దొంగ నిల్వలు అనేవి పెట్టుకోవద్దని అక్తర్ విజ్ఞప్తి చేశాడు. మనం నిత్యావసరాలను దొంగ నిల్వలుగా పెట్టుకునే సమయంలో రోజు వారీ శ్రామికుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని హితవు పలికాడు. -
కోహ్లిని తలపించే మొనగాడు వచ్చాడు..!
కరాచీ: టీమిండియా కెప్టెన్, పరుగుల మెషీన్ విరాట్ కోహ్లితో ఎక్కువగా పోల్చిన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజామ్. తమకు కోహ్లి లాంటి ఆటగాడు ఉన్నాడంటూ పాకిస్తాన్ క్రికెట్ పెద్దలు, మాజీలు పదే పదే అజామ్‌ను చూసుకుని మురిసిపోవడం మనకు అలవాటే. కానీ ఈ విషయంలో అజామ్ మాత్రం తాను ఎప్పుడూ కోహ్లితో పోల్చుకోలేదు సరికదా.. ఆ పోలిక తేవద్దని చాలాసార్లు విన్నవించాడు. కాకపోతే తాను ఎక్కువగా బ్యాటింగ్‌ను ఆస్వాదించే క్రికెటర్లలో కోహ్లి కూడా ఒకడని అజామ్ ఇప్పటికే స్పష్టం చేశాడు. కాగా, ఇప్పుడు కోహ్లి, అజామ్‌లను తలపించే మొనగాడు వచ్చాడని అంటున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత రమీజ్ రాజా. ఇప్పటివరకూ అంతర్జాతీయ అరంగేట్రం చేయని 19 ఏళ్ల హైదర్ అలీలో కోహ్లి, అజామ్‌లకు ఏమాత్రం తీసిపోని బ్యాటింగ్ నైపుణ్యం ఉందని అభిప్రాయపడ్డాడు. (ధోని భవితవ్యంపై గావస్కర్ స్పందన..) పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) తాజా సీజన్లో అండర్-19 జట్టు ఓపెనర్ అయిన హైదర్ అలీ రాణించడంతో అతన్ని ఆకాశానికెత్తేశాడు రమీజ్ రాజా. కరోనా వైరస్ విజృంభణ కారణంగా వాయిదా పడ్డ ఈ లీగ్‌లో ఇప్పటివరకూ హైదర్ అలీ 9 మ్యాచ్‌లు ఆడి 239 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే రమీజ్ రాజా తన యూట్యూబ్ చానల్లో మాట్లాడుతూ.. హైదర్ అలీని ప్రశంసల్లో ముంచెత్తాడు. ప్రధానంగా తన కెరీర్లో తొలి పీఎస్ఎల్ ఆడుతున్న హైదర్ అలీలో విశేషమైన టాలెంట్ ఉందంటూ కొనియాడాడు. ఏదొక రోజు వరల్డ్‌లో అందర్నీ హైదర్ వెనక్కినెట్టడం ఖాయమంటూ జోస్యం చెప్పాడు. ‘హైదర్ అలీలో కోహ్లి, బాబర్ అజామ్‌ల తరహా టాలెంట్ ఉంది. అచ్చమైన టెక్నిక్, క్వాలిటీ షాట్లు హైదర్ సొంతం. అతను బ్యాటింగ్‌లో ఎటువంటి లోపాలు లేవు. ఇక పవర్ హిట్టింగ్‌లో హైదర్ చాలా స్ట్రాంగ్. కాకపోతే మ్యాచ్‌పై అవగాహన అవసరం. అదే సమయంలో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఎలా ఆడాలి అనే దానిపై దృష్టి సారించాలి. ఈ రెండు తప్పితే హైదర్ అలీలో బ్యాటింగ్‌కు సంబంధించి మెరుగులు దిద్దాల్సిన అవసరం లేదు. కోహ్లి. అజామ్‌ల బ్యాటింగ్‌లో ఎంత సాంకేతికతో ఉందో అంతే సాంకేతికత హైదర్ అలీ బ్యాటింగ్‌లో కూడా ఉంది. కచ్చితంగా ఏదొక రోజు హైదర్ అలీ ప్రపంచ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా ఎదుగుతాడు’ అని రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు. పీఎస్ఎల్ లీగ్ దశను ముగించుకుని నాకౌట్ దశకు చేరుకున్న తర్వాత వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
‘నేను పిచ్చి పనిచేస్తే మళ్లీ క్రికెట్ ఆడలేను’
కరాచీ: కరోనా వైరస్ ప్రభావంతో దక్షిణాఫ్రికా వెటరన్ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ కొన్ని గంటల పాటు పాకిస్తాన్‌లోని ఓ హోటల్ నిర్బంధంలో ఉన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) ఆడేందుకు అక్కడికి వెళ్లిన స్టెయిన్.. ఇస్లామాబాద్ యునైటెడ్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కాగా, ఇస్లామాబాద్ యునైటెడ్ నాకౌట్‌కు చేరలేదు. దాంతో స్టెయిన్ స్వదేశానికి పయనం కావాల్సి ఉంది. ముందు జాగ్రత్తగా టోర్నీలో ప్లే ఆఫ్ చేరిన టీమ్స్‌లోని ప్రతీ ఒక్కరికి పరీక్షలు నిర్వహించింది. విదేశీ ఆటగాళ్లకు నెగటివ్ అని తేలితేనే ప్రయాణానికి అనుమతిచ్చింది. పరీక్షలకు పంపిన శాంపిల్స్ రిపోర్ట్ రావడం ఆలస్యం కావడంతో అప్పటి వరకూ క్రికెటర్లని హోటల్ గదులకే పరిమితం చేసింది.(కరోనా విజృంభణ: ఇటలీ వీధులు వెలవెల) ‘ఆటగాళ్లందరం హోటల్ నిర్భంధంలో ఉండిపోయాం. హోటల్ దాటి వీధుల్లోకి రాకూడదని మాకు ఆదేశాలు ఇచ్చారు. వ్యక్తిగతంగా కూడా ఈ నిబంధనల్ని అతిక్రమించాలనిపించలేదు. ఒకవేళ నేను ఏదైనా పిచ్చి పని చేసినా.. ఆ తర్వాత మళ్లీ పాకిస్తాన్లో క్రికెట్ ఆడలేను. నేను అందరికీ ఒకటే చెబుతున్నా ఎవరు కూడా వీధుల్లో తిరగకండి.. మీరు తిరగాలనుకునే వీధులు బాగున్నా సరే బయటకి వెళ్లవద్దు’ అని ఈసీపీన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన స్టెయిన్ చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకూ లీగ్ దశలో మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న పీఎస్ఎల్ తాజా సీజన్లో ఇంకా సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. కరోనా కారణంగా అవి వాయిదా పడ్డాయి. (భారత్‌లో 209కి చేరిన కరోనా కేసులు ) -
క్రికెటర్ హేల్స్‌కు కరోనా?
కరాచీ: కరోనా వైరస్‌తో ప్రపంచమే ఆగిపోయింది. ఆటలన్నీ వాయిదా పడినా... లీగ్ దశ దాకా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నిర్విరామంగా సాగింది. మంగళవారం రెండు సెమీస్ మ్యాచ్‌లు, బుధవారం ఫైనల్‌తో ఈ లీగ్‌కు శుభం కార్డు పడాల్సివుంది. అయితే ఈ ‘మహమ్మారి’ బారిన ఓ విదేశీ క్రికెటర్ పడటంతో లీగ్ అర్ధాంతరంగా వాయిదా పడింది. ఇంగ్లండ్ ప్లేయర్ అలెక్స్ హేల్స్‌కు కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలియడంతో సెమీస్, ఫైనల్స్ పోటీల్ని వాయిదా వేస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సీఈఓ వసీమ్ ఖాన్ తెలిపారు. ‘పాక్ నుంచి తిరుగుముఖం పట్టిన హేల్స్ తనకు కరోనా లక్షణాలున్నట్లు మాకు సమాచారమిచ్చాడు. దీంతో పలు వర్గాలతో సంప్రదింపులు జరిపాక లీగ్‌ను వాయిదా వేయాలని నిర్ణయించాం’ అని ఆయన చెప్పారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రజా మాట్లాడుతూ లీగ్ మొదలైనప్పటినుంచి ఎలాంటి అనుమానిత కేసులు లేకపోవడంతో సజావుగానే సాగిందని, కానీ 31 ఏళ్ల హేల్స్‌కు కరోనా లక్షణాలు బయటపడటంతో కలకలం రేగిందని... ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పుడు పీఎస్ఎల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేయనున్నామని ఆయన చెప్పారు. పీఎస్ఎల్లో మొత్తం 34 మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొన్నారు. వారంతా కరోనా భయాందోళనలతో ఇదివరకే స్వదేశాలకు చేరారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఒప్పందాలు, వ్యవహారాలను పక్కనబెట్టి వెళ్లాలనుకున్నవారిని పంపించామని రమీజ్ రజా తెలిపారు. పాకిస్తాన్‌లోనూ కరోనా కేసులు నమోదు కావడంతో బంగ్లాదేశ్‌తో వచ్చే నెలలో జరగాల్సిన వన్డే, టెస్టు సిరీస్‌లను పీసీబీ రద్దు చేసింది. అలాగే ఈ నెల 25 నుంచి జరగాల్సిన నేషనల్ వన్డే కప్‌ను కూడా సస్పెండ్ చేసింది. ఇంగ్లండ్ చేరుకున్న అనంతరం హేల్స్ తన స్పందన తెలియజేశాడు. తాను ఇంకా కరోనా పరీక్షలకు హాజరు కాలేదని, పాజిటివ్ అంటూ వచ్చిన వార్తల్లో కూడా నిజం లేదని స్పష్టం చేశాడు. అయితే జ్వరంతో పాటు సాధారణం కంటే భిన్నమైన లక్షణాలు తనలో కనిపించడంతో ముందు జాగ్రత్తగా అందరికీ దూరంగా ఉంటున్నట్లు అతను వెల్లడించాడు. -
పాకిస్తాన్లో ధోని ఫీవర్!
ఇస్లామాబాద్: మరికొద్ది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్-13వ సీజన్ ఆరంభం కానుంది. ఈ సీజన్లో సీఎస్కే కెప్టెన్ అయిన ఎంఎస్ ధోని ఆట ఎలా ఉండబోతుందనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్ తర్వాత ధోని భారత జట్టుకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. వచ్చే టీ20 వరల్డ్‌కప్‌లో ధోనికి భారత జట్టులో స్థానం ఉంటుందా.. లేదా అనేది అతని ఐపీఎల్ ప్రదర్శనపై ఆధారపడిందనేది కాదనలేని సత్యం. ఈ క్రమంలో ధనాధన్ ధోని ఆట గురించి అతని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాగా, ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ధోని ఫీవర్ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన ఆదరణ ఉన్న ధోనికి పాకిస్తాన్లో సైతం అభిమానులున్నారు. ఇది తాజాగా మరోసారి నిరూపితమైంది. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ధోని ఫ్యాన్ ఒకరు అలరించాడు. (ధోని@ 6, 6, 6, 6 ,6) పాకిస్తాన్ క్రికెట్ జట్టు కలర్లో ఉన్న జెర్సీపై ధోని పేరుతో పాటు నంబర్-7ను వేయించుకుని సందడి చేశాడు. పీఎస్ఎల్ ఐదో సీజన్లో భాగంగా ఇటీవల ముల్తాన్ సుల్తాన్స్-ఇస్లామాబాద్ యునైటెడ్‌ల మధ్య మ్యాచ్ జరగ్గా ఒక అభిమాని ఇలా ఆకట్టుకున్నాడు. ఇస్లామాబాద్ జట్టు అభిమాని అయిన అతను ధోని పేరుతో జెర్సీని ధరించడం హైలైట్‌గా నిలవగా, ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సీజన్ ఐపీఎల్ మార్చి 29వ తేదీన ఆరంభం కానుండగా, తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగనుంది. దాంతో ధోని రీఎంట్రీ షురూ కానుంది. -
కీపింగ్ వదిలేసి కాళ్లు మొక్కుతావేంట్రా నాయనా!
లాహోర్: క్రికెట్లో ఫీల్డింగ్ చేసే జట్టు.. బ్యాట్స్‌మన్ కొట్టే బంతుల్ని ఆపడానికి యత్నించడమే సాధారణంగా చేసే పని. మరి ఫీల్డింగ్ చేసే క్రికెటర్ బంతిని వదిలేసి బ్యాట్స్‌మన్ పట్టుకుంటే ఏమనాలి. బ్యాట్స్‌మన్ పరుగు తీయకుండా చేయడానికి చేసిన ఒక ప్రయత్నమనే అనుకోవాలి. ఇది తొందరపాటులో జరిగినా అది చూసిన అభిమానులకు మాత్రం సరదాగా మారిపోతుంది. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఇదే జరిగింది. ఆదివారం లాహోర్ క్వాలండర్స్-కరాచీ కింగ్స్‌ల మధ్య మ్యాచ్ జరిగింది. దీనిలో భాగంగా లాహోర్ క్వాలండర్స్ ఛేజింగ్‌కు దిగిన సమయంలో సెకండ్ డౌన్ ఆటగాడు బెన్ డంక్ ఇచ్చిన క్యాచ్ పట్టుకోవడంలో విఫలమైన కరాచీ వికెట్ కీపర్ చాడ్విక్ వాల్టన్ చేసేది లేక చివరికి ఇలా బ్యాట్స్‌మన్‌ను చుట్టేశాడు. (తాహీర్ ఓవరాక్షన్ చూడలేకపోతున్నా!) డెల్పోర్ట్ వేసిస10 ఓవర్ ఐదో బంతిని బెన్ డంక్ రివర్స్ స్వీప్ ఆడబోయాడు. అది కాస్తా ఎడ్జ్ తీసుకుని పైకి లేచింది. అయితే ఆ బంతి బ్యాట్స్‌మన్‌కు పైనే లేవడంతో కీపర్ చాడ్విక్ తడబడ్డాడు. ఆ బంతి బ్యాట్స్‌మన్ భుజానికి తాకిన గ్రౌండ్‌ను తాకే సమయంలో ఎక్కడుందో కనబడలేదు. దాంతో బెన్ డంక్ కాళ్లను అమాంతం చుట్టేశాడు. క్యాచ్ వదిలేసి ఇలా కాళ్లను చుట్టేయడం మాత్రం ఫన్నీగా అయ్యింది. ఆ సమయానికి బెన్ డంక్ 10 పరుగుల వద్ద ఉండగా, ఆపై వీరబాదుడు బాదాడు. 40 బంతుల్లో 12 సిక్స్‌లు, 3 ఫోర్లతో అజేయంగా 99 పరుగులు సాధించాడు. డంక్ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో ఇంకా ఐదు బంతులు ఉండగానే లాహోర్ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా, దాన్ని లాహోర్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన బెన్ డంక్-చాడ్విక్ల ఫన్నీ వీడియోకు మాత్రం సెటైర్లు పేలుతున్నాయి. ఇది కేవలం పీఎస్ఎల్లో మాత్రమే జరుగుతుందని కొంతమంది అభిమానులు ఎద్దేవా చేయగా, కీపింగ్ చేయకుండా కాళ్లు మొక్కుతావేంట్రా నాయనా అని మరి కొంతమంది జోకులు పేల్చుతున్నారు. One of the best scene of PSL 😂😂#KKvLQ #PSL2020 pic.twitter.com/4gJnzSRmJF — ثناء ہتھوڑی 😂😂 (@PakiPakori) March 8, 2020 -
తాహీర్ ఓవరాక్షన్ చూడలేకపోతున్నా!
రావల్పిండి: దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన లెగ్ బ్రేక్‌లతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే తాహీర్.. వికెట్ తీసిన సందర్భంలో సంబరాలు చేసుకోవడం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. వికెట్ తీస్తే చాలు రెండు చేతులను చాచుకుంటూ మైదానంలో కలియదిరుగుతాడు. అయితే తాహీర్ ఈ తరహా సెలబ్రేషన్స్‌ను చూడలేకపోతున్నామంటున్నాడు న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కొలిన్ మున్రో. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో భాగంగా ఆదివారం ముల్తాన్ సుల్తాన్స్- ఇస్లామాబాద్ యునైటెడ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇస్లామాబాద్ తరఫున మున్రో ఆడుతుండగా, ముల్తాన్ సుల్తాన్స్ తరఫున తాహీర్ ఆడుతున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో మున్రోను ఔట్ చేసిన తర్వాత తాహీర్ తన సెలబ్రేషన్స్‌కు పని చెప్పాడు. ఈ క్రమంలోనే తాహీర్‌కు మున్రోకు మాటల యుద్ధం జరిగింది. పెవిలియన్‌కు వెళుతూ మున్రో ఏదో అనగా, దానికి తాహీర్ రిప్లే ఇచ్చాడు. అయితే దీనిపై పాకిస్తాన్ జర్నలిస్ట్ సాజ్ సాదిక్.. మున్రోను వివరణ కోరగా తాహీర్ ఓవరాక్షన్ చూడలేకపోతున్నామనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. ‘ నేను తాహీర్ సెలబ్రేషన్స్ చూడలేకపోతున్నా. ఆ సెలబ్రేషన్స్ చూసి చూసి అలసిపోయా. సర్కస్‌లో చేసే ఫీట్లా ఉంటుంది అతని సెలబ్రేషన్. అది సరైన సెలబ్రేషన్స్ కాదు. అతను నాతో వాగ్వాదానికి దిగిన క్రమంలో ఎలా ప్రవర్తించాడో మీరు చూశారు కదా. దీన్ని ఇక్కడితో వదిలేద్దాం’ అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ 9 వికెట్ల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) విజయం సాధించింది. ఇస్లామాబాద్ నిర్దేశించిన 92 పరుగుల టార్గెట్‌ను ముల్తాన్ సుల్తాన్స్ వికెట్ కోల్పోయి ఛేదించింది. జేమ్స్ విన్సే(61 నాటౌట్) ముల్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ముల్తాన్ సుల్తాన్స్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. పీఎస్ఎల్లో ముల్తాన్ సుల్తాన్స్ ప్లేఆఫ్‌కు చేరడం ఇదే తొలిసారి. కాగా, ఈ సీజన్లో ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టు కూడా సుల్తాన్సే. -
ఉమర్.. మా డబ్బులు మాకిచ్చేయ్!
కరాచీ: ఇటీవల పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అవినీతి నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 4.7.1 కింద అక్మల్ సస్పెండ్ అయ్యాడు. గతంలో పీఎస్ఎల్ ఆడే క్రమంలో తనను ఒక బుకీ సంప్రదించిన విషయాన్ని దాచి పెట్టిన కారణంగానే అక్మల్‌పై నిషేధం విధించారు. అక్మల్‌పై విచారణ పూర్తయ్యే వరకూ అతను ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొనకుండా పీసీబీ ఆదేశాలు జారీ చేసింది. దాంతో ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)ను అక్మల్ మిస్సయ్యాడు. పీఎస్ఎల్ క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిథ్యం వహించాల్సిన అక్మల్ సస్పెన్షన్ కారణంగా ఆ లీగ్‌కు దూరం కావాల్సి వచ్చింది. దాంతో అక్మల్‌కు మరో తలనొప్పి ఎదురైంది. (ఇక్కడ చదవండి: అక్మల్‌ను సస్పెండ్ చేశారు..!) పీఎస్ఎల్ ఆడటానికి తాము ముందుగా ఇచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేయాలంటూ గ్లాడియేటర్స్ స్పష్టం చేసింది. ఈ మేరకు పీఎస్ఎల్ నిర్వహిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు విన్నవించింది. ‘అక్మల్ సస్పెండ్ అయిన కారణంగా అతనికి చెల్లించిన 70శాతం డబ్బును తిరిగి ఇచ్చేయండి. అతను చేసుకున్న కాంట్రాక్ట్‌లో భాగంగా చెక్ రూపంలో చెల్లించాం. దాన్ని పీసీబీ ద్వారానే సదరు క్రికెటర్‌కు అందజేశాం. దాంతో ఉమర్‌కు అందజేసిన డబ్బులు విషయంలో పీసీబీదే బాధ్యత’ అని ఫ్రాంచైజీ అధికారి ఒకరు తెలిపారు. పీఎస్ఎల్లో ఆటగాళ్ల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నగదును క్రికెట్ బోర్డు ద్వారానే ఇప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్మల్‌కు 70 శాతం కాంట్రాక్ట్ మొత్తాన్ని చెల్లించారు. (ఇక్కడ చదవండి: ‘జీవితకాల నిషేధం విధించండి’) అబ్దుల్ రజాక్‌ను ‘అమ్మ’ను చేసేశాడు..! -
పాకిస్తాన్లో టీమిండియా ఆడాలని..
లాహోర్: టీమిండియా-పాకిస్తాన్ క్రికెట్ జట్లు ఒక ద్వైపాక్షిక సిరీస్ ఆడి చాలా ఏళ్లే అయ్యింది. చివరిసారి 2008లో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్ జరిగితే.. ఐసీసీ నిర్వహించే మేజర్ ఈవెంట్లలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. 2013 నుంచి ఇరు జట్ల మధ్య ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా జరగలేదు. అయితే తమతో టీమిండియా ఆడాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పదే పదే విజ్ఞప్తి చేసినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. కాగా, పాకిస్తాన్లో క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం టీమిండియా క్రికెట్ జట్టు తమ దేశం రావాలని కోరుకుంటున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిమానులు ప్లకార్డుల పట్టుకుని మరీ తమ కోరికను వెల్లడించారు. భారత క్రికెట్ జట్టు తమ దేశం రావాలని వారు బ్యానర్లతో స్టేడియంలో కనిపించారు. దీనిని పాకిస్తాన్ జర్నలిస్టు సజ్ సిద్ధిక్ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీనికి ‘లాహోర్ ఫ్యాన్స్ భారత్‌ను పాకిస్తాన్ రావాలని కోరుకుంటున్నారు’ అని క్యాప్షన్‌లో ఇచ్చాడు. ఇటీవల షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది లాంటి మాజీ క్రికెటర్లు భారత్ తమ దేశం రావాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల రాజకీయ సమస్యలను పక్కన పెట్టి క్రీడను క్రీడగా చూడాలని వారు కోరారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్‌లను ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. -
ఫోన్ మాట్లాడుతూ దొరికిపోయాడు!
కరాచీ: ఇప్పటికే మ్యాచ్ ఫిక్సింగ్ ఘటనలతో బెంబేలెత్తిపోతున్న పాకిస్తాన్ క్రికెట్లో తాజాగా మరో అలజడి రేగింది. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదాలతో సతమవుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఓ అధికారి డగౌట్లో ఫోన్ మాట్లాడుతూ కనిపించడంతో తీవ్ర దుమారం రేపింది. తాజా పీఎస్ఎల్లో భాగంగా కరాచీ కింగ్స్-పెషావర్ జల్మీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మాజీ అధికారి ఒకరు మొబైల్ ఫోన్‌ను డగౌట్‌లోకి తీసుకొచ్చారు. అదే క్రమంలో ఫోన్లో మాట్లాడుతూ కనిపించిన దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో దుమారం రేగింది. దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. లీగ్ ప్రారంభమైన రెండో రోజే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పాకిస్తాన్ క్రికెట్ పెద్దల్లో ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటన పాకిస్తాన్ క్రికెట్‌కు మరొకసారి మచ్చను తెచ్చిపెట్టింది. (ఇక్కడ చదవండి: ‘జీవితకాల నిషేధం విధించండి’) అసలు ఆ అధికారి ఎవరు, ఎందుకు ఫోన్ తీసుకొచ్చి నిబంధనల్ని ఉల్లఘించాడని కాసేపు తలలు పట్టుకున్నారు. దీనిపై అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. డగౌట్లో ఫోన్లో మాట్లాడటాన్ని ఐసీసీ ఎప్పట్నుంచి అనుమతిస్తుందంటూ జోక్‌లు పేల్చుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)నిబంధనల ప్రకారం డగౌట్లో ఆటగాళ్లు కానీ అధికారులు కానీ మొబైల్ ఫోన్లను వాడకూడదు. ఇది నిబంధనలకు వ్యతిరేకం. కేవలం వాకీ టాకీలను మాత్రమే అనుమతిస్తారు. డగౌట్ నుంచి డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ఆటగాళ్లతో సంభాషించడానికి వాకీ టాకీలను వినియోగిస్తారు. మరి మాజీ అధికారి డగౌట్‌లోకి మొబైల్ ఫోన్ తీసుకురావడం ఏమటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై కరాచీ కింగ్స్ మేనేజర్ ఫైజల్ మీర్జా వివరణ ఇస్తూ.. జట్టు మేనేజర్‌గా పని చేసిన తారిక్ వాసీ ఇలా ఫోన్లో మాట్లాడిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించినట్లు తెలిపారు. ఈ మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ నాలుగ వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగా, పెషావర్ జట్టు 191 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. -
నిషేధం తర్వాత క్రికెట్లోకి రీఎంట్రీ
కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన ఆ దేశ క్రికెటర్ షార్జీల్‌ఖాన్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. షార్జిల్‌కు ఆ దేశ యాంటీ కరప్షన్ యూనిట్(అవినీతి నిరోధక శాఖ) నుంచి క్లియరెన్స్ లభించడంతో అతను ఆడటానికి మార్గం సుగుమం అయ్యింది. ఈ మేరకు ఇటీవల పీసీబీ యాంటీ కరప్షన్ యూనిట్ ముందు హాజరైన షార్జిల్ ఖాన్‌కు దేశవాళీ ఈవెంట్లలో ఆడటానికి అనుమతి లభించింది. దాంతో త్వరలో ఆరంభం కానున్న పీఎస్ఎల్లో షార్జిల్ ఆడనున్నాడు. పీఎస్ఎల్ ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లో షార్జిల్ చేరబోతున్నాడు. పాకిస్తాన్ తరఫున 25 వన్డేలు, ఏకైక టెస్టు, 15 అంతర్జాతీయ టీ20లు ఆడిన షార్జిల్.. పీఎస్ఎల్ రెండో ఎడిషన్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. దాంతో 2017, ఆగస్టులో అతనిపై ఐదేళ్ల నిషేధం విధిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. కాగా, తనను క్షమించాలంటూ పీసీబీకి షార్జిల్ విన్నవించుకోవడంతో అతనిపై ఉన్న నిషేధాన్ని రెండేళ్లకే పరిమితం చేశారు. దాంతో షార్జిల్‌పై నిషేధం ముగిసింది. దాంతో షార్జిల్ తన కెరీర్‌ను తిరిగి కొనసాగించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. కాగా, ఖలీద్ లతీఫ్, మహ్మద్ ఇర్ఫాన్, మహ్మద్ నవాజ్, నసీర్ జెంషెడ్, షహ్‌జైబ్ హసన్‌లు ఇంకా నిషేధం ఎదుర్కొంటున్నారు. -
క్యాచ్ వదిలేశాడు.. రివ్యూ కోరాడు!
లాహోర్: క్యాచ్ వదిలేసి రివ్యూ కోరిన పాక్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ‘పాకిస్తాన్ కప్’లో భాగంగా ఈ నెల 2న లిస్ట్ ఎ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఇందులో ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ఫెడరల్ ఏరియాస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న షెజాద్.. ఖైబర్ పఖ్తుంఖ్వాతో జరిగిన మ్యాచ్‌లో చేతిలో పడిన క్యాచ్‌ను వదిలేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు రివ్యూ కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఖైబర్ పఖ్తుంఖ్వా ఆటగాడు ఖుష్దిల్ షా భారీ షాట్‌కు యత్నించాడు. డీప్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న షెహజాద్ బంతిని అందుకునే ప్రయత్నంలో జారవిడిచాడు. కిందపడిన బంతిని తిరిగి చేతిలోకి తీసుకుని క్యాచ్ అందుకున్నట్టు నటించాడు. అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించడంతో రివ్యూ కోరి అభాసుపాలయ్యాడు. కిందపడిన బంతిని తీరిగ్గా చేతుల్లోకి తీసుకున్నట్టు రివ్యూలో స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతుండడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ ఆటగాళ్లు చీటింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ‘గతంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కూడా నువ్వు ఇలానే చేశావ్.. ఉమర్ అక్మల్‌ను తలపిస్తున్నావ్. మీకు అసలు బుర్ర ఉందా అంటూ ఒకరు ఎద్దేవా చేయగా, ‘సరైన క్రికెట్ ఆడని నువ్వు.. గిల్లీ దండా ఆడుకో’ అని మరొక అభిమాని విమర్శించాడు. ‘నువ్వు కెమెరా ఆన్‌లో ఉండగానే ఇలా చీట్ చేస్తే, కెమెరా ఆన్‌లో లేని దేశవాళీ క్రికెట్లో ఇలాంటివి ఎన్ని మోసాలు చేశావో’ అంటూ మరొకరు విరుచుకుపడ్డారు. ‘నువ్వు మహా నటుడిలా ఉన్నావే’ అని మరొక అభిమాని చమత్కరించాడు. -
క్యాచ్ వదిలేశాడు.. రివ్యూ కోరాడు!
-
పాక్ క్రికెటర్ నోట.. ఐపీఎల్ మాట
కరాచీ: మరో 12 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12 సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 23వ తేదీన ఆరంభమయ్యే ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ పొట్టి క్రికెట్ సంగ్రామం కోసం క్రికెట్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరుగాంచిన ఐపీఎల్‌పై పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ పాకిస్తాన్లో జరుగుతుందంటూ నోరుజారాడు. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్ఎల్)కు బదులుగా 'ఐపీఎల్' అని వ్యాఖ్యానించి నాలుక కరచుకున్నాడు. పీఎస్ఎల్ మొత్తం పాకిస్తాన్లో జరగదు. ఈ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి యూఏఈలో నిర్వహిస్తున్నారు. అయితే, నాకౌట్ మ్యాచ్‌లు లేదా పైనల్ మ్యాచ్‌ని మాత్రమే పాకిస్తాన్లో నిర్వహిస్తున్నారు. తాజా సీజన్లో లీగ్ మ్యాచ్‌లకు దుబాయి ఆతిథ్యమిస్తుండగా. ప్లే ఆఫ్ మ్యాచ్‌లు కరాచీలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమర్ అక్మల్ ఓ వీడియోని ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. అందులో ‘సొంతగడ్డపై అభిమానుల మద్దతు ఉంటే.. వచ్చే ఐపీఎల్ పాకిస్తాన్‌లోనే జరుగుతుంది’ అని ఉమర్ అక్మల్ అన్నాడు. ఆపై వెంటనే తేరుకున్న ఉమర్ అక్మల్ సారీ.. పీఎస్ఎల్ పాకిస్తాన్‌లోనే జరుగుతుందని సరిదిద్దుకునే యత్నం చేశాడు. -
మీకు ఐపీఎల్ కావాలా.. పాక్ లీగ్ కావాలా?
న్యూఢిల్లీ: ఇప్పటికే పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు దూరంగా ఉంటున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఆ దేశంతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవడానికి సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడుతున్న విదేశీ క్రికెటర్లకు సైతం బీసీసీఐ అల్టిమేటం జారీ చేసే యోచనలో ఉంది. పీఎస్ఎల్లో ఆడుతున్న క్రికెటర్లను ఐపీఎల్ నుంచి నిషేధించేందుకు కసరత్తులు చేస్తోంది. జాతీయ వార్తాసంస్థ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం మేరకు పీఎస్ఎల్లో ఆడే విదేశీ క్రికెటర్లను ఐపీఎల్ నుంచి తప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకవేళ ఐపీఎల్ కావాలనుకుంటే పీఎస్ఎల్లో ఆడకూడదనే ఆదేశాలు జారీ చేయాలని భావిస్తోంది. ఆ రెండు లీగ్‌ల్లో ఏది కావాలో ఆయా క్రికెటర్లు తేల్చుకోవాలని తేల్చిచెప్పేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు సోమవారం భారత క్రికెట్ పరిపాలక కమిటీ(సీఓఏ) సభ్యులు వినోద్ రాయ్, ఎడ్జుల్డీ, బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రిల మధ్య జరిగిన సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇప్పటికే పీఎస్ఎల్, ఐపీఎల్ ఆడుతున్న స్టార్ క్రికెటర్లు డ్వేన్ బ్రేవో, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, ఏబీ డివిలియర్స్‌లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ రెండింటిలో ఏదొక లీగ్ మాత్రమే ఎంచుకోవాలని బీసీసీఐ ప్రతిపాదన చేస్తే మాత్రం సదరు క్రికెటర్లకు కొత్త చిక్కు వచ్చిపడినట్లే. -
పీఎస్ఎల్లో డివిలియర్స్
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ ఐదు నెలల కిందట ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. అయితే, ఆ తర్వాత తాను మళ్లీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టే విషయంపై స్పష్టతనివ్వలేదు. ఇటీవలే వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2019 సీజన్లో తాను ఆడనున్నట్లు తెలిపాడు. తాజాగా మరో టీ20 లీగ్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆధ్వర్యంలో జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో పాల్గొనేందుకు డివిలియర్స్ సిద్ధమయ్యాడు. వచ్చే ఏడాది జరగనున్న సీజన్లో తాను అరంగేట్రం చేయబోతున్నానని 34 ఏళ్ల ఏబీ డివిలియర్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియో సందేశాన్ని ట్విటర్లో పోస్ట్ చేస్తూ 2019 ఫిబ్రవరిలో జరిగే పీఎస్ఎల్లో తాను భాగస్వామ్యం కాబోతున్నట్లు చెప్పాడు. -
లో–కాస్ట్ గృహాలకు ఊతం!
ముంబై: అందరికీ గృహం, ఇందుకు సంబంధించి రుణ సౌలభ్యానికి ‘ప్రాధాన్యతా పరిధి’ విస్తరణ లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాధాన్యతా రంగం కింద గృహ రుణ (పీఎస్ఎల్) పరిమితుల్ని పెంచటం ఈ నోటిఫికేషన్ ప్రధాన ఉద్దేశం. ఇందులో ముఖ్యాంశాలు చూస్తే... ♦ మెట్రో నగరాలు... అంటే 10 లక్షలు ఆ పైబడి ప్రజలు నివసిస్తున్న నగరాల్లో ఇక రూ.35 లక్షల వరకూ గృహ రుణాన్ని ప్రాధాన్యతా రంగ రుణంగానే పరిగణిస్తారు. అయితే ఆ ఇంటి నిర్మాణ వ్యయం రూ.45 లక్షలు దాటకూడదు. ♦ ఇతర నగరాల్లో రూ.30 లక్షల వరకూ గృహ నిర్మాణ వ్యయానికి రూ.25 లక్షల వరకూ లభించే గృహ రుణాన్ని ప్రాధాన్యతా రంగంగా పరిగణించడం జరుగుతుంది. ప్రాధాన్యతా పరిధి ప్రయోజనం ఏమిటి? ప్రాధాన్యతా రంగం పరిధిలో రుణమంటే... దీనిపై విధించే వడ్డీ, మార్కెట్ రేటుకన్నా తక్కువగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి ఇదీ... ప్రస్తుతం మెట్రోల్లో రూ.28 లక్షల వరకూ గృహ రుణం ప్రాధాన్యతా రంగం పరిధిలోకి వస్తోంది. ఇతర ప్రాంతాలకు సంబంధించి ఈ పరిమితి రూ. 20 లక్షలుగా ఉంది. మెట్రోల్లో రూ.35 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ.25 లక్షల వ్యయాలకు లోబడి గృహాలను నిర్మించుకుంటేనే ప్రాధాన్యతా రంగం పరిధిలో వడ్డీ సౌలభ్యత లభిస్తోంది. కుటుంబ ఆదాయ పరిమితీ పెంపు... ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్), దిగువ ఆదాయ గ్రూప్ (ఎల్ఐజీ)లకు హౌసింగ్ ప్రాజెక్టుల విషయమై రుణానికి ప్రస్తుత కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి రూ.2 లక్షలు. దీనిని కూడా ఆర్బీఐ సవరించింది. ఈడబ్ల్యూఎస్‌కు సంబంధించి వార్షికాదాయ పరిమితిని రూ.3 లక్షలకు,. ఎల్‌ఐజీకి సంబంధించి రూ.6 లక్షలకు సవరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్దేశించిన ఆదాయ విధానం ప్రకారం ఈ మార్పులు చేశారు. నిజానికి ఆయా నిబంధనల సడలింపు విషయాన్ని జూన్ 6 న జరిగిన పరపతి విధాన సమీక్ష సందర్భంగానే ఆర్బీఐ ప్రకటించింది. ఇప్పుడు ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. -
స్టేడియంలో అభిమానుల వీరంగం .. వీడియో వైరల్
కేప్‌టౌన్ : ప్రీమియర్ సాకర్ లీగ్(పీఎస్ఎల్) సెమీఫైనల్ మ్యాచ్‌లో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ అభిమాన ఫుట్‌బాల్ జట్టు ఓటమిని జీర్ణించుకోలేక గ్రౌండ్లోకి చొచ్చుకువచ్చి ఇష్టానుసారం దాడులకు దిగారు. మోసెస్ మబిదా స్టేడియంలో జరిగిన ఘటనకు సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. జొహన్నస్‌బర్గ్‌కు చెందిన కైజర్ ఛీఫ్స్ జట్టు నెడ్ బ్యాంక్ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో 2-0 తేడాతో ఫ్రీ స్టేట్ స్టార్స్ జట్టుపై ఘోరంగా ఓడిపోయింది. మ్యాచ్ ముగిసిన వెంటనే తమ అభిమాన జట్టు ఓటమిని జీర్ణించుకోలేని అభిమానులు ఆగ్రహావేశాలతో స్టేడియంలోకి చొచ్చుకువచ్చి గ్రౌండ్‌ను ధ్వంసం చేశారు. అనంతరం గ్రౌండ్లోకి వచ్చి సెక్యురిటీ గార్డులపై దాడికి దిగారు. ఈ హఠాత్పరిణామంతో షాక్‌కు గురైన ఇరుజట్లకు చెందిన క్రీడాకారులు ఒక్కసారిగా గ్రౌండ్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఆందోళనకారులు బారీకేడ్లను కిందపడేసి, కుర్చీలు విసిరేసి, కెమెరాలు ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. గ్రౌండ్లో కొన్నిచోట్ల నిప్పు కూడా పెట్టారు. పోలీసులు టియర్ గ్యాస్, స్టన్ గ్రెనేడ్స్‌లను ఆందోళనకారులపై ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కాగా, కైజర్ ఛీఫ్స్ జట్టు ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ, జట్టు కోచ్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ దాడిలో ఇద్దరు సెక్యురిటీ గార్డులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రౌండ్లో చోటు చేసుకున్న పరిణామాలపై పీఎస్ఎల్ ఓ ప్రకటనను విడుదల చేసింది. మోసెస్ మబిదా స్టేడియంలో మ్యాచ్ అనంతరం జరిగిన అల్లర్ల సంఘటనను పీఎస్ఎల్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. కాగా, ఈ ఘటనలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఫుట్‌బాల్ జట్టు ఓటమిని జీర్ణించుకోలేక...
-
ఐపీఎల్లో అవకాశమిచ్చినా ఆడను: అఫ్రిది
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి తన పరుష వ్యాఖ్యలతో భారత అభిమానులకు ఆగ్రహం తెప్పించాడు. రెండు రోజుల క్రితమే కశ్మీర్‌పై సంచలన ట్వీట్ చేసిన ఈ పాక్ మాజీ ఆటగాడు ఈ సారి ఐపీఎల్‌పై తన అక్కసు వెల్లగక్కాడు. ఐపీఎల్లో ఆడే అవకాశమిచ్చినా తాను ఆడనని పాక్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌తో వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా భవిష్యత్తులో పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్) ఐపీఎల్ కన్నా పెద్ద టోర్నీగా అవతరిస్తోందని జోస్యం చెప్పాడు. ఈ విషయాన్ని సదరు వెబ్సైట్ ఎడిటర్ సాజ్ సదిఖ్ ట్విటర్లో పేర్కొన్నాడు. ‘వారు ఒక వేళ ఐపీఎల్లో ఆడాలిని పిలిచినా.. నేను వెళ్లను. మా పీఎస్ఎల్ భవిష్యత్తులో ఐపీఎల్ కన్నా పెద్ద లీగ్‌గా అవతరిస్తోంది. నేను ప్రస్తుతం పీఎస్ఎల్ను ఆస్వాదిస్తున్నాను. నాకు ఐపీఎల్ ఆడాల్సిన అవసరం లేదు. అసలు నాకు ఐపీఎల్ అంటేనే ఆస్తక్తి లేదు.’ అని అఫ్రిది అభిప్రాయపడ్డాడు. తాను దేశ సైనికుడి వంటి వాడినని, తన దేశమంటే తనకెంతో గౌరవమని అప్రిదీ తెలిపాడు. పాకిస్తాన్ తనకన్నీ ఇచ్చిందని, ఒకవేళ తాను క్రికెటర్‌ను కాకుంటే పాక్ సైన్యంలో చేరేవాడినని పేర్కొన్నాడు. గతంలో అఫ్రిది ఇదే ఐపీఎల్‌ను ప్రశంసిస్తూ ఆకాశానికెత్తాడు. ‘నేనొక్కసారే ఐపీఎల్లో ఆడా. కానీ ఇది ఓ గొప్ప టోర్నీ.. ఈ లీగ్‌లో ఆడటంతో ప్రత్యేక అనూభూతి కలిగింది.’ అని ఈ క్యాష్ రిచ్ లీగ్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇక అఫ్రిది ఐపీఎల్ తొలి సీజన్లో అప్పటి డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. అయితే అఫ్రిది ఐపీఎల్‌పై తనకున్న అభిప్రాయాన్ని ఇలా యూటర్న్ చేసుకోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కశ్మీర్ వ్యవహారంలో తల దూర్చి సొంత అభిమానుల ఆగ్రహానికే గురైన అఫ్రిదిపై.. భారత క్రికెటర్లు సైతం తమదైన శైలిలో మండిపడ్డారు. ఇక భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న వివాదంతో ఆ దేశ ఆటగాళ్లను ఐపీఎల్‌కు అనుమతించడం లేదన్న విషయం తెలిసిందే. Shahid Afridi "Even if they call me, I won't go to the IPL. My PSL is the biggest and there will be a time that it leaves the IPL behind. I am enjoying the PSL, I don't have any need for the IPL. I'm not interested in it and never was" #Cricket — Saj Sadiq (@Saj_PakPassion) 4 April 2018 -
పాక్ అభిమానులను ఫూల్స్ చేసిన క్రికెటర్
సాక్షి, హైదరాబాద్ : ఏప్రిల్ 1 సందర్భంగా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ అభిమానులను సరదాగా ఆటపట్టించాడు. ఇటీవల పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో అదరగొట్టిన ఈ విండీస్ స్టార్.. అక్కడ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. పీఎస్ఎల్లో సామీ పెష్వార్జల్మీ జట్టుకి సారథ్యం వహించిన విషయం తెలిసందే. అయితే గత కొన్నాళ్లుగా విండీస్ జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సామీ.. తాను మళ్లీ తన దేశానికి పాత్రినిధ్యం వహించాలనుకుంటున్నానని, పాక్‌లో జరుగుతున్న టీ20 సిరీస్‌లో పాల్గొంటానని ట్వీట్ చేశాడు. ‘మీరు ఇది నమ్మలేరు.. నేను మెరున్(విండీస్ జెర్సీ) జెర్సీ వేసుకొని పాక్‌లో మెరుస్తాను.’ అని ట్వీట్లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌తో షాక్‌కు గురైన అభిమానులు ఆనందంతో పరవశించిపోయారు. ముఖ్యంగా పాక్ నెటిజన్లు సామీ రాకను స్వాగతిస్తూ ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. మీ జల్మీ జట్టు సహచరుడు హసన్ అలీ నిన్ను తొలి బంతిని అవుట్ చేయడానికి సిద్దంగా ఉన్నాడు.’ అని ఒకరనగా నీ మాటలు నాకు తియ్యని పాటగా వినబుడుతున్నాయని మరొకరు కామెంట్ చేశారు. అయితే మరికొద్ది సేపట్లోనే వారి ఆనందం ఆవిరయ్యేలా చేశాడు ఈ విండీస్ మాజీ కెప్టెన్. ‘ఇది నేను ఊహించలేదు.. ఇంతటితో మెరున్ జెర్సీలో ఆడాలనే నా ఆలోచన ముగిసింది.’ అని ఏప్రిల్ ఫూల్ చేశాడు. అయితే ఈ ప్రాంక్‌పై సామీ క్షమాపణలు కోరుతూ చాలా మంది తాను జట్టులోకి తిరిగి రావలని కోరుకుంటున్నారని మరో ట్వీట్ చేశాడు. సామీ ట్వీట్‌కు పాక్ అభిమానులు స్పందించడానికి కూడా ఓ కారణం ఉంది. 9 ఏళ్ల తర్వాత విండీస్ జట్టు పాక్‌లో పర్యటిస్తుంది. పైగా ఈ సిరీస్‌కు విండీస్ సీనియర్ ఆటగాళ్లు సైతం దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే సామీ ట్వీట్‌కు వారు అంతగా స్పందించారు. I am sorry guys... but wow so many ppl want to see me back.. #AprilFoolsPrank pic.twitter.com/vzJiCTQFfN — Daren Sammy (@darensammy88) April 1, 2018 Sammy you are welcome always. But this time round your Zalmi mate HASSAN ALI will be waiting to get youout the first ball. Will be good to see you on the field again. I can say on behalf of all Pakistanis that Pakistan genuinely loves you for the way you have loved Pakistan. — MasoodSharif Khattak (@MSharifKhattak) April 1, 2018 -
సూపర్ డ్యాన్స్ : ఇక్కడ బ్రావో.. అక్కడ సామీ
-
వైరల్ : ఇక్కడ బ్రావో.. అక్కడ సామీ
సాక్షి, స్పోర్ట్స్ : మైదానంలో వైవిధ్యమైన డ్యాన్స్‌లతో ఆడుతూ..పాడుతూ ప్రేక్షకులను అలరించే విషయంలో వెస్టిండీస్ ఆటగాళ్లు ఎప్పుడూ ముందుంటారు. వినూత్నమైన డ్యాన్స్‌లను పరిచయం చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటారు. ఇలాంటి డ్యాన్స్‌లను విండీస్ ఆల్‌రౌండర్ డ్వాన్ బ్రావో ఐపీఎల్లో మనకెన్నో సార్లు చూపించాడు. అయితే పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో ఈ బాధ్యతను మరో ఆల్‌రౌండర్ డారెన్ సామీ తీసుకున్నాడు. తన ఆట పాటతో చిందేస్తూ అభిమానులు, తోటి ఆటగాళ్లలో జోష్ నింపుతున్నాడు. ఈ లీగ్‌లో పెష్వార్ జల్మీ జట్టుకు సారథ్యం వహిస్తున్న ఈ ఆల్ రౌండర్ తమ జట్టు ఫైనల్‌కు చేరిందన్న ఆనందంతో తోటి దేశవాళి ఆటగాడైన ఆండ్రూ ఫ్లెచర్‌తో కలిసి హోటల్ గదిలో సందిడి చేశాడు. ఫేమస్ బ్రిటీష్ కమెడియన్ మైఖల్ డపా ఆలపించిన ‘మ్యాన్స్ నాట్ హాట్’ అనే ర్యాప్ సాంగ్ పాడుతూ డ్యాన్స్ ఇరగదీశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇప్పటి వరకు పీఎస్ఎల్ లీగ్ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగగా.. ఫైనల్ మ్యాచ్‌కు కరాచీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆదివారం జరిగే తుది పోరులో పెష్వార్ జల్మీ, ఇస్లామాబాద్ యూనైటెడ్ జట్లు తలపడనున్నాయి. -
ఐపీఎల్లో తొలిసారి..
న్యూఢిల్లీ: ఇప్పటివరకూ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకే పరిమితమైన అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి(డీఆర్ఎస్)ను ఇక నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చూడబోతున్నాం. దీనిపై గత కొంతకాలంగా జరుగుతున్న చర్చకు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఎట్టకేలకు ముగింపు పలికారు. వచ్చే సీజన్ ఐపీఎల్లో డీఆర్ఎస్ను ప్రవేశపెట్టబోతున్న విషయాన్ని శుక్లా ధృవీకరించారు. ఫలితంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో డీఆర్ఎస్ విధానం తొలిసారి ప్రవేశపెట్టబోతున్నట్లయ్యింది. 'ఐపీఎల్లో డీఆర్ఎస్ ప్రవేశపెట్టే ఆలోచన ఎప్పటినుంచో ఉంది. దాన్ని ఈసారి అమలుచేయబోతున్నాం' అని శుక్లా తెలిపారు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ-చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని మాత్రమే ఐపీఎల్ ఆరంభ వేడుకులకు రావడంపై శుక్లా వివరణ ఇచ్చారు. అందరు కెప్టెన్లు వేడుకలకు రావడం వల్ల మరుసటి రోజు మ్యాచ్‌లకు హాజరయ్యే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అందుకే మొదటి మ్యాచ్ కెప్టెన్లు మినహా మిగతా జట్ల కెప్టెన్లను ప్రారంభ వేడుకలకు దూరం పెట్టామన్నారు. గతేడాది పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో భాగంగా ప్లే ఆఫ్ స్టేజ్ మ్యాచ్‌లకు డీఆర్ఎస్ను ఉపయోగించారు. తద్వారా టీ 20 టోర్నమెంట్లలో తొలిసారి డీఆర్ఎస్ను ఉపయోగించిన ఘనత పీఎస్ఎల్ దక్కించుకుంది. ఇక 2017 అక్టోబర్‌లో అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌ల్లో డీఆర్ఎస్ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. -
హెలికాప్టర్లతో అవుట్ ఫీల్డ్‌ను ఆరబెట్టారు
-
హెలికాప్టర్లతో అవుట్ ఫీల్డ్ రెడీ చేశారు...
లాహోర్: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఏ చిన్న కారణంతోనైనా మ్యాచ్ జరగపోతే ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులోనూ నాకౌట్ మ్యాచ్‌లంటే మరీ ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ప్రధానంగా వర్షం వెలిసిన తర్వాత అవుట్ ఫీల్డ్‌ను సిద్ధం చేయడంలో క్రికెట్ బోర్డులో సరైన చర్యలు తీసుకోలేకపోతే విమర్శలు వర్షం కురుస్తోంది. ఇలా చేయాలంటే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా తమవద్ద ఉన్న వనరులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సద్వినియోగం చేసుకుని మ్యాచ్ సజావుగా జరిగేలా చేసిన ఘటన పీఎఎస్ఎల్ చోటు చేసుకుంది. అందుకు హెలీకాప్టర్లను సైతం ఉయోగించుకుని శభాష్ అనిపించింది. బుధవారం పెషావర్ జల్మీ-కరాచీ కింగ్స్ జట్ల మధ్య ఎలిమినేటర్-2 మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌కు ముందు వర్షం పడటంతో అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దాంతో సాధ్యమైనన్ని ఓవర్ల పాటు మ్యాచ్‌ను జరిపించాలని భావించిన పీసీబీ పెద్దలు ఉన్నపళంగా రెండు హెలికాప్టర్లను తెప్పించారు. వాటి సాయంతో అవుట్ ఫీల్డ్‌ను ఆరబెట్టారు. ఇది నాకౌట్ మ్యాచ్ కావడంతో హెలికాప్టర్లతో పిచ్‌ను సిద్ధం చేయడం ఒక్కటే మార్గమని తలచిన పీసీబీ.. ఆ మేరకు చర్యలు తీసుకుని సక్సెస్ అయ్యారు. ఆ క్రమంలోనే 16 ఓవర్ల పాటు మ్యాచ్ జరపడానికి అంపైర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో పెషావర్ జల్మీ 13 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. -
‘మా క్రికెట్ బోర్డు పెద్దలే కారణం’
కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) భాగంగా తమ దేశంలో జరగబోయే ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఆడటానికి విదేశీ క్రికెటర్లు ఆసక్తి చూపకపోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది చాలా బాధాకర విషయమని ఆవేదన వ్యక్తం చేసిన మొయిన్.. దీనింతటికీ తమ దేశ క్రికెట్ బోర్డు పీసీబీనే కారణమన్నాడు. ఈ సీజన్ పీఎస్ఎల్ లీగ్ మ్యాచ్‌లు యూఏఈ వేదికగా జరగగా, ప్లే ఆఫ్ మ్యాచ్‌లు మాత్రం పాకిస్తాన్లో జరగాల్సి ఉంది. అయితే పాకిస్తాన్‌కు రావడానికి విదేశీ ఆటగాళ్లు నిరాకరించడంపై మొయిన్ ఖాన్ మండిపడ్డాడు. ఇలా జరగడానికి పీసీబీ ఉదాసీనతే కారణమని విమర్శలకు దిగాడు. ‘ఇటువంటి బాధాకర పరిస్థితికి మా క్రికెట్ బోర్డు పెద్దలే కారణం. పాకిస్తాన్లో విదేశీ ఆటగాళ్లు ఆడితేనే పీఎస్ఎల్లో ఆడటానికి అనుమతించాలి. మా బోర్డు మాత్రం లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లకు ఎటువంటి ఆంక్షలు విధించలేదు. అందుకే పాకిస్తాన్లో ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు విదేశీ ఆటగాళ్లు రావడానికి మొగ్గుచూపడం లేదు. మా బోర్డుకు నా మాటలు రుచించకపోవచ్చు. భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటే పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి, పీఎస్ఎల్ పరిస్థితి దారుణంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పాకిస్తాన్లో క్రికెట్‌ను బ్రతికించుకునేందుకు పీసీబీ సీరియస్‌గా దృష్టి సారించాలి' అని మొయిన్ ఖాన్ తెలిపాడు. పీఎస్ఎల్లో క్వెటా గ్లాడియేటర్స్ హెడ్ కోచ్‌గా మొయిన్ ఖాన్ వ్యవహరిస్తున్నాడు. -
ఐపీఎల్‌కు ముందే నైట్‌రైడర్స్‌కు షాక్!
సాక్షి, స్పోర్ట్స్ : వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టె వెస్టిండీస్ ఆఫ్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఐపీఎల్లో ఆడేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో భాగంగా క్వెటా గ్లాడియేటర్స్-లాహోర్ క్వాలండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నరైన్ బౌలింగ్ యాక్షన్ ఐసీసీ నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారులు వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్‌కు రిపోర్ట్ చేశారు. వెస్టిండీస్ బోర్డు తీసుకునే నిర్ణయంపైనే నరైన్ ఐపీఎల్ భవిష్యత్తు తేలనుంది. ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్లో నరైన్ లేకుంటే కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఐపీఎల్లో నరైన్ బంతితో పాటు బ్యాట్‌తో మెరుపులు మెరిపించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. గతంలో సైతం సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌లో నిషేధం ఎదుర్కొన్నాడు. అనంతరం తన బౌలింగ్ శైలి మార్చుకోని తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్న నరైన్‌పై మరో సారి ఈ తరహా ఆరోపణలు రావడం గమనార్హం. -
వైరల్.. బూమ్ బూమ్ అఫ్రిది!
సాక్షి, స్పోర్ట్స్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిని అభిమానులు బూమ్ బూమ్ అనే ముద్దు పేరుతో పిలుస్తారు. మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ మాజీ క్రికెటర్ ఆ పాత బూమ్ బూమ్ అఫ్రిదిని మరోసారి గుర్తు చేస్తూ.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో చెలరేగిపోయాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌లో గురువారం పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది ఏకంగా వరుస నాలుగు బంతుల్లో నాలుగు సిక్స్‌లు బాదాడు. ఇవన్నీ భారీ సిక్సులే కావడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. బూమ్ బూమ్ అఫ్రిదీ అంటూ తెగ సంబరపడిపోయారు. అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఐదో బంతిని సైతం సిక్సుకు తరలించాలని భావించిన అఫ్రిది క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్‌లొ అఫ్రిది ప్రాతినిథ్యం వహిస్తున్న కరాచీ కింగ్స్ 44 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ప్రస్తుతం అఫ్రిది బూమ్ బూమ్ షో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అయితే పీఎస్ఎల్లో ఇది రికార్డు కావడం విశేషం. ఇక పీఎస్ఎల్ తొలి దశలో బౌండరీ లైన్ వద్ద అఫ్రిది అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఈ వీడియో సైతం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. -
వరుస సిక్సులతో అలరించిన అఫ్రిది
-
సహనం కోల్పోయి ఫీల్డర్‌పైకి బంతి విసిరేశాడు
-
వీడియో వైరల్: ఫీల్డర్‌పైకి బంతి విసిరిన బౌలర్!
షార్జా: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో మరోసారి ఇద్దరు పాకిస్తాన్ క్రికెటర్లు సహనం కోల్పోయి ప్రవర్తించారు. బుధవారం క్వెటా గ్లాడియేటర్స్-లాహోర్ క్వాలండర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. దీనిలో భాగంగా లాహోర్ క్వాలండర్స్ ఆటగాళ్లు సొహైల్ ఖాన్-యాసిర్ షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. క్వెటా ఇన్నింగ్స్ భాగంగా 19 ఓవర్‌ను లాహోర్ బౌలర్ సొహైల్ అందుకున్నాడు. ఆ క్రమంలోనే నాల్గో బంతికి సొహైల్ తన నియంత్రణను కోల్పోయాడు. ఫీల్డింగ్ సెట్ చేసే క్రమంలోనే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న యాసిర్ షాను ఫలానా చోట ఫీల్డింగ్ చేయాలంటూ ఆదేశించాడు. దానికి యాసిర్ షా నుంచి సరైన స్పందన రాకపోవడంతో అతనిపైకే బంతి విసిరి అక్కడ ఫీల్డింగ్‌లో నిలబడు అంటూ అసహనాన్ని ప్రదర్శించాడు సొహైల్. ఈ క్రమంలోనే యాసిర్-సొహైల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ బంతిని తిరిగి అందుకున్న యాసిర్.. సొహైల్ వైపు అంతే వేగంగా విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. గత వారం గ్లాడియేటర్స్ పేసర్ రహత్ అలీ, కరాచీ కెప్టెన్ ఇమాద్ వసీంల మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. -
పాకిస్తాన్ క్రికెటర్ల వాగ్వాదం!
-
పాకిస్తాన్ క్రికెటర్ల వాగ్వాదం!
దుబాయ్: మైదానంలో క్రీడా స్ఫూర్తిని పక్కకు పెట్టి మరీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగుతున్న ఘటనలు ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారిపోయాయి. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఇద్దరు పాకిస్తాన్ క్రికెటర్లు నియంత్రణ కోల్పోయి తమ నోటికి పని చెప్పారు. గురువారం క్వెటా గ్లాడియేటర్స్-కరాచీ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. దీనిలో భాగంగా గ్లాడియేటర్స్ పేసర్ రహత్ అలీ, కరాచీ కెప్టెన్ ఇమాద్ వసీంల మధ్య వాగ్వాదం జరిగింది. కరాచీ ఇన్నింగ్స్‌లో భాగంగా రహత్ అలీ వేసిన 16 ఓవర్లో ఇమాద్ వసీం అవుటయ్యాడు. ఆ వికెట్‌ను సాధించిన ఆనందంలో రహాత్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అది ఇమాద్ వసీంకు కోపం తెప్పించింది. రహాత్ అలీ వైపు చూస్తూ తన అసహనాన్ని ప్రదర్శించాడు. దానికి సమాధానంగా రహత్ అలీ 'ఇక నువ్వు స్టేడియంలోకి వెళ్లు' అనే అర్ధం వచ్చేలా చేయి చూపించాడు. దాంతో మరింత ఆవేశానికి గురైన ఇమాద్.. రహత్ అలీ మీదకు దూసుకొచ్చే యత్నం చేశాడు. అయితే వికెట్ కీపర్ సర్ది చెప్పి రహత్ అలీని పక్కకు తీసుకు వెళ్లగా, ఇమాద్ మాత్రం తిట్టుకుంటూ మైదానం విడిచాడు. కాగా, పాకిస్తాన్ జాతీయ జట్టుకు ఆడిన ఇద్దరు క్రికెటర్ల మధ్య ఇలా మాటల యుద్ధానికి దిగడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. -
పాక్ యువ సంచలనం షహీన్
దుబాయ్ : వసీం అక్రం, వకార్ యూనిస్, షాహిద్ ఆఫ్రిది వంటి దిగ్గజాలు తమ ప్రదర్శనతో పాకిస్తాన్ క్రికెట్ బౌలింగ్‌కు పర్యాయ పదాలుగా నిలిచారు. ఇప్పుడు మరో ‘ఆఫ్రిది’ తెరపైకి వచ్చాడు. తన ప్రదర్శనతో దుమ్ములేపుతున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో లాహోర్ క్వాలాండర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న షహీన్ ఆఫ్రిది కేవలం 4 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆరడుగుల ఆరు అంగుళాల ఎత్తు ఉండే షహీన్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. యార్కర్లను సంధించడంలోనూ దిట్ట. షహీన్‌కు ఆ దేశ దిగ్గజ పేసర్ వసీం అక్రం ఆదర్శం. వసీం అక్రమ్ తరహాలో ఎడమ చేతి వాటం బౌలర్. ఇక్కడ వసీం లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలరైతే, షహీన్ది లెఫ్టార్మ్ మీడియం ఫాస్ట్. లాహోర్ క్వాలాండర్స్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముల్తాన్ జట్టు ఒక దశలో 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఇక అక్కడ నుంచి షహీన్ బంతితో చెలరేగిపోయాడు. 3.4 ఓవర్లు వేసిన షహీన్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ప్రధానంగా 16వ ఓవర్లలో మూడు వికెట్లు దక్కించుకోవటం విశేషం. ఇలా తన అద్భుత ప్రదర్శనతో ముల్తాన్ సుల్తాన్స్ జట్టును 114 పరుగులకే కట్టడి చేశాడు. ఓవరాల్‌గా టీ20 ఫెర్మామెన్స్ గనుక గమనిస్తే... శ్రీలంక బౌలర్ హెరాత్ న్యూజిలాండ్‌పై, రషీద్ ఖాన్ ఐర్లాండ్‌పై, సోహైల్ తన్వీర్ ట్రిడెంట్స్ జట్టులపై 3 పరుగులిచ్చి ఐదేసి వికెట్లు పడగొట్టారు. ఈ లిస్ట్‌లో కుంబ్లేను (5 పరుగులు 5 వికెట్లు రాజస్థాన్ రాయల్స్ పై) కిందకి నెట్టి షహీన్ ఇప్పుడు నాలుగో స్థానంలో నిలిచాడు. అనతికాలంలోనే పాకిస్తాన్ క్రికెట్లోకి దూసుకొచ్చిన 17 ఏళ్ల యువ సంచలనం షహీన్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా బాగానే సంపాదించుకున్నాడు. అందులో పాక్ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ రమీజ్ రాజా కూడా ఉండటం విశేషం. ‘ ఒక కొత్త స్టార్ జన్మించాడు.. 17 ఏళ్ల షహీన్ ఆఫ్రిది పీఎస్ఎల్లో 5 వికెట్లు తీసిన యువ ఆటగాడు.. 22 బంతులు విసిరితే అందులో 18 డాట్ బాల్స్ ఉండటం అతని అద్భుత ప్రదర్శనకు నిదర్శనం.. ’అని అతని బౌలింగ్‌కు ఫిదా అయిన రమీజ్ రాజా ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు. A new star is born .. 17 year old Shaheen Afridi is youngest to 5 wickets in HBLPSL.. a triple wicket maiden over and 18 dots out of 22 bowled .. you kidding me.. — Ramiz Raja (@iramizraja) March 9, 2018 -
చైనాలో క్రికెట్ పేరు విని బిత్తరపోయాడు!
-
చైనాలో క్రికెట్ పేరు విని బిత్తరపోయాడు!
సాక్షి, స్పోర్ట్స్ : చైనాలో క్రికెట్‌ను ఏమంటారో తెలుసా అంటూ టీమిండియా సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఓ ఫన్నీ వీడియోను పోస్టు చేశాడు. చైనాలో క్రికెట్‌కు అంతగా ఆదరణ ఉండదన్న విషయం అందరికి తెలసిందే. అయితే అనూహ్యంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఇద్దరు చైనా ప్లేయర్లు టోర్నీ మధ్యలో భాగస్వాములయ్యారు. క్రికెట్‌ను విస్తరించాలని పీఎస్ఎల్ జట్టైన పెషావర్ జాల్మీ చేపట్టిన ప్రచారంలో భాగంగా చైనా ఆటగాళ్లు యూఫై జాంగ్, జియాన్ లీలను ఎంపికచేసింది. ఈ నేపథ్యంలో చైనాలో క్రికెట్ ఆడుతారా? చైనాలో క్రికెట్ ను ఏమని పిలుస్తారు? అంటూ పీఎస్ఎల్ లో యాంకర్ ఆ క్రికెటర్లపై ప్రశ్నల వర్షం కురిపించాడు. చైనాలో క్రికెట్ ఆడుతారని యూఫై జాంగ్ తెలిపాడు. క్రికెట్ ను చైనాలో ''భాంచో'' అంటారని అన్నాడు. దీంతో యాంకర్ బిత్తరపోయాడు. పాకిస్తాన్ లో అదొక బూతు పదం. ఎవరి సోదరినైనా తిట్టాలంటే ఇంచుమించు ఆ పదంతో తిడుతుంటారు. కొంత మంది ఆ బూతును ఊతపదంగా వినియోగిస్తుంటారు. దీంతో 'ఏమంటారు?' అని మళ్లీ అడిగి స్పష్టంగా విన్నాడు. ఈ సమాధానికి యువరాజ్ సింగ్ నవ్వాపుకోలేక పోయాడు. తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేస్తూ, 'పంజాబీ పదంలా ఉంది కదా' అంటూ పేర్కొన్నాడు. -
కాస్ట్లీ క్రికెటర్.. ఐపీఎల్‌కు అనుమానమే!
సాక్షి, స్పోర్ట్స్: ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికిన వెస్టిండీస్ పేస్ బౌలర్, స్పీడ్ సెన్సేషన్ జోఫ్రా ఆర్చర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)కు దూరమయ్యాడు. పీఎస్ఎల్లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ విండీస్ క్రికెటర్ అనారోగ్యం కారణంగా తాజా సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు క్వెట్టా గ్లాడియేటర్స్ ట్వీట్ చేసింది. పీఎస్ఎల్లో రెండు మ్యాచ్‌లాడిన జోఫ్రా ఆర్చర్.. 2/30, 3/23 తో ఆకట్టుకున్నాడు. కడుపులో ఏదో సమస్య కారణంగా పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న విండీస్ బౌలర్ ఐపీఎల్లో ఆడతాడా లేదా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలే ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఎవరూ ఊహించని రీతిలో ఫాస్ట్ బౌలర్ ఆర్కర్ను రాజస్థాన్ రాయల్స్ రూ.7.2 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుండగా.. ఈ విండీస్ పేసర్ కోలుకుని అందుబాటులోకి వస్తాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. మరోవైపు తన ఆరోగ్య పరిస్థితిపై ఆర్చర్ ఏ విధంగానూ స్పందించడం లేదు. బౌలింగ్‌లో తనకు దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డెల్ స్టెయిన్ ఆదర్శమని ఆర్చర్ చెబుతుంటాడు. -
తాహీర్ హ్యాట్రిక్
-
పరుగు వ్యవధిలో 5 వికెట్లు!
షార్జా: క్రికెట్ అనేది ఫన్నీ గేమ్. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. అందులోనూ టీ 20 క్రికెట్ వచ్చిన తర్వాత ఈ గేమ్ స్వరూపమే మారిపోయింది. బంతికో ఫోర్.. బంతికో వికెట్‌గా అన్న మాదిరిగా టీ 20 ఫార్మాట్ తయారైందనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఒక జట్టు పరుగు వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోవడమే ఇందుకు ఉదాహరణ. శనివారం క్వెట్టా గ్లాడియేటర్స్-ముల్తాన్ సుల్తాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ 15.4 ఓవర్లలో 102 పరుగులకు కుప్పకూలింది. 101 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయిన గ్లాడియేటర్స్.. మరో పరుగు మాత్రమే చేసి మిగతా వికెట్లను నష్టపోయింది. దాంతో పరుగు వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోయి స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఇందులో ముల్తాన్ సుల్తాన్స్ తరపున ఆడుతున్న దక్షిణాఫ్రికా స్పిన్నర్ తాహీర్ హ్యాట్రిక్ వికెట్లను సాధించడం మరొక విశేషం. తాహిర్ స్పిన్ దెబ్బకు గ్లాడియేటర్స్ విలవిల్లాడుతూ హ్యాట్రిక్‌ను సమర్పించుకుంది. చివరి ఐదు వికెట్లలో మూడు డకౌట్లు ఉండటం గమనార్హం. ఇది పీఎస్ఎల్ చరిత్రలో మూడో హ్యాట్రిక్‌గా నమోదైంది. ఆపై 103 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ముల్తాన్ సుల్తాన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. కుమార సంగక్కరా(51 నాటౌట్), షోయబ్ మస్జూద్(26 నాటౌట్), అహ్మద్ షెహజాద్(27)లు తమ జట్టు ఘన విజయానికి సహకరించారు. -
క్రికెటర్లను బుకీలు సంప్రదిస్తున్నారు!
కరాచీ: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)ను ఫిక్సింగ్ భూతం వదిలేటట్లు కనబడుటం లేదు. ఇప్పటికే పలువురు పాక్ క్రికెటర్లు ఫిక్సింగ్ ఆరోపణలు కారణంగా నిషేధాని గురవ్వగా, తాజాగా పీఎస్ఎల్లో మరొకసారి ఫిక్సింగ్ కలకలం రేగింది. దుబాయ్‌లో జరుగుతున్న పీఎస్ఎల్ క్రికెటర్లను బుకీలు సంప్రదిస్తున్నారనే విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు ప్రతినిధి ఒకరు వెల్లడించారు.' 'కొన్ని సోషల్ మీడియా యాప్స్ ద్వారా బుకీలు ఆటగాళ్లతో చర్చలు జరుపుతున్నారు. అయితే ఆటగాళ్ల నుంచి వారికి ఎలాంటి స్పందన దక్కలేదు. ఈ సమస్యను ఇప్పటికే ఆటగాళ్లు మా దృష్టికి తీసుకువచ్చారు. అప్రమత్తమైన మేము ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం' అని సదరు ప్రతినిధి తెలిపారు.పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఫిక్సింగ్ కలకల చెలరేగడం ఇది తొలిసారి కాదు. గత సీజన్లో లతీఫ్, షర్జీల్ ఖాన్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో వారిపై ఐదేళ్ల నిషేధం పడగా, నాసీర్ జంషెడ్‌పై ఏడాది నిషేధం విధించారు. -
సిక్స్ కొట్టినా అవుటైన క్రికెటర్
-
వైరల్: సిక్స్ కొట్టిన బంతికే అవుటయ్యాడు
షార్జా: ఒక బ్యాట్స్‌మన్ సిక్స్ కొట్టిన బంతికే పెవిలియన్‌కు చేరడం చాలా అరుదనే చెప్పాలి. రెండు రోజుల కిందట పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో బ్యాట్స్‌మన్ సిక్స్ కొట్టి పెవిలియన్‌కు చేరాడు. గురువారం క్వెట్టా గ్లాడియేటర్స్-పెషావర్ జల్మీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో క్వెట్టా గ్లాడియేటర్స్ అన్వర్ అలీ క్రీజులో ఉన్నాడు. ఇక్కడ బౌలర్ వహాబ్ రియాజ్ బాల్ వేయగా.. అన్వర్ అలీ లాంగ్ ఆన్ మీదుగా ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆ బంతి కాస్తా బౌండరీ లైన్ కూడా దాటి జనాల్లో పడింది. ఒకవైపు అలీతో పాటు స్టేడియంలో ప్రేక్షకులు సిక్సర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆ జోష్ ఎంతసేపో నిలవలేదు. అలీ అవుటైనట్లు అంపైర్ ప్రకటించాడు. ఇదేంటి అని అందరూ షాకయ్యారు. రెండు మూడు నిమిషాల తర్వాత కాని క్లారిటీ రాలేదు. సిక్స్ కొట్టే సమయంలో అలీ కాలు వికెట్లను తాకి బెయిల్స్‌ను పడగొట్టింది. దాంతో బ్యాట్స్‌మన్ అలీకి నిరాశ తప్పలేదు. సిక్స్ కొట్టినా చిత్రంగా పెవిలియన్‌కు చేరడం కూడా అభిమానులను కూడా తీవ్ర నిరాశకు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. -
గాయంతో క్రీజులోకి.. కెప్టెన్ కీలక ఇన్నింగ్స్!
-
పాక్ లీగ్‌లో కోహ్లి క్రేజ్!
ముంబై: ప్రపంచ క్రికెట్లో పరుగుల మెషీన్‌గా దూసుకుపోతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి హద్దులు ఎరుగని అభిమానం సొంతం. క్రికెట్ ఆడే దేశాల్లో కోహ్లికు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మన దాయాది దేశం పాకిస్తాన్లో అయితే కోహ్లి అభిమానులు మెండుగానే ఉన్నారు. ఇందుకు తాజా ఘటనే ఉదాహరణ. దుబాయ్‌లో ఇస్లామాబాద్ యు నైటెడ్-క్వెట్టా గ్లాడియేటర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 'పీఎస్ఎల్లో విరాట్ కోహ్లిని చూడాలనుకుంటున్నాం' అని ఓ అభిమాని బ్యానర్ పట్టుకొని కనిపించింది. ఇది ఇప్పుడు షల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ఏడాది ఐసీసీ వరల్డ్ లెవెన్-పాకిస్తాన్ జట్ల మధ్య లాహోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఓ పోలీసు ' కోహ్లి నన్ను పెళ్లి చేసుకో' అని ఫ్లకార్డు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. -
గాయంతో క్రీజులోకి.. కీలక ఇన్నింగ్స్!
షార్జా: గాయంతో బాధపడుతూ క్రీజులోకి దిగినా భారీ హిట్టింగ్తో జట్టును గెలిపించాడు పెషావర్ జల్మీ కెప్టెన్ డారెన్ స్యామీ. గురువారం సాయంత్రం జరిగిన ఉత్కంఠపోరులో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుపై పెషావర్‌ను విజేతగా నిలిపాడు స్యామీ. గాయంతో ఉన్న స్యామీ ఏం ఆడతాడులే అనుకుంటే భారీ షాట్లతో ఏకంగా మ్యాచ్‌నే దూరం చేశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో భాగంగా పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లాడి 142 పరుగులు చేసి పెషావర్‌కు ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్ధేశించింది. 143 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన డారెన్ స్యామీ జట్టు తొలుత బాగానే పరుగులు సాధించినా చివర్లో ఒత్తిడికి లోనైంది. తమీమ్ ఇక్బాల్-మహ్మద్ హఫీజ్ లు 54 పరుగుల భాగస్వామ్యం అనంతరం పెషావర్ టీమ్ వికెట్ కోల్పోయింది. పరుగులు రాకపోవడం, వికెట్ పడటంతో స్యామీ సేన విజయానికి 7 బంతుల్లో 16 పరుగులు కావాలి. ఎడకాలికి గాయంతో బాధపడుతున్నా స్యామీ క్రీజులోకి వచ్చాడు. 19వ ఓవర్ చివరి బంతికి సిక్సర్ బాది పెషావర్‌లో ఆశలు నింపాడు. గ్లాడియేటర్ బౌలర్ అన్వర్ అలీ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ రెండో బంతిని సిక్సర్‌గా మలిచిన స్యామీ, నాలుగో బంతిని లాంగాఫ్ దిశగా ఫోర్ కొట్టగానే సంబరాలు మొదలయ్యాయి. కేవలం 4 బంతులాడిన కెప్టెన్ స్యామీ 2 సిక్సర్లు, ఫోర్ బాది 16 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పెషావర్ జల్మీ నాలుగో స్థానంలో నిలిచింది. -
పాక్‌లో అయితే ఆడను!
-
పాక్‌లో అయితే ఆడను!
సాక్షి, స్పోర్ట్స్ : ‘మూలిగే నక్కమీద తాటి పండు పడ్టట్లుంది’ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నిర్వహాకుల పరిస్థితి. దుబాయ్ వేదికగా పీఎస్ఎల్ మూడో సీజన్ అట్టహాసంగా ప్రారంభమైనా.. ప్రేక్షకాదరణ లేక స్టేడియాలన్నీ బోసిబోయి కనిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో మ్యాచ్‌లను స్వదేశానికి తరలిస్తే అభిమానుల ఆదరణ పెరుగుతుందని భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఈ సీజన్ క్వాలిఫైయర్, ఫైనల్ మ్యాచ్‌లను పాక్‌లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అయితే క్వెట్టా గ్లాడియేటర్స్ తరుఫున ఆడుతున్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ పీసీబీకి షాకిచ్చాడు. పాక్‌లో జరిగే మ్యాచ్ తాను ఆడనని కుండలు బద్దలుకొట్టాడు. ఇస్లామాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పీటర్సన్ 34 బంతుల్లో 48 పరుగులు చేసి క్వెట్టా గ్లాడియేటర్స్‌కు లీగ్‌లో రెండో విజయాన్నందించాడు. ఈ మ్యాచ్ అనంతరం ‘ఒకవేళ మీ జట్టు ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తే పాక్‌లో జరిగే మ్యాచ్‌లకు హాజరవుతారా?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా అక్కడికి వెళ్లి ఆడలేనని బదులిచ్చాడు. తాన జట్టు ఫైనల్ కు చేరినా తాను పాక్ లో ఆడనని తెగేసి చెప్పాడు. ఈ సీజన్ మూడు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు లాహోర్‌లో జరగనుండగా.. మార్చి 25న జరిగే ఫైనల్‌కు కరాచీ నేషనల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.